వైఎస్సార్ జిల్లా (రాయచోటి) : వైఎస్సార్ జిల్లా రాయచోటి మండలం సంజీవనగర్‌లో శనివారం ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి అమరేశ్వర్(24) అనే యువకుడు మృతిచెందాడు. విద్యుత్ స్తంభంపై విధులు నిర్వర్తిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొన ఊపిరితో ఉన్న అమరేశ్వర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు.
తల్లిదండ్రులకు అమరేశ్వర్ ఒక్కడే కుమారుడు. డిగ్రీ మధ్యలో ఆపేసి చిన్న చిన్న పనులకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే లైన్మెన్కు సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అమరేశ్వర్ మృతితో ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి.
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
Published Sat, Jul 25 2015 7:06 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM
Advertisement