Narasimha
-
Abids CI: అడ్డు తొలగించుకునేందుకే అసత్య ప్రచారం
శాలిగౌరారం(నల్గొండ) : అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి, తనను ఇంటిలో నుంచి బయటకు వెళ్లగొట్టి, మరో మహిళతో సహజీవనం చేస్తూ.. తన అడ్డు తొలగించుకునేందుకు అసత్య ప్రచారం చేస్తున్న తనభర్త అయిన హైదరాబాద్‌లోని ఆబిడ్స్ సీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) కుంభం నర్సింహపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఐ భార్య కుంభం సంధ్య కోరారు. మండలంలోని బండమీదిగూడెంలో తన తల్లిగారింటి వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తనగోడును వెల్లబోసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవి గ్రామానికి చెందిన కుంభం నర్సింహతో తనకు 2012 ఏప్రిల్ 18న వివాహం జరిగిందన్నారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద రూ.18.50 లక్షలు ఇవ్వడంతోపాటూ పది తులాల బంగారు ఆభరణాలను పెట్టారన్నారు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టడంతో గ్రామపెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు పెట్టి అదనంగా మరో రూ. 2 లక్షలు అప్పజెప్పారన్నారు. అంతటితో ఆగకుండా తన తల్లిదండ్రుల వ్యవసాయ భూమిలో భాగం తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారన్నారు. ప్రస్తుతం తమకు కుమార్తె(10), కుమారుడు(05) ఉన్నారన్నారు. తన భర్త వేధింపులు తట్టుకోలేక తన ఇద్దరు పిల్లలతో తన తల్లిగారింటి వద్ద ఉండడంతో తనపై పిల్లల కిడ్నాప్ కేసు పెట్టారని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న తనభర్త సీఐ కుంభం నర్సింహపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సీఐ నర్సింహను ఫోన్లో వివరణ కోరగా.. తన భార్యతో గొడవలు జరుగుతున్న విషయం వాస్తవమేనన్నారు. విడాకుల కోసం తాను కోర్టును ఆశ్రయించానని, కేసు కోర్టులో ఉండడంతో కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఈ విషయంపై మాట్లాడతానన్నారు. -
50 ఏళ్ల వేడుక.. రజనీకాంత్ ఇండస్ట్రీ హిట్ సినిమా రీరిలీజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన నరసింహ రీరిలీజ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. 1999లో వచ్చిన ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో నీలాంబరిగా చాలా పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ (Ramya Krishnan) నటించారు. ఇందులో శివాజీ గణేశన్, సౌందర్య,నాజర్,అబ్బాస్ తదితరులు నటించారు. తమిళ్లో సంచలన విజయం అందుకున్న ఈ మూవీ తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం నుంచి రజనీకాంత్‌కు ఇక్కడ మార్కెట్ కూడా పెరిగింది.(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్'కు తారక్ ఫ్యాన్స్ అన్ స్టాపబుల్ వార్నింగ్)దర్శకుడు కేఎస్ రవికుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నరసింహ (Narasimha) సినిమాను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాదితో రజనీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి అవుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తాను ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎప్పుడు థియటర్స్లోకి తీసుకొచ్చే విషయాన్ని ఆయన చెప్పలేదు. కానీ, ఈ చిత్రం 2025 ఆగష్టులో విడుదల కావచ్చని తెలుస్తోంది. రజనీ నటించిన తొలి సినిమా అపూర్వ రాగంగళ్ 1975 ఆగస్టు 18న విడుదలైంది. దీంతో అప్పటికి ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అవుతాయి. ఆ సమయానికి నరసింహ సినిమాను రీరిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే ఏర్పాట్లు మొదలుపెడుతున్నారు. ఈ మధ్య కాలంలో రజనీ నటించిన హిట్ చిత్రాలు మళ్లీ బిగ్ స్క్రీన్స్‌పై సందడి చేశాయి. అందులో భాషా, బాబా, దళపతి ఉన్నాయి. ఇప్పుడు నరసింహ మూవీ మళ్లీ విడుదల కానున్నడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.నరసింహ సినిమా 1999లో 200 ప్రింట్స్‌తో విడుదలైంది. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 86 థియేటర్ సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. చాలా ప్రాంతాలలో 200 రోజులకు పైగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 50 కోట్లు రాబట్టింది. ఆ సమయంలో అమెరికాలో రూ. 3 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత రజనీ లుక్‌ను బీడీలు, సిగరెట్లు పొగాకు వంటి వాటిపై ట్రేడ్‌మార్క్‌గా రైట్స్ కొనుగోలు చేశారు. -
ఆస్పత్రుల్లో ఔషధ కొరత ఉండొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సర్కారు ఆస్పత్రుల కోసం కొనుగోలు చేసే మెడిసిన్ ఇండెంట్ నుంచి అవి రోగి కి చేరేవరకు పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ను మూడు దశలుగా విభజించి, ప్రతి దశకు ఒక అధికారిని బాధ్యులుగా నియమించాలని తెలిపారు. సెంట్రల్ మెడికల్ స్టోర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫార్మసీల బలోపేతం, ఫుడ్ సేఫ్టీ అంశాలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో శుక్ర వారం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేస్తు న్న 22 సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘ఈ ఔషధి’పోర్టల్ వినియోగంపై ఫార్మసిస్టులకు వర్క్‌షాపు నిర్వహించాలని సూచించారు. అవసరమై న ఔషధాల కోసం టీజీఎంఎస్ఐడీసీకి సకాలంలో ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. ఆస్పత్రు ల్లోని ఫార్మసీల్లో ఏయే ఔషధాలు అందుబాటు లో ఉన్నాయనేది ప్రజలు తెలుసుకొనేలా అక్కడ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా ల్లో మందుల సరఫరాకు డిప్యూటీ డీఎంహెచ్వోలను ఇన్‌చార్జీలుగా నియమించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి ఫుడ్సేఫ్టీలో హైదరాబాద్ నగరం దేశంలోనే చిట్టచి వరి స్థానంలో ఉందని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022 నాటి డేటా తో కొందరు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నా రని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలపటంతో.. ఫుడ్ సేఫ్టీ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. నెల రోజుల్లో 5 కొత్త మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.ఈ ఏడాది ఇప్పటివరకు 4,366 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్‌ఫుడ్ స్టాల్స్‌ను అధికారులు తనిఖీ చేశారని, నిబంధనలు పాటించని 566 సంస్థలపై కేసులు నమోదు చేయడంతో పాటు, రూ.66 లక్షల జరిమానా విధించామ ని తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్య దర్శి క్రిస్టినా, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ విభాగం అడిషనల్ డైరెక్టర్ అమర్‌సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కందుకూరు: చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరు మండలం మాచవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇనకొల్లు గజపతి, అనూరాధ దంపతుల కుమారుడు నరసింహ (21) తోటి యువకులతో కలిసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటుకు సంకల్పించారు.తన ఇంటి సమీపంలో ఫ్లెక్సీ కట్టేందుకు యత్నిస్తుండగా, ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. దీంతో ఫ్లెక్సీ బ్యాలెన్స్ తప్పి పక్కనే వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడింది. ప్రమాదంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప బోర్డుకు విద్యుత్ సరఫరా కావడంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కారమవ్వాలి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మధ్యవర్తిత్వంతో వివాదాల పరిష్కారానికి న్యాయవాదులు ప్రయత్నించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం నరసింహ సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో రూ.99.20 కోట్లతో నిర్మించనున్న జిల్లా కోర్టు భవనాల సముదాయానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. జస్టిస్ నరసింహమాట్లాడుతూ వివాదాల పరిష్కారం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించిన వారు ఏళ్ల తరబడి న్యాయం కోసం వేచి చూడకుండా న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువతీ యువకులు జిల్లా కోర్టుల్లో తమ వృత్తిని ప్రారంభించేలా సీనియర్ న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. విజయనగరంలో నూతన కోర్టు భవనాల ద్వారా మంచి వసతులు సమకూరనున్నాయని, వీటిని వినియోగించుకుని న్యాయవాదులు సమాజానికి సేవలు అందించాలని సూచించారు. జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా న్యాయ వ్యవస్థను నిలపాల్సి ఉందన్నారు. రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరాం, జిల్లా పోర్టుఫోలియో జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జిల్లా జడ్జి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. -
ఆ సీన్ చేయడం నాకు ఇష్టం లేదు.. కానీ: రమ్యకృష్ణ
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్ర నరసింహ( తమిళంలో పడయప్ప). ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. అయితే పేద అమ్మాయి పాత్రలో సౌందర్య కనిపించగా.. ధనిక అమ్మాయి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. ఈ చిత్రం తమిళంలో పడయప్పా పేరుతో తెరకెక్కించగా. . తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేశారు. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1999లో విడుదలైంది. ఈ చిత్రంలో శివాజీ గణేశన్, లక్ష్మి, సితార, నాజర్, రాధా రవి, సత్యప్రియ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం తెలుగులో నరసింహ పేరుతో ఓకేసారి విడుదలైంది. (ఇది చదవండి: రజనీకాంత్ నా కుటుంబానికి ఎంతో సాయం చేశాడు: కన్నడ సూపర్ స్టార్) అయితే ఈ చిత్రంలో ఓ ఆసక్తికర సన్నివేశం అభిమానులకు ఇప్పటికీ గుర్తు ఉంటుంది. సౌందర్యను ఇష్టపడుతున్న రజినీకాంత్‌ను రమ్యకృష్ణ ప్రేమిస్తుంది. కానీ పెద్దల అంగీకారంతో సౌందర్యను పెళ్లి చేసుకునేందుకు రజినీకాంత్ ఒప్పుకుంటాడు. దీంతో సౌందర్యతో రమ్యకృష్ణ మధ్య శత్రుత్వం పెరుగుతుంది. అదే సమయంలో ఇద్దరి మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంటుంది. ఆ సీన్లో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ తన పాదం ఉంచి ఆమెను ఉద్దేశించి కామెంట్స్ చేసింది. అయితే ఆ సందర్భంలో అలా నటించేందుకు చాలా కష్టంగా అనిపించిందని అన్నారామె. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సన్నివేశం గురించి రమ్యకృష్ణ మాట్లాడారు. ఆ సీన్లో చేయలేకపోయా రమ్యకృష్ణ మాట్లాడుతూ..' ఆ చిత్రంలో నా రోల్ సౌందర్యపై పగ తీర్చుకోవడం. అందుకే అలాంటి అహంకారం ప్రదర్శించే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. కానీ మొదట ఆ సీన్ చేయలేకపోయా. కానీ ఆ సీన్ సినిమాకు చాలా అవసరం. చివరికి ఆ షాట్ నాకు ఇష్టం లేదు. సినిమా తప్పకుండా చేయాల్సి వచ్చింది. ఆ సీన్ చేసేటప్పుడు దేవుళ్లందరినీ మనసులో స్మరించుకున్నా. ఆ తర్వాతే సౌందర్యపై చెంపపై కాలు పెట్టా. ఆ సీన్లో నటించిన కొన్ని రోజుల తర్వాత అదే మూడ్‌లో ఉన్నా.' అని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!) అయితే ఆ సినిమా షూటింగ్లో సౌందర్య, రమ్యకృష్ణల మధ్య గొడవ జరిగిందని కూడా వార్తలు కూడా వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇద్దరు హీరోయిన్స్ ఆ వార్తలను ఖండించారు. అయితే సౌందర్య, రమ్యకృష్ణలు ఎంత పెద్ద హీరోయిన్స్ అయినా వారి మధ్య మంచి స్నేహం ఉండేదని అంటున్నారు. సౌందర్య చనిపోయినప్పుడు రమ్యకృష్ణ చాలా బాధపడ్డారని తెలిసింది. ఇక రమ్యకృష్ణ సినిమాల విషయానికి వస్తే గతేడాది 'రంగ మార్తాండ' చిత్రంలో కనిపించింది. ఇటీవల రిలీజైన రజినీకాంత్ జైలర్ చిత్రంలోనూ కీలకరపాత్రలో నటించింది. మరోవైపు మహేష్ బాబు చిత్రం ‘గుంటూరు కారం’లో రమ్యకృష్ణ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ప్రాంతీయ భాషల్లో తీర్పులు శుభపరిణామం
సాక్షి, హైదరాబాద్: అత్యున్నత న్యాయస్థానం తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ఇవ్వడం శుభ పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహా వ్యాఖ్యానించారు. అలాగే, కనీసం జిల్లా కోర్టుల్లోనైనా స్థానిక భాషల్లో వాదనలు సాగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో తమ కేసులో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు కక్షిదారులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఆంగ్లంలో వాదనలు సాగుతుండటంతో చాలామంది కేసు గురించి అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. ‘బార్ అండ్ బెంచ్’ సంబంధాలపై హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ)ల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి జస్టిస్ నరసింహా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మన సొంత భాషలో న్యాయ విద్యాబోధనకు అవకాశం ఇవ్వాలన్నారు. ‘న్యాయవా దులు మన భాష, మన సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతోపాటే ఆంగ్లంపై కూడా పట్టు సాధించాలి. పెండింగ్ కేసులను మాత్రమే కాదు.. రోజూ నమోదవుతున్న కేసులను కూడా సత్వరం పూర్తి చేయాలి. దీనికి బార్ అండ్ బెంచ్ సమన్వయంతో పని చేయాలి. అన్నదమ్ముల భూ పంచాయతీకి.. భార్యాభర్తల విడాకులకు.. దాదాపు 15 ఏళ్లకుపైగా సమయం పడుతుండటంతో కోర్టులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలి’ అని వివరించారు. ఇక్కడి వారికి సుపరిచితుడు.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేకంగా జస్టిస్ నరసింహా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో పుట్టి పెరగ డమే కాదు.. న్యాయవాద వృత్తినీ ఇక్కడే ఆరంభించారు. ఇక్కడి న్యాయవాదులకు ఆయన సుపరిచితుడు. పలు కీలక కేసులను వాదించి సుప్రీంకోర్టు న్యాయవాదిగానూ పేరుతెచ్చుకున్నారు. రాజ్యాంగబద్ధమైన కేసుల్లో విజ యం సాధించి.. న్యాయమూర్తిగా నియమితులయ్యారు’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ అధ్యక్షుడు రఘునాథ్, కార్యదర్శులు మల్లారెడ్డి, నరేందర్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
జనశక్తి రాష్ట్ర నేత నర్సింహ్మ అరెస్టు
సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర నేత, ఒడిశా రాష్ట్ర మాజీ కార్య దర్శి బొమ్మని నర్సింహ్మ అలియాస్ ఆనంద్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఉంటున్న భార్యా పిల్లల వద్దకు వెళ్లారు. నర్సింహ్మను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడంతోపాటుగా ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. గతంలోనూ సిరిసిల్ల పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి వారం రోజులు హింసించి గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు చూపించారని, ఇప్పుడు కూడా సిరిసిల్ల పోలీసులే ఆయనను అరెస్టు చేసినట్లు భార్య పద్మ ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన నర్సింహ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఆయనను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు ఓ ప్రకటన లో డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంకు చెందిన బొమ్మని చంద్రయ్య–పెంటమ్మ దంపతులకు తొలి సంతానంగా నర్సింహ్మ(59) జన్మించారు. వరంగల్‌లో విద్యాభ్యాసం చేసే క్రమంలో వైద్య విద్యలో వచ్చిన సీటును వదులుకుని ఉద్యమాలకు ఆకర్షితుడై అడవిబాటపట్టారు. -
ముసురు వానకు పాడైన పంట.. ఆగిన రైతు గుండె
ఖిల్లాఘనపురం: వరి పంటకోత దశలో ముసురు వానకు పాడైపోయిందనే బెంగతో ఓ రైతు గుండెపోటుకు గురై మృతిచెందాడు. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురానికి చెందిన చెరక పెద్దనర్సింహ (65)కు మూడెకరాల పొలం ఉంది. అందులో వరి సాగు చేశాడు. కాగా, సోమవారం కోత మిషన్ తో పంటను కోయిస్తుండగా ముసురువాన కురిసింది. దీంతో సగమే కోసి మిగతాది మొత్తం బురదగా ఉండటంతో, వాహనం దిగబడుతుందని మధ్యలోనే వదిలేసి వెళ్లారు. దీంతో ఆ రైతు ఆందోళనకు గురయ్యాడు. ముందుగా కోసిన ధాన్యాన్ని కేజీబీవీ సమీపంలోని ప్రైవేట్ ప్లాట్లను చదును చేసుకుని రాశిగా పోసుకున్నాడు. రాత్రి అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక పెద్దనర్సింహకు గుండెనొప్పి రావడంతో తోటి రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. -
చికిత్స పొందుతూ ఏఎస్ఐ మృతి
పహాడీషరీఫ్: బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంచాల ఏఎస్సై కె.నర్సింహ మృతి చెందాడు. నర్సింహ గత నెల 22న ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న విషయం విదితమే. అప్పటి నుంచి కాంచన్‌బాగ్‌లోని డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు సోమవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఘటనకు ముందు నర్సింహ బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లోనే విధులు నిర్వహించేవాడు. గత నెల 15న బాలాపూర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో తమ బంధువుల విందులో ఉన్నప్పుడు అక్కడికి బాలాపూర్ పెట్రోలింగ్ వాహనం రావడం, ఏఎస్సై కుమారుడికి పోలీసులతో వాగ్వాదం జరగడం, మధ్యలో నర్సింహా రావడంతో గొడవ జరిగింది. ఆ సమయంలో నర్సింహ దూషించిన వీడియోతో కానిస్టేబుళ్లు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేయడంతో అతన్ని మంచాల ఠాణాకు బదిలీ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన నర్సింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
మంచాల ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం
పహాడీషరీఫ్: పోలీస్‌స్టేషన్ ముందు ఓ ఏఎస్ఐ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. బాలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కె.నర్సింహ ఏడాదిన్నర క్రితం నుంచి ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగైదు రోజుల క్రితం ఆయనను బదిలీ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ నెల 21న మంచాల పోలీస్‌స్టేషన్‌లో విధుల్లో చేరారు. శుక్రవారం మధ్యా హ్నం 3 గంటల సమయంలో బాలాపూర్ పోలీస్‌స్టేషన్ ముందున్న వాటర్‌ట్యాంక్ వద్దకు యూనిఫారంలో వచ్చిన ఆయన ట్యాంక్‌పైకి ఎక్కారు. ఇది గమనించిన పోలీస్‌స్టేషన్ సిబ్బంది ఆయనను కాపాడేందుకు పైకి ఎక్కారు. ఈలోపే ఆయన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. పైకి చేరుకున్న సిబ్బంది ఆయనను కిందికి దించి చికిత్స నిమిత్తం సంతోష్‌నగర్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. 35 శాతం కాలిన గాయాలతో ఆయన చికిత్స పొందుతున్నారు. వివాదానికి కారణమైన వివాహ విందు.. నర్సింహ బంధువుల వివాహం బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్హాల్లో ఈ నెల 15న జరిగింది. విందుకు నర్సింహ తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. విందుకు బాలాపూర్ ఠాణా కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు వెళ్లారు. ఈ సమయంలోనే ఏఎస్ఐకి, సదరు కానిస్టేబుళ్ల నడుమ వివాదం నెలకొంది. దీనికి సంబంధించిన ఆధారాలను రాచకొండ సీపీ అధికార గ్రూప్‌లో కానిస్టేబుళ్లు పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన సీపీ.. ఏఎస్ఐని మరుసటిరోజే బదిలీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఆ కానిస్టేబుళ్లు డబ్బులు డిమాండ్ చేశారంటూ బాలాపూర్ ఇన్స్పెక్టర్ సైదులుకి ఏఎస్ఐ కుమారుడు సాయికిరణ్ శుక్రవారం ఫిర్యాదు చేశాడు. అలాగే ఇన్స్పెక్టర్ సైదులు వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ సాయికిరణ్ ఆరోపించాడు. ఇన్స్పెక్టర్పై చర్యలు.. ఈ ఉదంతాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సింహను పరామర్శించి.. కుటుంబీకుల్ని ఓదార్చారు. అనంతరం ఇన్స్పెక్టర్ సైదులుతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ దశరథ్ను హెడ్‌క్వార్టర్‌కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ చేయాల్సిందిగా ఎల్బీ నగర్ డీసీపీని ఆదేశించారు. గతంలో సైదులు ఆత్మహత్యాయత్నం.. బాలాపూర్ ఇన్స్పెక్టర్ వి.సైదులు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారు. వనస్థలిపురం పోలీసుస్టేషన్లో ఎస్ఐగా ఉన్న సమయంలో ఆయనపై అవి నీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. దీంతో సైదులు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వద్ద తనపై విచారణ చేయకుండా చర్యలు తీసుకున్నారని హల్చల్ చేశారు. విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. సైదులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన సోదరుడు ఉన్నతాధికారులపై ఆరోపణలు చేశారు. -
జనశక్తి నేత నరసింహ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: జనశక్తి కీలక నేతను పోలీసులు అరెస్టు చేశారు. రెండు దశాబ్దాలుగా ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బొమ్మని నరసింహ (55) అలియాస్ ఆనంద్ అలియాస్ నర్సిరెడ్డి ఉరఫ్ విశ్వనాథ్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసింహను కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయన స్వస్థలం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం. ఈ నెల 24న పోలీసులు నరసింహ కోసం ఇంటికి రాగా ఆయన అక్కడ లేకపోవడంతో వెనుదిరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహ ఇంటికి వచ్చాడన్న సమాచారంతో నే పోలీసులు వచ్చి ఉంటారని తెలిసింది. బషీర్ బాగ్ లో ఆదివారం నరసింహను అరెస్టు చేశారు. పలు కార్యకలాపాల్లో బాధ్యుడిగా నరసింహ రాష్ట్రస్థాయి నేతగా వ్యవహరిస్తోన్న నరసింహ తెలం గాణలో పలు జనశక్తి కార్యకలాపాల్లో బాధ్యుడిగా ఉన్నారు. ఒడిశాలో ఉద్యమంలో ఉన్న సమయంలో ఆదివాసీల కోసం పలు పోరాటాలు చేస్తున్న క్రమంలోనే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కటక్ జైల్లో ఏడేళ్లపాటు శిక్ష అనుభవించి 2013లో విడుదలయ్యారు. తెలంగాణలో సెక్రటరీగా పార్టీ కార్యకలాపాలు చూస్తున్నాడు. 2018లో మహబూబాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అరెస్టు చేసింది కరీంనగర్ పోలీసులని, అక్కడ నరసింహకు సంబంధించి ఓ కేసు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. అతని క్షేమంపై కుటుంబ సభ్యులు, ఆయన భార్య బొమ్మని పద్మ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తని పోలీసులు ఎందుకు తీసుకెళ్లారో తెలియదని ఆయనకు ఏ హానీ తలపెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. -
నరసింహ పంచ్‌లు రజనీ రాసిన వేళ
‘నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు’... ‘నరసింహ’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన ఈ పంచ్ డైలాగులు ఇప్పటికీ పాపులరే. ఆ డైలాగులను ఇంకా వాడుతూనే ఉన్నాం. విశేషమేంటంటే ఈ డైలాగులను రాసింది రజనీకాంతే. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పడయప్పా’. (తెలుగులో నరసింహ). శివాజీ గణేశన్, సౌందర్య, రమ్యకృష్ణ, అబ్బాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 10వ తేదీతో ఈ సినిమా రిలీజ్ అయి 20 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు కేయస్ రవికుమార్ ఓ ఇంగ్లీష్ పత్రికతో సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. ► సినిమాలో ఫీమేల్ విలన్ (నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ) ఉండాలన్నది స్వయంగా రజనీకాంత్ ఆలోచనే. రజనీకాంత్ పొలిటికల్ స్టాండ్ ప్రకారం ఆ ఫీమేల్ విలన్ పాత్ర అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఉద్దేశించి రూపొందించినది. ఒకర్ని ఉద్దేశించి రూపొందించిన పాత్ర అయినప్పటికీ అన్ని రాష్ట్రాల వాళ్లు ఎంజాయ్ చేసేంత బలమైన కథ అయ్యుండాలని చెప్పారు రజనీ. ► నీలాంబరి పాత్ర కోసం మొదట మీనా, నగ్మా పేర్లను అనుకున్నాం. కానీ ఎందుకో వాళ్లు సూట్ కారనిపించింది. ఆ తర్వాత డిస్కషన్స్‌లో రమ్యకృష్ణ పేరు వచ్చింది. ఆమె అయితే కరెక్ట్ అనుకుని, స్క్రీన్ టెస్ట్ కూడా చేయకుండానే ఫిక్స్ చేశాం. తన పాత్రకు నీలాంబరి అనే పేరుని కూడా రజనీయే సూచించారు. ► మొదట నీలాంబరి పాత్ర కోసం అనుకున్న మీనా వసుంధర పాత్రకు అయితే బావుంటుందనుకున్నాం. ఆ సమయంలో ఆమె వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో రజనీకాంత్‌తో అప్పటికే ‘అరుణాచలం’లో నటించిన సౌందర్యనే హీరోయిన్గా తీసుకున్నాం. ► ‘నా దారి రహదారి, పోరా.. ఆ దేవుడే నా వైపు ఉన్నాడు, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు’.. ఈ మూడు ఫేమస్ పంచ్ డైలాగులను రజనీకాంతే స్వయంగా రాసుకున్నారు. మేం స్క్రిప్ట్ తయారు చేసే ఆలోచనల్లో ఉంటే రజనీకాంత్ డైలాగ్స్ గురించి ఆలోచించేవారు. ► సినిమాలో రమ్యకృష్ణ వాడిన రెక్కలు విచ్చుకునే కారు నాదే. స్క్రిప్ట్ డిస్కషన్స్ అప్పుడు నా కార్లో రజనీ, నేను తిరిగేవాళ్లం. ఈ కారు అయితే నీలాంబరి క్యారెక్టర్‌కు బాగా సూట్ అవుతుందని రజనీ తన అభిప్రాయం చెప్పారు. అదే సినిమాలో ఉపయోగించాం. ► సినిమా పూర్తయ్యేసరికి కంటెంట్ 19 రీళ్లు వచ్చింది. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చేలా సినిమా రిలీజ్ ప్లాన్ చేద్దాం అన్నది రజనీకాంత్ ఆలోచన. అప్పట్లో కమల్‌హాసన్ ‘భారతీయుడు’ సినిమాకు ఇదే ప్రాబ్లమ్. కమల్‌ను సలహా అడిగితే బావుంటుందని ఆయన్ను సంప్రదించాం. 14 రీళ్లకు సినిమాను కుదించండి అని ఆయన కూడా అనడంతో చాలా పోర్షన్ ఎడిట్ చేసేశాం. ఇప్పుడంటే డిజిటల్ అయిపోయింది. అప్పుడు ఫిల్మ్ కాబట్టి మిగిలిన భాగమంతా వృథా అయిపోయింది. . ► నీలాంబరి, నరసింహను 18 ఏళ్ల తర్వాత కలిసే సందర్భం అది. నరసింహను నిలబెట్టి తాను కుర్చీలో కూర్చుని అవమానించాలని నీలాంబరి భావిస్తుంది. నరసింహ తన స్టైల్లో అక్కడున్న కుర్చీ లాక్కొని కూర్చుంటాడు. ఇదీ సన్నివేశం. లొకేషన్‌కు వెళ్లి చూస్తే కుర్చీ లాగేంత చోటు లేదక్కడ. లక్కీగా ఊయల ఉండటంతో ఆ ఊయలను పైనుంచి కిందకు లాగి కూర్చునే సన్నివేశంగా మార్చాం. ► ‘నరసింహ’æ షూటింగ్ సమయంలో రజనీకాంత్ తరచూ వ్యాయామం చేస్తుండేవారు. కాస్ట్యూమ్స్ చేంజ్ సమయంలో రజనీకాంత్ ఫిట్ బాడీని గమనించాను నేను. రజనీ బాడీ చూపించే సన్నివేశం ఉంటే బావుంటుంది అనుకున్నాను. ఈ విషయం రజనీకు చెప్పడంతో రజనీ ఇంకా శ్రమించి ఎక్సర్సైజ్ చేశారు. ఆ సీన్లో ‘వాట్ ఏ మ్యాన్’ అనే డైలాగ్ అబ్బాస్‌తో చెప్పించాను. ‘నరసింహ’ గురించి రవికుమార్ చెప్పిన విషయాలు బాగున్నాయి కదూ. ఈ సినిమా తర్వాత రజనీతో ‘లింగా’ సినిమా డైరెక్ట్ చేశారు కేయస్ రవికుమార్. రజనీని మరోసారి డైరెక్ట్ చేయనున్నారట. ప్రస్తుతం రజనీ చేస్తున్న ‘దర్బార్’ తర్వాత రవికుమార్ కాంబినేషన్లో ఆయన సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని చెన్నై టాక్. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘నా పేరు నరసింహ.. ఇంటి పేరు నరసింహ...’, ‘నేనాటో వాణ్ని ఆటోవాణ్ని..’, ‘దేవుడ దేవుడ తిరుమల దేవుడా..’... ఇవి రజనీకాంత్ సినిమాల్లో ఇంట్రడక్షన్ సాంగ్స్ అని మనందరికీ తెలుసు. ఈ పాటలన్నీ పాడింది ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. రజనీ–బాలు కాంబినేషన్ సూపర్ హిట్. అయితే ఇటీవల రిలీజ్ అయిన రజనీకాంత్ సినిమాల్లో ఎస్పీబీ టైటిల్ ట్రాక్ ఏదీ పాడలేదు. రజనీ సినిమాలు కూడా ఇదివరకటి స్థాయిలో ఆడలేదు. ఆ సంగతలా ఉంచితే రజనీ–బాలుల హిట్ కాంబినేషన్‌ని రిపీట్ చేయనున్నారట దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ ఓ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. అందులోని టైటిల్ సాంగ్‌ను ఎస్పీబీతో పాడించారట చిత్రసంగీత దర్శకుడు అనిరు«ద్. సూపర్ హిట్ సెంటిమెంట్ రిపీట్ చేశారు. సినిమా కూడా సూపర్ సక్సెస్ అవుతుందని రజనీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సన్ నెట్వర్క్ నిర్మిస్తోన్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
సగర సంఘం అధ్యక్షుడిగా నర్సింహ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సగర(ఉప్పర) సంఘం అధ్యక్షుడిగా బంగారు నర్సింహ సగర, ప్రధాన కార్యదర్శిగా ఉప్పరి శేఖర్ సగర ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ భవన్లో సంఘం ఎన్నికలు జరిగాయి. సంఘం కోశాధికారిగా వరంగల్‌కు చెందిన కె.సదానందం సగరలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నర్సింహ మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా అధ్యక్షుడిగా ఉంటూ సగర ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో ఈఎండీలు లేకుండా టెండర్లలో పాల్గొనే వీలుగా జీవో 29ను సాధించామన్నారు. సగర జాతి సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో సగర ఫెడరేషన్‌కు రూ.6.30 కోట్లు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించామన్నారు. సగరల బతుకులు మారాలంటే బీసీ ‘డీ’నుంచి ‘ఏ’లో చేర్చాల్సిన అవసరం ఉందని ప్రధానకార్యదర్శి శేఖర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాజీ రాష్ట్ర కమిటీ సలహాదారులు, మాజీ స్టీరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సగరులను బీసీ–ఏలో చేర్చండి సాక్షి, హైదరాబాద్: సగరులను బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చాలని, సగర ఫెడరేషన్లకు రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించాలని సగర సంఘం డిమాండ్ చేసింది. సగర సంఘం నూతన అధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సాగర్ నేతృ త్వంలోని కమిటీ సభ్యులు సోమవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి సగరుల సమస్యలపై వినతిపత్రం అందచేశారు. భగీరథుని విగ్రహం ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. సగరల డిమాండ్లను పరిష్కరిస్తామని కడియం హామీ ఇచ్చారు. -
కనికరం లేని ప్రభుత్వం
-
కనికరం లేని ప్రభుత్వం
మూడేళ్లలో ఒక్క ఇల్లూ నిర్మించలేదు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం రైతుల కోసం ఎన్ని పాదయాత్రలైనా చేస్తాం : మాజీ ఎంపీ అనంత నార్పలకు చేరిన జొన్నలగడ్డ పద్మావతి పాదయాత్ర అనంతపురం : ‘వరుస కరువులతో అల్లాడిపోతున్న జిల్లా రైతులు ఉపాధి కోసం కర్ణాటక, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాలకు వలసలు వెళ్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదు. వారందరూ కార్లు, బైకుల కొనుగోలుకు, అధిక సంపాదన కోసం వెళ్తున్నారంటూ అవమానిస్తోంది. ఈ ప్రభుత్వానికి కాస్తయినా సిగ్గులేదు. కరువు ప్రాంతంపై కనికరం లేద’ని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి చేపట్టిన ‘మేలుకొలుపు’ పాదయాత్ర సోమవారం సాయంత్రం నార్పల మండల కేంద్రానికి చేరుకుంది. పట్టణ ప్రధాన కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ప్రజలు భారీగా తరలివచ్చారు. వారినుద్దేశించి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు పాలనపై ప్రజావ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో పద్మావతి పాదయాత్రకు లభిస్తున్న విశేష స్పందనే నిదర్శనమన్నారు. టీడీపీకి ఓట్లు వేసి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. చంద్రబాబు ఈ మూడేళ్లలో ఒక్క ఇల్లయినా నిర్మించారా అని ప్రశ్నించారు. అ అంటే అమరావతి, ఆ అంటే ఆదాయం అని మనవడికి నేర్పిస్తున్నాడంటే సంపాదనపై బాబుకు ఎంత యావ ఉందో అర్థమవుతోందన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని మేలుకొల్పేందుకే పద్మావతి పాదయాత్ర చేస్తున్నారన్నారు. కరువు పేరు చెప్పి అధికార పార్టీ నేతలు రూ. కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఉపాధి కోసం వలసలు వెళ్తుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే ఆయన కుటుంబంపై ఆరోపణలు చేస్తారా? బెదిరింపు ధోరణికి దిగుతారా? ఏం భయపడతామని అనుకుంటున్నారా? అలాంటి ప్రసక్తే లేద’ని అన్నారు. వైఎస్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉండేవారని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చిన తర్వాత వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కరువు పేరుతో వచ్చిన పనుల్లో జిల్లాలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని విమర్శించారు. రైతులు, ప్రజల కోసం ఎన్ని పాదయాత్రలైనా చేపడతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ మాటంటే ముఖ్యమంత్రి సింగపూర్ అంటున్నారని, శింగనమల నియోజకవర్గమంత లేని సింగపూర్ దేశంతో రాష్ట్రాన్ని ఎలా పోలుస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు దోపిడీకి చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో అబద్ధపు హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారన్నారు. బిడ్డనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఆయనకు.. ప్రజలను వెన్నుపోటు పొడవడం పెద్ద సమస్య కాదన్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలని, వారిని వేరు చేయలేరని చెబుతుంటారని... అయితే వైఎస్సార్సీపీకి ఓట్లు వేయడం వల్ల వారిద్దరిని వేరు చేసి కరువును కూడా పారదోలవచ్చన్నారు. రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చీపుర్లు పట్టి మరీ దోస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ అవకాశం ఇవ్వరని తెలిసే అందినకాడికి దోచుకుంటున్నారన్నారు. జేసీ సోదరులు సభ్యత,సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత మాట్లాడుతూ చంద్రబాబు వస్తే వర్షం వస్తుందో, రాదో తెలీదుకాని కరువు మాత్రం తప్పకుండా వస్తుందన్నారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారన్నారు. జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ పాదయాత్రకు నియోజకవర్గ ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు. దారి పొడవునా ప్రజలు సమస్యలపై ఏకరువు పెడుతున్నారన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నారా...లేరా అనే సందేహం తలెత్తుతోందన్నారు. వైఎస్సార్సీపీ నార్పల మండల కన్వీనర్ రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధనుంజయయాదవ్, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు తదితరులు పాల్గొన్నారు. -
నమో నారసింహా..
- వైభవంగా లక్ష్మీ నృసింహుని బ్రహ్మరథోత్సవం - భక్తులతో పోటెత్తిన పెన్నహోబిల క్షేత్రం ఉరవకొండ / ఉరవకొండ రూరల్ : ‘నమో నారసింహా’ అంటూ భక్తుల గోవింద నామస్మరణతో పెన్నహోబిల క్షేత్రం మార్మోగింది. శ్రీలక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి బ్రహ్మరథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి సుప్రభాతం, మహాభిషేకం, అలంకరణ, అర్చన, నిత్యహోమం, బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు మడుగుతేరులో వేలాది మంది భక్తుల నడుమ ఊరేగించారు. ధూళోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత ఉత్సవ మూర్తులను మేళతాళాల నడుమ రథం వద్దకు తీసుకొచ్చి ప్రదక్షిణ చేయించారు. రథంలో ఉంచి ముందుకు లాగారు. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం భారీసంఖ్యలో భక్తులు తరలిచ్చారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
తమ్ముడి గొంతుకోసిన అన్న
యాదాద్రి భువనగిరి: జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో గురువారం దారుణం జరిగింది. తోడబుట్టన తమ్ముడి గొంతు కోశాడో అన్న. వివరాల్లోకి వెళ్తే డోప్ప నర్సింహా, డోప్ప హరికిషన్‌లు అన్నదమ్ములు. చెల్లెలి పెండ్లి విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన అన్న హరికిషన్ బీరుబాటల్, కత్తితో తమ్ముడు నర్సింహపై దాడి చేశాడు. నర్సింహ పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన హైద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కత్తి నరసింహారెడ్డి విజయ కేతనం
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎస్టీయూ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, ఎస్ఎస్టీఏ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 3,763 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బచ్చలపుల్లయ్య కనీస పోటీ కూడా ఇవ్వలేక మూడో రౌండ్లోనే వెనుదిరిగారు. మరోవైపు పట్టభద్రుల కోటా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ, టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థుల మధ్య పోరు నడుస్తోంది. సోమవారం అర్ధరాత్రి వరకు సాగిన కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి రెండు వేల ఓట్లకుపైగా ఆధిక్యతతో ఉన్నారు. ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. మొదటి నుంచీ ‘కత్తి’కే మెజార్టీ ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతపురం పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి బ్యాలెట్‌బాక్సులను స్ట్రాంగ్‌రూం నుంచి తీసుకొచ్చి అభ్యర్థుల వారీగా వేరు చేశారు. ఈ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగింది. రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 18,840 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తొలి రౌండ్లో 14,007 ఓట్లను లెక్కించారు. ఇందులో 398 చెల్లని ఓట్లు ఉన్నాయి. వీటిని అధికారులు తొలగించారు. తక్కిన 13,609 ఓట్లలో 5,603 ఓట్ల మెజార్టీతో కత్తి నరసింహారెడ్డి ప్రథమస్థానంలో నిలిచారు. ఎస్‌ఎల్‌టీఏ (స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్) అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులురెడ్డి 3,083 ఓట్లతో రెండోస్థానం, టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య 2,352 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఆపై రెండోరౌండ్లో 4,833 ఓట్లకు గాను చెల్లని ఓట్లు పోనూ 4,692 ఓట్లను లెక్కించారు. ఇందులోనూ కత్తినరసింహారెడ్డికి 1,924 ఓట్లు లభించాయి. దీంతో ఆయన మొత్తం 7,527ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. అలాగే రెండోరౌండ్లో ఒంటేరు శ్రీనివాసులురెడ్డికి 1,383 ఓట్లు లభించగా.. మొత్తం 4,466 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్యకు రెండో రౌండ్లో కేవలం 877 ఓట్లు దక్కాయి. ఈయన మొత్తం 3,229 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. దీంతో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయినా అభ్యర్థి గెలిచేందుకు ‘మ్యాజిక్ ఫిగర్’ (9,152 ఓట్లు) రాలేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. బరిలోన ఉన్న 10 మంది అభ్యర్థులలో ప్రాధాన్యత క్రమంలో తక్కువ ఓట్లు పోలైన వారిని ఎలిమినేట్ చేస్తూ వారికి పోలైన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు కలుపుతూ వచ్చారు. ఈ క్రమంలో చివరగా కత్తి నరసింహారెడ్డి విజయం సాధించారు. కత్తికి 9,624 ఓట్లు, సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసరెడ్డికి 5,861 ఓట్లు లభించాయి. దీంతో కత్తి నరసింహారెడ్డి 3,763 ఓట్ల తేడాతో గెలిచారు. ‘పట్టభద్రుల కోటా’లో వైఎస్సార్సీపీ ఆధిక్యం మరోవైపు పట్టభద్రుల కోటా ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా కొనసాగుతోంది. రాత్రి 8 గంటల వరకు స్ట్రాంగ్‌రూంలోని బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లోకి తీసుకొచ్చి బ్యాలెట్‌పత్రాలను అభ్యర్థుల వారీగా వేరుచేసే ప్రక్రియే కొనసాగింది. దీంతో 8 తర్వాత తొలిరౌండ్ ఓట్లను లెక్కించారు. నియోజకవర్గ పరిధిలో 2,49,582 ఓట్లకు గాను 1,55,536 ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లను 26వేల చొప్పున వి¿భజించి ఆరు రౌండ్లుగా ఓట్ల లెక్కింపు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిరౌండ్ ముగిసే సరికి వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డిపై 2,133 ఓట్ల ఆధిక్యత సాధించారు. గోపాల్‌రెడ్డికి 8,648 ఓట్లు పోలవ్వగా, కేజేరెడ్డికి 6,515 ఓట్లు పోలయ్యాయి. గేయానంద్ మూడోస్థానంలో ఉన్నారు. ఆయనకు 5,316 ఓట్లు లభించాయి. ఇంకా ఐదురౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలివుంది. తుది ఫలితం రావాలంటే మంగళవారం సాయంత్రం వరకు ఆగాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఫలితాల కోసం వైఎస్సార్సీపీతో పాటు టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థులు రాత్రంతా కౌంటింగ్ కేంద్రం వద్ద జాగారణ చేశారు. -
నేడు మోహినీ ఉత్సవం
కదిరి: కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి వారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. పూర్వం పాల కడలిని మదించి అందులో ఉద్భవించిన అమృతాన్ని సేవించడానికి దేవతాసురులు పోటీ పడతారు. ఆ అమృతాన్ని పంచడానికి శ్రీమహా విష్ణువు మోహినీ అవతారమెత్తారు. దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి అసురులను మభ్యపెట్టేందుకు శ్రీవారు ఈ అవతారాన్ని ధరిస్తారని భక్తుల నమ్మకం. వయ్యారాలు పోసే సోయగాలతో, చంకన అమృత భాండాగారాన్ని పెట్టుకొని సుకుమార వేషంలో శ్రీవారు భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారి కుచ్చుల వాలుజడ నేటి ఉత్సవంలోని ప్రత్యేకత. ఉభయదారులుగా కోటా వెంకట కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పచ్చిపులుసు నరేంద్రబాబు తెలిపారు. -
నేత్రపర్వం.. నరసన్న తెప్పోత్సవం
హంస వాహనంపై దేవేరులతో స్వామివారి విహారం అంతర్వేది(సఖినేటిపల్లి) : శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా చివరిరోజు శనివారం స్థానిక మంచినీటి చెరువులో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. అంతకుముందు ఆలయం వద్ద నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పక వాహనంపై ఊరేగింపుగా చెరువు వద్దకు అర్చకులు, భక్తులు తీసుకువచ్చారు. తెప్పోత్సవానికి ముందు ఆలయ ప్రధాన అర్చకుడు కిరణ్, మాజీ ప్రధాన అర్చకుడు బుచ్చిబాబు చెరువు వద్ద గంగపూజ నిర్వహించారు. పుష్పకవాహనంపై కొలువుదీరిన స్వామిని వేదమంత్రాలతో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు, భక్తుల గోవింద నామస్మరణలతో తెప్పపైకి అధిరోహింపజేశారు. ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు కొబ్బరి కాయలు కొట్టి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థానం ఏర్పాటు చేసిన బాణాసంచా కాల్పులు భక్తులను అలరించాయి. వెన్నెల, దీప కాంతుల నడుమ భీమేశ్వరుని తెప్పోత్సవం ద్రాక్షారామ (రామచంద్రపురం): శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆలయ ప్రాంగణలో గల సప్తగోదావరి నదిలో స్వామి వారి తెప్పోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దివి నుంచి చంద్రుని పున్నమి వెన్నెల... భువి నుంచి రంగు రంగుల విద్యుత్‌దీప కాంతుల నడుమ సప్తగోదావరిలో స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ప్రత్యేకంగా అలకరించిన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తోడ్కొని వచ్చి విద్యుత్ దీపాలతో ఆలకరించిన హంసవానంలో ఉంచి పూజలు నిర్వహించారు. మూడు సార్లు నదిలో తెప్పోత్సవం జరిపారు. ఈఓ పెండ్యాల వెంకటచలపతిరావు, వేగాయమ్మపేట జమీందారు వాడ్రేవు సుందర రత్నాకర్, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అంగరంగ వైభవం నింగి నేలా సంబరం
నయనానందకరం నరసింహుని కల్యాణం అశేష భక్తుల మధ్య సాగిన దివ్య ఘట్టం తన్మయత్వంతో తరించిన భక్తులు అలవైకుంఠం ఇలకు దిగివచ్చిందా అన్నట్టు.. సర్వజగన్నియామకుడైన ఆ దేవదేవుని కల్యాణ వేళ.. అంతర్వేది పుణ్యక్షేత్రం దివ్యధామంగా శోభిల్లింది. రంగురంగుల విద్యుద్దీపాలు.. పరిమళాలు వెదజల్లే పూలమాలల అలంకరణలతో తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణంలోని కల్యాణ వేదికపై.. సర్వాభరణభూషితుడై కొలువుదీరిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం నయనానందకరంగా జరిగింది. సోమవారం అర్ధరాత్రి 12.21 గంటల సుముహూర్తానికి జరిగిన ఈ పరిణయ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. సఖినేటిపల్లి : ఆదిదేవుడు అంతర్వేది లక్ష్మీ నసింహస్వామివారి కల్యాణం నయనానందకరంగా సాగింది. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి వేదికపై పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాల అలంకరణతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. విష్వక్సేన పూజతో మొదలై, ఆగమశాస్త్ర ప్రకారం సంప్రదాయ పద్ధతిలో సాగిన ఈ వివాహ వేడుకను భక్తులు తన్మయత్వంతో చూసి తరించారు. అంతర్వేదిలో శ్రీలక్ష్మీనృసింహస్వామివారి కల్యాణం సోమవారం అర్ధరాత్రి 12.21 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త తులా లగ్నపుష్కరాంశలో జరిగింది. వైష్ణవ సంప్రదాయబద్ధంగా వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యుల పర్యవేక్షణలో ఆస్థాన వేదపండితులు చింతా వేంకటశాస్త్రి, అర్చక బృందం కల్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుముహూర్తానికి జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరస్సుపై ప్రధాన అర్చకుడు కిరణ్, శ్రీదేవీ, భూదేవీ అమ్మవార్ల శిరస్సులపై సహాయ అర్చకులు ఉంచారు. కల్యాణ మండపం వద్ద నిర్మించిన భారీ షెడ్లలో భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆశీనులై స్వామివారి తిరు కల్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు, రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. కల్యాణాన్ని ఫ్యామిలీ ఫౌండర్ మెంబరు శ్రీరాజా కలిదిండి కుమార సత్యనారాయణ సింహజగపతి రాజా బహద్దూర్ స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. కల్యాణం ఆద్యంతం భక్తుల గోవింద నామస్మరణతో కల్యాణ ప్రాంగణం మార్మోగింది. కల్యాణ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఎదురు సన్నాహంతో శ్రీకారం రాత్రి 10 గంటలకు ఎదురు సన్నాహంతో కల్యాణ తంతు ప్రారంభమైంది. అనాదిగా వస్తున్న సంప్రదాయ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబరు శ్రీరాజా బహుద్దూర్ శ్రీవారి తరఫున, అర్చకస్వాములు అమ్మవారి తరఫున వివాహకర్తలుగా నిలిచారు. ఆలయం నుంచి తొలుత స్వామిని, తరువాత అమ్మవార్లను వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య అర్చకులు, అధికారులు, ట్రస్ట్‌బోర్డు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు పల్లకిలో వేర్వేరుగా కల్యాణం మండపం వద్దకు తోడ్కొనివచ్చారు. శ్రీవారు, అమ్మవార్లకు అంతర్వేదికరకు చెందిన పోతురాజు కుటుంబీకులు గతంలో ఇచ్చిన ఆభరణాలను అర్చకులు అలంకరించారు. కల్యాణం నిర్వహణలో ఆనవాయితీ ప్రకారం పేరూరు వేద పండితులు వచ్చి స్వామిని సేవించుకున్నారు. ఆనవాయితీగా స్వామికి తలంబ్రాలు బియ్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పొలమూరు కుటుంబీకులు తీసుకువచ్చారు. స్వామివారికి, అమ్మవార్లకు మధుపర్కాలు కల్యాణానికి ముందు ప్రభుత్వ ప్రతినిధిలుగా......, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, రాజప్రతినిధిగా ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీరాజా బహుద్దూర్, దేవాదాయశాఖ తరఫున డిప్యూటీ కమిషనర్..., టీటీడీ తరఫున...., అన్నవరం దేవస్థానం తరఫున పురోహితులు, గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, స్వామి, అమ్మవార్లకు మధుపర్కాలను సమర్పించారు. కల్యాణం తదనంతరం కల్యాణం తదనంతరం ప్రముఖులు, విశిష్ట అతిథులు స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలను సమర్పించారు. వీరితో పాటు రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, జెడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు, మాజీ జెడ్పీఛైర్మన్... ఆర్డీఓ గణేష్‌కుమార్, డీఎస్పీ అంకయ్య స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో.... పాల్గొన్నారు. అలంకరణలతో కొత్త శోభ... స్వామివారిని, అమ్మవార్లను బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సెటారీ, వైరుముడి, సూర్యపతకం, చిన్ని కిరీటం, వెండి కిరీటం, సాదా కిరీటం, కంటి, పచ్చలు, కెంపులు, వజ్రాలతో పొదిగిన కిరీటం, వజ్రాలు పొదిగిన హంస పతకం, నవరత్నాలు పొదిగిన హారం, పగడాల దండ, తొమ్మిది ఈస్ట్ ఇండియా మోహాళీలు, 12 రకాల నాన్తాడులు, చిన్ని లక్ష్మీకాసుల పేర్లతో వారిని అలంకరించారు. నేడు రథోత్సవం అంతర్వేది తీర్థమహోత్సవాల్లో భాగంగా మంగళవారం భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. నూతన వధూవరులుగా మూర్తీభవించిన శ్రీలక్ష్మీనృసింహ స్వామివారిని రథంపై అధిరోహింపజేసి, అసంఖ్యాకమైన భక్తుల నడుమ ఈ రథోత్సవం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.42 గంటలకు మెరకవీధి నుంచి మొదలయ్యే ఈ యాత్ర పల్లపు వీధిలోని పదహారు కాళ్ల మండపానికి చేరుకోవడంతో ముగుస్తుంది. ఆలయ ఫ్యామిలీ ఫౌండర్ మెంబరు శ్రీరాజా బహుద్దూర్, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, గోదావరి డెల్టా కమిటీ ఛైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ, ఆర్డీఓ గణేష్ కుమార్, ట్రస్ట్‌బోర్డు, ఉత్సవ సేవా కమిటీ సభ్యులు రథం వద్ద పూజలు నిర్వహించి రథయాత్రకు శ్రీకారం చుడతారు. ఈ యాత్రలో సోదరి అశ్వరూఢాంబికకు, స్వామివారు చీర, సారె ఇవ్వడం ఆనవాయితీ. స్వామి తరఫున ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు వైభవంగా నిర్వహిస్తారు. ‘జనం’తర్వేది భక్తులతో కిటకిటలాడిన పవిత్ర క్షేత్రం అంతర్వేది(సఖినేటిపల్లి) : గోదావరి సప్తపాయల్లో ఒకటైన వశిష్టనది. సముద్రంలో సంగమ ప్రాంతం అంతర్వేది. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం సోమవారం జనసంద్రమైంది. ఆదిదేవుడు శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రెక్కలు కట్టుకుని వాలడంతో అంతర్వేది పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తుల రాక ఆరంభం కాగా, మధ్యాహ్నం నుంచి వారి సంఖ్య రెట్టింపైంది. మన జిల్లాతో పాటు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, మార్టేరు, ఏలూరు, తణుకు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, అవనిగడ్డ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని ఇలవేల్పుగా కొలిచే అంతర్వేదిపల్లిపాలెం వాసులకు కృష్ణా జిల్లాలోని పలుప్రాంతాల్లో బంధువులు ఉన్నారు. స్వామివారి మహోత్సవాలకు ఆయా జిల్లాల నుంచి మత్స్యకారులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఆలయ క్షేత్రపోషకులుగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు రాజవంశీయులు వ్యవహరిస్తుండడంతో ఆయా ప్రాంతాల నుంచీ భక్తులు ఎక్కువగా హాజరుకానున్నారు. -
వైభవం.. నరసింహుని పవిత్రోత్సవం
అహోబిలం (ఆళ్లగడ్డ): ఎగువ అహోబిలం శ్రీజ్వాలనరసింహస్వామి ఆలయ వార్షిక పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాలుగురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు మంగళవారం తెల్లవారు జామున యాగశాల ప్రవేశం తదితర పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో సోమకుంభస్థాపనం అంకురార్పణం చేశారు. రెండోరోజు బుధవారం ఉదయం నిత్య పూజ, నవకలశ స్నపనం, ద్వారతోరణ పూజ, మండల ప్రతిష్ఠ, కుంభ ప్రతిష్ఠ చేశారు. అనంతరం వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించారు. రాత్రి శ్రీజ్వాలనరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను అలంకరించి పల్లకిలో కూర్చోబెట్టి గ్రామోత్సవం నిర్వహించారు. పవిత్రోత్సవ విశిష్టత ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక ఉత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలిసీ తెలియక చేసిన తప్పులతో ఏర్పడ్డ దోష నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆనవాయితీగా వస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పవిత్రోత్సవాల్లో నేడు పవిత్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు నిత్యపూజలు, హోమం, గోష్టి, సాయంత్రం 6 గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు గ్రామోత్సవం, రాత్రి 10 గంటలకు హోమం, 10.30 కు గోష్టి తదితర పూజలు నిర్వహిస్తారు. -
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
హొసూరు (తమిళనాడు): తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి తాలూకా చెక్కినాంపట్టి గ్రామంలో రూ. 2 కోట్ల విలువైన నాలుగు టన్నుల ఎర్ర చందనం దుంగలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా రొంపిచెర్ల పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రొంపిచర్లలో మాస్ (35) అనే ఎర్రచందనం స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. అతడిచ్చిన సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం వేట మొదలుపెట్టారు. రొంపిచర్ల ఇన్స్పెక్టర్ నరసింహన్ ఆధ్వర్యంలో 20 మంది పోలీసులు బృందంగా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం చెక్కినాంపట్టి గ్రామంలో నివాసముంటున్న కృష్ణమూర్తి ఇంట్లో సోదాలు చేశారు. నాలుగు టన్నుల ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. అప్పటికే స్మగ్లర్ కృష్ణమూర్తి పరారీ అయ్యాడు. అతని ఇంటి యజమాని రామకృష్ణను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన బాలాజీతో కలిసి కృష్ణమూర్తి కొన్నేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. -
లారీని ఢీకొట్టిన మరో లారీ: ఇద్దరి మృతి
వేగంగా వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్, క్లీనర్ మృతిచెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గుంటూరు నుంచి నిమ్మకాయల లోడుతో లక్నోకు వె ళ్తున్న లారీ జైపూర్ సమీపంలోకి రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ వెంకటపతితో పాటు క్లీనర్ నరసింహా అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి జేసీబీ ఆపరేటర్ మృతి
జేసీబీ ఆపరేటర్ వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా మేడేపల్లి మండలం కొనుగోడు గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుంచె నరసింహ (42) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేసే వ్యవసాయ బావి పూడిక తీత పని కోసం వెళ్లాడు. పూడిక తీత తర్వాత బావి ఒడ్డున ఉన్న జనరేటర్ కాలికి తగలడంతో అదుపుతప్పి బావిలో పడి మృతి చెందాడు. -
సింహాచలం అప్పన్నను దర్శించుకున్న గవర్నర్
-
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య
మానవపాడు: సెల్‌ఫోన్ కోసం తీసుకెళ్లిన డబ్బులు ఏమి చేశావని భార్య అడిగినందుకు అడిగినందుకు క్షణికావేశంలో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడులో వెలుగులోకి వచ్చింది. చిన్నఅముదాలపాడుకు చెందిన నరసింహ, అతని భార్య జంగాల మహేశ్వరమ్మ రోజువారీ కూలీలు. పనిచేసుకుంటూ కొంత డబ్బు జమ చేసుకున్నారు. ఆ డబ్బుతో కొత్తసెల్‌ఫోన్ కొనాలని భావించిన నరసింహ.. గత నెల 24న భార్యతో గొడవ పడి ఇంట్లో ఉన్న రూ.6 వేలు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చిన నరసింహను సెల్‌ఫోన్ కొన్నావా.. డబ్బులు ఎక్కడ పెట్టావని భార్య మహేశ్వరమ్మ అడిగింది. క్షణికావేశానికి గురైన నర్సింహ ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. -
విన్నారా!
రమ్యకృష్ణ కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ విధంగా నిలిచిపోయిన పాత్రల్లో ‘నరసింహ’ చిత్రంలోని నీలాంబరి పాత్ర ఒకటి. ఈ పవర్ఫుల్ రోల్‌ను అద్భుతంగా చేశారామె. ఈ పాత్రను రమ్యకృష్ణ మినహా వేరే ఎవరూ ఇంత బాగా చేయలేరంటే అతిశయోక్తి కాదు. ఈ నీలాంబరి పాత్ర గురించి ఓ తమిళ పత్రిక రమ్యకృష్ణను ఓ ప్రశ్న అడిగింది. ఒకవేళ ‘నరసింహ’ చిత్రాన్ని రీమేక్ చేస్తే, అందులో నీలాంబరి పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందనుకుంటున్నారు? అని ఆ పత్రికా విలేకరి అడిగితే - ‘‘ఆ పాత్రలో వేరే ఎవర్నీ ఊహించుకోలేకపోతున్నాను. రీమేక్‌లో కూడా నేనే ఉండాలని కోరుకుంటున్నాను. అవకాశం ఇస్తే నేనే నటిస్తా’’ అని చెప్పారు. -
జైళ్లో ఐఎస్డీ సౌకర్యం లేదు: డీఐజీ నరసింహా
-
విత్తనాల కొరత లేదు
ఎరువులు అందుబాటులో ఉన్నాయి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఖరీఫ్ రైతులు ఆందోళన చెందవద్దు శాస్త్రీయంగా భూసార పరీక్ష పత్రాలు సేంద్రియ ఎరువుల వాడకంపై అన్నదాతలకు అవగాహన ఈ నెలాఖరులోగా రెండో విడత రుణమాఫీ అందుతుంది 'సాక్షి'తో వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ డి. నర్సింహా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మృగశిర, ఆరుద్ర కార్తెల ప్రభావం మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వానల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులు సాగుకు సన్నద్ధమయ్యూరు. ఖరీఫ్ పనులు వేగం పుంజుకున్నాయి. ఎరువులు, విత్తనాల సరఫరాపైనే అనుమానాలు. వ్యవసాయ పనిముట్లు, రుణమాఫీ, యంత్రలక్ష్మి పథకాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. భూసార పరీక్ష లు మొదలు పంటల సాగు వరకు అనేక అంశాలు ప్రాధాన్యంగా మారాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎం.నర్సిం హాసింహా 'సాక్షి'ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు, రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వివరాలు ఆ యన మాటలలోనే... విత్తనాలు, ఎరువుల కొరత లేదు... ఈ విషయంలో అపోహలు వద్దు ఖరీఫ్‌కు రైతులు విత్తనాలు, ఎరువుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీజన్‌కు సరి పడే విధంగా ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేం దుకు వీలుగా అన్ని చర్యలు తీసుకున్నాం. 1,04,550 క్వింటాళ్ల జీలుగ, సోయాచిక్కుడు, మొక్కజొన్న తది తర విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నా ము. 75,000 పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఈ సీజన్ కోసం 234303 మెట్రిక్ టన్నుల యూ రియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర రకాల ఎరువులను సరఫరా చేయనున్నాం. 1,02, 809 మె.టన్నుల ఎరువులు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(ప్యాక్స్)లకు సరఫరా చేశాం. విత్తనాలు, ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. ఖరీఫ్ సాగు అంచనా 4.18 లక్షల హెక్టార్లు 2013, 2014 ఖరీఫ్ సీజన్ల సాగును దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖరీఫ్ సాగును అంచనా వేశాము. 4,18,100 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారనుకున్నాం. అత్యధికంగా సోయా, వరి పంటలు మూడు లక్షల హెక్టార్ల వరకు ఉండవచ్చు. ఈసారి అటవీశాఖ ఆక్రమిత భూముల విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తున్నందున సుమారు 20 వేల హెక్టార్లలో సాగు తగ్గే అవకాశం ఉంది. 3.98 లక్షల హెక్టార్లు అనుకు న్నా ఇప్పటి వరకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 1,14, 860 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైనా, మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువే. ఆన్లైన్ ద్వారానే ఇక ‘యంత్రలక్ష్మి’ దరఖాస్తులు యంత్రలక్ష్మి పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా అర్హులైన రైతుల దరఖాస్తులు స్వీకరించనుంది. మ ండల వ్యవసాయాధికారి కార్యాలయంలో పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ ఏడాది జిల్లాకు యంత్రలక్ష్మి కింద రూ.18.74 కోట్లు కేటాయించారు. 25 హెచ్‌పీ ట్రాక్టర్లు,రొ టవేటర్లు, మినీ ట్రాక్టర్లు, ట్రాలీలు, టార్పాలిన్లు, వ్యవసాయ సస్యరక్షణ పరికరాలు తదితర యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకనుంచి వీటిని దరఖాస్తు చేసు కున్న వారం రోజులలోనే అందిస్తాం. మూడేళ్లలో భూములకు భూసార పరీక్ష పత్రాలు శాస్త్రీయ పద్ధతిలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు పత్రాలు అందజేసే ప్రక్రియను ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది.మోతాదును మించి రసాయన ఎరువులు వాడటంతో చాలా చోట్ల భూసారం దెబ్బతిన్నది. ఇందుకోసం జిల్లాలోని భూములన్నింటినీ మూడు విడతలుగా మూడేళ్లలో పరీక్షలు నిర్వహించి శాస్త్రీయంగా వ్యవహరించే వీలు కల్పించనున్నాం. వర్షాధార పంటలు వేసే భూములైతే 10 హెక్టార్లు ఒక గ్రిడ్‌గా, బాబులు, ప్రాజెక్టుల కింద సాగయ్యే భూములైతే రెండున్నర హెక్టార్లు ఒక గ్రిడ్ పరిగణించి భూమి ఆరోగ్య పథకం కింద పరీక్షలు నిర్వహించి కార్డులు అందజేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'పరం పరాగత్' స్కీం ద్వారా గతంలో రసాయన ఎరువులు వాడిన భూములను 25 ఎకరాలను ఒక క్లస్టర్‌గా తీసుకొని సేంద్రియ ఎరువులపై రైతులందరికీ అవగాహన కల్పించనున్నాం. పకడ్బందీగా విత్తన గ్రామ పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విత్తన గ్రామ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. బోధన్, భిక్కనూర్, బిచ్కుంద మండలాలో మినుముల విత్తనాల కోసం ఆరు క్వింటాళ్లు సరఫరా చేశాము. 12 మండలాలలో 900 క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకు సరఫరా చేయగా, నారుమళ్లు కూడ సిద్ధం చేశారు. సోయా సీడ్ కోసం 3000 క్వింటాళ్లు లక్ష్యం కాగా, 2600 క్వింటాళ్లు సరఫరా చేశాము. వచ్చే ఏడాదిలో రైతులు ప్రరుువేటు కంపెనీలపై ఆధారపడే పరిస్థితి ఉండదు.రెండో విడత రుణమాఫీకి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ నెలాఖ రులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీంతో మరో రూ.393.40 కోట్ల రుణా లు రైతులకు మాఫీ కానున్నాయి. -
నమో నారసింహ
అహోబిలం శనివారం నరసింహ నామస్మరణతో మార్మోగింది. దిగువ అహోబిలంలో తెల్లవారుజామున గరుడోత్సవంపై భక్తులకు దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు.. రాత్రి తెప్పోత్సవంలో కనువిందు చేశారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకం నిర్వహించిన వేదపండితులు అనంతరం తెప్పపై కొలువుదీర్చారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలతో స్వామికి కలిగిన శ్రమను తొలగించడానికి తెప్పోత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయమని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ తెలిపారు. నేడు, రేపు కూడా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో తెప్పోత్సవాన్ని శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. దేవాలయంలో ఉత్సవమూర్తులు ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు వేదమంత్రోచ్చారణల మధ్య అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పల్లకిలో దేవాలయం సమీపంలో ఉన్న కొనేరు వద్దకు తీసుకువచ్చారు. కోనేరు వద్ద అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్శఠగోపయతీంద్ర మహదేశికన్, దేవస్థాన మేనేజర్ రామానుజన్, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేరులో సిద్ధంగా ఉన్న తెప్పలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం ఉత్సవమూర్తులకు హారతి ఇచ్చి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలలో 10 రోజులపాటు స్వామి వారు వివిధ వాహనాలలో తిరగడంతో కలిగిన శ్రమను తొలగించడానికి తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ తెలిపారు.తెప్పోత్సవం ముగిసిన తరువాత ఉత్సవమూర్తులను అహోబిలం మఠం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. మఠం వద్ద పీఠాధిపతి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు తెప్పోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఆది,సోమవారాల్లో కూడా తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థాన మేనేజర్ రామానుజన్ తెలిపారు. దిగువ అహోబిలంలో ఘనంగా గరుడోత్సవం ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో శనివారం తెల్లవారుజామున గరుడోత్సవం నిర్వహించారు. ప్రహ్లాదవరదస్వామినిపల్లకిలో గరుడవాహనం వద్దకు తీసుకువచ్చారు. అర్చకులు వేదమంత్రోచ్చారణలు చదువుతుండగా, మేళతాళాలు,భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వామి గరుడవాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనానికి ముందు అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్శఠగోపయతీంద్రమహదేశికన్ ఉత్సవమూర్తులు ప్రహ్లదవరదస్వామి,శ్రీదేవి,భూదేవి అమ్మవారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నరసింహ.. ఓ మంచి అధికారి
నేను, నా కుటుంబం బాగుంటే చాలని అనుకుంటూ చాలామంది గిరి గీసుకుని బతికేస్తూంటారు. కానీ, దానికి భిన్నంగా సాటి మనిషి కష్టాలు తెలుసుకొని, చలించి, తోచిన సహాయం చేస్తున్నవారు కూడా అక్కడక్కడ ఉంటారు. అటువంటి కోవకు చెందిన అధికారి నరసింహ. జైళ్ల అధికారిగా సేవాపథంలో ముందుకు సాగుతూ, ఖైదీల అభిమానాన్ని చూరగొంటున్నారు. * ఖైదీల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందిస్తున్న కోస్తా రీజియన్ జైళ్ల డీఐజీ * వారి కుటుంబాలకూ తోచిన సాయం చేస్తున్న వైనం కోటగుమ్మం (రాజమండ్రి): ఖైదీలు కూడా మనుషులేనని.. క్షణికావేశంలో తప్పులు చేసి, జైలుపాలైన వారికి కూడా కుటుంబం ఉంటుందని.. యజమాని ఖైదులో ఉంటే అతడి కుటుంబం మొత్తం కష్టాలపాలవుతుందని.. వారిని ఆదుకోవాలని చెబుతారు కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ ఎ.నరసింహ. కేవలం ఆ మాటలు చెప్పడంతో ఆయన ఆగరు. స్వయంగా ఆ కుటుంబాలకు తోచిన సహాయం చేస్తూంటారు. ఫలితంగా ఖైదీలతో ‘మంచి అధికారి’గా ప్రశంసలు అందుకుంటున్నారు. కోస్తా రీజియన్ జైళ్ల అధికారిగా మూడేళ్ల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆయన.. జైళ్లను సంస్కరణాలయాలుగా మార్చారు. విశాఖ, రాజమండ్రిల్లోని సెంట్రల్ జైళ్లు; విజయవాడ, గుంటూరు, ఏలూరు, శ్రీకాకుళంలలోని జిల్లా జైళ్లు; కాకినాడ, భీమవరం, నర్సరావుపేట, మచిలీపట్నం, గురజాలల్లోని సబ్ జైళ్లతోపాటు 35 మినీ సబ్ జైళ్లు ఆయన పరిధిలో ఉన్నాయి. ఇదీ ప్రస్థానం.. నల్గొండ జిల్లా చౌటుప్పల్ గ్రామానికి చెందిన నరసింహ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ నరసింహ విద్యాభ్యాసం పూర్తి చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ, బీఈడీ చదివి, కొద్దికాలం పార్ట్‌టైమ్ లెక్చరర్‌గా పని చేశారు. 1990లో గ్రూప్-1లో ఎంపికై జైళ్ల శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. వరంగల్, విశాఖ, కడప, విజయవాడల్లో పని చేసి, పదోన్నతిపై కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని.. బాల్యంలోను, చదువుకునే రోజుల్లోను తాను పడిన కష్టాలు మరొకరు పడకూడదని నరసింహ భావిస్తారు. ఈ ఆలోచనతోనే ఏ ఆధారమూ లేని ఖైదీల పిల్లల చదువులకు తోచిన సహాయం చేస్తున్నారు. స్కాలర్షిప్లు ఇవ్వడం, ఉన్నత చదువుల కోసం ఫీజులు కట్టడం, ఖైదీల పిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం తదితర రూపాల్లో ఆయన సహాయపడతారు. ప్రాథమిక విద్య చదువుతున్న ఖైదీల పిల్లలు సుమారు 50 మందికి స్కాలర్షిప్పులు ఇస్తున్నారు. ఉన్నత విద్య చదువుతున్న 20 మంది విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలో హాస్టల్ వసతి కల్పించి, ఫీజులు కట్టి మరీ చదివిస్తున్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకూ సుమారు 500 మంది విద్యార్థులను ఈ విధంగా చదివించారు. దీనికోసం ఏటా తన ఆదాయంలో సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారు.కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహపురానికి చెందిన గుంటూరు సోమేశ్వరరావు ఒక హత్య కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అతడి కుమారుడు గుంటూరు గోపీచంద్ టెన్తలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రి జైలులో ఉండడంతో పై చదువులు చదివించే స్తోమత లేక అతడు సతమతమవుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీఐజీ విజయవాడ ఆంధ్రా లయోలా కళాశాలలో గోపీచంద్‌ను చదివించేందుకు ఆర్థిక సహాయం అందించారు. ఐఏఎస్ చదివేవరకూ హాస్టల్ విద్యాభ్యాసానికి అవసరమైన సహాయం చేస్తానని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. పెద్దాపురానికి చెందిన మోకమాటి సత్యనారాయణ అనే జీవిత ఖైదీ కుమార్తె వివాహానికి రూ.30 వేల వరకూ ఆర్థిక సహాయం చేసి, ఆ పెళ్లి జరిగేందుకు కృషి చేశారు. ఏటా ఉత్తమ ఖైదీలకు పురస్కారాలు ఏటా అక్టోబర్ 2న ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించి సత్ప్రవర్తనతో మెలిగే ఖైదీలకు కలెక్టర్ చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేస్తారు. తద్వారా ఖైదీల్లో మంచి ప్రవర్తన నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారు. విద్యా ప్రదాత జైలులో ఉన్న నాకు, నా కుటుంబానికి నా కుమారుడిని చదివించే స్తోమత లేదు. ఖైదీల ద్వారా ఈ విషయం తెలుసుకున్న డీఐసీ నరసింహ నా కుమారుడికి కాలేజీ, హాస్టల్ ఫీజులు చెల్లించి చదివిస్తున్నారు. ఆయనకు రుణపడి ఉంటా. - గుంటూరు సోమేశ్వరరావు, జీవిత ఖైదీ -
బంగారు బాతు 'నరసింహ'
పత్తి వంగడం సంపాదన ఏటా రూ. 5 వేల కోట్లు! 20 ఏళ్లుగా ఎదురులేని నంద్యాల పత్తి వంగడం ‘నరసింహ’ 1994లో దీన్ని రూపొందించిన ఘనత సీనియర్ విశారంత శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్‌దే దేశవ్యాప్తంగా అన్ని కంపెనీల హైబ్రిడ్స్, బీటీ పత్తి విత్తనాలకు ఇదే మూలాధారం వ్యవసాయ శాస్త్రవేత్త చేతి నుంచి విడుదలైన ఏ పత్తి వంగడం మనుగడైనా మహా అయితే ఐదేళ్లు. అప్పటికల్లా దీన్ని తలదన్నే మరో రకం వచ్చేస్తుంది. అయితే, ఏకంగా 20 ఏళ్లుగా వసివాడని నాన్ బీటీ పత్తి వంగడంగా ‘నరసింహ’(ఎన్.ఎ. 1325) రికార్డు సృష్టించింది! కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కాటన్ స్పెషలిస్ట్‌గా పనిచేసిన విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కాదరబాద్ రవీంద్రనాథ్ దీన్ని రూపొందించారు. 1994లో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. నరసింహ సూటిరకం పత్తి విత్తనాలను 1995 జూన్ 12న అప్పటి ప్రధాన మంత్రి, నంద్యాల ఎంపీ కూడా అయిన పీ వీ నరసింహారావు రైతులకు తొలుత పంపిణీ చేశారు. అప్పటి నుంచి రైతుల ఆదరణ పొందుతున్న ఈ వంగడాన్ని దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు విత్తనోత్పత్తి కోసం దీన్ని బేస్(పునాది)గా వాడుతుండడం విశేషం. ‘నరసింహ’ తీరే వేరు! నంద్యాలలో 1936లో జన్మించిన రావీంద్రనాథ్ 1983లో నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో కాటన్ స్పెషలిస్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. 10 మేలైన పత్తి వంగడాలను, రెండు హైబ్రిడ్ పత్తి రకాలను రూపొందించారు. సంకర జాతి రకాల్లో ఎన్‌హెచ్‌హెచ్ 390, అమెరికన్ రకాల్లో ప్రియ, నరసింహ, దేశవాళీ రకాల్లో శ్రీశైలం, అరవింద బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. అన్నిటికన్నా నరసింహ రకం ఇటు రైతులు.. అటు విత్తనోత్పత్తి కంపెనీల ఆదరణ పొందడం, అప్పటి నుంచి తిరుగులేని వంగడంగా మార్కెట్లో నిలవడం విశేషం. నాణ్యమైన అధిక దిగుబడినివ్వడమే కాకుండా శనగ పచ్చ పురుగును కొంతవరకు తట్టుకునే శక్తి దీనికి ఉంది. ఎంసీయూ 5, ఎల్ఆర్ఏ 5166 కన్నా 20 శాతం అధిక దిగుబడినిస్తున్న నరసింహ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగవుతోంది. ఈ పంట కాలపరిమితి 150 రోజులు. నల్లరేగడి నేలలతోపాటు నీటి వసతి ఉన్న ఎర్ర నేలలు, తేలికపాటి నేలల్లోనూ సాగు చేయొచ్చు. నీటి వసతి ఉంటే ఎకరానికి 15 క్వింటాళ్లు, నీటి వసతి లేకపోతే 7 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని డా. రవీంద్రనాథ్ తెలిపారు. మొదటి రెండుసార్లు తీసినప్పుడు ఎంత పత్తి దిగుబడి వచ్చిందో 3,4 సార్లు తీసినప్పుడూ ఆ స్థాయిలోనే పత్తి దిగుబడి రావడం దీనికున్న మరో ప్రత్యేకత అన్నారు. ఈ పత్తిలో దూది 37% ఉంటుంది. పోచ పొడవు 27.6 మి.మీ. ఉంటుంది. 40 కౌంట్ల దారం తీయడానికి అనువైనది. ఇన్ని మంచి లక్షణాలుండబట్టే దీన్ని తలదన్నే మరో నాన్ బీటీ పత్తి విత్తనం ఇప్పటికీ రాలేదు. లిఖితపూర్వకంగా కోరితే ‘నరసింహ’ విత్తనాలిస్తాం! అయితే, ప్రతి ఏటా కొనాల్సిన బీటీ పత్తి విత్తనాలు తప్ప.. తిరిగి వాడుకోవడానికి వీలైన నాన్‌బీటీ పత్తి విత్తనాలు మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో లేవు. నాన్‌బీటీ నరసింహ పత్తి విత్తనాలపై ఆసక్తి ఉన్న వారు నంద్యాలలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అసియేట్ డెరైక్టర్ ఆఫ్ రీసెర్చ్ డా. వై. పద్మలత(99896 25208)ను సంప్రదించవచ్చు. రైతు బృందాలు లేదా సంస్థలు ఫిబ్రవరి, మార్చిలోగా తమను లిఖితపూర్వకంగా కోరితే యూనివర్సిటీ అనుమతితో వచ్చే ఖరీఫ్‌లో నరసింహ సూటిరకం విత్తనాలను ఉత్పత్తి చేసి ఇవ్వగలమని ఆమె తెలిపారు. - గవిని శ్రీనివాసులు, కర్నూలు ‘నరసింహ’ను రూపొందించడం నా అదృష్టం! 1994లో విడుదలైన ‘నరసింహ’ పత్తి వంగడం నేటికీఆదరణ పొందుతుండటం ఆనందదాయకం. కొత్త రకాలు సాధారణంగా నాలుగైదేళ్లకు కనుమరుగవుతుంటాయి. నరసింహ మాత్రం ఏటికేడాది అభివృద్ధి చెందుతుండటం విశేషం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న 80 శాతం హైబ్రిడ్ పత్తి రకాలకు నరసింహ ఆడ పేరెంట్‌గా వాడుతున్నారు. ఈ వంగడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో ఏటా దాదాపు రూ. 5 వేల కోట్ల ఆదాయం వస్తున్నది. ఇటువంటి తిరుగులేని పత్తి వంగడాన్ని రూపొందించగలగడం నా అదృష్టం. - డా. కాదరబాద్ రవీంద్రనాథ్(99495 10008), విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త, నంద్యాల, కర్నూలు జిల్లా -
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
చాంద్రాయణగుట్ట, : అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ ఎం.హుస్సేన్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం....శంషీర్‌గంజ్ కాల్వగడ్డకు చెందిన నర్సింహ్మా (25) గోల్డ్‌స్మిత్. కాగా ఇతని పక్కింట్లోనే ఉంటున్న ఆరేళ్ల చిన్నారిపై అతడి కన్ను పడింది. శుక్రవారం సాయంత్రం చిన్నారిని ఇంట్లోకి పిలిపించుకున్నాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొద్ది సేపటి అనంతరం చిన్నారి విషయాన్ని తల్లికి తెలిపింది. దీంతో తల్లిదండ్రులు శుక్రవారం అర్ధరాత్రి ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితునిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
శభాష్ నరసింహా..
ధర్మవరం: శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు చెన్నేకొత్తపల్లికి చెందిన వికలాంగ విద్యార్థి నరసింహా హాజరయ్యాడు. ఇతనికి పుట్టుకతోనే చేతులు లేవు. చదువు మీద శ్రద్ధతో కాలితో రాయడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తుండటంతో టీచర్లు అతన్ని నవోదయ ప్రవేశపరీక్ష రాయమని సలహా ఇచ్చారు. ఈ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన డీఈఓ కాలితో పరీక్ష రాస్తున్న నరసింహను చూసి అభినందించారు. -
శభాష్ నరసింహా..
శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన నవోదయ ప్రవేశ పరీక్షకు చెన్నేకొత్తపల్లికి చెందిన వికలాంగ విద్యార్థి నరసింహా హాజరయ్యాడు. ఇతనికి పుట్టుకతోనే చేతులు లేవు. చదువు మీద శ్రద్ధతో కాలితో రాయడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. చదువులో మంచి ప్రతిభ కనబరుస్తుండటంతో టీచర్లు అతన్ని నవోదయ ప్రవేశపరీక్ష రాయమని సలహా ఇచ్చారు. ఈ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చిన డీఈఓ కాలితో పరీక్ష రాస్తున్న నరసింహను చూసి అభినందించారు. - న్యూస్‌లైన్, ధర్మవరం -
రైతులకు పథకాలు అందించాలి
నిజామాబాద్ వ్యవసాయం, న్యూస్‌లైన్ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వారికి అందించేందుకు వ్యవసాయ అధికారులు కృషిచేయాలని జల్లా వ్యవసాయ శాఖ జే డీఏ నర్సింహ వ్యవసాయ అధికారులకు సూచించారు. గురువారం నిజామాబాద్ వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ఏడీఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. యంత్రలక్ష్మి పథకం కింద మంజూరు చేసిన నిధులతో రైతులు యంత్రాలను సమకూర్చేందుకు కృషిచేయాలని ఆదేశించారు. జిల్లాలో రూ. 13 కోట్ల నిధులు యంత్రలక్ష్మి పథకం కింద మంజూరైనట్లు తెలిపారు. నిజామాబాద్ డివిజన్లో రూ.1.5 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులను నెలాఖరు వరకు ఖర్చు చేయాలని సూచించారు. పథకం కింద రైతులకు ట్రాక్టర్ పరికరాలు, తాడ్‌పత్రిలు, రోటవేటర్లు అందించాలని సూచించారు. డివిజన్ పరిధిలో పథకం అమలు తీరును ఆయన ఏడీఏ వెంకటలక్ష్మిని ఆయన అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశంలో ఏవోలు కేతావత్ సంతోష్, సురేష్‌గౌడ్, హరినాయక్, శశిధర్‌రెడ్డి,డీడీఏ నర్సింహాచారి, సూపరింటెండెంట్ ప్రసాద్, ఏఈవో దివ్యభార తి, అధికారులు పాల్గొన్నారు. -
మరో రెండు అవినీతి చేపలు
=ఏసీబీకి చిక్కిన యూఎల్సీ సీనియర్ అసిస్టెంట్, అటెండర్ =యూఎల్సీ సర్టిఫికెట్‌కు రూ.10 వేలు డిమాండ్ =లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం విశాఖపట్నం, స్యూస్లైన్ : కలెక్టరేట్లోని ఓ విభాగంలో సీనియర్ అసిస్టెంట్, అటెండర్ రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ నరసింహారావు తెలిపిన వివరాలివి. అక్కయ్యపాలెం నందగిరినగ ర్కు చెందిన వరిసి శ్రీనివాసరావు కుమారుడి చదువు కోసం తన మూడంతస్తుల భవనంపై బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేశాడు. బ్యాంకు అధికారులు యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకురావాలని కోరారు. ఈ మేరకు ఆయన ఈ ఏడాది ఆగస్టు 12న ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నాడు. వాస్తవానికి ప్రజావాణిలో దరకాస్తులకు నెలరోజుల్లోపు సమాధానం ఇవ్వాలి. ఎప్పటికీ స్పందన లేకపోవడంతో కలెక్టరేట్లోని సంబంధిత భూ గరిష్ట పరిమితి చట్టం ప్రత్యేకాధికారి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసరావును కలిశాడు. సర్టిఫికెట్ కోసం ఆయన రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులే ఇచ్చుకోగలిగితే బ్యాంకు రుణం కోసం ఎందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కనీసం రూ. 8 వేలు ఇవ్వాలని కోరాడు. దీంతో శ్రీనివాసరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు రూ.8 వేలు తీసుకుని శుక్రవారం మధ్యాహ్నం యూఎల్సీ కార్యాలయానికి వెళ్లాడు. సీనియర్ అసిస్టెంట్‌కి డబ్బులు ఇవ్వగా.. అటెండర్ వేణుగోపాలరెడ్డిని పిలిచి తీసుకోమని చెప్పాడు. అతడు ఆ మొత్తాన్ని తీసుకుని టీ కప్పు సాసర్ కింద పెట్టాడు. అప్పటికే సిద్ధం చేసిన యూఎల్సీ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చారు. అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ డీఎస్పీ నరసింహారావు, ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, గణేష్, రామకృష్ణ సొమ్ము స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించనున్నట్లు తెలిపారు. -
ఏఈ సహా అధికారుల నిర్బంధం
వీపనగండ్ల,న్యూస్‌లైన్: తమకు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్తు సరఫరా చేయక పోవడంతో వీపనగండ్ల మం డల పరిధికి చెందిన పలువురు రైతులు ఆగ్రహంతో విద్యుత్తు ఏఈని ఇతర సిబ్బందిని సోమవారం నిర్బంధించా రు. ఇటీవల సబ్‌స్టేషన్‌ను ముట్టడిం చిన రైతులకు ఏఈ ఏడుగంటల వి ద్యుత్తు సరఫరాలకు హామీ ఇచ్చిన సం గతి విదితమే.అది ఆచరణ దాల్చకపోవడంతో సోమవారం వీపనగండ్ల 33/ 11కేవీ సబ్‌స్టేషన్‌ను సంగినేనిప ల్లి, తూంకుంట, వీపనగండ్ల గ్రామాల రై తులు మరో మారు ముట్టడించారు. ఏ ఈ నర్సింహ్మతో పాటు జేఎల్ఎంలు ర మేష్, సాయిప్రసాద్, ఆపరేటర్లు నా గరాజు, శ్రీకాంత్‌లను రైతులు గది లో బందించారు. 10రోజులుగా తూం కుంట ఫీడర్‌కు విద్యుత్ సరఫరా నిలి చిపోవడంతో వేలాది రూపాయలు పె ట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్ సమస్య త లెత్తిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆందోళన విషయాన్ని తెలుసుకున్న ఏఎస్ఐ వహీద్అలీబేగ్ సి బ్బం దితో వెళ్లి రైతులను శాంతింపచేసేందుకు యత్నించారు. అధికారులు రైతు ల ఒత్తిడికి తలొగ్గి ఒకే ట్రాన్స్ఫార్మర్ నుండి తూంకుంట ఫీడర్‌కు సరఫరా అవుతున్న విద్యుత్ లైన్‌ను సబ్‌స్టేషన్‌లోని రెండో ఫీడర్‌కు కలపడంతో వా రు శాంతించారు. భవిష్యత్తులో వి ద్యుత్ సమస్య తలెత్తకుండా తూం కుంట ఫీడర్‌కు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని రైతులు ఏఈపై ఒత్తిడి తె చ్చారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ప్ర త్యేక లైన్ పనుల్లో జాప్యం చోటుచేసుకుందని ఉన్నతాధికారులకు విషయా న్ని విన్నవించి పనులు పూర్తయ్యేలా చూస్తానని రైతులకు ఏఈ హమీ ఇచ్చా రు. కార్యక్రమంలో రైతుసంఘాల నా యకులు రాంచంద్రయ్యగౌడ్, పీఏసీఎస్ డెరైక్టర్ కుర్మయ్య, ఉపసర్పంచ్ రాముడు, రైతులు బత్తుల యాదయ్య, సత్యనారాయణగౌడ్, కుర్ముర్తి, కృష్ణ య్య, మౌలాలి, రామన్‌గౌడ్, మైనద్దిన్, తుప్పలయ్య పాల్గొన్నారు. -
బస్తీ బాలుడు.. భళా అనిపించాడు...
హైటెక్‌సిటీ చెంతన ఓ బస్తీలోని ఇరుకు గదిలో నివాసం. తండ్రి కూలీ. తల్లి హౌస్‌కీపర్. వీరి అబ్బాయి నర్సింహ విద్యా ప్రమాణాలు మచ్చుకైనా లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థి. అయితేనేం.. ప్రతిభకు అవేవీ ఆటంకం కావని నిరూపించాడు. లక్షలకు లక్షలు పోసి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతో పోటీపడి ఆంగ్లభాషా ప్రావీణ్యంలో విజయకేతనం ఎగురవేశాడు. భవిష్యత్తులో పోలీస్ అధికారి కావాలనుకొంటోన్న ఆ విద్యార్థి సక్సెస్ స్టోరీ.. సున్నాల్లేని గోడలు, గొళ్లాల్లేని తలుపులు... ఇరుకిరుకు గదులు, సమయానికి రాని మాస్టార్లు, నాణ్యతలేని మధ్యాహ్న భోజనం... అరకొర చదువులు... ప్రభుత్వ పాఠశాలలు అనగానే అందరికీ గుర్తుకువచ్చే దుస్థితి. అయితే అలాంటి పరిస్థితుల నుంచి కూడా విశేషమైన విజయాలు పుట్టుకొస్తాయి. అలాంటి విజయం సాధించిన బాలుడు నర్సింహ... ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ‘ఇంటలిజెన్స్’ ముందు దిగదుడుపే అని నిరూపించాడు. రూ.లక్షలు చెల్లించి చదివే విద్యార్థులతో పోటీపడి గెలిచాడు. అది కూడా తెలుగు మీడియం విద్యార్థులను అనుక్షణం భయపెట్టే ఆంగ్లభాషా ప్రావీణ్యంలో... పేదింట్లో విద్యా కుసుమం వికసించింది. తెలుగు భాషలో విద్యా బుద్ధులు నేర్చుకుంటున్న ఓ బాలుడు శుక్రవారం ఆంగ్ల పదజాలంలో నిర్వహించిన పోటీల్లో కార్పొరేట్ విద్యార్థులను తోసిరాజన్నాడు. మొదటి స్థానంలో నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి వలస వచ్చిన నిరుపేద దంపతుల కుమారుడు రూ.50 వేలు నగదు గెలుచుకున్నాడు. ఇంటిల్లిపాదీ పని... ఒక్కడి చదువు... మెదక్ జిల్లా కంగ్టి మండలం దేగులవాడి గ్రామానికి మార్జోడి మారుతి ఇరవై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చాడు. భార్య లలితమ్మ, కొడుకులు రవికుమార్, నర్సింహలతో కలిసి గచ్చిబౌలిలోని సిద్దిఖ్‌నగర్‌లో నివాసముంటున్నారు. తండ్రి కూలి పనులు చేసుకుంటుండగా, తల్లి లలితమ్మ, సోదరుడు రవికుమార్‌లు హైటెక్‌సిటీలోని ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ పనులు చేస్తున్నారు. ముగ్గురు పనిచేస్తేనే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే స్థోమత లేక చిన్న కొడుకు నర్సింహను అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం నర్సింహ అక్కడ 5వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రుల కష్టం అర్థమైనట్టు... చదువులో రాణిస్తున్న నర్సింహ క్లాస్‌లో అన్నింటా ఫస్ట్ కావడంతో ఆంగ్లభాషా ప్రావీణ్యంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించే అట్లాంటా ఫౌండేషన్ దృష్టిని ఆకర్షించాడు. దీంతో నర్సింహకు ఆంగ్ల పదజాలంలో కొంతకాలం పాటు శిక్షణ ఇచ్చారు. ఔరా..! ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా పోటీలలో ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో నర్సింహను ఎంపిక చేస్తే... ఏకంగా విజేతగా నిలిచి నర్సింహ అందర్నీ ఆశ్చర్యంలో ముంచాడు. అల్లిబిల్లిగా ఉండే ఆంగ్ల అక్షరాలతో పదాలను కూర్చడం, ఉచ్ఛరించిన ఆంగ్లపదాల స్పెల్లింగులు కరెక్ట్ చేయడం... వంటి విభిన్న రకాల అంశాలతో నిర్వహించిన ఈ పోటీకి నగరానికి చెందిన దాదాపు అన్ని టాప్ క్లాస్ కార్పొరేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా ల్యాప్‌టాప్‌పై సమాధానాలు ఇస్తూ నర్సింహ ముందు వరుసలో నిలిచాడు. చివరకి... మాదాపూర్‌లోని మహీంద్రా సత్యంలో శుక్రవారం అట్లాంటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘లెర్నేసియం ఓపెన్ వొకాబ్ కాంటెస్ట్- 2013-14’ ఫైనల్స్‌లో అందర్నీ తోసిరాజని... అంజయ్యనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తరఫున ప్రైమరీ స్కూల్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ప్రశంసా పత్రం, మెమొంటోతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని సైతం దక్కించుకున్నాడు. ఎంతో సంతోషంగా ఉంది... పెద్ద పాఠశాలల్లో చదివే పిల్లలతో పోటీపడి తమ కొడుకు ఛాంపియన్‌గా నిలవడంపై తల్లిదండ్రులు మారుతి, లలితమ్మలు ఆనందం వ్యక్తం చేశారు. చదువంటే ఎంతో ఇష్టమని, అయినా ప్రైవేట్ స్కూల్లో చదివించే స్థోమత తమకు లేదన్నారు. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. మంచి ఉద్యోగమే లక్ష్యం... బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని తాను భావిస్తున్నట్లు విద్యార్థి నర్సింహ తెలిపారు. పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మొదట్లో ఇంగ్లిష్‌లో చదవాలంటే భయం వేసేదని చెప్పారు. ఆ తరువాత మేడం రోజూ క్లాస్ తీసుకోవడంతో భయం పోయిందన్నారు. సృజనాత్మకతను వెలికి తీసేందుకే... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లోనూ ప్రతిభకు కొరత ఉండదు. పేద విద్యార్థులకు ఆంగ్ల భాషలో శిక్షణ ఇస్తున్నాం. వారిలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకే అట్లాంటా ఫౌండేషన్ కొంత కాలంగా కృషి చేస్తోంది. ఛాంపియన్‌గా నిలిచిన అంజయ్యనగర్‌లోని ప్రైమరీ స్కూల్ విద్యార్థి నర్సింహకు నేనే శిక్షణ ఇచ్చా. ఆత్మ స్థైర్యంతో పోటీపడి విజయం సాధించాడు. - శేషు, అట్లాంట ఫౌండేషన్