విద్యుదాఘాతంతో యువకుడి మృతి | Youth Dies to Electric Shock: Sri Potti Sriramulu Nellore | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Jun 12 2024 5:56 AM | Updated on Jun 12 2024 5:57 AM

Youth Dies to Electric Shock: Sri Potti Sriramulu Nellore

టీడీపీ ఫ్లెక్సీ కడుతుండగా ఘటన

కందుకూరు: చంద్ర­బాబు ప్రమాణ స్వీకా­రాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరు మండలం మాచవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇనకొల్లు గజపతి, అనూరాధ దంపతుల కుమా­రుడు నరసింహ (21) తోటి యువ­కులతో కలిసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటుకు సంకల్పించారు.

తన ఇంటి సమీపంలో ఫ్లెక్సీ కట్టేందుకు యత్నిస్తుండగా, ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. దీంతో ఫ్లెక్సీ బ్యాలెన్స్‌ తప్పి పక్కనే వెళ్తున్న 11 కేవీ విద్యుత్‌ లైన్‌పై పడింది. ప్రమా­దంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప బోర్డుకు విద్యుత్‌ సరఫరా కావడంతో నరసింహ అక్క­డి­కక్కడే మృతి చెందారు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement