స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని... ఆ పార్టీనే కాదనుకుంటే కిరణ్ కలలో కూడా సీఎం అవ్వలేరని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులను సంప్రదించకుండా కేంద్రమంత్రుల బృందానికి (జీవోఎం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రధాని మన్మోహన్ సింగ్, జీవోఎం సభ్యుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తాము సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.