తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది. రాష్ట్ర విభజన విధివిధానాల గురించి మంత్రుల బృందం నిర్ణయించనుంది. తెలంగాణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తొలిసారిగా శుక్రవారం సమావేశంకానుంది. ఈ ప్యానెల్లో సభ్యుడిగా ఉన్న కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే బుధవారం ఈ విషయం వెల్లడించారు.
తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దులు, పంపకాలను నిర్ధారించనుంది. సాగునీరు, నదీజలాల పంపిణీ నుంచి కొత్త రాష్ట్రాల్లో చట్ట సభ నియోజకవర్గాలు, న్యాయ, ఆర్థిక, ఇతర పరిపాలన విభాగాలకు సంబంధించి కూలంకుషంగా చర్చించి నివేదిక సమర్పించనుంది. ఇరు ప్రాంతాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల అభివృద్దిపై దృష్టి కేంద్రీకరించనుంది. ఇరు రాష్ట్రాలకు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉండనున్న హైదరాబాద్ గడువు తర్వాత తెలంగాణలో అంతర్భాగంగా ఉంటుంది. దీంతో సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధాని విషయం గురించి మంత్రుల బృందం చర్చించే అవకాశముంది.
రాష్ట్ర విభజన, పంపకాలపై మంత్రుల బృందం భేటీ
Published Wed, Oct 9 2013 9:27 PM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement