స్పీడ్‌ పెంచిన కిషన్‌ రెడ్డి.. తెలంగాణ కీలక నేతలతో సమావేశం | Kishan Reddy Meeting With Telangana BJP Leaders In Hyderabad | Sakshi
Sakshi News home page

స్పీడ్‌ పెంచిన కిషన్‌ రెడ్డి.. తెలంగాణ కీలక నేతలతో సమావేశం

Jul 5 2023 9:16 PM | Updated on Jul 5 2023 9:28 PM

Kishan Reddy Meeting With Telangana BJP Leaders In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌ కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు విచ్చేశారు. ఈ క్రమంలో టీఎస్‌ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ నేతలతో కిషన్‌ రెడ్డి సమావేశమయ్యారు. 

వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, అధికార ప్రతినిధులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతల అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనపైన చర్చ, బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశం కిషన్‌ రెడ్డి అధ్యక్షతన జరుగుతోంది. ఇక, కిషన్‌ రెడ్డి తెలంగాణ అధ్యక్షుడి హోదాలో ఇది తొలి సమావేశం కావడం విశేషం. ఈ సమావేశానికి ఎంపీ లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ధర్మపురి అర్వింద్, జితేందర్ రెడ్డి, విజయశాంతి, ఏవీ.ఎన్.రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, బాబు మోహన్, బూర నర్సయ్య గౌడ్, ఎండల లక్ష్మీనారాయణ, నందీశ్వర్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, రాణి రుద్రమ హాజరయ్యారు. 

ఇది కూడా చదవండి: బండి సంజయ్‌ ఎఫెక్ట్‌.. బీజేపీకి బిగ్‌ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement