సంస్థాపక దినోత్సవం సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో నిర్వహణ
ఎవరి అల్పాహారం వారే తెచ్చుకోనున్న నేతలు, కార్యకర్తలు
లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ కార్యక్రమాలపై చర్చ
కేడర్ మధ్య సమన్వయం మెరుగవుతుందని భావిస్తున్న నాయకత్వం
పార్టీ పతాకాలు ఆవిష్కరించనున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: శనివారం బీజేపీ 44వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ‘టిఫిన్ బాక్స్ బైఠక్’ల నిర్వహణకు పార్టీ సిద్ధమౌతోంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ సికింద్రాబాద్ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి మొదలు అన్ని స్థాయిల నేతలు, కార్య కర్తలు తమ తమ ఓటున్న సొంత పోలింగ్ బూత్ కేంద్రాల్లో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాలు, పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ పతాకాలను ఆవిష్కరించనున్నా రు.
కాగా రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్ల పరిధిలోని పోలింగ్ బూత్ కేంద్రాలకు ఎవరి అల్పాహారం (టిఫిన్) వారు తెచ్చుకుని, అక్కడే తింటూ ఉదయ ం నుంచి మ«ధ్యాహ్నం వరకు భేటీలు నిర్వహించను న్నారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీపరంగా సన్నద్ధ తపై, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ కేడర్ మధ్య మెరుగైన సమన్వయ సాధన, కార్యాచరణ రూప కల్పనకు ఈ భేటీలు దోహదపడతాయని నేతలు చెబుతున్నారు.
మూడు లక్ష్యాల సాధనకు సంకల్పం
ఒక్కో పోలింగ్ బూత్‌లోని మూడు, నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఆయా సామాజికవర్గాల ఓట్లు, వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వారికి సంబంధించి సమాచారం, ఇతర అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువత, మహిళలు, రైతులు ఇలా వివిధ వర్గాల ఓటర్లను ఏవిధంగా చేరుకోవాలి, దళిత బస్తీలు, గిరిజన తండాల్లో ఎలాంటి ప్రచారాన్ని నిర్వహించాలన్న దానిపై అభిప్రాయ సేకరణ జరపను న్నారు. ఫిర్ ఏక్‌బార్ నరేంద్ర మోదీ సర్కార్ కోసం 370 సీట్ల సాధన, ప్రతి పోలింగ్ బూత్‌లో అదనంగా 370 ఓట్ల సాధన, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి బూత్‌లో 50 ఓట్ల సాధనకు ఈ సందర్భంగా సంకల్పం తీసుకోనున్నారు.
కాచిగూడలో కిషన్‌రెడ్డి.. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ
శనివారం ఉదయం అంబర్‌పేట నియోజ కవర్గం కాచిగూడలోని 214 పోలింగ్ స్టేషన్‌లో కిషన్‌రెడ్డి టిఫిన్ బాక్స్ బైఠక్‌లో పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల ఇన్‌చార్జి అభయ్‌పాటిల్ సికింద్రాబాద్ అసెంబ్లీలోని మెట్టుగూడ 33–35 పోలింగ్ స్టేషన్లలో, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ నారాయణపేట అసెంబ్లీ కోయిల్‌కొండలోని 23–27 పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు. ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్‌లోని సాధనా స్కూల్ 174వ పోలింగ్ స్టేషన్‌లో, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజక వర్గం చిక్కడపల్లిలోని 9వ పోలింగ్‌స్టేషన్‌లో, జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ మల్కాజిగిరిలోని వినాయక్‌నగర్ 155–157 పోలింగ్‌స్టేషన్లలో, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ అసెంబ్లీలోని గాజులపేట 192 పోలింగ్ స్టేషన్‌లో, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి మహేశ్వరం అసెంబ్లీలోని నాదర్‌గుల్, బడంగ్‌పేట పోలింగ్ స్టేషన్లలో పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment