అత్యధికంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై 54 కేసులు
ఎంపీలపై కేసులు, ఆస్తుల వివరాలు వెల్లడించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment