జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం | narendra Modi axes all GOMs, EGOMs for fast decisions, accountability | Sakshi
Sakshi News home page

జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

Published Sat, May 31 2014 6:26 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం - Sakshi

జీవోఎం విధానాన్నిరద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: జీవోఎంలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. పాలనలో పారదర్శకత కోసం జీవోఎంలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జీవోఎం పరిధిలో మిగిలిపోయిన నిర్ణయాలను ఇక నుంచి సంబంధిత శాఖలే చూసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో 21 మంత్రుల బృందాలు (జీవోఎం), 9 సాధికారిక బృందాలు(ఈజీవోఎం)లపై వేటు పడింది. ఇప్పటివరకూ పలురకాలైన అంశాలపై జీవోఎం కమిటీలు అందజేసే నివేదికలతోనే కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే.

 

కాగా, ఈ విధానంతో పరిపాలనలో పూర్తి పారదర్శకత ఉండదని భావించిన నరేంద్ర మోడీ సర్కారు దీనికి స్వస్తి చెప్పింది. ఇక నుంచి శాఖా పరంగానే వాటిపై నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement