సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పర్యటనలో భాగంగా ఈనెల 21న రాయచోటిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించదలిచారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన సమాచారం ఉంది. రచ్చబండ నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) సమావేశంలో పాల్గొనే నిమిత్తం సీఎం కిరణ్ సోమవారం న్యూఢిల్లీకి వెళ్లారు.
సమావేశం అనంతరం మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలోనే ఆయన పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. ఈమేరకు జిల్లా యంత్రాంగానికి సీఎంఓ నుంచి ఆదేశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి 21న జిల్లాలో నిర్వహించదలిచిన రచ్చబండ కార్యక్రమం రద్దు అయిన సమాచారాన్ని కలెక్టరేట్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. సీఎం పర్యటన జిల్లాలో ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈనెల 22న ఉంటుందని కొందరు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నా, అధికారిక సమాచారం లేదు.
కిరణ్ రచ్చబండ వాయిదా
Published Tue, Nov 19 2013 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement