Group of ministers
-
వాటర్ క్యాన్, సైకిళ్లపై తగ్గింపు షూ, వాచీలపై పెంపు
న్యూఢిల్లీ: 20 లీటర్ల వాటర్ క్యాన్, సైకిళ్లు, నోటు పుస్తకాల ధరలు తగ్గే వీలుంది. వస్తుసేవల పన్నుల(జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం(జీఓఎం) శనివారం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్యాక్చేసిన 20 లీటర్ల నీళ్ల క్యాన్, సైకిళ్లు, రాసుకునే నోటుపుస్తకాలపై జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించాలని జీఓఎం నిర్ణయించింది. ఖరీదైన చేతి గడియారాలు, షూలపై పన్నులను పెంచాలని మంత్రుల బృందం నిర్ణయించిందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కొన్ని వస్తువులపై పన్నులు పెంచడం ద్వారా రూ.22,000 కోట్ల ఆదాయం సమకూరవచ్చని బిహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం అంచనావేసింది. ఈ సిఫార్సులను జీఎస్టీ మంత్రిమండలి ఆమోదిస్తే సవరణల అమల్లోకి రానున్నాయి. ప్యాక్చేసిన 20 లీటర్ల నీళ్ల బాటిల్‌పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలుచేస్తుండగా త్వరలో అది 5 శాతానికి దిగిరానుంది. రూ.10వేలలోపు ధర ఉన్న సైకిళ్లపై ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ ఉండగా దానిని 5 శాతానికి తగ్గిస్తారు. నోటు పుస్తకాలపైనా 5 శాతం జీఎస్టీనే వసూలుచేయనున్నారు. కొన్నింటి ధరలు పెరిగే వీలుంది. హెయిర్ డ్రయర్లు, హెయిర్ కర్లర్లు, బ్యూటీ/మేకప్ సామగ్రిపై ప్రస్తుతం అమలవుతున్న 18 శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచనున్నారు. మంత్రుల బృందంలో ఉత్తరప్రదేశ్ ఆర్థికమంత్రి సురేశ్ ఖన్నా, రాజస్తాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ సభ్యులుగా ఉన్నారు. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబులతో జీఎస్టీని అమలుచేస్తున్నారు. నిత్యావసరాల సరకులపై తక్కువ పన్నులను, అత్యంత విలాసవంత వస్తువులపై 28 శాతం జీఎస్టీని వసూలుచేస్తుండటం తెల్సిందే. వినియోగదారులు, మార్కెట్వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటూ ఎప్పటి కప్పుడు ఆయా వస్తువులను ప్రభుత్వం వేర్వేరు శ్లాబుల్లోకి మారుస్తోంది. -
Group of ministers: జీఎస్టీ రేట్లలో సెస్సు విలీనం!
న్యూఢిల్లీ: జీఎస్టీ కాంపెన్సేషన్ (పరిహారం) సెస్సును జీఎస్టీ రేట్లలో విలీనం చేసే ప్రతిపాదనపై మంత్రుల బృందం (జీవోఎం) చర్చించింది. జీఎస్టీ ఆరంభంలో రాష్ట్రాలు కోల్పోయే పన్నును భర్తీ చేసేందుకు వీలుగా సెస్సును ప్రవేశపెట్టడం తెలిసిందే. ఒక్కసారి విలీనంపై నిర్ణయం తీసుకున్న తర్వాత, ఈ సెస్సు నుంచి మళ్లే క్రమంలో మరే వస్తువును లగ్జరీ లేదా సిన్ విభాగం కిందకు చేర్చకూడదని రాష్ట్రాలు సూచించాయి. 2026 మార్చిలో కాంపెన్సేషన్ సెస్సు ముగిసిన అనంతరం దాన్ని జీఎస్టీ రేట్లలో కలిపేయాలని.. అప్పటి వరకు ఏ వస్తువులకు సెస్సు అమలు చేశారో వాటికి సంబంధించి ప్రత్యేక రేటును జీఎస్టీలో ప్రవేశపెట్టాలన్నది రాష్ట్రాల అభిప్రాయంగా ఉంది. ‘‘జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సు ముగింపునకు వస్తోంది. దీని భవిష్యత్ ఏంటన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రం తమ అభిప్రాయాలను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇది తొలి సమావేశం’’అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. మంత్రుల బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. సెస్సును కొనసాగించాలా లేదంటే దాన్ని పన్ను కిందకు మార్చాలా? లగ్జరీ విభాగంలో మార్పులు చేయాలా? అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నట్టు చెప్పారు. జీఎస్టీ కాంపెన్సేషన్ సెస్సుపై నవంబర్ రెండో వారంలో జీవోఎం మరోసారి సమావేశమై చర్చించనుంది. అసోం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్ రాష్ట్రాల మంత్రులు జీవోఎంలో సభ్యులుగా ఉన్నారు. -
సీఆర్డీఏలో భూ కేటాయింపులపై మంత్రులతో బృందం
సాక్షి, అమరావతి: సీఆర్డీఏలో పలు సంస్థల భూ కేటాయింపుల సమస్యలను పరిశీలించడానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. మంత్రుల బృందంలో పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, దుర్గేశ్, టీజీ భరత్ ఉన్నారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్ కన్వీనర్‌గా వ్యవహరిస్తూ ఈ బృందం ప్రొసీడింగ్స్‌ను సమన్వయం చేస్తారు. బృందంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్థిక, ప్రణాళిక, ఉన్నత విద్యా, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, యువజన సర్వీసు శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. మంత్రుల కమిటీ అప్పగించిన బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. మంత్రులు బృందం ఎప్పటికప్పుడు తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ బృందం ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవేంటంటే..» సీఆర్డీఏలో గతంలో పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపులను సమీక్షించి ఇప్పటికే ఉన్న వాటి కేటాయింపులను కొనసాగించడంపై నిర్ణయం తీసుకోవాలి. ఇందివరకే కేటాయించిన భూమి వినియోగం లేదా ఇతర అంశాలను అంచనా వేయడంతోపాటు అవసరమైన మార్పులను పరిశీలన చేయాలి.» భూ కేటాయింపుల కోసం కొత్త అభ్యర్థనలను పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలి. పలు రంగాల్లో ప్రపంచస్థాయి సంస్థలను గుర్తించి వాటిని అమరావతిలో తమ కార్యాకలాపాలను నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలి. సీఆర్డీఏ ప్రాంతంలో పలు సంస్థలకు మొత్తం భూముల కేటాయింపుల పురోగతిని పర్యవేక్షించాలి. 17 నుంచి ‘స్వచ్ఛతా హి సేవా’ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవా సన్నాహక కార్యక్రమం ఈ నెల14న ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు.తక్కువ బడ్జెట్‌తో నాణ్యమైన రోడ్లు నిర్మించాలి తక్కువ వ్యయంతో ఎక్కువకాలం మన్నేల రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ అండ్ బి అధికారులను సీఎస్ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో వెలగలపూడిలోని సచివాలయంలో గురువారం సీఎస్ సమీక్ష నిర్వహించారు. -
AP: సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీలకు మరింత చేయూతనివ్వడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని.. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రుల బృందం తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించుకోవాలని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరింది. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లల మీద మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. వారి క్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అనివార్య పరిస్థితి తీసుకురావద్దని కోరింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల ప్రయోజనం కోసం తీసుకున్న వివిధ నిర్ణయాలను పునరుద్ఘాటిస్తూ.. మరిన్ని సానుకూల నిర్ణయాలను తీసుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని.. అందువల్ల సమ్మెను విరమించాలని కోరింది. టీడీపీ హయాంలో ఒక్కపైసా కూడా పెంచలేదు అంగన్వాడీలకు టీడీపీ హయాంలో 2016 ఏప్రిల్ 4న అంగన్వాడీ కార్యకర్తల జీతం రూ.4,200 నుంచి, రూ.7,000కు, మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలు రూ.2,950 నుంచి రూ.4,500కు, అంగన్వాడీ సహాయకుల జీతాలు రూ.2,200 నుంచి రూ.4,500కు పెంచారని మంత్రుల బృందం గుర్తు చేసింది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీల కష్టాలు చూసి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపింది. దీంతో అప్పటి ప్రభుత్వం ఎన్నికలకు 6 నెలల ముందు అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల జీతాలను పెంచిందని గుర్తు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2019 వరకూ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950, అంగన్వాడీ సహాయకురాలికి, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించిందని వివరించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్యకర్తల జీతాలను రూ.11,500లకు, మినీ అంగన్వాడీ కార్యకర్తల జీతాలను రూ.7,000కు, అంగన్వాడీ సహాయకుల జీతాలను రూ.7,000కు పెంచిందన్నారు. మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.27.80 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోందని మంత్రుల బృందం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తొలిసారిగా పదోన్నతులు ఇచ్చి 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేసింది. ఈ పోస్టుల పరీక్షలు రాసేవారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచింది. దాంతో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎక్కువ మంది పోటీపడే అవకాశాన్ని కల్పించిందని వివరించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి డీబీటీ ద్వారా రూ.1,313 కోట్లు అందించిందని తెలిపింది. నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేసిన జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ తదితర పథకాలతోపాటు వివిధ రూపాల్లో తోడ్పాటు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. -
ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీకే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సుముఖత చూపిస్తున్నారు. అది గేమ్ లేక నైపుణ్యం లేక మరొకటి అయినా 28 శాతం జీఎస్టీ రేటు ఉండాలని కోరుతున్నారు. 28 శాతం జీఎస్టీ ప్రతికూలమని, తక్కువ పన్ను రేటునే కొనసాగించాలని పరిశ్రమ కోరుతుండడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై పన్ను రేటు పెంపు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన నేపథ్యంలో.. దీనిపై మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా మంగళవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెజారిటీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను రేటును 28 శాతానికి పెంచాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రుల గ్రూప్ ఈ సూచనలను జీఎస్టీ మండలికి నివేదించనుంది. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ సూచనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. స్థూల గేమింగ్ ఆదాయంపై ఈ పన్ను అమలు చేస్తున్నారు. -
టాటా చేతికే ఎయిరిండియా!
ఇంత కాలం ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇకపై ప్రైవేటు పరం కానుంది. ఇకపై ఎయిరిడియా టాటా గ్రూపు చేతిలోకి వెళ్లనుందని సమాచారం. రూ. 20,000 వేల కోట్లు ? పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎయిరిండియాలో వంద శాతం వాటాను కేంద్రం అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు బిడ్లను ఆహ్వానించగా టాటా గ్రూపు సంస్థ ఇందులో విజేతగా నిలిచినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఎయిరిండియా విమనాలతో పాటు సంస్థ స్థిర, చర ఆస్తులు టాటా గ్రూపునకు దక్కనున్నాయి. ఈ పెట్టుబడుల ఉపసంహారణ ద్వారా కేంద్రం రూ.20,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. టాటాకే దక్కింది ఎయిరిండియాలో వాటాల విక్రయానికి సంబంధించి ఇటీవల కేంద్రం బిడ్లను ఆహ్వానించింది. టాటా గ్రూపుకి సంబంధించిన టాటా సన్స్‌తో పాటు స్పైస్ జెట్ సంస్థ బిడ్లను దాఖలు చేసింది. వీటిని పరిశీలించిన కేంద్ర మంత్రి అమిత్‌షా నేతృత్వంలో మంత్రుల బృందం చివరకు టాటా గ్రూపునకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ బిడ్డింగ్‌కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 1932లో ప్రారంభం స్వాతంత్రానికి పూర్వమే జంషెడ్జీ టాటా 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 1946లో ఎయిర్ ఇండియా పేరు మార్చారు. అయిత ఆ తర్వాత 1953 సెప్టెంబరు 29న టాటా ఎయిర్‌లైన్స్‌ని కేంద్రం జాతీయం చేసింది. దీంతో ప్రైవేటు ఎయిర్‌లైన్స్ కాస్తా ప్రభుత్వ ఎయిరిండియాగా మారింది. నష్టాల ఊబిలో విదేశాలకు నడిపే విమానాలు ఎయిరిండియా, దేశీయంగా నడిపే విమాన సర్వీసులను ఇండియన్ ఎయిర్‌లైన్స్‌గా వ్యవహరించారు. అయితే ఈ రంగంలో రాజకీయ జోక్యం పెరిగి పోవడం, నిర్వాహాణపరమైన లోపాల కారణంగా గత ఇరవై ఏళ్లుగా నష్టాలే తప్ప లాభాలు రావడం లేదు. దీంతో ఈ సంస్థను అమ్మేయాలని కేంద్రం నిర్ణయించింది. 67 ఏళ్ల తర్వాత ఉప్పు నుంచి హెలికాప్టర్ల వరకు అనేక రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తోన్న టాటా గ్రూపు ఎప్పటి నుంచో విమానయాన రంగంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. వివిధ కారణాల వల్ల ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా 67 ఏళ్ల తర్వాత తాము స్థాపించిన సంస్థను తిరిగి టాటా గ్రూపు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని ప్రచారాలే మరోవైపు తాజా మీడియా నివేదికలను ప్రభుత్వం ఖండించింది. ఇంతవరకు ఎయిరిండియా ఇన్వెస్ట్మెంట్ బిడ్‌కు సంబంధించి ఎవరికీ ఎలాంటి ఆమోదం ఇవ్వలేదని తెలిపింది. దీనిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నప్పుడు మీడియాకు తెలియచేస్తామంటూ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ ట్వీట్ చేసింది. మీడియా నివేదికలు తప్పు అని పేర్కొంది. Media reports indicating approval of financial bids by Government of India in the AI disinvestment case are incorrect. Media will be informed of the Government decision as and when it is taken. pic.twitter.com/PVMgJdDixS — Secretary, DIPAM (@SecyDIPAM) October 1, 2021 చదవండి : ఎయిరిండియా రేసులో టాటా -
79% కేసులు 30 మున్సిపాల్టీల్లోనే..
న్యూఢిల్లీ/తిరువనంతపురం/గువాహటి: భారతదేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 79 శాతం కేసులు కేవలం 30 మున్సిపాల్టీలు/కార్పొరేషన్ల పరిధిలోనే బయటపడ్డాయని మంత్రుల బృందం(జీవోఎం) వెల్లడించింది. 15వ జీవోఎం సమావేశం శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో జరిగింది. దేశంలో కరోనా తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల్లో 6.92 శాతం మంది మరణించగా, భారత్‌లో 3.23 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని జీవోఎం పేర్కొంది. ఉధృతంగానే కరోనా వ్యాప్తి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల ఆగడం లేదు. తాజాగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,976 కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనా వల్ల 100 మంది మరణించారు. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 81,970కి, మరణాలు 2,649కి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. భారత్‌లో యాక్టివ్ కరోనా కేసులు 51,401. ఇప్పటివరకు 27,919 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రికవరీ రేటు 34.06కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. తాజాగా నమోదైన 100 మరణాల్లో 44 మరణాలు మహారాష్ట్రలోనే సంభవించాయి. గుజరాత్లో 20 మంది, ఢిల్లీలో 9 మంది, పశ్చిమబెంగాల్లో 8 మంది ఉత్తరప్రదేశ్‌లో ఐదుగురు, మధ్యప్రదేశ్‌లో ఐదుగురు కన్నుమూశారు. కరోనా కారణంగా సంభవించిన మరణాల్లో 70 శాతానికి పైగా బాధితులకు ఇతర జబ్బులు కూడా ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 20 లక్షలకుపైగా కరోనా టెస్టులు: ఐసీఎంఆర్ దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షల సంఖ్య 20 లక్షలు దాటినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) ప్రకటించింది. శుక్రవారం ఉదయం వరకు 20,39,952 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది. ఇందులో 92,911 పరీక్షలను గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిర్వహించినట్లు వెల్లడించింది. కరోనా టెస్టుల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, ప్రస్తుతం రోజుకు దాదాపు లక్ష టెస్టులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రత్యేక రైలులో వచ్చిన వారికి కరోనా వెయ్యి మంది వలస కూలీలతో కూడిన మొదటి ప్రత్యేక రైలు ఢిల్లీ నుంచి కేరళకు చేరుకుంది. వీ రిలో ఏడుగురికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు పరీక్షలో తేలింది. దాంతో వారిని అధికారులు కరోనా కేర్ సెంటర్లకు, ఆసుపత్రులకు తరలించారు. కాగా,కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని అ స్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ కేంద్రానికి లేఖరాశారు. లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ శుక్రవారం మిజోరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
కరోనాపై జీఓఎం భేటీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా దేశవ్యాప్తంగా తీసుకున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) చర్చించింది. భౌతిక దూరం పాటించడం సహా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్రాలు తీసుకున్న చర్యలను సమీక్షించింది. కరోనాపై పోరు విషయంలో తాము చేపట్టిన, చేపట్టదలచిన చర్యలను వివరించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్హవర్ధన్ అధ్యక్షతన జరిగిన జీఓఎంకు అధికారులు వివరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రాష్ట్రాలకు మరిన్ని వనరులను సమకూర్చే విషయాన్ని కూడా జీఓఎం చర్చించింది. రాష్ట్రాల్లో ప్రత్యేక కోవిడ్–19 ఆసుపత్రుల ఏర్పాటు, వెంటిలేటర్లు, ఇతర వైద్య ఉపకరణాలను సమకూర్చడం, సిబ్బందికి పీపీఈలను అందించడంపై వారు చర్చించారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం, అందుబాటులో ఉన్న టెస్టింగ్ కిట్స్, వైరస్ హాట్‌స్పాట్స్ నిర్వహణలను కూడా వారు సమీక్షించారు. కరోనా పరీక్షలను నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్స్ వివరాలను కూడా వారికి అందించారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అమలును కూడా జీఓఎం సమీక్షించింది. కోవిడ్–19కి సంబంధించి ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్, పీఐబీ సహా ఇతర ప్రభుత్వ వెబ్సైట్లు అందించే సమాచారాన్నే విశ్వసించాలని హర్షవర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎలాంటి మాస్క్‌ను వాడాలనే విషయాన్ని ఆరోగ్య శాఖ వెబ్సైట్లో విపులంగా వివరించామన్నారు. -
మూక హత్యల నిరోధంపై నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న మూక హత్యల నిరోధానికి నూతన చట్టం తీసుకువచ్చే ప్రతిపాదనపై హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గుబ నేతృత్వంలోని కమిటీ మంత్రుల బృందానికి నివేదిక సమర్పించింది. సోషల్ మీడియా వేదికలపై విద్వేష ప్రచారం, వదంతులు వ్యాప్తి చేయడాన్ని నివారించేందుకూ ఈ కమిటీ పలు మార్గదర్శకాలు జారీచేసింది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని మంత్రుల బృందం కమిటీ సూచించిన మార్గదర్శకాలను పరిశీలిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఈ కమిటీ పలు సోషల్ మీడియా వేదికల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి, అభ్యంతరకర కంటెంట్‌పై ప్రజలు ఫిర్యాదులు నమోదు చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని కోరింది. కంటెంట్ పర్యవేక్షణ, సైబర్ పోలీసింగ్‌కు ప్రత్యేక చర్యలు అవసరమని స్పష్టం చేసింది. మూక హత్యలను నివారించేందుకు నూతన చట్టం తీసుకువచ్చే ప్రతిపాదన పరిశీలించాలని సుప్రీం కోర్టు ఇటీవల పార్లమెంట్‌ను కోరిన క్రమంలో ఈ అంశంపై మంత్రుల బృందం, కార్యదర్శుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ మార్గదర్శకాలను మంత్రుల బృందం పరిశీలించి తుదినిర్ణయం కోసం ప్రదాని నరేంద్ర మోదీకి తమ సిఫార్సులను నివేదిస్తుందని హోంమంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. -
జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: జీవోఎంలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. పాలనలో పారదర్శకత కోసం జీవోఎంలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జీవోఎం పరిధిలో మిగిలిపోయిన నిర్ణయాలను ఇక నుంచి సంబంధిత శాఖలే చూసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో 21 మంత్రుల బృందాలు (జీవోఎం), 9 సాధికారిక బృందాలు(ఈజీవోఎం)లపై వేటు పడింది. ఇప్పటివరకూ పలురకాలైన అంశాలపై జీవోఎం కమిటీలు అందజేసే నివేదికలతోనే కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. కాగా, ఈ విధానంతో పరిపాలనలో పూర్తి పారదర్శకత ఉండదని భావించిన నరేంద్ర మోడీ సర్కారు దీనికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి శాఖా పరంగానే వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. -
విభజన బిల్లుకు తుది మెరుగులు
-
విభజన బిల్లుకు తుది మెరుగులు!
ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జీవోఎంలోని కేంద్ర మంత్రులు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. బుధవారం సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన ప్రతిపాదనలపై జీవోఎంలోని కేంద్ర మంత్రులు ఈ సందర్బంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 5.30 నిముషాలకు కేంద్ర క్యాబినేట్ భేటీ కానుంది. అయితే ఆ సమయానికి విభజన బిల్లుకు తుది రూపం ఇచ్చేందుకు జీవోఎం సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఆంధప్రదేశ్ విభజన జరిగితే పోలవరం డివిజన్ సీమాంధ్రలో కలపాలని, హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని తదితర మొత్తం 9 ప్రతిపాదనలు జీవోఎం వద్ద సీమాంధ్ర కేంద్ర మంత్రులు బుధవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం జరగనున్న కేంద్ర మంత్రి వర్గం సమావేశం ఎదుట తెలంగాణ బిల్లు టేబుల్ ఐటంగా వచ్చే అవకాశం ఉంది. -
ప్రారంభమైన జీవోఎం సమావేశం
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)మంగళశారం సమావేశమయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లులపై అసెంబ్లీ పంపిన అభిప్రాయాలు,సవరణలను జీవోఎం ఈ సందర్భంగా పరిశీలించనుంది. అసెంబ్లీలో కోరిన, ఇటు విపక్షాలు సూచించిన సవరణల్లో ప్రధానంగా పోలవరం, కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజివంటి అంశాలను తిరిగి బిల్లులో ప్రవేశపెట్టేందుకు జీవోఎం చర్చించనుంది. సవరణలు చేసి తుది బిల్లును జీవోఎం సిద్ధం చేయనుంది. ఈ కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా తిరిగి కేబినెట్ బిల్లును రాష్ట్రపతికి పంపే అవకాశం ఉంది. ఈ సమావేశానికి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, ఆంటోనీ హాజరయ్యారు. కాగా సమావేశం జరిగే హోంశాఖ కార్యాలయానికి కేంద్రమంత్రి పురందేశ్వరి, కిల్లి కృపారాణి వచ్చారు. -
పోలీసు చట్టంపై సూచనలకు మంత్రుల బృందం
రాష్ట్రంలో కొత్త పోలీసు చట్టం రూపకల్పన కోసం సూచనలు, సలహాలు అందించేందుకు మంత్రు ల బృందాన్ని ఏర్పాటుచేస్తూ రాష్ర్ట ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి జీవో జారీచేశారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, పొన్నాల లక్ష్మ య్య, డొక్కా మాణిక్య వరప్రసాద్, వి సునీతాలకా్ష్మరెడ్డి మంత్రుల బృందంలో ఉన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మంత్రుల బృందానికి సహకారం అందిస్తారు. మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్ కేసులో 2006 సెప్టెంబర్ 22వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ‘పోలీసు యాక్టు-2013’ను పోలీసుశాఖ సిద్ధంచేసిం ది. మొత్తం 8 చాప్టర్లు, 121 ఉప చాప్టర్లతో సుమారు 150 పేజీలున్న ‘పోలీసు యాక్టు-2013’ను ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న మూడు పోలీసు చట్టాల స్థానంలో ఒకే చట్టాన్ని రూపొందించారు. పోలీసుశాఖ రూపొందించిన ‘యాక్టు-2013’ బిల్లును ‘సాక్షి’ సంపాదించింది. అందులోని ప్రధానమైన అంశాలివే... డీజీపీకి చట్టబద్ధంగా రెండేళ్ల పదవీకాలం రాష్ట్ర పోలీసు డెరైక్టర్ జనరల్(డీజీపీ)గా నియమితులైనవారు సర్వీసుతో సంబంధంలేకుండా కచ్చితంగా రెండేళ్లపాటు కొనసాగేవిధంగా చట్టంలో పొందుపరిచారు. జిల్లా ఎస్పీ, శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో)లను రెండేళ్ల తరువాత మాత్రమే బదిలీ చేసేవిధంగా పేర్కొన్నారు. వారిపై తీవ్రమైన ఆరోపణలు, పనిలో అసమర్థత ఉన్న సమయంలో మాత్రమే రెండేళ్లకన్నా ముందుగా వారిని బదిలీచేసే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు/సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి చైర్మన్‌గా పోలీసు ఫిర్యాదుల విభాగంను కూడా చట్టబద్ధంచేశారు. జిల్లా స్థాయి విభాగంలో రిటైర్డు జిల్లా జడ్జి చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో పీసీఏను ఏర్పాటుచేస్తారు. హత్య, అత్యాచారం, అధికార దుర్వినియోగం తదితర నేరాలకు పాల్పడిన పోలీసులపై పీసీఏ విచారణ జరుపుతుంది. ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే, అధికారిపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. పదిలక్షలకన్నా అధికంగా జనాభా కలిగిన పట్టణ ప్రాంతాలలో సివిల్, దర్యాప్తు విభాగాలు వేర్వేరుగా పనిచేయనున్నాయి. రాష్ర్ట హోంమంత్రి చైర్మన్‌గా... ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోపాటు ఐదుగురు స్వతంత్ర సభ్యులతో రాష్ట్ర భద్రతా కమిషన్(ఎస్ఎస్సీ) ఏర్పాటుకు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. పోలీసు చట్టంలో ఎస్ఎస్సీకి కూడా స్థానం కల్పించారు. బదిలీలు, పదోన్నతులన్నీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు ద్వారానే జరిగే విధంగా చట్టంలో నిబంధన పొందుపరిచారు. మంత్రుల బృందం సూచనల తర్వాత పోలీసు నూతన చట్టం ముసాయిదా బిల్లును ప్రభుత్వం శాసనసభ ఆమోదానికి పంపనుంది. అసెంబ్లీలో బిల్లుపెట్టే పరిస్థితి ప్రస్తుతానికి లేకుంటే ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పిస్తారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం సమాజ భద్రత విషయంలో ప్రజలను కూడా భాగస్వాములను చేసేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్‌కు కొత్త చట్టంలో ప్రాధాన్యం ఇచ్చారు. తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం నియమిస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్(ఎస్పీవో)ల నియామకానికి సంబంధించి కూడా కచ్చితమైన మార్గదర్శకాలను పొందుపరిచారు. రిటైర్డు పోలీసులు, మిలటరీ సిబ్బందిని మాత్రమే ఎస్పీవోలుగా తీసుకోవాలని స్పష్టంచేశారు. -
కిరణ్ రచ్చబండ వాయిదా
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పర్యటనలో భాగంగా ఈనెల 21న రాయచోటిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించదలిచారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన సమాచారం ఉంది. రచ్చబండ నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) సమావేశంలో పాల్గొనే నిమిత్తం సీఎం కిరణ్ సోమవారం న్యూఢిల్లీకి వెళ్లారు. సమావేశం అనంతరం మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలోనే ఆయన పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. ఈమేరకు జిల్లా యంత్రాంగానికి సీఎంఓ నుంచి ఆదేశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి 21న జిల్లాలో నిర్వహించదలిచిన రచ్చబండ కార్యక్రమం రద్దు అయిన సమాచారాన్ని కలెక్టరేట్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. సీఎం పర్యటన జిల్లాలో ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈనెల 22న ఉంటుందని కొందరు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నా, అధికారిక సమాచారం లేదు. -
'నక్సలిజం, టెర్రరిజం పెరుగుతాయి'
దేశ భద్రతకే ముప్పని జీవోఎంతో చెప్పా: కిరణ్ మావోయిస్టు అగ్రనేతల్లో అధికులు ఆంధ్రప్రదేశ్ వారే.. మెజారిటీ నక్సలైట్లు తెలంగాణ వారే జమ్మూకాశ్మీర్ తర్వాత టైస్టుల లక్ష్యం హైదరాబాదే.. దీనిపై మాకు సాహిత్యం లభ్యమైంది రాష్ట్రం విడిపోతే మిగులు జలాల హక్కును తెలంగాణ కోల్పోతుంది.. అక్కడ తీవ్ర విద్యుత్ కొరత వస్తుంది సమైక్యంగా ఉంచి తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కోరాను న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని విభజిస్తే ఇరు రాష్ట్రాల్లోనూ దారుణ నష్టాలను చవిచూడాల్సి వస్తుందని.. ముఖ్యంగా నక్సలిజం, ఉగ్రవాదం, మతకలహాలు చెలరేగుతాయని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) సభ్యులతో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనవల్ల సాగునీరు, విద్యుత్, ఉద్యోగాలు, విద్య, హైదరాబాద్ భద్రత వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని, వీటిని పరిష్కరించడం సాధ్యం కాదని చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో పాటు విద్యుత్, సాగునీటి రంగాల అభివృద్ధికి ఇతోధిక సాయం చేయడమే మేలని అభిప్రాయపడ్డారు. ‘‘ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఇరు రాష్ట్రాల్లోనూ నక్సలిజం, తీవ్రవాదం, మతకల హాలు చెలరేగే ఆస్కారముంది. దేశానికి అతిపెద్ద సవాల్ నక్సలిజమేనని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కనీసం ఆరేడుసార్లు చెప్పారు. విడిపోతే ఈ సమస్య మరింత పెద్దది అవుతుంది. ఎందుకంటే దేశంలో మావోయిస్టు కేంద్ర కమిటీలోనున్ను 17 మందిలో 11 మంది ఆంధ్రప్రదేశ్ వారే. మొత్తం నక్సలైట్ల సంఖ్యలో 80 శాతం మంది మన రాష్ట్రం వారే. వీరిలో మెజారిటీ నక్సలైట్లు తెలంగాణ వాళ్లే. అలాగే టైర్రరిజం పెరుగుతుంది. జమ్మూకాశ్మీర్ తర్వాత టైస్టుల లక్ష్యం హైదరాబాదే. ఈ విషయంపై వారు రూపొందించుకున్న సాహిత్యం మాకు లభ్యమైంది. అందుకే హెదరాబాద్లో ఏ ఉత్సవాలు జరిగినా సీమాంధ్ర నుంచి 25 వేల మంది పోలీసులను తరలించి బందోబస్తు నిర్వహిస్తూ ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. విడిపోతే పోలీసుల సంఖ్య, విజిలెన్స్ తక్కువవుతుంది. తద్వారా నక్సలిజం, టైజంతో పాటు మతకలహాలు చోటుచేసుకునే ఆస్కారముంది. దీనివల్ల రాష్ట్రానికే కాదు.. జాతీయ భద్రతకే ముప్పు ఏర్పడుతుందని జీవోఎం సభ్యులకు స్పష్టంచేశాను’’ అని ఆయన సోమవారం జీవోఎంతో భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్ వద్దకు సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, ఏరాసు ప్రతాపరెడ్డి, పితాని సత్యనారాయణ, టి.జి.వెంకటేశ్, కాసు వెంకటకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావులతో కలిసి జీవోఎం వద్దకు వెళ్లారు. అక్కడ బయట ఉన్న గదిలో మంత్రులందరినీ కూర్చోబెట్టి సీఎం నేరుగా జీవోఎం సభ్యులున్న చాంబ ర్లోకి అడుగుపెట్టారు. దాదాపు గంటన్నర భేటీ అనంతరం బయటకు వచ్చిన సీఎం నేరుగా ఏపీ భవన్‌కు వచ్చి మంత్రులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి జీవోఎం సభ్యుల వద్ద తాను ఏయే అంశాలను ప్రస్తావించాననే దానిపై దాదాపు గంటకు పైగా వివరించారు. తన అభిప్రాయాలను లేఖ రూపంలో ఇవ్వడంతో పాటు విభజిస్తే జరిగే నష్టాలను కూడా వివరిస్తూ రెండు పుస్తకాలను కూడా అందజేశానన్నారు. ఈ సందర్భంగా సీఎం చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది... ‘‘విభజన నిర్ణయం హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఇప్పటివరకు ఏ ఉద్యమం జరిగినా నగరంపై ప్రభావం చూపలేదు. రాష్ట్రంలో ఉన్న 3.5 లక్షల ఐటీ ఉద్యోగుల్లో 90 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఏటా రూ. 55 వేల కోట్ల టర్నోవర్ జరిగితే రూ. 54 వేల కోట్లు హైదరాబాద్‌లోనే జరుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి విభజన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరాను. విభజన జరిగితే సాగునీటి ప్రాజెక్టుల అంశం అతిపెద్ద సమస్యగా మారుతుంది. జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఆగిపోయే ప్రమాదముంది. ఇప్పటికే వీటి నిర్మాణానికి రూ. 13 వేల కోట్లు ఖర్చు చేశాం. ఇంకా తెలంగాణలోని ప్రాజెక్టులకు రూ. 65 వేల కోట్లు, సీమాంధ్రలోని ప్రాజెక్టులకు రూ. 30 వేల కోట్లు కావాలి. విడిపోతే నిధుల సమస్యతో పాటు 74.6 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు ఇచ్చే కార్యక్రమమూ ఆగిపోతుంది. ఎగువ ప్రాంతాన ఉన్న తెలంగాణ.. మిగులు జలాలను వాడుకునే హక్కును కోల్పోతుంది. రాష్ట్రం విడిపోతే తెలంగాణకు విద్యుత్ కొరత తీవ్రంగా ఉంటుంది. తెలంగాణ వినియోగంలో సగానికి సరిపడ ఉత్పత్తి చేసే సామర్థ్యం మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది. సీమాంధ్రలో మిగులు విద్యుత్ ఉన్నందున సర్దుబాటు చేస్తున్నాం. విభజన జరిగితే అది సాధ్యపడదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 2 లక్షల మంది ఓపెన్ కేటగిరి కింద వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నారు. వారందరిని సొంత జిల్లాలకు తరలించటం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్లకు సీనియారిటీ సమస్య ఏర్పడుతుంది. అయినా వెళ్లిపోవాలంటే కోర్టుల్లో వేలాది కే సులు దాఖల య్యే ప్రమాదముంది. తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలన్నాను... రాష్ట్రంలో అతిపెద్ద సమస్య విభజనే. అందుకే తెలంగాణకు మంచి ప్యాకేజీ ఇవ్వాలన్నాను. దీంతోపాటు విద్యుత్, సాగునీటి రంగాల అభివృద్ధికి ఆర్థిక సాయంతో విద్యాపరంగా సౌకర్యాలు క ల్పిస్తే సరిపోతుందే తప్ప విభజన మాత్రం వద్దని, కేంద్ర నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించాలని కోరాను. నేను చెప్పిందంతా విన్న జీవోఎం సభ్యులు నా ప్రెజెంటేషన్ బాగుందన్నారు. వాళ్లడిగిన క్లారిఫికేషన్లన్నింటికీ సమాధానాలిచ్చాను. విభజన ఆగిపోతుందో లేదో చెప్పలేదు. ఏం జరగబోతుందో చూద్దాం. విభజన బిల్లు వచ్చినా, రాకున్నా డిసెంబర్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. ఎందుకంటే ఆరు నెలల గడువు కూడా ముగుస్తుంది కాబట్టి సభ నిర్వహించాల్సిందే. అప్పుడు బిల్లు వస్తే విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమసల్యన్నీ హైలెట్ చేస్తా. రాష్ట్ర కేబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వం పంపే నివేదికను ఆమోదించవద్దని తెలంగాణ మంత్రులు చెప్తున్నారు. ఏ నివేదికైనా పంపే అధికారం సీఎంగా నాకు ఉంది. కేబినెట్ ఆమోదం అక్కర్లేదు. నన్ను సీఎంగా పిలిచారే తప్ప కేబినెట్ ఆమోదంతో రావాలని చెప్పలేదు.’’ -
ఉమ్మడి రాజధానిపై స్పష్టతనివ్వనున్న జీవోఎం
-
రాజధాని చుట్టూ.. రామయ్య పై బెట్టు
తెలంగాణ, సీమాంధ్ర కేంద్రమంత్రులు, సీఎంతో భేటీలు టీ బిల్లు ముసాయిదాలో మార్పుచేర్పులపైనే జీవోఎం దృష్టి హైదరాబాద్, భద్రాచలం అంశాలపైనే ప్రధాన చర్చలు హెచ్ఎండీఏ పరిధిని యూటీ చేస్తే, భద్రాచలం ఇచ్చేస్తే విభజనకు ఒప్పుకునే దిశలో సీమాంధ్ర కేంద్రమంత్రులు వంద రోజులకు పైగా సాగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోని నేతలు.. తాయిలాలిస్తే విభజనకు తలూపేందుకు సిద్ధం భద్రాచలాన్ని వదులుకోక తప్పదని సందేహిస్తున్న తెలంగాణ కేంద్రమంత్రులు.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ రెవెన్యూ జిల్లాకే పరిమితమయ్యేలా పట్టుపట్టాలని ఆలోచన రాష్ట్ర కాంగ్రెస్ నేతల ప్రతిపాదనలకు అనుగుణంగా తెలంగాణ బిల్లు ముసాయిదాలో మార్పులు జరిగేనా? 21న కేంద్ర మంత్రిమండలి భేటీకి ముందే ఉమ్మడి రాజధానిపై స్పష్టతనివ్వనున్న జీవోఎం రాష్ట్ర విభజనపై ఢిల్లీ కసరత్తు క్లైమాక్స్‌కు చేరుకుంది. కేంద్ర హోంశాఖ ఇప్పటికే సిద్ధం చేసిన తెలంగాణ ముసాయిదా బిల్లులో స్వల్ప మార్పుచేర్పులపైనే ఇప్పుడు కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) దృష్టి సారించింది. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న డిమాండ్, ఉమ్మడి రాజధాని పరిధి, అక్కడ శాంతిభద్రతల పర్యవేక్షణ, భద్రాచలం డివిజన్‌ను ఎటువైపు ఉంచటం.. ఈ కీలకాంశాలు పీటముడిగా మారటంతో వీటిని పరిష్కరించేందుకు తుది కసరత్తుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, సీమాంధ్ర కేంద్రమంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రితో జీవోఎం సోమవారం వేర్వేరుగా భేటీ కానుంది. మొన్నటివరకూ సమైక్యగళం వినిపించిన సీమాంధ్ర కేంద్రమంత్రులు.. పార్టీ అధిష్టానం ఎజెండాను అమలులోకి తెస్తూ సీమాంధ్రకు ప్యాకేజీలంటూ స్వరం మార్చిన విషయం తెలిసిందే. వంద రోజులకు పైగా సమైక్య రాష్ట్రం కోసం కొనసాగుతున్న ప్రజా ఉద్యమాన్ని విస్మరించి మరీ.. ప్యాకేజీలు, తాయిలాలు ఇస్తే విభజనకు సరేనంటూ సిద్ధమవుతున్నారు. అలాగే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఒకవైపు సమైక్యవాదన వినిపిస్తూ.. మరోవైపు అధికారికంగా విభజనకు తోడ్పాటునందిస్తున్న విషయం విదితమే. విభజన బిల్లులోనే హైదరాబాద్ హెచ్ఎండీఏ పరిధిని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయటంతో పాటు సీమాంధ్రకు ప్యాకేజీ ప్రకటించాలని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. కానీ.. తెలంగాణ ప్రాంత రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కేవలం హైదరాబాద్ రెవెన్యూ పరిధిని మాత్రమే.. అదికూడా ఉమ్మడి రాజధానిగా మాత్రమే గుర్తించాలని పట్టుపడుతున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిని ఉమ్మడి రాజధానిగా చేయటానికి కూడా తెలంగాణ నేతలు అంగీకరించటం లేదు. అలాగే.. భద్రాచలం మాదంటే మాదని ఇరువైపుల నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో జీవోఎం దాన్ని కూడా అత్యంత కీలకంగా భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్ రెవెన్యూ పరిధిని మాత్రమే ఉమ్మడి రాజధానిగా చేస్తే భద్రాచలం విషయంలో పట్టువిడుపులు తప్పవన్న భావన కొందరు టీ-కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సోమవారం జరిగే జీవోఎం భేటీల్లో ఈ రెండు అంశాలపై ఒక స్పష్టతకు రావటం.. తదనుగుణంగా ముసాయిదా బిల్లులో మార్పుచేర్పులు చేయటంపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే సారథ్యంలోని జీవోఎం దృష్టి సారిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. కీలకమైన అంశాలపై ఇరు ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి వేర్వేరుగా వినిపించే వాదనలను జీవోఎం కొంతమేరకు పరిగణనలోకి తీసుకుంటుంది తప్ప వారు చెప్పే విభజన అనుకూల, వ్యతిరేక వాదనలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని తెలుస్తోంది. వీరిచ్చే నివేదికల ఆధారంగా.. హైదరాబాద్‌ను యూటీ చేయటం, లేదా ఢిల్లీ తరహాలో పాక్షిక కేంద్ర పాలిత ప్రాంతం, లేదంటే ఒకే గవర్నర్ కింద రెండు రాష్ట్రాల రాజధానులను నడిపించటానికి ఉన్న అవకాశాలు, కేంద్రం పరిధిలోకి తీసుకోవటం వంటి ప్రతిపాదనలపై జీవోఎం కసరత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఉమ్మడి రాజధాని పరిధిపై ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల భద్రత, హక్కులు వంటి అంశాలను బిల్లులో చేరుస్తారని సమాచారం. మరోవైపు.. వనరుల పంపిణీ, నీటిపారుదల, ఉద్యోగులు, విద్య తదితర అంశాలకు సంబంధించి విభజన బిల్లులో పూర్తి సమాచారంతో సమగ్రంగా చేర్చకుండా.. దేనికదే ప్రత్యేక బోర్డులు, కేంద్ర ప్రభుత్వం నియమించే కమిటీలు పరిష్కారం చూపుతాయని మాత్రమే బిల్లులో చెప్తారని తెలుస్తోంది. ఇక ఆర్టికల్ 371 (డి) విషయంలో జీవోఎం ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చలు జరపగా.. చిన్న సవరణతో ఇరు ప్రాంతాల్లో దాన్ని కొనసాగించడానికే ఎక్కువ అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఈ నెల 21న కేంద్ర మంత్రిమండలి ముందు తెలంగాణ ముసాయిదా బిల్లు పెట్టే అవకాశాలున్నందున.. సోమవారం నాటి సమావేశాల అనంతరం ముసాయిదా మార్పుచేర్పుల పనుల్లో జీవోఎం తుది కసరత్తు పూర్తి చేస్తుందని సమాచారం. జీవోఎంతో చర్చలపై విడివిడిగా కసరత్తులు... విభజన కసరత్తు క్లైమాక్స్‌కు చేరిన దశలో జరుగుతున్న కీలక భేటీలు కావటంతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, నేతలు జీవోఎంకు తమ వాదన వినిపించడానికి నివేదికల రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇరు ప్రాంతాల కేంద్రమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులు జీవోఎం ముందు హాజరుకానున్నారు. సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు ఉదయం 11.30 గంటలకు జీవోఎం ఎదుట హాజరవుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణల నివాసాల్లో ఆ ప్రాంత మంత్రులు, పలువురు రాష్ట్ర నేతలు సమావేశమై.. జీవోఎంకు నివేదించాల్సిన అంశాలపై చర్చించి నివేదికను రూపొందించారు. జీవోఎం కీలకంగా భావిస్తున్న అంశాల్లో ఒకటైన భద్రాచలం విషయంలో వీరు వెసులుబాటు కల్పించే రీతిలో ఈ నివేదికలో పొందుపరిచినట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు సీమాంధ్ర కేంద్రమంత్రి ఎం.ఎం.పళ్లంరాజు సమక్షంలో సీమాంధ్ర నేతలు సమావేశమై జీవోఎం వద్ద సీమాంధ్రకు కోరాల్సిన ప్యాకేజీలపై ప్రధానంగా చర్చించి ఆ మేరకు నివేదిక రూపొందించారు. అధికారులతో నివేదిక సిద్ధం చేయించిన సీఎం జీవోఎం ముందు హాజరుకావటానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన జీవోఎం ముందు హాజరై నివేదిక సమర్పిస్తారు. నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్, ఉద్యోగుల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తయారు చేయించిన నివేదికను ఆయన జీవోఎంకు సమర్పించబోతున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గత అసెంబ్లీ సమావేశాల్లో, శాసనమండలిలో స్పష్టంగా చెప్పిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ తర్వాత పార్టీ కోర్ కమిటీ ముందు కూడా అదే వైఖరి ఉద్ఘాటించారు. ఆనంతర పరిణామాల్లో సీఎం సీమాంధ్ర సమస్యలు లేవనెత్తుతున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పెద్దలు వాటికి పరిష్కారం చూపిస్తామని, సీమాంధ్రకు న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చే నివేదికలో.. ప్రధానంగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను యూటీ చేయడమా, చేయకపోవడమా, ఒకవేళ చేసినా దాని పరిధి.. ఇలాంటి అంశాలపై సూచనలను కొంతమేరకు పరిగణనలోకి తీసుకుంటారని చెప్తున్నారు. ఆర్టికల్ 371 (డి) విషయంలో న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్నందున దానితో పాటు మిగిలిన అంశాలన్నింటిపైనా జీవోఎం ఇప్పటికే స్పష్టతకు వచ్చిందని, పైగా విభజన వల్ల ఇరు ప్రాంతాల్లో తలెత్తే సమస్యలను క్రోడీకరించే క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నివేదికను ఉపయోగిస్తారని తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే జీవోఎం ముందు ఒక నివేదిక సమర్పించిన విషయం పత్రికల్లో వచ్చిందే. ఎవరి వాదన వారిదే... తెలంగాణ ముసాయిదా బిల్లును ఇప్పటికే సిద్ధం చేసిన జీవోఎం దానికి తుదిరూపమిచ్చే పనిలో నిమగ్నం కాగా.. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటికీ విభజన అంశంపై ఎవరి అభిప్రాయాలు వారివన్నట్లుగానే మాట్లాడుతున్నారు. విభజన అంశాన్ని సీమాంధ్ర ప్రజలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా వంద రోజులకు పైగా ఉద్యమం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విభజనను వ్యతిరేకిస్తున్నట్లు చెప్తూ వచ్చారు. సీమాంధ్రకు భారీ ప్యాకేజీలు కావాలని కోరుతున్నప్పటికీ.. తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంత నేతలు విభజనపై ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇటు తెలంగాణ నేతలదీ అదే పరిస్థితి. మరోవైపు విభజన ప్రక్రియను సాఫీగా పూర్తి చేయించే బాధ్యతను హైకమాండ్ ఆదేశాల మేరకు నెత్తికెత్తుకున్న సీఎం కిరణ్ సైతం తప్పనిసరి పరిస్థితుల్లో సీమాంధ్ర సమస్యలు లేవనెత్తాల్సి వస్తోందని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో జీవోఎం ముందు ఏం చెప్పినా విభజన విషయంలో బయట ఎవరివాదన వారు వినిపించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నేటి జీవోఎం భేటీలు ఇలా... ఉదయం 10:30కు: తెలంగాణ కేంద్రమంత్రులు ఎస్.జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్లతో భేటీ ఉదయం 11:30కు: సీమాంధ్ర కేంద్రమంత్రులు వి.కిశోర్‌చంద్రదేవ్, ఎం.ఎం.పళ్లంరాజు, కావూరి సాంబశివరావు, చిరంజీవి, కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, పనబాక లక్ష్మి, డి.పురందేశ్వరి, జె.డి.శీలం, కిల్లి కృపారాణిలతో భేటీ మధ్యాహ్నం 12:30కు: సీఎం కిరణ్‌తో సమావేశం -
విభజనతో సమస్యలు వస్తాయి: రాఘవులు
-
విభజనతో సమస్యలు వస్తాయి: రాఘవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం (జీఓఎం)కు విజ్ఞప్తి చేసినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు వెల్లడించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన జీఓఎంతో భేటీ అయ్యారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని రెండుగా విభజించినంత మాత్రాన ఇరుప్రాంతాల్లో నెలకొన్న అసమానతలు కానీ అభివృద్ధిలో ఏర్పడిన వ్యత్యాసాలు కానీ మారవని జోఓఎంకు తెలిపినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో సమస్యలు వస్తాయని జీఓఎంకు వివరించినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఈ నెల 3వ తేదీన జీవోఎంకు రాసిన లేఖను రాఘవులు ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాఘవులుతోపాటు ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు ఈరోజు ఉదయం జీఓఎం ఎదుట హాజరై విభజనపై తమ వైఖరిని వివరించారు. గోదావరిపై నిర్మించే పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కరువు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని, అలాగే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలని జీవోఎంను కోరినట్లు చెప్పారు. వివిధ జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్‌లను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్య సంస్థలు అన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయన్న సంగతిని ఈ సందర్బంగా జీవోఎంకు గుర్తు చేసినట్లు వివరించారు. అలాంటి సంస్థలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో హంద్రీనివా, చిత్తూరు జిల్లాలో గాలేరు నగరి, కడపలో కల్వకుర్తి నెట్టెంపాడు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో వెలుగొండ, నల్గొండ జిల్లాకు ఉపయోగపడే ఎల్ఎల్బీసీ ప్రాజెక్ట్‌లు పూర్తికి సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. ముస్లీంలు అధికంగా ఉన్న పట్టణాల్లో లౌకిక విద్యను అందించేందుకు సత్వరమే కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని జీవోఎంను కోరారు. -
జీవోఎంకు నివేదిక ఇవ్వం: రేవూరి ప్రకాష్ రెడ్డి
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పడే సమస్యలపై ఇరుప్రాంతాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీఓఎం) విధి విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ టీడీపీ ఫోరం సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం వరంగల్‌లో ఆయన మాట్లాడుతూ.... జీవోఎంకు నివేదిక ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే అందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్లదే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. -
జీఓఎంకు తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నివేదిక
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై జాతీయ స్థాయిలో ఏర్పాటయిన మంత్రుల బృందానికి సమర్పించాల్సిన నివేదికను తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం విడుదల చేసింది. ఈ- మెయిల్ ద్వారా నివేదికను జీఓఎంకు పంపింది. ఫతేమైదాన్ క్లబ్లో నేడు సమావేశమయిన తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం నేతలు విభజన అంశంపై సమర్పించే నివేదికను ఖరారు చేశారు. శాంతి భద్రతలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంచడానికి అంగీకరిస్తున్నట్టు నివేదికలో తెలిపామని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణకు ప్రత్యక చట్టాలు అవసరం లేదన్నారు. వాటి గురించి ఆలోచించడమంటే హైదరాబాద్ వాసులను అవమాన పరచడమేనని అన్నారు. విభజనతో వచ్చే కష్టనష్టాలను భరిస్తూ తెలంగాణను పునర్నిర్మించుకుంటామన్నారు. విభజనపై సీమాంధ్రుల్లో నెలకొన్న భయాలను నివృత్తి చేయడం, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం వంటివి నివేదికలో పొందుపరిచామని వెల్లడించారు. -
ముగిసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం
-
గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ప్రారంభం
-
ఢిల్లీలో టిడిపి ఎంపీల హైడ్రామా
-
విద్యుత్ ప్లాంట్లు సీమాంధ్రలో అధికం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం)కు ఇంధనశాఖ నివేదిక సమర్పించింది. నివేదికలోని ముఖ్యాంశాలు... విద్యుత్ ఉత్పత్తి: రాష్ట్రం మొత్తం సామర్థ్యం 15,407.81 మెగావాట్లు. సీమాంధ్రలో 9,508.70 మెగావాట్లు, తెలంగాణలో 5,899.11 మెగావాట్లు ఉత్పత్తి. విద్యుత్ వినియోగం: 2013-14 టారీఫ్ ఆర్డర్ ప్రకారం.. తెలంగాణలో 46,030.47 మిలియన్ యూనిట్లు, సీమాంధ్రలో 43,903.96 ఎంయూ. 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ(ఎక్స్ట్రా హై-టెన్షన్-ఈహెచ్‌టీ) సబ్స్టేషన్లు: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 447. తెలంగాణలో 211, సీమాంధ్రలో 236. 33/11 కేవీ సబ్స్టేషన్లు: మొత్తం 4429. సీమాంధ్రలో 2,333, తెలంగాణలో 2096. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ (డీటీఆర్): రాష్ట్రవ్యాప్తంగా 9,99,984. సీమాంధ్రలో 5,45,690. తెలంగాణలో 4,54,294. విద్యుత్ కనెక్షన్లు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేటగిరీలను కలుపుకొని 2,55,73,811. తెలంగాణలో 1,07,51,630, సీమాంధ్రలో 1,48,22,181. వ్యవసాయ కనెక్షన్లు మాత్రమే అయితే సీమాంధ్రలో 13,92,489. తెలంగాణలో 18,60,493. -
శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిశీలించనున్నకేంద్ర మంత్రుల బృందం
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో గతంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర మంత్రుల బృందం పరిశీలించనుంది. ఏడుగురు మంత్రులతో కూడిన బృందానికి సారథ్యం వహిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితులు, విభజన గురించి 2010లో బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు సంబంధించి కమిటీ అప్పట్లో పలుప్రతిపాదనలు చేసింది. అయితే కేంద్రం ఇతర ప్రతిపాదనల్నిపక్కనబెట్టి తెలంగాణతో కూడిన హైదరాబాద్‌కు ఓటేసింది. కాగా తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రలో వచ్చే వ్యతిరేకతను కమిటీ అప్పుడే హెచ్చరించింది. హైదరాబాద్‌లో ఆ ప్రాంతవాసులకున్న అనుబంధం గురించి వివరించింది. సీమాంధ్ర కొత్త రాజధానికి కేంద్రం భారీ ప్యాకేజీ ఇచ్చే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇతర అంశాల గురించి శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిశీలించనుంది. -
విభజనపై సుప్రీంలో సవాల్ చేస్తాం: ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక
రాష్ట్ర విభజనపై కేంద్రం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)ను బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక శుక్రవారం హైదరాబాద్‌లో డిమాండ్ చేసింది. విభజన అంశంపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించింది. దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంది. జీవోఎంకు సహకరిస్తే విభజనకు సహకరించినట్లే ఆని అభిప్రాయపడ్డింద. అసెంబ్లీని సమావేశ పరచి తెలంగాణపై తీర్మానం పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. -
విభజన ప్రక్రియ ప్రారంభమైంది: జీఎంవో
-
తెలంగాణపై ప్రాథమిక అంశాలను చర్చించాం: ఆజాద్
తెలంగాణపై ఏర్పాటైన మంత్రుల బృందం శుక్రవారం ఉదయం తొలిసారి సమావేశమైంది. గంట పాటు జరిగిన సమావేశమనంతరం కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ వివరాలను వెల్లడించారు. ప్రాథమిక అంశాలను మాత్రమే చర్చించినట్టు తెలిపారు. ఈ నెల 19న రెండో విడత సమావేశం కానున్నట్టు ఆజాద్ వివరించారు. తాజా భేటీలో కేంద్రమంత్రులు ఆజాద్‌తో పాటు సుశీల్‌కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్, నారాయణస్వామి పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఎ.కె.ఆంటోనీ హాజరుకాలేదు. మరో మంత్రి చిదంబరం విదేశీ పర్యటనలో ఉన్నారు. -
తెలంగాణపై మంత్రుల కమిటీ తొలి భేటీ
న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ శుక్రవారం తొలిసారి సమావేశం అయ్యింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయంలో ఈ భేటీ జరుగుతోంది. సమావేశానికి జైరాం రమేష్, నారాయణ స్వామి, గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ హాజరు అయ్యారు. అయితే షిండే అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి అనారోగ్య కారణాలతో ఆంటోనీ, విదేశీ పర్యటనలో ఉన్న చిదంబరం అందుబాటులో లేరు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ .... ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలపై చర్చించనుంది. కాగా విభజన ప్రకటన, భగ్గుమన్న సీమాంధ్ర, రెండు నెలలకు పైగా తీవ్ర ఉద్యమం, ఊరూ వాడా ఏకమైనా కేంద్రం నుంచి కనీస స్పందన కరువైంది. దీనికి తోడు రాష్ట్రానికి వరుస అవమానాలు తప్పటం లేదు.. ఏకపక్షంగా విభజన నిర్ణయమన్న విమర్శలను పట్టించుకోకుండా తాను ఏం చేయదలుచుకుందో,.... అదే నిర్ణయాన్ని అమలు చేసేందుకు కేంద్రం మొండిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సీడబ్ల్యూసీ నిర్ణయం, క్యాబినెట్ ముందుకు టీ నోట్, విభజనకు మంత్రుల కమిటీ, విధివిధానాలు ఇలా ఏ దశలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల మనోగతాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకున్న దాఖలాలు కనిపించటం లేదు. తాజాగా ఏడుగురు మంత్రులతో విభజన కమిటీని ఏర్పాటు చేసినా, విధివిధానాలు ఖరారు చేసినా ముఖ్యమంత్రికి కానీ, ప్రభుత్వానికి కనీస సమాచారం లేదు. దానికి సంబంధించిన నోట్ కాపీని కూడా ప్రభుత్వానికి పంపలేదు. విభజన ప్రక్రియలో ప్రతి సమాచారం రాష్ట్రం నుంచి అధికారులు అందించాల్సి ఉంటుంది. మంత్రుల కమిటీ మొదటి సమావేశం జరుగుతున్నా ఎలాంటి సమాచారం లేదు. దీంతో నోట్ కాపీ అధికారికంగా అందుతుందని భావించిన ప్రభుత్వ వర్గాలు నివ్వెరపోతున్నాయి. మొదట్లో పదిమంది మంత్రులతో కమిటీ, రాష్ట్రానికి చెందిన వారికి కూడా చోటు ఉంటుందని చెప్పినా, అవన్నీ పక్కన పెట్టి, తాము తీసుకున్న నిర్ణయాన్ని వీలైనంత తొందరగా అమల్లో పెట్టే వారినే కమిటీలో నియమించారనే ప్రచారం జరుగుతోంది.. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని కూడా కనీసం పరిగణలోకి తీసుకోకపోవటం దారుణమని అధికారిక వర్గాలు అంటున్నాయి. -
కేంద్ర మంత్రుల బృందానికి గోబ్యాక్ చెప్పాలి: కొణతాల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయే కేంద్ర మంత్రుల బృందానికి (జీఓఎం)గో బ్యాక్ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ గురువారం సీమాంధ్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ సంక్షోభంతోనే విభజనను అడ్డుకోగలమని అభిప్రాయపడ్డారు. తక్షణమే అసెంబ్లీని సమావేశపరచి సమైక్య తీర్మానం చేద్దామన్నారు. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలని సూచించారు. న్యూఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమైక్యం కోసమే దీక్ష చేస్తున్నానని చెప్పడం లేదంటూ కొణతాల రామకృష్ణ ఎద్దేవా చేశారు. -
రాష్ట్ర విభజన, పంపకాలపై మంత్రుల బృందం భేటీ
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. రాష్ట్ర విభజన విధివిధానాల గురించి మంత్రుల బృందం నిర్ణయించనుంది. తెలంగాణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తొలిసారిగా శుక్రవారం సమావేశంకానుంది. ఈ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్న కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే బుధవారం ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దులు, పంపకాలను నిర్ధారించనుంది. సాగునీరు, నదీజలాల పంపిణీ నుంచి కొత్త రాష్ట్రాల్లో చట్ట సభ నియోజకవర్గాలు, న్యాయ, ఆర్థిక, ఇతర పరిపాలన విభాగాలకు సంబంధించి కూలంకుషంగా చర్చించి నివేదిక సమర్పించనుంది. ఇరు ప్రాంతాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించనుంది. ఇరు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండనున్న హైదరాబాద్ గడువు తర్వాత తెలంగాణలో అంతర్భాగంగా ఉంటుంది. దీంతో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని విషయం గురించి మంత్రుల బృందం చర్చించే అవకాశముంది. -
'జీవోఎంలో కీలకశాఖ మంత్రులు లేరు'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్వహించేందుకు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)లో కీలక శాఖ మంత్రులు లేరని మంత్రులు కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఆ కమిటీ అసలు రాష్ట్రానికి వస్తుందో లేదో నమ్మకం లేదని....అందుకే ఆ కమిటీని తాము వ్యతిరేకిస్తున్నట్లు వారు బుధవారమిక్కడ తెలిపారు. ఆ కమిటీలో తెలంగాణ తీర్మానంపై ఓటింగ్ జరగకపోయినా.... సభ్యులంతా విభజనపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్నారు. అలాగే అసమ్మతి తెలపటానికి కూడా ఆస్కారముందని వారు తెలిపారు. రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారిస్తున్నారని.... అయితే విశ్వరూప్ పార్టీ మారతారనే ఆయన రాజీనామాను ఆమోదించారని కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పలువురు సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. -
11న తెలంగాణపై మంత్రుల కమిటీ భేటీ
హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్వహించేందుకు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) శుక్రవారం సమావేశం కానుంది. ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతోంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బుధవారం ఏడుగురు మంత్రులతో కూడిన కమిటీకి ఆమోదం తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ నిర్వహించేందుకు యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) సంఖ్యను పదినుంచి ఏడుకు కుదించిన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్థిక మంత్రి పి చిదంబరం, పెట్రోలియం మంత్రి వీరప్పమొయిలీ, వైద్య ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్, గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్, ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి నారాయణ స్వామి జిఓఎం సభ్యులుగా కొనసాగుతారు. మానవ వనరుల మంత్రి పళ్లంరాజు, రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే, నీటివనరుల శాఖ మంత్రి హరీష్ రావత్‌లను జిఓఎం నుంచి తొలగించటం గమనార్హం. పల్లంరాజు మంత్రి పదవికి రాజీనామా చేయటంతో ఆయనతోపాటు ఖర్గే, రావత్లనూ జిఓఎం నుంచి తొలగించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అవసరమైన విభజన ప్రక్రియను ఆరువారాల్లో పూర్తి చేయాల్సిన జిఓఎం, ఇకమీదట తరచూ సమావేశం కానుంది. అయితే జిఓఎం సంఖ్యను పదినుంచి ఏడుకు ఎందుకు కుదించారనేది మాత్రం హోంశాఖ స్పష్టం చేయటం లేదు. విభజన ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేందుకే జిఓఎంలోని మంత్రుల సంఖ్యను తగ్గించి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
'తెలంగాణ'పై కేంద్రమంత్రుల బృందం భేటీ
తెలంగాణపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం తొలిసారి భేటి కానుంది. సోమవారం సాయంత్రం మంత్రులు సమావేశమై చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంతమంది మంత్రులు హాజరవుతారన్న విషయంపై స్పష్టత రాలేదు. ముగ్గురు మంత్రులు మాత్రమే హాజరయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి చెందిన కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి పల్లంరాజు హాజరయ్యేది లేనిది ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై సందిగ్ధత నెలకొంది.