electrocution
-
యువకుల ప్రాణం తీసిన ఫ్లెక్సీలు
కొల్చారం (నర్సాపూర్): విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ మహ మ్మద్ గౌస్ కథనం ప్రకా రం.. కిష్టాపూర్ గ్రామా నికి చెందిన ఎక్కెం యాదగిరి కుమారుడు నవీన్ (21), పసుపుల చిన్న వెంకటేశం కుమారుడు పసుపుల ప్రసాద్ (20) వారి వ్యవసాయ పొలంలో నారు మడికి నీరు పెట్టి, అడవి పందులు రాకుండా మంటలు పెట్టడానికి వెళ్లారు. కాగా, బుధవారం మెదక్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా వీరి పొలాలకు సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఫ్లెక్సీలు విద్యుత్ హైటెన్షన్ వైర్‌కు ఆనుకొని ఉండటంతో వాటిని ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ తీయకుండా వదిలేశాడు. అయితే, ప్రసాద్, నవీన్ ఫ్లెక్సీలు తీయడానికి ప్రయతి్నంచగా విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని నిర్లక్ష్యంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మెదక్–నర్సాపూర్ జాతీ య రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో శాంతించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుల్లో ఒకరైన ప్రసాద్‌కి ఇటీవలే పెళ్లి కుదిరినట్లు గ్రామస్తులు తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మెదక్ చేరుకొని యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పు న అందజేశారు. -
ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్.. సురక్షితం.. కాలుష్య రహితం
దేశంలో గత కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై పలు ఆంక్షలు విధించారు. బాణసంచా నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి హానిచేస్తుంది. అలాగే కాలుష్యాన్ని కూడా వ్యాపింపజేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు.అయితే దీపావళి వేళ బాణసంచా లేకుండా సరదాగా ఎలా గడపడం? ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు బాణసంచాకు బదులుగా ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి వెలుగు జిలుగులను, ధ్వనిని అందించినప్పటికీ కాలుష్యాన్ని కలుగజేయవు. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను కాల్పడం వలన ఎటువంటి హాని జరగదు.ఎలక్ట్రానిక్ టపాసులు నిజమైన టపాసుల మాదిరిగనే కనిపిస్తాయి. వాటిలానే వెలుగులను ఇస్తాయి. అయితే ఇవి రిమోట్‌తో పనిచేస్తాయి. వీటిని వినియోగించినప్పుడు నిజమైన బాణసంచాను కాల్చిన అనుభూతినే పొందవచ్చు. ఎలక్ట్రానిక్ టపాసులు వెలిగించేందుకు ఎటువంటి అగ్గిపెట్టె లేదా నిప్పు అవసరం లేదు. ఇవి ఎంతో సురక్షితమైనవి. కాలుష్యాన్ని కూడా వెదజల్లవు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్లో వివిధ రకాల శబ్ధాలు, వెలుగులను చూడవచ్చు.remote control ignition device for crackers दिवाली में पटाखे जलाने के सुरक्षित यंत्र शुभ दिवाली 🪔 pic.twitter.com/VLj2n0tNFV— Er Ranjeet Singh (@ErRanjeetSingh) October 27, 2024 ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్ లోపల వైర్లతో అనుసంధానమైన పలు చిన్న పాడ్లు, ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వీటిని ఆన్ చేసినప్పుడు పాడ్ల నుంచి స్పార్క్ వస్తుంది. అలాగే బాణసంచా మాదిరి శబ్దం కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను వినియోగించి వినూత్నమైన దీపావళి ఆనందాన్ని పొందవచ్చు.ఎలక్ట్రానిక్ ఫైర్‌క్రాకర్స్‌ను మార్కెట్లో లేదా ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. వీటిని పలుమార్లు ఉపయోగించవచ్చు. వీటిధర రూ.2,500 వరకూ ఉండవచ్చు.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
గజేంద్ర విలాపం
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో వివిధ కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో 528 ఏనుగులు అసహజ రీతిలో మృత్యువాత పడ్డాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన నేపథ్యంలో జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా విద్యుదాఘాతం కారణంగా గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24 వరకు) అత్యధికంగా 392 ఏనుగులు మృత్యువాతపడగా.. ఆ తరువాత రైళ్ల ప్రమాదాల బారిన పడి 73 ఏనుగులు మృతి చెందాయి. వేటాడం ద్వారా 50, విషప్రయోగం చేసి 13 ఏనుగులను హతమార్చారు.విద్యుత్ కంచెలతోనే పెను ముప్పు..అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తుండడంతో అత్యధికంగా ఏనుగులు మృతి చెందుతున్నాయి. విద్యుత్ ఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెలను తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. అండర్ గ్రౌండ్ లేదా, పోల్స్ పైన మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్రం తెలిపింది.ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్ర ప్రయోజిత పథకం ద్వారా ఏనుగులు, పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైలు పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్‌ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగు ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్‌ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్‌పాస్, ఓవర్‌పాస్‌ను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్‌లైన్ సిబ్బంది, వన్యప్రా ణుల పరిశీలకులు రైల్వే ట్రాక్‌లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం తదితర చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.ఏనుగు దంతాల కోసం.. ఏనుగు దంతాల కోసం అత్యధికంగా ఒడిశా, మేఘాలయ, తమిళనాడులో వేటాడి హతమారుస్తున్నారని, అలాగే అసోం, ఛత్తీస్‌గఢ్‌లో విషప్రయోగం చేస్తున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రల్లో ఏనుగుల దంతాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. వేటగాళ్లు, విషప్రయోగాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో 71, అసోంలో 55, కర్ణాటకలో 52 మృతి చెందాయి. రైళ్లు ఢీ కొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24, ఒడిశాలో 16 మృతి చెందాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 17, మేఘాలయలో 14 ఏనులను చంపేశారు. అసోంలో విషప్రయోగం ద్వారా 10 ఏనుగులను హతమార్చారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కందుకూరు: చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరు మండలం మాచవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇనకొల్లు గజపతి, అనూరాధ దంపతుల కుమారుడు నరసింహ (21) తోటి యువకులతో కలిసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటుకు సంకల్పించారు.తన ఇంటి సమీపంలో ఫ్లెక్సీ కట్టేందుకు యత్నిస్తుండగా, ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. దీంతో ఫ్లెక్సీ బ్యాలెన్స్ తప్పి పక్కనే వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడింది. ప్రమాదంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప బోర్డుకు విద్యుత్ సరఫరా కావడంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తూ.. కరెంట్ షాక్‌తో విద్యుత్ ఆపరేటర్ మృతి
సాక్షి, సూర్యాపేట, నడిగూడెం: ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ ఆపరేటర్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్ (40) మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సుధాకర్ గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తెల్లబల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రత్నవరం రహదారిలోని ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని అతన్ని తీసుకెళ్లారు. ఆ ట్రాన్స్ఫార్మర్ మునగాల మండలం ఆకుపాముల విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉందనుకొని అక్కడి నుంచి సుధాకర్ ఎల్సీ తీసుకున్నాడు. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ నడిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉంది. ఈ విషయం తెలియకపోవడంతో సుధాకర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు!
రాజస్థాన్‌లోని బాడ్మేర్లో విద్యుదాఘాతానికి నలుగురు బలయ్యారు. పిండిమరకు విద్యుత్ ప్రవహించిన నేపధ్యంలో వీరు ఒకరిని కాపాడబోయు మరొకరు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులతోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బాడ్మేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అర్జున్‌సింగ్ ఇంటిలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంటిలో అర్జున్‌సింగ్ లేడు. అతని భార్య పిండిమరలో గొధుమలను ఆడిస్తుండగా, ఆమె విద్యుదాఘాతానికి గురయ్యింది. బాధతో తల్లి విలవిలలాడుతుండగా, వారి ఇద్దరి పిల్లలను ఆమెను పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. బాధితుల అరుపులు విన్న అర్జున్ సింగ్ బంధువు హఠెసింగ్ అక్కడికు వచ్చి, వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ అంజుమ్ తాహిర్ సమా మాట్లాడుతూ పిండిమరకు విద్యుత్ ప్రవాహం జరిగి, దానిని ముట్టుకున్న నలుగురు మృతి చెందారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు! -
తల్లీకొడుకుల ప్రాణం తీసిన మొబైల్ చార్జర్
యూపీలోని సీతాపూర్‌లో మొబైల్ చార్జింగ్ అవుతున్న సమయంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన తల్లీకుమారుడు మృతిచెందారు. వారిద్దిరూ ఒకే గదిలో ఉండగా, ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఆ గది తలుపులు తెరవగానే వారికి అక్కడ అచేతనంగా పడివున్న తల్లీకొడుకుల మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే కుటుంబ సభ్యులు మృతులకు పోస్టుమార్టం చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన భవానీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 15 ఏళ్ల రోహిత్ జైశ్వాల్ తమ ఇంటిలోని ఒక గదిలో పడుకున్నాడు. అదే గదిలో అతని తల్లి రామస్ హెలీ కూడా పడుకుంది. రాత్రి వేళ రోహిత్ మొబైల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అతనిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా విద్యుదాఘాతానికి గురయ్యింది. ఉదయం కుటుంబ సభ్యులు తల్లీకొడుకులు మృతి చెందిన విషయాన్ని గుర్తించారు. మృతులకు పోస్టుమార్టం చేయవద్దంటూ అభ్యర్ఙంచి, వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో.. -
కళ్లముందే ఘోరం.. 16 మంది మృతి, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో సంభవించిన విద్యుదాఘాత ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అనూహ్య ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాక్షించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. కాగా, చమోలీ జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న చమోలీ బ్రిడ్జిపై ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యుత్ ప్రసరించింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవారికి షాక్ తగిలి 16 మంది ప్రాణాలు విడిచారు. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. (దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్) మృతుల్లో ముగ్గురు గార్డులు, ఒక పోలీసు వ్యక్తి కూడా ఉన్నారు. కళ్లముందే కరెంట్ షాక్‌తో అంతమంది విగతజీవులుగా మారడం స్థానికంగా భయోత్పాతం సృష్టించింది. తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సీఎం విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన చమోలీ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులకు రూ.1 లక్ష చొప్పున అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం ధామితో ఫోన్లో మాట్లాడారు. చమోలీ ఘటనపై ఆరా తీశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. (డిప్యూటీ స్పీకర్‌పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..) -
ఢిల్లీలో భారీ వర్షాలు.. కరెంటు షాక్ కొట్టడంతో యువతి మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో రుతుపవనాల తాకిడికి శనివారం జోరుగా వర్షం కురిసిన వర్షాలు ఒక యువతిని బలితీసుకున్నాయి. గుంతలుగా మారిన రోడ్డులో నడుస్తూ పొరపాటున కరెంటు స్తంభానికి వేలాడుతున్న వైర్లను తాకడంతో తాకడంతో యువతి విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఆమె అప్పటికే చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. తూర్పు ఢిల్లీలోని ప్రీతి విహార్ లో నివాసముండే సాక్షి అహూజా తెల్లవారుజాము 5.30 నిముషాలకు ఇద్దరు పెద్దవాళ్ళు ముగ్గురు చిన్నారులతో రైల్వే స్టేషన్ వైపుగా వెళ్తోంది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కరెంటు స్థంభంవైపు అడుగు వేసిన ఆ యువతికి కింద వేలాడుతున్న వైర్లు తాకి అక్కడికక్కడే కూలబడిపోయింది. అక్కడే ఉన్న ఆమె సోదరి మాధవి చోప్రా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాక్షి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఆమె సోదరి మరణించినట్లు సంబంధిత అధికారులపై మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి లోకేష్ కుమార్ చోప్రా కూడా అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విపరీతమైన ఉక్కపోతతో వేసవిపై విసుగెత్తిపోయిన తరుణంలో తొలకరి చినుకులు ఎట్టకేలకు పలకరించాయని సంతోషించేంతలోపే ఢిల్లీలో పెనువిషాదం చోటు చేసుకోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఇది కూడా చదవండి: ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ -
హృదయవిదారకం: కరెంట్ షాక్‌తో గున్న ఏనుగు.. కాపాడదామని మరో మూడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తాగునీటి కోసం పొలాల్లోకి వచ్చిన నాలుగు ఏనుగులు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం పక్కుడుభద్ర గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఒక గున్న ఏనుగు, ఐదు పెద్ద ఏనుగుల గుంపు గత ఫిబ్రవరిలో ఒడిశా సరిహద్దులోని అడవుల్లోంచి భామిని మండలంలోకి వచ్చింది. మూడు నెలలుగా ఇక్కడి అడవుల్లో ఉంటూ ఆహారం, తాగునీటి కోసం సమీప పొలాల్లోకి వస్తుండేవి. ఎవరికీ హాని చేయకపోవడంతో వాటిని చూసేందుకు పార్వతీపురం మన్యం జిల్లావాసులే కాకుండా ఒడిశా నుంచి కూడా వస్తుండేవారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి పక్కుడుభద్ర గ్రామ సమీపంలోని పొలాల్లోకి వచ్చాయి. బొమ్మిక మిన్నారావుకు చెందిన బోరుబావి వద్దకు వెళ్లేందుకు యత్నించాయి. ఆ పక్కనే ఉన్న త్రీఫేజ్ విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ను గున్న ఏనుగు తన తొండంతో లాగింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై విలవిలలాడుతున్న గున్న ఏనుగును రక్షించేందుకు మరో మూడు పెద్ద ఏనుగులు ప్రయత్నించాయి. దీంతో నాలుగూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. వాటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు వేలాది సంఖ్యలో పోటెత్తారు. నాలుగు ఏనుగుల కళేబరాలకు విశాఖ జూ వైద్యాధికారి శ్రీనివాసరావు బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఘటన స్థలంలోనే వాటిని ఖననం చేసేందుకు రైతు మిన్నారావు అంగీకరించడంతో జేసీబీలతో పెద్ద గోతులు తీయించి కళేబరాలను ప్రొటోకాల్ ప్రకారం ఖననం చేశారు. విశాఖ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకంఠనాథరెడ్డి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డీఎఫ్‌వోలు పాల్గొన్నారు. -
అమ్మా.. నేనూ బడికి పోతా!
సాక్షి, హిందూపురం: ‘అమ్మా... నేనూ బడికి పోతానమ్మా.. నాన్నకు చెప్పు.. నన్ను బడికి పిలుచుకెళ్లమని’ అంటూ ప్రాధేయపడుతున్న ఆ బాలుడి మాటలు విన్న కన్నతల్లికి కంట నీరు ఆగలేదు. అందరిలా తాను కూడా ఆడుకోవాలని, చదువుకోవాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్న కుమారుడిని చూస్తూ నిరుపేద తల్లిదండ్రులు అసహాయ స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు. ఏం జరిగింది?.. హిందూపురంలోని మేళాపురం ప్రాంతానికి చెందిన షేక్ రఫీక్, నూర్జహాన్ దంపతుల ఏకైక కుమారుడు హర్షాద్ ఏడో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం ఇంటిపైన కోతులు చేరుకుని అపరిశుభ్రం చేస్తున్నాయంటూ వాటిని అదిలించేందుకు కర్ర తీసుకుని మిద్దెపైకి హర్షాద్ వెళ్లాడు. ఆ సమయంలో కోతులను అదలిస్తూ ఇంటి పైభాగంలో వెళుతున్న హైటెన్షన్ (33కేవీ) విద్యుత్ వైర్ల ప్రభావం కారణంగా షాక్‌కు గురయ్యాడు. దీంతో మెడ నుంచి కుడి వైపు శరీరం మొత్తం కాలిపోయింది. ఉన్నదంతా అమ్మి.. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రఫీక్ పెద్ద ఆస్తి పరుడేమీ కాదు. వృత్తిలో భాగంగా వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అడపాదడపా కొంత మొత్తం పొదుపు చేసుకున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురైన కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వైద్య చికిత్సకు పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు ఉన్న కొద్దిపాటి బంగారు నగలూ కర్పూరంలా కరిగిపోయాయి. దాదాపు రూ. 5లక్షలకు పైగా ఖర్చు పెట్టి కుమారుడి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే మెడ నుంచి నడుము వరకూ కుడివైపు శరీరం పూర్తిగా కాలిపోయి ముడతలు పడింది. కుడి చేతిలోని నాలుగు వేళ్లూ తొలగించారు. శరీరంలో నీటి శాతం తగ్గింది. గొంతు వద్ద నరాలు గట్టిపడ్డాయి. శరీరంలో రక్తప్రసరణతో పాటు నరాల వ్యవస్థ మెరుగు పడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారు. ఇందు కోసం రూ. 30 లక్షల వరకూ ఖర్చు వస్తుందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇప్పటికే వారానికి ఒకసారి బెంగళూరుకు చికిత్స కోసం వెళ్లి వచ్చేందుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ ఖర్చు వస్తోంది. ఈ క్రమంలో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తం సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమవుతోందని, ఎవరైనా మానవతావాదులు స్పందించి తమ బిడ్డను మామూలు మనిషిని చేయాలని వేడుకుంటున్నారు. దాతలు సాయం చేయదలిస్తే... పేరు: షేక్ మహమ్మద్ రఫీక్ బ్యాంక్ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నంబర్ : 3878 101 6511 ఐఎఫ్ఎస్సీ కోడ్ : టఆఐN 0004696 ఫోన్ పే నంబర్ : 76709 34214 (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
Darshit: కన్నా..ఇక కనిపించవా..
సాక్షి, తాళ్లపూడి/కాకినాడ క్రైం: మూడేళ్ల దర్శిత్ విషాదాంతం అందరి హృదయాలను కలచివేసింది. మండలంలోని పైడిమెట్ట గ్రామానికి చెందిన జొన్నకూటి వినోద్‌కుమార్ కుమారుడైన దర్శిత్ (3) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 12న తమ ఇంటి డాబాపై ఆడుకుంటుండగా, పై నుంచి వెళుతున్న విద్యుత్ వైర్లు తగిలి బాలుడు షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడ్ని చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాబును కంటికి రెప్పలా చూసుకున్నారు. బాలుడి కాళ్లకు ఇన్పెక్షన్ సోకడంతో ఆపరేషన్ చేసి రెండు కాళ్లనూ తొలగించాల్సి వచ్చింది. ఈ సంఘటన అందరి గుండెలనూ పిండేసింది. బాలుడ్ని కాపాడేందుకు జీజీహెచ్ వైద్యుల బృందం చేయని ప్రయత్నం లేదు. మరోపక్క దాతలూ స్పందించారు. పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందించారు. పలు శాఖల అధికారుల తమ ఉదారతను చాటుకున్నారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. సుమారు రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి దర్శిత్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు. బాలుడి మృతితో పైడిమెట్ట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జొన్నకూటి వినోద్, చాందిని దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడైన అక్షిత్ యూకేజీ చదువుతున్నాడు. దర్శిత్ రెండో కుమారుడు. వినోద్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే) హోం మంత్రి వనిత పరామర్శ శుక్రవారం ఉదయం హోంమంత్రి తానేటి వనిత కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి ఆర్ఐసీయూలో దర్శిత్‌ను పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలుడికి అత్యంత నాణ్యమైన వైద్యం అందించినట్లు తెలిపారు. బాలుడ్ని రక్షించేందుకు పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీయా నిపుణులు శ్రమించారని వివరించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. కుమారుడ్ని కాపాడాలంటూ రోదించిన దర్శిత్ తల్లి చాందినిని హోం మంత్రి అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఆర్ఐసీయూలో బాలుడికి అందుతున్న చికిత్సను హోం మంత్రి తానేటి వనతి, కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ గీత, కౌడా ఛైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర శివప్రసన్న పరిశీలించారు. సాయంత్రానికే బాబు మరణించాడనే దుర్వార్త మనసున్నవారిని కుదిపేసింది. బాలుడి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూసి అందరూ చలించిపోయారు. -
కరెంటుతో జాగ్రత్త!.. ప్రాణాలు కోల్పోతున్న రైతులు, కూలీలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నాలుగేళ్లలో 41,914 విద్యుత్ ప్రమాదాలు సంభవించగా.. మహారాష్ట్ర 10,698, ఉత్తరప్రదేశ్ 9,970, గుజరాత్ 3,767 ప్రమాదాలతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో అదే నాలుగేళ్లలో 2,922 ప్రమాదాలు జరిగాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వీటిని సైతం నివారించాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విద్యుత్ షాక్‌కు గరవుతున్నారు. కొన్ని జాగ్రతలు పాటిస్తే పెనుప్రమాదం నుంచి బయటపడవచ్చని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి వ్యవసాయ పంపుసెట్లకు మోటార్ స్టార్టర్లు, స్విచ్‌లు ఉన్న ఇనుప బోర్డులకు విధిగా ఎర్తింగ్ చేయించాలి. తడి చేతులతో, నీటిలో నిలబడి విద్యుత్ మోటార్లను, స్విచ్‌లను, పరికరాలను తాకకూడదు. ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయడానికి విద్యుత్ అర్హత గల ఎలక్ట్రీషియన్‌ను పిలిపించాలి. పొలాల్లో తెగిపడిన, జారిపడి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండి.. 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంబంధిత విద్యుత్ సిబ్బందికి గానీ, గ్రామ సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ సహాయకులకు గానీ ఫిర్యాదు చేయాలి. పంటను జంతువుల బారినుంచి రక్షించేందుకు పెట్టే ఫెన్సింగులకు విద్యుత్ సరఫరా చేయకూడదు. పాడైన విద్యుత్ వైర్లను ఇన్సులేషన్ టేపుతో చుట్టాలి. వాహనాలపై విద్యుత్ తీగలు తగిలితే బయట పడేందుకు హాపింగ్ (గెంతుట, దుముకుట) విధానం అనుసరించాలి. అంతేతప్ప ఒక కాలు వాహనంలోనూ, మరో కాలు నేలపైనా ఉంచకూడదు. వర్షం వచ్చిన సమయంలో విద్యుత్ స్తంభాలను తాకరాదు. నీటిలో పడిన విద్యుత్ వైర్ల జోలికి వెళ్లకూడదు. స్తంభం, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు. విద్యుత్ స్తంభం నుంచి వ్యవసాయ మోటారుకు మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ దూరం ఉంటే గాలులు వీచినప్పుడు వాటి మధ్య ఉండే సర్వీస్ వైరు వదులై మోటారుపై ప్రభావం చూపుతుంది. విద్యుత్ స్తంభం నుంచి మోటారుకు కరెంటు నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్ బ్యాక్, స్టార్టర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మోటార్ వద్ద ఫ్యూజ్‌లు, ఇండికేటర్ బల్బులు, స్టార్టర్‌ను చెక్కపై బిగించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇనుప డబ్బాపై బిగించకూడదు. భవనాలు, బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉన్నట్టు గుర్తిస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఇదీ చదవండి: ప్రమాదాల వేళ గోల్డెన్ అవర్‌లో స్పందించండి.. పోలీసుల సూచనలివీ -
అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలని ఆదేశించారు. 2 వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తక్షణమే గుర్తించాలన్నారు. సమగ్ర అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్‌సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: (మృత్యుపాశం.. కూలీల ట్రాక్టర్‌పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ) -
ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్‌తో ఆరుగురు మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ షాక్‌తో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని మసుపుర్ గ్రామంలో సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్థులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో ఉపయోగించిన బండిలో ఏర్పాటు చేసిన ఇనుప రాడ్ హైఓల్టేజ్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ సరఫరా అయినట్లు స్థానికులు తెలిపారు. కరెంట్ షాక్‌తో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో బాలుడు అరఫాత్(10) ఆసుపత్రిలో మృతి చెందగా.. మృతుల సంఖ్య ఆరుకు చేరినట్లు వెల్లడించారు. మృతుల్లో సుఫియా(12), ఇల్యాస్(16), టబ్రేజ్(16), అష్రఫ్ అలీ(30)లుగా గుర్తించారు. పలువురు గ్రామస్థులకు సైతం కరెంట్ షాక్ తగిలినట్లు చెప్పారు. ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా -
విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్‌కు తాకడంతో..
కామారెడ్డి: వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన ఎండీ అహ్మద్ (40) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. అతడికి భార్య పర్వీన్ బేగం (32), కూతురు మాహీన్ (6), కుమారులు అద్నాన్ (3), ఫైజాన్ (2) ఉన్నారు. ఫైజాన్ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. బట్టలు ఆరేయడానికి వారు నివసించే రేకుల ఇంటి ముందు గోడకు రెండువైపులా మేకులు కొట్టి వైరుకట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పర్వీన్ బేగం దుప్పటిని వైరుపై ఆరేస్తుండగా బరువు కారణంగా వైరు కిందకు జారింది. వైరు అంచుకు కొద్దిదూరంలోనే విద్యుత్ ఫ్యూజ్ ఉంది. దానికి వైరు తాకడంతో విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో పర్వీన్ బేగం విద్యుదాఘాతానికి గురైంది. ఆమె అరుపు విని ఇంట్లో ఉన్న అహ్మద్, పిల్లలు బయటకు పరుగెత్తుకొచ్చారు. ఆమెను కాపాడబోయే ప్రయత్నంలో ఒకరి వెంట మరొకరు విద్యుదాఘాతానికి గురై నలుగురూ మృతిచెందారు. చుట్టుపక్కలవారు గమనించి విద్యుత్‌శాఖ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. 3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. ఆయన ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్‌తో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గోవర్ధన్ తెలిపారు. -
విషాదం: గడ్డివాముకు నిప్పు.. పశువులను కాపాడబోయి.. వదిన, మరిది..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పశువులను కాపాడబోయి వది న, మరిది కరెంట్ షాక్‌తో ప్రా ణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండ లం ఎర్రగడ్డతండాలో ఈ ఘట న జరిగింది. గురువారం రాత్రి తండాలో బానోతు నీల (37), బానోతు రవి(34) ఇంటికి సమీపంలో ఉన్న ట్రా న్స్ఫార్మర్ నుంచి మంటలు వెలువడి గడ్డివాముకు నిప్పంటుకుంది. దీంతో సమీపంలోని పాకలో ఉన్న పశువులను మంటల నుంచి కాపాడేందుకు నీల, రవి వెళ్లా రు. అదే సమయంలో మంటలకు విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు, బంధువులు శుక్రవారం ఉదయం మృతదేహాలతో వీర్నపల్లి సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అక్కడికి చేరుకొని కలెక్టర్, సెస్ ఎండీతో మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుతుండగా.. అధికారుల నిర్లక్ష్యమే!
మరిపెడ రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గ్రామమంతా షార్ట్‌సర్క్యూట్ వస్తుందని చెప్పినా వారు పట్టించుకోలేదు. వెరసి కుక్కర్లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్జేజితండా పరిధిలోని బుడ్డతండా(మెగ్యాతండా)లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్ట్‌సర్క్యూట్ వల్ల కొద్ది రోజులుగా తండాలోని ఇళ్లలో గల గృహోపకరణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. సమస్యను పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తండాకు చెందిన భూక్యా సునీత(25) ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. తన భార్య మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి భర్త భూక్యా సంతోష్ ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఏడాదిన్నర పాప ఉంది. తల్లి కోసం రోదిస్తున్న చిన్నారిని చూసి పలువురు కన్నీటి పర్యాంతమైయ్యారు. (చదవండి: అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం.. ముగ్గురు కొడుకులు రోడ్డు ప్రమాదాల్లోనే..) -
ఇంటి స్లాబ్ వేస్తుండగా విద్యుదాఘాతం
ధారూరు/వికారాబాద్: ఇంటికి స్లాబ్ వేయిస్తున్న క్రమంలో ఇంటి యజమాని, మేస్త్రీకి విద్యుదాఘాతం కావడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ధారూరు మండల పరిధిలోని కేరెళ్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ధారూరు మండంల కేరెళ్లి గ్రామనికి చెందిన చంద్రారెడ్డి(55) గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి ఆదివారం స్లాబ్ వేయించారు. కూలీలంతా కిందకు దిగినప్పటికీ పైన సెంట్రింగ్ మేస్త్రీ సురేష్ మాత్రం చంద్రారెడ్డి సూచన మేరకు పైనే ఉన్నాడు. ఇంటిపైకీ ఎవరు ఎక్కకుండా కింద ఉన్న ఇనుపరాడ్‌ను మెట్లపై అడ్డంగా పెట్టేందుకు పైకీ తీసుకెళ్లాడు చంద్రారెడ్డి. ఇనుపరాడ్‌ను అడ్డంగా పెట్టేందుకు ప్రయతి్నస్తున్న సమయంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు ఇనుపరాడ్ తగిలింది. యజమానిని రక్షించబోయిన మేస్త్రీ సురేష్ కూడా షాక్‌కు గురియ్యాడు. విద్యుత్ షాక్‌తో ఇద్దరూ భవనం పైనుంచి కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మొదట వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారుల తీరుపై మండిపడ్డ గ్రామస్తులు.. కొత్త ఇంటి నిర్మాణానికి స్లాబ్ వేస్తున్నామని, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలనీ చంద్రారెడ్డి విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నారు. వారెవరు వినలేరని, గత్యంతరం లేక జాగ్రత్తగా స్లాబ్ వేయించిన ఇనుపరాడ్ మెట్లకు అడ్డంగా పెట్టేందుకు ప్రయతి్నస్తూ షాక్‌కు గురిౖయె ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వాపోయారు. అధికారుల నిర్లక్షమే చంద్రారెడ్డి, మేస్త్రీ ప్రమాదానికి కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ మరో ఘటనలో బాలుడికి గాయాలు.. దోమ: విద్యుదాఘాతంతో బాలుడికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కోళ్ల రవి, చెన్నమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్ చెయ్యి విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుదాఘతానికి గురై కొట్టుకుంటుండంగా మరో బాలుడు పట్టుకునే ప్రయత్నం చేశాడు. అతడికి కూడా విద్యుత్‌షాక్ తగలడంతో పక్కకు జరిగి కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన జనుమాండ్ల వెంకట్‌రెడ్డి గమనించి వెంటనే కర్రతో కొట్టగా శ్రీకాంత్ కిందపడిపోయాడు. వెంటనే కొస్గీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా రెండు నెలల క్రితం గ్రామస్తులకు ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం అందించేందుకు పాఠశాల ఆవరణలో విద్యుత్ సరఫరా తీసుకుని అలాగే వదిలివేశారు. అతుకులతో కూడిన విద్యుత్ కనెక్షన్ తొలగించాలని గ్రామస్తులు చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవ్వరూ పట్టించుకలేదని గ్రామస్తులు తెలిపారు. -
కరెంట్ షాక్‌తో ఫుడ్ డెలివరీ బాయ్ మృతి
అబిడ్స్: అర్ధరాత్రి వేళ భారీ వర్షంలో విద్యుత్ వైరు తెగిపడడంతో స్విగ్గి డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిదిలోని గోడేకికబార్ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో నివసించే మహ్మద్ ముస్తాఫ్‌ఉద్దీన్(40) స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గోషామహల్ పాన్‌మండి నుండి మంగళ్‌హాట్ ప్రాంతానికి గురువారం అర్ధరాత్రి వెళ్తుండగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి, ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి అతనిపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతానికి గురైన ముస్తాఫ్ ఉద్దీన్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమీపంలో ఉన్న కొంత మంది స్థానికులు షాహినాయత్‌గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్, ఎస్ఐ కిషన్‌లు విద్యుత్ అధికారులను రపించి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దాదాపు 3 గంటల పాటు శుక్రవారం తెల్లవారు జాము వరకు గోడేకికబర్, మంగళ్‌హాట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ట్రాన్స్‌జెండర్‌తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు న్యాయవాదుల హత్య: ఆడియో క్లిప్పింగ్ వైరల్ -
స్తంభంపైనే మృత్యువాత
శివ్వంపేట (నర్సాపూర్): బోరుబావి సర్వీస్ వైరు కనెక్షన్ ఇచ్చేందుకు స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గోమారం గ్రామానికి చెందిన గూడెపు లక్ష్మణ్(40) విద్యుత్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విద్యుత్ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు స్థానిక రైతులకు ఏదైనా సమస్యలు తలెత్తితే లక్ష్మణ్‌తో చేయిస్తుంటారు. అదే గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ అలీ బోరు మోటారు సర్వీస్ వైర్ కనెక్షన్ ఇచ్చేందుకు లక్ష్మణ్‌ని తీసుకెళ్లాడు. కాగా, పెద్దగొట్టిముక్ల కు చెందిన రైతు అనిల్ ఆదివారం తన వరి పంటను కోసేందుకు కోత యంత్రం రావడంతో విద్యుత్ వైర్లు కిందికి ఉన్నాయని ట్రాన్స్ఫార్మర్ను బంద్ చేసి, ఆన్ఆఫ్ హ్యాండిల్‌కు టవల్ చుట్టి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు పొలానికి వచ్చిన అనిల్.. ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేయగా.. అప్పటికే లక్ష్మణ్ విద్యుత్ స్తంభంపై ఉండటంతో ప్రాణాలు కోల్పోయాడు. -
మృత్యుపాశాలు; ఆరేళ్లలో 3 వేల మంది మృతి
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ తీగలు ప్రజల పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఆరేళ్ల వ్యవధిలో 3 వేల మందిపైగా విద్యుదాఘాతాలకు బలైపోయారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో 2014-2020 మధ్య కాలంలో విద్యుత్ సంబంధిత ప్రమాదాల బారిన పడి 3,008 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 1,197 కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ పరిహారం అందడం గమనార్హం. తెలంగాణ ఉత్తర విభాగం విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెల్లడించింది. (వచ్చే జాతరకు ఉంటామో, లేదో !?: ఏఎస్పీ) విద్యుత్ ప్రమాదాల బారిన పడిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయం పరిహారం చెల్లించాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(టీఎస్ఈఆర్సీ) స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది, అధికారుల నిర్లక్క్ష్యంతో తరుచుగా ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తీగలను సరిగా అతికించకపోవడం, లైవ్ వైర్లు, స్తంభాల నుంచి లీకేజీ, విద్యుత్ సరఫరాలోని లోపాల కారణంగా విద్యుత్దాఘాతాలు సంభవిస్తున్నాయి. కరెంట్ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేసే ముందు అవసరమైతే అంతర్గత విచారణ చేపట్టవచ్చని డిస్కంలకు టీఎస్ఈఆర్సీ సూచించింది. 2013 వరకు 2 లక్షలుగా ఉన్న పరిహారాన్ని 2015లో నాలుగు లక్షలకు ప్రభుత్వం పెంచింది. పలు సవరణల తర్వాత 2018లో పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మృతుల్లో చాలా మంది సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు కావడంతో పరిహారాన్ని పొందడంలో వారి కుటుంబ సభ్యులు అవాంతరాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. పరిహారం కోసం చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలు లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నాయని సామాజిక కార్యకర్త సుధీర్ జలగం తెలిపారు. ఆర్టీఐ కింద విద్యుత్ ప్రమాద వివరాలను ఆయన సేకరించారు. ‘బాధితుల కుటుంబాలు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి చట్టపరమైన వారసుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర రుజువులను అందించాల్సిన అవసరం ఉంది, కాని అధికారులు వాటిని జారీ చేయడానికి నెలల సమయం తీసుకుంటూ, ప్రక్రియను ఆలస్యం చేస్తున్నార’ని ఆయన ఆరోపించారు. డిస్కంలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నాయని, తరచుగా తనిఖీలు నిర్వహించడం లేదని తెలిపారు. (మళ్లీ నగరం బాట పడుతున్న వలసజీవులు) టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 2014-2020 మధ్య కాలంలో వరంగల్ రూరల్ జిల్లాలో అత్యధికంగా 178 విద్యుత్ ప్రమాద సంబంధిత మరణాలు సంభవించాయి. తర్వాత స్థానాల్లో కామారెడ్డి(175), నిర్మల్(164), మహబూబాబాద్(163), జగిత్యాల్(160), నిజామాబాద్(158), పెద్దపల్లి(139), కరీంనగర్(130), మంచిర్యాల(129), ఆదిలాబాద్(128), ఖమ్మం(128), భూపాలపల్లి(122), భదాద్రి-కొత్తగూడెం(119), జనగాం(113), వరంగల్ అర్బన్(60), ఆసిఫాబాద్(53) ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు, విద్యుత్ సిబ్బంది తప్పనిసరిగా ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు అమలు చేసి ఉంటే ఈ మరణాలు సంభవించేవి కాదని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి. సాగర్ అన్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్క్ష్యం కారణంగానే రైతులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు తప్ప ముందుస్తు రక్షణ చర్యలు శూన్యమని విమర్శించారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో గత కొనేళ్లుగా విద్యుత్ ప్రమాద మరణాలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2014-15లో 210 మరణాలు నమోదు కాగా, 2017-18లో 537 మంది మృతి చెందారు. 2019-20 నాటికి ఈ సంఖ్య 681కి పెరగడం ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తోంది. -
చెట్టెక్కడంతో ప్రాణాలు విడిచిన చిరుత!
జైపూర్: నీటి జాడ కోసం వెతుకున్న క్రమంలో ప్రమాదం పడిన ఓ చిరుత ప్రాణాలు విడిచింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కరేడా ప్రాంతంలోని రాంపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. నీటి జాడను వెతుక్కుంటూ చిరుత రాంపూర్ గ్రామానికి చేరుకుంది. ఆక్రమంలోనే అది చెట్టుపైకి ఎక్కింది. అయితే, సమీపంలోని గ్రానైట్ గనికి విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందిందని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ దేవేంద్ర ప్రతాప్‌సింగ్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని, పోస్టుమార్టం నివేదికలో అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు. కాగా, వేసవిలో ఆహారం కోసం అన్వేషిస్తూ భిల్వారా ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. తాజాగా మృతి చెందిన చిరుత కూడా కొన్ని రోజులుగా స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. (చదవండి: చంటి బిడ్డలా మొసలిని మోస్తున్నాడు) -
ట్రాక్టర్ ప్రమాదం.. కరెంట్ షాక్ కూలీల దుర్మరణం
కాసేపట్లో ఇల్లు చేరతామంటూ మిర్చి కూలీలంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం. ట్రాక్టర్‌లోంచి కొందరు ఎగిరిపడ్డారు. మరికొందరు ట్రాలీలోనే ఉండిపోయారు. వారిపై విద్యుత్ తీగలు పడ్డాయి. కేకలు.. అరుపులు.. ఏం జరిగిందో అర్థం కాకముందే ఘోరం జరిగిపోయింది. నాగులుప్పలపాడు/ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామం సమీపంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. కుమ్మరిడొంక వద్ద మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. రాపర్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని పొలాల్లో మిర్చి కోతలకు వెళ్లిన కూలీలు ట్రాక్టర్లో సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ► మాచవరం గ్రామానికి చెందిన నల్లూరి చెంచయ్య తాను కౌలుకు తీసుకున్న 3 ఎకరాల పొలంలో మిర్చి కోతలకు 23 మంది కూలీలను తన ట్రాక్టర్లో ఎక్కించుకుని మధ్యాహ్నం పొలానికి వెళ్లాడు. ఈ కూలీలంతా ఉదయం ఉపాధి పనులకు వెళ్లి వచ్చారు. ► ఇంటికి తిరిగి వస్తుండగా అమ్మనబ్రోలు–నాగులుప్పలపాడు మధ్య హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉన్న స్తంభాన్ని ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సంఘటనా స్థలంలో మృతి చెందింది వీరే ► పీకా కోటేశ్వరమ్మ (50), నూకతోటి లక్ష్మమ్మ (65), కాకుమాను రమాదేవి (55), రమాదేవి కొడుకు, కాకుమాను శివ (17), కాకుమాను కుమారి (60), కాకుమాను రవీంద్ర (మహిళ– 40), గోళ్ల రవిశంకర్ (20), కాకుమాను మౌనిక (18), కాకుమాను అమూల్య (18). ► పొలం కౌలుదారు, ట్రాక్టర్ డ్రైవర్, యజమాని నల్లూరి చెంచయ్య (48), కాకుమాను భాగ్యవతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ చెంచయ్య మృతి చెందాడు. రోదనలు మిన్నంటిన కుమ్మరి డొంక ► ప్రమాదం జరిగిన కుమ్మరిడొంకలో రోదనలు మిన్నంటాయి. రాపర్ల రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న మాచవరానికి చెందిన మిర్చి కూలీలు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో మాచవరం, రాపర్ల గ్రామాల్లోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు,పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ► ప్రమాదం జరిగిన ట్రాక్టర్ ట్రక్కులోనే విగతజీవులై పడివున్న మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కాటేసిందంటూ కన్నీరు మున్నీరుగా రోదించారు. మృతదేహాలపై పడి తల్లడిల్లిపోయారు. మృతులంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు. వెంటనే స్పందించిన పరిసర ప్రాంతాల రైతులు ► ప్రమాదం జరిగిందని గమనించిన కుమ్మరిడొంక పరిసర ప్రాంతాల్లో పొలం పనులు చేసుకుంటున్న రైతులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులైన నల్లూరి చెంచయ్య (ఆసుపత్రిలో చనిపోయాడు), కాకుమాను భాగ్యవతిని, స్వల్ప గాయాలైన మరో 11 మందిని వేరే ట్రాక్టర్లో చికిత్స నిమిత్తం తరలించారు. ► నాగులుప్పలపాడు ఎస్ఐ జి సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్ ప్రసాద్‌కు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్–1 జేవీ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. సీఎం దిగ్భ్రాంతి.. సహాయక చర్యలకు ఆదేశం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో కూలీలు మరణించిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, బాధిత కుటుంబాలను పరామర్శించాలని జిల్లా మంత్రులను సీఎం ఆదేశించారు. బాధితులను ఆదుకుంటాం : మంత్రి బాలినేని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన అధికారులను అప్రమత్తం చేసి ఘటనాస్థలానికి పంపించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పరామర్శ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కాకుమాను భాగ్యలక్ష్మి, నల్లూరి చెంచయ్యలను జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. చెంచయ్యకు కాలు తెగిపోగా శరీరంలో సగభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. భాగ్యలక్ష్మి శరీరం కూడా 70 శాతం కలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చికిత్స పొందుతూ కాసేపటి తర్వాత చెంచయ్య మృతి చెందాడు. భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్ఎంఓ వేణుగోపాలరెడ్డి పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. కాగా, అంతకు ముందు క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, జేసీ మురళి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగతో పాటు మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లమాలపు కృష్ణారెడ్డి తదితరులు పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును కలెక్టర్ భాస్కర్, జేసీ వెంకట మురళి వాకబు చేశారు. ప్రమాద స్థలం వద్ద రోదిస్తున్న మృతుల బంధువులు -
తప్పిన పెను ప్రమాదం.. 60 మంది సేఫ్!
సాక్షి, రాయపర్తి : 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలను తాకడంతో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. అదే సమయంలో విద్యుత్ తీగలు కూడా తెగిపడడంతో.. ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టేసి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాయపర్తి మండలం తిరుమలయ్య పల్లి శివారులో పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని దంపతులు బొమ్మకంటి రాజు (40), బొమ్మకంటి రాణి (33) మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. వారితో పాటు బైక్‌పై వెళ్తున్న రాణి సోదరి కవిత తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈనేపథ్యంలో.. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మృతదేహాలతో ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారికి రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వరంగల్ నుంచి తొర్రూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. డ్రైవర్ ఇరుకైన మార్గం గుండా పోనిచ్చేందుకు యత్నించాడు. ఆ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను డ్రైవర్ గమనించకపోవడంతో.. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలకు తాకింది. విద్యుత్ ప్రసరించడంతో బస్సు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. విద్యుత్ తీగలు కూడా తెగిపోవడంతో.. ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టేసింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే ఆ రూట్లో విద్యుత్ నిలిపివేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అజాగ్రత్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు.