సంప్రదింపులు తప్పనిసరి: వీరప్ప మొయిలీ
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై సంప్రదింపులు జరపడం అనేది తప్పనిసరి అని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి, జిఓఎం సభ్యుడు వీరప్ప మొయిలీ చెప్పారు. జిఓఎం సంప్రదింపులు ఎందుకు కొనసాగుతున్నాయన్న దానిపై ప్రశ్నలు అనవసరం అని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలు చెప్పుకునేందుకు చాలా అవకాశాలు ఇచ్చామని మొయిలీ తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుకు తుది మెరుగులు దిద్దేందుకు జిఓఎం సభ్యులు ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు సమావేశం కానున్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు నిన్న ఇచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.