
సాక్షి, వైఎస్సార్ కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు, రాయచోటి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ అఫ్జల్ అలీఖాన్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలీఖాన్ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని, ఆదుకుంటామని హామినిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment