రాయచోటి: వైఎస్సార్‌జిల్లా రాయచోటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇటీవల రంజాన్ సందర్భంగా పట్టణం నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ నాయకులు షాది ముబారక్ కార్యక్రమానికి సంబంధించి 25X40 అడుగుల ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ బుధవారం అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. విద్యుత్ వైర్లు అడ్డుగా ఉండడంతో అది వాటిపై పడింది. ఆ సమయంలో బస్సు షెల్టర్ వద్ద ఉన్న ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అది వారిపై పడి ఉంటే పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
వైర్లు తెగిపడిపోవడంతో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ ఫ్లెక్సీ ఏర్పాటుకు మున్సిపల్ అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. మున్సిపల్ సిబ్బంది సహకారంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించే చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment