విభజన బిల్లుకు తుది మెరుగులు! | Group of Ministers to Finalize Telangana Bill | Sakshi
Sakshi News home page

విభజన బిల్లుకు తుది మెరుగులు!

Published Thu, Feb 6 2014 10:24 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

విభజన బిల్లుకు తుది మెరుగులు! - Sakshi

విభజన బిల్లుకు తుది మెరుగులు!

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జీవోఎంలోని కేంద్ర మంత్రులు గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు. బుధవారం సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇచ్చిన ప్రతిపాదనలపై జీవోఎంలోని కేంద్ర మంత్రులు ఈ సందర్బంగా చర్చించనున్నారు. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం 5.30 నిముషాలకు కేంద్ర క్యాబినేట్ భేటీ కానుంది.

 

అయితే ఆ సమయానికి విభజన బిల్లుకు తుది రూపం ఇచ్చేందుకు జీవోఎం సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఆంధప్రదేశ్ విభజన జరిగితే పోలవరం డివిజన్ సీమాంధ్రలో కలపాలని, హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని తదితర మొత్తం 9 ప్రతిపాదనలు జీవోఎం వద్ద సీమాంధ్ర కేంద్ర మంత్రులు బుధవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం జరగనున్న కేంద్ర మంత్రి వర్గం సమావేశం ఎదుట తెలంగాణ బిల్లు టేబుల్ ఐటంగా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement