
త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్స్ ఉందనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు.
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్స్ ఉందనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఆశాహుల జాబితాను హైకమాండ్‌కు పంపించినట్లు సమాచారం. ఇప్పటికే తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ.. ఇటీవల మాదిగ, లంబాడి, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి లేఖలు రాశారు. ఈ మేరకు ఏఐసీసీ నేతలు రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు తమ వినతులను పంపారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగింటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.