High Command
-
ఢిల్లీ సీఎం ఎంపిక.. ప్రధాని సహా బీజేపీ అగ్రనేతల భేటీ
సాక్షి,ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సీఎం ఎవరనే సస్పెన్స్‌కు కొన్ని గంటల్లో తెరపడనుంది. సీఎం ఎవరన్నది ఖరారు చేసేందుకు బుధవారం(ఫిబ్రవరి 19) ఉదయం ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. సీఎం ఎవరన్నది ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. ఖరారు తర్వాత సీఎం ఎవరన్నది సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు.అనంతరం రాత్రి 7 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోనున్నారు. బీజేఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, ఓపి దంకర్‌ను అధిష్టానం నియమించింది. బీజేఎల్పీ నేతను ఎన్నుకునేందుకుగాను వీరు ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతారు. బీజేఎల్పీ నేతను ఎన్నుకున్న తర్వాత పార్టీ ముఖ్య నేతలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. సీఎం రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ),రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్),అజయ్ మహావార్ (ఘోండా) ఉన్నారు. అయితే ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో ముందున్నారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పర్వేష్వర్మకు సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయని సమాచారం.ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన వారిలో పదిమంది జాట్ ఎమ్మెల్యేలుండడం పర్వేష్‌కు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.కాగా గురువారం 11 గంటలకు ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు.రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం కోసం రామ్‌లీలా మైదానంలో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. మొత్తం 150 మంది ముఖ్య అతిథులకు ఆహ్వానం పలికారు.ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. ప్రమాణస్వీకారానికి లక్ష మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది. -
ఢిల్లీ కొత్త సీఎం ఖరారు రేపే..! రేసులో ముందున్న యువనేత
న్యూఢిల్లీ:ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్నదానిపై సస్పెన్స్‌కు తెరపడనుంది. సీఎం పేరును సోమవారం(ఫిబ్రవరి17) జరిగే బీజేపీ కీలక నేతలో భేటీలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎంగా ఎవరిని నిర్ణయించాలన్నదానిపై బీజేపీ హైకమాండ్ ఇప్పటికే చర్చోపచర్చలు సాగిస్తోంది. దీనిపై పార్టీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.అయితే సీఎం ఎవరన్నది బయటికి పొక్కకుండా బీజేపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ విషయంపై ఎవరూ నోరు విప్పకుండా అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేష్వర్మకే ఢిల్లీ సీఎంగా ఎక్కువ అవకాశాలున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.పర్వేష్‌వర్మతో పాటు ఢిల్లీ మాజీ ప్రతిపక్షనేత విజేందర్‌గుప్తా, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ,ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆశిష్ సూద్,ఆర్ఎస్ఎస్ నేత జితేంద్ర మహాజన్ పేర్లు సీఎం రేసులో పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీపార్టీపై బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారం చేపట్టనుంది. -
ఢిల్లీలో రేవంత్ టీమ్
-
ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ హైకమాండ్ సీరియస్
సాక్షి,గుంటూరు:తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం(జనవరి20) కొలికపూడిని పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11వ తేదీన ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికిపూడి శ్రీనివాస్ దాడి ఘటనను సీరియస్ టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు వివరించాలని అధిష్టానం కొలికపూడిని ఆదేశించింది.తిరువూరులో జరిగిన ఘటనపై ఇప్పటికే తీవ్ర సీఎం చంద్రబాబు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎస్టీ మహిళపై దాడి అంశంలో క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను పార్టీ అధిష్టానం దృష్టికి క్రమశిక్షణ కమిటీ బృందం తీసుకువెళ్లనుంది.కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కొలికపుడిపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.వివాదస్పద వ్యాఖ్యలు చేయడం, దౌర్జన్యాలకు దిగడం కొలికపూడికి సర్వసాధారణమైపోయిందని టీడీపీలోని పలువురు నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. గతంలో కొలికపూడి రైతులపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. కుక్కలకైనా విశ్వాసముంటుంది కానీ రైతులకు లేదని వ్యాఖ్యానించి వివాదానికి కారణమయ్యారు. లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించానని, రైతులకు తన పట్ల విశ్వాసం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కాకుండా ఒక సందర్భంలో క్రిస్టియన్లుగా మతం మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ల వర్తింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
డిన్నర్లపై హైకమాండ్ గరం
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు పెరిగిపోగా, ఢిల్లీలో హైకమాండ్ అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. మంత్రులు, సీనియర్లు విందు భేటీలు జరుపుతూ ముఠా రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు రావడంతో పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారం. డిన్నర్లు, రహస్య భేటీల్లో నిమగ్నమైన నాయకులను ఢిల్లీకి పిలిపించి మందలించనుంది. ఎలాంటి విందు రాజకీయ సమావేశాలను, పార్టీ అనుమతి లేకుండా జరపరాదని హెచ్చరికలు చేయడంతో రాష్ట్ర నాయకుల్లో కలవరం నెలకొంది. వచ్చే వారం కొందరు మంత్రులకు ఢిల్లీకి రావాలని రాహుల్‌గాంధీ ఆప్తుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సమాచారం పంపారు. డీకే ఫిర్యాదు ఏమిటి? రాష్ట్ర కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు ముమ్మరం కాగా, ప్రతిపక్షాలు దీనిని హేళన చేస్తున్నాయి. ప్రజల సమస్యలతో సంబంధం లేకుండా డిన్నర్లు చేసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో పార్టీ గౌరవానికి భంగం వాటిల్లుతోంది. దీనంతటికీ చెక్ పెట్టాలని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్(DKShivakumar) హైకమాండ్‌కు విన్నవించారని తెలిసింది. ఎందుకంటే ఎక్కువ డిన్నర్లు ఆయన వ్యతిరేక వర్గీయులు జరుపుతున్నవే. డీకేశి విన్నపానికి సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ హైకమాండ్ (CongressHighCommand) మరో రెండు వారాల్లో ప్రక్షాళన చేపడతామని సంకేతాలిచ్చింది. కొందరు మంత్రులు విందు భేటీలు ఏర్పాటు చేయడం సరికాదు, నేను కూడా విందు ఇవ్వవచ్చు, కానీ అలాంటివి సబబుకాదు అని డీకే పేర్కొన్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎంతో కష్టపడి అధికారంలోకి వస్తే నేతలు, మంత్రులు ఇలా చేస్తున్నారేమిటా అని తీవ్రంగా పరిగణించిన హైకమాండ్ పలువురు సీనియర్ మంత్రులను పిలిపించి గట్టిగా మాట్లాడనుంది. సీఎం వర్గం గుర్రు మరోవైపు డీ.కే.శివకుమార్‌పై సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) వర్గానికి చెందిన కొందరు మంత్రులు అసంతృప్తికి గురయ్యారని తెలిసింది. వీరంతా వచ్చేవారం ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. అంతఃకలహాలు కాంగ్రెస్‌లో ఏ పరిణామాలకు దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది. డీకే అడ్డుగోడల్ని సీఎం వర్గీయులు ఎలా ఛేదిస్తారనేది చర్చకు కారణమైంది.13న సీఎల్పీ భేటీ శివాజీనగర: తాజా పరిణామాల నేపథ్యంలో జనవరి 13న బెంగళూరులోని ఓ హోటల్లో సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు సభ మొదలవుతుంది. పారీ్టలో గ్రూపు కొట్లాటలు, హైకమాండ్ ఆగ్రహం నేపథ్యంలో ఈ భేటీ కుతూహలం కలిగిస్తోంది.నా విందు వాయిదా: హోంమంత్రి పరమేశ్వర్బుధవారం సాయంత్రం దళిత ఎమ్మెల్యేలు, మంత్రులకు నేను ఏర్పాటు చేసిన విందు రద్దు కాలేదు, వాయిదా పడింది అంతేనని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, హైకమాండ్ సూచన మేరకు విందు భోజనాన్ని వాయిదా వేశాను. విందు తేదీని త్వరలో వెల్లడినన్నారు. డీకే శివకుమార్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తనకు తెలియదన్నారు. తాను విందు ఇవ్వరాదని ఎవరైనా అంటే సమాధానం చెప్పే శక్తి తమకు ఉందన్నారు. -
TG: కొత్త పీసీసీ చీఫ్ ఖరారు ! ముగిసిన ఏఐసీసీ కీలక భేటీ
సాక్షి,ఢిల్లీ: తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై శుక్రవారం(ఆగస్టు23) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌కు పీసీసీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. పీసీసీ రేసులో మధు యాష్కి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ , ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ , అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు కేబినెట్ విస్తరణపైనా ఏఐసీసీ సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ , సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగుతున్నారు. -
చివరి దశకు ‘పీసీసీ’ కసరత్తు!
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పార్టీ నేతలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఏఐసీసీ పెద్దలు.. పలువురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. అందులో నుంచి ఒకరిని ఎంపిక చేసేందుకు గురువారం రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఢిల్లీలో విస్తృతంగా చర్చలు.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతోపాటు టీపీసీసీ అధ్యక్ష నియామకంపై ఢిల్లీలో మూడు రోజులుగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. గురువారం కూడా చర్చలు జరిగాయి. తొలుత రాçష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతోపాటు ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక పీసీసీ పదవులు ఆశిస్తున్న నేతలు మహేశ్‌గౌడ్, బలరాం నాయక్, మధుయాష్కీ గౌడ్, సురేశ్ షెట్కార్, సంపత్‌కుమార్ తదితరులు కూడా మున్షీతో భేటీ అయి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ నేతలంతా ఢిల్లీలో రేవంత్‌తో కూడా భేటీ అయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాం«దీని మహేశ్‌గౌడ్, మధుయాష్కీ విడివిడిగా కలసి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఏఐసీసీ సీనియర్లను కలవాలని ఆమె సూచించడంతో.. ఈ ఇద్దరు నేతలు అక్కడే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ చర్చించారు. తెలంగాణ భవన్లో భట్టి, ఉత్తమ్, శ్రీధర్‌బాబు సైతం ఏ అభ్యరి్థకి మద్దతివ్వాలన్న దానిపై చర్చించారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపైనా..పొద్దంతా జరిగిన వరుస భేటీల అనంతరం మున్షీ, సీఎం, మంత్రులు, ఇతర సీనియర్లు వెళ్లి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒకపేరు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మరో పేరును ఫైనల్ చేసినట్టు తెలిసింది. వారు మహేశ్ గౌడ్, బలరాం నాయక్ అయి ఉంటారని.. వీరిలోంచి ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడిపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నేపథ్యంలో ఆశావహుల పేర్లపైనా ఈ భేటీలో చర్చించినట్టు సమాచారం.తొలి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం: భట్టి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన భేటీ అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పార్టీ వ్యవహారాలతోపాటు కేబినెట్ విస్తరణపై కేసీ వేణుగోపాల్‌తో చర్చించామని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరికల అంశంపైనా చర్చ జరిగిందని.. అయితే కాంగ్రెస్‌లో మొదటి నుంచీ ఉన్నవారికి సముచిత స్థానం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరామని వివరించారు. -
హస్తినలో కాంగ్రెస్ నేతల చక్కర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కీలక పదవుల భర్తీపై దేశ రాజధానిలో హైకమాండ్ పెద్దల కసరత్తు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర నేతలంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. అత్యంత ప్రాధాన్య మైన పీసీసీ అధ్యక్ష పదవి సహా మంత్రి పదవుల భర్తీ, ఇతర నామినేటెడ్ పదవుల నియామకానికి సంబంధించి హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండ్రోజులుగా ఢిల్లీలో ఉంటున్నారు. దీంతో నేతలంతా ఆయనను, పార్టీ ఇతర పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఐదుగురు రాష్ట్ర మంత్రులతోపాటు సుమారు పది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర సీనియర్ నేతలు ఢిల్లీలో తిష్టవేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.పీసీసీ పదవికి తీవ్ర పోటీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ స్థానంలో కొత్తవారిని నియమించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆ పదవిని ఆశిస్తున్న ముఖ్యనేతంతా ఢిల్లీలోనే మకాం వేశారు. పీసీసీని ఆశిస్తున్న మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు రెండ్రోజులుగా హస్తిన లోనే ఉన్నారు. మధుయాష్కీ ఢిల్లీలో తనకున్న పరిచయాలను వాడుకుంటూ పెద్దల దృష్టిలో పడేందుకు యత్నిస్తుండగా, ఇతర నేతలు మంగళవారం ముఖ్యమంత్రిని కలిసి తమ అభ్యర్థిత్వంపై వినతులు ఇచ్చారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తోనూ వీరు భేటీ అయ్యారు. మరోపక్క ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తున్న జాబితాలో ఉన్న ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్‌లు సైతం రోజంతా సీఎం చుట్టూతే ఉన్నారు. హైకమాండ్ పెద్దలను సీఎం కలిసిన సమయంలోనూ ఈ ఇద్దరు ఆయనతో పాటు నేతలను కలిశారు. ఇక్కడే ఉన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితోనూ పీసీసీ ఆశావహులు భేటీ అయ్యి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవుల కోసం మరికొందరుమరికొద్ది రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో పలవురు ఆశావహులు పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. మంత్రి పదవి దక్కుతుందని గంపెడాశతో ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్లు రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈసారి విస్తరణలో తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు జి.వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం కేసీ వేణుగోపాల్ సహాæ ఇతర నేతలను కలిశారు.ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వచ్చిన ముఖ్యమంత్రితో కలిసి రాష్ట్ర నాయకులు అగ్రనేతలైన సోనియాగాంధీ, ప్రియాంకగాంధీలతో ముచ్చటిస్తూ కనిపించారు. ఇక సోమవారం ఖర్గే, రాహుల్‌లను కలిసిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డిలు రేవంత్‌తో ఆయన అధికారిక నివాసంలో భేటీ అయ్యి, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మాట్లాడినట్లు తెలిసింది. ఇక వీరితోపాటు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు సైతం ఢిల్లీలోనే ఉండి హైకమాండ్ పెద్దలకు తమ వినతులు అందజేశారు. ఢిల్లీలో గూడెం మహిపాల్సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సైతం ఢిల్లీలో కనిపించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకే ఢిల్లీకి వచ్చారని ప్రచారం జరిగినా, సుప్రీంకోర్టులో ఓ కేసు విషయమై వచ్చినట్లు ఆయన వివరణ ఇచ్చారు. ఇక పటాన్‌చెరుకే చెందిన కాంగ్రెస్ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు సైతం ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలను కలవడం గమనార్హం.నేడు ఢిల్లీకి భట్టి, ఉత్తమ్ అధిష్టానం పిలుపుతోనే ఇద్దరు నేతల హస్తిన పయనం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో స్పష్టమైన కదలికలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండగా, అధిష్టానం పిలుపు మేరకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడకు వెళ్లనున్నారు. బుధవారం ఉదయం ఈ ఇద్దరు నేతలు హస్తినకు పయనమవుతున్నారు.పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలోనే ఉండటంతో కీలక పరిణామాలు చోటుచేసుకోవచ్చనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్ష పదవితోపాటు నామినేటెడ్ పదవుల కసరత్తును ఓ కొలిక్కి తెచ్చేందుకే అధిష్టానం మొగ్గు చూపుతోందని, అందుకే రేవంత్‌కు తోడు ఆ ఇద్దరికీ ఢిల్లీ నుంచి పిలుపు వచి్చందని తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయలుదేరతారని తెలుస్తోంది. ఈలోపే ఢిల్లీ పెద్దలతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ జరిగే అవకాశముంది. -
ఒడిశా సీఎంగా సురేశ్ పూజారి?
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 24 ఏళ్లకు బీజేపీ గెలుపు సొంతం చేసుకోవడం తెల్సిందే. ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించేదెవరన్న విషయంలో మాత్రం సందిగ్ధం కొనసాగుతోంది. అయితే, సీనియర్ నేత, తాజాగా ఎమ్మెల్యే సురేశ్ పూజారిని పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాలంటూ కబురు పంపించింది. దీంతో, సీఎం పదవి ఆయనకే దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. శాసనసభా పక్ష నేత ఎవరనేది అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర వర్గాలు అంటున్నాయి. ఇలా ఉండగా, ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ దృష్ట్యా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 10కి బదులుగా 12న చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. -
అమేథీ, రాయ్‌బరేలీపై కాంగ్రెస్ వీడని మౌనం!
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ ఇంకా లోక్‌సభ అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబం పోటీ చేస్తుందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. ఈ రెండు లోకసభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఇంకా మౌనం వీడలేదు. పార్టీ అధిష్టానం తాజాగా యూపీ అభ్యర్థుల నూతన జాబితాను విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో అమేథీ, రాయ్‌బరేలీ పేర్లు కనిపించలేదు. కాంగ్రెస్ తన కంచుకోట స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అమేథీ, రాయ్‌బరేలీకి చెందిన కాంగ్రెస్ నేతలు గాంధీ కుటుంబ సభ్యులను ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ఇందుకోసం వారు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి లేఖలు పంపుతున్నారని సమాచారం. అయితే నామినేషన్ల చివరి రోజున ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని పలువురు భావిస్తున్నారు. రాయ్‌బరేలీ సీటును గాంధీ కుటుంబం నుంచి వేరొకరికి వెళ్లేందుకు అనుమతించబోమని స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఈ రెండు స్థానాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు మహిళా నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. వీరిలో ఒకరు జాతీయ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా, మరొకరు రాష్ట్ర పార్టీలో కీలక పదవిలో ఉన్నారట. -
బీజేపీ అధిష్ఠానానికి సీనియర్ల లేఖ..ఆ లెటర్ లో ఏముంది ?
-
Delhi: హైకమాండ్ నుంచి కిషన్‌రెడ్డికి పిలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మిగిలిన 8 మంది అభ్యర్థులను కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు. జాయినింగ్ అనేది నిరంతర ప్రక్రియ.. చాలా మంది చేరుతున్నారన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్తున్నానని.. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి, రాజకీయ అంశాలు, అభ్యర్థులపై చర్చిస్తామని తెలిపారు. -
తెలంగాణలో పార్టీ బలోపేతం కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్
-
తేలని శాఖలు
ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన, స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా సమర్పించారు. సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేసిన నేతలకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావించినా ఏమీ తేల్లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకమాండ్ పెద్దలతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ వా రంతా బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ రోజంతా సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ దాదాపు రెండు గంటల సేపు భేటీ అయి శాఖల కేటాయింపుపై చర్చించారు. హోం, ఆరిక్థ, రెవెన్యూ, వైద్యం, మునిసిపల్, విద్యుత్, నీటిపారుదల వంటి కీలక శాఖల కేటాయింపుపై సీనియర్ల నుంచి వస్తున్న వినతులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లకే కీలక శాఖలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లకు కీలక శాఖలు ఇవ్వాలని, వారి సేవలను వినియోగించుకోవాలని కేసీ సూచించినట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ శాఖ ఇచ్చేలా నిర్ణయం జరిగిందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఈ భేటీ అనంతరం కేసీ, ఠాక్రే, రేవంత్ కలిసి ఖర్గే నివాసానికి వెళ్లారు. కాసేపటి తర్వాత రాహుల్ కూడా వారితో చేరారు. అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయానికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి? అనే దానిపై మరోసారి చర్చిద్దామని వేణుగోపాల్ సూచించడంతో దీనిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. -
తెలంగాణ కమల బృందంలో మార్పులుంటాయా?
బీజేపీ హైకమాండ్ తెలంగాణ కాషాయ పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తోందా? ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారిన అంశం. కమలం పార్టీ రాష్ట్ర సారథిగా ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. బీజేపీ హైకమాండ్ ఒత్తిడితో పార్టీ పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డి శక్తి మేర కష్టపడ్డారు. ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అనూహ్యంగా ఓటు శాతాన్ని పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇతరులకు ఇవ్వాలని కిషన్ రెడ్డి పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ కాషాయ దళపతిగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై పార్టీలో విస్తృత చర్చ కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొత్తగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కంటిన్యూ కావాలని ఓ వైపు యోచిస్తోంది. అయితే రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. రాష్ట్ర స్థాయి నేతలు ఎవరికి వారు సోషల్ మీడియాలో సొంత పార్టీలో ప్రత్యర్థులను డీగ్రేడ్ చేస్తూ కామెంట్స్ పెట్టడం పార్టీకి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇక పార్టీ ఫుల్ టైమర్ గా పనిచేసిన రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ వెళ్లిపోయిన తర్వాత... కొత్తగా ఎవరిని నియమించలేదు. దీంతో రాష్ట్ర పార్టీ నేతల సమన్వయం పెద్ద తలనొప్పిగా మారింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు డా లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా, పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంపీ బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. వీరందరిని పక్కన పెట్టి కొత్త నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో బండారు దత్తాత్రేయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శిగా పనిచేసి... మహారాజ్ గంజ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా విష్ణుదత్త శర్మను నియమించింది. ఇతను ఏబీవీపీ జాతీయ సంఘటన కార్యదర్శి, ఫుల్ టైమర్ గా పనిచేశారు. అదేతరహాలో తెలంగాణ బీజేపీ పగ్గాలు... గతంలో ఇక్కడ రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా పనిచేసిన మంత్రి శ్రీనివాస్ కు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై జాతీయ పార్టీ కసరత్తు చేస్తున్నారు. చండిఘడ్ కేంద్రంగా పంజాబ్ సంఘటన కార్యదర్శిగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాస్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారా ? కొత్త ప్రయోగం చేస్తారా ? లేదా అన్నది చూడాలి. మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ గా ఉన్న మురళీధర్ రావు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ప్రయోగం చేస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. ఇదీ చదవండి: వాళ్లు ఓడిపోవడం ఏమిటో? -
TS: సీఎం పదవి పంచాయితీ..ఢిల్లీకి సీనియర్లు..?
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ మార్కు రాజకీయం మళ్లీ స్టార్టయింది. ఎన్నికల ఫలితాల్లో పార్టీ గెలిచిన వెంటనే జరగాల్సిన సీఎం ఎంపిక తంతు వాయిదాపడింది. సీఎం పదవి ఎవరికివ్వాలనే పంచాయితీ అంత ఈజీగా తేలేలా కనిపించడం లేదు. సీఎం ఎంపిక కోసం సోమవారం హైదరాబాద్‌లో జరగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గచ్చిబౌలిలోని ఓ హోటల్లో జరిగిన ఎమ్మెల్యేల మీటింగ్‌లో సీఎం అభ్యర్థిపై ఏకాభిప్రాయం రాలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సీఎం ఎవరనేది నిర్ణయించే బాధ్యతను ఎమ్మెల్యేలలంతా కలిసి ఏకవాక్య తీర్మానం ద్వారా అధిష్టానానికి అప్పగించారు. దీంతో సీన్ ఒక్కసారిగా ఢిల్లీకి మారిపోయింది. ఏఐసీసీ ముఖ్య పరిశీలకునిగా వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్యేల సమావేశం నుంచి అలిగి బయటికి వెళ్లిన భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ కూడా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లి లాబీయింగ్..? సీఎం పదవిపై ఇప్పటికే రేసులో ఉన్న అగ్రనేతలెవరూ పట్టు వీడటం లేదని తెలుస్తోంది. తామూ పదవికి అర్హులమేనని ఢిల్లీ వెళ్లి హై కమాండ్‌కు మొర పెట్టుకోనున్నట్లు సమాచారం. దీంతో రేసులో ఉన్నవారందరి పేర్లు పరిగణలోకి తీసుకుని త్వరలో ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరనేది వెల్లడవుతుందనుకుని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ అధికారులు, పోలీసులు పార్టీ నుంచి ఏ నిర్ణయం రాకపోవడంతో రాజ్‌భవన్ నుంచి ఇవాళ సాయంత్రం వెళ్లిపోయారు. ఎల్లా హోటల్లోనే ఎమ్మెల్యేలు.. అయితే సీఎం ఎవరనేదానిపై మంగళవారం క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, ఇతర ఏఐసీసీ పరిశీలకులు రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశమై చర్చించనున్నారు. భేటీ తర్వాత సీఎం ఎవరనే నిర్ణయాన్ని ఖర్గే వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు క్యూ కట్టనుండడంతో ఒక్కరోజులో అధిష్టానం సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తుందా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సోమవారం సమావేశమైన గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బస చేస్తున్నారు. సీఎం అభ్యర్థి ఫైనలయ్యేదాకా వారంతా అక్కడే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం. ఇదీచదవండి..ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా.. ఆసక్తికర వ్యాఖ్యలు -
TS: సీఎం ప్రమాణస్వీకారం వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఎన్నికల ముఖ్య పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాటు మరో నలుగురు అబ్జర్వర్లు కూడా ఢిల్లీకి వెళ్లారు. మంగళవారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పరిశీలకులు సమావేశమవనున్నారు.దీంతో ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లేనని సమాచారం. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల(సీఎల్పీ)సమావేశం సోమవారం ఉదయం గచ్చిబౌలిలోని ఎల్లాహోటల్లో జరిగింది. ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏకాభిప్రాయం రాకపోవడంతో సీఎల్పీ నేతల ఎన్నిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాఖ్య తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత పేరుపై క్లారిటీ వస్తుందని అంతా ఎదురు చూశారు. కానీ చివరకు డీకే శివకుమార్ సహా నలుగురు ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పయనమయ్యారు. దీంతో సీఎల్పీ నేత ఎంపిక వాయిదా పడింది. మరోపక్క తెలంగాణ రెండవ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్ మూడో శాసనసభను గెజిట్‌లో నోటిఫై చేశారు. జీఏడీ అధికారులు కూడా సీఎం ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్‌ని కూడా రెడీ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎల్పీ నేత ఎవరో వెల్లడించిన వెంటనే కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావించారు. చివరకు పరిశీలకులు ఢిల్లీ వెళ్లడంతో సీఎల్పీనేత ఎంపికతో పాటు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఇవాళ లేనట్లేనని తేలిపోయింది. సీఎం ప్రమాణ స్వీకారం వాయిదాపడిందని తెలియడంతో రాజ్‌భవన్ నుంచి పోలీసులు, అధికారులు వెళ్లిపోయారు. ఇదీచదవండి..తెలంగాణలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. అప్డేట్స్ -
రేవంత్ రెడ్డి సీఎం కాదు ?..ఎవరూ గీత దాటొద్దు..ఢిల్లీ చెప్పినట్టు వినాలి
-
Rajasthan Elections 2023: ‘కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుంది.. నా భవిష్యత్తు మాత్రం..’
జైపూర్: మరో మూడు రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది మాత్రం పార్టీ హైకమాండ్‌కే వదిలేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం తన పాత్ర ఎలా ఉండోబోతోందన్న దానిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ "నా పాత్రను పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటాను" అని అన్నారు. ఆ సంప్రదాయం మారుతుంది రాజస్థాన్‌లో అధికార వ్యతిరేకతను అధిగమించి మరోసారి ప్రజామోదం పొందుతామని అశోక్ గెహ్లాట్ విశ్వాసం వ్యక్తం చేశారు. 2ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పునరావృతం చేసేలా ప్రజలు తమ మూడ్‌ని ఏర్పరచుకున్నారు. మేము 156 సీట్ల దిశగా పయనిస్తున్నామని నమ్ముతున్నాను. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడబోతోంది’ అని గెహ్లాట్ అన్నారు. ‘కేరళలో 76 ఏళ్ల ఇలాంటి రికార్డును ఆ రాష్ట్ర ప్రజలు బద్దలు కొట్టారు. కోవిడ్ సమయంలో మెరుగైన సేవలు అందించిన ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించారు. ఇక్కడ రాజస్థాన్‌లో మేం కూడా కోవిడ్ సమయంలో ప్రజలకు విశేష సేవలు అందించాం. కేరళ ప్రజల లాగే రాజస్థాన్ ప్రజలు కూడా తెలివైనవారు ప్రభుత్వాన్ని పునరావృతం చేస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను పడగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీలను ఉపయోగిస్తోందని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. తాము అమలు చేసిన వివిధ సామాజిక పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఉపయోగిస్తున్న భాషపైనా ఆయన అభ్యంతరం వెలిబుచ్చారు. -
తెలంగాణలో జెండా పీకేసిన టీడీపీ.. కాసాని జ్ఞానేశ్వర్ తాడోపేడో..!
సాక్షి, హైదరాబాద్: జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ.. తెలంగాణలో జెండా పీకేసింది. ఎన్నికల్లో పోటీ చేయలేమంటూ టీడీపీ క్యాడర్‌కు చంద్రబాబు సంకేతాలు ఇచ్చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ సందర్భంగా తెలంగాణలో పోటీ చేయొద్దంటూ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు మేలు చేయడం కోసమే తెలంగాణలో పోటీకి దూరమంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం మేరకే పోటీకి దూరం అంటూ చర్చ సాగుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్ తానే అభివృద్ధి చేశానంటూ చెప్పుకున్న చంద్రబాబు.. తెలంగాణ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే ఎందుకు పోటీ చేయడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా, టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ తెలంగాణ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్.. నేడు నారా లోకేశ్‌తో కాసాని జ్ఞానేశ్వర్ భేటీ కానున్నారు. ఇన్నాళ్లు పార్టీ పోటీ చేస్తుందంటూ మభ్య పెట్టారన్న ఆవేదనలో ఉన్న జ్ఞానేశ్వర్ నారా లోకేష్‌తో తాడోపేడో తేల్చుకోనున్నట్లు సమాచారం. తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత మారిన పార్టీ స్టాండ్‌తో తల పట్టుకుంటున్న కాసాని జ్ఞానేశ్వర్.. పార్టీ కోసం బోలెడు ఖర్చు పెట్టాం అంటూ టీడీపీ పెద్దల దగ్గర వాపోయినట్లు తెలిసింది. తెలంగాణలో ఒంటరి పోరు వల్ల కాదని.. పోటీకి దూరంగా ఉండాలని నారా లోకేష్ సూచించడంతో, పోటీ చేయొద్దని ఇప్పుడు నిర్ణయిస్తే తన పరిస్థితి ఏంటని, ఇన్నాళ్లు తాను పడ్డ శ్రమ పెట్టిన ఖర్చు ఫలితం ఏంటని కాసాని ప్రశ్నిస్తున్నారు.. ఏపీ రాజకీయాలకు తెలంగాణను ముడి పెట్టడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తే కనీసం పార్టీకి మనుగడ అయినా ఉంటుందని అంటున్న కాసాని.. ఇంకా కూడా పార్టీ పోటీ చేయాలన్న నిర్ణయం తీసుకోకపోతే తన దారి తాను చూసుకుంటానని కాసాని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను కాసాని అన్వేషిస్తున్నట్లు సమాచారం. చదవండి: పవన్ కల్యాణ్ రాయబారం సఫలం కాలేదా?! -
ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
-
బండి సంజయ్ విషయంలో అధిష్టానం లో తీవ్రంగా చర్చ
-
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ హై కమాండ్ పిలుపు
-
కమలం పార్టీ నేతల్లో అయోమయం..పైకి గంభీరం
-
అగ్రత్రయ నేతల పర్యటనపైనే కాషాయ పార్టీ ఆశలు
-
బీజేపీ వెనకడుగు.. కేసీఆర్ వైఫల్యాలపై రివర్స్ అటాక్‌కు ‘నో’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కార్ ‘దశాబ్ది’ఉత్సవాలకు కౌంటర్‌గా ‘రివర్స్ గేర్’ కార్యక్రమాలు నిర్వహించాలనే యోచనను కమలదళం విరమించుకుంది. కేసీఆర్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై రాష్ట్ర పార్టీ చేపట్టాలని భావించిన ఎదురుదాడి కార్యక్రమాలకు బీజేపీ హైకమాండ్ నో చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై నిర్వహిస్తున్న ‘మహా జనసంపర్క్ అభియాన్’లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపైనే ప్రజల్లోకి వెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. జాతీయ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మే 30 నుంచి జూన్ 30 దాకా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో నెగిటివ్ ప్రచారం వద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం 21 రోజులపాటు నిర్వహిస్తున్న అధికార కార్యక్రమాలకు వ్యతిరేకంగా కేసీఆర్ సర్కార్ తీరును ‘రివర్స్ గేర్’ నిరసనలతో ఎండగట్టాలని రాష్ట్ర బీజేపీ తొలుత నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తొమ్మిదేళ్ల మోదీ పాలనపై పాజిటివ్ ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించి ప్రజల్లోకి వెళ్లాలని అధినాయకత్వం సూచించింది. దీంతో బీఆర్ఎస్పై రివర్స్‌గేర్ కార్యక్రమాలు రద్దయినట్టు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ప్రస్తుత పరిణామాలు ఉండటం పార్టీ నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తున్నారు. జన సంపర్క్ అభియాన్ ముగియగానే మళ్లీ కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతామని పార్టీ నాయకులు చెబుతున్నారు. చదవండి: Secunderabad: పలు రైళ్లు రద్దు.. వివరాలివే! -
అసమ్మతి నేతల ‘అల్టిమేటం’.. ‘బండి’ని ఢిల్లీ పిలిపించిన అధిష్టానం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అసమ్మతి నేతలు అల్టిమేటం వరకు వెళ్లారు. ప్రాంతీయ పార్టీని సమర్థంగా ఎదుర్కొనే దిశలో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు జరగడం లేదని ఎన్నిసార్లు అధిష్టానం పెద్దలకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని, నెలాఖరు వరకు వేచి ఉండాలని, అప్పటికి కూడా పార్టీ వైఖరిలో మార్పు రాకపోతే తాడోపేడో తేల్చుకోవాలని వారు నిర్ణయించినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, సుగుణాకర్‌రావు, వెంకటరమణి, డా. మల్లారెడ్డి, పాపారావు తదితరులు ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే క్వార్టర్లలో భేటీ అయినట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వైఖరి, రాష్ట్ర ఇంచార్జుల వ్యవహారశైలిపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారని చెబుతున్నారు. సంజయ్ ఏకపక్ష ధోరణితో వెళ్తున్న ఒంటెత్తు పోకడల కారణంగా పార్టీ నష్టపోతోందని, ఈ విషయాన్ని ఎన్నిసార్లు పార్టీ ఇన్చార్జుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, బయటి నుంచి వచ్చిన ఇన్చార్జులు పార్టీలో సమన్వయంతో పాటు పాత, కొత్త నేతల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించకపోగా, పెత్తనం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైందని తెలుస్తోంది. తన సొంత ప్రచారం, ఆధిపత్యం కోసమే బండి సంజయ్ పాకులాడుతున్నారు తప్ప పార్టీలోని సీనియర్లకు గౌరవం, కార్యక్రమాల నిర్వహణలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని, జిల్లాలకు వచ్చినప్పుడు కూడా తగిన విధంగా వ్యవహరించడం లేదని ఇప్పటికే ఢిల్లీ పెద్దల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెలాఖరు వరకు పార్టీలో మార్పు వస్తుందనే ఆశతో ఎదురుచూడాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. చదవండి: Rahul Gandhi: రాహుల్ ‘తుడిచివేత’ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో..? ఢిల్లీకి సంజయ్ కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఢిల్లీ వెళ్లారు. పార్టీ అధిష్టానం కబురు వచ్చినందునే ఆయన ఢిల్లీ వెళ్లారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కూడా బీజేపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
తెలంగాణ బీజేపీలో కన్ ఫ్యూజన్ ను గుర్తించిన పార్టీ హై కమాండ్
-
Telangana BJP: ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచాలి.. వాళ్లకే సీట్లివ్వండి!
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకులున్నారని, ఆయా స్థానాల్లో వారికంటే బలమైనవారు పార్టీలోకి వచ్చే పక్షంలో వారికి సీటు కేటాయించడంపై స్పష్టమైన హామీ ఇవ్వండి..’ అంటూ బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి సూచించింది. మిగిలిన 40 స్థానాల్లోనూ ఇతర పార్టీలకు గట్టి పోటీనిచ్చేలా చూడాలని తెలిపింది. ‘ఆపరేషన్ ఆకర్ష్' స్పీడ్ పెంచాలని ఆదేశించింది. ప్రస్తుతం తెలంగాణలో అధికార, ప్రధాన ప్రతిపక్షాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, బయటపడుతున్న అసంతృప్తిని పార్టీకి అనుకూలంగా మలుచుకుంటూ ముందుకెళ్లాలని సూచించింది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పార్టీకి ఇంతకంటే అనుకూల వాతావరణం, అవకాశం మరోసారి రాదని స్పష్టం చేసింది. బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, సభ్యులు డీకే అరుణ, గరికపాటి మోహన్‌రావు తదితరులతో జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ వేర్వేరుగా సమావేశమయ్యారు. తగిన నేతల భరోసానివ్వండి... ఇతర పార్టీల నుంచి వచ్చేవారిలో బలమైన నేతలకు సీటు ఇచ్చే విషయంపై వారికి విశ్వాసం కల్పించాలని, అయితే పలానా సీటిస్తామని మాత్రం ముందుగానే ప్రకటించలేమని బీజేపీ జాతీయ నేతలు స్పష్టం చేశారు. తమతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల గురించి ఈటల వివరించినట్టు సమాచారం. దాదాపు 15 నుంచి 20 మంది దాకా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర స్థాయిల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పినట్టు తెలిసింది. అధికార పార్టీలో ఎమ్మెల్యేలుగా, టీపీసీసీలో వివిధ హోదాలు, పదవుల్లో ఉన్నందున ఇప్పటికిప్పుడు బీజేపీలోకి రాలేమని, కొంతకాలం వేచి చూస్తామంటూ కొందరు ముఖ్య నేతలు చెబుతున్నట్టు సమాచారం. కొందరు నేతలు తమకు పలానా ఎంపీ, అసెంబ్లీ సీటు ఖరారు చేయాలంటూ ముందుగానే కండిషన్లు పెడుతున్నారని రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులకు చెప్పారు. గ్రామాల్లో చేరికల ప్రళయం రాబోతోంది రాబోయే రోజుల్లో బీజేపీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, గ్రామాల్లో చేరికల ప్రళయం రాబోతోందని పార్టీ చేరికలు, సమన్వయ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం రాత్రి ఓ రిసార్ట్ వద్ద ఈటల మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకు తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని అన్నారు. చదవండి: 26 నుంచి రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’ -
టీ కాంగ్రెస్ సీనియర్లకు హైకమాండ్ బుజ్జగింపు
-
తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్
-
తెలంగాణ కాంగ్రెస్ పై హైకమాండ్ ఫోకస్
-
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్ అసమ్మతి నేతలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. అంతర్గత విభేదాలతో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రెండుగా చీలింది. వలస నేతల వల్ల అసలైన కాంగ్రెస్ నాయకులకు అవకాశం లేకుండా పోతోందంటూ పలువురు సీనియర్లు శనివారం ఆరోపణలు చేయగా.. అదే రోజున రేవంత్ అనుచరులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌కు లేఖ రాశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ అసమ్మతి నేతలపై బీజేపీ దృష్టి సారించింది. జాయినింగ్స్ కమిటీని బీజేపీ హైకమాండ్ అప్రమత్తం చేసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్‌లో జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ అసమ్మతి నేతలు బీజేపీలోకి రావాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే పనిలో బీజేపీ నేతలు ఉన్నారు. చదవండి: రేవంత్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు -
ఇంద్రసేనారెడ్డి ఏం చేస్తున్నారు?.. బీజేపీ హైకమాండ్ లైట్ తీసుకుందా?
ఎంత సీనియర్ నాయకుడికైనా కొంతకాలం తర్వాత రాజకీయంగా ముగింపు దశ వస్తుంది. ఒక్కసారి కాలపరిమితి ముగిసిపోతే తిరిగి వెనక్కి రావడం సాధ్యం కాదని అర్థం చేసుకోవాల్సిందే. ఇప్పుడిదే పరిస్థితి తెలంగాణ కమలం పార్టీలో ఓ సీనియర్ నేత ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా.. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ నేతను కాషాయ పార్టీ హైకమాండ్ పట్టించుకోవడంలేదట. గతం ఘనం.. వర్తమానం నిశబ్దం కొత్త నీరు వచ్చినపుడు పాత నీరు కొట్టుకుపోతుంది. కాంగ్రెస్ అయినా కమలం పార్టీ అయినా ఎందరో మహా మహులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొందరు నాయకులకు ఎక్స్పైరీ డేట్ త్వరగా వచ్చేస్తుంది. మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న నల్లు ఇంద్రసేనారెడ్డికి అదే పరిస్థితి ఎదురయ్యిందట. మూడు సార్లు ఎమ్మెల్యేగా.. 12 మంది ఎమ్మెల్యేలు గెలిచినపుడు అసెంబ్లీలో పార్టీ లీడర్‌గా ఆయన సేవలందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్‌నాథ్ సింగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న ఈ నేతను కమలదళం పెద్దలు లైట్ తీసుకుంటున్నారట. పెద్ద పదవుల్లో తోటి వాళ్లు ఇంద్రసేనారెడ్డి తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన దత్తాత్రేయకు కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా అవకాశాలు వచ్చాయి. ఇటీవల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ లక్ష్మణ్‌కు.. రాజ్యసభ సభ్యుడిగా, పార్లమెంటరీ బోర్డు మెంబర్‌గా ప్రమోషన్ కల్పించారు. వెంకయ్య నాయుడితో పాటు విద్యార్థి దశ నుంచి ఇంద్రసేనారెడ్డి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో పనిచేశారు. 73 ఏళ్ల వయస్సున్న ఇంద్రసేనారెడ్డికి పార్టీలో ఇక భవిష్యత్ లేదా? అన్న చర్చ సాగుతోంది. ఆయన సీనియారిటీ, అందించిన సేవలకు పార్టీ నుంచి ఎలాంటి గౌరవం లభించదా అనే డిస్కషన్ నడుస్తోంది. చదవండి: TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు! గుర్తిస్తుందా? పదవులిస్తారా? ఇటీవల హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒకరోజు ముందు ఇంద్రసేనారెడ్డికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించారు. పార్టీలో చేరికల కమిటీకి ఛైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డిని నియమించారు. అయితే కొత్తగా పార్టీలో చేరేవారికి భరోసా ఇవ్వడం, చేరికల కమిటీ సభ్యులను ఒప్పించడం తన వల్ల కాదని ముక్కుసూటిగా చెప్పేశారాయన. ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి మాత్రం నిత్యం టచ్‌లో ఉంటూ.. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ అవినీతిని బయటకు తీసే పనిలో నిమగ్నమయ్యారు. మరి భవిష్యత్‌లో ఆయన సేవలను పార్టీ వాడుకుంటుందో ? వదిలేస్తుందో? కాలమే నిర్ణయిస్తుంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీజేపీలో కలవరం.. కనీస విలువ లేని పదవి నాకెందుకంటూ ‘బొక్కా’ అలక
సాక్షి, రంగారెడ్డి: భారతీయ జనతాపార్టీ జిల్లా (గ్రామీణ) అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి అలకబూనారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు ఉంటూ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గాల కన్వీనర్ల నియామకంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో కినుక వహించిన బొక్క.. అధ్యక్ష పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. ఆధిపత్యపోరుతో నియోజకవర్గంలో పార్టీగా రెండుగా చీలడంతో కమలం శిబిరంలో కలహాలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే నర్సింహారెడ్డి సూచించిన వ్యక్తిని సెగ్మెంట్ కన్వీనర్ పదవికి ఎంపిక చేయకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. గౌరవంలేని పదవి తనకెందుకని అధిష్టానం ముందు ఆక్రోషం వెళ్లగక్కినట్లు సమాచారం. అగ్రనేతలు బుజ్జగింపులతో ఒకింత మెత్తబడినప్పటికీ పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో నొచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెల్లుబాటు కాకపోవడంతో.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఇటీవల నియోజకవర్గాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం జిల్లా కోర్‌కమిటీ నుంచి అభిప్రాయాలు సేకరించింది. జిల్లా అధ్యక్షుడిగా బొక్కా కొన్నిపేర్లు సిఫార్సు చేశారు. పార్టీ ప్రకటించిన జాబితాలో తాను సూచించిన వ్యక్తికి కాకుండా మరొకరి పేరు ఉండడంతో ఆయన అవాక్కయ్యారు. పార్టీలో తన మాట చెల్లుబాటుకాకపోవడంతో అధ్యక్ష పదవిని సైతం త్యజించేందుకు సిద్ధపడగా.. పార్టీ నేతలు నచ్చజెప్పడంతో వెనక్కితగ్గారు. కానీ, పార్టీలో అంతర్గతంగా ఉన్న లుకలుకలు మరోసారి బయటపడటంతో కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడిప్పుడే సంస్థాగతంగా బలపడుతున్న పార్టీకి అధ్యక్షుడి అలక నష్టాలను తెచ్చిపేట్టే అవకాశం లేకపోలేదు. శిక్షణ తరగతులకు దూరంగా.. క్షేత్రస్థాయి కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి రెండేళ్లకోసారి ప్రశిక్షణ్ శిబిరాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం శామీర్‌పేటలో పార్టీ శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. పార్టీ మూల సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, వారిని పార్టీ వైపు ఆకర్షితులను చేయడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ కేడర్ ఈ శిబిరానికి హాజరైంది. బొక్కా నర్సింహారెడ్డి మాత్రం దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఎల్బీనగర్ తర్వాత మహేశ్వరం నియోజకవర్గంలోనే పార్టీ బలంగా ఉంది. ఇది ఆయన సొంత నియోజకవర్గం కూడా. ఇక్కడి నుంచి అందెల శ్రీరాములు, తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ కూడా పోటీపడుతున్నారు. ఎవరికి వారు వ్యక్తిగత కేడర్‌ను తయారు చేసుకుంటున్నారు. ఈ వర్గపోరు కూడా ఆయన మనస్తాపం చెందటానికి మరో కారణమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
MLAs Episode: బీజేపీ హైకమాండ్ ఆగ్రహం.. రంగంలోకి కేంద్ర హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ ఆరోపణలపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలిసింది. దీనిని తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని రాష్ట్ర నేతలకు సూచించినట్టు సమాచారం. ఈ అంశంలో టీఆర్ఎస్ నేతలు నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించడం, దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని ఉపేక్షించవద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. అవసరమైతే టీఆర్ఎస్తో తాడోపేడో తేల్చుకోవాలనే సంకేతాలను కూడా హైకమాండ్ ఇచ్చినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. సీబీఐ విచారణ.. కోర్టుల్లో పోరాటం.. టీఆర్ఎస్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న అంశం గురువారం ఢిల్లీలో హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలోకి బీజేపీని లాగుతోందని భావించిన పార్టీ పెద్దలు.. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలతో చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశంలో సీబీఐ విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కుదరని పక్షంలో కోర్టుల ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా పోరాటం చేయాలని సూచించినట్టు వివరిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ గురువారం హైకోర్టును ఆశ్రయించిందని అంటున్నాయి. ఇక రాజకీయంగానూ ఈ వ్యవహారాన్ని ఎదుర్కోవాలని నేతలకు హైకమాండ్ సూచించినట్టు తెలిసింది. ‘తెలంగాణలో మరో ఎనిమిది, తొమ్మిది నెలలైతే సాధారణ ఎన్నికలున్న సమయంలో ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేస్తారా? అదీ కేవలం నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుందా? ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా?’అన్న దానిపై విస్తృత చర్చ పెట్టాలని సూచించినట్టు సమాచారం. ఇదే సమయంలో ‘కొనుగోళ్ల వ్యవహారం అంతా బోగస్. కేసీఆర్ ఆడుతున్న డ్రామా. పోలీసులు దీనికి సహకరిస్తున్నారు. ఫామ్‌హౌస్ ఎవరిది? డబ్బు ఎక్కడిది? ఎవరు ఎవరితో మాట్లాడారనే ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే పోలీసులు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు ఎలా తరలించారు? బేరసారాలపై ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌లో విచారిస్తున్నారా? లేక ప్రగతిభవన్ చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారా?’’అని బీజేపీ జాతీయ స్థాయి నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. ఈ అంశాలన్నింటినీ జనంలోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పార్టీకి సూచించినట్టు వెల్లడించారు. నిజానిజాలు త్వరలోనే బయటికి వస్తాయని.. ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని లక్ష్యంగా పెట్టుకొని ఇలా చేశాక పార్టీ అంత సులువుగా దీనిని వదిలిపెట్టదని పేర్కొన్నారు. రంగంలోకి కేంద్ర హోం శాఖ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తుండటం, వందల కోట్ల డీల్ జరిగినట్టు కథనాలు వస్తుండటంపై హోంశాఖ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి పెట్టాలని ఐబీ, ఐటీ, ఈడీలనూ అప్రమత్తం చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని ఇప్పటికే ఏజెన్సీలను కోరినట్టు నేతలు చెబుతున్నారు. నిజంగానే కోట్ల రూపాయలు చేతులు మారితే అవి ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చేందుకు సిద్ధం కావాలని సూచించినట్టు పేర్కొంటున్నారు. కేంద్ర సంస్థలు ఈ వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీస్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ కాల్ రికార్డ్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంకట్‌రెడ్డి ఆడియో లీక్‌పై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదుతో వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం మునుగోడు ఓటర్‌తో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరిన వెంకట్‌రెడ్డి ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ కాగా, మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీసులు
-
గెహ్లోత్ వర్గంపై హైకమాండ్ సీరియస్..!
న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ అంతర్గత విషయాలు, ఇతర నేతలపై బహిరంగ ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు పార్టీ సీనియర్ సెంట్రల్ లీడర్ కేసీ వేణుగోపాల్ లేఖ పంపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసు నుంచి గెహ్లోత్ తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే హెచ్చరికలు పంపటం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఇతర నేతలకు వ్యతిరేకంగా, పార్టీ అంతర్గత విషయాలపై బహిరంగ ప్రకటనలు చేయటానికి దూరంగా ఉండాలని పార్టీనేతలకు సూచిస్తున్నాం. ఎవరైనా హైకమాండ్ హెచ్చరికలను బేఖాతరు చేస్తే పార్టీ నిబంధనల మేరకు కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.’ అని లేఖ రాశారు సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్. సచిన్ పైలట్ వర్గం నేత వేద్ ప్రకాశ్ సొలంకిపై ఆరోపణలు చేస్తూ గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ధర్మేంద్ర రాథోడ్ ఓ వీడియో విడుదల చేయటంపై ఇప్పటికే క్రమశిక్షణ నోటీసులు ఇచ్చింది హైకమాండ్. ఈ అంశంపై గెహ్లోత్ వర్గం విలేకరుల సమావేశం నిర్వహించిన కొద్ది సేపటికే.. హెచ్చరిక లేఖ పంపారు కేసీ వేణుగోపాల్. ఇదీ చదవండి: దిగ్విజయ్‌తో థరూర్ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు -
రాజస్థాన్ విషయంలో చేతులెత్తేసిన కాంగ్రెస్ హైకమాండ్
-
హై కమాండ్‌పై కూడా తిరుగుబాటేనా.. టి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. పీసీసీ చీఫ్ మారినప్పటి నుంచి పార్టీలో తిరుగుబాట్లు ఎక్కువవుతున్నాయి. ఇక్కడి నేత మీదే కాదు.. హైకమాండ్ మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. టీ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?. కాంగ్రెస్ అంటే అంతే.. వచ్చే వాళ్లు వస్తుంటారు. పోయేవాళ్లు పోతుంటారు. తిట్టేవాళ్లు తిడుతుంటారు. కొట్టే వాళ్లు కొడుతుంటారు. అధినేత మాటైనా ఇక్కడ నడవదు. చదవండి: వచ్చే ఎన్నికల్లో పోటీ.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు: పొంగులేటి ఎవరిష్టం వాళ్లదే. గీత దాటితే చర్యలు తీసుకుంటామంటారు. అయినా ఎవరూ భయపడరు. కొంతకాలం క్రితం పార్టీ అధినేత స్థాయి నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. పార్టీ నేతలు ఎవరు కూడా బహిరంగ విమర్శలు చేయవద్దని, ఏదైనా ఉంటే అంతర్గత సమావేశాల్లోనే మాట్లాడాలని అందరికీ ఆదేశాలిచ్చారు. క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని కూడా రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ఆయన ఆదేశాలు కొద్ది రోజుల్లోనే బేఖాతర్ అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ షరా మామూలే. పార్టీలోని సీనియర్లెవరూ రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా అంగీకరించడం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్రుగా ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి జెల్ల కొట్టారు. రాజగోపాలరెడ్డి అన్న వెంకటరెడ్డి అటు హైకమాండ్ మీద, ఇటు రేవంత్ మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ వ్యూహరచన కమిటీ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మధుయాష్కీ డుమ్మా కొట్టారు. వంత్ మీద సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నేరుగా దాడి ప్రారంభించారు. రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు శశిధర్‌రెడ్డి. పాలమూరు జిల్లా జడ్చర్ల పార్టీ ఇన్చార్జ్ అనిరుధ్‌రెడ్డి ఓ అడుగు ముందుకేసి ఠాకూర్‌కు రెండు పేజీల ఘాటు లేఖ రాశారు. జిల్లాల్లో ఎవరికి వారే తాము అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానం అండదండలు తమకే ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో తామే పోటీ చేయబోతున్నామని కనీసం 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ తమకే హామీ ఇచ్చాడని మరికొందరు స్థానికంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అభ్యర్థి ఎవరనే విషయంలో క్యాడర్లోనే సందిగ్ధత ఏర్పడే పరిస్థితి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ చివరి వరకూ స్రవంతి పేరు ప్రకటనను నాన్చారు. ఇప్పుడు పార్టీ మీద, రేవంత్ మీద బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్న నాయకులంతా సీనియర్లు, ఢిల్లీ పెద్దల దగ్గర పలుకుబడి ఉన్నవారే. రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడగలిగినవారే. పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా రచ్చ చేయవద్దని రాహుల్ గాంధీ ఆదేశించిన తర్వాత కూడా సీనియర్లు బేఖాతరు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ వ్యవహార సరళి, పీసీసీ చీఫ్ రేవంత్ ఏకపక్ష ధోరణుల్ని సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు వారి మాటలు తెలియచేస్తున్నాయి. -
రాజగోపాల్ వ్యవహారంపై రంగంలో దిగిన హైకమాండ్
-
Jagga Reddy: రేవంత్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు.. జగ్గారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు!
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. పదేపదే పార్టీ లైన్ దాటుతూ వ్యవహరిస్తున్న జగ్గారెడ్డిపై చర్యలు కఠినంగా ఉంటాయనే చర్చ జరుగుతోంది. రెండు నెలల క్రితం రాష్ట్ర పర్యటనలో భాగంగా గాంధీభవన్‌కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ కీలక సూచనలు చేశారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మీడియా ముందు మాట్లాడకూడదని, పార్టీ నేతల గురించి వ్యాఖ్యలు చేయకూడదని హెచ్చరించారు. అప్పటి నుంచి ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయని జగ్గారెడ్డి శనివారం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన తీరు పార్టీ ఇన్చార్జిలను ఆగ్రహానికి గురిచేసినట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి చేసిన ‘గోడకేసి కొడతాం..’ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని చెప్పాల్సింది పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై చర్యలకు సిఫారసు చేస్తూ పార్టీ రాష్ట్ర ఇన్చార్జితో పాటు పొలిటికల్ కన్సల్టెంట్‌గా ఉన్న సునీల్ కనుగోలు సైతం నివేదిక అందించినట్టు తెలుస్తోంది. ఆయనతోపాటు పార్టీకి సమాచారం లేకుండా యశ్వంత్‌సిన్హాకు బేగంపేట ఎయిర్‌పోర్టులో టీఆర్ఎస్తో కలిసి స్వాగతం పలికిన వి.హనుమంతరావుకు సైతం షోకాజ్ నోటీసులివ్వాలని అధిష్టానం ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. ‘పార్టీ లైన్ దాటి మాట్లాడనని రాహుల్‌గాంధీకి ఇచ్చిన మాట తప్పినం’దుకు తానే సొంతంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతున్న జగ్గారెడ్డి.. దీనిపై సోమవారం సంచలన ప్రకటన చేయబోతున్నట్టు చెప్పారు. -
తెలంగాణ రాజకీయాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్
-
జగ్గారెడ్డికి షాక్.. ఆ బాధ్యతల నుంచి తొలగింపు.. కారణం..?
-
రేవంత్‌రెడ్డిని తప్పించండి.. జగ్గారెడ్డి లేఖ
హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీ,రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి ఓ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ప్రోగ్రామ్ గురించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న తనతో చర్చించలేదని జగ్గారెడ్డి ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోయేలా ఆదేశాలు ఇవ్వండి.. లేదంటే పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించి అందరినీ కలుపుకొనిపోయే మరోకరికి అవకాశం ఇవ్వండంటూ కాంగ్ అధిష్టానాన్ని లేఖలో జగ్గారెడ్డి కోరినట్లు సమాచారం. జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడ తప్పుబట్టారు. ఇదిలా ఉంటే గజ్వేల్ జిల్లా ఎర్రవెల్లి గ్రామంలో రచ్చబండకు వెళ్తుండగా పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకొని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
హుజూరాబాద్ ఓటమి పై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్
-
అభ్యర్థి ఎంపికే కొంపముంచింది!
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్‌లో ఓటమికి నువ్వంటే.. నువ్వే కారణం అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. వేదికలు మారినా తెలంగాణ కాంగ్రెస్‌లో ఆరోపణలు మాత్రం తగ్గలేదు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో జరిగిన హైకమాండ్ సమీక్ష సమావేశంలోనూ రాష్ట్ర నాయకుల ఆరోపణల పర్వం కొనసాగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిర్వహించిన సమీక్షా సమావేశం మరోసారి గ్రూపు రాజకీయాలకు వేదికైందని సమాచారం. శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన మొదటి సమీక్షా సమావేశం గంటన్నర పాటు సాగింది. కాగా, సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర నేతలు విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమీక్షా సమావేశాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్ పార్టీ హైకమాండ్ తరఫున పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి పార్టీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, పార్టీ సీనియర్ నేతలు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, వీ.హనుమంతరావు, హుజూరాబాద్ అభ్యర్థి బల్మూరి వెంకట్ హాజరయ్యారు. కాగా ఉపఎన్నికలో పార్టీ వైఫల్యం, అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను వేణుగోపాల్ తెలుసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలను వేణుగోపాల్ సైతం ఓటమిపై సంజాయిషీ అడిగారని తెలిసింది. రేవంత్‌కు వ్యతిరేకంగా రాహుల్‌కు సురేఖ రాసిన లేఖ ప్రతిని ఈ సందర్భంగా హనుమంతరావు వేణుగోపాల్‌కు అందజేశారు. అయితే భేటీ తర్వాత పొన్నం పలు ఆరోపణలు చేయగా, ఆ సమయంలో అక్కడే ఉన్న రేవంత్ తనను ఈ వ్యవహారంలోకి లాగొద్దంటూ బదులిచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అభ్యర్థిని నేనే ప్రతిపాదించా.. ‘కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడిపోవడం వల్లనే హుజూరాబాద్‌లో ఓడిపోయాం. పార్టీలో కొందరు టీఆర్ఎస్ కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు. ఉప ఎన్నిక అభ్యర్థిని నేనే ప్రతిపాదించా. ఎంపిక చేశా’. – పొన్నం ప్రభాకర్ కొందరు నన్ను కార్నర్ చేస్తున్నారు... నాతో ఈటల ఫోన్లో మాట్లాడారు. కానీ, కలవలేదు. కౌశిక్‌రెడ్డితో నాకున్న బంధుత్వానికి, ఆయన పార్టీ వీడిపోవడానికి సంబంధం లేదు. అయినా జూలైలో కౌశిక్ కాంగ్రెస్‌ను వీడితే, అక్టోబర్ దాకా హుజూరాబాద్ అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదు?. వెంకట్ స్థానికేతరుడు కావడం కూడా ఓటమికి ప్రధాన కారణం. కౌశిక్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ మధ్య ఉన్న విభేదాలు, తగాదాలను నాకు రుద్దడం సబబు కాదు. కౌశిక్‌రెడ్డి అంశాన్ని సాకుగా తీసుకుని నన్ను కొందరు కార్నర్ చేస్తున్నారు. – ఉత్తమ్ సొంత ఇమేజ్‌పైనే శ్రద్ధ... హుజూరాబాద్‌లో కొండ సురేఖను అభ్యర్థిగా ఎందుకు ఎంపిక చేయలేదు? తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహించింది. కానీ, ఉప ఎన్నిక జరిగిన హుజూరాబాద్‌లో ఎందుకు సభ నిర్వహించలేదు? కొందరు నాయకులకు సొంత ఇమేజ్ పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ పార్టీ ఇమేజ్ పెంచడంపై లేదు. – వి.హనుమంతరావు హుజూరాబాద్‌లో కాంగ్రెస్ కంటే అన్ని రకాలుగా టీఆర్ఎస్, బీజేపీలు చాలా బలంగా ఉన్నాయని దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈటలతో కలిసి మాట్లాడాను కానీ, పార్టీలో చేరే విషయం చర్చకు రాలేదని భట్టివిక్రమార్క వెల్లడించారు. ఓటమి సమష్టి బాధ్యత అని దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. కాంగ్రెస్ నుంచి కౌశిక్‌రెడ్డి వెళ్లిపోవడం వల్లనే ఓడిపోయామని చెప్పడం సరైంది కాదని, పరస్పరం నిందలు వేసుకోవడం పార్టీకి మంచిది కాదని మధుయాష్కీగౌడ్ సూచించారు. సమావేశం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే... పార్టీని పటిష్ట పరుస్తున్నాం.. ‘గతంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న సవాళ్ల నుంచి బయటికి వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికీ సిగ్గులేకుండా అమిత్ షాతో బంధం కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్.. అమిత్ షా పాదాల వద్ద తాకట్టుపెట్టారు. ధాన్యాన్ని కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీలు ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని పటిష్ట పరచడమే కాకుండా, లోటుపాట్లను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నాం’ –మాణిక్యం ఠాగూర్ సీనియర్లతో కలసి పోరు... ‘హుజూరాబాద్ ఎన్నిక, పార్టీ అంతర్గత విషయాలపై, ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. త్వరలో కేంద్ర నాయకత్వం నుంచి పరిశీలకులు రాష్ట్రానికి వస్తారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనను పక్కనపెట్టి, అనవసర విషయాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తోంది. దీనిపై సీనియర్లు అందర్నీ కలుపుకొని పోరాడుతాం. 2023లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తాం.’ – రేవంత్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం.. ‘హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు, దానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. అందరం కలిసికట్టుగా 2023 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పోరాడుతాం. దీనికోసం యాక్షన్‌ప్లాన్ రెడీ చేస్తున్నాం. బీజే పీ, టీఆర్ఎస్ల నాటకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్తాం’ –మల్లు భట్టివిక్రమార్క నన్ను ఎవరూ సస్పెండ్ చేయలేరు.. ‘పార్టీలో గ్రూప్ రాజకీయాల వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఇలాగైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కష్టమే. హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై కూడా పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించాలని సమావేశంలో కోరా. ఈటల రాజేందర్ రూపంలో దొరికిన ఆయుధాన్ని పార్టీ సరైన రీతిలో వినియోగించుకోలేదు. ఉత్తమ్ నన్ను హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఎవరికి లేదు’. – పొన్నం ప్రభాకర్ -
హుజూరాబాద్ ఫలితంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్..
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపఎన్నిక ఓటమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని అధిష్టానం ఆదేశించింది. ఈ నెల 13న పీసీసీ నేతలు ఢిల్లీకి రావాలంటూ టీ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. కాగా, ఉప ఎన్నిక ఓటమిపై ఇప్పటికే అదిష్టానం కమిటీ వేసిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై అధిష్టానం సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై అధిష్టానం సీరియస్ అయ్యింది. ప్రజా సమస్యలపై సరైన రీతిలో పనిచేయడం లేదని జాతీయ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అనుబంధ సంఘాల పనితీరుపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హుజురాబాద్ మాదిరిగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు ఎందుకు పనిచేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మైనార్టీ, క్రిష్టియన్ వర్గాలను ఎందుకు దూరం పెడుతున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ నాయకులు గ్రామాలకు, కార్యకర్తల వద్దకు వెళ్లాలన్నారు. పోరాటం చేయకుంటే పార్టీతో పాటు నేతలకు గుర్తింపు రాదని సంతోష్‌జీ అన్నారు. -
కర్ణాటక కొత్త సీఎం ఎంపిక పై బీజేపీ హైకమాండ్ కసరత్తు
-
సీఎల్పీ నేత భట్టికి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. దీంతో ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత భట్టికి అధిష్టానం నుంచి రావడం చర్చంశనీయమైంది. కొందరు సీనియర్లు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక పట్ల అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. టీపీసీసీ.. టీడీపీ పీసీసీగా మారుతుందంటూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. భట్టి మాత్రం మౌనంగానే ఉన్నారు. మరి కొంత మంది సీనియర్లు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశముందని సమాచారం. రేవంత్‌రెడ్డిని టీపీసీపీ అధ్యక్షునిగా నియమించడం పట్ల కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సారథిగా కొత్తగా ఎంపికైన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌కు అధ్యక్షుడు కావడం, తన నియామకాన్ని కొందరు పార్టీ నేతలు బహిరంగంగానే వ్యతిరేకించిన నేపథ్యంలో ఎక్కడా అసంతృప్తి ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తనను నియమిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటించిన రోజే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దాయన జానారెడ్డిని కలిసిన రేవంత్ పార్టీ నేతలందరితో సమన్వయమే ఎజెండాగా ముందుకెళ్తున్నారు. -
కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన రగడ..
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్‌లో రగడ రచ్చకెక్కింది. సీనియర్ల అసంతృప్తితో కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలో పడింది. దూకుడుగా ఉండే వ్యక్తికే టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. పీసీసీ ఎన్నికపై తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దంటూ సోనియా గాంధీ, రాహుల్, ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తెలంగాణలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేకపోవడంతో రాజకీయంగా ఎదగడానికి ఆ పార్టీ ప్లాన్ చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలను పరోక్షంగా బీజేపీ వాడుకుంటుందని లేఖలో జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: షబ్బీర్ అలీకి కీలక పదవి!?) ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చిలో రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు జాగ్రత్త పడాల్సిన అవసరముందని పేర్కొంటూ.. జానారెడ్డి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని లేఖలో ఆయన సూచించారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్నారు. సీనియర్ నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చే వరకు పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ ఆపాలని కోరారు. సాగర్ ఉప ఎన్నిక వరకు పీసీసీ ఉత్తమ్ కుమార్‌రెడ్డినే కొనసాగించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. (చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్) -
మళ్లీ రానంటున్న రాహుల్..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలను మరోసారి చేపట్టడంపై ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. తాను పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేశానని, మళ్లీ ఆ బాధ్యతలు చేపట్టే ఉద్దేశం లేదని రాహుల్ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను తిరిగి రాహుల్ స్వీకరిస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. నాయకత్వ బాధ్యతను రాహుల్ స్వీకరించే పరిస్దితి లేకపోవడంతో ఈ అంశంపై ఏప్రిల్‌లో జరిగే కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తుది నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. పార్టీ చీఫ్ బాధ్యతలను తిరిగి స్వీకరించాలని పార్టీ ఒత్తిడి తెస్తే ఏమిటన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తే కాంగ్రెస్ అధినేత్రి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోనియా ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా చురుకైన పార్టీ చీఫ్ ఉండాలని ఏఐసీసీ యోచిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఆవశ్యకతను సుస్పష్టంగా చాటాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ప్రభుత్వం సైతం కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ శిబిరానికి దగ్గరవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో చురుకైన నేత పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. గాంధీ కుటుంబం నుంచే పార్టీ అధినేత ఉండాలన్నది ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయంగా ముందుకొస్తోంది. చదవండి : కొత్త సారథి కావలెను -
‘కారు’చిచ్చు
ఖానాపూర్: ఖానాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో మరోసారి అసమ్మతి చిచ్చు రగిలింది. టీఆర్ఎస్ టికెట్ తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు ప్రకటించడంతో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అసమ్మతి జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరి, రేఖానాయక్‌కు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తాజాగా డీసీసీ మాజీ చైర్మన్, ఏపీపీఎస్సీ మాజీ మెంబర్ పైడిపల్లి రవీందర్రావు అనుచరులు రేఖానాయక్ వ్యవహారిశైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్లో చేరి పదహారు నెలలు అవుతున్నా కనీస గుర్తింపు లేదని, భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాలని రవీందర్‌రావుపై ఒత్తిడి పెంచుతున్నారు. శుక్రవారం పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పలువురు పార్టీ కార్యకర్తలతో ఏపీపీఎస్సీ మాజీ మెంబర్ రవీందర్రావు అధ్యక్షతన భవిష్యత్తు కార్యాచరణపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ముప్పై ఏళ్లుగా తమకు అన్నీ తానై అండగా ఉన్న రవీందర్రావు ఆధ్వర్యంలో ఆయన నాయకత్వం కోసం టీఆర్ఎస్లో చేరామన్నారు. అప్పటినుంచి కనీసం ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా తమను పట్టించుకోవడం లేదన్నారు. సదర్మాట్ సమస్య తెరమీదికి రావడానికి కాల్వల అభివృద్ధికి రవీందర్రావు సహకారమే ఉందన్నారు. మిగతా అభివృద్ధి సైతం రవీందర్రావు చొరవతోనే సాధ్యమవుతుందన్నారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా... రవీందర్రావు మాట్లాడుతూ.. మరోసారి కేసీఆర్ ను సీఎంగా చూడడమే తమ అందరి లక్ష్యమని, అందుకు కలిసికట్టుగా పనిచేయాలని సూచించా రు. కార్యకర్తల ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, అందరూ సంయమనం పాటించాలని అన్నారు. కార్యకర్తల మనోభావాలు, ఆవేదనను.. పార్టీ అభ్యర్థి రేఖానాయక్ వ్యవహార శైలిని అధి ష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అధిష్టానం పట్టించుకోని పక్షంలో కలిసికట్టుగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని హామీ ఇచ్చారు. భారీ ర్యాలీ, ఉరేగింపు... ముందుగా పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రధాన రహదారిపై వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీలు గుస్సాడీ సాంప్రదాయ నృత్యాల మధ్య రవీందర్‌రావుతో పాటు ఆయా గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగి లక్ష్మణ్‌రావు, ఎంఏ.వకీల్, కొండాడి గంగారావు, కొత్తపెల్లి సురేష్, బీసీ రాజన్న, పెద్ద లక్ష్మణ్‌రావు, జక్కుల నవీన్‌యాదవ్, లక్ష్మీరాజం, కుమ్మరి భూమన్న, గంగాధర్, గంగారావు, ఖాజా, జక్కుల గంగామణి, మాధవి, తొడసం ఇంద్ర, భీంరావు, శ్రీనివాస్‌రావు, అడిదెల రాజన్న, సతీశ్‌కుమార్, శ్రీనివాస్, ఎంఏ.సమీ, సంజీవ్‌రావు, సుధాకర్‌రావు, బీసీ రమేశ్, నీలిమాన్, సాయి, సతీశ్, బీరయ్య, భీమన్న, కొమురయ్య, కుమ్మరి గంగరాం, వెంకట్రాములు, నర్సింహారెడ్డి, వెంకటేశ్, బత్తుల నర్సయ్య, కాలేరి రమేష్, బాస రవీందర్ పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల బేజారు
సాక్షి, మెదక్ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి రాజకీయంగా బలపడదామనుకున్న తమ ఆశలను పార్టీ అధినేతే గండి కొట్టడాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరుతో టీడీపీ నాయకులు లోలోన రగిలిపోతున్నారు. మహాకూటమి పేరుతో జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు టికెట్లు కట్టబెడతారన్న వస్తున్న సమాచారాన్ని పలువురు టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు గతంలో టీడీపీ కంచుకోటల్లా ఉండేవి. రెండు చోట్లా టీడీపీ బలంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం జిల్లాలో టీడీపీ క్రమంగా పట్టుకోల్పోతూ వస్తోంది. టీడీపీలోని నాయకులు ఇటీవల టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళ్లారు. పార్టీపై అభిమానంతో పలువురు నాయకులు ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. మెదక్ నియోజకవర్గంకు సంబంధించి టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎ.కె.గంగాధర్‌రావు, తెలుగు యువత అధ్యక్షుడు బొజ్జ పవన్, టీడీపీ నేత అఫ్జల్ లాంటి తదితర నేతలు పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ ఇస్తే పోటీచేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే టీడీపీ మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో జత కట్టడంతో ఎమ్మెల్యేగా పోటీచేయాలన్న ముగ్గురి ఆశలు అడియాసలయ్యాయి. పార్టీ కేడర్‌లోనూ అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీ మార్పుపై ఒత్తిడి.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయలేమని పలువురు మండలపార్టీ నాయకులు, కార్యకర్తలు అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయటం ఇష్టంలేని టీడీపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ నాయకత్వం కూడా మహాకూటమిలోని విభేదాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ నేతలను ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తోంది. తమ పార్టీలో చేరాలంటూ టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నాయకుడు ఒకరు ఏ.కె.గంగాధర్‌రావుతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే చిన్నశంకరంపేట, పాపన్నపేట, మెదక్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులతోనూ టచ్‌లో ఉన్నట్లు సమాచారం. మెదక్ మండలంలోని పలువురు టీడీపీ కార్యకర్తలు ఇటీవల పార్టీ వీడి టీఆర్ఎస్లో చేరుదామని మండల పార్టీ అధ్యక్షుడిపై వత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీలో ముఖ్యనేతగా పనిచేసిన సరాఫ్ యాదగిరి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు. టీడీపీలో తనకు సన్నిహితులైన నాయకులు, కార్యకర్తలను టీఆర్ఎస్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీని నడిపించే నాయకుడు లేకపోవటంతో అక్కడి మండల నాయకులు, కార్యకర్తలు సైతం పక్కపార్టీల వైపు చూస్తున్నారు. కాగా వలసల విషయమై టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఏ.కె.గంగాధర్‌రావు వద్ద ప్రస్తావించగా తనతో సహా టీడీపీ నాయకులు ఎవ్వరూ పార్టీ వీడే యోచనలో లేరని తెలిపారు. పార్టీ అధినేత ఆదేశాలకు అనుగుణంగా మహాకూటమి గెలుపుకోసం ప్రయత్నిస్తామని వివరించారు. -
తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ ఆశలు ?
-
నేనంటే..నేనే.. నగరపంచాయతీ ఎన్నికలు
నెల్లిమర్ల: త్వరలో జరగనున్న నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికలు టీడీపీ నేతల్లో చిచ్చురేపుతున్నాయి. చైర్మన్ అభ్యర్థిత్వానికి ఆ పార్టీ ప్రధాన నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా ఇద్దరు నేతలు ఏమాత్రం వెనక్కు తగ్గబోమని తెగేసి చెబుతున్నారు. పార్టీ అధిష్ఠానం వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. నెల్లిమర్ల నగరపంచాయతీకి త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నగరపంచాయతీ మొట్టమొదటి ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు టీడీపీనేతలు ఉవ్విళ్లూరుతున్నారు. పోటీలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నప్పటికీ పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు లెంక అప్పలనాయుడు, మాజీసర్పంచ్ బెరైడ్డి నాగేశ్వరరావు మాత్రం నువ్వా..నేనా అన్నట్లు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇద్దరిలో ఎవరూ ఏమాత్రం వెనక్కు తగ్గేటట్లు కనిపించడంలేదు. గత మూడేళ్లుగా పార్టీకి, పట్టణవాసులకు సేవలందిస్తున్నానని..తనకే టికెట్ ఇవ్వాలని లెంక అప్పలనాయుడు చెబుతున్నట్లు సమాచారం. బెరైడ్డి కుటుంబానికి చెందిన పలువురు గతంలో నెల్లిమర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్‌లుగా పనిచేశారు కాబట్టి ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానంవద్ద తన వాదనను వినిపించినట్లు తెలిసింది. అయితే తాను మొదట్నుంచీ రాజకీయాల్నే నమ్ముకుని ఉన్నానని, తనకు వ్యాపారాలుగాని, కాంట్రాక్టులు గాని లేవని మరో నేత నాగేశ్వరరావు చెప్పినట్లు భోగట్టా. తన తండ్రి బెరైడ్డి సూర్యనారాయణకు నెల్లిమర్ల పట్టణంలో మంచిపేరు ఉందని, అలాగే తనకు, తనభార్యకు సర్పంచ్‌గా పనిచేసిన అనుభవముందని అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం. తమ ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపునకు కృషిచేస్తామని ఇద్దరూ బయటకు చెబుతున్నప్పటికీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గేది లేదని ఆ ఇద్దరు నేతలూ అధిష్ఠానానికి తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారం టీడీపీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికి ఇస్తారో..లేదా మూడోవ్యక్తికి టికెట్ కేటాయిస్తారో వేచిచూడాల్సిందే. -
సహజ రంగులు వాడేలా చర్యలు
* గ్రేటర్ అధికారులకు హైకోర్టు ఆదేశం * తయారీదారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించండి * ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించండి * వినాయక చవితికి ముందే ఈ ప్రక్రియనంతా పూర్తి చేయండి * దీనిపై ఓ కార్యాచరణ ప్రణాళికను మా ముందుంచండి * విచారణ జూన్ 4కు వాయిదా సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాలకు కృత్రిమ రంగుల స్థానంలో సహజ రంగులను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు గురువారం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులను ఆదేశించింది. విగ్రహాల తయారీదారుల వద్దకు వెళ్లి వారికి సహజ రంగుల పట్ల అవగాహన కల్పించాలని స్పష్టం చేసింది. కృత్రిమ రంగుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వారికి వివరించాలంది. విగ్రహాల తయారీకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బదులు బంకమట్టిని ఉపయోగించేలా చూడాలంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, కృత్రిమ రంగుల వినియోగం వల్ల ప్రజానీకానికి కలిగే నష్టాల గురించి పోస్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని గ్రేటర్ అధికారులకు తేల్చి చెప్పింది. ఈ ప్రక్రియనంతా కూడా వినాయక చవితికి ముందే పూర్తి చేయాలంది. ఈ విషయంలో గణేష్ ఉత్సవ సమితులతో చర్చించి, వారు కూడా సహకరించేలా చూడాలంది. ఈ మొత్తం వ్యవహారంపై ఓ నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువులు, నీటి కుంటలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. అన్ని చోట్లా భారీ విగ్రహాలు వద్దు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది పి.కేశవరావు స్పందిస్తూ, విగ్రహాల నిమజ్జనం నిమిత్తం ఎన్క్లోజర్ల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 15 అడుగులకు మించి విగ్రహాలు ఏర్పాటు చేయాలనుకుంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తామన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఒకటి రెండు చోట్లు భారీ విగ్రహాలు ఏర్పాటు చేస్తే తప్పు లేదని, అయతే ఒకరిని చూసి మరొకరు ఎత్తుపై పోటీపడుతూ అన్ని చోట్ల భారీ విగ్రహాలు ఏర్పాటు చేయడం ఏ మాత్రం అమోదయోగ్యం కాదంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, విగ్రహాలకు సహజ రంగులు ఉపయోగించే విషయంలో ప్రభుత్వం నిధులు జారీ చేసిందన్నారు. ఈ సమయంలో భాగ్యనగర ఉత్సవ కమిటీ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ స్పందిస్తూ, సహజ రంగుల వాడకంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. -
బీజేపీ జిల్లా సారథి ఎవరో?
ఈనెల 29న బీజేపీ జిల్లా అధ్యక్షుని ఎన్నిక రేసులో కేశ్‌పల్లి ఆనందరెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి.. హైకమాండ్ చెప్తే మళ్లీ ఓకే అన్న గంగారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకులుగా వెంకటరమణి.. రెండు రోజుల ముందు అభిప్రాయసేకరణ జోరందుకున్న ‘సంస్థాగత’ సందడి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో ‘సంస్థాగత’ సందడి జోరందుకుంది. రెండు నెలల కిందటే జరగాల్సిన జిల్లా అధ్యక్షుని ఎన్నిక ఈ నెల 29న జరగనుంది. ఆ పార్టీ అధిష్టానం సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత వెంకటరమణి జిల్లా కమిటీ ఎన్నికలకు ఇన్‌చార్జీగా వ్యవహరించనుండగా.. జిల్లాకు చెందిన జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కొత్త అధ్యక్షుని ఎన్నికలో కీలకపాత్ర పోషించనున్నారు. 29న జిల్లా కమిటీ ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ జిల్లా సారథి ఎవరనేది పార్టీ వర్గాల్లో అప్పుడే చర్చ జరుగుతోంది. అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందే 27న పార్టీ సీనియర్లు, పదాధికారుల సమావేశమై కొత్త అధ్యక్షుని ఎన్నికపై అభిప్రాయ సేకరణ చేయనున్నారని తెలిసింది. మొత్తంగా కొత్త అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనే నినాదాన్ని కొందరు సీనియర్లు తెరపైకి తీసుకు వస్తుండగా.. పార్టీ కోసం అధిష్టానం సూచనల ప్రకారం పనిచేస్తున్న వారు పోటీకి సిద్ధమవుతున్నారు. పార్టీ కేడర్ మద్దతుతో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి గడ్డం(కేశ్‌పల్లి) ఆనందరెడ్డి ఈ సారి జిల్లా అధ్యక్షపదవికి గట్టీగా ప్రయత్నాలు చేస్తుండగా, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జి బాణాల లక్ష్మారెడ్డి కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి కూడా అధిష్టానం ఆదేశిస్తే రెండోసారి కొనసాగేంగుదుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంటుండటం పార్టీవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘సంస్థాగతం’పై దృష్టి సారించిన అధిష్టానం 2014 ఎన్నికల్లో జిల్లాలో ఆశించిన మేరకు ఓట్లు రాకున్నా.. కేంద్రంలో నరెంద్రమోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రావడం ఆ పార్టీ కేడర్‌లో ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో సంస్థాగతంగా బలపడేందుకు అధిష్టానం ఆదేశానుసారం కమలనాథులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అక్టోబర్ వరకు సభ్యత్వ నమోదు పూర్తిచేసి, డిసెంబర్ నెలాఖరు వరకు గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎన్నికలు నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలో 2015 ఆగస్టు నుంచి ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదుపై దృష్టి సారించారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లాలో కొంతమంది ఇన్చార్జీలు మాత్రమే చురుగ్గా పాల్గొన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో కీలకంగా వ్యహరిస్తారనే పేరున్న నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముందుకు సాగలేదు. జిల్లాలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 1.18 లక్షల సభ్యత్వం నమోదైతే.. ఒక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే 46,850 సభ్యత్వం నమోదు చేశారు. జిల్లాలో చాలా గ్రామాల్లో బూత్ కమిటీలు, మండల కమిటీలు ఇంకా వేయాల్సి ఉండగా.. నిజామాబాద్ రూరల్ బూత్ కమిటీలు, మండల కమిటీలు నెలరోజులు కిందటే పూర్తయి, శిక్షణ తరగతులు కూడ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే వేగం ఉంటే ఇప్పటికే అన్ని కమిటీలు పూర్తయ్యేవి. అయినప్పటికీ వచ్చే నెలలో రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగనున్నందున, ముందుగానే అన్ని జిల్లా కమిటీలను వేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు నెలల ఆలస్యంగానైనా ఈ నెల 29న జిల్లా అధ్యక్షుని ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. త్వరితగతిన సంస్థాగత ఎన్నికలను పూర్తి చేయడంపై అధిష్టానం దృష్టి సారించగా... జిల్లా కమిటీ ఎన్నికలు ఆ పార్టీ కేడర్‌లో చర్చకు తెరలేపాయి. పదాధికారులతో ఆశావహుల మంతనాలు సభ్యత్వ నమోదు సమయంలో ఈ సారి జిల్లా అధ్యక్ష పదవికి పోటీ ఉండబోదని, కొత్త వారికే అవకాశం వస్తుందన్న చర్చ జరిగింది. తీరా ఎన్నికలు జరిగే సమయం సమీపించడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతుండటం పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పల్లె గంగారెడ్డి జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో తనవంతు కృషి చేశారు. ఆయన హయాంలోనే 2014 సార్వత్రిక ఎన్నికలు రాగా.. పార్టీ కోసం పనిచేసిన అందరికీ టిక్కెట్లు రావాలని పొత్తులను గట్టిగా వ్యతిరేకించారు. అయినా అధిష్టానం నిర్ణయం మేరకు పొత్తులతో పోటీ చేయాల్సి రాగా.. ఆ తర్వాత ఆయన రెండోసారి అవకాశం వచ్చినా జిల్లా అధ్యక్షునిగా కొనసాగేందుకు విముఖత చూపారు. అయితే ఈ నెల 29న జిల్లా కమిటీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిష్టానం తానే ఉండాలని భావిస్తే రెండోసారి కొనసాగుతానంటూ పల్లె గంగారెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుం డటం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా వుండగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండోసారి కొనసాగలేనని గంగారెడ్డి తరచూ ప్రస్తావించడంతో.. ఇదే సమయంలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న గడ్డం(కేశ్‌పల్లి) ఆనందరెడ్డి జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఇదే క్రమంలో జిల్లా కేంద్రంలో రైతు ధర్నాలు, పార్టీ కార్యక్రమాలు జరిగినా రూరల్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలను పిలిపించడం, జాతీయ, రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రుల పర్యటనలు, సభలు విజయవంతం చేయడం కోసం జిల్లా అధ్యక్షుడి సూచన మేరకు ఆనందరెడ్డి గట్టిగా కృషి చేశారు. మొదటి నుంచి జిల్లా అధ్యక్ష పదవి లక్ష్యంగా పనిచేస్తున్న ఆయన ఈ సారి పోటీలో ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇన్చార్జి బాణాల లక్ష్మారెడ్డి కూడా జిల్లా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ ముగ్గురు నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేయగా, 27న జరిగే పదాధికారుల అభిప్రాయ సేకరణలో తమ పేరును ప్రతిపాదించాలని ఎవరికీ వారుగా ఫోన్లలో కోరుతుండటం.. జిల్లా అధ్యక్షుని ఎన్నికలు రసకందాయంలో పడినట్లేనన్న చర్చ జరుగుతుంది. -
రెండు ఎఫ్ఐఆర్లనూ సీబీఐకి బదలాయించండి
నిధుల మళ్లింపు కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), ఇతర బ్యాంకుల్లో లిక్విడేషన్(మూసివేత) కంపెనీల నిధుల మళ్లింపునకు సంబంధించి సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నందున, ఈ వ్యవహారంలో మల్కాజ్గిరి, ఖమ్మం జిల్లా ఖానాపూర్ పోలీస్స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లను, అన్ని రికార్డులను తక్షణమే సీబీఐ, డీఐజీ(ఏసీబీ విభాగం) హైదరాబాద్‌కు బదలాయించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అఫీషియల్ లిక్విడేటర్ పేరు మీద వివిధ బ్యాంకులో ఉన్న కోట్ల రూపాయల నిధుల మళ్లింపు వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. -
టీ కాంగ్ నేతలకు హైకమాండ్ పిలుపు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన పక్ష నేత జానా రెడ్డితో పాటు శాసన మండలి నేత షబ్బీర్ ఆలీ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వరంగల్ ఉప ఎన్నిక ఓటమితో పాటు, తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలపై హైకమాండ్‌తో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యే అవకాశముంది. వరంగల్ ఉప ఎన్నికల్లో చివర నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పు, ప్రచారంలో లోపాలు, అధికార పార్టీని ఎదుర్కోవడంలో విఫలమైన అంశాలతో పాటు, ఓటమి గల కారణాలను నాయకులు హైకమాండ్‌కు వివరించనున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్కి వచ్చిన భారీ మెజార్టీపై కూడా అధిష్టానం ఆరా తీసే అవకాశముంది. వచ్చే నెలాఖరులో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రేటర్ ఎన్నికలపై పట్టు సాధించే దిశగా పని చేసేందుకు నాయకులకు అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. -
టీ కాంగ్ నేతలకు హైకమాండ్ పిలుపు
-
కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో దానం!
-
టీపీసీసీ చీఫ్‌ని మార్చేస్తారా ?
-
టైం దగ్గరపడింది!
హోంశాఖ మంత్రి కె.జె.జార్జ్‌ను ఆ స్థానం నుంచి తప్పించేందుకు యత్నం లాభిస్తుందన్న యోచనలో సీఎం సిద్ధరామయ్య ఈ నిర్ణయం వల్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత తప్పదన్న ఆందోళన సాక్షి, బెంగళూరు : రాష్ట్ర హోంశాఖ మంత్రి కే.జే జార్జ్‌ను ఆ స్థానం నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ భావిస్తోందా? ఇందుకు ఆ పార్టీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర హోంశాఖలో అక్రమాలు పెరిగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కావలసిన ప్రాంతానికి బదిలీపై వెళ్లడానికి పోలీసు సిబ్బంది ఎక్కువ మొత్తం చెల్లించారని వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని విపక్ష నాయకులు చాలా సార్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇక చాలా ఏళ్లుగా రాష్ట్రంలో నిషేదానికి గురైన సింగిల్నెంబర్ లాటరీ, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వంటి చట్టవ్యతిరేక పనులు ప్రారంభమయ్యాయి. ఇక కరావళి ప్రాంతంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరగడం కూడా హోంశాఖ నిఘా వైఫల్యానికి కారణమనే అపవాదు ఉంది. హోంశాఖలోని ఉన్నతాధికారుల మధ్య సఖ్యత లేదనే విషయం ‘ఏడీజీపీ రవీంధ్రనాథ్’ ఘటనలో తేటతెల్లమయినట్లు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయంతో పాటు ఇక మహిళలు, పిల్లల పై అత్యాచారాలు జరుగుతున్న సమయంలో ఉన్నతస్థాయిలో ఉన్న హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ ప్రవర్తించిన తీరు పై కూడా సొంత పార్టీ నాయకులే గుర్రుగా ఉన్నారు. ఇక చట్టసభలతో పాటు బయట కూడా ప్రభుత్వ చర్యలను సమర్థించేలా ఆయన వ్యవహరించడం లేదని వారు పేర్కొంటున్నారు. మొన్న శాసన మండలిలో అత్యాచారాలపై విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో జార్జ్ తత్తరపాటుకు గురైనప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కలుగజేసుకున్న వైనాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా దాదాపు ఐదు రోజులుగా చట్టసభల్లో ఈ అత్యాచారాల విషయమే చర్చకు వస్తోంది. విపక్షాల విమర్శలను తప్పించుకోవడానికి కే.జే జార్జ్‌ను హోంశాఖ మంత్రి స్థానం నుంచి తప్పించడం వల్ల కొంత ఉపయోగం ఉంటుందని సిద్దరామయ్య భావిస్తున్నారు. అయితే ఆ విధంగా చేయడం వల్ల సొంత పార్టీలో తనపై మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉందనే ఆలోచన సిద్ధరామయ్యకు లేకపోలేదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కనీసం హోం మంత్రి స్థానం నుంచి తప్పించి ఇతర శాఖను కేటాయించవచ్చుననే వాదన కూడా ఉంది. ఏది ఏమైనా హోంశాఖ మంత్రి స్థానం నుంచి కే.జే జార్జ్‌ను పక్కకు తప్పించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. -
ముఖ్యమంత్రి కుర్చీ ఇక భద్రం
ఇదిగో మారుస్తారు.. అదిగో మారుస్తారు అని చెబుతూ వస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్.. ఇక బేఫికర్‌గా ఉండొచ్చు. ఆయన యథాతథంగా కొనసాగుతారని, ముఖ్యమంత్రి పదవిలో మార్పు ఏమీ లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మోహన్ ప్రకాష్ తెలిపారు. పృథ్వీరాజ్ నిస్సందేహంగా తన పదవిలో కొనసాగుతారని అన్నారు. అంతకు ముందు పృథ్వీరాజ్ చవాన్ ఇంటి బాట పడతారనే ఊహాగానాలు దాదాపు రెండు మూడు వారాల నుంచి అటు మహారాష్ట్రతో పాటు ఇటు ఢిల్లీల్లో కూడా జోరందుకున్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ ను బుధవారం ఉన్నట్టుండి ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ హైకమాండ్ కోరడంతో ఈ ఊహాగానాలు మరోసారి గుప్పుమన్నాయి. అయితే 48 గంటలు గడవకుండానే మళ్లీ ఆయన పదవి సేఫ్ అని చెప్పారు. అధిష్ఠానం పిలుపుతో ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి పరుగెత్తారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహరాష్ట్రలో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున చవాన్‌కు ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఒక దశలో భావించింది. ఆయన స్థానంలో సుశీల్ కుమార్ షిండే, నారాయణ రాణే, రాధాకృష్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాట్, పతంగ్ రావ్ కదమ్ వంటి వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చునని ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అధిష్ఠానం నిర్ణయంతో మరోసారి వారందరికీ ఆశాభంగం కలిగింది. -
కాంగ్రెస్ మహారాష్ట్ర సీఎంను మారుస్తుందా?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇంటి బాట పట్టనున్నారా? మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఈ మేరకు ఊహాగానాలు జోరందుకున్నాయి. పృథ్వీరాజ్ చౌహాన్ ను బుధవారం ఉన్నట్టుండి ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ హైకమాండ్ కోరడంతో ఈ ఊహాగానాలు గుప్పుమన్నాయి. ముఖ్యమంత్రి తన కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి హుటాహుటిన పరుగెత్తారు. ఇటీవలి లోకసభ ఎన్నికల్లో మహరాష్ట్రలో కాంగ్రెస్ ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. అక్కడ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బవాన్ ను ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ నేతృత్వం భావిస్తోంది. ఆయన స్థానంలో సుశీల్ కుమార్ షిందే, నారాయణ రాణే, రాధాకృస్ణ విఖే పాటిల్, బాలాసాహెబ్ థోరాట్, పతంగ్ రావ్ కదమ్ వంటి వారిలో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చవాన్ ను తొలగించాలని ఎన్సీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పిలుపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. -
ఉమకే మొగ్గు
కరీంనగర్ సిటీ : జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, కథలాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు తుల ఉమ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపింది. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తుల ఉమ అభ్యర్థిత్వంపై విముఖతతో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కేసీఆర్ నిర్ణయం తెలిసినా మరో పేరును తెరపైకి తీసుకురావడంపై సదరు ఎమ్మెల్యేలపై పార్టీ ముఖ్యనేతలు అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ‘మీకు కూడా బీ-పారాలు ఇచ్చింది పార్టీయే... గుర్తుంచుకోండి’ అంటూ మందలించినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న తుల ఉమ రాష్ట్రస్థాయి నాయకురాలిగా అనతి కాలంలోనే గుర్తింపు పొందారు. కేసీఆర్‌కు సన్నిహిత నాయకుల్లో ఆమె ఒకరుగా ఉన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు పార్టీలో పోటీ తీవ్రంగా ఉండటంతో ఆ స్థాయి పదవిని ఉమకు ఇవ్వాలనే దిశగా కేసీఆర్ యోచిస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ కోరుట్ల ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. అదే సమయంలో జిల్లా పరిషత్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కేసీఆర్ ఆమెను జెడ్పీవైపు మళ్లించారు. జెడ్పీ చైర్పర్సన్ సీటు ఖాయమన్న అధినేత హామీ మేరకు ఆమె కథలాపూర్ నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. ఎన్నికల సమయంలో స్థానికంగా కొన్ని సమస్యలు తలెత్తగా పార్టీ ఉమకు అండగా నిలిచింది. జెడ్పీటీసీగా ఆమె విజయం సాధించడంతో చైర్పర్సన్ ఖాయమైంది. చైర్పర్సన్ రేసులో ఉన్న జెడ్పీటీసీలు కూడా ఉమ గెలుపొందడంతో తమ ప్రయత్నాలు విరమించుకున్నారు. అయితే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా తమ విముఖతను వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ.. ఉమ అభ్యర్థిత్వం పట్ల కేసీఆర్ పూర్తి సానుకూలంగా ఉండటంతో ఆమె ఎన్నిక తప్పనిసరైంది. ఇప్పటికే ఉమ పేరిట బీ-ఫారాన్ని కూడా జిల్లా ముఖ్య నాయకులకు అందచేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి ఒకరిద్దరు సుముఖంగా లేకున్నా, జిల్లాలోని మెజారిటీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అనుకూలంగా ఉన్నారు. దీంతో ఈ నెల 5న జరిగే ఎన్నికలో తుల ఉమ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికవడం లాంఛనమే కానుంది. -
ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధం
-
సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ డ్రామానా?
-
హైకమాండ్ డైరెక్షన్లో సీఎం రాజీనామా
-
రాజీనామా అంటూ నాటకాలు
-
టీడీపీతో అంటకాగుతున్న గల్లా కుటుంబం
-
గల్లా సాక్షిగా బాబు విమర్శలు
సాక్షి, తిరుపతి: రాష్ట్ర గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌పై ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. బంగారుపాళెం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఎన్పీ.చెంగల్రాయనాయుడు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇందుకు వేదికగా నిలిచింది. మంత్రి గల్లా కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమానికి మంత్రి స్వయంగా హాజరయ్యారు. విగ్రహావిష్కరణ ఏర్పాటు చేసిన ప్రాంగణంలోని వేదికపై చంద్రబాబు, అరుణకుమారి పక్కపక్కనే కూర్చున్నారు. దశబ్దాలుగా రాజకీయ వైరం ఉన్న ఈ నేతలు ఒకే వేదికపై పక్కపక్కన కూర్చోవడం చర్చకు దారితీసింది. ఈ వేదికపై నుంచే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రులు చిదంబరం, వీరప్పమొయిలీలను ప్రతిపక్షనేత తీవ్రస్థాయిలో విమర్శించారు. చంద్రబాబు విమర్శలు చేస్తున్న సమయంలో అరుణకుమారి కొంత ఇబ్బందిపడినట్టు కనిపించారు. రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని కాంగ్రెస్ నేతలు కీలకంగా వ్యవహరించారని బాబు తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో చిదంబరం భారీ మెజారిటీతో ఓడిపోవడం ఖాయమన్నారు. అంతకుముందు గల్లా అరుణకుమారి తన ప్రసంగంలో ఎన్పీ. చెంగల్రాయనాయుడు సేవలను కీర్తించారు. కాగా చంద్రబాబు బంగారుపాళెం చేరుకోవడానికి గంట ముందుగానే అరుణకుమారి అక్కడికి చేరుకున్నారు. అయితే గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాబు చేరుకోవడానికి ఐదు నిమిషాల ముందు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే రవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే సీకే బాబు ఉదయం పది గంటల సమయంలో బంగారుపాళెం చేరుకుని చెంగల్రాయనాయుడు విగ్ర హానికి నివాళులు అర్పించి వెళ్లారు. -
ఏఐసీసీ భేటీకి రాలేను! హైకమాండ్‌కు సీఎం విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 17న ఢిల్లీలో జరిగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశానికి హాజరయ్యే విషయంలో తనకు మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కోరారు. శాసనసభా నాయకుడిగా ఉంటూ కీలకమైన విభజన బిల్లుపై సభలో చర్చ కొనసాగుతున్న సమయంలో ఢిల్లీ వెళ్లడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఆయన వారికి చెప్పినట్టు సమాచారం. ఏఐసీసీ సమావేశాల కోసం 17న అసెంబ్లీకి సెలవు ఇవ్వాలని భావించినా ఢిల్లీ పెద్దల సూచనల మేరకు ఆరోజు సభ జరపాలని సీఎం కోరినట్లు తెలిసింది. సీఎం విజ్ఞప్తిపై హైకమాండ్ స్పందనను బట్టి కిరణ్ ఢిల్లీ ప్రయాణం ఆధారపడి ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు. -
కుట్రతోనే శాఖ మార్చారు
సీఎం తెలంగాణ ప్రజలను అవమానించారు అందుకే రాజీనామా చేశా : శ్రీధర్‌బాబు సాక్షి, హైదరాబాద్ : శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తనను తప్పించడం తెలంగాణలోని 4 కోట్లమంది ప్రజలను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ బిల్లును అడ్డుకునే కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ పని చేశారని ఆరోపించారు. అందుకు నిరసనగానే మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. తెలంగాణ కోసం ఎందరో తల్లులు తమ బిడ్డలను పోగొట్టుకున్నారని, వారి త్యాగం ముందు తన రాజీనామా కాలిగోటితో సమానమని చెప్పారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పదేపదే చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. తన రాజీనామా అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు బిల్లును అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలను కూడా వివరిస్తానన్నారు. దీంతోపాటు అసెంబ్లీలోనూ రాజీనామా అంశాన్ని లేవనెత్తుతానని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం శ్రీధర్‌బాబు తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాజీనామాకు దారితీసిన కారణాలను వివరించారు. ‘‘వ్యక్తిగత స్వార్థం కోసం నేను మంత్రి పదవికి రాజీనామా చేయలేదు. నాకు సీఎం అదనంగా మంచి శాఖను ఇచ్చారా? లేదా? అనేది కూడా వేరే అంశం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం 4 కోట్ల తెలంగాణ ప్రజలను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. శాసనసభ నిబంధనలు, సాంప్రదాయాలతోపాటు బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకే నేను సభలో బిల్లును ప్రవేశపెట్టాను. సీఎం తీసుకున్న శాఖ మార్పు నిర్ణయం తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉంది. శాఖల మార్పు సీఎం విచక్షణలో భాగమే అయినప్పటికీ ఈ సమయంలో కవ్వింపు చర్యలు సరికాదు. నూటికి నూరుశాతం అధికార దుర్వినియోగం చేశారు. ఈ సంగతి తెలిసినప్పటికీ సీఎం, సీమాంధ్ర నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, బిల్లును ఆపే కుట్రలో భాగంగానే శాఖను మార్చారు. తెలంగాణ వ్యతిరేక శక్తులపై తిరుగుబాటు ఉంటుందని చెప్పడానికే ఈ పని చేశాను’’అని అన్నారు. సీఎం చెప్పేవన్నీ అసత్యాలే: తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్న మాటలన్నీ అసత్యాలేనని శ్రీధర్‌బాబు చెప్పారు. ‘‘తెలంగాణపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడేమో మాటతప్పి బిల్లును అడ్డుకుంటున్నారు. అసెంబ్లీలో విభజన బిల్లును ప్రవేశపెట్టనేలేదని చెబుతూ తప్పుదోవపట్టిస్తున్నారు. అసెంబ్లీలో వెంటనే విభజన బిల్లుపై చర్చించాలని బీఏసీ తీసుకున్న నిర్ణయం నిజం కాదా? దానికి సీఎం హాజరుకావడం...ఆయన పేరుతో బులెటిన్ విడుదల కావడం నిజం కాదా? ఆ తరువాత అసెంబ్లీ కార్యదర్శి సభలో విభజన బిల్లును చదవడం నిజ ం కాదా? ఆ బిల్లుకు నేను మద్దతు చెబుతూ చర్చను ప్రారంభిస్తున్నట్లు చెప్పడం నిజం కాదా? ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ బిల్లుపై చంద్రబాబును మాట్లాడాలని కోరడం నిజం కాదా? అన్నీ నిజాలేనని తెలిసినప్పటికీ అసలు చర్చ ప్రారంభమే కాలేదని అసత్యాలు చెప్పడం న్యాయమా?’’అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు నేతలు వక్రభాష్యాలు చెబుతూ సమైక్య తీర్మానం ప్రవేశపెట్టే దిశగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి సభలో ఏదైనా ఒక అంశంపై చర్చ మొదలయ్యాక... అది పూర్తయ్యే వరకు మరే అంశాన్ని చేపట్టడానికి వీల్లేదని అన్నారు. తెలంగాణ కోసం నాలుగేళ్లుగా తమ ప్రాంత ప్రజలు ఆందోళన చేస్తున్నా కాంగ్రెస్‌కు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎంతగానో సహకరించామన్నారు. ఈ తరుణంలో తనపై ఎన్నో ఆరోపణలు వచ్చినా, అవమానాలు ఎదురైనా భరించానన్నారు. కొందరు జేఏసీ నేతలు చివరకు తన తండ్రి శ్రీపాదరావుపై వ్యక్తిగత ఆరోపణలు చేసినా తెలంగాణ వస్తుందనే ఆశతో ప్రతిఘటించకుండా ఓపిక పట్టానని చెప్పారు. ఇంత చేసినా సీఎం ఈ విధంగా వ్యవహరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిపక్వతలేని సీఎం చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ మంత్రులూ రాజీనామాకు వెనుకాడరు: సమయం వచ్చినప్పుడు తెలంగాణ మంత్రులంతా రాజీనామాకు వెనుకాడబోరని శ్రీధర్‌బాబు చెప్పారు. విభజన బిల్లుపై సభలో చర్చ జరుగుతున్న తరుణంలో అందరూ రాజీనామా చేయడం సరికాదనే ఆగిపోయారన్నారు. ఎవరేం చేసినా, తనపై మరెన్ని ఆరోపణలు వచ్చినా తాను మాత్రం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా హైకమాండ్ ఆదేశాలు, ఎజెండా ప్రకారమే ముందుకు వెళుతున్నానని చెప్పారు. శ్రీధర్‌బాబుకు సంఘీభావం: శ్రీధర్‌బాబు మంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు తరలివచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారు. మంత్రులు జానారెడ్డి, బసవరాజు సారయ్య, ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్యేలు ప్రవీణ్‌రెడ్డి, కిష్టారెడ్డి, ఆకుల రాజేందర్, నందీశ్వర్‌గౌడ్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సంతోష్‌కుమార్, బి.వెంకట్రావుతోపాటు వందలాది మంది నాయకులు శ్రీధర్‌బాబును ఆయన నివాసంలో కలిశారు. కార్యకర్తలు ‘జై తెలంగాణ, జై శ్రీధర్‌బాబు’ అంటూ నినాదాలు చేశారు. -
పథకం ప్రకారమే తప్పించారు
-
పథకం ప్రకారమే తప్పించారు
హైకమాండ్ వ్యూహం మేరకే శ్రీధర్‌బాబు శాఖ మార్పు పార్టీ అధిష్టానం అనుమతి తీసుకునే మార్పు చేపట్టిన కిరణ్ విభజన బిల్లుపై చర్చ సాఫీగా జరిగేలా చూడటమే సీఎం లక్ష్యం బిల్లును తానే అడ్డుకుంటున్నాననే భావనా కల్పించే పథకం సాక్షి. హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి ప్రయోజనం కలిగించేలా ‘రోడ్ మ్యాప్’ను అమలు చేయిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం వ్యూహంలో భాగంగానే.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజాగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిని మార్చినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. శాసనసభ మలివిడత సమావేశాలు ఈ నెల 3వ తేదీ (శుక్రవారం) నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. శాసనసభా వ్యవహారాల శాఖను దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నుంచి తప్పించి మరో మంత్రి సాకే శైలజానాథ్‌కు అప్పగించడం.. హైకమాండ్ ఆదేశాలను అమలు చేయడంలో తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటం, సీఎం తనకు తానుగా సమైక్యాంధ్ర చాంపియన్ అనిపించుకోవడమన్న రెండు లక్ష్యాలను సాధించుకోవడానికేనని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ‘నేను కొట్టినట్టు చేస్తా.. మీరు ఏడ్చినట్టు చేయుండి...’ అన్నట్టుగా సీఎం కిరణ్ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్ర విభజన బిల్లును మరో 24 గంటల్లో అసెంబ్లీలో చర్చకు చేపట్టాల్సిన తరుణంలో ఉన్నట్టుండి శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి తప్పించడం ద్వారా రాజకీయవర్గాల్లో ఒక చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే కిరణ్ కావాలనే ఈ చర్యకు దిగారని ఆ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి తప్పించడం ద్వారా తెలంగాణ వాదుల నుంచి తనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయని, తద్వారా సీమాంధ్రలో తాను ఒక్కడే సమైక్యం కోసం పనిచేస్తున్నట్టు ప్రజలు భావిస్తారన్న లక్ష్యంతోనే కిరణ్ తాజా చర్యకు దిగినట్టు చెప్తున్నాయి. అనుకున్నట్టుగానే తెలంగాణ మంత్రులు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఈ విషయమై కిరణ్‌పై ఫిర్యాదు చేయడాన్ని ఆ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. విభజన బిల్లు తిరిగి వెళ్లదుగా..? కిరణ్ వ్యూహాత్మకంగానే ఈ చర్యకు దిగారని చెప్పేందుకు పరిశీలకులు పలు అంశాలను విశ్లేషిస్తున్నారు. ‘శాసనసభా వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి తప్పించి మరొకరికి అప్పగించినంత వూత్రాన అసెంబ్లీకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు తిరిగి వెనక్కి వెళ్లదు. ఒకవేళ విభజన బిల్లును శాసనసభలో అడ్డుకోవాలనుకుంటే ఇంకేదైనా మార్గం ఎంచుకోవాలి. అంతే తప్ప దానికి శాసనసభ వ్యవహారాల శాఖ వుంత్రికి ఎలాంటి సంబంధం ఉండదు. విభజన బిల్లుపై సభలో చర్చ జరపాలని గానీ వద్దనిగానీ చెప్పే అధికారం గానీ ఆ మంత్రికి లేదు. శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ)లో తీసుకున్న నిర్ణయం మేరకు స్పీకర్ పర్యవేక్షణలో మాత్రమే సమావేశాలు సాగుతాయి. బీఏసీ సమావేశం జరిగినప్పుడు జనవరి 23 వరకు బిల్లుపై చర్చిద్దామని ప్రతిపాదించిందే ముఖ్యమంత్రి. ఆ మేరకే అసెంబ్లీ ఎజెండా ఖరారైంది కూడా. బీఏసీ నిర్ణయూలపై అసెంబ్లీ నోట్ విడుదల చేయూలి. కానీ ఆ సంప్రదాయూనికి భిన్నంగా ఆ రోజున ప్రత్యేకంగా సీఎం పేరుతో నోట్‌ను విడుదల చేశారు. సమావేశాలను సవ్యంగా జరిపించడంలో స్పీకర్‌కు సహకరిస్తూ ప్రభుత్వానికి, మిగిలిన పక్షాలకు మధ్య సమన్వయం చేయడం తప్ప చర్చ వద్దని చెప్పడం గానీ ఇతర పక్షాలు, సభ్యుల వాదనను గానీ శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అడ్డుకోలేరు’ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు నెలల్లో ఆదాయం పెంచగలరా? ‘ఇక మంత్రిత్వ శాఖల విషయానికి వస్తే ఒక్క వాణిజ్యపన్నుల శాఖే కాదు రాష్ట్ర పరిపాలనా వ్యవహారాల్లో అత్యంత కీలకమైన హోంశాఖ, ఎక్సయిజ్, విద్యుత్ వంటి ముఖ్యమైన శాఖలన్నీ సీఎం వద్దే ఉన్నాయి. ఎంతో కాలంగా ఆ శాఖలకు మంత్రులెవరినీ కిరణ్ నియమించలేదు. తవుకు కీలక శాఖలు కాకుండా చిన్న శాఖలు ఇచ్చారని సీనియుర్ వుంత్రులు తీవ్ర అసంతృప్తితో అధిష్టానానికి ఫిర్యాదులు పంపినా సీఎం తనవద్ద అదనంగా ఉన్న కీలక శాఖలను వారికి ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. తాజాగా స్వయంగా ఆయన పర్యవేక్షణలో ఉన్న వాణిజ్యశాఖ ద్వారా రాబడి తగ్గిపోయిందని.. ఇంత కాలం తర్వాత.. అది కూడా మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఆ శాఖను శ్రీధర్‌బాబుకు అప్పగించడం అర్థంలేనిదని అందరికీ స్పష్టవువుతోంది. పైగా ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే పెట్టగలదే తప్ప వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టజాలదు. అలాంటప్పుడు ఆగమేఘాలపై వాణిజ్య పన్నుల రాబడిని పెంచాలన్న అంశంపై ఇప్పుడు దృష్టి సారించడాన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి చెప్తున్న వాదనలో ఏ మాత్రం పసలేదని తేలిపోతోంది’ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సైమైక్యవాదిగా చెప్పుకునే డ్రామా... ‘మంత్రుల శాఖలను మార్చడం, చేర్చుకోవడం, తొలగించడం వంటి అంశాల్లో ముఖ్యమంత్రికి సర్వ అధికారాలు ఉంటాయి. ఉన్నట్టుండి సీఎంకు వాణిజ్య పన్నుల రాబడిపై ఆందోళన ఉన్నట్టయితే ఆ కీలకమైన శాఖను మరో మంత్రికి అదనంగా అప్పగించవచ్చు. లేదా కొత్త వ్యక్తికి అప్పగించవచ్చు. ఇప్పుడున్న అనిశ్చిత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేతిలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ సరైన ఫలితాలు చూపించలేనప్పుడు మరో మంత్రి మాత్రం అధికాదాయన్ని రాబట్టడం సాధ్యమవుతుందా?’ అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే.. ప్రస్తుత కేబినేట్లో శ్రీధర్‌బాబు మొదటి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుందని గుర్తుచేస్తున్నారు. ‘పైగా సీఎం నిర్ణయాలకు, ఆదేశాలకు వ్యతిరేకంగా శ్రీధర్‌బాబు వ్యవహరించింది కూడా ఏమీ లేదు. డిసెంబర్ 12న ప్రారంభమైన శాసనసభ తొలి విడత సమావేశాలను పురస్కరించుకుని స్పీకర్ బీఏసీ నిర్వహించగా, ఆ సమావేశానికి ముఖ్యమంత్రి గైర్హాజరయ్యారు. ఆయన తరఫున ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమావేశాల అజెండాను అంగీకరించారు. విభజన బిల్లుపై చర్చకు సంబంధించిన అజెండా ఖరారు చేయడానికి రెండోసారి బీఏసీ సమావేశమైనప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే జనవరి 23 వరకు చర్చ జరగాలని కోరడం, ఆ మేరకు అసెంబ్లీ షెడ్యూలు విడుదల చేయడం జరిగిపోయింది. ఇంత జరిగాక ఇంకా ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అదనంగా చేసేదేమీ ఉండదు. సభా వ్యవహారాల వుంత్రిగా శ్రీధర్‌బాబు.. సీఎం కిరణ్ వ్యూహాలను అడ్డుకునేదీ ఏమీ ఉండదు. అరుునా సీఎం ఆయున నుంచి ఆ శాఖను తప్పించడం కేవలం సమైక్యవాదిగా చెప్పుకొనేందుకు వేసిన ఒక డ్రావూ వూత్రమేనని స్పష్టవువుతోంది’ అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అందివచ్చిన అవకాశంగా... కేబినేట్లో తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న శ్రీధర్‌బాబు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారన్నది సుస్పష్టమని పరిశీలకులు చెప్తున్నారు. ‘శ్రీధర్‌బాబు శాఖను మార్చినట్టే మార్చి ప్రాధాన్యత కలిగిన వాణిజ్యపన్నుల శాఖను కట్టబెట్టారు. విభజన బిల్లు శాసనసభలో స్పీకర్ ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చను ప్రారంభించాలని శ్రీధర్‌బాబు సభలో కోరడం, ఆ తర్వాత చర్చ ప్రారంభమైందని సభ బయట చెప్పడం, గతంలో అసెంబ్లీ ప్రొరోగ్ చేయడానికి సంబంధించిన ఫైలు పంపకుండా తనవద్దే పెట్టుకోవడం వంటి అంశాలను ముఖ్యమంత్రి తనకుఅందివచ్చిన అవకాశంగా మార్చుకున్నారు. శ్రీధర్‌బాబును మార్చితే తెలంగాణ వాళ్లకు కోపమొస్తుంది. విభజనను అడ్డుకోవడానికి మాత్రమే ఈ పని చేశారని సీమాంధ్రలో తనకు సమైక్యవాదినన్న పేరు దక్కుతుంది. ఈ ప్లాన్ ప్రకారమే ఈ శాఖల వూర్పు చేసినట్టు సీఎం తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి’ అని వారు పేర్కొంటున్నారు. నిజానికి రాష్ట్ర కేబినేట్లో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య ఎన్నో విబేధాలున్నాయని, దామోదర రాజనర్సింహ సూచించిన ఏ పని జరక్కుండా ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయని, తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారినే సీఎం తప్పించాలనుకుంటే ఆ జాబితాలో డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు ఉన్నారని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఆది నుంచీ అంతే... ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై పార్టీలోని సీమాంధ్ర నేతలు మొదటి నుంచీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సీడబ్ల్యూసీ తెలంగాణ ఇవ్వాలని తీర్మానం చేసింది మొదలుఇప్పటివరకు అనేక దశల్లో రాష్ట్ర విభజనను కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న భావన కల్పించుకుంటున్నారే తప్ప విభజనను అడ్డుకునే పని ఒక్కటి కూడా చేయలేదని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలే చెప్తుంటారు. ‘హైకమాండ్ విభజన నిర్ణయం తీసుకున్న రోజే సీఎం రాజీనామా చేసి ఉంటే అసలు అసెంబ్లీ ఉండేది కాదు.. ఈ చర్చకు ఆస్కారమే లేదు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ కమిటీ విభజనపై నివేదికను సమర్పించకముందు, కేంద్ర కేబినెట్ విభజన ముసాయిదా బిల్లును ఆమోదించకముందు, ఆ బిల్లు రాష్ట్రపతి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి రాకముందు.. ఇలా ఎన్నో దశల్లో రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసి ముందుగా పంపించవచ్చు. కానీ.. అన్ని దశల్లోనూ తానే అడ్డుకుంటానంటూ మాటలు చెప్తున్న ముఖ్యమంత్రి కిరణ్.. అంతర్గతంగా విభజనకు సహకరిస్తూ వస్తున్నారు. ఏదీ చేయకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న భావన కల్పించడంలో కిరణ్ చాలా తెలివిగా బిల్లును అసెంబ్లీ వరకు వచ్చేట్టు వ్యవహారాలు నడిపించారు. చివరికి.. ఇటీవల కిరణ్‌కు సన్నిహితుడుగా ఉండే ఏపీఎన్జీవో సంఘ నేత ఒకరు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో.. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలందరూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి అఫిడవిట్లు అందించాలనీ నిర్ణయించారు. రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు.. కొన్ని రోజుల విడిది అనంతరం ఢిల్లీ కూడా వెళ్లిపోయారు.. కానీ కిరణ్ మాత్రం అఫిడవిట్ల ఊసే ఎత్తలేదు’ అని సీమాంధ్ర సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. హైకమాండ్ అనుమతితోనే... పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను కూడా మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించలేదనే విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. ‘మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేసుకోవడానికి అవకాశమివ్వాలని సీఎం కిరణ్ ఢిల్లీ వెళ్లి చెప్పుకున్నా హైకమాండ్ అంగీకరించలేదు. అలాంటిది ఈ కీలక సమయంలో తెలంగాణకు చెందిన శ్రీధర్‌బాబు శాఖను ఉన్నట్టుండి మార్చే సాహసం.. పార్టీ హైకమాండ్ ఆదేశాలు లేకుండా ముఖ్యమంత్రి చేయరు’ అని వారు స్పష్టంచేస్తున్నారు. ఇప్పుడు కూడా సీఎం కిరణ్ తన తాజా నిర్ణయంపై ముందుగానే హైకమాండ్ పెద్దలతో చర్చించి, వారి ఆమోదం మేరకే నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో విభజన బిల్లుపై చర్చ జరక్కుండా వైఎస్సార్ కాంగ్రెస్ లాంటి సమైక్యవాద పార్టీలు అడ్డుకునే అవకాశాలు ఉండటంతో ముందుగానే తానే ఏదో చేశానన్న అభిప్రాయం కల్పించడానికి సీఎం హైకమాండ్ పెద్దలతో మాట్లాడి శ్రీధర్‌బాబును మార్చినట్టు ఆ వర్గాల సమాచారం. అదీగాక.. ‘అసెంబ్లీ ప్రొరోగ్ ఫైలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపకుండా శ్రీధర్‌బాబు తన వద్దే పెండింగ్‌లో పెట్టుకున్నారన్న విషయంలో ఆగ్రహంగా ఉండి ఉంటే ఆ రోజే ఆయనను ముఖ్యమంత్రి భర్తరఫ్ చేసేవారు. లేదా అప్పుడే శాఖను మార్చేవారు’ అని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ‘పైగా విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందని బీఏసీ సమావేశంలో శ్రీధర్‌బాబు చెప్పినప్పుడు సీమాంధ్రకు చెందిన కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా.. అయిందేదో అయిపోయింది.. దాన్ని వివాదం చేసి పెద్దది చేయకండని చెప్పిందే ముఖ్యమంత్రి’ అని ఆ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. శైలజానాథ్ చేసేదేంటి? శ్రీధర్‌బాబు నుంచి అసెంబ్లీ వ్యవహారాలను తప్పించి మరో మంత్రి శైలజానాథ్‌కు అప్పగించగా.. శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న సమావేశాల్లో ఆ శాఖ మంత్రిగా ఆయున పెద్దగా చేసే కార్యక్రమాలేవీ లేవని పరిశీలకులు పేర్కొంటున్నారు. ‘బీఏసీలో అజెండా ఇప్పటికే నిర్ణయం జరిగిపోయింది. విభజన బిల్లు సందర్భంగా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో చర్చ జరిగిన తీరును పరిశీలించి వచ్చిన స్పీకర్ అవసరమైతే ఆ విషయాలను వెల్లడించడానికి ఫ్లోర్ లీడర్లతో సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లేదా ముఖ్యమంత్రి అనుమతి మేరకు మరోసారి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసే ఆస్కారం కూడా ఉంది. విభజన బిల్లుపై చర్చ జరగాలని తెలంగాణ నేతలు కోరుతుండగా, సమైక్యవాదులు చర్చను అడ్డుకునే అవకాశముంది. ఇంతకాలం సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న శైలజానాథ్‌ను శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా చేసి ఇప్పుడు సభలో కార్యక్రమాలు సజావుగా నిర్వహించేలా చూసే బాధ్యతలను ఆయనకే సీఎం కిరణ్ అప్పగించారు. ఇదీ కిరణ్ వ్యూహంలో భాగమే’ అని వారు విశ్లేషిస్తున్నారు. శాసనసభలో సమైక్యవాదానికి వుద్దతు లేకుండా చేయుడానికే సీఎం వ్యూహాత్మకంగా ఆ గొంతులూ నొక్కేలా ఈ శాఖల వూర్పు చేశారన్న అనువూనాలు కాంగ్రెస్‌లోనే వ్యక్తవువుతున్నారుు. -
బీజేపీతో టచ్‌లో కాంగ్రెస్ సీనియర్లు
-
కుడితిలో పడ్డ ఎలకలా కాంగ్రెస్ పరిస్థితి
యూపీఏ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. అనుకున్న అస్త్రాలన్నీ బూమెరాంగ్ అవుతుండటంతో ఏం చేయాలో తెలియక కొట్టుకుంటోంది. ఒకవైపు తాను రేపిన తెలంగాణ చిచ్చు, మరోవైపు నాలుగు రాష్ట్రాల్లో కమలానికి అధికారం.. అన్నీ కలిపి అధిష్ఠానం పెద్దల తలకు రోకలిలా చుట్టుకున్నాయి. దీనికి తోడు లోక్‌సభలో అవిశ్వాసం ఇప్పుడు అసలు సిసలు సమస్యగా మారింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సొంత పార్టీ ఎంపీలు ఎటూ విశ్వాస పాత్రంగానే పడి ఉంటారులే అనుకుని తేలిగ్గా తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. వాళ్లకు దాదాపు మరో 50 మంది వరకు తోడు కావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతేకాదు, ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులో ఎక్కడా తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించకపోవడంతో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ కూడా ఆ తీర్మానానికి మద్దతిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. లోక్‌సభలో విపక్ష నేత సుష్మా స్వరాజ్‌తో ఒకసారి సంప్రదించి ఏ విషయం చెబుతామన్నారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఉలిక్కిపడ్డారు. ఎటుతిరిగి ఇది ఎటు వెళ్తుందోనని ఆలోచనలో పడ్డారు. ఎందుకైనా మంచిదని ఆలోచన చేశారు. ఎలాగోలా ముందు ఈ పరిస్థితి నుంచి బయటపడాలనుకుని, బుధవారం వరకు లోక్‌సభను బలవంతంగా వాయిదా వేయించారు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. సాక్షాత్తు అధికార పార్టీకే చెందిన ఎంపీ సబ్బం హరి. సొంత పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విషయంలో ముందడుగు వేసినది, అందరి మద్దతు కూడగట్టేందుకు గట్టిగా ప్రయత్నించిది ఆయనే. అవిశ్వాసం గండం నుంచి గట్టెక్కేందుకు పార్లమెంటును ప్రోరోగ్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తనకు విశ్వసనీయంగా సమాచారం ఉందని ఆయన అన్నారు. ఆరుగురు ఎంపీలే కదా, వాళ్లపై సస్పెన్షన్ వేటు వేసేస్తే ఇక తీర్మానమూ ఉండదు, అవిశ్వాసమూ ఉండదని తొలుత కాంగ్రెస్ పెద్దలు భావించారు. ఈ మేరకు పొద్దున్నే తమ నాయకులతో ప్రకటనలు కూడా చేయించారు. కానీ, తీరా బీజేపీ నాయకులు అవిశ్వాసానికి మద్దతు విషయంలో సానుకూలంగా స్పందించడం, యూపీఏకు మద్దతిస్తున్న ఇతర పక్షాలు కూడా తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు దీన్నో అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉందని తెలియడంతో కాంగ్రెస్ అధిష్ఠానం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారైంది. పొరపాటున అవిశ్వాసం గనక పార్లమెంటులో చర్చకు, ఓటింగుకు వస్తే.. అసలే అరకొర మెజారిటీతో నెట్టుకొస్తున్న తమ ప్రభుత్వం గుటుక్కుమంటుందని, ముందస్తు ఎన్నికలు తప్పవని కాంగ్రెస్ పెద్దలకు బాగా తెలుసు. ప్రస్తుత పరిస్థితి చూస్తే దేశంలో ఎక్కడా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు అంత గొప్పగా లేవు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఇంకా దేశ ప్రజలపై అలాగే ఉంది. యూపీ లాంటి వాటి తర్వాత అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని రెండు ప్రాంతాల్లోనూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. సీమాంధ్ర ప్రాంతంలో అయితే ఆ పార్టీని వెయ్యి కిలోమీటర్ల లోతు గొయ్యి తీసి పాతర వేద్దామన్నంత కసితో ప్రజలున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ కేవలం తన ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్ర విభజన అంటోంది తప్ప ఇందులో ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అనుమానమేనని, కావాలనే తన సొంత పార్టీకి చెందిన సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో తెలంగాణను అడ్డుకునే ప్రయత్నాలు చేయిస్తోందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సార్వత్రిక ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పడవ మునిగిపోవడం ఖాయం. అందుకే ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక అధిష్ఠానం పెద్దలు కొట్టుమిట్టాడుతున్నారు. -
మళ్లీ రాయల తెలంగాణ !
-
విభజన నిర్ణయాలపై కాంగ్రెస్ నేతలకు ముందే తెలుసు
విభజన నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలకు ముందే సమాచారం నెలాఖరులోగా అసెంబ్లీకి టి.బిల్లు వస్తుందని సమన్వయ కమిటీ భేటీలోనే దిగ్విజయ్ స్పష్టీకరణ... ఆ భేటీలో పాల్గొన్న సీఎం కిరణ్, కేంద్రమంత్రి చిరంజీవి సమైక్య వాదన వినిపించలేదు రచ్చబండలో మాత్రం రాజకీయ ప్రసంగాలు.. ముఖ్యమంత్రి వైఖరిపై పీసీసీ నేతల్లో విమర్శలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం తీసుకొనే ప్రతి నిర్ణయం గురించి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు ముందే సమాచారం ఇచ్చారు. వారితో చర్చించారు. ప్రతి సందర్భంలోనూ రాష్ట్రానికి చెందిన ముఖ్య కాంగ్రెస్ నేతలంతా ఆ నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడమే కాకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకరిస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. అలాగే, ఈ నెలాఖరులోపే తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకు రానుందనే విషయం కూడా వారికి హైకమాండ్ ముందే స్పష్టం చేసింది. ఈ బిల్లు గురించి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలతో చర్చించారు. ఆ భేటీలో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, కేంద్ర మంత్రి చిరంజీవి కూడా ఉన్నారు. ఈ నెలాఖరులోపే తెలంగాణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీకు రానుందని సమన్వయ కమిటీ సమావేశంలోనే దిగ్విజయ్‌సింగ్ పార్టీ నేతలకు చెప్పారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టంచేశారు. అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వైఖరిపై కూడా దిగ్విజయ్ వారికి పలు సూచనలు కూడా చేశారు. సమన్వయ కమిటీ భేటీ హైదరాబాద్‌లో జరగాల్సి ఉన్నా దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ బిల్లు వ్యవహారం గురించి కూలంకషంగా చర్చించడానికే వేదికను ఢిల్లీకి మార్చారని సమాచారం. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని, దాన్ని ఆమోదించాల్సిందేనని దిగ్విజయ్ ఆ సమావేశంలో కరాఖండీగా చెప్పినప్పుడు అక్కడే ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కానీ చిరంజీవి కానీ సమైక్యవాదన వినిపించకుండా అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటామన్నట్లుగానే భరోసా ఇచ్చారని తెలిసింది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా చర్చలో పాల్గొనడంపై కూడా సీఎం సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. పార్టీనేతల విస్మయం: సీడబ్ల్యూసీ సమావేశంలో సానుకూలంగా స్పందించి.. ఆ తరువాత రచ్చబండ సహా పలు సందర్భాల్లో సమైక్య రాగం వినిపించడంపై పార్టీ రాష్ట్ర నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సీఎం సమైక్యమంటూ వినిపిస్తున్న వాదనలోనే విభజనకు తాను అనుకూలమన్న సంకేతాలు ఇస్తున్నారు. ఆయన చెప్పిన అంశాలను గమనిస్తే వైఖరేమిటో స్పష్టమవుతుంది. విభజన వల్ల వచ్చే సమస్యల గురించి చెబుతూ విభజించదలిస్తే వాటిని పరిష్కరించండంటున్న సీఎం సమైక్యవాది ఎలా అవుతారు?’’ అని పీసీసీ నేత ఒకరు విశ్లేషించారు. రచ్చబండ రాజకీయం ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించడం రచ్చబండ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అయితే.. ముఖ్యమంత్రి సమైక్య ప్రసంగాలు చేయడాన్ని కూడా పీసీసీ నేతలు విమర్శిస్తున్నారు. ‘‘మూడేళ్లుగా ఎమ్మెల్యేలెవరూ గ్రామాల్లోకి వెళ్లడం లేదు. ప్రజలతో సంబంధాలు తెగిపోయాయి. విభజన, సమైక్యమన్న గందరగోళంలోనే అందరూ ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘంలోనూ చర్చించి గ్రామస్థాయిలో రచ్చబండ పెట్టాలని సిఫార్సు చేశాం. దాన్ని పట్టించుకోకుండా సీఎం మండలస్థాయికే రచ్చబండను పరిమితం చేశారు. రాజకీయ వేదికగా మార్చేశారు’’ అని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘కన్నా’పై కావాలనే దుష్ర్పచారం.. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కావడంపై ముఖ్యమంత్రి వర్గీయులు దుష్ర్పచారం సాగించారంటూ కన్నాతో పాటు బొత్స సత్యనారాయణ మండిపడుతున్నారు. సీఎం పదవికోసం విభజనకు అంగీకరించి పార్టీ అధిష్టానంతో కన్నా ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే సోనియాతో మంతనాలు జరిపారని సీఎం వర్గీయులు ప్రచారం సాగించారని కన్నా, బొత్స వర్గం అభిప్రాయపడుతోంది. తమ సామాజికవర్గం అయితే ఒకలా, వేరే సామాజికవర్గం అయితే మరోలా కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. -
'అధిష్టానం వల్లే కిరణ్ సీఎం అయ్యారు'
స్పీకర్‌గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని... ఆ పార్టీనే కాదనుకుంటే కిరణ్ కలలో కూడా సీఎం అవ్వలేరని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులను సంప్రదించకుండా కేంద్రమంత్రుల బృందానికి (జీవోఎం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, జీవోఎం సభ్యుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తాము సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. -
అధిష్టానమే మాకు ముఖ్యమంత్రి: జానారెడ్డి
-
అధిష్టానమే మాకు ముఖ్యమంత్రి: జానారెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే తమకు ముఖ్యమంత్రి అని మంత్రి జానారెడ్ది అన్నారు. విభజన విషయంలో అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. విభజనకు అన్ని పక్షాలు సహకరించాలని జానారెడ్డి కోరారు. విభజన ప్రక్రియ కీలక దశలో ఉండగా కొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విభజన అనేది తండ్రి, ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిందని చెప్పారు. విభజనను వ్యతిరేకించేవారు ముందుగా వారి వద్ద ఉన్న ప్రణాళిక తెలియజేయాలన్నారు. -
సీఎం కిరణ్ సరికొత్త గేమ్ ప్లాన్
-
ఈ హైడ్రామా హైకమాండ్దా.. నేతలదా?
రాష్ట్ర విభజనపై ముసాయిదా నోట్‌ను కేంద్ర మంత్రిమండలి ఆమోదించి దానిపై జీవోఎంను కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళుతున్న తరుణంలో సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో హడావుడి చేయడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర సమైక్యత కోసం ప్రయత్నిస్తామని ఢిల్లీ వెళ్లిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, విభజనను ఆపడమెలాగో తెలియక మళ్లీ మొదటికొచ్చి అసెంబ్లీకి తీర్మానం పంపాలని కొత్త బాణీ వినిపిస్తున్నారు. ఢిల్లీలో హైకమాండ్ నేతలతో కలసి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు హైడ్రామా నడిపిస్తుండగా, రాష్ట్రాన్ని విభజించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిన 87 రోజుల తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ తీర్మానం కోరండంటూ ప్రధానమంత్రికి లేఖ రాయడం గమనార్హం. జూలై 30న యూపీఏ భాగస్వామ్య పక్షాలు, ఆ వెంటనే సీడబ్ల్యూసీ తెలంగాణ ఏర్పాటును ఆమోదిస్తూ తీర్మానం చేసిన తర్వాత కేంద్ర హోం శాఖ రూపొందించిన ముసాయిదా నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానం కోరకుండానే ముందుకు వెళుతున్నట్టు స్పష్టమైంది. పైగా అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే కోరుతామని, తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం కోరడం లేదని కేంద్రం స్పష్టంగా తేల్చింది. మూడు నెలలుగా ఈ వ్యవహారమంతా సాగుతున్నప్పటికీ, అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకుంటామని ముఖ్యమంత్రితో పాటు సీమాంధ్ర నేతలు చాలాసార్లు ప్రకటించారు. కేంద్రం అసెంబ్లీ తీర్మానం కోరుతుందని, ఆ సమయంలో వ్యతిరేకిస్తామంటూ చెప్పారు. ఉద్యోగ సంఘాలతో సీఎం ఇదే చెప్పి ఆందోళన విరమింపజేశారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన నేతలు బిల్లు ముసాయిదాను అసెంబ్లీకి పంపాలని పార్టీ నేతలను,అక్కడే ఉన్న రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విన్నవించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒకవైపు తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, వెనక్కి తగ్గేది లేదని చెబుతూనే,అసెంబ్లీ తీర్మానం,అభిప్రాయం రెండూ ఉంటాయని దిగ్విజయ్‌సింగ్ కొద్దిరోజులు అయోమయపరిచే వ్యాఖ్యలు చేశారు. తీరా హోం శాఖ రూపొందించిన ముసాయిదాతో పాటు ఆ శాఖ నుంచి అందిన వివరణతో తీర్మానం ఉండదనీ, కేవలం శాసనసభ అభిప్రాయం కోరుతూ బిల్లును అక్కడికి పంపిస్తారని తేలిపోయింది. అయినప్పటికీ సీమాంధ్ర నాయకులు కలిసిన సందర్భంగా ఈ అంశాన్ని పరిశీలిస్తామంటూ ప్రజలను గందరగోళపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదంతా పథకం ప్రకారమే హైకమాండ్ వ్యవహారాలను నడిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణపై మంత్రుల బృందాన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బృందం అన్ని శాఖల అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. మరోవైపు గవర్నర్ నరసింహన్‌ను హస్తినకు రప్పించి కేంద్ర పెద్దలు చర్చలు సాగిస్తున్నారు. గవర్నర్ 3 రోజులుగా విభజన ప్రక్రియపై సమాలోచనలు జరుపుతుండగా, మరోవైపు హోంశాఖ విభజనలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను సంప్రతిస్తుండగా ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ సాగిస్తున్న హైడ్రామాలో భాగమనే అభిప్రాయం ఆ పార్టీలోనే వినిపిస్తోంది. -
విద్యుత్ సమ్మె పై కేంద్రం సీరియస్
-
అధిష్టానంకు తలవంచుతూనే సమైక్యవాదం: మంత్రి ఆనం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతూనే సమైక్యవాదం వినిపిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి రఘువీరా రెడ్డి మంత్రి ఆనంతో సమావేశమై విభజన అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ప్రాంతాలకు అనుగుణంగా ఎవరి అభిప్రాయాలు చెప్పాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలిపారు. శాసనసభలో తమ అభిప్రాయాలు చెబుతామన్నారు. -
రాష్ట్ర విభజనపై మరోసారి పరిశీలించాలి: శైలజానాథ్
-
విభజన పై కాంగ్రెస్ అధిష్టానం కొత్త వ్యూహం
-
తెలంగాణ ఎంపీలపై అధిష్టానం కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలపై పార్టీ అధిష్టానం కన్నెర్రజేసింది. సీమాంధ్ర ఎంపీలపై వారు ఫిర్యాదు చేస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టింది. సీమాంధ్ర ఎంపీలు చేస్తున్న ఆందోళనలపై ఇటీవల తనకు ఫిర్యాదు చేసిన పలువురు తెలంగాణ ఎంపీలను సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తీవ్రంగా మందలించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇలాంటి కీలక దశలో తెలివితక్కువగా వ్యవహరించి చారిత్రక తప్పిదానికి పాల్పడొద్దంటూ ఆయన గట్టిగా హెచ్చరించారని కూడా సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా ఈ విషయంలో తెలంగాణ ఎంపీల తీరును తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ‘‘ఇప్పుడు ఆందోళనలు చేసేందుకు సీమాంధ్ర ఎంపీలకు సర్వ హక్కులూ ఉన్నాయి. ఇంతకాలం మీరు చేశారు, ఇప్పుడు వారిని చేయనివ్వండి. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది. దాన్ని మీకందరికీ స్వయంగా మేడమే స్పష్టంగా తెలియజేశారు కూడా. మరి అలాంటప్పుడు సీమాంధ్ర ఎంపీల మనోవేదన ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. వారికి వ్యతిరేకంగా మతిలేని ఆందోళనకు దిగడం ద్వారా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చకండి’’ అంటూ గట్టిగానే అక్షింతలు వేసినట్టు చెబుతున్నారు. నిజానికి తెలంగాణ ఏర్పాటుపై సీడబ్ల్యూసీ విస్పష్టంగా ప్రకటన చేశాక కూడా తెలంగాణ నాయకులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానం చాలా అసంతృప్తితో ఉందని సమాచారం. సీమాంధ్ర నేతల అభ్యంతరాలు, ఆందోళనలు, సమస్యలను ఆలకించేందుకు పార్టీపరమైన కమిటీ వేస్తే దానికి తెలంగాణ నేతలు అభ్యంతరపెట్టాల్సిన అవసరం ఏముందంటూ మండిపడుతోందని ఏఐసీసీ వర్గాలన్నాయి. ‘‘ముఖ్యంగా ఈ అంశంపై తెలంగాణ ఎంపీలను అహ్మద్ పటేల్ గట్టిగా మందలించారు. ఇటీవల తిరుపతిలో సీమాంధ్ర వాసులను ఎంపీ వి.హన్మంతరావు అనవసరంగా రెచ్చగొట్టారంటూ సోనియా కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. అనవసర చేష్టలతో సీమాంధ్ర ఎంపీలకు తెలంగాణ ఎంపీలు అడ్డు తగలరాదన్నదే అధిష్టానం అభిమతం. అది తెలివితక్కువతనమే కాగలదని పార్టీ పెద్దలంతా భావిస్తున్నారు’’ అని వివరించాయి. -
ఆందోళన కొనసాగిస్తామంటున్న సీమాంధ్ర ఎంపీలు
-
అధిష్టానంపై ఒత్తిడికి ఇదే మంచితరుణం:ఎంపి హరి
విశాఖపట్నం: రాష్ట్ర విభజన అంశం ఆగిపోతుందనే సంకేతాలు వస్తున్నాయని ఎంపీ సబ్బం హరి చెప్పారు. అధిష్టానంపై సీమాంధ్ర నేతలు ఒత్తిడి చేయడానికి ఇదే మంచి తరుణం అని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు హరి తెలిపారు. హైదరాబాద్ విషయంలో టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ కోసం పాటుపడలేదన్నారు. స్వప్రయోజనాలకే తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నట్లు ఆరోపించారు. హైదరాబాద్ నుంచి వెళ్లిపోమ్మని చెప్పడానికి కేసీఆర్ ఎవరు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ అందరిదని హరి అన్నారు. -
అధిష్టానాన్ని ఎదిరించైనా సమైక్యాంధ్ర సాధిస్తాం: ధర్మాన
కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించైనా సమైక్యాంధ్రను సాధించుకుంటామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం శ్రీకాకుళంలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. అలాగే అదే జిల్లాకు చెందిన మంత్రి కొండ్రు మురళి ఆదివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తూ...హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగువారందరూ భాగస్వాములే అని స్ఫష్టం చేశారు. రాష్ట విభజనపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు స్ఫష్టమైన లేఖలు ఇచ్చాయని ఆయన తెలిపారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయావలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన ఆ రెండు పార్టీలు తమ లేఖలను ఉపసంహరించుకుంటే విభజన ప్రక్రియను తాము అడ్డుకుంటామని కొండ్రు మురళి ఈ సందర్బంగా వెల్లడించారు. -
నిర్ణయం జరిగిపోయింది విభజన తప్పదు
పాలమూరు, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి తిరుగు లేదని, హై కమాండ్ నిర్ణయించిన ప్రకారం రాష్ట్ర విభజన తప్పక జరిగి తీరుతుందని కేంద్ర, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామ్య విజయమన్నారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో టీజేఏసీ ఆధ్వర్యంలో జైపాల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాలు సంఘటితంగా ఉద్యమించి అపూర్వ విజయం సాధించారన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న తెలంగాణ వాదులు, ఆయా పార్టీల ప్రతినిధులు, జేఏసీ, ప్రజా సంఘాల ప్రతినిధులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 1969 తెలంగాణ ఉద్యమంలో తాను కూడా పాల్గొన్నానన్నారు. తెలంగాణ-సీమాంధ్ర ఏ ప్రాంతం వారైనా ప్రజలను మాత్రం నిందించనని, సీమాంధ్ర ప్రాంత నాయకుల వైఖరి కారణంగానే అక్కడ సమస్య తలెత్తిందని, తన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ప్రకారం సీమాంధ్ర నేతలు ఇలాంటి వాదనలు చేయడం సరికాదన్నారు. తాను కేంద్రంలో ఉన్న కారణంగానే తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను సందర్భోచితంగా చెప్పే అవకాశం దక్కిందన్నారు. నదీ జలాలకు సంబంధించి భయాందోళనలు తొలగించాలని, అమాంతంగా హైదరాబాద్‌ను వదిలి వెళ్లమని ఎవరూ చెప్పడం లేదని, ఉమ్మడి రాజధానిగా పదేళ్ల వరకు ఇక్కడే ఉండేందుకు అవకాశం కల్పించారన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలకు సమ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ హైకమాండ్ కార్యాచరణ రూపొందించిందన్నారు. సీమాంధ్ర ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించడం వల్లే అర్థం లేని ఆందోళనలకు దిగుతున్నారని, ఎవరి వ్యాఖ్యలపై ఆందోళన చెందాల్సిన పనిలేదని, సమస్యల పరిష్కారాన్ని కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందన్నారు. బాధ్యత కలిగిన కేబినెట్ మంత్రి స్థాయిలో ఉన్న తెలంగాణ వాడిగా తాను ఈ ప్రాంతం తరఫున మాట్లాడతానని తెలిపారు. రాష్ట్ర విభజనకు ఆర్టికల్-3 ప్రకారం ఎలాంటిచిక్కులు ఉండవని, పార్లమెంటులో ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చన్నారు. తాము తెలంగాణకు జిందాబాద్ అని మాత్రమే అంటున్నామని, సీమాంధ్రకు ముర్దాబాద్ చెప్పడం లేదని, అదీ మన ప్రాంత ప్రజల స్వభావమన్నారు. అంతకు ముందు టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు శ్రీకారం చుట్టే పరిస్థితికి అందరూ కృషి చేశారని, విభజన ప్రకటన వెలువడినంత మాత్రాన సంతోషపడేది లేదని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితేనే నమ్మకం కుదురుతుందన్నారు. సీమాంధ్ర నేతలు చేస్తున్న ఒత్తిళ్లకు యూపీఏ హైదరాబాద్‌పై పేచీ పెడుతుందన్న అనుమానం వ్యక్తమవుతోందన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు పోరు చేసైనా హైదరాబాద్‌పై సమస్యల రాకుండా చూడాలని కోరారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి 13 జిల్లాల ప్రతినిధిగా మాట్లాడటం శోచనీయమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భగవంతరావు, బాలవర్ధన్‌రెడ్డి, జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
నువ్వెంత... పిల్లోడివి: డి.శ్రీనివాస్
సాక్షి, నిజామాబాద్: నువ్వెంత? నీ అనుభవమెంత? పిల్లోడివి... ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రివి కాలేదు... సోనియాగాంధీ దయతో ఆ సీట్లో కూర్చున్నావ్... ఇప్పుడు ఆమె నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నావ్... కేంద్రప్రభుత్వం, అధిష్టానం నిర్ణయాన్నే ధిక్కరిస్తున్నావ్... భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నావ్... ఇప్పటికైనా నీ ప్రవర్తన సరిదిద్దుకో... లేదంటే హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి పీసీసీ మాజీ అధ్యక్షుడు, సమన్వయ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ తీవ్రంగా హెచ్చరించారు. ఆయన శుక్రవారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, పార్టీ హై కమాండ్ స్థాయిలో జరిగిన అన్ని చర్చల్లోనూ ముఖ్యమంత్రిగా పాల్గొన్న కిరణ్... సోనియా తీసుకున్న నిర్ణయం తెలియదని చెప్తే ప్రజలెలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. ‘‘మంత్రులకు తెలియకుండానే వాళ్ల శాఖలకు చెందిన విషయాలపై జీఓలు విడుదల చేసిన ముఖ్యమంత్రివి నువ్వు. ఆ జీఓలపై మంత్రులు ఎదురు తిరిగితే... సీనియర్లు అని కూడా చూడకుండా బర్తరఫ్ చేశావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, హై కమాండ్ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నావు. సోనియాగాంధీ, ప్రధానిలతో జరిగిన కోర్ కమిటీలో రాష్ట్ర విభజనపై నువ్వు గంటకుపైగా ప్రజెంటేషన్ ఇవ్వడం, ప్రత్యేకంగా మాట్లాడటం వాస్తవంకాదా? చిదంబరం, షిండేలు హోం మంత్రులుగా సీఎం హోదాలో మిమ్మల్ని పిలిచి మాట్లాడలేదా? ఈ రోజు మాత్రం మంత్రులు, ప్రజలను తప్పుదారి పట్టించేలా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తప్పుడు లెక్కలు ఎందుకు చెబుతున్నావు? యువకుడనే ఉద్దేశంతో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు సీఎం పదవిని కట్టబెడితే మీరిచ్చే బహుమానం ఇదేనా?’’ అని ధ్వజమెత్తారు. గతంలో సీఎంలుగా, ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న షిండే, గులాంనబీ అజాద్, ఏకే అంటోనీ, చిదంబరంలకు ఉన్న రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షతలో నీ అనుభవం ఎంత? అని నిలదీశారు. జాతీయ నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నప్పటికీ మౌనంగా ఉండటానికి మనసెలా ఒప్పిందని కిరణ్‌కుమార్‌రెడ్డిపై డీఎస్ నిప్పులు చెరిగారు. పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకమా? రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని హై కమాండ్ తీసుకున్న తెలంగాణ నిర్ణయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి సంతకం పెట్టడం ఏమిటని డీఎస్ నిలదీశారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేసినప్పుడు కూడా తెలంగాణపై సంతకం చేయలేదని చెప్పారు. తెలంగాణపై కేబినెట్ నోట్‌కు రూపకల్పన జరుగుతున్నట్లు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు షిండే, చిదంబరంలు వెల్లడిస్తే ఇది ప్రభుత్వ ప్రకటన కాదా? అని ప్రశ్నించారు. దీన్ని పార్టీలో తీసుకున్న నిర్ణయంగా సీఎంతో సహా పలువురు మంత్రులు పేర్కొనటం ఎలా సమంజసమవుతుందన్నారు. ఏ పదవి ఆశించకుండా దేశంలో పార్టీని బలోపేతం చేస్తున్న రాహుల్‌ను ప్రధానిని చేయటానికే కిరణ్ చేతికి పగ్గాలు ఇచ్చిన విషయాన్ని మరిచిపోకూడదన్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి, ఇక్కడే చదువుకున్నానని చెబుతున్న సీఎంను ఎవరు ఇక్కడి నుంచి వెళ్లమంటున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ల నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. యావత్తు దేశంలో ఉన్న తెలుగువారిని భయాందోళనలకు గురిచేసే విధంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారని డీఎస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వాసిననే చెబుతూ సీమాంధ్రులకు భయం కలిగించే విధంగా, స్వేచ్ఛకు హాని కలిగే విధంగా సీఎం వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం మాటలతో కర్ణాటక, తమిళనాడులో ఉన్న తెలుగువారు కూడా భయాందోళలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణను ఎవ్వరూ ఆపలేరు సోనియాగాంధీ ప్రకటించిన తెలంగాణను ఎవరూ ఆపలేరని, సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రాష్ట్రంగా అభివృద్ధి దిశగా ముందుకుసాగుతుందని డీఎస్ చెప్పారు. సమస్యలు నెలకొన్నప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటారని విలీనం సమయంలోనే నెహ్రూ చెప్పారని గుర్తుచేశారు. 1969, 1972లలో జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు వచ్చినా కలిసి ఉన్నామని, కేవలం ఉద్యోగుల కోసమే విడిపోతున్నామని స్పష్టంచేశారు. జెంటిల్మెన్, సేఫ్‌గార్డు ఒప్పందాలు, 610 జీఓల వంటివిఅమలైతే ఈ పరిస్థితులు వచ్చేవి కాదేమోనని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణలో విద్యుత్, సాగునీటి సంక్షోభం ఏర్పడుతుందని సీఎం చెబుతున్న మాటలు ఉత్త అపోహలు మాత్రమేనని డీఎస్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వివాదాల పరిష్కారానికి అనేక మార్గాలు ఉన్న విషయం తెలిసిందేనన్నారు. పాకిస్థాన్, భారత్ మధ్య నదులు ఉన్నాయని, యూరప్‌లోని ఏడు దేశాలు నదీజలాలను పంచుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణలో విద్యుత్ లోటు లేదని, 80 ఏళ్లకు సరిపడా విద్యుత్ ఉత్పాదనకు అవసరమయ్యే బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పారు. -
విభజన ఆపుతూ త్వరలో ప్రకటన: లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: విభజనపై సీమాంధ్ర ప్రజల అభ్యర్థనలను పరిశీలించేవరకు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తమకు అధిష్టానం సంకేతాలిచ్చిందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బుధవారం ప్రకటించారు. ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీవూంధ్ర ప్రజల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఆ ప్రాంత నేతలు లగడపాటి ఇంట్లో సమావేశమై మరోమారు చర్చించారు. ఓ వైపు తెలంగాణపై వెనక్కి వెళ్లేది లేదని పార్టీ పెద్దలు స్పష్టం చేస్తుండటం, మరోవైపు పదవులకు రాజీనామాలు చేసి ఆందోళనలో పాల్గొనాలని ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో వారంతా ఆయోమయంలో పడ్డారు. భేటీకి ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, బాపిరాజు, మాగుంట శ్రీనివాసులరెడ్డి, హర్షకుమార్‌తో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళీ, శైలజానాథ్‌లు హాజరయ్యారు. -
బీసీలకు కేంద్రం అన్యాయం: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: దేశంలోని 70 కోట్ల మంది వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధికోసం ఎలాంటి చర్యలు చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఎంతో మంది సమర్థులైన బీసీ నేతలున్నా వారికి సీఎం పదవి ఇవ్వకుండా అణగదొక్కుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం బీసీ భవన్లో జరిగిన ‘చలో ఢిల్లీ’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీసీ కులంలో పుట్టడమే ముఖ్యమంత్రి పదవికి అనర్హతగా మారిందని, ఇప్పటివరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా 30 మంది ప్రమాణస్వీకారం చేస్తే ఒక్క బీసీ కూడా ఆ జాబితాలో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం పదవిని కచ్చితంగా బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నేతలు జె.శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, ర్యాగ రమేశ్, ఎస్.దుర్గయ్యగౌడ్, కె.బాలరాజ్, నీల వెంకటేశ్, కుల్కచర్ల శ్రీనివాస్, పెరిక సురేశ్, అశోక్‌గౌడ్, నర్సింహనాయక్, జి.అంజి, ఎ.పాండు, పి.సతీశ్, జి.భాస్కర్, బి.సదానందం తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాం పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉందా?
-
కిరణ్,బొత్సల వైఖరిని తప్పుపడుతున్న హైకమాండ్