సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో, తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. ఇక, శనివారం ఉదయం తెలంగాణ బీజేపీ నేతలు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ మీటింగ్‌లో రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్ ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్ పాల్గొన్నారు.
ఇక, ఈ మీటింగ్ సందర్బంగా తెలంగాణలో బీజేపీ నేతల మధ్య సమన్వయం కోసం హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యచరణను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లకు బాధ్యతలు అప్పగించే పనిలో హైకమాండ్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. తెలంగాణ బీజేపీకి మరో కొత్త టెన్షన్ కలవరపెడుతోంది. బీజేపీ నేతల సమావేశాలకు ఏపీ నేతలు రావడంతో తెలంగాణ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి రాకను బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యతిరేకించారు. కిరణ్ కుమార్ మాకొద్దు అని రాష్ట్ర బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక, కిరణ్‌కుమార్‌రెడ్డిని స్థానిక నేతలు మరో చంద్రబాబులాగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ను ఫాంహౌస్ అరెస్టు చేస్తాం
Comments
Please login to add a commentAdd a comment