జేసీబీ ఆపరేటర్ వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.
జేసీబీ ఆపరేటర్ వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా మేడేపల్లి మండలం కొనుగోడు గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుంచె నరసింహ (42) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేసే వ్యవసాయ బావి పూడిక తీత పని కోసం వెళ్లాడు. పూడిక తీత తర్వాత బావి ఒడ్డున ఉన్న జనరేటర్ కాలికి తగలడంతో అదుపుతప్పి బావిలో పడి మృతి చెందాడు.