jcb
-
‘‘వీళ్లు మనుషుల్రా..బాబూ..!’’ జేసీబీని ఎత్తికుదేసిన గజరాజు, వైరల్ వీడియో
సాధారణంగా సాధు జంతువులైనా, అడవి జంతులైనా వాటికి హాని కలుగుతుందన్న భయంతోనే ఎదుటివారిపై దాడి చేస్తాయి ఈ విషయంలో ఏనుగు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలా సహనం నశించి ప్రాణ భయంతో ఏనుగు తిరగబడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆహారం కోసం వచ్చి తనదారిన తాను పోతున్న అడవి ఏనుగును అనవసరంగా కావాలనే రెచ్చగొట్టారు తుంటరిగాళ్లు. వేలం వెర్రిగా వీడియోలను తీసుకుంటూ వేధించారు. ‘‘చూసింది.. చూసింది.. మనుషులురా..ఇక వీళ్లు.. మారరు.. అనుకున్నట్టుంది.. తనదైన శైలిలో ప్రతాపం చూపించింది. జేసీబీని ఎత్తి కుదేసింది. పశ్చిమ బెంగాల్లో ఫిబ్రవరి 1న జరిగిన ఈ సంచలన ఘటన సోషల్ మీడియా ఆగ్రహానికి కారణమైంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలోని డామ్‌డిమ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆహారం కోసం ఒక పెద్ద ఏనుగు అపల్‌చంద్ అడవి నుండి బయటకు వచ్చింది. స్థానికులు దానిని వెంటాడారు. ఏనుగును వేధించి వెంబడించారు. అక్కడ ఉన్న వారిలో ఒకరు ఏనుగు తోక పట్టుకొని లాగారు. సహనం నశించిన అది చుట్టూ మూగినవారిపై దాడి చేసింది.. నిర్మాణ సామగ్రిని,సమీపంలోని వాచ్‌టవర్‌ను లక్ష్యంగా చేసుకుంది. జేసీబీపై తన ఆగ్రహాన్ని ప్రకటించింది. డ్రైవర్ ఎక్స్కవేటర్ బకెట్‌ను ఉపయోగించి దానిని ఎదుర్కొన్నాడు. దీంతో ఏనుగు పారిపోవడానికి అలా తిరిగిందో మళ్లీ జనం ఎగబడటం వీడియోలో రికార్డ్ అయింది. స్థానికులెవరికీ గాయాలు కాలేదు.కానీ ఏనుగుకి తొండంపై గాయాలైనాయి. దీంతో నెటిజనులు మండిపడుతున్నారు. ఏనుగుని గాయపర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. TRAGIC THIS: In search of food but disturbed by human noise, a wild elephant attacked a JCB and a watchtower in Damdim (Dooars) today. In the chaos, the tusker also sustained injuries. pic.twitter.com/ZKlnRixaFN— The Darjeeling Chronicle (@TheDarjChron) February 1, 2025వన్యప్రాణులతో సహజీవనం చేయాలని, వాటి పట్ల దయతో వ్యవహరించాలనే అభిప్రాయాలను వ్యక్తం చేశారు చాలామంది. అలాగే అడవి జంతువులను కాపాడటానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించిన వారిపైఅటవీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, లేకపోతే కొన్ని సంవత్సరాల్లో ఇవి పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. "ఏనుగులను ఏమీ అనకపోతే వాటిదారిన అవి పోతాయి, వేధిస్తేనే తిరగబడతాయని మరొకొరు పేర్కొన్నారు. ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం!మరోవైపు జేసీబీ డ్రైవర్ , ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఏనుగును వేధించారనే ఆరోపణలపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని బహుళ సెక్షన్ల కింద వన్యప్రాణి కార్యకర్త తానియా హక్‌తో పాటు, మరికొందరు ఫిబ్రవరి 2న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు. అడవి ఏనుగును రెచ్చగొట్టాడనే ఆరోపణలతో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.జేపీబీ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. జేసీబీ క్రేన్‌తో ఏనుగును రెచ్చగొట్టి దాడి చేసినందుకు నిందితుడిని అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దేబల్ రే తెలిపారు. ఏనుగును అడవిలోకి వదిలేశామని అన్నారు.బెంగాల్ ప్రస్తుతం దాదాపు 680 ఏనుగులకు నిలయంగా ఉంది. అడవి ఏనుగులు తరచుగా ఆహారం కోసం జల్పైగురి, నక్సల్బరి, సిలిగురి , బాగ్డోగ్రా వంటి ప్రాంతాలలో తిరుగుతుంటాయి. సాధారణంగా, స్థానికులు సురక్షితమైన దూరంలో ఉంటూ, వారితో ప్రేమగా, శాంతియుతంగా ఉంటారు. అయినా పశ్చిమ బెంగాల్ అడవులలో మానవ-ఏనుగుల సంఘర్షణ చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య. దీనివల్ల పెద్ద సంఖ్యలో మానవ మరణాలు సంభవిస్తున్నాయి. పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూలై 2024 నాటి డేటా ప్రకారం, 2023-24లో పశ్చిమ బెంగాల్లో మానవ-ఏనుగుల సంఘర్షణ కారణంగా 99 మానవ మరణాలు సంభవించాయి.ఇది ఒడిశా ,జార్ఖండ్లతో పాటు దేశంలోనే అత్యధిక మరణాలలో ఒకటి. 2022-2023 మంత్రిత్వ శాఖ డేటా ఆధారంగా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో వేటాడటం, విద్యుదాఘాతం, విషప్రయోగం రైలు ప్రమాదాలు వంటి మానవ ప్రేరిత కారకాల వల్ల తక్కువ సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదయ్యాయి. ఇక్కడ 2023లో మొత్తం ఏడు ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. -
పోతే ఒక్కడిని.. వస్తే పది మందిమి
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై వరదలో చిక్కుకున్న తొమ్మిదిమందిని కాపాడేందుకు ‘పోతే ఒక్కడిని..వస్తే పది మందిమి అంటూ జేసీబీ డ్రైవర్ ఎస్కే.సుబాన్ ధైర్యం చేయగా, ‘జేసీబీ మధ్యలో ఆగిపోతే మనమైనా తీసుకొద్దామంటూ’వెంకటగిరికి చెందిన మొర్రిమేకల ఉపేందర్, మొర్రిమేకల జవహర్లాల్, కనపర్తి నాగేశ్వరరావులతోపాటు కొందరు గ్రామపెద్దలు ముందుకు రావడంతో దాదాపు 14 గంటల పాటు ఆపదలో చిక్కుకున్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. అసలేం జరిగిందంటే... ఈ నెల 1న ఆదివారం మున్నేరు వాగుకు ఒక్కసారిగా వచ్చిన భారీ వరదతో ఖమ్మం ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై వోగబోయిన శ్రీనివాసరావు, ఆయన కుమారుడు విక్రమ్, కట్టెలమండె వాచ్మెన్ మోహన్–లక్ష్మి దంపతులు, వీరి ఇద్దరు కుమారులు, వర్కర్లు వినోద్, వెంకన్నతో పాటు మరొకరు చిక్కుకున్నారు. షాపుల్లో ఉన్న వీరు వరద పరిస్థితిని గమనించి ఎటూ వెళ్లలేక ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. ఉదయం నుంచి తమకు సాయం చేయాలని వీరితోపాటు కుటుంబీకులు అధికారులు, ప్రభుత్వ యంత్రాంగాన్ని వేడుకున్నా స్పందన కనిపించలేదు. హెలికాప్టర్ వస్తోందని.. ఎన్డీఆర్ఎఫ్ టీం వస్తుందంటూ రాత్రి 10 గంటల వరకు తాత్సారం చేశారు. యంత్రాంగం జాప్యంతో... యంత్రాంగం చెబుతున్న మాటలతో విసుగెత్తిన వెంకటగిరివాసులు తొమ్మిది మంది ప్రాణాలను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకున్నారు. అక్కడే ఉన్న జేసీబీ యజమాని వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లగా డ్రైవర్ సరేనంటే వాహనం ఇచ్చేందుకు సిద్ధమేనని చెప్పాడు. డ్రైవర్ ఎస్.కే.సుబాన్(హరియాణావాసి)తో మాట్లాడారు. కాలు కాస్త ఇబ్బందిగా ఉండే ఆయన్ను బండి తీసుకొని వరదలోకి వెళ్లే ధైర్యం ఉందా అని అడగగా.. ‘ప్రాణాలను కాపాడేందుకే కదా వెళ్తా.. వస్తే అందరం వస్తాం.. లేకపోతే ఒక్కడిని పోతా’అని ముందుకొచ్చాడు. అయితే రాత్రి 8 గంటల నుంచి రెండుసార్లు ప్రయతి్నంచగా.. మధ్యలో రోడ్డు కోతకు గురికావడంతో బండి ముందుకు కదల్లేదు. దీంతో మొర్రిమేకల ఉపేందర్, మొర్రిమేకల జవహర్లాల్, కనపర్తి నాగేశ్వరరావు తాము తాళ్ల సాయంతో బ్రిడ్జిపైకి వెళతామని చెప్పగా..11 గంటల సమయాన వారు రోడ్డు కోతకు గురైన ప్రాంతం వరకు జేసీబీపై వెళ్లి అక్కడ నుంచి జేసీబీ బకెట్ మీదుగా బ్రిడ్జివైపు దిగారు. అనంతరం బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మందిని అదే జేసీబీ బకెట్లోకి ఎక్కించి సురక్షితంగా ఇవతలికి తీసుకొచ్చారు. తొమ్మిది మందిని సురక్షితంగా తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన జేసీబీ యజమాని, స్థానికులతోపాటు డ్రైవర్ సుబాన్ సేవలను కొనియాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రాణాలను కాపాడాలని.. వరదలోకి వెళ్లేందుకు ధైర్యం ఉందా అని అడిగారు. నేను పోతే ఒక్కడినే.. వస్తే పది మంది అని సాహసించి ముందుకు వెళ్లాను. ఇంజిన్ పైకి నీళ్లు వచ్చాయి. మొదట రెండుసార్లు ప్రయతి్నంచి విఫలమయ్యాను. మూడోసారి స్థానికుల సహకారంతో తొమ్మిది మందిని రక్షించగలిగాం. – ఎస్.కే.సుబాన్, జేసీబీ డ్రైవర్డ్రైవర్తో పాటే మేం కూడా.. హెలికాఫ్టర్‌తో కాపాడుతారని అంటుంటే చూద్దామని వచ్చాం. ప్ర భుత్వ సాయం ఎంతకూ అందకపోవడంతో వారిని రక్షించేందుకు మేము ముందుకొచ్చాం. జేసీబీ డ్రైవర్‌తో పాటు మేము తాళ్లను తీసుకొని వరదను దాటి వెళ్లి తొమ్మిది మందిని ఒడ్డుకు చేర్చాం. – మొర్రిమేకల ఉపేందర్, వెంకటగిరివాసిబండికి నష్టం జరిగినా సరే అన్నా.. జేసీబీ పోయినా ప ర్వాలేదు.. ప్రాణాలు కాపాడొచ్చనుకుని బండి పంపించా. పోలీసులు ఒప్పుకోకుంటే మాదే బాధ్యత అని ఒప్పందం చేసుకొని బండి ని పంపా. జేసీబీ ఇంజిన్లోకి నీళ్లు పోవడంతో మరమ్మతుకు రూ.85 వేలు ఖర్చు అవుతుంది. అయినా ప్రాణాలు కాపాడామనే తృప్తి కలిగింది. – వెంకటరమణ, జేసీబీ యజమాని -
‘పోతే నా ఒక్కడి ప్రాణం..’ ఖమ్మం రియల్ హీరో సాహసం వైరల్
ఖమ్మం, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయిపోయింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది. అయితే..శనివారం రోజు కురిసిన భారీ వర్షాలకు.. మున్నేరు వరద ప్రమాదకరంగా పొంగిపొర్లింది. భారీ వర్షం, వరద ధాటికి ప్రకాశ్‌నగర్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహించింది. అనుకోకుండా.. ఈ బ్రిడ్జి మీద చిక్కుకుపోయిన తొమ్మిది మంది సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు. ఈ ప్రమాదకర వరదల్లో సుభాన్ ఖాన్ అనే జేసీబీ డ్రైవర్ ప్రదర్శించిన సాహసం.. జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. If I go, it is one life, if I return, I will save nine lives: this was the courage shown by #Subhankhan who took a JCB to bring back 9 people marooned on Prakash Nagar Bridge #Khammam from early hrs on Sept1; You can hear daughter brimming with pride #MyDaddyBravest #RealLifeHero pic.twitter.com/tbthGfUhRB— Uma Sudhir (@umasudhir) September 3, 2024వాళ్లను రక్షించేందుకు సుభాన్ ప్రయత్నిస్తుండగా అంతా వారించారు. ‘నేను అక్కడిపోతే నాది ఒక్క ప్రాణం పోవచ్చు. నేను సాహసం చేస్తే తొమ్మిది ప్రాణాలు రక్షించిన వాడిని అవుతాను’ అని జేసీబీతో వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. వరద సహాయక కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బీఆర్ఎస్ నేతలు, స్థానిక ప్రజలు జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ చేసిన సాహసాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుభాన్‌ను ఫొన్లో అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆ రియల్ హీరో సాహసం నెట్టింట చర్చగా మారింది. -
టీడీపీ నేత క్వారీలో జేసీబీ డ్రైవర్ మృతి!
సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేత నడుపుతున్న క్వారీలో ఆదివారం జేసీబీ డ్రైవర్ మృతిచెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా బైక్‌పైనే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావడంతో అది ప్రమాదమా! లేక హత్యా! అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మాదిగబండలోని అక్రమ క్వారీ కథ ఇది..స్థానికుల కథనం ప్రకారం.. మాదిగబండ సమీపంలోని సర్వే నంబర్లు 1367,1345, 1376లో 4.43 హెక్టార్లలో రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ కోసం శరత్‌కుమార్ గనులశాఖ అనుమతులతో క్వారీ నడుపుతున్నారు. ఈక్రమంలో నిబంధనలు పాటించడంలేదని అధికారులు క్వారీకి అనుమతులు రద్దుచేస్తూ ఈ నెల 1న నోటీసులిచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ క్వారీని టీడీపీ నేత జనార్థన్‌నాయుడు స్వాధీనం చేసుకుని నడుపుతున్నారు. దీని కరెంటు బిల్లులు రూ.20.09 లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చిన విద్యుత్ అధికారులు.. బకాయిలు చెల్లించకపోయినా స్పందించలేదు. అనర్హత వేటుపడిన ఈ క్వారీని మైనింగ్ అధికారులు సీజ్ చేయకుండా వదిలేశారు. ఇన్ని ఉల్లంఘనల మధ్య యథేచ్ఛగా నడుస్తున్న ఈ క్వారీలో ఇప్పుడు జేసీబీ డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదమా? చంపేశారా?ఈ క్వారీలో ఎర్రగొండేపల్లికి చెందిన చిన్నస్వామి (38) జేసీబీ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం జేసీబీ ముందు భాగంలో తొట్టి వద్ద చిన్నస్వామి గ్రీజు వేస్తుండగా సెల్వ అనే వ్యక్తి జేసీబీ క్యాబిన్లో కూర్చొన్నాడు. సెల్వి సెల్‌ఫోన్ చూస్తూ గేర్ వేయడంతో జేసీబీ తొట్టె కిందికెళ్లిపోయి, గ్రీజు వేస్తున్న చిన్నస్వామిపై పడిందని, దాని కింద నలిగి అతను మృతి చెందినట్టు చెబుతున్నారు. పోలీసులను పిలవకుండానే మృతదేహాన్ని బైక్‌పై ఆస్పత్రికి తెచ్చారు. క్వారీలో ఉన్న జేసీబీని మాయం చేశారు. దీంతో ఇది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చిన్నస్వామిని జేసీబీతో కొట్టి చంపేశారా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్వారీ యజమాని ఆదేశాలతో ఆ ప్రాంతానికి చెందిన పలువురు అధికార పార్టీ నాయకులు మృతుడి కుటుంబానికి ఎంతోకొంత పరిహారం చెల్లించి కేసు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. మృతుల బంధువులు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఏం జరి గిందనేది తెలుస్తుందని పలమనేరు టౌన్ సీఐ చంద్రశేఖర్ చెప్పారు. -
కష్టజీవులపై కర్కశం
కనిగిరి రూరల్: వేకువజామున 4 గంటల సమయం.. కనిగిరిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన రహదారులపైకి జేసీబీలు, ట్రాక్టర్లు దూసుకొచ్చాయి. వాటి వెనుకే మునిసిపల్, రెవెన్యూ అధికారులు, సచివాయల సిబ్బంది మందీమార్బలంతో చేరుకున్నారు. ఏకంగా 80 మంది పోలీసులను వెంటబెట్టుకొచ్చారు. రహదారుల వెంబడి ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలు, బడ్డీలను నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో కనిగిరి మునిసిపల్ కమిషనర్ టీవీ రంగారావు కనీస నిబంధనలు పాటించకుండా.. కష్టజీవులపై కర్కశంగా వ్యవహరించారు. తొలుత చెప్పుల బజార్, పామూరు బస్టాండ్ వైపు బడ్డీలను పెకిలించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన చిరు వ్యాపారులను పోలీస్‌లు, మునిసిపల్ సిబ్బందితో అడ్డుకున్నారు. కనీసం తమ బడ్డీల్లో ఉన్న సామగ్రి తీసుకునే అవకాశం ఇవ్వాలని కోరినా అంగీకరించకుండా జేసీబీలతో నుజ్జునుజ్జు చేశారు. పిండి వంటలు, చెప్పుల దుకాణాలు, సెల్ పాయింట్లు, వాచీ షాపులు, గాజుల షాపులు ఇలా అనేక దుకాణాల్లో వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక వీధి వ్యాపారులు లబోదిబోమన్నారు. మొత్తం మీద చిరు వ్యాపారులకు రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.పోలీస్ పహారాతో దమనకాండ వాస్తవానికి చెప్పుల బజార్‌లోని కొన్ని దుకాణాలు, చర్చి సెంటర్లోని బడ్డీలు తొలగించనున్నట్టు కొంతకాలంగా చర్చ నడుస్తోంది. కానీ.. బుధవారం ఒక్కసారిగా పట్టణంలోని పామూరు రోడ్డు, కందుకూరు రోడ్డు, ఒంగోలు బస్టాండ్ రోడ్డులోని దుకాణాలను ముందస్తు సమాచారం లేకుండా నేలమట్టం చేశారు. 50 మంది స్పెషల్ పోలీసులు, 20 మంది పోలీస్ సిబ్బంది, నలుగురు ఎస్సైలు, సీఐలు ఈ దమనకాండలో పాల్గొన్నారు. కమిషనర్ టీవీ రంగారావు, ఆర్డీఓ పి.జాన్ ఇర్విన్, సీఐలు, ఎస్సైలు బడ్డీల తొలగింపును దగ్గరుండి పర్యవేక్షించారు. వ్యాపారుల శాపనార్థాలుబడ్డీల తొలగింపు సందర్భంగా కమిషనర్ రంగారావు వ్యవహరించిన తీరుపై చిరు వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. నోటికాడి కూడును నేలపాలు చేసి, తమ జీవితాలను రోడ్డున పడేసిన వారంతా దుమ్ము కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసమే అధికారులు దమనకాండకు పాల్పడ్డారని ప్రజా సంఘాల నాయకులు నిప్పులు చెరిగారు. చిరు వ్యాపారుల పక్షాన న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ భరోసా ఇచ్చారు. -
ఏకంగా యజమానినే కిడ్నాప్ చేసి.. రూ.4 కోట్లు తీసుకుని
కర్నూలు: జేసీబీ డ్రైవర్ ఏకంగా తన యజమానినే కిడ్నాప్ చేసి రూ.4కోట్లతో ఉడాయించిన ఘటన గత జూన్‌లో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి గతంలో 11 మందిని అరెస్టు చేయగా, ప్రస్తుతం ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు విడతల్లో రూ.3.6 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బనగానపల్లి పట్టణానికి చెందిన వినాయకరెడ్డి క్రషర్ వ్యాపారం చేస్తూ ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికవేత్తగా పేరు గడించాడు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు గ్రామానికి చెందిన నరేష్ ఇతని వద్ద గత నాలుగేళ్లుగా జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే క్రమంగా ప్రవర్తనలో మార్పు కనిపించడంతో వినయకరెడ్డి అతడిని తొలగించాడు. ఇది మనసులో పెట్టుకున్న నరేష్ అతన్ని కిడ్నాప్ చేసి కోట్లు రాబట్టేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన సురేష్, శ్రీనివాస్, ఖలందర్, అజయ్, విజయ్, భార్గవ్, ప్రభు, ప్రకాష్, రంజిత్.. అనంతపురం జిల్లాకు చెందిన రవికుమార్, రంజిత్‌కుమార్, చెన్నా భాస్కర్, రఘులతో కిడ్నాప్‌నకు తెరలేపారు. అందరూ కలిసి గత జూన్ 3న బనగానపల్లిలో రెక్కీ నిర్వహించారు. 5వ తేదీ ఉదయం బనగానపల్లి నుంచి బేతంచర్లకు వినాయకరెడ్డితో పాటు ఆయన కుమారుడు భరత్‌కుమార్‌రెడ్డి డ్రైవర్‌తో కలిసి కారులో బయలుదేరారు. అదే సమయంలో కిడ్నాపర్లు నాలుగు కార్లలో వెంబడించి సీతారామాపురం మెట్ట వద్ద అడ్డగించారు. కత్తిని చూపించి భరత్‌కుమార్‌రెడ్డి, వినాయకరెడ్డిలను కిందకు దించారు. వారిని కిడ్నాపర్ల కారులో ఎక్కిస్తుండగా డ్రైవర్ సాయినాథ్‌రెడ్డి అడ్డుకున్నారు. కిడ్నాపర్లు తండ్రీ కొడుకులతో పాటు డ్రైవర్‌ను కూడా కారులోకి కుక్కి ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత వినాయకరెడ్డి తండ్రి నాగిరెడ్డికి ఫోన్ చేసి రూ.4 కోట్లు ఇవ్వాలని, లేకుంటే వాళ్లను చంపుతామని బెదిరించారు. భయపడిన నాగిరెడ్డి బంధువుల వద్ద డబ్బు తీసుకుని మొదటగా అనంతపురం జిల్లా కొత్తపల్లి వద్ద రూ.2 కోట్లు.. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ వద్ద రూ.2 కోట్లు ముట్టజెప్పాడు. దీంతో కిడ్నాపర్లు 7వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురినీ విడిచిపెట్టారు. అయితే కిడ్నాపర్లు డబ్బు తీసుకొని కూడా తమ కుమారుడిని, మనవడిని వదిలిపెట్టరేమోనన్న ఆందోళనతో నాగిరెడ్డి జరిగిన విషయాన్ని బేతంచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ కొనసాగించారు. ఇంతలోనే కిడ్నాప్‌నకు గురైన ముగ్గురూ ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు జూన్ 30న గుత్తి పట్టణంలో 11 మందిని అరెస్ట్ చేసి రూ.40 లక్షల నగదు, కత్తి, మూడు సెల్ఫోన్లు, నాలుగు కార్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న కిడ్నాప్ ప్రధాన నిందితుడు నరేష్, చెన్నా భాస్కర్, రఘులను శుక్రవారం వేకువజామున అనంతపురం జిల్లా గుత్తి వద్ద అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2.66 కోట్లు నగదు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలో స్వాధీనం చేసుకున్న నగదుతో కలిపి మొత్తం రూ.3.6 కోట్లు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన అడిషనల్ ఎస్పీ వెంకటరాముడుతో పాటు డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ ప్రియతమ్‌రెడ్డి, ఎస్ఐలు శివశంకర్, నాయక్, రాకేష్, నరేష్, జగదీశ్వరరెడ్డి, రమేష్ రెడ్డి, హరినాథ్‌రెడ్డి, పీఆర్ఓ చెన్నయ్యలను ఎస్పీ అభినందించారు. -
జేసీ.. జేసీబీ!
తాడిపత్రి: ప్రభుత్వ విద్యాసంస్థల ప్రాంగణంలో దర్జాగా అసాంఘిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రహరీ గోడ నిర్మాణాన్ని అడ్డుకోవటమే కాకుండా తన అనుచరులతో కలసి కూల్చివేతలకు పాల్పడ్డారు. శనివారం రాత్రి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనుల వద్ద వీరంగం సృష్టించారు. జేసీ గ్యాంగ్ కూలగొట్టిన పిల్లర్లను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నించిన కార్మికులపై ఆదివారం ఉదయం దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఏం జరిగిందంటే... నాడు–నేడు ఫేజ్ 2 పనుల్లో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ నిర్మాణ పనులను మూడు రోజుల క్రితం చేపట్టారు. జూనియర్ కళాశాల సమీపంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉంది. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో నిర్మాణ పనుల వద్దకు అనుచరులతో కలసి చేరుకున్న జేసీ ‘రేయ్ జేసీబీతో పిల్లర్లను కూలదోయండిరా..’ అంటూ హుకుం జారీ చేశారు. జేసీబీతో కాంక్రీట్ పిల్లర్లను కూలదోశారు. మర్నాడు అక్కడకు వచ్చిన కూలీలను పనులు నిలిపి వేయాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అడ్డగించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రహరీ నిర్మిస్తున్నామని, అడ్డు తగలడం సమంజసం కాదని చెప్పినా వినిపించుకోలేదు. దీనిపై మేస్త్రీ గురుశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్మాణాలను దౌర్జన్యంగా కూలగొట్టడంపై జేసీ ప్రభాకర్‌రెడ్డి, వెన్నపూస మల్లికార్జునరెడ్డి, సుబ్బయ్య, వడ్డే మధు, సోమశేఖర్ నాయుడు, దినేష్‌రెడ్డి, పవన్‌నాయుడు, మునిసిపల్ కాంట్రాక్టర్ తిరుపాల్‌రెడ్డి, కుమ్మరి వెంకటేష్, రాంబాబు, గురుజాల శివశంకర్‌రెడ్డి, చరణ్, హరినాథ్‌రెడ్డి, గండికోట కార్తీక్ తదితరులపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ హమీద్‌ఖాన్ తెలిపారు. -
ఎంతకు తెగించారు.. జేసీబీతో ఏటీఎం దోపిడీకి యత్నం
యశవంతపుర(బెంగళూరు): జేసీబీలను తీసుకొచ్చి ఏటీఎంలను ధ్వంసంచేసి డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించడం పెరిగింది. ఇటీవల శివమొగ్గలో ఇటువంటి దోపిడీ యత్నం మరువకముందే మంగళూరు వద్ద సూరత్కల్లో ఇదే మాదిరిగా దొంగలు యత్నించారు. విద్యాదాయిని పాఠశాల సమీపంలో జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద సౌతిండియా బ్యాంక్ ఎటీఎం ఉంది. శుక్రవారం తెల్లవారు 2:13 గంటలకు దుండగులు జేసీబీతో వచ్చారు. ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించగా సైరన్ మోగడంతో జేసీబీ వదిలి పారిపోయారు. అక్కడికి రెండువందల మీటర్ల దూరంలోనే పోలీసుస్టేషన్ ఉంది. పడుబిద్రి నుంచి జేసీబీని తెచ్చినట్లు తేలింది. దొంగల దాడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి స్మార్ట్‌ఫోన్ కోసం లోకానికి దూరమై... మరో ఇద్దరికి ప్రాణదాతగా.. -
జేసీబీలో నిండుగర్భిణి తరలింపు
భీమ్‌గల్: ఓ నిండుగర్భిణి పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా దారి మధ్యలో చెరువుకట్ట తెగి నీటి ప్రవాహం పెరిగింది. జేసీబీ సహాయంతో ఆమెను నీటిప్రవాహంలోంచి దాటించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన నిండుగర్భిణి అనిలకు గురువారం పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో పిప్రి నుంచి బాచన్పల్లి వెళ్లే దారిలో ఉన్న చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఆమెను జేసీబీలో కూర్చోబెట్టి దాని సహాయంతో నీటి ప్రవాహాన్ని దాటించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్ ద్వారా ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
జేసీబీతో ఏటీఎంపై దాడి.. దోపిడీకి దొంగల యత్నం
శివమొగ్గ: అర్ధరాత్రి.. నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యం. పెద్ద ప్రొక్లెయినర్‌తో కొందరు వచ్చారు. వెంటనే ఏటీఎం ముందు నిలిపి నగదు యంత్రాన్ని పెకలించడంలో నిమగ్నమయ్యారు. ఇది సినిమా షూటింగ్ కాదు.. నిజంగా జరిగినదే. జేసీబీ సాయంతో ఏటీఎం యంత్రాన్ని తొలగించి డబ్బులు దొంగిలించేందుకు దొంగలు విశ్వప్రయత్నాలు చేశారు. ఈ వినూత్న సంఘటన శివమొగ్గ నగరంలోని వినోబా నగరలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. నకిలీ తాళాలతో జేసీబీ స్టార్ట్ చేసి వివరాలు.. 100 అడుగుల రోడ్డు శివాలయం ఎదురుగా ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎం సెంటర్ ఉంది. సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గత కొన్ని రోజుల నుంచి ఒక జేసీబీ వాహనం మరమ్మతుల వల్ల నిలిచి ఉంది. దొంగలు నకిలీ తాళాలను ఉపయోగించి ఈ జేసీబీని స్టార్ట్ చేశారు. తరువాత ఏటీఎం వద్దకెళ్లి దానిని పెకలించే పనిలో పడ్డారు. ఇంతలో అదే రోడ్డులో ట్రాఫిక్ సీఐ సంతోష్ కుమార్‌తో కూడిన గస్తీ వాహనం వచ్చింది. జేసీబీతో ఏటీఎం వద్ద ఏం చేస్తున్నారని దుండగులను సీఐ ప్రశ్నించారు. దీంతో దుండగులు జేసీబీని వదిలి పారిపోయారు. వినోబనగర పోలీసులు వచ్చి పరిశీలించారు. ఏటీఎం పైభాగం పూర్తి ధ్వంసమైంది. అక్కడి సీసీ కెమెరాల్లో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. దొంగల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
ఇసుకాసురులు.. భారీగా ఇసుక అక్రమ రవాణా
వనపర్తి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటూ అధికారులు ఇరవై రోజులుగా బిజీగా ఉండటంతో ఇదే అదనుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఉదయమంతా కృష్ణానది నుంచి ఇసుకను తోడి రాంపూర్, రంగాపూర్ శివారులోని పొలాల్లో నిల్వ చేయటం, అర్ధరాత్రి సమయంలో టిప్పర్లు, ట్రాక్టర్లలో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు తెర వెనుక ఉంటూ దందాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదిలో ఎంత తవ్వినా.. ఎగువ నుంచి వరద వస్తే మట్టి, ఇసుక కొట్టుకొస్తుండటంతో గుంతలన్నీ మూసుకుపోతాయి. దీంతో ఏటా వేసవిలో ఈ ప్రాంతాల నుంచి భారీగా ఇసుకను తోడుతూ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొక్కుబడి చర్యలేనా? గతంలోనూ ఇదే ప్రాంతంలో పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు పలుమార్లు ఇసుక డంపులను సీజ్ చేసినా.. ఏనాడు ప్రభుత్వం వేలం వేయలేదు. తూతూమంత్రంగా ఇసుక డంపులను సీజ్ చేయటం, తర్వాత వదిలేయటంతో అక్రమార్కులు సైతం ఇందుకు అలవాటు పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసినట్లు పత్రికల్లో వార్తలు రాయించుకోవటం మినహా చేసేదేమీ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీజ్ చేసిన కొన్నాళ్లకు డంపులను అధికారుల కళ్లుగప్పి అక్రమార్కులు విక్రయించుకోవటం పరిపాటిగా మారిందనే వాదనలు లేకపోలేదు. ఇసుక నిల్వలు సీజ్.. రంగాపూర్ శివారులోని ఇసుక డంప్‌లను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీఓ పద్మావతి మంగళవారం రంగాపూర్, రాంపూర్ శివారు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మూడు భారీ ఇసుక డంపులు గుర్తించి సీజ్ చేశారు. మొత్తంగా ఇటీవల అధికారులు సీజ్ చేసిన ఇసుక సుమారు వెయ్యి ట్రాక్టర్ల వరకు ఉండవచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కలిసొచ్చిన పుష్కర రోడ్లు.. కృష్ణా పుష్కారాల సమయంలో నిర్మించిన రోడ్లు అక్రమార్కులకు కలిసొచ్చిన అంశంగా చెప్పువచ్చు. ప్రజల సౌకర్యార్థం వేసిన రోడ్లు వాహనాలు (జేసీబీ, ట్రాక్టర్లు) నేరుగా నది వరకు వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయి. పెబ్బేరు మండలం రాంపూర్ శివారు నుంచి గద్వాల జిల్లా గుర్రంగడ్డ ప్రాంతానికి వంతెన నిర్మాణానికి గుర్తించిన ప్రాంతం నుంచి జేసీబీ సాయంతో నదిలో పెద్దఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ దందాకు సహకరిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది జోక్యం చేసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నెలరోజులుగా విచ్ఛలవిడిగా ఇసుక రవాణా పెబ్బేరు మండలంలోని కృష్ణానది కేంద్రంగా సాగుతూ.. ఇతర జిల్లాలకు సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు.. మంగళవారం నాలుగు ఇసుక డంప్‌లతో పాటు ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశాం. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉన్న విషయం మా దృష్టికి రాలేదు. – పద్మావతి, ఆర్డీఓ, వనపర్తి -
Crime News: ప్రాణాలు తీసిన జేసీబీ
సాక్షి, నిజామాబాద్: మృత్యువు ఎప్పుడు ఎలా దూసుకొస్తుందో చెప్పలేం. ముందు వెళ్తోంది మృత్యువాహనమని.. పాపం ఆ డ్రైవర్ పసిగట్టలేకపోయాడు. మంగళవారం రాత్రి నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ నుంచి జేసీడీ ఊడిపోయి.. ఓ కారు మీద పడి పలువురి ప్రాణాలు బలిగొంది. భీంగల్ జూనియర్ కాలేజ్ వద్ద ట్రాక్టర్ పై జేసీబీ తీసుకెళ్తుండగా.. వెనకవస్తున్న కారుపై పడింది జేసీబీ. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలిస్తుండగా.. దారిలో మరొకరు కన్నుమూశారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. వీళ్లంతా మోర్తాడ్‌కి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు పిల్లలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటం గమనార్హం. -
సోలిస్ ట్రాక్టర్స్ చేతికి జర్మనీ కంపెనీ థాలర్
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ గ్రూప్ అనుబంధ సంస్థ సోలిస్ ట్రాక్టర్స్ అగ్రికల్చరల్ మిషనరీ జర్మనీకు చెందిన థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ ని కొనుగోలు చేసింది. ఈ వ్యూహాత్మక విలీనంతో సోలిస్ ట్రాక్టర్స్ యూరప్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. అలాగే 19–75 హెచ్‌పీ శ్రేణికి చెందిన నాణ్యమైన జేసీబీలను తన పోర్ట్ ఫోలియోలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.200 కోట్ల ముందస్తు పెట్టుబడులతో ఈ డీల్‌ను ప్రారంభిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ఎండీ దీపక్ మిట్టల్ తెలిపారు. జర్మనీలోనీ థాలర్ ఫ్యాక్టరీ కార్యాలయంలో జరిగిన టేకోవర్ కార్యక్రమంలో ఐటీఎల్ గ్రూప్ ఎండీ దీపక్ మిట్టల్, థాలర్ జీఎంబీహెచ్ అండ్ కో.కేజీ కంపెనీ అధినేత మ్యాన్‌ఫ్రెడ్ థాలర్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ట్రాక్టర్.. వామ్మె అంత స్పీడ్!
ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ట్రాక్టర్ ఇది. భారీ వాహనాల తయారీ సంస్థ జేసీబీ దీనిని రూపొందించింది. ఎంతటి అధునాతనమైన ట్రాక్టర్లయినా వాటి గరిష్ఠ వేగం దాదాపు 40 కిలోమీటర్ల వరకు ఉంటుంది. జేసీబీ తాజాగా రూపొందించిన ఐదు టన్నుల ఈ భారీ ట్రాక్టర్ గరిష్ఠవేగం గంటకు 247 కిలోమీటర్లు. ఆరు సిలిండర్ల డీజిల్మ్యాక్స్ ఇంజన్‌తో తయారు చేసిన ఈ వాహనం అత్యంత వేగంగా పరుగులు తీసే ట్రాక్టర్‌గా గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం. జేసీబీ ఇదివరకు రూపొందించిన ఫాస్ట్‌ట్రాక్ ట్రాక్టర్ గరిష్ఠంగా 217.6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఈ ట్రాక్టర్ పనితీరును బ్రిటన్‌లోని ఎల్వింగ్టన్ ఎయిర్‌ఫీల్డ్‌లో పరీక్షించారు. దీని సాంకేతికతలో మార్పులు చేసి కొత్తగా రూపొందించిన ట్రాక్టర్ ఏకంగా 247 కిలోమీటర్ల వేగం అందుకోవడం ఆనందంగా ఉందని జేసీబీ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ టిమ్ బమ్హోప్ తెలిపారు. శరవేగంగా పరుగులు తీసే ఇలా ట్రాక్టర్లు సువిశాలమైన వ్యవసాయ క్షేత్రాల్లో పనులను వేగంగా చేయడానికి ఉపకరిస్తాయని, సాంకేతికంగా మరిన్ని మెరుగులు చేసిన తర్వాత దీనిని మార్కెట్లోకి అందుబాటులోకి తేనున్నామని బమ్హోమ్ తెలిపారు. చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
‘బుల్డోజర్లతో కూల్చమని ఏ చట్టం చెప్తోంది?’
గువాహతి: నేరస్తుల ఇళ్లను, వాళ్లకు సంబంధించిన ఇతర స్థిర ఆస్తులను బుల్డోజర్లతో నేలమట్టం చేసే సంస్కృతిపై గువాహతి(అస్సాం) హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అసలు కేసు దర్యాప్తులో ఉండగా.. నిందితులపై అలాంటి చర్యలు తీసుకోమని ఏ చట్టం చెబుతోందని గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడి పోలీస్ శాఖను నిలదీసింది ఉన్నత న్యాయస్థానం. పోలీస్ స్టేషన్‌కు తగలబెట్టిన కేసులో అరెస్ట్ అయిన ఐదుగురి ఇళ్లను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది గువాహతి హైకోర్టు. చీఫ్ జస్టిస్ ఆర్ఎం ఛాయతో పాటు జస్టిస్ సౌమిత్రి సాయికియా నేృతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. అయితే గురువారం విచారణ సమయంలో ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘ఏ చట్టం ఇలా బుల్డోజర్లతో ఇళ్లు కూల్చమని చెబుతోంది’’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘ కేసు దర్యాప్తులో ఉండగా.. పోలీసులు ఎటువంటి ఆదేశాలు లేకుండా ఒక వ్యక్తి ఆస్తులపై బుల్డోజర్ ప్రయోగించవచ్చని మీరు (ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ఏదైనా చట్టంలో చూపిస్తారా?’’ అని ప్రశ్నించింది. మెకాలే తీసుకొచ్చిన నేర విచారణ చట్టంలోనూ దాని ప్రస్తావన లేదు కదా! అని నిలదీసింది. అయితే ఆ సమయంలో ప్రభుత్వం తరపున న్యాయవాది వివరణ ఇచ్చే యత్నం చేస్తుండగా.. సీజే ఛాయ కలుగజేసుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఒక ఎస్పీనే కావొచ్చు. కానీ, అధికారి అలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారు అసలు?. ప్రజాస్వామిక పద్ధతిలో ఉన్నాం మనం. సెర్చ్ వారెంట్ జారీ చేయకుండా అలా చేయడం ఏంటి?. పోలీస్ విభాగానికి పెద్ద అయినంత మాత్రాన.. ఎవరి ఇల్లు అయినా పడగొడతారా?.. ఇలాంటి చర్యలకు అనుమతి ఇస్తే.. దేశంలో ఎవరూ భద్రంగా ఉండరు అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు.. హిందీ సినిమాల్లోనూ ఇలాంటివి చూడలేదని వ్యాఖ్యానించారాయన. సినిమాల్లోనూ ఇలాంటి కూల్చివేత సీన్లు చూపించేప్పుడు సెర్చ్ వారెంట్ అనేది చూపిస్తారు. కానీ, ఇక్కడ అలాంటిదేం జరగలేదు. మీ కథలేమైనా ఉంటే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టికి ఇవ్వండి.. ఆయన వాటిని సినిమాలుగా తీస్తాడేమో అంటూ సీజే చురకలంటించారు. కూల్చేసిన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఓ తుపాకీని కోర్టులో సమర్పించగా.. ఇది పోలీసుల పని అయ్యి ఉండొచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు ఆయన. ‘‘ఈ విషయాన్ని డీజీపీకి తెలియజేయండి, లేకుంటే ఈ సమస్య పరిష్కారం కాదు. దయచేసి అర్థం చేసుకోండి.. ఇది మీరు శాంతిభద్రతలను నియంత్రించే పద్ధతి కాదు. మీరు ఒకరు చేసిన ఏ నేరానికి అయినా విచారణ చేయవచ్చు. ఒకరి ఇంటిని కూల్చేసే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారు? అని బెంచ్ ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేస్తూ.. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖ స్పందన కోరింది. నాగావ్ జిల్లా బటద్రవ పోలీస్ స్టేషన్లో సఫికుల్ ఇస్లాం(39) అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో మరణించాడు. అయితే.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ముస్లింలు మే 21వ తేదీన పోలీస్ స్టేషన్‌కు నిప్పటించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ మరుసటి రోజే ఇళ్లను కూల్చేశారు. స్థానిక ఎస్పీ ఆ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం, మాదక ద్రవ్యాల సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా తాము ఆ పని చేయాల్సి వచ్చిందని అధికారులు గతంలో వివరణ ఇచ్చుకున్నారు. -
నోయిడా ట్విన్ టవర్స్ ఎఫెక్ట్.. ఐటీ విప్రో, ఎకోస్పేస్ భవనాలు కూల్చివేత!
బనశంకరి: బెంగళూరులో వరద బాధిత ప్రాంతాల్లో బీబీఎంపీ, రెవెన్యూ శాఖలు చేపట్టిన కబ్జా కట్టడాల తొలగింపు మంగళవారం రెండవరోజుకు చేరుకుంది. రాజకాలువలు ఆక్రమించుకుని నిర్మించిన భవనాలు, ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారు. దీంతో రియల్ వ్యాపారులు, కట్టడ యజమానుల్లో కలవరం మొదలైంది. జాబితాలో ప్రముఖ సంస్థలు, వ్యక్తులు - మహదేవపుర వలయంలో వివిధ బిల్డర్లు, ఐటీ పార్కులవారు ఆక్రమణలకు పాల్పడిన స్థలాల జాబితాను బీబీఎంపీ విడుదల చేసింది. - బాగమనె టెక్ పార్కు, రెయిన్బో డ్రైవ్ లేఔట్, విప్రో, ఎకో స్పేస్, బెళ్లందూరు, హుడి, సొణ్ణెహళ్లి గోపాలన్, దియా పాఠశాల, కొలంబియా ఏషియా ఆసుపత్రి, న్యూ హొరైజన్ కాలేజీ, ఆదర్శ రిట్రీట్, ఏషియన్ దివ్యశ్రీ, ప్రెస్టేజ్, సాలార్పురియా, నలపాడ్ డెవలపర్స్‌తో పాటు మహమ్మద్ నలపాడ్ కు చెందిన ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. అడ్డుగా 700 కట్టడాలు సుమారు 700 కు పైగా అక్రమ కట్టడాలు నగరవ్యాప్తంగా వర్షం నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయని , కంపెనీలు కబ్జాకు పాల్పడిన స్థలాలను తొలగిస్తామని బీబీఎంపీ అధికారులు తెలిపారు. 2.5 నుంచి 5 మీటర్ల ప్రభుత్వ స్థలం రాజకాలువకు వదిలిపెట్టాలి. ఇందులో ప్రముఖులు ఆక్రమణకు పాల్పడిన స్థలాలు ఉన్నాయని, వీటిని తొలగించి రక్షణ గోడను నిర్మిస్తామని అధికారులు తెలిపారు. మహదేవపుర వలయంలో శాంతినికేతన్ లేఔట్, స్పైసి గార్డెన్, పాపయ్యరెడ్డి లేఔట్, చల్లఘట్ట రాజకాలువ ఆక్రమణల ఏరివేత చేపట్టారు. 30 జేసీబీలతో కూల్చివేతలు రెండోరోజు 30కి పైగా జేసీబీలతో మహదేవపుర, యలహంక వలయాల పరిధిలో కట్టడాలను కూల్చారు. శాంతినికేతన్ లేఔట్లో భారీ భవంతులను బుల్డోజర్ ద్వారా కూల్చివేశారు. మున్నకోళాల సరిహద్దుల్లో 7 ఆక్రమణలను తొలగించారు. తొలగించాలని అనేక ఇళ్లు, దుకాణాలు ముందు రెవెన్యూ అధికారులు మార్కింగ్ వేశారు. భారీ పోలీస్ భద్రత మధ్య రెండు కిలోమీటర్ల పొడవు గల రాజకాలువపై నెలకొన్న ఆక్రమణలను పడగొట్టారు. యలహంక వలయంలో జక్కూరు, అల్లాలసంద్ర, కోగిలు, అట్టూరు, సింగాపుర, దొడ్డబొమ్మసంద్ర, హెబ్బాళ, నవనగర, రాచేనహళ్లితో పాటు సుమారు 30 చెరువులు కబ్జాకు గురయ్యాయి. రియల్టర్లు, నేతలు కుమ్మక్కై చెరువులు మింగేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఆక్రమణదారులు పలుకుబడి కలిగినవారు కావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. నలపాడ్ అకాడమి తొలగింపు నిలిపివేత మరోవైపు ఆక్రమణల తొలగింపు వద్ద ఎమ్మెల్యే హ్యారిస్ తనయుడు, కాంగ్రెస్ నేత మహమ్మద్ నలపాడ్ పడవ వేసుకుని ధర్నా చేసి హల్చల్ చేశారు. ఆక్రమణల జాబితాలో నలపాడ్ ఆస్తులు కూడా ఉన్నాయి. మహమ్మద్ నలపాడ్ అకాడమి తొలగింపును అధికారులు నిలిపివేశారు. పనులు చేస్తున్న సిబ్బందిని హ్యారిస్ పీఏ నిలిపివేయాలని ఒత్తిడి చేశాడు. గేటు వద్ద అడ్డుకున్నాడు. దీంతో కూల్చివేతను నిలిపివేశారు. శివాజీనగర: బెంగళూరులో అక్రమ భవనాల తొలగింపు పై మంగళవారం విధాన సౌధలో రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ మాట్లాడుతూ... వీటి వెనుక ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బెంగళూరులో ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఆక్రమించుకొని అనేక అతిపెద్ద భవనాలు నిర్మించుకున్నారని, అలాంటి భవనాలను ఎలా తొలగిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి ఎంతటివారైనా సరే తొలగిస్తామని, నోయిడా తరహాలో అక్రమ భవనాలకు పేలుడుతో సమాధానం చెబుతామన్నారు. ఆక్రమణదారులకు ఘాటైన హెచ్చరిక చేశారు. గత ప్రభుత్వాలవి నాటకాలు ఆక్రమణల విషయంలో గత ప్రభుత్వాలు నాటకీయంగా వ్యవహరించాయని, అయితే తమ అధికారంలో అలా జరగదని, ఐటీకి చెందిన 30 కంపెనీలు ఆక్రమణలకు పాల్పడ్డాయని, తమ శాఖ జాబితా సిద్ధం చేసి బీబీఎంపీకి ఇచ్చామన్నారు. మినహాయింపు లేదు ఐటీ–బీటీ కంపెనీలకు ఎలాంటి మినహాయింపు లేదని, పెద్దవారు, చిన్నవారు అనేది లేదని, రెవెన్యూ శాఖ, బీబీఎంపీ, బీడీఏ సంయుక్త కార్యచరణ చేపడుతాయి. వరదలు తమకు గుణపాఠం చెప్పింది. బాగమనె పార్కుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పెద్దవారు చిన్నవారు అంటూ చూడమని మంత్రి తెలిపారు. విల్లాలు, విద్యాసంస్థలనూ వదలం రాజకాలువ ఆక్రమించుకొన్న భవనాలపై బీబీఎంపీ జాబితా సిద్ధం చేయగా, 600 అక్రమ భవనాల తొలగింపునకు ఆదేశించాం, రాజకాలువ తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయని, మహదేవపుర భాగంలో బీబీఎంపీ రాజకాలువ అక్రమణలు తొలగిస్తోందని, విల్లాలు, విద్యా సంస్థ, ఇళ్లు నేలమట్టమవుతాయి. రైన్బో డ్రైవ్ లేఔట్లో జిల్లా యంత్రాంగం సర్వే జరుపగా, కాలువను ఆక్రమించుకొని విల్లాలను నిర్మించినట్లు తెలిసింది. ప్రస్తుతం విల్లాలను తొలగించాలని యజమానులకు నోటీస్ ఇచ్చామన్నారు. JCB’s in action today in Mahadevapura demolishing alleged encroachments on rajakaluves. #BBMP pic.twitter.com/lvEjU9yHyM — Anil Budur Lulla (@anil_lulla) September 12, 2022 -
గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం
వైరల్: గుండెల్ని పిండేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో ఓ భారీ వృక్షాన్ని నేల్చకూల్చగా.. అంతకాలం ఆ చెట్టు మీద గూళ్లు కట్టుకుని జీవిస్తున్న పక్షులు చెల్లాచెదురు అయిపోయాయి. అంతకంటే బాధాకరం ఏంటంటే.. పాపం ఆ చెట్టు కిందే నలిగి కొన్ని చనిపోవడం. వైరల్ అయిన ఈ వీడియో.. కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం దాకా చేరడంతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని పక్షులు ఎగిరిపోగా.. మరికొన్ని పక్షులు, పిల్ల పక్షులు మాత్రం సమయానికి ఎగరలేక ఆ చెట్టు కిందే నలిగి చనిపోయాయి. అక్కడున్న చాలామంది పక్షుల పరిస్థితిని చూస్తూ అరవడం వీడియోలో గమనించొచ్చు. It not about road widening.. It’s about “how we treat other living-beings on earth..” Hope concerned authorities must have taken needful legal action..#wilderness #UrbanEcology #nature #ConserveNature pic.twitter.com/aV16cIWmo8 — Surender Mehra IFS (@surenmehra) September 2, 2022 చెట్టు నెలకొరిగాక.. చనిపోయిన పక్షుల్ని బాధతో ఒకవైపుగా వేశారు స్థానికులు. ప్రస్తుతం ఈ విషాదకరమైన వీడియో వైరల్ అవుతోంది. దీంతో చాలామంది కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. మనుషులు ఎంత క్రూరంగా మారిపోయారో అని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. దీనికి ఫలితం అనుభవించక తప్పదంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే.. ఈ ఘటన ఆగష్టు తొలివారంలోనే కేరళ మలప్పురం జిల్లా తిరురంగడి వీకే పడి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా ఈ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. క్రూరమైన ఈ పనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాన్ని కోరారు. మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసి తన అసంతృప్తి వెల్లగక్కారు. అటు ఇటు తిరిగి ఈ వీడియో కాస్త గడ్కరీ కార్యాలయానికి చేరింది. దీంతో.. Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij — Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం స్పందించింది. విషయం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దాకా వెళ్లిందని, ఆయన వీడియో చూసి విచారం వ్యక్తం చేశారని తెలిపింది. సేవల్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ మూమెంట్ సీఈవో థామస్ లారెస్స్ ఫిర్యాదు మేరకు.. స్వయంగా స్పందించిన మంత్రి నితిన్ గడ్కరీ.. ఈ ఘటనకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను, బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్‌ను, స్థానిక అధికారులను కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీ శాఖ విభాగం స్పందించింది. ఆ చెట్టు కూల్చివేతలకు అనుమతులు లేకపోవడంతో జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేరళ అటవీ పరిరక్షణ శాఖ మంత్రిణేకే ససీంద్రన్ ఈ ఘటనను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. తమ అనుమతులు లేకుండానే ఈ ఘటన జరిగిందని ఆయన నేషనల్ హైవేస్ అథారిటీపై ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: మనిషి జీవితం నీటి బుడగ.. అందుకు ఉదాహరణే ఈ వీడియో -
అంబులెన్స్ రాలేదు.. జేసీబీతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు: వీడియో వైరల్
భోపాల్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మధ్యప్రదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాలు, రహదారులు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఐతే మధ్యప్రదేశ్‌లోని నీమాచ్ జిల్లాలో ఒక గర్భిణిని ఆస్పత్రిని తీసుకెవెళ్లేందుకు అంబులెన్స్‌కి కాల్ చేశారు. కానీ వరదల ఉధృతి కారణంగా అంబులెన్స్ ఆ గర్భిణి నివాసానికి చేరుకోవడం సాధ్యం కాలేదు. దీంతో స్థానిక అధికారులు, ఎమ్మెల్యే, పోలీసులు సదరు గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు జేసీబీ మెషిన్ని ఏర్పాటు చేశారు. ఈఘటన నీమాచ్ జిల్లాలోని రావత్‌పూర్‌లో చోటు చేసుకుంది. వాస్తవానికి ఈ వరదలు కారణంగా మధ్యప్రదేశ్‌లోని 39 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. ఐతే ప్రభుత్వం జారీ చేసిన ప్రమాద హెచ్చరికల్లో ఆ గర్భిణి నివాసిత జిల్లా కూడా ఉంది. దీంతో అదికారులు ఆమెను సకాలంలో ఆస్పత్రికి తరలించేందుకు ఈ ఏర్పాటు చేశారు. అంతేకాదు భోపాల్‌తో సహా మధ్యప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర రాజధాని తోపాటు ఇతర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. नीमच के बेसदा की रहने वाली गीता बाई प्रसव पीड़ा में पुलिया पर पानी होने की वजह से एंबुलेंस नदी के दूसरे पार नही जा सकी ऐसे में उन्हें जेसीबी में बिठाकर सुरक्षित नदी पार कराई गई, किनारे पहुंचने पर उन्हें एंबुलेंस से मनासा सरकारी अस्पताल भेजा गया @ndtv @ndtvindia pic.twitter.com/IJw91C2Yya — Anurag Dwary (@Anurag_Dwary) August 25, 2022 (చదవండి: ప్రయాణికుడికి అస్వస్థత.. ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్) -
జేసీబీ కూల్చివేతలు.. పిటిషనర్లకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మున్సిపల్ అధికారులు చేపట్టిన జేసీబీ అక్రమ కట్టడాల కూల్చివేతపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేతలపై నిషేధం విధించలేమని, అది పూర్తిగా మున్సిపల్ అధికారుల పరిధిలోని అంశమని, ఎవరైనా చట్టానికి లోబడి నడుచుకోవాల్సిందేనని బుధవారం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా జేసీబీ కూల్చివేతలపై నిషేధం విధించాలని.. ప్రత్యేకించి ఇస్లాం కమ్యూనిటీకి చెందిన కట్టడాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఉలామా-ఐ-హింద్ అనే సంస్థ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. బదులుగా.. కూల్చివేతలు అంతా సర్వసాధారణంగా జరిగే వ్యవహారమని, ఉద్దేశపూర్వక చర్యలు కావని యూపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈ తరుణంలో.. మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలకు సైతం సుప్రీం కోర్టు బదులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. బుధవారం వాదనల సందర్భంగా.. ప్రత్యేకంగా కమ్యూనిటీ అనే పదాన్ని ప్రస్తావించారు పిటిషనర్లు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు చేపడుతున్నారని, అల్లర్లకు సాకుగా చేసుకుంటున్నారని పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు. ప్రతిగా.. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వేలు ప్రభుత్వాల తరపున వాదనలు వినిపించారు.. ‘అంతా భారతీయ కమ్యూనిటీలే’ ని వ్యాఖ్యానించారు. అల్లర్లకు, కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదని, అవసరంగా సంచలనం చేయాలని చూస్తున్నారంటూ పిటిషనర్ల వాదనను తప్పుబట్టారు. ఈ క్రమంలో పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు.. కూల్చివేతలపై నిషేధం విధించలేమని స్పష్టం చేసింది. -
వైరల్: పాపం.. మృత్యువును ఊహించి ఉండరు
మనిషి ప్రాణాలు.. గాల్లో దీపంలాగా మారిన రోజులివి. అలాంటి ఘటన గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. జేసీడీ టైర్లో గాలి నింపుతుండగా.. అది పేలి ఇద్దరు మరణించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. కూలీలు ఇద్దరూ జేసీబీకి చెందిన భారీ టైర్లో గాలి నింపుతుండగా.. దానిని మరో వ్యక్తి వచ్చి పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఇద్దరూ చెల్లచెదురై పడిపోయారు. ప్రమాదంలో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. గాయపడిన ఈ ఇద్దరిని మధ్యప్రదేశ్ రేవా ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చత్తీస్‌గఢ్ రాయ్‌పూర్ జిల్లాలో సిల్తారా ఇండస్ట్రీయల్ ఏరియాలో మే 3వ తేదీన ఈ ఘటన జరిగింది. -
గుజరాత్లో జేసీబీ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
న్యూఢిల్లీ: నిర్మాణ రంగ పరికరాల తయారీ దిగ్గజం జేసీబీ తాజాగా గుజరాత్‌లోని వదోదరలో కొత్త ప్లాంటు ఆవిష్కరించింది. దాదాపు 100 మిలియన్ పౌండ్లతో (సుమారు రూ. 995 కోట్లు) నిర్మించిన ఈ ఫ్యాక్టరీని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ప్రారంభించారు. అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులకు అవసరమైన భాగాలను ఈ ప్లాంటులో తయారు చేయనున్నట్లు జేసీబీ చైర్మన్ లార్డ్ బామ్ఫోర్డ్ తెలిపారు. ఇది ఏటా 85,000 టన్నుల ఉక్కును ప్రాసెస్ చేయగలదని వివరించారు. 1979లో భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించిన జేసీబీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయి. చదవండి: తులసిభాయ్.. ఆ ప్రముఖుడికి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ -
రోడ్డుపై మోకాల్లోతు మంచు.. మంటపానికి వరుడు ఏలా వెళ్లాడంటే!
Heavy snowfall in Shimla: సాధారణంగా మంటపానికి వధూవరులు కారు మీద, గుర్రాల మీద చేరుకోవడం సహజమే. అయితే ఓ వరుడు మాత్రం జేసీబీ మీద మంటపానికి చేరుకున్నాడు. అయితే ఇదేదో సరదాకి అనుకున్నారంటే పొరపాటు. అసలు ఏం జరిగిందంటే! మనం ప్రస్తుత శీతాకాలంలో చలికి గజగజ వణికిపోతున్నాం. అలాంటిది హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో చలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ మంచు ఏకంగా మోకాల్లోతు ఏర్పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడికి పెళ్లి జరగాల్సింది. అయితే మంచు కారణంగా రోడ్డుపై ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీంతో అతను ఆ రోడ్డు పై వెళ్లేందుకు అనువుగా ఉంటుందని జేసీబీ బుక్ చేసుకుని వధువు ఇంటికి వెళ్లి అక్కడి నుంచి మంటపానికి చేరుకున్నాడు. ఆ తర్వాత చేయాల్సిన తతంగాన్ని పూర్తి చేశాడు. అనంతరం వధువు అదే జేసీబీలో ఎక్కించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. Because of heavy Snowfall going on in Himachal,a barat was ferried in Two JCB Machines in a Snow Bound are of Shimla district in Himachal ..Watch this video of Barat in JCBs ..Himachali Rocks pic.twitter.com/OU6hDDVQea — Anilkimta (@Anilkimta2) January 24, 2022 -
కుప్పకూలిన మూడంతస్తుల భవనం.. ఐదుగురు మృతి
సాక్షి, అనంతపురం: కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ఈ ఘటన జరిగినప్పుడు బిల్డింగ్‌లో 15 మంది ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వెంటనే నలుగురు వ్యక్తులు బిల్డింగ్‌నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఇప్పటికి బిల్డింగ్‌లో చిక్కుకున్న కొందరు బాధితులతో.. ఫోన్లో మాట్లాడుతున్నారని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కుండపోత వర్షం కారణంగానే భవనం దెబ్బతిని.. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో.. గాయపడిన వారికి ఎమ్మెల్యే డా . సిద్ధారెడ్డి స్వయంగా వైద్యం అందించారు. -
4 గంటలు మట్టిలో ఇరుక్కుని
శాయంపేట: మంచినీటి బావి ఓడలు శిథిలావస్థకు చేరుకోవడంతో వాటి స్థానంలో కొత్తవి పోసేందుకు ఓ యువకుడు మట్టిని తీస్తుండగా ఒక్కసారిగా కుంగిపోయి లోతుకు జారిపోయాడు. పోలీసులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆ యువకుడిని క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతుగంటి వెంకటేష్ తన ఇంటి ముందు ఉన్న మంచినీటి బావి ఓడలను మార్చి కొత్తవి వేసేందుకు మట్టిని తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా మట్టి కుంగిపోవడంతో సుమారు ఏడు ఓడల లోతు జారిపోయాడు. గమనించిన అతని భార్య పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే 100కు డయల్ చేయడంతో ఎస్ఐ అక్కినపల్లి ప్రవీణ్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే రెండు జేసీబీలు తెప్పించి మట్టి, ఓడలను తొలగిస్తూ పోయారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి యువ కుడిని బయటకు తీశారు. వెంకటేష్‌ను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్న దృశ్యం ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే వెంకటేష్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. సర్పంచ్ రాజిరెడ్డి, ఉపసర్పంచ్ వలి హైదర్, ఎంపీటీసీ ఐలయ్యలతోపాటు పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అదుపుతప్పి కూలీలపై దూసుకెళ్లిన జేసీబీ, నలుగురు మృతి
సాక్షి, వైఎస్సార్ కడప: మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లె వద్ద విషాదం చోటుచేసుకుంది. జేసీబీ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న కూలీల మీదకు దూసుకెళ్లడంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు. మృతులంతా కేసలింగాయపల్లె గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా పొలం పనులకు వెళ్లి ఆటో కోసం వేచి చూస్తున్న కూలీలను జేసీబీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జేసీబీ డ్రైవర్ మద్యం మత్తులోఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. -
రోడ్డుపై కుప్పకూలిన మహిళ.. జేసీబీలో వేసుకుని..
బెంగళూరు : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మానవత్వం మంటగలుస్తోంది. ఆపద కాలంలో మనిషికి తోడు నిలవాల్సిన తోటి మనిషి చావు భయంతో వెనకడుగు వేస్తున్నాడు. నిత్యం వందల సంఖ్యలో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని కోలార్‌లో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఆదివారం కోలార్‌కు చెందిన ఓ మహిళ తన చిన్న కూతుర్ని వెంట బెట్టుకుని ఆసుపత్రికి బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత తీవ్ర అనారోగ్యం కారణంగా రోడ్డుపై కుప్పకూలి, ఆపస్మారక స్థితిలోకి వెళ్లింది. కరోనా భయంతో రోడ్డుపై వెళుతున్న వారెవరూ ఆమెకు సహాయం చేయటానికి ముందుకు రాలేదు. కనీసం అంబులెన్స్‌కు అయినా ఫోన్ చేద్దామన్న ఇంగితాన్ని మరిచారు. కొద్దిసేపటి తర్వాత కొందరు స్థానికులు ఆమెను జేసీబీతో ఆసుపత్రికి తరలించటానికి నిర్ణయించారు. జేసీబీ ముందు భాగంలో ఆమెను పడేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. సదరు మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. కాగా, కర్ణాటకలో కోవిడ్ కేసుల సంఖ్య 16 లక్షల మార్కును దాటింది. తాజాగా 37,733 కరోనా కేసులు నమోదయ్యాయి. 217 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 16, 011కు చేరింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16,01, 865 కాగా, 4,21,436 యాక్టిక్ కేసులు ఉన్నాయి. -
కుప్ప‘కూలి’న గోడ.. తెల్లారిన ఆరుగురి బతుకులు
పాట్నా: కాలువ తవ్వకం చేస్తుండగా పాఠశాల ప్రహారి గోడ కుప్పకూలిపోయింది. అయితే గోడ పనులు చేస్తున్న కూలీలపై పడడంతో వారి శిథిలాల కింద ఛిద్రమయ్యారు. ఈ ప్రమాదంలో మొత్తం 6గురు కూలీలు దుర్మరణం పాలవగా.. మరికొందరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన బిహార్‌లో ఖగారియా జిల్లా మహేశ్‌ఖంట్ పోలీస్ పరిధిలోని చాందీతోలా ప్రాంతంలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చాందీతోల ప్రాంతంలో ఉన్న పాఠశాల ప్రహారి గోడకు సమీపంలో భూగర్భ కాలువ తవ్వకాలు చేపట్టారు. మొత్తం 12 మంది కూలీలు పాల్గొంటున్నారు. ఈ పనుల్లో భాగంగా జేసీబీ ప్రహారి గోడకు సమీపం తవ్వకాలు చేపట్టడంతో పగులుళ్లు వచ్చి కూలిపోయింది. ఈ పనుల వలన పాఠశాల ప్రహారి గోడకు పగుళ్లు ఏర్పడి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 6 గురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా మరికొందరు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదానికి కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని స్థానికులు, మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే జేసీబీకి సంబంధించిన వ్యక్తులు పరారయ్యారు. -
వార్నీ.. జేసీబీని ఇలా కూడా వాడొచ్చా!
జేసీబీని సాధారంగా చిన్నచిన్న ఇండ్లను కూల్చేందుకు లేదా మట్టిని తవ్వేందుకు వాడుతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీపును గోకేందుకు వాడుకున్నాడు. అవును మీరు చదివింది నిజమే. ఓ వ్యక్తి వీపును జేసీబీతో గోకించుకున్నాడు. ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 41సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో ఓ వ్యక్తి టవల్‌తో వీపును గోక్కుంటూ.. అక్కడనే ఉన్న జేసీబీ దగ్గరకు వెళ్లాడు. కిందకు వంగగా జేసీబీలో ఉన్న ఓ వ్యక్తి దానికి కిందకి దించి అతని వీపుపై పెట్టి కింది నుంచి పైకి వెళ్లే విధంగా చేశాడు. ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటి వరకు 2300 మంది షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. నవ్వించేందుకే ఈ వీడియో తీశారని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడగా, అలా చేయడం ప్రమాదకరమని, మరోసారి ఇలా ఎవరూ చెయ్యెద్దని మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఉన్నవారు ఎక్కడివారు, ఎప్పుడు జరిగిందనే విషయాలు వెల్లడి కాలేదు. -
జేసీబీని ఇలా కూడా వాడొచ్చా!
-
బంధాలను దూరం చేస్తున్న కరోనా
సాక్షి, నిజామాబాద్ : బంధాలను, మానవత్వాన్ని దూరం చేసేస్తుంది ఈ కరోనా మహమ్మారి. మనిషి చనిపోతే పాడె మోయడానికి ఉండాల్సిన నలుగురు వ్యక్తులు కూడా లేక అనాథ శవాల్లా అంత్యక్రియలు నిర్వహించాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది ఈ కరోనా. తాజాగా నిజామాబాద్ ఆర్మూరు మండలం గోవింద్‌పేట్‌నూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కరోనా అనుమానుంతో బంధువులు ముందుకు రాకపోవడంతో జేసీబీ సహాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల ప్రకారం నాలుగు రోజుల క్రితమే ఆ కుటుంబంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కుటుంబసభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. అయితే పెరాలసిస్‌తో బాధపడుతున్న తల్లిని ఈరోజు హాస్పిటల్‌కి తీసుకెళదామనుకునే లోపే ఆమె నిద్రలోనే కన్నుమూసింది. దీంతో అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ఎవరూ రాకపోవడంతో కొంతమంది గ్రామస్థుల సహకారంతో పీపీఈ కిట్ ధరించి తల్లి శవాన్ని జేసీబీ ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు. (చదవండి: ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కేసు విషాదాంతం!) -
బంధాలను దూరం చేస్తున్న కరోనా
-
తిట్టాడని జేసీబీతో దాడి
-
మంటగలసిన మానవత్వం
-
ఆ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది : సీఎం జగన్
సాక్షి, అమరావతి : శ్రీకాకుళం జిల్లాలో పలాసలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ‘శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంత మంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు’ అని సీఎం ట్వీట్ చేశారు. (చదవండి : అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్.. ) పలాసలో ట్రూనాట్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వృద్ధుడి మృతదేహాన్ని జేసీబీతో తరలిస్తున్న దృశ్యం ఏం జరిగిందంటే... శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఓ 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్ కాల్ ద్వారా ట్రూనాట్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు.ఉన్నతాధికారులకు తగిన సమాచారం ఇవ్వకుండానే జేసీబీతో తరలించడం కలకలం రేపింది. పలాస–కాశీబుగ్గలో జరిగిన ఘటన ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి వచ్చింది. సీఎంఓ ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్ నివాస్... పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను తక్షణమే సస్పెండ్ చేశారు. -
అంత్యక్రియలకు తరలిస్తుండగా పాజిటివ్..
బంధాలు, ప్రేమానుబంధాలు.. కరోనా దెబ్బకు పటాపంచలవుతున్నాయి. ఊహించని రీతిలో వచ్చి పడ్డ ఈ మహమ్మారి మనుషుల మధ్య గోడలు కట్టేస్తోంది. ఎవరినీ ఏమీ అనలేం.. కనీసం మిగిలున్నవారైనా క్షేమంగా ఉండాలి కదా.. పలాస–కాశీబుగ్గలో శుక్రవారం జరిగిన ఓ అరుదైన ఘటన గుండెను కదిలించేలా ఉంది. శ్మశానానికి తరలిస్తుండగా కరోనా ట్రూనాట్ పాజిటివ్ వచ్చిందని తెలిసి మృతదేహాన్ని బంధువులు వదిలేయగా... మున్సిపల్ సిబ్బంది జేసీబీతో తరలించడం వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు విచారణ జరిపిన శ్రీకాకుళం కలెక్టర్ నివాస్... పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను సస్పెండ్ చేశారు. కాశీబుగ్గ: మున్సిపాలిటీ పరిధిలోని ఉదయపురం సమీపాన శుక్రవారం ఉదయం 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యంతో మరణించాడు. ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్ కావడంతో అంత్యక్రియలకు ముందు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ లీల ఆదేశాల మేరకుమృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించారు. అప్పటికప్పుడు ‘వీఎల్‌ఎం’ కిట్ల ద్వారా కరోనా పరీక్షలు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించే ప్రక్రియ కొనసాగిస్తుండగా ఫోన్ కాల్ ద్వారా ట్రూనాట్ పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, కాలనీవాసులంతా మృతదేహాన్ని వదిలి భయంతో పరుగులు పెట్టారు. దీంతో శానిటరీ ఇన్స్పెక్టర్ సిబ్బందికి పీపీఈ కిట్లు వేయించి మృతదేహాన్ని మున్సిపాలిటీ జేసీబీతో శ్మశానానికి తరలించారు. జేసీబీలో వీధుల గుండా తరలిస్తున్న వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృతుడిది 13మంది కుటుంబ సభ్యులు గల ఉమ్మడి కుటుంబం. హైదరాబాద్‌లో ఉన్న కుమారుడు, కోడలు ఇటీవల రైలులో ఇంటికి చేరుకున్నారు. అధికారులు వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వేరే ఇంట్లో ఉండే అవకాశం లేక ఉమ్మడి కుటుంబం కావడంతో అందరూ కలిసే జీవనం సాగించారు. హుటాహుటిన చేరుకున్న కలెక్టర్ ఈ ఘటన గురించి సమాచారం అందడంతో జిల్లా కలెక్టర్ జె.నివాస్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలో అధికంగా కరోనా అనుమానిత కేసుల నమోదు, వరుస మరణాలపై ఆరా తీశారు. మృతదేహం తరలింపు విధానంపై పలాస తహసీల్దారు మధుసూదన్, మున్సిపల్ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో సమగ్రంగా దర్యాప్తు జరిపి అమానవీయ ఘటనకు బాధ్యులను చేస్తూ పలాస మున్సిపల్ కమిషనర్ టి.నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎన్.రాజీవ్‌లను సస్పెండ్ చేశారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ఉదయపురం, కాశీబుగ్గలలో పర్యటించి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఉన్నతాధికారులతో పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆవరణంలో సమీక్షించారు. కరోనా కట్టడికి మరి న్ని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంఅండ్‌హెచ్‌ఓ చెంచయ్య వచ్చారు. ఆర్డీఓ కిషోర్ కుమార్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఒ డాక్టర్ లీల, ఎంపీడీఓ రమేష్‌నాయుడు, డాక్టర్ జోగి గౌతమ్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల నమూనాల సేకరణ మృతుడికి పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులందరి నుంచి నమూనాలు సేకరించి, పరీక్షకు పంపారు. కాంటాక్ట్స్ గుర్తించేపనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రెంటికోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రశాంతి తన సిబ్బందితో పన్నెండు మంది కుటుంబ సభ్యుల శాంపిల్స్ సేకరించారు. కరోనా లక్షణాలతో వృద్ధురాలి మృతి! సోంపేట: పట్టణంలోని కోర్టుపేట వీధిలో కరోనా లక్షణాలతో గురువారం రాత్రి వృద్ధురాలు మృతి చెందింది. మృతదేహం నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జేసీ కె.శ్రీనివాసులు స్థానిక అధికారులతో కలసి కోర్టుపేట వీధిని శుక్ర వారం పరిశీలించారు. ఈ వీధిని కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. కాకినాడ రిపోర్టు రావల్సి ఉందని వైద్య సిబ్బంది తెలియజేశారు. కోర్టు పేట వీధివారు కంటైన్మెంట్ నిబంధనలు పాటించి స్థానిక అధికారులకు సహకరించాలని స్థానికులను జేసీ కోరారు. కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ ఉన్నవారిని గుర్తించి వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా ప్రత్యేకాధికారి కె.శ్రీనివాసరావు, తహసీల్దార్ సదాశివుని గురుప్రసాద్, ఉప తహసీల్దార్ బి.అప్పలస్వామి, ఈవో జ్యోతిరెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు. మృతుల పట్ల మానవత చూపండి కరోనా సమయంలో సంభవించే మరణాల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ నివాస్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పలాసలో శుక్రవారం జరిగిన ఘటన ఎంతో దురదృష్టకరమన్నా రు. ఇలాంటి సందర్భాల్లో స్పష్టపైన విధానాలు పాటించాలన్నారు. సందేహాలుంటే పై అధికారులను సంప్రదించాలని తహసీల్దార్లు, ఎంపీడీఓలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. కోవిడ్ మరణాలకు సంబంధిత ప్రొ టోకాల్ కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. -
'బహుశా ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విటర్లో ఓ ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. విషయానికొస్తే.. జేసీబీని సాధారణంగా మట్టి తవ్వకాలకు, ఇళ్లను కూల్చడానికి, బండరాళ్లను ఎత్తడానికి, ఇంకా అనేక పనులకు ఉపయోగిస్తుంటాం. కానీ గుజరాత్లో మాత్రం కొందరు మహిళలు డీసీఎం వాహనంలో నుంచి దిగడానికి జేసీబీని ఉపయోగించారు. ఆ సమయంలో ఆ మహిళలు కూడా నవ్వుఆపుకోలేకపోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన ఓ వ్యక్తి 'జేసీబీని కనిపెట్టిన వ్యక్తి ఎప్పుడూ బహుశా ఇప్పటిదాకా గుజరాత్లో పర్యటించి ఉండకపోవచ్చు.. తన ఆవిష్కరణలను ఇలా ఉపయోగించుకుంటారని ఎన్నడూ ఊహించకపోవచ్చు' అంటూ ట్వీట్ చేశారు. దీనిని ఐవైఆర్ రీట్వీట్ చేస్తూ.. ఆవిష్కరణలకు ప్రజలు మార్పులు చేస్తే అటువంటి ఆవిష్కరణలు మరింత అద్భుతంగా ఉంటాయి' అంటూ పేర్కొన్నారు. Inventions become useful as people start innovating . https://t.co/f3UZfRUI0n — IYRKRao , Retd IAS (@IYRKRao) February 24, 2020 -
ఇలాంటి నాగిని డ్యాన్స్ ఎక్కడా చూసి ఉండరు
టిక్‌టాక్ యాప్ పుణ్యామా అని సామన్యులు కూడా రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతున్నారు. ఈ మధ్య కాలంలో వాహనాలు కూడా టిక్‌టాక్‌లో బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం టిక్‌టాక్‌లో #JCBKiKhudayi హ్యాష్‌ట్యాగ్ కూడా విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం జేసీబీకి సంబంధించిన మరో వీడియో టిక్‌టాక్‌లో తెగ వైరలవుతోంది. ఓ వ్యక్తి ఏకంగా జేసీబీ మిషన్లతో నాగిని డ్యాన్స్ చేయించాడు. విననడానికి విడ్డూరంగా ఉన్న నిజం. ఓ యువకుడు జేసీబీల ముందు కూర్చుని నాగిని సినిమాలోని మైనే తేరీ దుష్మన్ సాంగ్‌ను ప్లే చేస్తుండగా.. మరో వ్యక్తి ఆ మిషన్లను పాటకు తగ్గట్టు ఆడిస్తూ వాటితో నాగిని డ్యాన్స్ చేయించారు. క్రిష్ణ భట్ అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను తన ట్విటర్లో షేర్ చేయడమే కాక.. టిక్‌టాక్‌ను బ్యాన్ చేయనందుకు ధన్యవాదాలంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘వరల్డ్‌కప్‌లో ఇండియా ఓడిపోవడంతో బాధలో ఉన్న వారికి ఈ వీడియో కొత్త ఉత్సాహాన్ని కల్గిస్తుంది’.. ‘వాటే క్రియేటివిటీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు. thank you for not banning TikTok.#TikTok #ThursdayThoughtspic.twitter.com/W1Lf2hx1MA — Krishna Bhatt (@thekrishnabhatt) July 11, 2019 -
జేసీబీ డోజర్‌లో వధూవరుల బరాత్
సంగెం (పరకాల): సాధారణంగా పెళ్లి పూర్తయ్యాక వధూ వరులతో కారు లేదా జీపు.. ఇంకా ఆసక్తి ఉంటే గుర్రాల బగ్గీపై బరాత్ నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం తనకు బతుకుదెరువు ఇచ్చిన జేసీబీపైనే బరాత్ ఏర్పాటు చేసుకున్నాడు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం రామచంద్రాపురానికి చెందిన ఉడుతబోయిన రాకేష్ చిన్నప్పటి నుంచి వాహనాలను ఇష్టపడేవాడు. తండ్రితో కలసి స్వయం ఉపాధి కోసం జేసీబీ తీసు కుని నడుపుకుంటున్నాడు. ఇదే మండలంలోని లోహిత గ్రామానికి చెందిన సుప్రియతో ఈనెల 8న రాకేష్ వివా హం జరిగింది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి తన జేసీబీ డోజర్‌ను అందంగా అలంకరించి దాని తొట్టెలో సుప్రియతో కలసి కూర్చుని బరాత్ నిర్వహించుకున్నాడు. దీనికి గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. -
ఒక్కరి కోసం రోడ్డు తవ్వేశారు..
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణాల్లో ఇప్పటికే పేదల ఇళ్లు మూడడుగుల లోతుకు వెళ్లిపోయాయి. పాత సీసీ రోడ్డును పగలగొట్టకుండానే కాంట్రాక్టర్లు రోడ్డుపై రోడ్డు వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. పేదలు కావడంతో కాంట్రాక్టర్లను ప్రశ్నించలేదని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో తమ ఇళ్లలోకి నీరొస్తుందం టూ అధికారులు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవిం చుకున్నా ప్రయోజనం కరువైంది. ఈ పరిస్థితులు సామాన్యులకు మాత్రమేనని స్పష్టమవుతోం ది. నిబంధనలకు మంగళం నగరంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేట కృష్ణమందిరం వీధిలో టీడీపీ సీనియర్ నేత దగ్గు సుబ్బారావు కుమారుడి ఇంటి వద్ద ఇటీవల సీసీ రోడ్డును నిర్మించారు. అయితే రోడ్డు ఎత్తులోకి రావడంతో టీడీపీ నేత ఇళ్లు రెండడుగుల లోతుకు వెళ్లింది. దీంతో తాము నివసిస్తున్న ఇల్లు లోతులోకి వెళ్లిందని.. రోడ్డును పగలగొడతామని కాంట్రాక్టర్‌ను బెదిరించారు. దీంతో రోడ్డు వేసిన వారంలోనే జేసీబీ సాయంతో గంటల వ్యవధిలో పగలగొట్టారు. టీడీపీ నేతలకు సమస్య వస్తే మాత్రం వేసిన రోడ్డును సైతం పగలగొడుతున్నారని, అయితే ఇదే సమస్యను తాము ఎదుర్కొంటున్నామని తెలియజేస్తే పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమందిరం వీధిలో దాదాపు 200 మీటర్ల రోడ్డును వేసి ఉండగా, టీడీపీ నేత ఇంటి వద్ద 40 మీటర్ల రోడ్డు తవ్వి తిరిగి వేయడం విమర్శలకు తావిస్తోంది. కాంట్రాక్టర్‌కు హుకుం జారీ టీడీపీ నేతల ఇళ్ల వద్ద సీసీ రోడ్డు వేసే క్రమంలో నేతలతో చర్చించి వారి సూచనల మేరకే రోడ్డు వేయాలని కాంట్రాక్టర్లకు మంత్రి నారాయణ హుకుం జారీ చేశారని సమాచారం. సీసీ రోడ్లు వేయడంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని వీధుల్లో ఇళ్లు మూడు నుంచి నాలుగడుగుల మేర లోతుకు వెళ్లాయి. పాత సీసీ రోడ్డును పూర్తిగా పగలకొట్టకుండా మరో సీసీ రోడ్డు వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. -
జేసీబీలో ఊరేగిన వధూవరులు
బొమ్మనహళ్లి : పెళ్లి అనేది జీవితంలో మరుపురాని ఘట్టం. వారి వారి ఆర్థిక స్థోమతలను బట్టి వివాహాలను వైభవంగా చేసుకుంటారు. ఇందులో మరో తరహా వ్యక్తులు ఉంటారు. ఆకాశంలో, నీటి అడుగు భాగంలో పెళ్లిల్లు చేసుకుని సాహసాలు చేసేవారు మరికొందరు. ఇక్కడ జేసీబీలో ఊరేగుతున్న ఈ నూతన జంటను చూడండి... పనిపై ఉన్న ప్రేమతోనే సదరు వరుడు, వధువును ఒప్పించి పెళ్లి అయిన తరువాత ఊరేగింపు ఇలా వెరైటీగా చేసుకున్నారు. వివరాలు... దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరు సంట్యార్ అనే ప్రాంతానికి చెందిన చేతన్ జేసీబీ ఆపరేటర్. పని పట్ల నిబద్దత ఎంతో ఎక్కువ. పనిని ప్రేమిస్తాడు. సోమవారం చేతన్‌కు మమతతో వివాహం జరిగింది. పెళ్లి తతంగం అంతా పూర్తయిన తరువాత పెళ్లి కుమారుడు చేతన్ జేసీబీలో ఊరేగింపు నిర్వహించాలని కోరాడు. ఇందుకు ఇరు కుటుంబాల వారు సమ్మతించడంతో ఒక జేసీబీని తెప్పించి దానికి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం నూతన వధూవురులను రెండు కిలోమీటర్ల మేర ఊరేగింపు చేశారు. దారి పొడవునా వధువు ముసిముసి నవ్వులు అందర్ని ఆకట్టుకున్నాయి. చేతన్ స్థానికంగా మంచి పేరు ఉండటంతో పెద్ద ఎత్తున బంధువుల, స్నేహితులు వచ్చి ఆశీర్వదించి వెళ్లారు. -
వీళ్లు సామాన్యులు కాదు
ప్రజాధనాన్ని దోచుకోవడానికి అనుకూలంగా ఉన్న ఏ ఒక్క చిన్న అవకాశాన్నీ నేతలు వదులుకోవడం లేదు. ఇందుకు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చిరునామాగా నిలుస్తోంది. చేయని పనులకు తప్పుడు బిల్లులు సృష్టించిన టీడీపీ నేతలు రూ.78 లక్షల ప్రజాధనాన్ని జేబుల్లో వేసుకున్నారు. తప్పుడు పనులకు ఫైలు సృష్టించిన అధికారులకు పర్సెంటేజీల రూపంలో మామూళ్లు అందజేశారు. చిత్తూరు అర్బన్: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగేళ్ల కాలంలో జేసీబీలకు చెల్లించిన అద్దె రూ.78 లక్షలు. ఏంటీ అవాక్కయ్యారా..? నిజమండీ బాబు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ చిట్టా పద్దుల్లో రాసుకున్న అక్షర సత్యం. రోడ్లు వేయాలంటే సిమెంటు కొనాలి. కమ్మి, రాళ్లు, కూలి ఇవ్వడంతో పాటు పెట్టుబడి కూడా పెట్టాలి. రూ.లక్ష పెట్టుబడి పెట్టి నాణ్యతగా రోడ్డు వేస్తే రూ.8 వేలు మిగిలే అవకాశముంది. అది కూడా అధికారులకు ఎలాంటి మామూళ్లు ఇవ్వకపోతే. కానీ పైసా పెట్టుబడి పెట్టకుండా, క్షేత్రస్థాయిలో పనులు చేయకుండా గమ్మత్తుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఒకే ఒక్క అవకాశం జేబీసీకే దక్కుతుంది. మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు తీశామని, రోడ్డుకు పక్కనున్న మట్టిని తీయించామని, చెరువు కట్టపై పిచ్చి మొక్కలు తొలగించామని, చెరువుకట్ట తెగ్గొట్టడానికి, కట్టను పూడ్చడానికి, రోడ్డు విస్తరణ పనులు అబ్బో ఇలా చాలా కారణాలను కష్టపడి మరీ కనుక్కుని రికార్డుల్లోకి ఎక్కించారు. ఇలా పలు కారణాలకు నాలుగేళ్ల కాలంలో జేసీబీని ఏకంగా 464 రోజులు వినియోగించినట్లు బిల్లులు చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా కార్పొరేషన్ కార్యాలయంలోని ఒక్క పారిశుద్ధ్య విభాగంలోనే రూ.అరకోటి దోచేశారు. అందరికీ వాటాలు.. పక్కాగా చేసిన పనులకైతే ఏ ఒక్కరికీ వాటాలు, లంచాలు ఇవ్వాల్సిన అసరంలేదు. చేయని పనులకు, తప్పుడు పనులకు, నాణ్యత లేని పనులకు తప్పకుండా వాటాలు పంచాల్సిందే. జేసీబీల ద్వారా పనులు చేయకుండానే టీడీపీ చెందిన 18 మంది కార్పొరేటర్లు రూ.62 లక్షల బిల్లులు బినామీల పేరిట కాజేశారు. ఇదే సమయంలో వాస్తవ పనులకు జేబీసీ పెట్టిన పలువురికి ఇప్పటికీ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. నేతలు చూపించిన దారి మున్సిపల్ కార్యాలయంలోని ఓ శానిటరీ ఇన్స్పెక్టర్, మరో గుమాస్తా, ఇంజనీరింగ్ విభాగంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేసే మరో గుమస్తాకు బాగా కలిసి వచ్చింది. జేసీబీల పేరిట తప్పుడు బిల్లులు సృష్టించి రూ.7 లక్షల వరకు జేబుల్లో వేసుకున్నారు. టీడీపీ నేతలకు ఈ విషయం తెలిసినా అడగలేని పరిస్థితి. అడిగితే తమ బాగోతం బయటకొస్తుందనే భయంతో మిన్నకుండిపోతున్నారు. బిల్లుల మంజూరులో ఓ ఇంజినీరు, గణాంక శాఖ విభాగంలోని మరో అధికారి, గుమస్తాకు రూ.2 లక్షల వరకు వాటాలు చేరాయని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తవే కొనేయొచ్చు.. నాలుగేళ్లలో జేసీబీలకు పెట్టిన ఖర్చుతో మూడు కొత్త జేసీబీ యంత్రాలను కొనచ్చు. ఒక్కో కొత్త యంత్రం రూ.28 లక్షలే. ఇక మంచి కండీషన్లో ఉన్న సెకండ్‌హ్యాండ్ యంత్రాలైతే ఏకంగా ఎనిమిదింటిని కొనేయచ్చు. ఇదంతా అధికారులకు తెలియనివా అంటే అన్నీ తెలుసనే చెప్పాలి. తప్పదన్నట్లు కొన్ని.. తమకెంత అని మరికొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. విజిలెన్స్ లాంటి విభాగాలు ఈ వ్యవహారంపై దృష్టి సారిస్తే జరిగిన అవకతవకలు బయటపడే అవకాశముంది. -
ఇనుగుర్తిలో కాకతీయుల ఆనవాళ్లు
బయటపడిన కల్యాణ మండపం, పూల చిత్రాల రాళ్లు కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో కాకతీయుల ఆనవాళ్లు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన వేముల చిన్నయాదగిరి ఇంట్లో ఇంకుడుగుంత కోసం తవ్వుతుండగా, వెడల్పు రాయి తగిలింది. దీంతో వేరే పక్క నుంచి తవ్వకాలు జరిపారు. మళ్లీ రాతిబండ వచ్చింది. ఈ మేరకు జేసీబీలో ఆ రాయిని బయటకు తీశారు. ఈ క్రమంలో అవి కాకతీయుల నాటి రాతి నిర్మాణాలుగా గుర్తించారు. సుమారు 6 ఫీట్ల వైశాల్యంతో రెండు ఫీట్ల మందంతో ఉన్న ఈ రాతి విగ్రహం పైన వృత్తాకారంలో చెక్కిన తీరు చూసి గర్భగుడిలోని కల్యాణ మండపాల రాయిగా భావిస్తున్నారు. ఈ రాయితో పాటు మరో రెండు చిన్న రాళ్లు వాటిపై పుప్పాల చిత్రాలు ఉన్నాయి. ఈ బండరాయి కింద పెద్ద మొత్తంలో ఇసుక ఉండడం, మరో రాయి కూడా తీయరాని విధంగా ఉండడంతో ఇక్కడ కాకతీయుల నాటి నిర్మాణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. -
సోలార్ సిబ్బందిపై కేసు నమోదు
గడివేముల: గని సమీపంలో సోలార్ ప్రాజెక్టు పనులు చేస్తున్న హజురా కంపెనీ జేసీబీ డ్రైవర్లు శరత్‌కుమార్, శీనుపై సోమవారం సాయంత్రం కేసు నమోదు చేశామని గడివేముల పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు. 640 సర్వే నంబర్లో జేసీబీతో పనులు చేస్తుండగా నష్ట పరిహారం ఇవ్వలేదని గని గ్రామ రైతు చాంద్‌బాషా అడ్డుకున్నాడు. దీంతో జేసీబీ డ్రైవర్లు తనపై రాడ్లతో కొట్టారని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం కేసు నమోదు చేశామని హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. బాధితుడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
జేసీబీ ఆపరేటర్ దుర్మరణం
గుత్తి రూరల్ : లారీలో జేసీబీని తీసుకెళుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జేసీబీ ఆపరేటర్ దుర్మరణం చెందాడు. మరొక ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం పెద్దొడ్డి గ్రామానికి చెందిన రాజేష్‌గౌడ్ (23), లద్దగిరి మండలం కొండాపురానికి చెందిన గొల్ల కృష్ణలు జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో వెల్దుర్తిలో పనులు ముగించుకుని రాయలచెరువుకు లారీలో జేసీబీని తీసుకెళ్తున్నారు. గుత్తి మండలం ఉబిచెర్ల వద్దకు రాగానే లారీ ముందు టైరు పంక్చర్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతల్లోకి దూసెకెళ్లింది. అలా వెళ్లే సమయంలో వెనుక ఉన్న జేసీబీ ఒక్క సారిగా లారీ క్యాబిన్‌పైన పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఇరుక్కుపోయిన రాజేష్‌గౌడ్, గొల్ల కృష్ణలను పోలీసులు, స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో రాజేష్‌గౌడ్ మృతి చెందాడు. గొల్ల కృష్ణకు ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళ్లారు. ఎస్ఐ చాంద్‌బాషా సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
జేసీబీ కింద పడి యువకుడి మృతి
దుత్తలూరు : జేసీబీకి మరమ్మతులు చేస్తున్న ఓ యువకుడు అదే జేసీబీ కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం దుత్తలూరు సెంటర్ సమీపంలో జరిగింది. ఆత్మకూరు మండలం కరటంపాడుకు చెందిన హరీష్ (25) అనే యువకుడు నర్రవాడలో జేసీబీ ఆపరేటర్‌గా నాలుగు నెలల క్రితం చేరాడు. బుధవారం దుత్తలూరు–వింజమూరు మార్గంలోని మూతబడిన పెట్రోల్ బంక్ వద్ద జేసీబీని నిలిపి కిందవైపు మరమ్మతులు చేస్తున్నాడు. అయితే జేసీబీని ఆపరేట్ చేసే గేర్ లివర్లను లాక్ చేయడం మరిచాడు. మరమ్మతులు చేస్తుండగా అటుగా ఆడుకుంటున్న పిల్లలు పొరపాటున వాటిని తగలడంతో జేసీబీ ముందు భాగంలోని తొట్టెవంటి భాగంలో ఇరుక్కుపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం వింజమూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఆందలేదు. -
ఆర్టీసీ బస్సుకు జేసీబీ తగిలి తొమ్మిది మందికి గాయాలు
ములుగు : హన్మకొండ నుంచి ములుగుకు వస్తున్న ఆర్టీసీ బస్సుకు రోడ్డు పక్కన మిషన్ భగీరథ పనులు చేస్తున్న జేసీబీ హైడ్రాలిక్ బకెట్ ప్రమాదవశాత్తు తగలడంతో బస్సులోని ప్రయాణì కులకు గాయాలైన సంఘటన మండలంలోని పందికుంట సమీపంలో మంగళవారం జరిగింది. ఆర్టీసీ బస్సు(ఏపీ 28జెడ్ 2308) హన్మకొండ నుంచి ప్రయాణికులతో ములుగు వైపు బయల్దేరింది. పందికుంట సమీపంలో మిషన్ భగీరథ పైపుల కోసం కందకాలు తవ్వుతున్న జేసీబీ డ్రైవర్ గమనించకుండా ఒక్కసారిగా వెనక్కి తిప్పడంతో బకెట్ బస్సుకు తాకింది. దీంతో మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేటకు చెందిన బొచ్చు ఈశ్వరమ్మ, ఎం. పద్మ, బండారుపల్లికి చెందిన ముఖ్తార్‌పాషా, ముత్యాల ఉప్పరయ్య, జాకారానికి చెందిన తోట మల్లయ్య, కండక్టర్ తిప్పాని అనిత, ములుగుకు చెందిన అఫ్పియా, షకీల్‌కు గాయాలు కాగా ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై మల్లేశ్‌యాదవ్ పరిశీలించారు. -
కరెంట్ తీగలు తగిలి లారీ, జేసీబీ దగ్ధం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఓదెల మండలకేంద్రంలో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక లారీతోపాటు జేసీబీ కాలిపోయాయి. కొలనూర్ నుంచి లారీలో జేసీబీని తరలిస్తుండగా ఓదెల సమీపంలో కరెంటు తీగలు తగిలాయి. అది గమనించని లారీ డ్రైవర్ లారీని ముందుకు తీసుకెళ్లాడు. ఇంతలో కరెంట్ తీగలు ఒకదానికికోటి రాసుకుని ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో లారీ, జేసీబీ పూర్తిగా కాలిపోయాయి. రూ.70 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. కాగా, లారీ డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. -
జేసీబీ దగ్ధం చేసిన మావోయిస్టులు?
ములుగు: వరంగల్ జిల్లా ములుగు మండలం మల్లంపల్లి వద్ద ఎర్రమట్టి క్వారీ కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీకి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో జేసీబీ పూర్తిగా దగ్ధం అయింది. ఏటూరునాగారంలో పలువురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల తర్వాత జరిగిన ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల దృష్టి మార్చడానికే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. -
మట్టి దొంగలు
► అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా తవ్వకాలు ► చెరువు ఆధునికీకరణ పేరుతో మట్టిని అమ్ముకుంటున్న వైనం ► కాంట్రాక్టర్, ఫారెస్ట్ అధికారుల మిలాఖత్ నందనపల్లె (కర్నూలు సీక్యాంప్): అడవులను సంరక్షించాల్సిన అధికారులే మట్టి దొంగలకు అండగా నిలిచారు. నందనపల్లె గ్రామ పంచాయతీలో దర్గా సమీపంలోని అటవీశాఖ గట్టు తరిగిపోతోంది. ఐదు నెలల కాలంలో కొండను పూర్తిగా తవ్వేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుని అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. కాంట్రాక్టర్, అటవీ అధికారుల అండతో సూదిరెడ్డిపల్లె, నందనపల్లెకు చెందిన ఇద్దరు వ్యాపారులు అక్రమంగా మట్టిని తవ్వుకుని అమ్మేస్తున్నారు. గార్గేయపురం చెరువు ఆధునికీకరణకు అవసరమైన మట్టిని సమీపంలోని కొండ గట్టులో తవ్వుకునేందుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. దీనిని ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్ మట్టి వ్యాపారులతో చేతులు కలిపాడు. రెండు ట్రిప్పులు చెరువు నిర్మాణానికి తరలిస్తే మరో మూడు ట్రిప్పులు ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ట్రాక్టర్ ట్రిప్పు రూ. 2 వేల నుంచి 3 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జేసీబీతో కొండ గట్టును ఇప్పటికే దాదాపు చదును చేశారు. వేల క్యూబిక్ మీటర్ల మట్టిని అమ్మేసుకున్నారు. ఒకప్పుడు గుట్టగా కనిపించే ప్రాంతం మైదానంలా మారిపోయింది. ఫారెస్ట్ అధికారులకు నెల మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో మట్టి తరలింపును ఎవరూ అడ్డుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొందరు స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని బెదిరించారు. దీంతో అటు వైపు రైతులు వెళ్లేందుకు సాహసించడం లేదు. -
జేసీబీ దహనం: మావోయిస్టుల చర్యేనా?
కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో జరిగిన వరుస ఘటనలు మావోయిస్టుల సంచారంపై అనుమానాలు కలిగిస్తున్నాయి. సోమవారం రాత్రి మండలంలోని రామన్నపేట శివారులో ఒక కాంట్రాక్టర్‌కు చెందిన జేసీబీని గుర్తు తెలియని వ్యక్తులు కాలబెట్టారు. దాదాపు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఈ జేసీబీని ఇక్కడ గుట్టను తవ్వేందుకు వాడుతున్నారు. ఇదే విధంగా ఇటీవల మరిమడ్ల గ్రామంలోని సెల్‌ఫోన్ టవర్‌ను కూడా కాలబెట్టారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో ఇది మావోయిస్టుల పనిగా అనుమానిస్తున్నారు. -
బావిలో పడి జేసీబీ ఆపరేటర్ మృతి
జేసీబీ ఆపరేటర్ వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా మేడేపల్లి మండలం కొనుగోడు గ్రామ శివారులో సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుంచె నరసింహ (42) జేసీబీ ఆపరేటర్‌గా పనిచేసే వ్యవసాయ బావి పూడిక తీత పని కోసం వెళ్లాడు. పూడిక తీత తర్వాత బావి ఒడ్డున ఉన్న జనరేటర్ కాలికి తగలడంతో అదుపుతప్పి బావిలో పడి మృతి చెందాడు. -
భూగర్భ ఘోష
సరి‘హద్దులు’ దాటిన దందా పట్టా భూమి ఒడ్డున ఉంటే.. గోదావరిలో ఇసుక తవ్వకాలు నిబంధనలను నదిలోతొక్కుతున్న ఇసుకాసురులు నిత్యం 150 వాహనాల్లో రవాణారోజుకు లక్షలు దండు కుంటున్న అక్రమార్కులు టీఎస్ఎండీసీ పేరుతోకాంట్రాక్టర్లకు కాసులు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :చెన్నూరు వద్ద గోదావరిలో సాగుతున్న ఇసుక దందా సరి‘హద్దులు’ దాటిందా? పట్టా భూములు నది ఒడ్డున ఉంటే.. అధికారులు నదిలో ఉన్నట్లు చూపి తవ్వకాలకు తలుపులు బార్లా తీశారా? ఈ క్రమంలో రూ.లక్షల్లో ముడుపులు చేతులు మారాయా? అంటే అవుననే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టా భూములు ఒక చోట ఉంటే, బడా ఇసుక కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు ఆ భూములు నదిలో ఉన్నట్లు తేల్చి ఇసుక తవ్వకాలకు అనుమతులు కట్టబెట్టారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. చెన్నూరు గ్రామ శివారులోని సర్వే నెం.230లో 1.12 ఎకరాల్లో 12 వేల క్యూబిక్ మీటర్లు, 227, 227/1లోని 29 గుంటల్లో 6,750 క్యూబిక్ మీటర్లు, అలాగే సర్వే నెం.231లోని 2.19 ఎకరాల్లో మరో 15 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు అధికారులు డిసెంబర్లో అనుమతులు కట్టబెట్టిన విషయం విధితమే. ఆదిలాబాద్ :జిల్లాలో ఒకవైపు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే విధంగా ఇసుక తవ్వకాలకు అనుమతులు కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. కాగా.. ఈ అనుమతుల పేరుతో చేపడుతున్న ఇసుక దందా ఇప్పుడు మూడు టిప్పర్లు.. ఆరు లారీలు అన్న చందంగా నడుస్తోంది. నిత్యం సుమారు 150 నుంచి రెండు వందల వరకు భారీ వాహనాల్లో ఇసుకను తరలించి రూ.లక్షలు గడిస్తుంటే, అధికార యంత్రాంగం మామూళ్లతో జేబులు నింపుకుంటోంది. అయితే.. ఈ పట్టా భూములు నది ఒడ్డున ఉంటే.. అధికారులు మాత్రం నదిలో ఉన్నట్లు తేల్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి వ్యవహారాలే చోటు చేసుకున్నాయి. జైపూర్ మండల పరిధిలో కూడా పట్టా భూముల పేరుతోనే నది గర్భాన్నంతా తొలిచేసే వరకు రూ.లక్షల్లో ముడుపులు తీసుకుని కళ్లు మూసుకున్న అధికారులు, అంతా అయ్యాక విచారణల పేరుతో హడావుడి చేయడం జిల్లాలో పరిపాటిగా తయారైంది. నిత్యం రూ.లక్షల్లో... నగరాల్లో ఇసుక ఇప్పుడు బంగారమైంది. ఒక్కో టన్నుకు రూ.వేలల్లో ధర పలుకుతోంది. ఈ ఇసుక రీచ్ నుంచి నిత్యం సుమారు 150 నుంచి రెండు వందల లారీల్లో ఇసుక తరలిపోతోంది. ఒక్కో లారీలో 15 నుంచి 20 టన్నుల వరకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాలకు తరలించి నిత్యం రూ.లక్షల్లో జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలు నదిలో తొక్కుతున్నారిలా.. ఇసుక తవ్వకాల్లో నిబంధనలను పూర్తిగా నదిలో తొక్కుతున్నారు. జీవనదిగా పేరున్న గోదావరిని భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. పేరుకు టీఎస్ఎండీసీ అయినప్పటికీ, బడా ఇసుక కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.నిబంధనల ప్రకారం ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగించకూడదు. కూలీల చేత ఇసుకను తవ్వించి, డంప్ యార్డుకు తరలించి అక్కడి నుంచి ఇసుకను తరలించాలి. డంప్ యార్డుల్లో ఇసుక లోడ్ చేసేందుకు యంత్రాలను వాడవచ్చు. కానీ.. ఇక్కడ భారీ యంత్రాలతో నది గర్భాన్ని తొలిచేస్తున్నారు. జేసీబీలు, ప్రొక్లయినర్లతో ఇసుకను తోడేస్తున్నారు.నిర్ణీత లోతుకు మించి ఇసుక తవ్వరాదు. కానీ.. భూమి కనిపించే వరకు తవ్వుతుండటంతో నదిలో లోతైన గోతులు ఏర్పడుతున్నాయి. గతంలో ఈ గోతుల్లో పడి స్థానికులు చనిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇసుక తవ్వకాలు జరుపుతున్న చోట్ల టీఎస్ఎండీసీ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. కానీ.. అవేవీ లేకుండానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అటువైపు కన్నెత్తి చూస్తున్న నాథుడే లేకుండా పోవడంతో ఇష్టారాజ్యం కొనసాగుతోంది.రాత్రి ఆరు గంటల తర్వాత ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. కానీ.. పగలు రాత్రి తేడా లేకుండా తవ్వకాలు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.ఈ ఇసుక రవాణా చేసేందుకు పర్మిట్లు మంజూరు గనుల శాఖకు ఉండేది. కానీ.. టీఎస్ఎండీసీకి లీజుకిచ్చాక.. పర్మిట్ల మంజూరు కూడా ఆ సంస్థే జారీ చేస్తోంది. దీంతో ఒక్కో వే బిల్లుపై పదుల సంఖ్యలో భారీ వాహనాలు రవాణా అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒక్కో వాహనంలో పరిమితికి మించి ఇసుకను రవాణా చేస్తున్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఈ లారీలను తనిఖీ చేసిన దాఖలాల్లేవంటే రవాణా శాఖకు కూడా ఏ స్థాయిలో ముడుపులందుతున్నాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. -
పరకల్ని ఆశించి.. నరకంలో పడింది..
గోకవరం : ఆవును పూజిస్తే వచ్చే పుణ్యం.. మరణానంతరం వైతరిణి అనే కశ్మలపూరితమైన నదిని దాటించి, నరకాన్ని తప్పిస్తుందని పురాణాలు చెపుతారుు. దాని మాటేమో గానీ, పాపం.. ఓ ఆవు బతికుండగానే వైతరిణి లాంటి లెట్రిన్ ట్యాంక్‌లో చిక్కుకుని నాలుగు గంటలు నరకయూతన అనుభవించింది. చివరికి జనం దానికి ఆ కశ్మలకూపం నుంచి విముక్తి కలిగించారు. మంగరౌతు రామకృష్ణ అనే వ్యక్తి సాకుతున్న ఆవు సోమవారం ఉదయం అరుుదుగంటల సమయంలో మేతకు తిరుగాడుతూ గోకవరం, కొత్తపల్లి గ్రామాల మధ్య ఓ పామాయిల్ తోటలో చొరబడింది. తోట మకాంలోని లెట్రిన్ సెప్టిక్ ట్యాంక్ మీంచి వెళుతుండగా దాని మీదున్న మూతతో సహా బావిలోకి పడిపోరుుంది. ఎటూ కదలడానికి లేకుండా ఆ కశ్మలకూపంలో ఇరుక్కుపోరుుంది. ఉదయం ఏడు గంటలకు విషయం తెలుసుకున్న రామకృష్ణ.. నున్నం నూకరాజు తదితరులు ట్యాంక్ పక్కన వాలుగా గాడి తవ్వి, జేసీబీ సహాయంతో రెండు గంటలు శ్రమించి ఆవును బయటకు తీసి, చికిత్స చేరుుంచారు. -
వరంగల్ జిల్లాలో మావోయిస్టుల కలకలం
-
గుప్తనిధుల కోసం తవ్వకాలు
♦ గ్రామస్తులు, పోలీసుల రాకతో దుండగుల పరారీ ♦ జేసీబీతో పాటు రెండు కార్లలో వచ్చిన పదిమంది గిద్దలూరు : గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలకు యత్నిస్తుండగా గ్రామస్తులు, పోలీసుల ప్రవేశంతో పరారయ్యారు. ఈ సంఘటన మండలంలోని నరవ, బయనపల్లె గ్రామాల మధ్య నందికుంట సమీపంలో గురువారం రాత్రి జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. నంది కుంట సమీపంలోని పొలంలో కొన్నేళ్లుగా రెండు పెద్ద రాళ్లున్నాయి. వాటిపై సంస్కృతంలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. గమనించిన దుండగులు రాళ్ల కింద గుప్తనిధులున్నాయని ఆశపడ్డారు. అందులో భాగంగా గుప్తనిధుల కోసం అక్కడ తవ్వేందుకు రెండు కార్లలో పది మంది చేరుకున్నారు. రాళ్లను పక్కకు తొలగించి తవ్వకాలకు జేసీబీని తెచ్చుకున్నారు. రాళ్లు ఉన్న ప్రదేశంలో పూజలు చేస్తే గ్రామస్తులకు కనిపిస్తుందని గ్రహించిన దుండగులు.. పక్కనే ఉన్న కుంటను అడ్డుగా చేసుకుని కొంచెం దూరంగా పూజలకు జిల్లేడు కర్రలు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ వంటివి సిద్ధం చేసుకున్నారు. వాహనాలన్నీ నరవ నుంచి రాత్రి 10 గంటల సమయంలో వెళ్లడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. కొందరు యువకులు సంఘటన స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ ఎక్కువ మందితో పాటు రెండు కార్లు, జేసీబీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎస్ఎండీ ఫిరోజ్, ఏఎస్సై రఫీయుద్దీన్లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వస్తుండగా దుండగులు జేసీబీ, కార్లతో సహా బయనపల్లె రోడ్డులో పారిపోయారు. సంఘటన స్థలంలో జిల్లేడు కర్రలు, నిమ్మకాయలను సీఐ పరిశీలించారు. నిందితులు గిద్దలూరు ప్రాంతానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. గతేడాది పాపులవీడు, తురిమెళ్ల కనక సురభేశ్వర కోన ఆలయం వద్ద దుండగులు అనేక పర్యాయాలు తవ్వకాలు జరిపారు. రాచర్ల మండలం గుడిమెట్ట మౌళాలి స్వామి దర్గాలో తవ్వకాలు జరిపి స్వామి ప్రతిమ తీసుకెళ్లారు. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడే వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. -
జేసీబీని ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి(శామీర్‌పేట్): కారు, జేసీబీని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పుష్కరాలకు వెళ్లిన వస్తున్న నగరవాసులు శామీర్‌పేట్ మండలం మజీద్‌పూర్ చౌరాస్తా వద్ద రాజీవ్ రహదారిపై ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఐదుగురు పుష్కరాల సందర్భంగా గురువారం తెల్లవారుజామున కారులో కరీంనగర్ జిల్లా ధర్మపురికి వెళ్లి అదేరోజు రాత్రి తిరిగి నగరానికి ప్రయాణమయ్యారు. రాజీవ్ రహదారిపై వస్తుండగా మండలంలోని మజీద్‌పూర్ చౌరాస్తా వద్దకు రాగానే ఓ జేసీబీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. -
ఆటో బోల్తా : నలుగురికి గాయాలు
మహబూబ్‌నగర్ : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో వెనుకనే వస్తున్న జేసీబీ డ్రైవర్ ఇది గమనించి ఆటోను సరిచేయడానికి ప్రయత్నించాడు. దీంతో జేసీబీ క్రేన్ బలంగా తగిలి ఆటోలో ఉన్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజ్నేపల్లి మండలం వట్టెం గ్రామ సమీపంలో శనివారం జరిగింది. తెల్కపల్లి మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అలివేలమ్మ(54) ఆటోలో తెల్కపల్లి మీదుగా హైదరాబాద్ వస్తోంది. ఈ క్రమంలో ఆటో వట్టెం గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో ఆటో వెనుకనే వస్తున్న జేసీబీ డ్రైవర్ ఆటోను తిరిగి నిలబెట్టడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆటోలోని అలివేలమ్మకు జేసీబీ క్రేన్ బలంగా ఢీకొనడంతో ఆమె చేయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
మేడ్చల్‌లో ‘గ్యాస్’ లీకేజీ కలకలం!
మేడ్చల్:ఓ ప్రైవేట్ స్థలంలో జేసీబీతో పని చేయిస్తుండగా భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ పగిలిపోవడంతో సీఎన్జీ గ్యాస్ లీకైంది. ఈ సంఘటన మేడ్చల్‌లోని ఉమానగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌కు చెందిన లక్ష్మీనారాయణ ఉమానగర్‌లో జాతీయ రహదారి పక్కన దర్గా సమీపంలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇంటి ఆవరణలో నిలుస్తున్న వర్షం నీటిని సమీపంలోని డ్రైనేజీలోకి మళ్లించేందుకు మంగళవారం ఓ జేసీబీతో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో భూగర్భంలో ఉన్న భాగ్యనగర్ గ్యాస్ పైపులైన్ పగిలిపోవడంతో సీఎన్జీ గ్యాస్ లీకైంది. ఈ సంఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైపులైన్ పగిలిన చోట మరమ్మతు చేసి గ్యాస్ లీకవకుండా చేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సీఎన్జీ గ్యాస్ కావడంతో మంటలు చెలరేగే ప్రమాదం లేదని వారు స్థానికులకు చెప్పి వెళ్లిపోయారు. కాగా భాగ్యనగర్ సీఎన్జీ గ్యాస్ పైపులైన్లు చాలా తక్కువ లోతులోంచి ఉండడంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం మేడ్చల్ బస్‌డిపో వద్ద ఓ ప్రైవేట్ వ్యక్తి జేసీబీతో పనిచేయిస్తుండగా కూడా భాగ్యనగర్ సీఎన్జీ గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
తృటిలో జబల్పూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో కాపలాలేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూల్ బస్సును రైలు డీకొని చిన్నారుల మరణించిన ఘోర సంఘటన కళ్ల ముందు మెదులుతుండగానే.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో మరోసారి ఇలాంటి ప్రమాదమే జరిగింది. అదృష్టవశాత్తూ ఈసారి పెద్ద ప్రమాదమే తప్పింది. కాపాలేని రైల్వే క్రాసింగ్ వద్ద జబల్పూర్ ఎక్స్‌ప్రెస్ జేసీబీని డీకొంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దున గల కర్ణాటకలోని దొడ్డబళాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలవగా, రైలు ఇంజిన్ దెబ్బతింది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
పోలీసుల అదుపులో జేసీబీ డ్రైవర్
డిచ్పల్లి, న్యూస్‌లైన్: అటవీ సెక్షన్ అధికారులపై దాడికి యత్నించిన జేసీబీ డ్రైవర్ తౌఫిక్‌ను ఆదివారం డిచ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం ఇందల్వాయి అటవీ రేంజ్ పరిధిలోని అటవీ భూమిలో అనుమతి లేకుండా మొరం తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో సెక్షన్ అధికారి గోవర్ధన్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ అధికారులను గమనించిన జేసీబీ డ్రైవర్ పారిపోయేందుకు యత్నించాడు. పట్టుకునేందుకు వెంబడించిన అటవీ అధికారుల జీపును జేసీబీతో ఢీకొట్టగా తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన డిచ్పల్లి పోలీసులు జేసీబీని, ధ్వంసమైన జీపును పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్ తౌఫిక్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. గతనెలలో ఇందల్వాయి రేంజ్ అధికారి గంగయ్య హత్యోదంతం మరువక ముందే మరోసారి అటవీ అధికారులపై దాడి యత్నం జరుగడం అటవీ సిబ్బందిలో అందోళన రేకేత్తిస్తోంది. దాడులకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అటవీ సిబ్బంది కోరుతున్నారు. ఎఫ్ఆర్వో హత్య సమయంలో ధ్వంసమైన జీపుకు మరమ్మతులు చేయించిన తర్వాత శనివారం మధ్యాహ్నం కార్యాలయానికి తీసుకువచ్చినట్లు సిబ్బంది తెలిపారు. అదే రోజు సాయంత్రం తిరిగి జీపు జేసీబీ దాడిలో మరోసారి ధ్వంసమైంది.