తెలంగాణ కమలం పార్టీలో కాంగ్రెస్ పోకడలు కనిపిస్తున్నాయా?.. నాయకుల మధ్య విభేదాలు కొత్త చీఫ్‌కు తలనొప్పిగా మారుతున్నాయా?. ఏకంగా రాష్ట్ర పార్టీ ఆఫీస్‌లోనే ఇద్దరు ముఖ్య నేతల అనుచరులు రచ్చ చేయడం దేనికి సంకేతం? ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుని దూషించుకోవడంపై ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. సోషల్ మీడియా వార్‌కు కారణమైన ఆ ఇద్దరు నేతలు ఎవరు?..
తెలంగాణలో కమలం పార్టీ అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ వార్తలు వచ్చిన సమయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా వార్ మొదలైంది. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైన ఈటల రాజేందర్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు.
అప్పటికే ఇద్దరు నేతల మధ్య విభేదాలు తీవ్రమైన నేపథ్యంలో వారిద్దిరి అనుచరులు ఒకరి మీద మరొకరు పోస్టులు పెడుతూ.. వార్ కొనసాగిస్తున్నారు. తాజాగా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌ల సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినపుడు.. ఈటలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని గురించి స్టేట్ ఆఫీస్ సోషల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మాటా మాటా పెరిగి ఇరు వర్గాలవారు ఒకరినొకరు తిట్టుకున్నారు.
ఆఫీసుకు తాళం..
రాష్ట్ర బీజేపీ ఆఫీస్ వేదికగా నడుస్తున్న పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే ప్రశాంత్‌తో పోట్లాడిన వారిలో ఈటల రాజేందర్ అనుచరులతో పాటుగా.. పార్టీ కొత్త అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అనుచరులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. సోషల్ మీడియా రూమ్‌కు తాళం వేసిన ఈటల అనుచరులు సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ప్రశాంత్‌ను ఈటలకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టులపై ప్రశ్నించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత పార్టీ ఆఫీస్ సిబ్బంది ప్రశాంత్‌ను అక్కడి నుంచి పంపించేశారు. రెండు వర్గాల వారికి కార్యాలయ సిబ్బంది నచ్చ చెప్పడంతో కాస్త వెనక్కి తగ్గారు. దీంతో, పార్టీ ఆఫీస్‌లో ఉద్రిక్త వాతావరణం చల్లబడింది.
నిర్వాహకులకు వార్నింగ్..
ఇక, పార్టీ ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియాలో ఒక నేతకు అనుకూలంగా.. మరో నేతకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం సరికాదని దాని నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు. మొన్నటి వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నపుడు ఆయనకు వ్యతిరేకవర్గం నేతలపై పోస్టులు పెట్టారని బాహాటంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ సోషల్ మీడియా వ్యవహారం కొత్త బాస్ కిషన్‌రెడ్డికి తలనొప్పిగా మారింది.
ఇది కూడా చదవండి: హరీశ్‌రావుకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్సార్: రేవంత్
Comments
Please login to add a commentAdd a comment