
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. ప్రైవేట్ లాయర్లకు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుందని లేఖలో పేర్కొంది. ఏజీ, అడిషనల్ ఏజీ ఉండగా, ప్రైవేట్ లాయర్ల ఎందుకు అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది.
గవర్నర్ రిపబ్లిక్ డే కేసుతో పాటు, ఎమ్మెల్యేల ఫాంహౌస్ కేసులోనూ ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రైవేట్ న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు ఇచ్చి
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫిర్యాదు చేసింది.
చదవండి: E-Car Racing: ఓరి నాయనో ఇదేంటి! వాహనాలు రేసింగ్ ట్రాక్‌పైకి ఎలా వచ్చాయ్?