రాయచోటి, న్యూస్‌లైన్ : వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషిచేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎస్పీడీసీఎల్ డీఈ కార్యాలయంలో ఆయన డివిజన్ పరిధిలోని డీఈ, ఏడీ, ఏఈ తదితరులతో విద్యుత్‌సరఫరాపై సమీక్ష నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూస్తామన్నారు. ముఖ్యంగా బకాయిల వసూలుపై తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి తగు సలహాలు ఇచ్చామన్నారు. నెలాఖరులోపు వ్యవసాయ కనెక్షన్లు ఇస్తామన్నారు. డివిజన్ పరిధిలో రూ..10 కోట్లతో నూతనంగా 7 సబ్‌స్టేషన్‌లు నిర్మింప చేస్తుండగా ఇప్పటికే నాలుగింటి నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఎస్పీడీసీఎల్ ైడె రెక్టర్ రాంసింగ్, జిల్లా ఎస్‌ఈ గంగయ్య, రాయచోటి డీఈ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్ల నిర్మాణానికి
అనుమతులివ్వండి..
రాయచోటిడివిజన్ పరిధిలో మరో రెండు నూతన సబ్ స్టేషన్‌ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.వై.దొర కు ఎమ్మెల్యే గడి కోట శ్రీకాంత్‌రెడ్డి విన్నవించారు.
పట్టణ శివార్లలోని రాయుడు కాలనీలో గల దళితుల ఇళ్ళకు బిల్లులు చెల్లి ంచలేదన్న కారణంగా విద్యుత్ కనెక్షన్‌లు తొలగించిన విషయాన్ని కూడా సీఎండీ దృష్టికి తీసుకెళ్ళారు. మాజీ జడ్పీటిసి సభ్యుడు సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.
అంజన్న సన్నిధిలో సీఎండీ
చక్రాయపేట: గండిలో వెలసిన గండి వీరాంజనేయుడిని మంగళవారం ట్రాన్స్‌కో సీఎండీ హెచ్ వై దొర, డెరైక్టర్ రాం సింగ్‌లు సందర్శించు కొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి
Published Wed, Dec 4 2013 3:10 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement