న్యూఢిల్లీ: నిర్మాణ రంగ పరికరాల తయారీ దిగ్గజం జేసీబీ తాజాగా గుజరాత్‌లోని వదోదరలో కొత్త ప్లాంటు ఆవిష్కరించింది. దాదాపు 100 మిలియన్ పౌండ్లతో (సుమారు రూ. 995 కోట్లు) నిర్మించిన ఈ ఫ్యాక్టరీని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ప్రారంభించారు.
అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులకు అవసరమైన భాగాలను ఈ ప్లాంటులో తయారు చేయనున్నట్లు జేసీబీ చైర్మన్ లార్డ్ బామ్‌ఫోర్డ్ తెలిపారు. ఇది ఏటా 85,000 టన్నుల ఉక్కును ప్రాసెస్ చేయగలదని వివరించారు. 1979లో భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించిన జేసీబీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయి.
చదవండి: తులసిభాయ్.. ఆ ప్రముఖుడికి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment