Rayachoti
-
టీడీపీ నేత రాసలీలలు.. వీడియో లీక్
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో పేద మహిళలే టార్గెట్‌గా ఖాదర్ బాషా అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం టీడీపీ పరిశీలకుడిగా ఉన్న గాజుల ఖాదర్ బాషా అసలు స్వరూపం బట్టబయలైంది. పేద మహిళలను టార్గెట్ చేస్తూ ఖాదర్.. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ బాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకు వచ్చింది. పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి ఖాదర్.. ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే బహిర్గతం చేసింది. దీంతో, అసలు విషయం బయటకు వచ్చింది.ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పచ్చ నేతలు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల సత్యవేడు, ఇప్పుడు రాయచోటిలో వెలుగు చూసిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఈ రెండు ఘటనల్లో బాధితులు ఎంతో ధైర్యం చేసి బయటకు రావడంతో పచ్చ నేతల బాగోతం బయటకు వచ్చింది. -
తుపాకీతో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
రాయచోటి: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వేదవతి (26) గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేలిందని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారిస్తామని డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి చెప్పారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పుంగనూరు సమీపంలోని బింగానిపల్లెకు చెందిన వేదవతి, మదనపల్లెకు చెందిన దస్తగిరి 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది. దస్తగిరి పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్నారు. వేదవతి చిత్తూరు నుంచి ఏడాది కిందట అన్నమయ్య జిల్లాకు బదిలీపై వచ్చారు. రాయచోటిలోనే కాపురం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం సెంట్రీ డ్యూటీలో ఉన్న వేదవతి చేతిలో ఉన్న గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
రెచ్చిపోయిన పచ్చమూకలు..BC నేత వెంకటేశ్వరులు ఇంటిపై రాళ్ళ దాడి
-
వైఎస్ఆర్ సీపీ లో చేరనున్న రమేష్ రెడ్డి
-
రణన్నినాదం
సాక్షి, రాయచోటి: ఇన్నాళ్లూ సామాజిక సాధికారత అంటే ఒక నినాదంగానే వింటూ వచ్చామని, కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఒక విధానంలా అమలు చేశారని బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీ నేతలు కొనియాడారు. సామాజిక విప్లవమే జగనన్న విధానం అని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. సభకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. రింగ్‌రోడ్డు సర్కిల్ నుంచి శివాలయం వరకు మెయిన్‌రోడ్డు మీదుగా వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైనార్టీలకు ఎంతో మేలు మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలు అంతా ఇంతా కాదని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియాఖాన్ చెప్పారు. ఆయన చేసిన మేలును ముస్లిం మైనార్టీ వర్గాలు ఎప్పటికీ మరిచిపోవన్నారు. దేశ చరిత్రలో ముస్లింలకు న్యాయం చేస్తున్న ఏకైక సీఎం జగనేనని వారు కొనియాడారు. పేదల బతుకుల్లో వెలుగులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ఇలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకడం మన అదృష్టమన్నారు. జగనన్నలా ఏ ఒక్కరూ చేయలేదు..: రాజ్యాంగ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఎవరూ ఊహించని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో పెద్దపీట వేశారని కొనియాడారు. ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్లుగా చేశారన్నారు. డీబీటీ రూపంలో దాదాపు రూ.2.4 లక్షల కోట్లు వారి ఖాతాల్లో వేశారని చెప్పారు. సంక్షేమ సారథి.. జగనన్న రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ పేదల గుండెల్లో సంక్షేమ సారథిగా నిలిచిపోయారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లా అంటే రాయచోటి అని గుర్తు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి నియోజకవర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో రూ.1,289 కోట్ల ప్రయోజనం కల్పించారని వెల్లడించారు. -
రాయచోటి: సామాజిక జైత్రయాత్ర.. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత
సాక్షి, అన్నమయ్య జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తోన్న మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతంగా సాగుతోంది. రాయచోటిలో గురువారం మధ్యాహ్నం సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ బస్సు యాత్రలో పలువురు మంత్రులతో పాటు ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు హాజరయ్యారు. మధ్యాహ్నం రింగ్‌రోడ్డు నుంచి బంగ్లా వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి ప్రజాప్రతినిధులు, నేతలు మాట్లాడారు. బీసీల పేరు చెప్పుకుని చంద్రబాబు మోసం: అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ, గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లతో గెలిచి అన్యాయం చేశారని మండిపడ్డారు. 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు టీడీపీ బీసీల పార్టీ అంటాడు.. బీసీల పేరు చెప్పుకుని మోసం చేశాడు. మన ఓట్లతో గెలిచి మనల్ని మోసం చేశారు. మోసం చేసిన చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలా? సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ కావాలా? అని ప్రశ్నించారు. మైనార్టీని మంత్రి చేయని వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేను చేసి డిప్యూటీ సీఎంను చేశాడు. రాయచోటికి చెందిన జకియా ఖానమ్‌ను శాసన మండలి డిప్యూటి ఛైర్మన్‌ను చేశారు. చరిత్ర రాయాలంటే వైఎస్ కుటుంబానికే సాధ్యమౌవుతుంది. అందరిని నా వాళ్లు అని పిలిచే ఏకైక వ్యక్తి వైఎస్ జగన్. రాయచోటి ఈ ఐదేళ్లలో ఎంతో అభివృద్ది చెందింది. రాయచోటి అభివృద్దిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది’’ అని అంజాద్ బాష ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో నక్కలు, కుక్కలు, పందులు ఏకమవుతున్నాయి. అయినా భయపడేది లేదు .. సింహం వైఎస్ జగన్ సింగిల్‌గా వస్తారు. 175 స్దానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుంది. 175 స్దానాల్లో టీడీపీకి అభ్యర్దులు లేరు. మేము ఏరిపారేస్తే వారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారు’’ అని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత: ఎంపీ సురేష్ వైఎస్సార్ ఫ్యామీలిని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ తేడా చూసి వైఎస్సార్సీపీని గెలిపించండి. సీఎం వైఎస్ జగన్ కోసం పోరాడే సైనికుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు మన పిల్లలు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడుతున్నారంటే ఇది సీఎం జగన్ పాలన ఘనత. కార్యాలయాల చుట్టూ తిరగకుండా పథకాలు అందిస్తున్న వ్యక్తి జగన్’’ అని ఎంపీ సురేష్ పేర్కొన్నారు. -
నేడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో సామాజిక సాధికార యాత్ర
-
మహమ్మద్ రఫీ కుటుంబ సభ్యుల వివాహానికి హాజరైన సీఎం జగన్
-
సొంతింటి కల నిజం చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో..!
ఇప్పుడున్న టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఈ పరిచయం అక్కర్లేని పేరు కిరణ్ అబ్బవరం. రాజావారు రాణిగారు చిత్రంలో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో. ఆ తర్వాత ఎస్ఆర్ కల్యాణమండపం మూవీతో ఫేమ్ తెచ్చుకున్నారు. అనంతరం సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం రూల్స్ రంజన్ అంటూ సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. (ఇది చదవండి: జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ!) ఇకపోతే సొంతింటి కల అనేది సామాన్యులకైనా.. సెలబ్రిటీలకైనా ఒకటే. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక మైల్స్టోన్. అయితే తాజాగా మన హీరో కిరణ అబ్బవరం సొంతింటి కలను నిజం చేసుకున్నారు. కానీ కిరణ్ తన సొంత ఊర్లోనే ఈ ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. కడప జిల్లా రాయచోటికి చెందిన కిరణ్ గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఆయనకు అభినందనలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. View this post on Instagram A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram) -
ముందుకు సాగడమే జీవితం.. సేవ కోసం ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని..
కిన్నెర నాగ చంద్రికాదేవి పుట్టింది అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణం (కడప జిల్లా). పెరిగింది కడప జిల్లా ఎర్రగుంట్లలో. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో పుట్టిన నాగచంద్రాదేవికి పదో తరగతితోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఊహించలేదు. అలాగే రెండు వందల తులాల బంగారంతో మొదలైన ఆమె జీవితంలో కాలంతోపాటు బంగారం కరిగిపోవడమూ ఊహించలేదు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని, సమాజ సేవ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేయాల్సి వస్తుందని కూడా ఊహించని సంఘటనలే. అలాగే సోదరులున్నప్పటికీ తల్లిదండ్రుల దహన సంస్కారాలు తన చేతులతో చేయాల్సి వస్తుందని కూడా ఊహించని పరిణామమే. అలాగే తన హోమ్‌లో కాలధర్మం చెందిన ఆరు వందల మందికి స్వయంగా అంత్యక్రియలు చేయడం కూడా ఊహించని సంఘటనలే. తన సేవా ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారామె. ‘జీవితం అంటేనే గమ్యం ఏమిటో తెలియకనే మొదలు పెట్టే ప్రయాణం. ఊహకందని మలుపులతో సాగే ఈ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లుంటాయి, గతుకులుంటాయి, వాహనం మొరాయిస్తుంది, మరమ్మతులు చేసి ముందుకు సాగబోతే ఇంధనం నిండుకోనూవచ్చు. ఇన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడమే మనం చేయగలిగింది. వృద్ధుల సేవలో నా జీవితానికి ఒక అర్థాన్ని నిర్వచించుకున్నాననే అనుకుంటున్నాను’ అన్నారామె. నైరాశ్యం– నేను– నా బిడ్డ ‘‘మా నాన్న మెడికల్ ఆఫీసర్. అమ్మానాన్నలకు తొలి సంతానం నేను. నన్ను మా మేనత్తకు దత్తత ఇచ్చారు. అత్త, మామ ఇద్దరూ హైస్కూల్ టీచర్లు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ టెన్త్ క్లాస్‌తోనే పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కాలేజ్‌కెళ్లే అవకాశం ఉండింది. ఇంటర్ తర్వాత విద్యుత్‌సౌధలో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేస్తూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాను. ఈ లోపు బాబుకి తల్లి కావడం... బిడ్డనెత్తుకుని ఇంటి నుంచి బయటపడడం వరకు జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ చిన్నవయసుకే పూర్తయిపోయాయి.. ఉద్యోగం చేసుకుని ఇంటికి వస్తే నాలుగ్గోడల మధ్య నేను, నా కొడుకు. నైరాశ్యం ఆవరించినట్లయ్యేది. దాని నుంచి బయటపడడానికి వేసిన ఒక్కో అడుగూ నన్ను ఇవాళ ఇలా సేవకు ప్రతీకగా నిలబెట్టాయి. నా పనిని గుర్తించి అవార్డులు వరించాయి. నన్ను అంటిపెట్టుకుని నేడో రేపో అన్నట్లు కళ్లలో ప్రాణాలు నిలుపుకుని రోజులు లెక్కపెట్టుకుంటున్న వాళ్లు ఉన్నారు. నేను కనిపించగానే వాళ్ల కళ్లలో కనిపించే వెలుగు నన్ను నడిపిస్తోంది. ఒకరికి ఒకరు తోడు మగవాడి మోసానికి గురయి ఒంటరైన మహిళలకు నా ఇంట్లో ఉంచుకుని వాళ్లు ఏదో ఒక పని నేర్చుకుని వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే వరకు ఆసరా ఇస్తూ వచ్చాను. అలాగే ఏ దిక్కూలేని వృద్ధులను ఇంటికి తీసుకురావడం కూడా. ఏ బంధుత్వం లేని వాళ్లను అలా ఇంట్లో ఉంచుకోవడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం అని తెలిసి 2003లో మా ఇంటి పేరుతోనే కిన్నెర ఫౌండేషన్ స్థాపించాను. అక్కడి నుంచి నా సర్వీస్ విస్తరణ కూడా మొదలైంది. స్కూల్లో ఉండాల్సిన పిల్లలు వీథుల్లో ఉంటే వారిని సమీకరించి కౌన్సెలింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్చాను. ఎందుకో తెలియదు కానీ అక్కడ కూడా సింగిల్ పేరెంట్ సంరక్షణలో ఉన్న పిల్లలే ఎక్కువగా ఉండేవారు. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి నా బిడ్డల్లా అనిపించేవారు. సామాజిక చైతన్యం మహిళలకు ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ ప్రభుత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంలో షీ టీమ్‌తో కలిసి పని చేశాను. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట దగ్గర జప్తేసద్గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని ప్లోరోసిస్ బాధితులకు మంచి నీటి ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు నా చేతుల మీదుగా చేయగలిగాను. వృద్ధుల సేవనే ప్రధానంగా తీసుకోవడానికి కారణం మా అమ్మమ్మ, అత్త మంచం పట్టిన రోజులను దగ్గరగా చూడడమే. వాళ్ల మీద మనకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ల బాధను పంచుకోలేం. మనం చేయగలిగింది వారికి తోడుగా ఉంటూ భరోసా ఇవ్వడం మాత్రమే. అందుకే మా హోమ్‌లో హాస్పిస్ సేవలే ప్రధానంగా ఉంటాయి. హోమ్ నిర్వహణకు నెలకు మూడు లక్షల ఖర్చు వస్తుంది. ఒక కంపెనీ నుంచి అద్దెలో కొంత ఆర్థిక సహాయం, మరో కంపెనీ నుంచి బియ్యం నెలనెలా అందుతున్నాయి. పుట్టినరోజులు హోమ్‌లో చేసుకోవడానికి కొంతమంది వస్తారు. మిగిలిన ఖర్చుల కోసం ... ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లో సంపాదించుకున్న ఇల్లు, రెండు ప్లాట్లు అమ్ముకున్నాను. బంగారం బ్యాంకులో తాకట్టు పెడుతూ విడిపిస్తూ, పెద్ద అవసరంలో అమ్ముకుంటూ అలా 30 తులాలు ఖర్చయింది. మాసాబ్ ట్యాంకులో అద్దె ఇంట్లో హోమ్ నిర్వహిస్తున్నాను. నా శక్తి తగ్గిపోతోందనే సమయం వచ్చిందని కాబోలు భగవంతుడు హోమ్ కోసం సొంత భవనాన్ని నిర్మించే మార్గం చూపించాడు. చిన్న జీయర్ స్వామి సూచనతో ముచ్చింతల్‌లో హోమ్ నిర్మాణం పూర్తయితే మా హోమ్ అక్కడికి మారుతుంది’’ అని వివరించారు నాగ చంద్రికాదేవి. సేవలోనే సాంత్వన నా సర్వీస్‌కి గుర్తింపుగా స్టేట్ అవార్డు, ఉత్తమ మహిళ అవార్డు, సేవాధార్మిక, గవర్నర్ అవార్డు, నేషనల్ అవార్డు అందుకున్నాను.ఈ పనుల్లో నన్ను నేను ఎంగేజ్ చేసుకున్నాను. ఈ సేవలో నాకు సాంత్వన లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏపీలో గుణదలలో పోస్టింగ్ వచ్చింది. నేను హైదరాబాద్ వదిలి వెళ్లాలంటే హోమ్‌లో ఉన్న వాళ్ల సంరక్షణ ప్రశ్నార్థకమైంది. వాళ్లను ఎవరి మీద వదలాలి? తాత్కాలికంగా బాధ్యత అందుకోవడానికి కూడా ఏ ఆసరా లభించలేదు. దాంతో 2016లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. – నాగ చంద్రికాదేవి, ఫౌండర్, కిన్నెర ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
ఎంత పని చేశావు తల్లీ..!
సాక్షి, రాయచోటి: కడుపులో పెరుగుతున్నప్పటి నుంచే తల్లి ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటుంది. భూమి పైకి వచ్చిన తర్వాత కంటికి రెప్పలా కాపాడుతుంది. కట్టుకున్న భర్త పట్టించుకోకపోయినా.. నా అన్న వారు పలకరించకపోయినా.. చివరికి తాను ఏకాకైనా సరే సర్వం ధారపోసి బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మ తన కడుపున పుట్టిన బిడ్డను తన చేతులతోనే కర్కోటకంగా గొంతు నులిమి చంపిన సంఘటన రాయచోటిలో చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె గ్రామం పొలాల వద్ద ఉన్న నక్కలగుట్టలో జరిగింది. మానసిక స్థితి సరిగా లేకపోవడం, అనవసర భయంతో ఆమె ఈ దుర్ఘటనకు పాల్పడింది. అర్బన్ సీఐ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరులోని చెన్నారెడ్డి వీధికి చెందిన షేక్ మహమ్మద్ బాషా సంబేపల్లె మండలం చౌటపల్లె గ్రామం షేక్ ఫాతిమాను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి రుక్సానా (10 నెలల) కుమార్తె ఉంది. ఫాతిమా మానసిక స్థితి సరిగా లేదు. ఆమె భర్త ఇంటి నుంచి అప్పుడప్పుడూ చెప్పకుండా పుట్టింటికి వచ్చేది. తన ఆరోగ్యం సరిగా లేదని, త్వరగా చనిపోతానని భావించింది. తాను చనిపోతే తన బిడ్డను ఎవరు చూసుకుంటారు అనే అనుమాన పడింది. ఎవరూ చూసుకోరనే నిర్ణయానికి వచ్చింది. అనుకున్నదే తడువుగా శనివారం తన పసిబిడ్డను తీసుకొని రాయచోటికి వచ్చింది. అక్కడి నుంచి పుట్టింటికి వెళ్లేందుకు మనసు నచ్చక రాయచోటిలోనే ఆగిపోయింది. రాయచోటి పట్టణ శివారులోని పెమ్మాడపల్లె సమీపాన ముళ్ల పొదల వద్ద ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి కుమార్తె గొంతు నులిమి చంపేసింది. కుమార్తె మృతదేహాన్ని తన భుజాలపై వేసుకొని రాయచోటికి వచ్చి, అక్కడి నుంచి తిరిగి పీలేరుకు వెళ్లింది. అప్పటికే రాత్రి కావడంతో పీలేరు నుంచి భర్త బంధువులకు ఫోన్ చేసి తన బిడ్డను చంపేశానని, వచ్చి తీసుకెళ్లాలని చెప్పింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి విగతజీవిగా పడి ఉంది. బంధువులు పాప శవాన్ని తీసుకొని రాయచోటి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదివారం నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదు రోజుల క్రితమే గల్ఫ్ నుంచి ఇంటికి.. భర్తను దూరం పెట్టడంతో..
సాక్షి, అన్నమయ్య(రాయచోటి): భార్యపై అనుమానం పెంచుకున్న భర్త క్షణికావేశంలో కత్తితో దాడిచేసిన ఘటన రాయచోటిలో సంచలనం రేకెత్తిస్తోంది. గురువారం తెల్లవారుజామున అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాయచోటి అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రజినాల వెంకట రామ్మోహన్ భార్య రజినాల రాజేశ్వరి (37) 5 రోజుల కిందట గల్ఫ్ దేశం నుంచి వచ్చింది. ఆమె ఇంటికి వచ్చినప్పటి నుంచి అనారోగ్య రీత్యా భర్తను దగ్గరకు రానివ్వలేదు. దీంతో భార్యపై అనుమానం పెంచుకున్న రామ్మోహన్ మద్యం మత్తులో దాడికి పాల్పడ్డాడు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డివారిపల్లెలో నివాసం ఉంటున్న వెంకట రామ్మోహన్ గురువారం తెల్లవారుజామున పదునైన కత్తితో భార్య రాజేశ్వరిని పొడిచి హత్య చేశాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. భార్యను హత్యచేసిన అనంతరం రామ్మోహన్ పరారయ్యాడు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని సిఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: (చెరకు తోటలో మూకుమ్మడి అత్యాచారం.. ఆ సైట్లకు బానిసై అఘాయిత్యం) -
శేషాచలం.. నల్లమల.. అడవి ఏదైనా జల్లెడ పట్టడమే వారి విధి
సాక్షి, రాయచోటి: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు అడవిబాట పడుతున్నారు. ఇంతకుమునుపు మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో అనునిత్యం అరణ్యంలో గడుపుతూ వచ్చారు. అయితే కాలక్రమేణా మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడం.. ఎర్రచందనం స్మగ్లర్ల బెడద పెరిగిపోవడంతో వారిని ఎదుర్కొనేందుకు ఖాకీలు శ్రమిస్తున్నారు. ఒక వైపు స్మగ్లర్లు, మరోవైపు ఎర్రచందనం కూలీల చర్యలు తిప్పికొట్టేందుకు అడవిలోనే మకాం వేస్తున్నారు. అడవిలో అనేక రకాల సవాళ్లు.. కష్టాలు ఎదురవుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఇష్టంగా ముందుకు వెళుతున్నారు. ఒక్కరోజులో పదుల సంఖ్యలో కొండలు, గుట్టలు..వాగులు, వంకలు దాటుకుంటూ ఎర్రచందనం చెట్ల రక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. సుమారు 20 మందితో కూడిన కూంబింగ్ దళం ప్రతినెల మూడు వారాలపాటు అడవిలోనే తిరుగుతోంది. అరణ్యంలో కిలోమీటర్ల మేర నడక అన్నమయ్య జిల్లాలో నల్లమలతోపాటు ఎర్రమల, శేషాచలంతోపాటు ఇతర పలు రకాల అడవులు విస్తరించాయి. ప్రధానంగా ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్న కొండల్లోకి బృందం అడుగు పెట్టిందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నడకే సాగుతుంది. ఆహారం తీసుకునే సమయం మినహా మిగతా సమయంలో అడవినంతా జల్లెడ పడతారు. తెల్లవారుజామున 4 గంటలకే లేవడం, ఒక ప్రాంతంలో టిఫెన్ చేసుకుని ఉదయాన్నే 6 గంటలకు అలవాటు ఉన్న వారు తినడం, లేని వారు పార్సిల్ కట్టుకుని నడక మొదలు పెడతారు. అక్కడి నుంచి అటవీశాఖ సిబ్బంది సహాయంతో గాలింపు చర్యలు చేపడతారు. నడిచే సమయంలో మాట్లాడకుండా, సెల్ఫోన్లు చూడకుండా తుపాకీ భుజాన పెట్టుకుని కూంబింగ్‌లో భాగంగా వేట కొనసాగుతుంది. అలా మధ్యాహ్న భోజనం అనంతరం సాయంత్రం వరకు తిరగడం, రాత్రికి సమీప ప్రాంతంలోనే టెంటు వేసుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అందులోనూ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కాకుండా బయట ప్రాంతాలను ఎంచుకుంటారు. అడవిలో నీరు నిల్వ ప్రాంతాలకు జంతువులు వచ్చే అవకాశం ఉండడంతో కూంబింగ్ దళం సమీప ప్రాంతాల్లో ఎక్కడా టెంట్లు వేసుకోరు. దుంగలు దొరికితే ‘అడవంత కష్టం’ అడవిలో కొండలు, రాళ్లు, చెట్ల పొదలను దాటుకుని నడవడమే కష్టం. అలాంటిది ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసుకున్న దుంగలు కూడా ఒక్కోసారి కనబడతాయి. ఈ తరుణంలో వాటిని అటవీ ప్రాంతం నుంచి బయటికి తీసుకు రావాలన్నా...అడవిలో మోయాలన్నా అడవంత కష్టముంటుంది. ఎందుకంటే ఒకవైపు బ్యాగు, మరోవైపు తుపాకీ, ఇంకోవైపు ఎర్రచందనం దుంగలను ఎత్తుకుని కాలిబాటగా రావాల్సిందే. కనీసం బయటికి సమాచారం ఇవ్వడానికి సెల్ఫోన్లు పనిచేయవు.. సిగ్నల్స్ ఉండవు. కేవలం భుజానికి ఎత్తుకుని కిలోమీటర్ల మేర నడవడమే మార్గం. అనుక్షణం అప్రమత్తం అడవిబాట పట్టిన పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే నీరు నిల్వ ఉన్నచోట, మధ్యాహ్న సమయంలో స్వయంగా ఈ బృందమే వంట సిద్ధం చేసుకుని తిని వెళతారు. అయితే ఒకవైపు స్మగ్లర్లు, ఎర్రచందనం కూలీలతో ముప్పు పొంచి ఉంటుంది. మరోవైపు అడవి జంతువులతోనూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రాత్రి సమయంలో ప్రధానంగా విష సర్పాలు, పురుగులతో సహవాసం తప్పదు. రాత్రి సమయంలో సెల్ఫోన్ల లైటింగ్ కూడా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. రాత్రి పూట ఒక సెంట్రీ అడవిలో కూంబింగ్ నిర్వహణకు వెళ్లిన పోలీసులు నిద్రపోయే సమయంలో కూడా ఒక సెంట్రీ పహారా కాస్తారు. రాత్రంతా రెండు గంటలకు ఒకరు చొప్పున మారుతూ డ్యూటీలు చేస్తారు. పగలంతా నడక చేసినా రాత్రి పూట కూడా వారందరికీ రక్షణగా ఒకరు మేలుకుని విధులు నిర్వర్తిస్తారు. ఎందుకంటే రాత్రిపూట స్మగ్లర్లు, కూలీలు, అడవి జంతువుల దాడుల నేపథ్యంలో కచ్చితంగా ఒక పోలీసు నిద్ర మేల్కొని సెంట్రీ డ్యూటీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. జోరు వానలో.. ఎముకలు కొరికే చలిలో.. కూంబింగ్ దళానికి సంబంధించి ఒక ఆర్‌ఎస్‌ఐతోపాటు ఒక లోకల్ ఎస్ఐ, పది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు అటవీశాఖ సిబ్బందితో కలిసి అడవిలోకి వెళితే వర్షం వణికిస్తున్నా.. చలి చంపేస్తున్నా.. మంచు కమ్మేస్తున్నా.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవమే లక్ష్యంగా అడుగు మాత్రం ముందుకు పడాల్సిందే. ఒక్కోసారి అడవిలోకి బృందం వెళ్లిందంటే మూడు రాత్రులతోపాటు నాలుగు పగళ్లు అక్కడే ఉండి ఇంటికి చేరుకుంటారు. జిల్లా కేంద్రం నుంచి చుట్టు పక్కల అటవీ ప్రాంతం సమీపం వరకు వాహనం వదిలి వస్తుంది. నాలుగు రోజుల తర్వాత అడవి నుంచి బయటికి రాగానే మళ్లీ వాహనం వెళ్లి తీసుకు వస్తుంది. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకే కూంబింగ్ అన్నమయ్య జిల్లాలోని అడవుల్లో ఎర్రచందనం చెట్లు విస్తరించి ఉన్నాయి. అయితే కొంతమంది స్మగ్లర్లు, తమిళ కూలీలు అక్రమ రవాణాకు తెగబడుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడమే లక్ష్యంగా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో కఠినంగా ముందుకు వెళుతున్నాం. – వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ, అన్నమయ్య జిల్లా రోజుకు 40 కిలోమీటర్ల మేర నడక అడవిలోకి కూంబింగ్ వెళ్లిన దళం ఉదయం 6 గంటలకు నడక మొదలు పెడితే సాయంత్రం 6 గంటల వరకు సాగుతూనే ఉంటుంది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అడవిలో నడుస్తూనే ఉంటాం. ఒకరినొకరు మాట్లాడుకోకుండా గ్రూపులుగా అడవి అంతా జల్లెడ పడతాం. అడవినంతా గాలిస్తూ ముందుకు వెళతాం. ఎక్కువ యుక్త వయస్సు వారే ఉంటుండడంతో ఎక్కువ కిలోమీటర్లు నడవగలగడంతోపాటు వంట కూడా మేమే చేసుకుంటాం. – తులసిరామ్, కానిస్టేబుల్, రాయచోటి అక్రమ రవాణాను అడ్డుకోవడమే సవాలుగా తీసుకుని.. అడవిలోకి వెళుతున్నామంటే ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళతాం. ఎలాంటి సవాళ్లు ఎదురైనా కూడా భయపడం. పైగా ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు ఎదురైనా వారిని అదుపులోకి తీసుకునేందుకు అడవినంతా గాలిస్తాం. అడవిలో ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఉన్నా అడుగు మాత్రం వెనక్కి పడదు. – రెడ్డిశేఖర్, కానిస్టేబుల్, రాయచోటి -
Guvvalacheruvu Palakova: గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్!
సాక్షి రాయచోటి: గువ్వలచెరువు పాలకోవా.. నోటి తీపికే కాదు.. ఊరూరా గుర్తింపు పొందింది. రాష్ట్రాలే కాదు.. ఖండాతరాలు దాటి వెళుతోంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని అనేక మంది ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. అక్కడ కూడా గువ్వలచెరువు పాలకోవాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వందల ఏళ్ల కాలం నుంచి ఇక్కడివారు పాలకోవా తయారు చేస్తూ రుచిలో శుచిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గువ్వల చెరువు మెయిన్‌రోడ్డు మీద ఉండే 60 షాపులే కాకుండా గ్రామంలో పాలకోవాను తయారు చేసే బట్టీలు 15 వరకు ఉన్నాయి. కోవా అనగానే గువ్వలచెరువు నుంచి తెచ్చారా? అనడం చూస్తే ఆ కోవాకు ఎంతటి గుర్తింపు ఉందో అర్థమవుతుంది. ప్రతిరోజు ఐదు వేల లీటర్ల వరకు పాలు వస్తుండగా... 2000 కిలోల వరకు పాలకోవాను తయారు చేసి విక్రయిస్తుంటారు. గువ్వల చెరువు గ్రామంలో సుమారు 1500 మంది జనాభా ఉంది. అధికభాగం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారితోపాటు నాయుళ్లు, వడ్డెర, గిరిజన కుటుంబాలకు చెందిన వారు ఉన్నారు. గ్రామంలో తరతరాల నుంచి అంటే దాదాపు వందేళ్లకు పైగా కోవా తయారు చేస్తూ వస్తున్నారు. ప్రతినిత్యం 100 కుటుంబాల వారు కోవా తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా అంటే ఫేమస్ కావడంతో జీవనోపాధిని వదులుకోలేక కొనసాగిస్తున్నారు. తయారు చేసే సమయంలో కూడా అనేక రకాల కష్టాలు ఉన్నాయి. గోలాల్లో పాలు పోసి ఐదు గంటలపాటు వేడి చేసే సమయంలో విపరీలమైన వేడి పొగతో కళ్లు ఎర్రబారడం, నీళ్లు కారడం, మంటకు గురికావడం జరుగుతుంది. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపైన గ్రామం ఉండడంతో నిత్యం వేలాది వాహనాలు గువ్వల చెరువు మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. రాత్రి సమయంలో పదుల సంఖ్యలో లారీలో ఆగి ఉంటాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, మహరాష్ట్ర, పంజాబ్, కేరళ తదితర ప్రాంతాలకు వెళ్లే లారీల వారు పాలకోవాను ఆర్డర్లపై తీసుకెళుతుంటారు. అంతేకాకుండా కువైట్, సౌదీ అరేబియా, మస్కట్, ఖత్తర్, దుబాయ్, బెహరీన్ తదితర దేశాలకు కూడా బంధువులు, స్నేహితుల ద్వారా పాల కోవాను ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు. పాలకోవా సుదీర్ఘకాలంపాటు నిల్వ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇతర దేశానికి తరలిస్తుంటారు. దీని తయారీకి అవసరమైన పాలను తయారీదారులు ప్రత్యేకంగా ఆటోల ద్వారా పీలేరు, రాయచోటి, మదనపల్లె తదితర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. పాలకోవాను గ్రామంలో బట్టీల వద్ద తయారు చేసిన అనంతరం పెద్దపెద్ద పాత్రలలో రోడ్డుపై ఉన్న షాపులకు సరఫరా చేస్తున్నారు. గువ్వలచెరువు పాలకోవా రుచికరంగా మంచి గుర్తింపు ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకెళుతుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు 15 ఆటోల ద్వారా వివిధ జిల్లాలకు కూడా తీసుకెళ్లి విక్రయాలు సాగిస్తున్నారు. గతంలో ఈ మార్గంలో వెళుతున్న జాతీయ నేతలైన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతోపాటు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ సైతం గువ్వుల చెరువు పాలకోవా రుచిచూసి మెచ్చుకున్నట్లు పలువురు గ్రామస్తులు తెలియజేశారు. తయారీ విధానం పాలకోవాను తయారీదారులు ముందుగా పాలను తీసుకొచ్చి పెద్ద గోలాల్లో వేసిసుమారు ఐదు గంటలపాటు మరగబెడతారు. ఒకవైపు గరిటెతో కలియబెడుతూ చిక్కదనం కోసం పొంగు రాకుండా చూసుకుంటారు. పాలు బాగా మరిగిన తర్వాత చక్కెర, ఇతర పదార్థాలు వేసి మరో అరగంట నుంచి గంటపాటు వేడి చేస్తారు. తద్వారా పాలకోవా రూపుదిద్దుకుంటుంది. అవసరమైన కట్టెలనుకూడా సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తీసుకొస్తారు. గోలంలో పాలు ఉడికిస్తున్న ఇతని పేరు షేక్ జమాల్‌వలి. గువ్వలచెరువు గ్రామం. ఎన్నో ఏళ్ల నుంచి పాలకోవా తయారు చేస్తున్నారు. ఆర్డర్లను బట్టి పాలను ప్రత్యేకంగా ఆటోలో క్యాన్ల ద్వారా పీలేరు, మదనపల్లె, రాయచోటిలకు వెళ్లి తెచ్చుకుంటారు. ఈ ప్రాంతానికి చెందిన వారు అధికంగా ఇతర దేశాల్లో చాలా మంది ఉండడంతో అక్కడకి తీసుకెళ్లేందుకు ఆర్డర్లు ఇస్తుంటారు. ఇతర రాష్ట్రాలకు, ప్రొద్దుటూరు, కడప, మదనపల్లె, రాజంపేట, రాయచోటితోపాటు వివిధ ప్రాంతాల్లోని బేకరీలకు కూడా గువ్వలచెరువు నుంచే పాలకోవాను పంపిస్తుంటారు. (క్లిక్: వెయ్యేళ్ల చరిత్రకు పూర్వ వైభవం.. నాడు రాజుల నేతృత్వంలో.. నేడు సీఎం హోదాలో!) కల్తీ లేని కోవా కల్తీ లేకుండా నాణ్యమైన పాలకోవా అందిస్తాం. ఇక్కడి పాలకోవా మంచి రుచికరంగా ఉంటుంది. గ్రామంలో తయారు చేసి దుకాణాలకు ఆర్డర్లపై అందజేస్తారు. సుమారు 100 కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి సరుకు తీసుకెళుతుంటారు. – అబ్దుల్ మతిన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు వ్యాపారం బాగుంది పాలకోవాను నమ్ముకుని వ్యాపారం చేస్తున్నాం. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడ ఆగుతాయి. కార్లలో ప్రత్యేకంగా వచ్చి కోవాను తీసుకెళుతుంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీల డ్రైవర్లు, క్లీనర్లు కూడా తీసుకెళతారు. ప్రతిరోజు మా షాపులో రూ. 4 వేల వరకు వ్యాపారం జరుగుతుంది. పదిహేనేళ్ల నుంచి ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాం. – పఠాన్ అజీజ్‌ఖాన్, పాలకోవా వ్యాపారి, గువ్వలచెరువు -
లక్షల్లో వేతనాలు వదిలిన జంట.. ‘పంట’ భద్రులైంది!
ఆ దంపతులు ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ అర్హతతో మెట్రో నగరాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందారు. లక్షల్లో వేతనాలు తీసుకుంటూ ఆనందమయమైన జీవితం గడుపుతూ వచ్చారు. అయితే వారి మదిలో ఓ వినూత్న ఆలోచన మెదిలింది. వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను గమనించి తాము కూడా వ్యవసాయంలో ఏదో ఒక విజయాన్ని సాధించాలని భావించారు. అనుకున్నదే తడవుగా తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలి పల్లెబాట పట్టారు. పల్లెలో తమకున్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలు సాగు చేస్తూ ఆదాయం ఆర్జించడమే గాక, అందరినీ అబ్బుర పరుస్తున్నారు. దాదాపు 30 ఆవులను సైతం పెంచుతూ ప్రకృతి వ్యవసాయంలో పరవశించిపోతున్నారు. భర్త చేస్తున్న వ్యవ‘సాయం’లో భార్య సైతం భాగస్వామి అవుతూ భర్తకు తోడునీడగా ఉంటోంది. సాక్షి, రాయచోటి : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం గోపగుడిపల్లె పంచాయతీలోని నాగరాజుపల్లెకు చెందిన అశోక్‌రాజు, అపర్ణలు ఇంజినీరింగ్ పట్టభద్రులు. సుమారు పదేళ్లపాటు హైదరాబాదు, ఢిల్లీలోని పలు ప్రైవేటు కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశారు. అశోక్‌కు నెలకు రూ. 1.20 లక్షల వరకు వేతనం వచ్చేది. అపర్ణకు రూ. 60–70 వేల వరకు వచ్చేది. ఎప్పటినుంచో వ్యవసాయంపై మక్కువ ఉన్న వారు సెలవు రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలను వెళ్లి పరిశీలించేవారు. ఈ క్రమంలోనే అందరి కంటే భిన్నంగా వ్యవసాయం చేయాలన్న తలంపు వారిలో మొదలైంది. అనుకున్నదే తడవుగా ఉన్న ఉద్యోగాలను వదిలేసి సొంతూరి వైపు నడిచారు. అమ్మానాన్నల సమక్షంలో ఉన్న 25 ఎకరాల పొలంలో రకరకాల పంటలను వేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. 30 ఆవులను పెంచుతున్నారు. అరుదైన పంటల సాగు ప్రస్తుతం అశోక్‌రాజు తనకున్న పొలంలో అరుదైన పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల క్రితం డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలను ఎకరాలో సాగు చేశారు. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయం ఉంటుందని భావించి మొక్కలను పెంచుతున్నారు. డ్రాగన్‌ఫ్రూట్స్ వంగడాలను థాయిలాండ్ (తైవాన్) నుంచి దిగుమతి చేసుకుని పొలంలో ఒక్కొక్క రాతి స్తంభానికి నాలుగు మొక్కలను నాటారు. తోటలో 350 రాతి స్తంభాలు అంటే 1500 డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. రూ. 8 లక్షల వరకు డ్రాగన్ ఫ్రూట్స్ మీదనే ఖర్చు చేశారు. జూన్ నుంచి మొదలైతే డిసెంబరు వరకు ప్రతి 45 రోజులకు ఒక క్రాప్ వస్తూనే ఉంటుంది. కిలో రూ. 200 చొప్పున నెల్లూరు, హైదరాబాదు, తిరుపతి, మదనపల్లె, చిత్తూరు, పుత్తూరు, కడప ఇలా ఆర్డర్ల మీదనే సరఫరా చేస్తున్నారు. ఎవరికి అవసరమైనా బాక్సులో భద్రపరిచి బస్సుల ద్వారా రవాణా చేస్తున్నారు. నీరు లేకున్నా.. చెట్లు తట్టుకుని నిలబడతాయి. ఎప్పటికీ పంట కాస్తూనే ఉండడంతో మంచి ఆదాయం వస్తోంది. ఏడాదికి సుమారు 4–5 టన్నుల వరకు దిగుబడి వస్తుండగా, రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు టన్ను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం తోటలోని డ్రాగన్ ఫ్రూట్స్ అంట్లు తయారు చేసి ఒక్కొక్క మొక్క రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్క డ్రాగన్ ఫ్రూట్స్‌నే కాకుండా వరిలో కూడా వినూత్న వంగడాలు జీర సాబ, కుచిపటాలై, క్షేత్రాయ మహరాజ్, నవారు (షుగర్‌ను కంట్రోల్ చేసే వంగడంగా గుర్తింపు) లాంటివి సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయంతోనే వేరుశనగ, మామిడి, నన్నారి సాగుకు కూడా శ్రీకారం చుట్టారు. చెరకు వేసి.. బెల్లం తీసి.. అశోక్‌రాజు దంపతులు ప్రకృతి వ్యవసాయంతో చెరకు పంటను పండిస్తున్నారు. సుమారు రెండు ఎకరాల్లో చెరకు పండించి తర్వాత రెండు నెలలపాటు కటింగ్ చేస్తూ వస్తారు. ప్రతిరోజు తోట సమీపంలోనే ఇంటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గానుగ మిషన్ ద్వారా పాలు బయటికి తీసి పాకం పట్టి బెల్లం తయారు చేస్తున్నారు. రోజూ 200 కిలోలు చొప్పున తీస్తున్న బెల్లానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు తయారు చేసిన బెల్లంను నేరుగా వచ్చి కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు. వినూత్న పంటలతోపాటు వ్యవసాయంలోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న అశోక్‌రాజు దంపతులు 2021లో రైతు నేస్తం అవార్డును అప్పటి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఆనందంగా ఉంది వ్యవసాయంలో చాలా సంతృప్తి ఉంది. అంతకంటే ఆరోగ్యం, ఆనందం కూడా ఉన్నాయి. అందుకే అందరి కోసం ప్రకృతి వ్యవసాయం ద్వారా రకరకాల పంటలను పండిస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్స్ ద్వారా ఇప్పటికే లక్షల్లో ఆదాయం వచ్చింది. ఆర్డర్ల మీద వాటిని పంపిస్తుంటాము. అలాగే చెరకు ద్వారా బెల్లం కూడా తయారు చేస్తున్నాము. వరిలో కూడా అద్భుతమైన వంగడాలను తీసుకొచ్చి పండిస్తున్నాం. ఈసారి కొత్తగా నన్నారి సాగు కూడా మొదలెట్టాం. సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కంటే ప్రకృతి మధ్య చేసే వ్యవసాయంలో ఉన్న ఆనందమే వేరు. – ముప్పాళ్ల అశోక్‌రాజు, ప్రకృతి వ్యవసాయ రైతు, నాగరాజుపల్లె, రామాపురం మండలం -
సాంకేతిక తంత్రం...ఆధునిక యంత్రం
సాక్షి రాయచోటి: మారుతున్న కాలానికి తోడు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. ఎప్పటికప్పుడు వ్యవసాయంలో వస్తున్న నూతన విప్లవాత్మక మార్పులను రైతుల ముంగిటకు తెస్తూ అధిక దిగుడులకు కృషి చేస్తోంది. మరోవైపు రైతు భరోసా కేంద్రాలను పల్లె ముంగిటకు తెచ్చి ఎల్లప్పుడూ రైతులకు సలహాలు, సూచనలతోపాటు అవసరమైన సమస్యలు తీర్చేలా కొత్త ఒరవడి సృష్టించారు. ప్రస్తుతం వ్యవసాయ పద్ధతుల్లో సులువైన రీతులను కనుగొంటూ వ్యవసాయాన్ని పండుగ చేసేలా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రోన్లను రైతన్నలకు సబ్సిడీపై అందించి తోడ్పాటును ఇస్తున్నారు. కిసాన్ డ్రోన్లు పురుగు మందుల పిచికారీతోపాటు.. విత్తనాలు, ఎరువులు చల్లడం తదితర అనేక ఉపయోగాలు ఉన్నాయి. మండలానికి మూడు డ్రోన్లు అన్నమయ్య జిల్లాలో 30 మండలాలు ఉన్నాయి. ఒక్కొక్క మండలానికి మూడు డ్రోన్లను అందించాలని వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా ఐదుగురు రైతులు గ్రూపుగా ఏర్పడి దరఖాస్తు చేసుకోవాలి. అందులో చదువుకున్న వారు (టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ) ఒకరు ఉండాలి. ఎందుకంటే డ్రోన్ ఆపరేట్ చేసేందుకు చదువుకున్న వ్యక్తికి నెల రోజులపాటు శిక్షణ ఉంటుంది. ఆపరేట్ చేసే విధానం నేర్పించడంతోపాటు ప్రత్యేకంగా కోర్సుకు సంబంధించి లైసెన్స్ సర్టిఫికెట్ అందించనున్నారు. 2022–23 సంవత్సరానికి సంబంధించి అన్నమయ్య జిల్లాలో మండలానికి మూడు చొప్పున 90 డ్రోన్లు అందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. డ్రోన్‌తో అనేక ప్రయోజనాలు జిల్లాలో రైతన్నలకు డ్రోన్ల ద్వారా అనేక ప్రయోజనాలు అందనున్నాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా ఆపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చు. అలాగే కూలీల అవసరం కూడా తగ్గిపోతుంది. ఎత్తుగా పెరిగే అరటి, చీనీ, జామ, నేరేడు, సపోట తదితర పంటలకు మరింత అనువుగా ఉంటుంది. వర్షం కురిసినా.. తేమ ఉన్నా.. డ్రోన్‌తో పిచికారీ చేయడంగానీ.. చెట్లకు స్ప్రే సత్తువ అందించడానికి డ్రోన్ ప్రయోజనకరంగా మారనుంది. ఇంకా విత్తనం చల్లేందుకు కూడా అవకాశం ఉంటుంది. సబ్సిడీతో డ్రోన్ అందజేత జిల్లాకు కేటాయించిన డ్రోన్ యంత్రాల విషయంలో భారీగా సబ్సిడీ వర్తించనుంది. ఒక్కో డ్రోన్ విలువ దాదాపు రూ. 10 లక్షలుగా నిర్ణయించారు. అందులో 10 శాతం రైతుల వాటా చెల్లించాలి. మిగిలిన 90 శాతంలో 40 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. అంటే రూ. 10 లక్షలు విలువజేసే డ్రోన్ యంత్రంపై రూ. 4 లక్షల వరకు సబ్సిడీ ఉంటుంది. అదే డిగ్రీ, డిప్లొమా (అగ్రికల్చర్) చదివిన వారికి 50 శాతం మేర రాయితీని కల్పించారు. 164 ఆర్బీకేలలో ట్రాక్టర్లకు అవకాశం జిల్లాలో మొత్తం 30 మండలాల్లో 400 ఆర్బీకేలు ఉండగా 236 ఆర్బీకేల పరిధిలో రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లను అందించారు. అయితే పలు మండలాల్లోని 164 ఆర్బీకేల పరిధిలో సబ్సిడీపై అందించే ట్రాక్టర్లకు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో ప్రభుత్వం రైతులకు మరో అవకాశం కల్పించింది. రూ. 15 లక్షల విలువైన ట్రాక్టర్‌తోపాటు పరికరాలు అందించనున్నారు. రైతు వాటా 10 శా తం పోను 40 శాతం సబ్సిడీ ఉంటుంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో రైతులు ఐదుగురు గ్రూపుగా ఏర్పడి ఆర్బీకేల పరిధిలో దరఖాస్తు చేసుకోవాలి. మండలానికి మూడు చొప్పున జిల్లాకు 90 వరకు అందించేందుకు అవకాశం ఉంది. ఈనెల 31వ తేదీలోగా ఆర్బీకేలలో సంప్రదించాలి. ఒక్కొక్క డ్రోన్ విలువ రూ. 10 లక్షలు కాగా ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోంది. డీసీసీ బ్యాంకు ద్వారా డ్రోన్‌కు అందించే రుణాలను తిరిగి కంతుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. డ్రోన్‌తో రైతులకు చాలా ప్రయోజనం ఒనగూరనుంది. ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే జిల్లాకు సబ్సిడీపై అందించే ట్రాక్టర్లు, పరికరాలకు సంబంధించి కూడా 164 ఆర్బీకేల పరిధిలో రైతులు దరఖాస్తు చేసుకుంటే అర్హులకు అందించనున్నాం. – ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయశాఖాధికారి, రాయచోటి, అన్నమయ్య జిల్లా -
కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట
సాక్షి, రాయచోటి(అన్నమయ్య జిల్లా) : మన పూర్వీకుల కాలంలో బందిపోటు, గజదొంగలు, శత్రువులు గ్రామాలపై దాడి చేసి దోచుకొని వెళ్తుండేవారు. అప్పట్లో గ్రామాలను కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం యువత కర్రసాము విద్యను అభ్యసించి ప్రావీణ్యం పొందేవారు. ఇందుకు ప్రత్యేకంగా గురుకులాలు ఏర్పాటుచేసి కర్రసాములో శిక్షణ ఇచ్చే వారు. కర్రసాములో బాగా రాణించిన వారికి సంఘంలో ప్రత్యేక ఆదరణ లభించేంది. కాలానుగుణంగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడంతో కర్రసాము విద్య మరుగున పడిపోయింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఆనాటి కర్రసాములో ప్రావీణ్యం పొందిన వారు ఉన్నారు. పెళ్లిసందడి, జాతర్లలో, ఉరుసు ఉత్సవాలతోపాటు పండుగ, పబ్బాల సమయంలోనూ కర్రసాము తళుక్కుమంటోంది. పూర్వకాలం నుంచి వస్తున్న అనేక విద్యల్లో కర్రసాము అనేది విలువైనదిగా గ్రామీణ ప్రాంత జనం భావించేవారు. కాలంలో మార్పు.. కంప్యూటర్ యుగం రాకతో పాతకాలం సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. అయితే ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన పలువురు యువకులు, చిన్నారులు కర్రసాము పట్ల ఆసక్తి చూపడంతోపాటు నేర్చుకోవడం విశేషం. అలా గిర్రున తిప్పేస్తున్నారు.. అంతే..! మంగంపేట గ్రామస్తులు తమ పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో పునరావాస కాలనీ కోసం ఏర్పాటు చేసిన మైదానంలో గత కొంతకాలంగా ప్రతిరోజూ కర్రసాముపై శిక్షణ పొందుతూ వస్తున్నారు. వై.కోట గ్రామానికి చెందిన గురువు బాబు వేసవి సెలవుల నుంచి ప్రతి నిత్యం సాయంత్రం సమయంలో కర్రసాము నేర్పించారు. ఇదే వరుసలో గ్రామానికి చెందిన యువత కూడా ఆసక్తి చూపుతూ కర్రసాములో భాగంగా కట్టెను అలా గిర్రున తిప్పేస్తున్నారు. సెలవులలో ఇంటి వద్ద ఉన్న పిల్లలు కర్రసాముపై మక్కువ పెంచుకొని ప్రతి రోజూ సాధన చేయడంతో ఇప్పుడుతిప్పడంలో ఆరితేరిపోయారు. గ్రామానికి చెందిన దాదాపు 40 మంది పిల్లలు కర్రసాములో ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. మంగంపేట పునరావాస కాలనీకి చెందిన ఎన్ఆర్ఐ బాబాయి, అబ్బాయిలైన బంగారపు నరసింహులు, బంగారపు పీరయ్య గ్రామంలో యువకులు, పిల్లలకు కర్రసాము నేర్పించాలనే ఉద్దేశంతో వై.కోట గ్రామానికి చెందిన బాబు అనే గురువును ఏర్పాటు చేశారు. తొలుత పది మంది పిల్లలతో ప్రారంభించారు. అయితే కర్రసాములో యువకులు, పిల్లలు కొద్ది కాలంలోనే బాగా రాణిస్తుండంతో వీరిని చూసి మరికొంత మంది కర్రసాము నేర్చుకొనేందుకు ముందుకు వచ్చారు. ఏది ఎమైనా అంతరించి పోయిన కర్రసాము విద్యను మంగంపేట గ్రామస్తులు నేర్చుకుంటూ పది మందికి మళ్లీ పరిచయం చేస్తున్నారు. కర్ర తిప్పడం అప్పుడు కష్టం... ఇప్పుడు ఇష్టం కర్ర తిప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. గురువు సలహాలు, సూచనలతో వేళ్ల చేతితో కర్రను తిప్పడం సులువు కాదు. సాధన చేయగా తిప్పడం సులువుగా మారింది. తిప్పడంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. కట్టె తిప్పుతూ ముందుకు నడుస్తూ, కాళ్ల కింద నుంచి తిప్పడం లాంటి మెలకువలు నేర్చుకున్నాను. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వీలు దొరికినప్పుడల్లా అందరం కలిసి సాధన చేయడం ద్వారా కర్రసాములో ప్రావీణ్యత సాధించాం. – ఎం.రామ్‌చరణ్, 10వ తరగతి, మంగంపేట, అన్నమయ్య జిల్లా వేసవి విడిదిలో పిల్లలకు నేర్పించాలని అనుకొన్నాను నేను గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి వచ్చి ఇంటి వద్ద మా పిల్లలకు కర్రసాము నేర్పించాలని అనుకున్నాను. మరి కొంత మంది పిల్లలు ఆసక్తి చూపడంతో గురువును ఏర్పాటు చేసి ప్రతి రోజూ నేర్పిస్తున్నాను. – బంగారపు నరసింహులు, ఎన్ఆర్ఐ మంగంపేట, ఓబులవారిపల్లె శారీరకంగా, మానసికంగా ఉపయోగకరం దాదాపు నలభై మంది పిల్లలు కర్రసాము నేర్చుకున్నారు. కొద్దిరోజుల్లోనే మెలకువలు తెలుసుకొని బాగా రాణిస్తున్నారు. పిల్లలు నేర్చుకునే సమయంలో చాలా ఆసక్తిగా కనిపించారు. ప్రతి రోజూ సాయంత్రం సమయంలో నేర్చుకోవడంతో శారీరకంగా, మానసికంగా పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – బి.పీరయ్య, మంగంపేట, ఓబులవారిపల్లె. వేసవి సెలవుల్లో నేర్చుకున్నా ! నా పేరు ఎం.సుశాంత్. మంగంపేటలో నివాసముంటున్నాను. మక్కా స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో ఏదో ఒక విభాగంలో నైపుణ్యం పెంచుకుంటే బాగుంటుందని భావించి కర్రసాము నేర్చుకున్నాను. దాదాపు 45 రోజుల వ్యవధిలో కర్ర బాగా తిప్పుతు న్నాను. చదువుతోపాటు ఆత్మరక్షణకు సంబంధించిన కర్రసాములో నైపుణ్యం సాధించాను. (క్లిక్: అవధాన ఉద్దండుడు.. నరాల రామారెడ్డి) -
88 వేల మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించి..
రాయచోటిటౌన్: అక్రమ మద్యంపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత రెండు సంవత్సరాల కాలం నుంచి దాదాపు 472 కేసులు నమోదు చేసి పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి సమీపంలో ధ్వంసం చేశారు. అడిషనల్ ఎస్పీ రాజ్‌కమల్ కథనం మేరకు.. రెండు సంవత్సరాల కాల వ్యవధిలో అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లోని 17 పోలీస్స్టేషన్లలో 472 కేసులు నమోదు చేసి 88 వేల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.92 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారులు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. (క్లిక్: వింత ఆచారం.. సమాధులే దేవాలయాలు!) -
రాయచోటి.. ప్రత్యేకతల్లో మేటి
అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఆవిర్భవిస్తున్న రాయచోటి ప్రాంతానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్వం కడప జిల్లాలో ఉన్న తాలూకాలు ఇతర జిల్లాల్లో కలిశాయే తప్ప ఏవీ జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఆ అవకాశం రాయచోటికి మాత్రమే దక్కింది. కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి దీనిపై చర్చలు జరుగుతున్నాయి. పునర్విభజన అంటూ జరిగితే కడప, ప్రొద్దుటూరు కేంద్రాలుగా రెండు జిల్లాలు ఏర్పాటు అవుతాయని ఇంతకాలం అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ మహదవకాశం రాయచోటిని వరించింది. – కడప సెవెన్‌రోడ్స్ సరిహద్దులిలా.. కడప జిల్లా ఉదక మండలంగా పిలువబడే ఈ ప్రాంతం 14.0586 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 78.7519 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి సుమారు 1185 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంది. కొత్తగా ఆవిర్భవిస్తున్న అన్నమయ్య జిల్లాకు తూర్పున తిరుపతి, నెల్లూరు జిల్లాలు, ఉత్తరాన వైఎస్సార్ జిల్లా, పడమర పుట్టపర్తి, దక్షిణాన చిత్తూరు జిల్లాతోపాటు కర్నాటక సరిహద్దులుగా ఏర్పాటు కానున్నాయి. పరవశింపజేసే ప్రకృతి అందాలు రాయచోటి అంటే అందరికీ గుర్తుకొచ్చేది కొండలు, గుట్టలు. ఇక్కడ ఎటుచూసినా వివిధ ఆకృతులతో అందంగా ప్రకృతి తీర్చిదిద్దిన రాక్ గార్డెన్స్ చూపరులను ఆకట్టుకుంటాయి. ఉత్తరం, తూర్పు దిశన తూర్పు కనుమలు పెట్టని కోటలా ఉంటాయి. వీటిని ఈ ప్రాంతంలో పాలకొండలు లేదా శేషాచలం కొండలుగా పిలుస్తారు. దుప్పులు, జింకలు, మనుబోతులు, కోతులు, ఎలుగుబంట్లు, చిరుతలు, అడవి పందులు, నక్కలు, రేచు కుక్కలు తదితర వన్యమృగాలు సందడి చేస్తుంటాయి. ఔష«ధి వృక్షాల సౌరభాలతో, వనపుష్పాల సోయగాలతో ఈ కొండలు కనువిందు చేస్తాయి. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన, అత్యంత నాణ్యతగల ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నందున ఎర్రచందనానికి చైనా, జపాన్ తదితర గ్లోబల్ మార్కెట్లో విపరీత డిమాండ్ ఉంది. ఎర్రబంగారంగా పిలిచే ఈ సంపదను సక్రమంగా వినియోగించుకోగలిగితే పెద్ద ఎత్తున విదేశీ మాదక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. వీటిపై పరిశోధనలు సాగాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. నదుల సంగమం.. కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా రాయలపాడు కొండల్లో ఉద్భవించే బహుదానది ఇక్కడి సుండుపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. పుంగనూరు ప్రాంతంలోని ఆవులకొండలో జన్మించే పింఛా నది కూడా ఇదే మండలంలోకి ప్రవేశించి రాయవరం గ్రామ సమీపంలో బహుదాలో కలుస్తుంది. పింఛాపై సుండుపల్లె మండలంలో చిన్న ప్రాజెక్టు నిర్మించారు. బహుదాను నందలూరు ప్రాంతంలో చెయ్యేరుగా పిలుస్తారు. చిత్తూరు జిల్లా రెక్కలకొండలో జన్మించే మాండవ్యనది చిన్నమండెం మండలం కేశాపురం బంగ్లా వద్ద ప్రవేశించి ప్రవహిస్తుంది. గంగనేరు, ఎర్రవంకలాంటి చిన్న వాగులు ఇందులో కలుస్తాయి. మాండవ్యనది పాలకొండల సానువుల ద్వారా ప్రవహిస్తూ చెయ్యేరులో విలీనమవుతుంది. కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా నంది దుర్గపు ఉత్తరానగల స్కంధగిరిలో జన్మించే పాపాగ్ని నది చిత్తూరు, అనంతపురం జిల్లాలను దాటుకుని గాలివీడు మండలం వెలిగల్లు వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఇది సురభి వ్యాలీ, గండిక్షేత్రం మీదుగా సాగుతూ కమలాపురం సమీపంలో పెన్నాలో ఐక్యమవుతుంది. ఇవి కాకుండా గంగనేరు, కుషావతి లాంటి చిన్నచిన్న నదులు ఉన్నాయి. వీరబల్లి బేనీషాతో అంతర్జాతీయ ఖ్యాతి కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో అధికశాతం ఇసుకతో కూడిన ఎర్ర నేలలు ఉన్నాయి. ఇక్కడ అత్యధికశాతం వర్షాధారంపైనే పంటలు సాగు చేస్తారు. ప్రధానంగా వేరుశనగ, కంది, పెసర, అనప, మినుము, ఉలవ, అలసంద, జొన్న, ఆముదం పంటలు వేస్తారు. గతంలో సాగు చేస్తుండిన అరికలు, సామలు, బరిగలు, కొర్రలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. చెరువులు, కుంటలు, బోరు బావుల కింద వరి పంట సాగవుతుంది. తరుచూ కరువులతో వేరుశనగ దెబ్బతినడం వల్ల రైతులు ఉద్యాన పంటలవైపు దృష్టి సారిస్తున్నారు. చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లె మండలాల్లో మామిడి తోటలు అధికంగా ఉంటాయి. వీరబల్లి బేనీషాకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇక చిన్నమండెం, సంబేపల్లె మండలాల్లో టమాటా విస్తారంగా సాగవుతోంది. ఖనిజ సృష్టి.. ఆదాయంపై దృష్టి ఈ ప్రాంతంలో తక్కువ నాణ్యతగల గ్రానైట్ లభ్యమవుతుంది. దీనికి మార్కెట్లో అంతగా డిమాండ్ లేదు. ఇక్కడి కొండలు, గుట్టల నుంచి తవ్వే తెల్లరాయి ఇళ్ల నిర్మాణాల్లో ఉపయోగిస్తారు. దీని నుంచి తయారు చేసే కంకర రోడ్ల నిర్మాణాల్లో వాడుతారు. గాలివీడు మండలం వెలిగల్లు వద్ద బంగారు ఖనిజం ఉన్నట్లు గుర్తించారు. ఒక మెట్రిక్ టన్ను ఖనిజం వెలికితీస్తే అందులో తొమ్మిది గ్రాముల బంగారం లభ్యమైతే తవ్వకాలు లాభసాటిగా ఉంటాయి. అయితే ఇక్కడ తక్కువ మోతాదులో బంగారు లభ్యమవుతుండడం వల్ల ఆర్థికంగా లాభసాటి కాదని మైన్స్ అండ్ జియాలజీ అధికారులు అంటున్నారు. పలుగురాయి, పెల్స్పర్, ఫైరోఫిలైట్ నిక్షేపాలు ఇక్కడ ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలు.. ఈశాన్యం నుంచి వచ్చే గాలులతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో వాతావరణం పొడిగా, చల్లగా ఉంటుంది. మార్చి నుంచి వేసవి తీవ్రత పెరుగుతుంది. ఏప్రిల్, మే మాసాల్లో ఎండలు మండిపోతుంటాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేడిగాలులు, ఉక్కపోత అధికం. జూన్‌లో నైరుతి రుతు పవనాల ప్రవేశంతో వాతావరణం చల్లబడుతుంది. ప్రధానంగా ఈ రుతు పవనాల ద్వారానే వర్షపాతం నమోదవుతుంది. తుఫాన్లు సంభవిస్తే ఈశాన్యంలో వర్షాలు కురుస్తాయి. రాయచోటిలో సాధారణ వర్షపాతం 650 మిల్లీమీటర్లు. సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉండడం వల్ల క్రానికల్లీ ›డ్రౌట్ ప్రోన్ ఏరియా కింద ఈ ప్రాంతం ఉంది. -
చావనైనా చస్తాను..పెళ్లికి మాత్రం ఒప్పుకోను
మనసిచ్చాను.. అతన్నే మనువాడతానని ఆమె ‘ప్రేమ’ పట్టుబట్టింది.. వద్దమ్మా.. మా మాట విను అతడ్ని మరిచిపో పెద్దల ‘ప్రేమ’ నచ్చజెప్పింది.. కోరుకున్న ప్రేమ ఓ వైపు.. కన్న ప్రేమ మరోవైపు.. పంతం వీడని కూతురు.. పరువు కోసం కన్నవారు.. మాటా మాటా పెరిగింది.. కన్నోళ్ల కోపం కట్టలు తెగింది.. పెద్దోళ్ల పెళ్లికి ఒప్పుకో.. అన్న హుకుం జారీ చేశాడు.. చావనైనా చస్తాను.. ఒప్పుకోను.. చెల్లి జవాబిచ్చింది.. అమ్మా,నాన్న చూస్తుండగానే తోడబుట్టిన చెల్లి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రేమ పంతానికి.. పరువు పాకులాటకు జరిగిన ఘర్షణలో ఓ కుటుంబం రోడ్డున పడింది. తీవ్రగాయాలతో కూతురు ఆస్పత్రి పాలవగా.. కన్న తల్లిదండ్రులు, సోదరుడు కటకటాలపాలయ్యారు. రాయచోటి: ఆ కుటుంబంలో ప్రేమ మంటలు రేపింది. తాను ప్రేమించిన యువకుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పిన పాపానికి ఓ యువతిపై సొంత సోదరుడే పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన మంగళవారం రాత్రి రాయచోటి పట్టణంలో కలకలం రేపింది. రాయచోటి పట్టణం కొత్తపల్లెలో నివాసం ఉంటున్న పఠాన్ మహమ్మద్, మున్వర్ జాన్‌ల కుమార్తె తహసీన్‌కు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాను ఇమ్రాన్ అనే యువకుడిని ప్రేమించానని.. అతడినే పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పింది. అంతే.. కుటుంబ సభ్యుల్లో కోపం కట్టలు తెంచుకుంది. తాము సూచించిన యువకుడినే పెళ్లి చేసుకోవాలని గట్టిగా చెప్పారు. ఇందుకు ఆమె ససేమిరా.. అనడంతో ఆగ్రహించిన సోదరుడు ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. పక్కనే ఉన్న తల్లిదండ్రులు కన్నకూతురు మంటల్లో కాలుతున్నా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఆమె కేకలు విన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె మృత్యువుతో పోరాడుతోంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ప్రేమ పెళ్లి చేసుకున్న 13 రోజులకే... -
రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి
రాయచోటి: రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన ఓ కూరగాయల వ్యాపారి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చి మున్సిపల్ చైర్మన్‌గా అతడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకంగా మారింది. వివరాల్లోకి వెళితే.. రాయచోటికి చెందిన షేక్ బాష డిగ్రీ వరకు చదువుకున్నారు. ఉద్యోగం దొరక్కపోవటంతో గ్రామంలోనే కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో మంచి పేరున్న షేక్ భాషకు వైఎస్సార్ సీపీ మున్సిపాలిటీ ఎన్నికలలో కౌన్సిలర్ టికెట్ ఇచ్చింది. దీంతో ప్రజలు షేక్ బాషను గెలిపించారు. గురువారం రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా షేక్ బాష సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన జీవితంలో ఇలాంటి అవకాశం వస్తుందని ఊహించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వారికి అధిక శాతం సీట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ 86కు గాను, 84స్థానాలలో విజయకేతనం ఎగరవేసిందని అన్నారు. ఈ ఎన్నికలలో మహిళలకు 60.47 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ,వెనుకబడిన వర్గాల వారికి 78 శాతం పోస్టులను కేటాయించడం గొప్ప విషయమని కొనియాడారు. చదవండి: ఏపీ: కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీరే.. -
ఐపీఎల్‌లోకి కడప క్రికెటర్ ఎంట్రీ.. చెన్నై ట్వీట్
సాక్షి, రాయచోటి(కడప): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 టోర్నమెంట్లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడో యంగ్ క్రికెటర్. రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం బోనమల పంచాయతీ నాగూరువాండ్లపల్లెకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఐపీఎల్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. 22 ఏళ్ల హరిశంకర్ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. 2021 ఐపీఎల్ సీజన్లో భాగంగా గురువారం నిర్వహించిన వేలంలో ఈ యువకుడిని రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై ఫ్రాంచైజీ దక్కించుకుంది. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, ఫాప్ డుఫ్లెసిస్, శార్దుల్ ఠాకూర్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అరుదైన అవకాశం హరిశంకర్‌కి దక్కినట్టయింది. ఇక బాహుబలి వచ్చిన గడ్డ నుంచి హరిశంకర్ వచ్చాడని సీఎస్కే టీమ్ అభివర్ణించింది. ఈమేరకు సీఎస్కే యాజమాన్యం ట్వీట్ చేసింది. ఇది వరకు కడప జిల్లాకే చెందిన పైడికాల్వ విజయ్ కుమార్‌కు కూడా ఐపీఎల్లో ఆడే అవకాశం లభించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత కడప జిల్లా నుంచే మరో యంగ్ క్రికెటర్ హరిశంకర్ ఐపీఎల్లో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. కాగా హరిశంకర్‌కు ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాయచోటి ప్రతిష్టను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేయాలని ఆయన ఆకాక్షించారు. చదవండి: కాసుల వర్షం .. 20 లక్షలు టూ కోట్లు ఆసీస్ ఫాస్ట్ బౌలర్‌కు కోట్లాభిషేకం ఐపీఎల్ 2021 వేలం: ముంబైకి అర్జున్ టెండూల్కర్ LION ALERT! 🦁 From the land of #Bahubali we rope in Harishankar Reddy! #WhistlePodu #Yellove #SuperAuction 💛🦁 — Chennai Super Kings (@ChennaiIPL) February 18, 2021 -
‘ప్రతి క్షణం ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు’
సాక్షి, వైఎస్సార్ కడప : కరోనా వైరస్ మహమ్మారితో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఏ విధంగా వస్తుందో అలాగే కరోనా కూడా తొందరగానే నయమవుతుందని ఆయన పేర్కొన్నారు. రాయచోటి పట్టణం శివారులో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను బుధవారం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానంలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి ఒక్క పనిని క్షేత్ర స్థాయి నుంచి ఆలోచిస్తారన్నారు. అందులో భాగంగానే కోవిడ్ కేర్ సెంటర్లలో ఆహరం కూడా మెనూ ప్రకారం అందిస్తున్నారని అన్నారు. (రమేశ్ ఆస్పత్రి ఘటనపై ఎందుకు మాట్లాడవు బాబూ?) రాష్ట్రంలోని 30 వేలకు పైగా వైద్యుల పోస్టులను భర్తీ చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని ప్రశంసించారు. 13 మెడికల్ కళాశాలలను వైఎస్ జగన్ త్వరలో ప్రారంభించబోతున్నాడని తెలిపారు. ప్రతి మనిషికి మనోధైర్యం కల్పించేందుకు ముఖ్యమంత్రి ప్రతి క్షణం ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం ఉందని అయితే ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ ఉంటే తగ్గిపోతుంనన్నారు. వైరస్ పట్ల అనవసర భయాందోళనలు పెట్టుకోవద్దని, జాగ్రత్తలు వహిస్తూ, రోగనిరోధక శక్తి పెంచుకోంటే చాలని సూచించారు. (‘ఈ-రక్షాబంధన్’కు విశేష స్పందన) -
వైఎస్సార్ జిల్లాలో బరితెగించిన టీడీపీ నేతలు
సాక్షి, రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటిలో టీడీపీ నేతలు బరితెగించారు. మాజీ కౌన్సిలర్ హజ్రత్ కుమారులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు ఫారుక్, అతని గ్యాంగ్ హజ్రత్ కుమారులతో గొడవకు దిగి చంపుతామంటూ కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. తౌహీద్ అనే యువకుడి పరిస్థితి విషమం ఉంది. వీరిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా దాడికి పాల్పడిన ఫారూక్ గ్యాంగ్ గతంలో జరిగిన ఓ హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైతులకు రూ. 33 కోట్ల చెక్కు అందజేసిన చీఫ్ విప్
సాక్షి, వైఎస్సార్ కడప: నిత్యం రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమని... ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మండల అభివృద్ది కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 42500 మంది రైతులకు రూ. 33 కోట్ల మెగా చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం అందించిన ముఖ్యమంత్రి వెఎస్ జగన్ అన్నారు. 42500 మంది రైతుల ఖాతాలోకి మొత్తం రూ. 33 కోట్లు జమ అయినట్టు తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించి రైతుల మొహంలో సంతోషం కలిగేలా చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ('కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం') కరోనా వైరస్ వంటి విపత్తు కాలంలో రుపాయి ఆదాయం లేదని చాలా రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా తప్పించుకుంటునాయని ఆయన చెప్పారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం సున్న వడ్డీ పథకం, ఫీజు రీయంబర్స్మెంట్, పూర్తి బకాయిల చెల్లింపు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతున్నారని పేర్కొన్నారు. ఇంతవరకు రాయచోటి నియోజకవర్గమంతా గ్రీన్ జోన్లో ఉండేది. అయితే కోయంబేడు నుంచి వచ్చన వ్యక్తికి కరోనా పాజిటివ్ తెలిడంతో రెడ్‌జోన్‌కి వచ్చిందన్నారు. ఓ పక్క మహమ్మారిని ఎదుర్కొంటునే మరో పక్క పారదర్శకంగా ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కడా అవినీతి లేకుండా సువర్ణ పాలన అందిస్తున్నారని చీఫ్ విప్ అన్నారు. (విద్వేషాలు రగిల్చే దుష్ట ఆలోచన) కరోనా నివారణ, సహయక చర్యలపై చీఫ్ విప్ వీడియో కాన్ఫరెన్స్... కరోనా నివారణ సహయక చర్యలపై చీఫ్ విప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడారు. సంబేపల్లి ఘటనతో అధికారులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనా నియంత్రణపై అధికారులు బేషుగ్గా పనిచేస్తున్నారని వారిపై ప్రశంసల జల్లు కురిపించారు. అధికారులు మరింత ఉత్సహంతో పనిచేసి కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. వలస కార్మికులకు క్లియరెన్స్ వచ్చేంత వరకు నిత్యవసర సరుకులు అందించండని, బయట ప్రాంతాల నుంచి ఎవరూ వచ్చిన నేరుగా క్వారంటైన్‌కు పంపించాలని సూచించారు. -
తండ్రికి తగ్గ తనయుడు సీఎం వైఎస్ జగన్
-
కరోనా కలవరం.. చైనా నుంచి రాయచోటి విద్యార్థిని
కడప రూరల్: తాజాగా ‘కరోనా’ ప్రపంచాన్ని వణికిస్తోంది. పొరుగు దేశం చైనాలో తొలిసారి ఇది వెలుగు చూసింది. ఈ వ్యాధి దాదాపుగా ‘స్వైన్ ఫ్లూ’ లక్షణాలను కలిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చైనా, తైవాన్ తదితర ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల కొంతమంది సంక్రాంతికి వచ్చి వెళ్లిన వారు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం చైనాలో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఒక అమ్మాయి రాయచోటికి వచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అమెను మూడు రోజుల బయటకు రానీకుండా ఇంటిలోనే ఉంచారు. అమె ఆరోగ్య పరిస్ధితిని పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వ్యాధిపై ప్రభుత్వం ఇటీవల అమరావతిలో ఒక ‘నిఘా వ్యవస్ధ’ను ఏర్పాటు చేసింది. వైద్య ఆరోగ్య శాఖలను అప్పమత్తం చేసింది. చైనా తదితర ప్రాంతాల నుంచి వస్తే సమాచారం ఎయిర్ పోర్ట్ అధారిటీ ద్వారా ‘నిఘా వ్యవస్ధ’కు చేరుతుంది. సదరు వ్యక్తిని 28 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచుతారు. ఇప్పటికే ఇటు కేరళ, అటు హైదరాబాద్‌లో ‘కరోనా’ బాధితులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రజలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించడం మంచిదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమాసుందరి సూచించారు. -
రాయచోటి బహిరంగ సభలో సీఎం జగన్
-
ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారు
-
అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నారు
-
కృష్ణా, గోదావరి జలాలు తరలిస్తాం
-
రాయచోటిపై సీఎం జగన్ వరాల జల్లు
సాక్షి, వైఎస్సార్ : కృష్ణా, గోదావరి జలాలతో వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని కడప జిల్లా రాయచోటి, చిత్తూరు జిల్లాకు తరలిస్తామని సీఎం తెలిపారు. కనీసం సాగు,తాగు నీరు కూడా అందుబాటులో లేని రాయచోటి ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. గత ప్రభుత్వాలు కడప జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశాయని విమర్శించారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని నిధులు మంజూరు చేయమని అడిగితే.. పార్టీ మారాలని అన్నారని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతంగా ఇచ్చిన మాటకు కట్టుబడి రాయచోటిని అభివృద్ధి చేస్తామని సీఎం ప్రకటించారు. ఆరునెలల కూడా కాకముందే రెండువేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. (అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నారు) బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘తాగు, సాగు నీటి కోసం అల్లాడుతున్న నియోజకవర్గం రాయచోటి. రాయలసీమలో ఈ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉంది. దివంగత నేత వైఎస్సార్‌ను అత్యంత అభిమానించే ప్రాంత కూడా రాయచోటి. గతంలో కనీసం నీరు లేకపోవడంతో వైఎస్సార్ వెలగల్ల రిజర్వాయర్ నిర్మించారు. ఈ ప్రాంతానికి రింగురోడ్డు కూడా నిర్మించారు. ఆయన మరణం తరువాత అభివృద్ధి కుంటుపడింది. గత పదేళ్లలో జరిగింది శూన్యం. మీ కృషి ఫలితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా అభివృద్ధి ఫలాలు అందిస్తాం. నీటి కొరతను తీర్చేందుకు కాలేటివాగు రిజర్వాయర్ సామర్థ్యంను 1.2 టీఎంసీలకు పెంచుతాం. అక్కడి నుంచి నీటిని లక్కిరెడ్డి పల్లి, రామపురం మండలాలకు తరలిస్తాం. కృష్ణా నీటితో రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం అవుతుంది. రాయచోటితోపాటు చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా లబ్ధిపొందుతాయి. దీని కోసం 12వేల కోట్ల ఖర్చు చేస్తాం. (సీఎం జగన్ వేసే ప్రతీ అడుగు ప్రజలకోసమే..) రాయచోటిలో తాగునీరు, కాలువలు, డ్రైనేజికి రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నాం. స్థానికంగా ఉన్న 50 పడకల హాస్పిటల్‌ను 100 పడకలుగా మారుస్తాం. దీని కోసం రూ.23 కోట్లు కేటాయిస్తాం. గ్రామవార్డు, సచివాలయాల అభివృద్ధికి రూ.11 కోట్లు, సీసీరోడ్లకు రూ.11.55 కోట్లు. జిల్లాలో పోలీస్ కార్యాలయంకు రూ. 20 కోట్లు, డీఎస్పీ, పోలీస్ ఆఫీసులు నిర్మిస్తాం. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం.. రాయచోటి వక్ఫ్ బోర్డుకి సంబంధించి వివాదంగా ఉన్న నాలుగు ఎకరాల భూమిని ముస్లింలకు కేటాయిస్తాం.’ అని అన్నారు.గుంటూరు మీదుగా గోదావరి జలాలు.. శ్రీశైలంలో వరదలు వచ్చినవి. 800 టీఎంసీలు నీరు సముద్రంలో కలిశాయి. అయినా కూడా రాయలసీమ ప్రాజెక్టుల నిండలేదు. గండికోట సామర్థ్యం 23 టీఎంసీలు.. కేవలం 12 టీఎంసీలు మాత్రమే నింపగలిగాం. చిత్రావతి 10 టీఎంసీలకు కేవలం ఆరు టీఎంసీలు, బ్రహ్మంసాగర్ 17 టీఎంసీలకు కేవలం 8 మాత్రమే నింపగలిగాం. దానికి కారణం కాలువలు సరిగ్గాలేకపోవడం. వెడల్పు చేయకపోవడం. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్క్ష్యం చేశాయి. గత ప్రభుత్వం వీటిని పట్టించుకుని ఉండి ఉంటే నిండుకుండల్లా కనిపించేవి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల దశ, దిశ మారేవి. పోతిరెడ్డి పాడు, తెలుగుగంగా, సీసీ కేనాల్, గాలేరు నగరి సృజల శ్రవంతి సామర్ధ్యం పెంచుతాం. గోదావరి జలాలను గుంటూరు మీదుగా రాయలసీమకు తీసుకువచ్చే ప్రణాళిలకు తయారుచేస్తున్నాం. దీని కోసం 63 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాం’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ చేతికి ఎముక ఉందా?
సాక్షి, రాయచోటి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి నాయకుల వల్లే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. అడగకుండానే సీఎం జగన్ అన్నీ చేసేస్తున్నారని, ఆయన చేతికి ఎముక ఉందా అన్న అనుమానం కూడా కలుగుతోందని అన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామచంద్రయ్య మాట్లాడుతూ... అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తానన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు. తాను రెండుసార్లు మంత్రిగా పనిచేసినా రాయచోటిలో ఇంత అభివృద్ధి చేయలేకపోయానని, ఇందుకు సిగ్గు పడుతున్నానని ఆయన అన్నారు. ఆరు నెలల్లోనే చరిత్ర సృష్టించారు అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రిగా మొదటి ఆరు నెలల్లోనే వైఎస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. (చదవండి: రాయచోటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం) -
రాయచోటిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-
రాష్ట్రానికి శాశ్వత సీఎం జగనన్నే...
సాక్షి, రాయచోటి/వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేసే ప్రతీ అడుగు ప్రజల కోసమే అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ వంటి నాయకుడితో కలిసి పనిచేయడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ రాయచోటి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం జగన్‌ది ఉక్కు సంకల్పం అని వ్యాఖ్యానించారు. ‘రైతులకు అండగా నిలిచారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించారు. రూ. 23 కోట్లతో వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. రాయచోటి పట్టణాభివృద్ధికి రూ. 340 కోట్లు కేటాయించారు. మహిళ భద్రత కోసం దిశ చట్టం తీసుకువచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. సీఎం జగన్ వేసే ప్రతీ అడుగు ప్రజలకోసమే’ అని ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. నేనున్నానని హామీ ఇచ్చి.. రాయచోటి వెనుకబడిన ప్రాంతమని.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు.. ‘రాయచోటి నేనున్నా’ అని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు గాలేరు- నగరి నీటి తరలింపునకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని తెలిపారు. శాశ్వత సీఎం జగనన్నే.. గత ఐదేళ్లలో రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోని చంద్రబాబు... సిగ్గు లేకుండా ఈరోజు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఆనాడు ప్రాజెక్టులను పూర్తిచేసి ఉంటే మొన్నటి వరదల్లో అదనంగా 50 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే వాళ్లమని పేర్కొన్నారు. ఇక సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రాయచోటి అభివృద్ధికి రూ. 2 వేల కోట్లతో శంకుస్థాపన చేశారని తెలిపారు. చంద్రబాబు మరో జన్మ ఎత్తినా ముఖ్యమంత్రి కాలేరని.. ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి జగనన్నే అని అనిల్ వ్యాఖ్యానించారు. -
రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి జగనన్నే
-
వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధికి సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు
-
రాయచోటిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
సాక్షి, రాయచోటి: వైఎస్సార్ జిల్లా రాయచోటిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.1272 కోట్లతో జీఎన్ఎస్ఎస్ మెయిన్ కెనాల్ నుంచి కాలేటివాగు రిజర్వాయర్, అక్కడి నుంచి చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల చెరువులకు నీరందించి తద్వారా ఆయకట్టును స్థిరీకరించేందుకు ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రూ. 340.60 కోట్లతో రాయచోటిలో చేపట్టే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణాభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ. 23 కోట్లతో రాయచోటి ఆస్పత్రిని 50 నుంచి 100 పడకలకు విస్తరించే పనులకు, రూ.11.55 కోట్లతో రాయచోటి నియోజకవర్గంలో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవనాలకు, రూ. 15.52 కోట్లతో నియోజకవర్గంలో చేపట్టనున్న సీసీ రోడ్లు నిర్మాణానికి, రూ.31.7 కోట్లతో సీసీ డ్రెయిన్స్ , రూ.కోట్లతో రాయచోటి మండలంలో చేపట్టనున్న తాగునీటి పథకాలకు, రూ.18 కోట్లతో చేపట్టనునన మైనార్టీ రెసిడెన్సియల్ స్కూలు కాంప్లెక్స్, రూ. 20.95 కోట్లతో నిర్మించనున్న కడప డిస్ట్రిక్ట్ పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన శిలాఫలకాలను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, మంత్రులు ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ రాయచోటి శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు రాయచోటిలో సీఎం పర్యటన
-
ఈ నెల 24న రాయచోటిలో సీఎం వైఎస్ జగన పర్యటన
-
టీడీపీ భేటీకి ఎమ్మెల్సీల డుమ్మా
సాక్షి, కడప: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్ జిల్లా టీడీపీ నాయకులు షాక్ ఇచ్చారు. కడప నగరం రామాంజినేయపురంలోని సాయిశ్రీనివాస కళ్యాణ్ మండపంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా ముఖ్య నాయకులు, ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీలుగా గెలుపొందిన బిటెక్ రవి, శివనాథరెడ్డిలు సమావేశానికి హజరు కాలేదు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడైన శివనాథరెడ్డి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు ప్రొద్దుటూరు నేత వరదరాజులు రెడ్డి, బద్వేలు విజయమ్మ, సుగవసి ప్రసాద్ అలాగే రాయచోటి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు, ఆయన వర్గీయులు సైతం టీడీపీ సమీక్షా సమావేశానికి గైర్హాజరయ్యారు. -
గండి, రాయచోటి రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు
-
గ్రేడ్–1 మున్సిపాలిటీగా రాయచోటి
-
రాయచోటికి మహర్దశ
సాక్షి, రాయచోటి : కరవు కాటకాలకు కేరాఫ్‌గా ఉంటున్న రాయచోటి నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిం చింది. ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఈవిషయంలో చొరవ తీసుకుని తన నియోజకవర్గంలో అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారు. కరవును శాశ్వతంగా దూరం చేసేందుకు రూ.800 కోట్లతో గండికోట నుంచి రాయచోటికి కృష్ణా జలాలను అందించేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నారు. ఈ దిశగా అనుమతులు కూడా వచ్చాయి. ఇదే సందర్భంలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న రాయచోటి వాసుల రెండు కలలు నెరవేరుతున్నాయి. రాయచోటి గ్రేడ్–3 మున్సిపాలిటిని గ్రేడ్–1గా అప్గ్రేడు చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వంద పడకల స్థాయికి పెంచుతూ మరో జీఓ కూడా విడుదల అయింది. ఇప్పటివరకూ ఈ ఆస్పత్రి 50పడకల స్థాయిగా కొనసాగుతోంది. పడకలు పెంచాలనేది చాలా కాలంగా ప్రజల ఆకాంక్ష. ఈ రెండు జీఓలు ఒకేసారి విడుదల కావడంతో రాయచోటి ప్రజానీకం హర్షం వ్యక్తంచేస్తోంది. పోరాటాలు లేకుండానే.... నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా తొమ్మిది మండలాల ప్రజలకు వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. పడకలు సరిపడేవి కావు. వంద పడకల ఆసుపత్రిగా మార్చాలంటూ 10 సంవత్సరాలుగా పోరాటాలు నడిచాయి. అయినా గత ప్రభుత్వాలు స్పందించలేదు. ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం కంటి తుడుపుగా పడకలు పెంచుతున్నట్లు తప్పుడు ఉత్తర్వు జారీ చేసి అభాసుపాలైంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా వంద పడకల ఆసుపత్రిగాను, గ్రేడ్–1 మున్సిపాలిటీగా మారుస్తామన్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మూడు నెలల్లోనే ఈ హామీ కార్యరూపం దాల్చుతుండటంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది. గ్రేడ్ –1గా మున్సిపాలిటీ ఉన్నతీకరణ 2005లో పంచాయతీగా ఉన్న రాయచోటిని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రేడ్–3 మున్సిపాలిటీగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేడ్ –3 మున్సిపాలిటీలో 97మంది ఉద్యోగులుండాలి. కానీ 36 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తుండగా మిగిలిన పోస్టులు ఖాళీగా వున్నాయి. ఉద్యోగుల కొరతతో పాటు జనాభా అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చగలిగేలా నిధులు విడుదల కావడంలేదు. ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి గ్రేడ్–1గా పెంచేందుకు కృషి చేశారు. ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. మున్సిపల్‌మంత్రి బొత్ససత్యనారాయణతో పలుమార్లు మాట్లాడారు. ఫలితంగా గురువారం మున్సిపాలిటి అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు వెలువడ్డాయి. మున్సిపాలిటీ స్థాయి పెరగడం వల్ల కేంద్ర–రాష్ట్రప్రభుత్వాల నుండి వివిధరకాల పథకాల పేరిట నిధుల విడుదల పెరుగుతుంది. జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. లక్షరూపాయల వరకు అత్యవసర పనులను కమిషనరు నామినేషన్ పద్ధతిలో చేపట్టవచ్చు. రాయచోటి రూపురేఖలే మారతాయి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన ప్రేమాభిమానాల వల్ల రాయచోటి నియోజకవర్గ రూపురేఖలు మారుతాయి. రాయచోటి ఆసుపత్రిని వంద పడకల స్థాయిగా పెంచడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే మున్సిపాలిటీ కూడా గ్రేడ్–1గా మార్చేందుకు వీలు కల్పించారు. ఆసుపత్రికి అదనంగా 12 మంది వైద్యులతో పాటు 25 మంది సిబ్బంది సంఖ్య పెరగుతుంది. వైద్య సేవలూ విస్తృతమవుతాయి. రాయచోటిని విద్యా హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశాం. సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికలను తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. – ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి -
అ‘మాయ’కుడు.. ‘మంత్రులే టార్గెట్’
ఉన్నత చదవు చదివాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయినా సంతృప్తి చెందలేదు. డబ్బుపై వ్యామోహం పెరిగింది. వంచన మార్గం ఎంచుకున్నాడు. పెద్ద పెద్ద నాయకులనే టార్గెట్ చేశాడు. కొంత కాలం తన ఆటలు సాగాయి. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు హైటెక్ మోసగాడు. పేరు బాలాజీ నాయుడు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం వాసి ఇతను. సాక్షి, రాయచోటి(కడప): సమాజంలో మోసగించే వాళ్లు ఉన్నతంత కాలం మోసపోయే వాళ్లూ ఉంటారు. అలాంటి వారు పలు మార్గాల్లో అమాయకులను ఎంచుకుంటారు. చీటీలు, రియల్ ఎస్టేట్, ఒకటి కొంటే మరోక్కడి ఉచితం, రూ. పది వేలు దాస్తే చాలు మీకు రూ. లక్షలు ఇస్తాం ..అంటూ.ఇలా మోసం చేయడానికి ఎత్తులు వేస్తుంటారు. ఈ మాయ గాళ్ల ఉచ్చులో సామాన్యులు చిక్కుకుని నష్టపోతున్నారు. కానీ ఈ సారి బడా బాబుల వంతు వచ్చింది. మంత్రులు, నాయకులే టార్గెట్ చేశాడు ఓ ఘరానా మోసగాడు. ఒక ఫోన్ కాల్‌తో వాళ్ల జేబులకు చిల్లు వేశాడు. అది కూడా ఒకరా ఇద్దరా....వందమందికి పైగా నాయకులు ఆ బడా మాయగాడి చేతిలో మోసపోయారు. పైకి అమాయకుడిలా కనిపించే ఆ ఘరానా మోసగాడి పేరు తాట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి, అలియాస్ అనిల్‌కుమార్. తూర్పు గోదావరి పిఠాపురం. ఇతడు జేన్టీయూ కళాశాలలో బీటెక్ చదివి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. జీతం చాలదనుకొని తెలివితేటలను ఉపయోగించి గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పేరు గాంచిన ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసుకున్నాడు. సచివాలయం నుంచి ఫోన్ అంటూ.. ఒక్కొరికి ఫోన్ చేసి సార్ నేను సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు కోరినట్లుగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావాలంటే మాకు పర్సెంటెజ్ ఇవ్వాలి. ఒక ప్రైవేట్ వ్యక్తి ఖాతా ద్వారా డబ్బులు జమచేయమని చెబుతాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి రూ. కోట్లలో దండుకున్నాడు. వీరి జాబితాలో గత ప్రభుత్వంలో కడప జిల్లా మంత్రి కూడా ఆ జాబితాలో ఉండటం విశేషం. ఆయన కూడా లక్షలాది రూపాయాలు సమర్పించుకున్నాడు. కానీ బయటకు చెప్పుకోలేక గుట్టుచప్పుడు కాకుండా పోలీసుల ద్వారా ఆ మోసగాడిని పట్టుకోమ్మని పురమాయించారు. మాయగాడి ఉచ్చులో జిల్లా వాసులు 2017లో జిల్లాకు చెందిన ఓ మంత్రితో పాటు రాయచోటికి చెందిన ప్రజాప్రతినిధితో మారో ద్వితియ శ్రేణి నాయకుడుకి కూడా గాలం వేశాడు. వీరు కూడా ఈ మోసగాడికి భారీగా చెల్లించుకున్నారు. తరువాత ఇతనిపై పలు స్టేషన్లలో కేసులు నమోదు చేయడంతో ఉల్లిక్కి పడ్డారు. విషయం తెలిసి ఎవరికి చెప్పాలో తెలియక గుట్టుచప్పుడు కాకుండా రాయచోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది చదవండి : పీడీజేకు ఫోన్ చేసి దొరికిపోయిన నిందితుడి సోదరుడు ఎట్టకేలకు అరెస్ట్ అప్పటి నుంచి ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. నిందితుడిని పట్టుకోవడానికి అహర్నిశలు శ్రమించారు. చివరికి మంగళవారం రాత్రి తెల్లవారు జామున హైదరాబాద్‌లో అరెస్టు చేసి రాయచోటికి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం రాయచోటి కోర్టుకు హాజరు పెట్టారు. కోర్టు నిందిడికి రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు ఇవ్వడంతో మరో కంటికి కనిపించకుండా పోలీసులు హైదరాబాద్‌లోని చెంచ్ల్ గూడా జైల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. నిందితుడిని పట్టుకున్న వారిలో రాయచోటి ఎస్ఐ మహమ్మద్ రఫీ, అర్బన్ సీఐ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. -
అలీఖాన్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, రాయచోటి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ అఫ్జల్ అలీఖాన్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అలీఖాన్ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని, ఆదుకుంటామని హామినిచ్చారు. -
కలుషితాహారం: విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, వైఎస్సార్ కడప: రాయచోటి గిరిజన హాస్టల్లో కలుషిత అల్పాహారం వల్ల 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో నీరసించిన విద్యార్థులను అధికారులు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ఓటేశారు’
సాక్షి, కడప: ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలంతా ఓటింగ్‌కు తరలివచ్చారని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మార్పుకోరుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడి ఐదేళ్ళ పాలనలో దుర్మంగా వ్యవహరించారని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసి స్వప్రయోజనాల కోసం పనిచేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై ఉన్న ఆక్రోశంతోనే ప్రజలు చైతన్యవంతులై.. ఓటు హక్కుని వినియోగించుకున్నారని అభిప్రాయపడ్డారు. రానున్నవి మంచిరోజులని, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజాసంక్షేమంపై దృష్టి పెడతామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో టీడీపీ నేతలు అనేక అరాచకాలు సృష్టించారు. తమపై అసత్యకరమైన ఆరోపణలు సృష్టించారు. వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు. భయనక వాతవారణం సృష్టించారు. అంతటితో ఆగకుండా ఎల్లో మీడియా ద్వారా అసత్య రాతలు రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర దుర్బిక్ష పరిస్థితులున్నాయి. ప్రజలు త్రాగునీటి కోసం అలమటిస్తున్నారు. ఇటువంటి సమస్య రావడానికి టీడీపీయే కారణం. ప్రభుత్వ నిధులను టీడీపీ సొంత ప్రచారానికి ఉపయోగించుకుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ అభిమానులు తరలివచ్చారు. బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్, కువైట్ నుంచి ప్రవాసాంధ్రులు కష్టపడి వచ్చి ఓటును వినియోగించుకున్నారు. వారందరికీ కృతజ్ఞతలు. అధికారంలో లేకపోయిన, ఆర్థిక సమస్యలున్నా.. వైఎస్సార్సీపీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, వారందరి ఋణం తీర్చుకుంటాం’’ అని అన్నారు. -
కడప జిల్లా రాయచోటిలో అగ్ని ప్రమాదం..!
-
భారీ అగ్ని ప్రమాదం..!
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొబైల్ షాపులో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాయచోటి అగ్నిమాపక బృందం అరకొర నీటితో అక్కడికి వచ్చింది. మధ్యలోనే నీళ్లు లేక అగ్నిమాపక సిబ్బంది వెనుదిరిగింది. భవంతిలోని సామాగ్రి కాలి బూడిదైంది. లక్కిరెడ్డిపాలెం అగ్నిమాపక దళం వచ్చినా.. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బాధితులను పరామర్శించారు. బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
పసుపు–కుంకుమ పచ్చి మోసం
సాక్షి కడప : రాయచోటి ఎన్నికల ప్రచార సభలో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సుగువాసి పాలకొండ్రాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పాలకొండ్రాయుడు మాట్లాడుతూ పసుపు–కుంకుమ పథకం మొత్తం ఫ్రాడ్ అని వ్యాఖ్యానించడంతో చంద్రబాబు కంగుతిన్నారు. సంబేపల్లె మండలానికి మంజూరైన పసుపు–కుంకుమ నిధులను అసలైన లబ్ధిదారులెవరికీ ఇవ్వకుండా, కొంతమంది కాజేశారని పాలకొండ్రాయుడు వ్యాఖ్యానించారు. దాంతో చంద్రబాబు ఆయనను వారించే ప్రయత్నం చేశారు. మాసాపేట హైస్కూల్లో పబ్లిక్ పరీక్షల ప్రశ్నా పత్రాలను రూ.20 కోట్లకు అమ్ముకున్నారని, సంబంధిత బాధ్యులను కలెక్టరు కూడా సస్పెండ్ చేశారని చెబుతూ పాలకొండ్రాయుడు ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా, సభావేదికపై ఉన్న కొంతమంది నేతలు జోక్యం చేసుకుని మాట్లాడింది చాలు.. ముఖ్యమంత్రి మాట్లాడాలంటూ ఆయనను పక్కకు తీసుకెళ్లారు. కాగా పాలకొండ్రాయుడు ఈ విషయాలను వెల్లడిస్తున్న సమయంలో సభ మొత్తం చప్పట్లు, ఈలలతో మార్మోగిపోవడంతో సీఎం కొంత అసహనానికి గురయ్యారు. అనంతరం పాలకొండ్రాయుడి వద్దనుంచి మైకు లాక్కున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలకొండ్రాయుడు చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఓ పార్టీ కార్యకర్త సైతం హంద్రీ–నీవా నీటిని రాయచోటికి ఇవ్వకుండా కుప్పానికి తరలించుకుపోయారంటూ ప్రశ్నించడంతో, అక్కడున్న అధికార పార్టీ నాయకులు సర్ది చెప్పారు. అయితే సీఎం ఆ మాటలను విననట్లు నటిస్తూ ముందుకెళ్లిపోయారు. అభివృద్ధి, సంక్షేమంలో మనమే టాప్ దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధి, సంక్షేమంలో మనమే ముందున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందుగా విజయవాడ నుంచి కడపకు ప్రత్యేక విమానంలో వచ్చిన సీఎం..అక్కడి నుంచి హెలీకాఫ్టర్ ద్వారా బద్వేలు, రాయచోటి చేరుకుని ప్రసంగించారు. బంగారు గుడ్డు పెట్టే బాతు లాంటి హైదరాబాదును అప్పగిస్తే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, హైదరాబాదును అభివృద్ధి చేసింది తానేనని మరోమారు చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధిని చూసి కేసీఆర్ ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. అందుకే కేసీఆర్ ఇతరులతో కలిసి కుట్రలు చేస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఏం చేయలేరని పేర్కొన్నారు. తెలంగాణ నేతలు మాజోలికి వస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. ‘నా జీవితంలో హింస లేదు. ముఠాలను అణిచి వేసింది నేనే. నాపై అలిపిరిలో దాడి చేసినపుడు బాంబులకే భయపడలేదు. ఎవరికీ భయపడనని’ బాబు తెలిపారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం సహకరించలేదన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తా! ఇప్పటిæకే గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసి పట్టిసీమ ద్వారా నీటిని రాయలసీమకు తరలిస్తున్నామని, త్వరలో గోదావరి నీటిని పెన్నానదికి తీసుకొచ్చి కరువును జయించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే హంద్రీ–నీవా ద్వారా నీటిని చిత్తూరుకు అందించామని వివరించారు. రైతులకు సంబంధించి 4, 5 విడతల రుణమాఫీ సొమ్ము ఏప్రిల్ మొదటి వారంలో ఖాతాల్లో వేయనున్నట్లు సీఎం ప్రకటించారు. భగవంతుడు మంచిగా చూస్తే ఒక పెద్దన్నగా కానుకలు ఇస్తూనే ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. -
పరీక్షకు వెళుతూ.. మృత్యు ఒడికి
సాక్షి, రాయచోటి టౌన్ : చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలోని మల్లూరమ్మ తిరునాలకోసం బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వల్లూరు మండలం నాగిరెడ్డి గారిపల్లెకు చెందిన ఎం. ఓబుల్‌రెడ్డి (48) గురువారం రాత్రి జరిగే తిరునాలకోసం బుధవారం మల్లూరుకు వచ్చారు. అదేరోజున తన తోడల్లుడి కుమార్తె భార్గవి, అల్లుడు మహేశ్వరరెడ్డి కూడా గుర్రంకొండ నుంచి వచ్చారు. భార్గవి డిగ్రీఫైనల్ ఇయర్ చదువుతోంది. గురువారం రాయచోటిలో పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో భార్గవి భర్త ద్విచక్రవాహనం కావాలని, తన భార్యను పరీక్షకు తీసుకెళ్లాలని మామ ఓబుల్‌రెడ్డిని అడిగారు. అయితే తనకు కూడా రాయచోటిలో పని ఉందని, పరీక్ష కేంద్రానికి నేను తీసుకెళతానని చెప్పి కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. రాయచోటి సమీపంలోని ఏజీ గార్డెన్ మలుపువద్దకు రాగానే కడప నుంచి బెంగళూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఓబుల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భార్గవిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తి మృతి
సాక్షి, రాయచోటి టౌన్ : పట్టణంలో మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ పేలి తానిగుండ పెద్ద గుర్రన్న (35) మృతి చెందాడు. ఈ సంఘటనతో చుట్టు పక్కల వారు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నాకటలోని బళ్లారికి చెందిన తానిగుండ పెద్ద గుర్రన్న పాత రాయచోటికి చెందిన సుజాతను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. గుర్రన్నకు టీబీ జబ్బు ఉండటంతో ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో భార్య వైద్యం చేయిస్తోంది. సోమవారం వైద్యులను సంప్రదించగా జబ్బు నయం అయినట్లు చెప్పారు. ఈ క్రమంలో రెండు రోజులు పుట్టింటిలో ఉండి వెళ్లాలని అనుకొని ఇక్కడే ఆగిపోయారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అర్థరాత్రి దాటాక ఒక్క సారిగా గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. మంటల్లో నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో భార్య భర్తలకు నిప్పు అంటుకుంది. గుర్రన్నకు మంటలు ఎక్కువగా కావడంతో తలుపులు తెరుచుకొని వీధిలోకి దూసుకొచ్చాడు. భయాందోళనతో మిద్దిపైకి వెళ్లి వెనుక వైపు కిందకు దూకాడు. దీనిని ఎవరూ గమనించలేదు. స్థానికులు తలుపులు బద్ధలుకొడి ఇంట్లో ఉన్న మహిళను కాపాడారు. గుర్రన్న కోసం వెతకగా బలమైన గాయాలతో కిందపడి ఉన్నాడు. 108కు ఫోన చేసినా సమయానికి రాకపోవడంతో బాధితులను ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుర్రన్న మృతి చెందాడు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హత్యలు చేయడానికైనా చంద్రబాబు వెనకాడరు
-
అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు: వైఎస్ జగన్
-
అడుగడుగునా అన్యాయం.. అబద్ధాలు: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్: ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనతో విసిగిపోయిన ప్రతి పేదవాడికి అండగా తాను ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తన 3648 కి.మీటర్ల పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండెచప్పుడు విన్నానని, వారి సమస్యలను దగ్గరుండి చూశానని వైఎస్ జగన్ తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం, అబద్ధాలతో ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో సోమవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ప్రభుత్వానికి మంచి మనసుంటే ప్రతి ఇంటికీ మంచిచేయాలని కోరుకుంటుందని, టీడీపీ ప్రభుత్వానికి మాత్రం అదిలేదని మండిపడ్డారు. పేదవాడు సంతోషంగా బతకడానికి ఏం కావాలో తన పాదయాత్రలో తెలుసుకున్నానని, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటన్నింటిని అందిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డిని, రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్ కోరారు. ‘అన్నకు అవకాశం ఇద్దాం.. సీఎం చేద్దాం’ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్ చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చే మూడువేలు తీసుకుని మరోసారి మోసపోద్దని వైఎస్ జగన్ పేర్కొన్నారు. బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మహిళలు, రైతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్రలో చూశాను. వాటిని చూసి చలించిపోయాను. చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రతి పేదవాడి సమస్యలను నేను విన్నాను, చూశాను. వారందరికీ మాట ఇస్తున్న మీకు అండగా నేనున్నాను. గత ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తానని, పొదుపు రుణాలు మాఫీ చేస్తానని, ఉద్యోగాలు ఇస్తామని ఇలా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని హామీ ఇచ్చి.. దానిని విస్మరించి.. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను తెరిపించారు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నాలుగు విడతల్లో మద్యపానం పూర్తిగా నిషేధిస్తాం. చదవుకున్న వారికి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతికూడా ఇవ్వలేదు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డాం. చంద్రబాబు దానిని కూడా తాకట్టుపెట్టారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించేవి. టీడీపీ ప్రభుత్వం దానిని కూడా విస్మరించింది. రాబోయే 20 రోజుల్లో జరగబోయేది ఇదే : వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తాడు. మూటలతో కోట్లు తెస్తాడు. మన పార్టీకి చెందిన వారి ఓట్లను తొలగిస్తాడు. అవసరమయితే దొంగ ఓట్లు చేరుస్తాడు. తెగించి హత్యలు కూడా చేయిస్తాడు. ప్రజల సమాచారం కూడా చోరీచేస్తాడు. న్యాయానికి, అన్యాయానికి మధ్యం మధ్య యుద్ధం జరుగుతోంది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. వైఎస్సార్ పాలన కంటే గొప్ప పరిపాలనను అందిస్తా. మళ్లీ రాజన్న రాజ్యాన్ని నిర్మిస్తాం. మరో 20 రోజులు ఒపిక పట్టండి. మన ప్రభుత్వం ఏర్పడుతుంది. చదువుకు దూరమైన ప్రతి పిల్లవాడిని చదవిస్తాం. పిల్లల్ని బడికి పంపిన ప్రతి తల్లికి ఏడాదికి 15000 అందిస్తాం. డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాం. నవరత్నాలు ప్రతి ఒక్కరికి అందేలా పరిపాలన అందిస్తాం. ఈ ప్రాంతానికి చెందిన మైనార్టీ వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని గతంలో రాయచోటికి వచ్చిన సందర్భంగా మాట ఇచ్చాను. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీని నెరవేరుస్తాం’’ అని తెలిపారు. -
వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు
-
రాయచోటిలో టీడీపీకి షాక్
వైఎస్సార్ జిల్లా: రాయచోటి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాయచోటి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం ప్రకటించారు. సుబ్రమణ్యం గతంలో జెడ్పీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలసుబ్రమణ్యం పోటీ చేశారు. కార్యకర్తల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. రాయచోటి నుంచి బాల సుబ్రమణ్యం తండ్రి పాలకొండ్రాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాయచోటి అసెంబ్లీ టికెట్ రమేశ్ రెడ్డికి కేటాయించడమే బాలసుబ్రమణ్యం అసంతృప్తికి కారణమైంది. -
రాయచోటి టీడీపీలో టికెట్ల రగడ
-
వాడుకో.. వదిలేయ్!
ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వాడుకో.. వదిలేయ్’ సూత్రాన్ని మరోమారు అమలు పర్చారు. రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న సుగవాసి ప్రసాద్‌బాబును బైపాస్ చేశారు. మూడునెలల హోదా టీటీడీ సభ్యుడి పదవి కట్టబెట్టి.. కరివేపాకు అస్త్రం సంధించారు. తన సమకాలికుడైన మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుటుంబం పట్ల కంటితుడుపు చర్యలకు పాల్పడ్డారు. చాణక్యం ప్రదర్శించి మరో దగాకు తెరలేపారని రాయుడు అనుచరులు వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి కడప: ‘ఏరు దాటేంతవరకూ ఏటి మల్లన్న, ఏరుదాటాక బోడి మల్లన్న’ అన్నరీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది. అందుకు అనేక ఉదాహరణలు ప్రస్ఫుటం అయ్యాయి. ఎన్నికల్లో వాడుకొని వదిలేయడంలో తనను మించిన దిట్ట మరొకరు లేరని అనేక పర్యాయాలు ఆచరణలో ఆ పార్టీ నిరూపించింది. బద్వేల్లో ఎన్డి.విజయజ్యోతి, రైల్వేకోడూరులో ఓబిలి సుబ్బరామయ్య, కడపలో దుర్గాప్రసాద్, రాజంపేటలో మాజీ మంత్రి బ్రహ్మయ్య ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది తెరపైకి రానున్నారు. ఎన్నికల్లో వాడుకోవడం వదిలేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మించిన నాయకుడు లేరని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు. రాయుడు కుటుంబానికి భంగపాటు.. రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబం మరోమారు భంగపాటుకు గురైంది. చంద్రబాబుకు రాజకీయ సమకాలికుడైన పాలకొండ్రాయుడుకు ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఈమారు తన కుమారుడు ప్రసాద్‌బాబుకు రాయచోటి టికెట్ కట్టబెట్టాలని పలుమార్లు కోరారు. అదేవిషయాన్ని టీడీపీ అ«ధిష్టానానికి స్పష్టం చేశారు. కాగా టికెట్ రేసులో ఉన్న ప్రసాద్‌బాబును తప్పించేందుకు టీడీపీ బోర్డు మెంబర్ పదవి కట్టబెడుతూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం పట్టుమనిమూడు నెలలు గడువు మాత్రమే ఉంది. ఎన్నికల తర్వాత ‘రాజు ఎవరో.. రౌతు ఎవరో’ తెలియదు. మూడు నెలల పదవి అప్పగించి అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పిస్తారనని రాయుడు వర్గీయులు మండిపడుతున్నారు. టీడీపీ కోసం నిబద్ధతతో ఉన్న మమ్ముల్ని కాదని, ఆర్ఆర్ సోదరులకు ప్రాధాన్యత ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ప్రసాద్‌బాబు ఇమేజ్ అధికంగా ఉన్నా తప్పిస్తారనని సీఎం చర్యలపై మండిపడుతున్నారు. రాయచోటిలో రాయు డు కుటుంబం మద్దతు లేకుండా టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, ఈ వాస్తవాన్ని గ్రహించిన అధిష్టానం రాయుడు కుటుంబాన్ని వ్యూహాత్మకంగా తప్పిస్తున్నారని వారు వివరిస్తున్నారు. మరోవైపు టీడీపీలో బలిజలకు ప్రాధాన్యత లేదని బ్రోకర్లు పెత్తనం అధికమైందనీ, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కడపలో చేసిన ఆరోపణలు టీడీపీ చర్యలకు బలం చేకూరుస్తున్నాయి. వాడుకొని వదిలేయడంలో దిట్ట.. అవసరానికి వాడుకొని వదిలేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్టని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి, జయరాములుకు ఎర వేశారు. ఆమేరకు టీడీపీలో చేర్పించుకొని క్రియాశీలక రాజకీయాలల్లో ప్రధానంగా వాడుకున్నారు. ఎన్నికలు సమీపించే కొద్ది అభ్యర్థిత్వం వ్యవహారంలో మొండిచేయి ప్రదర్శిస్తున్నారు. మంత్రి ఆదికి టీడీపీ ఓడిపోయే ఎంపీ సీటు అయినా కట్టబెట్టనున్నారు. జయరాములకు ఎలాంటి భరోసా దక్కడం లేదని పలువురు వివరిస్తున్నారు. అవసరానికి ఎమ్మెల్యేలను వాడుకొని ఆపై విస్మరిస్తున్నారని, సీఎం ఎప్పుడు, ఎవర్నీ ఎలా వాడుకోవాలనే బాగా తెలిసిన వ్యక్తి అంటూ స్వయంగా ఆయా నేతలే అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ కంటిని అదే చేతితో పొడిచేందుకు పార్టీ ఫిరాయించిన మమ్మల్ని వాడుకొని ఎన్నికలు సమీపించే కొద్ది ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని వాపోతున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం చంద్రబాబు తన చాణక్యాన్ని తాజాగా సుగవాసీ ప్రసాద్‌బాబుపై ప్రదర్శించారని విశ్లేషకులు వివరిస్తున్నారు. -
కువైట్‌లో తెలుగువారి మృతి
కువైట్ సిటీ : కువైట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు మృతి చెందారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు రాయచోటికి చెందినవారు కాగామరొకరు కాకినాడ వాసిగా గుర్తించారు. వీరు కైరవాన్ ప్రాంతంలో ఇంటిపనులు చేసి జీవనం సాగిస్తున్నట్టుగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్యాయత్నం
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఓ వ్యక్తి తన భార్య కాపురానికి రాలేదని నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నాడు. పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కిందకు దింపి అతని ప్రాణాలను కాపాడారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమండె మండలం గుడిబండ గ్రామానికి చెందిన గణేష్ భార్య భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చేసింది. కాపురానికి రావడానికి భార్య నిరాకరించడంతో చేసేది లేక శనివారం రాత్రి సుమారు 100 అడుగుల ఎత్తు ఉన్న నీటి ట్యాంక్ ఎక్కాడు. భార్య కాపురానికి రాకపోతే పైనుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకొంటానని బెదిరించారు. ఈ విషయాన్ని కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్ సీఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. ఎంతో నేర్పుతో అతడికి నచ్చజెప్పి కిందకు దించారు. తరువాత భార్య భర్తలిద్దరికి సర్దిచెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. -
కన్నతండ్రే.. కర్కోటకుడయ్యాడు..
సాక్షి, కడప అర్బన్ : కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే దుర్మార్గుడిలా మారాడు.. కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులను ఆశ్రయిస్తే వారు పట్టించుకోలేదు. విధిలేని పరిస్థితుల్లో శనివారం తల్లి, బిడ్డ జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రాయచోటి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురిపై(16) కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం తెలుసుకున్న తల్లి బాధితురాలిని వెంట తీసుకుని రాయచోటి పోలీసు స్టేషన్‌కు వెళితే వారు ఫిర్యాదు స్వీకరించలేదు. ఈ నేపథ్యంలో వారు ఎస్పీని కలవగా స్పందించిన ఎస్పీ వెంటనే దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని రాయచోటి పోలీసులను ఆదేశించారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై కక్షగట్టారు
రాయచోటి అర్బన్ : విభజన హామీలను అమలుపర్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రప్రభుత్వంపై కక్ష గట్టారని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్‌రెడ్డి ఆరోపిం చారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డు ఆవరణంలో 1, 2, 31 వార్డుల్లో 4వ విడత నవనిర్మాణదీక్ష సభను నిర్వహించారు. గతంలో జరిగిన తిరుపతి సభలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా విభజన హామీలన్ని నెరవేరుస్తానంటూ ప్రధాని ప్రమాణం చేశారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్‌బాష, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర మురళి, ప్రభుత్వ న్యాయవాది జక్రియాబాష, కమిషనర్ శ్రీనివాసులు, డీఈఈ సుబ్రమణ్యం, హౌసింగ్ ఏఈ హరి పాల్గొన్నారు. రామాపురం : నవనిర్మాణ దీక్షల నిర్వహణ సమయాల్లో మార్పుచేసినట్టు మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నవనిర్మాణ దీక్ష నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తహసీల్దార్ అనూరాధ, ఎంపీడీఓ విజయరావు, ఎంపీడీఓ సూపరింటెండెంట్ అబ్దుల్‌రహీం పాల్గొన్నారు. నవనిర్మాణ దీక్షా.. పింఛన్ల పంపిణీనా ? సంబేపల్లె : నవనిర్మాణ దీక్షా.. పింఛన్లు పంపిణీ కార్యక్రమా అని పింఛన్‌దారులు వాపోతున్నారు. దీక్షలకు జనాలు రాక పోవడంతో కొత్తగా పింఛన్లు ఇస్తామంటూ అధికార పార్టీ నాయకులు, అధికారులు ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. శనివారం నాల్గో విడత నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. లక్కిరెడ్డిపల్లె: నవనిర్మాణ దీక్షలో అందరూ భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ రవికుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీరాములు నాయక్, సూపరింటెండెంట్ హైదర్ వల్లీ పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ జోరు
రాయచోటి రూరల్ : మన దేశంలో యువత నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారిలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఆట క్రికెట్. టి–20 మ్యాచులతో క్రికెట్‌కు మరింత క్రేజ్ పెరిగింది. దీనికి తోడు ఐపీఎల్ పేరుతో నిర్వహిస్తున్న అతి పెద్ద టి–20 క్రికెట్ టోర్నమెంట్‌కు ఆట పరంగా క్రేజ్‌తో పాటు బెట్టింగ్ పరంగా దేశ వ్యాప్తంగా విపరీతమైన మోజు పెరుగుతోంది. ఫోర్లు, సిక్సర్లతో ఐపీఎల్ జోరుగా కొనసాగుతుండటంతో, అంతే స్థాయిలో క్రికెట్‌బెట్టింగ్ కూడా సాగుతోంది. జిల్లా వ్యాప్తం గా ఎక్కడ చూసినా ఐపీఎల్ మాటే. ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు ఉండటంతో హోటళ్లు, ప్రధాన కూడలి ప్రాంతాలు, రెస్టారెంట్లు బుకీలకు వేదికగా మారాయి. అయితే జిల్లాలో ప్రొద్దుటూరు బెట్టింగ్‌లో మొదటి స్థానం సాధించగా, రాయచోటి రెండవ స్థానంలో ఉన్నట్లు పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వీటితో పాటు రాజంపేట, కడప, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో బెట్టింగ్‌కు పాల్పడే వారిలో ఎక్కువగా యువత, విద్యార్థులు ఉండటం విశేషం. పలు రకాలుగా బెట్టింగ్‌లు.! ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో బుకీలు, బెట్టింగ్ రాయుళ్లు వివిధ రకాలుగా నిమిషాలలో వేలాది రూపాయలు చేతులు మారే విధంగా బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఫలా నా ఓవర్లో ఇంత స్కోరు వస్తుంది, ఫలానా ఓవర్లో అవుట్ అవుతారు, ఓవర్ల వారిగా ఫోర్లు, సిక్సర్లు వస్తాయంటూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అలాగే మ్యాచ్ మొత్తానికి ఎవరు గెలుస్తారు, టాస్ వేయకముందే మొదటి ఫీల్డింగ్ చేసే వారో, లేక బ్యాటింగ్ చేసే వారో గెలుస్తారంటూ లక్షల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. అలాగే ప్రధాన ఆట గాళ్ల ఆటతీరుపైన కూడా బెట్టింగ్‌లు జరుపుతున్నారు. ఏదీ ఏమైనా ఎక్కువ శాతం కమీషన్లు తీసుకుని బుకీలు బెట్టింగ్‌కు పాల్పడుతూ యువతలో క్రికెట్‌పై ఉన్న క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల వలలో చిక్కుతున్న చేపలు, తప్పించుకుంటున్న తిమింగళాలు ప్రతి రోజు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ఉండటంతో జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాలతో బెట్టింగ్ రాయుళ్లపై , బుకీలపై , యువతపై పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కాకముందు నుంచి గతంలో బెట్టింగ్‌కు పాల్పడిన వారిని, కేసుల్లో ఉన్న వారిని పోలీస్ స్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కొత్తగా తయారైన బుకీలు, బెట్టింగ్ రాయుళ్లు పోలీసుల నిఘాను ఏమార్చేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి ఇక్కడి వారితో బెట్టింగ్‌లు కట్టించే విధంగా ముందుకు సాగుతున్నారు. దీంతో పోలీసులు మరింత చాకచక్యంగా ప్రవర్తించినప్పటికీ పోలీసులు వేస్తున్న వలలో చిన్నపాటి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న చేపలే చిక్కుతున్నాయి కానీ , పెద్ద పెద్ద తిమింగళాలు మాత్రం తప్పించుకుంటున్నాయని రాయచోటి పట్టణంలోనూ, ఇతర ప్రాంతాల్లో కూడా విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. రూ.100 కోట్లు బెట్టింగ్ జరిగే అవకాశం.! జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలు, మండల , గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెయ్యి రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా బెట్టింగ్ జరుగుతోంది. ఐపీఎల్ జరిగే నెల రోజులకు పైగా ప్రతి రోజు రూ.2 కోట్లు–2.5 కోట్ల నుంచి మొత్తం 100కోట్ల రూపాయల వరకు బెట్టింగ్‌ల రూపంలో చే తులు మారే అవకాశం ఉన్నట్లు కొం దరు బుకీలు, ప్రధాన బెట్టింగ్ రాయు ళ్లు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లపై 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి: అట్టాడ బాబూజీ, ఎస్పీ యువత చెడుమార్గంలోనకి వెళ్లకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. పోలీసు శాఖ నుంచి మేము కూడా అవగాహన కల్పించే విధంగా కృషి చేస్తున్నాం. షార్ట్ ఫిల్మ్ తీసి దాని ద్వారా అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం. బెట్టింగ్‌ను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత . బెట్టింగ్ నివారణకు ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో అనుమానాలు ఉన్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇస్తున్నాము. బెట్టింగ్ వల్ల చాలా వరకు కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంది. బెట్టింగ్పైన ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే ఆయా పోలీసు స్టేషన్లలో కానీ, 100 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలి. -
అక్కడేం జరుగుతోంది..!
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో అధికారుల కళ్లు రాయచోటి పరీక్షా కేంద్రాలపైనే ఉన్నాయి. గత కొనేళ్ల నుంచి ఇక్కడి కేంద్రాల్లో కాపీయింగ్ జోరుగా సాగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో పలు సంఘటనలు రుజువు కూడా అయ్యాయి. రాయచోటిలో పరీక్షల సమయానికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు సిండికేట్ అవుతాయని, పరీక్ష విధులకు వచ్చే సిబ్బంది, స్క్వాడ్ సభ్యులను మెయింటెయిన్ చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. వీటిని అరికట్టాలని డీఈఓ శైలజ ఈ సారి పది పరీక్షలకు డైట్ ప్రిన్సిపాల్ చంద్రయ్యను స్పెషల్ అధికారిగా నియమించారు. ఆయన ప్రతి సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. రాయచోటి పట్టణంలో 11 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.ఒక్కో సెంటర్‌కు ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశారు. అయినా అక్కడక్కడ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈనెల 15 నుంచి 20వ తేదీనాటికి పరీక్ష విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారే ఆరోపణలతో 8మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించగా... 21వ తేదీ బుధవారం ఒక్కరోజే 9 మంది ఇన్విజిలేటర్లు, ఇద్దరు చీప్ సూపరింటెండెంట్లు,, ఒక డిపార్టుమెంట్ అధికారిని పరీక్షల విధుల నుంచి తొలగించారు. మొత్తంగా పరీక్షలు జరిగిన ఆరు రోజుల్లో 20 మందిని తొలగించారంటే పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతోంది.విద్యాశాఖ అధికారులు పరీక్షల నిర్వహణకు మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. -
పేగుబంధం తెంచుకున్న కన్నతల్లి
-
గువ్వలచెరువు ఘాట్‌లో గుప్తనిధులు?
సాక్షి, రామాపురం : గువ్వల చెరువు ఘాట్.. ఈ పేరు వింటూనే అందరికీ దట్టమైన అడవి.. లోతైన లోయలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయంటూ ఓ ముఠా అన్వేషణ ప్రారంభించింది. గత రెండు నెలల నుంచి ఈ ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంత వాసులకు తెలియని గుప్తనిధులు పరాయి రాష్ట్రం వారికి ఎలా తెలిశాయా అని అందరూ చర్చించుకుంటున్నారు. గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద నుంచి దాదాపు 5 కిలోమీటర్ల పొడవైన గుహను గుర్తించారు. ఈ గుహలోకి మహారాష్ట్ర వ్యక్తులు దాదాపు రెండు కిలో మీటర్ల దూరం వెళ్లగా లోపల ఊపిరాడక వెంటనే బయటకు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఆక్సిజన్ సిలిండ్లతో గుహలోకి వెళ్లగా బ్రిటీష్ పాలకుల కాలం నాటి వజ్రాల పెట్టెలు ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. అయితే ఆ పెట్టెలను బయటకు తెచ్చేందుకు వీలుకాక అక్కడే వదిలేసి వచ్చారనే చర్చ జరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా గత వారం రోజులుగా ఆ గుహ చుట్టూ మహారాష్ట్ర వాసులు సంచరిస్తున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పోలీసు కేడర్‌లో ఉన్న ఓ అధికారి ఇక్కడి పోలీసులకు చేరవేసినట్లు సమాచారం. సోమవారం రాత్రి కూడా ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఉన్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ కృష్ణమూర్తిని వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించామన్నారు. అక్కడ గుహ మాత్రం ఉందని, అయితే అది ఎంత దూరం ఉంది, అక్కడ ఏమైనా ఉన్నాయా అనే దానిపై అధికారులతో సంప్రదించి చర్యలు చేపట్టనున్నామన్నారు. ఈ ప్రాంతంలో తమ సిబ్బంది గస్తీ కాస్తున్నారని, కొత్త వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
వీరబల్లి: ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా రాయచోటిలో జరిగింది. వీరబల్లి మండలం మట్లి వడ్డేపల్లెకు చెందిన నాగచాలం రాయచోటిలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల యాజమాన్యం మృతదేహాన్ని అతడి ఇంటికి గుట్టుచప్పుడు కాకుండా తరలించినట్లు సమాచారం. ఉదయం 7 గంటల ప్రాంతంలో విద్యార్థి ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు. కాగా, తమ కుటుంబం గురించి వార్తలు వస్తే తాము కూడా చనిపోతామని అక్కడికి వెళ్లిన మీడియాను మృతుడి కుటుంబీకులు బెదిరించారు. అధికారుల వాట్సప్‌లలో విషయం వెలుగు చూడడంతో రాయచోటి రూరల్ సీఐ రాజు. వీరబల్లి ఏఎస్సై మృతుని కుటుంబాన్ని విచారించారు. సీఐను వివరణ కోరేందుకు యత్నించగా వివరాలు ఇపుడే చెప్పలేమని వెళ్లిపోయారు. -
రాయచోటిలో విషాదం
వైఎస్సార్ జిల్లా : రాయచోటి పాలిటెక్నిక్ సమీపంలో ఓ కుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఆదివారం సెలవు కావడంతో రాయచోటి మండలం మాసాపేటకి చెందిన హర్ష, బాలాజీతో పాటు మరో నలుగురు ఈత కొట్టేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ హర్ష, బాలాజీ మునిగి చనిపోయారు. హర్ష(11) రాయచోటిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. బాలాజీ మాసాపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతులిద్దరినీ వెలికి తీశారు. హర్ష, బాలాజీ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు గండి..
-
రిజర్వాయర్‌కు గండి.. ముంచెత్తిన నీళ్లు
సాక్షి, రాయచోటి: వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలంలోని శ్రీనివాసపురం రిజర్వాయర్‌కు శనివారం అర్ధరాత్రి గండిపడింది. పంట పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ స్థంభాలు నేల వాలాయి. ప్రాజెక్టులోని నీరు ఖాళీ అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం వరకూ సహాయక చర్యలు చేపట్టేందుకు ఒక్క అధికారి కూడా సంఘటనా స్థలానికి రాకపోవడంతో రైతులు, స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రిజర్వాయర్ ఎగువ గేటు తెగిపోవడంతో భారీగా గండి ఏర్పడింది. పంట పొలాలను వరద నీరు ముంచెత్తడంతో అవి చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే సుమారు 50 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. విద్యుత్ స్థంభాలు సైతం నేలవాలాయి. రెండు నెలల క్రితం భారీ వర్షాలు రావడంతో ఓ మోస్తారు నీరు ప్రాజెక్టులో వచ్చి చేరింది. రిజర్వాయర్ కు గండి పడటంతో 10 చెరువులు, 15 కుంటలకు గండి పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చెరువుల సమీపాల్లో దాదాపు 1000 ఎకరాల పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం కూడా పొంచి ఉంది. రెవెన్యూ, నీటిపారుదల, విద్యుత్, వ్యవసాయ అధికారులు ఇంతవరకూ ఆ ప్రక్కకు తొంగిచూడలేదని స్థానికులు వాపోతున్నారు. హత్యాయత్నంలో భాగంగానే... తనపై హత్యా ప్రయత్నంలో భాగంగానే ప్రాజెక్టుకు అధికార పార్టీ నాయకులు గండి కొట్టారని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రామ లక్షుమమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. తాము చేస్తున్న అభివృధ్ధిని చూసి ఓర్వలేక తమపై ఈవిధంగా హత్యాయత్నానికి ఒడిగట్టారని, ప్రాజెక్టుకు గండి పడటం వెనుకఅధికార పార్టీ నాయకుల కుట్ర ఉందని ఆరోపించారు. భారీ వర్షాలు పడినా ఎప్పుడు గండి పడలేదని, ప్రాజెక్టుకు వర్షాలులేని సమయంలో గండి పడటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోందని వారు పేర్కొన్నారు. -
రాయచోటిలో తప్పిన పెనుప్రమాదం
రాయచోటి: వైఎస్సార్‌జిల్లా రాయచోటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇటీవల రంజాన్ సందర్భంగా పట్టణం నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ నాయకులు షాది ముబారక్ కార్యక్రమానికి సంబంధించి 25X40 అడుగుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ బుధవారం అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. విద్యుత్ వైర్లు అడ్డుగా ఉండడంతో అది వాటిపై పడింది. ఆ సమయంలో బస్సు షెల్టర్ వద్ద ఉన్న ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అది వారిపై పడి ఉంటే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైర్లు తెగిపడిపోవడంతో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుకు మున్సిపల్ అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. మున్సిపల్ సిబ్బంది సహకారంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించే చర్యలు చేపట్టారు. -
గిరిపుత్రిక కల్యాణ పథకానికి మంగళం.?
ప్రజలకు లబ్ధి చేకూర్చే ఒక్కో పథకానికి ప్రభుత్వం మంగళం పాడుతున్నట్లు ఉంది. ఇప్పటికే ‘బంగారుతల్లి’ పథకానికి టీడీపీ ప్రభుత్వం వీడ్కోలు పలికింది. తాజాగా గిరిపుత్రుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గిరిపుత్రిక కల్యాణ పథకాన్నిఅటకెక్కించే దిశగా సన్నాహాలు చేస్తోంది. రాయచోటి రూరల్ : గిరిజనుల సంక్షేమమే ధ్యేయం అంటూ పలు బహిరంగ సభల్లో సీఎం చంద్రబాబు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే వారికోసం ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తూ వారికి తీరని ఆవేదనను మిగుల్చుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజనుల ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి, వారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ‘గిరిపుత్రిక కల్యాణ పథకం’ పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆడపిల్ల వివాహ ఖర్చులకు రూ. 50 వేలను ప్రభుత్వం అందజేస్తుంది. అయితే ఈ పథకం ప్రారంభమై మూడేళ్లు గడిచినా ఇంత వరకు పథకం గురించి తమకేమాత్రం తెలియదని అధిక శాతం మంది గిరిజనులు చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం దరఖాస్తు ఇలా: పథకం ప్రకారం 18 ఏళ్లు వయసు నిండి, సంవత్సర ఆదా యం రూ.2.50 లక్షల లోపు ఉండాలి. కుల, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో 01.04.2015 లోపు వివాహం అయిన గిరిజన అమ్మాయిల పేరుతో తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. జిల్లా వ్యాప్తంగా లక్షకు పైబడి ఎరుక, యానాది, సుగాలి జనాభా ఉన్నారు. సుమారు 20 వేల కుటుంబాలు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నా, ఎలాంటి ప్రోత్సాహకం అందడంలేదని సమాచారం. లబ్ధిదారులకు ఈ పథకంపై అవగాహన కల్పించి, దరఖాస్తు చేసుకున్న వారికి లబ్ధి చేకూర్చాలని అర్హులు కోరుతున్నారు. పథకం ఉన్నట్లు తెలీదు.. గిరిజనుల పిల్లల పెళ్లిళ్ల కోసం రూ.50 వేలు ప్రభుత్వం ఇస్తుందని.. మా కోసం ఓ పథకం ఉందని ఇప్పటికీ తెలీదు. ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి మాలాంటి నిరుపేదలకు పథకాన్ని అమలు చేసి ఆదుకోవాలి. – సేలం రెడ్డెమ్మ, ఎస్టీ కాలనీ, మోటకట్ల పూట గడవడమే కష్టంగా ఉంది మాలాంటి కుటుంబాలకు పూట గడవడం కూడా కష్టంగా ఉంది. అలాంటి మేము రూ. లక్షలు వెచ్చించి ఆడపిల్లల పెళ్లి చేయలేకపోతున్నాం. ప్రభుత్వం కొంతలో కొంత రూ.50వేలను అందజేస్తే ఉపశమనంగా ఉంటుంది. అధి కారులు ఇంతవరకూ ఇటువైపు వచ్చి పథకం గురించి చెప్పనే లేదు. – ఎస్ నాగరత్నమ్మ, ఎస్టీ కాలనీ, మోటకట్ల -
వైఎస్సార్ జిల్లాలో భారీ వర్షం..
-
రాయచోటిలో వైఎస్ఆర్కు ఘన నివాళి
-
ఇద్దరు దొంగలు.. ఒకడు దొరికాడు.. మరొకడు..?
రాయచోటిటౌన్: దొంగతనానికి వచ్చాడు... ఫ్లాన్ ఫెయిల్ కావడంతో పోలీసులకు దొరికిపోయాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి పట్టణంలోని దాదేసాహెబ్ వీధిలో ఇద్దరు దొంగతనానికి వచ్చారు. అటు ఇటు తిరుగుతూ స్థానికుల కంటబడ్డారు. వీరిని పట్టుకోవడానికి స్థానికులు చేసిన ప్రయత్నంలో ఒకరు పారిపోయాడు. ఒక వ్యక్తి మాత్రం దొరికాడు. అతనిని పోలీసులకు అప్పగించారు. అర్ధరాత్రి సమయంలో రెండోవ్యక్తి పక్కనే ఉన్న కోనేరు ( వీరభద్రస్వామి) పక్కనుంచే పారిపోయాడు. అయితే అదే సమయంలో స్థానికులు కోనేరులో పడిపోయాడని చెప్పడంతో తెల్లవారి నుంచి ఆ వ్యక్తి కోసం పోలీసులతో పాటు ఫైర్ స్టేషన్ సిబ్బందితో కలసి తీవ్రంగా గాలింపు చేపట్టారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే దొరికిన వ్యక్తి మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ వ్యక్తి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఒక సారి తనది తమిళనాడని.. మరో సారి కర్నాటక అని.. చివరిగా తనది గాలివీడు అంటూ పలు రకాలుగా సమాధానాలు చెప్పడంతో ఆ వ్యక్తి దొంగా లేక మతిస్థిమితం లేక ఇలా మాట్లాడుతున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. ఆ దొంగ నిజాలు చెప్పితే తప్ప అసలు వారు దొంగలా... కాదా అనే విషయాలు వెలుగులోకి వస్తాయి. -
పిచ్చి కుక్క స్వైర విహారం
రాయచోటి రూరల్: పెమ్మాడపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని గరుగుపల్లె, వడ్డెపల్లె, కొండోళ్లపల్లె గ్రామాలకు చెందిన 30 మందిపై పిచ్చికుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు కొండోళ్లపల్లెలో ఆరుబయట నిద్రిస్తున్న 10 మందిని ఆ కుక్క కరిచింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో గరుగుపల్లె, వడ్డెపల్లెలో 20 మందిపై దాడి చేసింది. అలాగే ఆ మూడు గ్రామాల్లో 20 పశువులను కూడా కరిచిందని స్థానికులు తెలిపారు. గరుగుపల్లెకు చెందిన లక్ష్మీదేవి నుదుటున, వెంకటమ్మ మోచేతి పైన తీవ్ర గాయాలయ్యాయి. వీరితోపాటు గాయపడిన వారిలో రెడ్డెమ్మ, నాగులమ్మ , సిద్దన్న, ఓబులమ్మ, అంజలి , నాగసిద్దయ్య, జ్యోతి, అప్పన్న, పాపులమ్మ, ఆంజినేయులు, మల్లికార్జున తదితరులు ఉన్నారు. వారిని 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన 10 మందిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అధికారులు చర్యలు తీసుకుని పిచ్చికుక్కలను అదుపు చేయాలని బాధితులు, స్థానికులు కోరుతున్నారు. -
హత్య కేసులో నలుగురు అరెస్టు
రాయచోటి : స్థానిక కొత్తపల్లెలోని అలీమాబాద్‌వీధిలో నివాసం ఉన్న పఠాన్ ఫయాజ్‌ఖాన్ అనే వ్యక్తి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను సోమవారం సాయంత్రం అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. గత నెల 6వ తేదీన ఫయాజ్‌ఖాన్‌ను షేక్.యూనస్, షేక్.ముష్రఫ్, షేక్.కమాల్‌బాషా, షేక్. మహమ్మద్‌అలీలు కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అలీమాబాద్‌వీధికి చెందిన యూనస్, ముష్రఫ్‌లు జులాయిగా తిరుగుతూ మహిళలను వేధించేవారు. అలాగే హతుడు ఫయాజ్‌ఖాన్ బంధువులకు చెందిన మహిళలను కూడా వేధించారు. ఈ విషయం తెలిసిన ఫయాజ్‌ఖాన్ వారిని మందలించాడు. దీనిని అవమానంగా భావించిన యూనస్, ముష్రఫ్‌లు కమాల్‌బాష, మహమ్మద్‌అలీలతో కలిసి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఫయాజ్‌ఖాన్‌ను తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ కేసులో నిందితులు నలుగురిని సోమవారం మదనపల్లె మార్గంలోని రింగు రోడ్డు వద్ద అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాయచోటి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు రమేష్‌బాబు, మైనుద్దీన్, మహమ్మద్‌రఫీ పాల్గొన్నారు. -
హత్యకేసులో నలుగురు అరెస్టు
రాయచోటి : స్థానిక కొత్తపల్లెలోని అలీమాబాద్‌వీధిలో నివాసం ఉన్న పఠాన్ ఫయాజ్‌ఖాన్ అనే వ్యక్తి హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను సోమవారం సాయంత్రం అర్బన్ సీఐ మహేశ్వర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. గత నెల 6వ తేదీన ఫయాజ్‌ఖాన్‌ను షేక్.యూనస్, షేక్.ముష్రఫ్, షేక్.కమాల్‌బాషా, షేక్. మహమ్మద్‌అలీలు కలిసి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అలీమాబాద్‌వీధికి చెందిన యూనస్, ముష్రఫ్‌లు జులాయిగా తిరుగుతూ మహిళలను వేధించేవారు. అలాగే హతుడు ఫయాజ్‌ఖాన్ బంధువులకు చెందిన మహిళలను కూడా వేధించారు. ఈ విషయం తెలిసిన ఫయాజ్‌ఖాన్ వారిని మందలించాడు. దీనిని అవమానంగా భావించిన యూనస్, ముష్రఫ్‌లు కమాల్‌బాష, మహమ్మద్‌అలీలతో కలిసి కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఫయాజ్‌ఖాన్‌ను తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ కేసులో నిందితులు నలుగురిని సోమవారం మదనపల్లె మార్గంలోని రింగు రోడ్డు వద్ద అరెస్టు చేశారు. వారు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రాయచోటి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఐలు రమేష్‌బాబు, మైనుద్దీన్, మహమ్మద్‌రఫీ పాల్గొన్నారు.