ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో గతంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర మంత్రుల బృందం పరిశీలించనుంది.
ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో గతంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసులను కేంద్ర మంత్రుల బృందం పరిశీలించనుంది. ఏడుగురు మంత్రులతో కూడిన బృందానికి సారథ్యం వహిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండే శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. రాష్ట్ర పరిస్థితులు, విభజన గురించి 2010లో బి.ఎన్. శ్రీకృష్ణ కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర విభజనకు సంబంధించి కమిటీ అప్పట్లో పలుప్రతిపాదనలు చేసింది. అయితే కేంద్రం ఇతర ప్రతిపాదనల్నిపక్కనబెట్టి తెలంగాణతో కూడిన హైదరాబాద్కు ఓటేసింది. కాగా తెలంగాణ ఏర్పాటు వల్ల సీమాంధ్రలో వచ్చే వ్యతిరేకతను కమిటీ అప్పుడే హెచ్చరించింది. హైదరాబాద్లో ఆ ప్రాంతవాసులకున్న అనుబంధం గురించి వివరించింది. సీమాంధ్ర కొత్త రాజధానికి కేంద్రం భారీ ప్యాకేజీ ఇచ్చే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇతర అంశాల గురించి శ్రీకృష్ణ కమిటీ నివేదికను పరిశీలించనుంది.