
జీవోఎం భేటీకి హస్తినకు పయనమైన కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రుల బృందం కసరత్తు క్లైమాక్స్‌కు చేరింది. దాంతో నేడు జివోఎం భేటీలో పాల్గొనడానికి కిరణ్ హస్తిన పయనం అయ్యారు.
తెలంగాణ, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో కూడా ఇవాళ జీవోఎంతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో జీఓఎంతో సీఎం భేటీ కానున్నారు. 11 అంశాలపై వీరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తెలంగాణ ముసాయిదా బిల్లుకు రూపకల్పన చేయనున్నారు.