'నక్సలిజం, టెర్రరిజం పెరుగుతాయి' | Creation of Telangana will create bigger problems: Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

'నక్సలిజం, టెర్రరిజం పెరుగుతాయి'

Published Tue, Nov 19 2013 1:40 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'నక్సలిజం, టెర్రరిజం పెరుగుతాయి' - Sakshi

'నక్సలిజం, టెర్రరిజం పెరుగుతాయి'

  •  దేశ భద్రతకే ముప్పని జీవోఎంతో చెప్పా: కిరణ్
  •  మావోయిస్టు అగ్రనేతల్లో అధికులు ఆంధ్రప్రదేశ్ వారే..
  •  మెజారిటీ నక్సలైట్లు తెలంగాణ వారే
  •  జమ్మూకాశ్మీర్ తర్వాత టైస్టుల లక్ష్యం హైదరాబాదే.. 
  •  దీనిపై మాకు సాహిత్యం లభ్యమైంది
  •  రాష్ట్రం విడిపోతే మిగులు జలాల హక్కును తెలంగాణ కోల్పోతుంది.. అక్కడ తీవ్ర విద్యుత్ కొరత వస్తుంది
  •  సమైక్యంగా ఉంచి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కోరాను
  • న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: 
    రాష్ట్రాన్ని విభజిస్తే ఇరు రాష్ట్రాల్లోనూ దారుణ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని.. ముఖ్యంగా నక్సలిజం, ఉగ్రవాదం, మతకలహాలు చెలరేగుతాయని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యులతో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనవల్ల సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలు, విద్య, హైదరాబాద్ భద్రత వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, వీటిని పరిష్కరించడం సాధ్యం కాదని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో పాటు విద్యుత్, సాగునీటి రంగాల అభివృద్ధికి ఇతోధిక సాయం చేయడమే మేలని అభిప్రాయపడ్డారు.
     
      ‘‘ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఇరు రాష్ట్రాల్లోనూ నక్సలిజం, తీవ్రవాదం, మతకల హాలు చెలరేగే ఆస్కారముంది. దేశానికి అతిపెద్ద సవాల్ నక్సలిజమేనని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కనీసం ఆరేడుసార్లు చెప్పారు. విడిపోతే ఈ సమస్య మరింత పెద్దది అవుతుంది. ఎందుకంటే దేశంలో మావోయిస్టు కేంద్ర కమిటీలోనున్ను 17 మందిలో 11 మంది ఆంధ్రప్రదేశ్ వారే. మొత్తం నక్సలైట్ల సంఖ్యలో 80 శాతం మంది మన రాష్ట్రం వారే. వీరిలో మెజారిటీ నక్సలైట్లు తెలంగాణ వాళ్లే. అలాగే టైర్రరిజం పెరుగుతుంది. జమ్మూకాశ్మీర్ తర్వాత టైస్టుల లక్ష్యం హైదరాబాదే. ఈ విషయంపై వారు రూపొందించుకున్న సాహిత్యం మాకు లభ్యమైంది. అందుకే హెదరాబాద్‌లో ఏ ఉత్సవాలు జరిగినా సీమాంధ్ర నుంచి 25 వేల మంది పోలీసులను తరలించి బందోబస్తు నిర్వహిస్తూ ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. విడిపోతే పోలీసుల సంఖ్య, విజిలెన్స్ తక్కువవుతుంది. తద్వారా నక్సలిజం, టైజంతో పాటు మతకలహాలు చోటుచేసుకునే ఆస్కారముంది. 
     
     దీనివల్ల రాష్ట్రానికే కాదు.. జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడుతుందని జీవోఎం సభ్యులకు స్పష్టంచేశాను’’ అని ఆయన సోమవారం జీవోఎంతో భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్  వద్దకు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, ఏరాసు ప్రతాపరెడ్డి, పితాని సత్యనారాయణ, టి.జి.వెంకటేశ్, కాసు వెంకటకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావులతో కలిసి జీవోఎం వద్దకు వెళ్లారు. అక్కడ బయట ఉన్న గదిలో మంత్రులందరినీ కూర్చోబెట్టి సీఎం నేరుగా జీవోఎం సభ్యులున్న చాంబ ర్లోకి అడుగుపెట్టారు. దాదాపు గంటన్నర భేటీ అనంతరం బయటకు వచ్చిన సీఎం నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి మంత్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి జీవోఎం సభ్యుల వద్ద తాను ఏయే అంశాలను ప్రస్తావించాననే దానిపై దాదాపు గంటకు పైగా వివరించారు. తన అభిప్రాయాలను లేఖ రూపంలో ఇవ్వడంతో పాటు విభజిస్తే జరిగే నష్టాలను కూడా వివరిస్తూ రెండు పుస్తకాలను కూడా అందజేశానన్నారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే...
     
     హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది... 
     ‘‘విభజన నిర్ణయం హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటివరకు ఏ ఉద్యమం జరిగినా నగరంపై ప్రభావం చూపలేదు. రాష్ట్రంలో ఉన్న 3.5 లక్షల ఐటీ ఉద్యోగుల్లో 90 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఏటా రూ. 55 వేల కోట్ల టర్నోవర్ జరిగితే రూ. 54 వేల కోట్లు హైదరాబాద్‌లోనే జరుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాను. విభజన జరిగితే సాగునీటి ప్రాజెక్టుల అంశం అతిపెద్ద సమస్యగా మారుతుంది. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఆగిపోయే ప్రమాదముంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి రూ. 13 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇంకా తెలంగాణలోని ప్రాజెక్టులకు రూ. 65 వేల కోట్లు, సీమాంధ్రలోని ప్రాజెక్టులకు రూ. 30 వేల కోట్లు కావాలి. విడిపోతే నిధుల సమస్యతో పాటు 74.6 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు ఇచ్చే కార్యక్రమమూ ఆగిపోతుంది. ఎగువ ప్రాంతాన ఉన్న తెలంగాణ.. మిగులు జలాలను వాడుకునే హక్కును కోల్పోతుంది. రాష్ట్రం విడిపోతే తెలంగాణకు విద్యుత్ కొరత తీవ్రంగా ఉంటుంది. తెలంగాణ  వినియోగంలో సగానికి సరిపడ ఉత్పత్తి చేసే సామర్థ్యం మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది. సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉన్నందున సర్దుబాటు చేస్తున్నాం. విభజన జరిగితే అది సాధ్యపడదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 2 లక్షల మంది ఓపెన్ కేటగిరి కింద వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నారు. వారందరిని సొంత జిల్లాలకు తరలించటం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్లకు సీనియారిటీ సమస్య ఏర్పడుతుంది. అయినా వెళ్లిపోవాలంటే కోర్టుల్లో వేలాది కే సులు దాఖల య్యే ప్రమాదముంది.
     
     తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలన్నాను...
     రాష్ట్రంలో అతిపెద్ద సమస్య విభజనే. అందుకే తెలంగాణకు మంచి ప్యాకేజీ ఇవ్వాలన్నాను. దీంతోపాటు విద్యుత్, సాగునీటి రంగాల అభివృద్ధికి ఆర్థిక సాయంతో విద్యాపరంగా సౌకర్యాలు క ల్పిస్తే సరిపోతుందే తప్ప విభజన మాత్రం వద్దని, కేంద్ర నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాలని కోరాను. నేను చెప్పిందంతా విన్న జీవోఎం సభ్యులు నా ప్రెజెంటేషన్ బాగుందన్నారు. వాళ్లడిగిన క్లారిఫికేషన్లన్నింటికీ సమాధానాలిచ్చాను. విభజన ఆగిపోతుందో లేదో చెప్పలేదు. ఏం జరగబోతుందో చూద్దాం. విభజన బిల్లు వచ్చినా, రాకున్నా డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఎందుకంటే ఆరు నెలల గడువు కూడా ముగుస్తుంది కాబట్టి సభ నిర్వహించాల్సిందే. అప్పుడు బిల్లు వస్తే విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమసల్యన్నీ హైలెట్ చేస్తా. రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వం పంపే నివేదికను ఆమోదించవద్దని తెలంగాణ మంత్రులు చెప్తున్నారు. ఏ నివేదికైనా పంపే అధికారం సీఎంగా నాకు ఉంది. కేబినెట్ ఆమోదం అక్కర్లేదు. నన్ను సీఎంగా పిలిచారే తప్ప కేబినెట్ ఆమోదంతో రావాలని చెప్పలేదు.’’

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement