inauguration
-
జైశంకర్‌కు ముందు సీటు.. మెలానియా తళుకులు.. సందడిగా సాగిన ట్రంప్ ఈవెంట్లో చిత్రాలెన్నో!
-
ప్రజల భద్రతకు ఎన్డీఆర్ఎఫ్ భరోసా
సాక్షి, అమరావతి: విపత్తులు సంభవించినప్పుడు ప్రజల భద్రతకు భరోసానిస్తూ జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) నిరుపమాన సేవలు అందిస్తోందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్నారు. గన్నవరం మండలం కొండపావులూరులో ఆదివారం నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, దక్షిణ క్యాంపస్ భవనాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని చెప్పారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మూడింతల అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఆరు నెలల్లోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించామని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించడంతోపాటు రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా రూ.27 వేల కోట్ల సహాయం అందిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అమిత్ షా(Amit Shah) మనిషిలా కాకుండా మెషిన్లా పని చేస్తున్నారని, ఆయన పనితీరు చూస్తుంటే అసూయ కలుగుతోందన్నారు. పీపీపీ విధానంలో ‘గోదావరి – బనకచర్ల’ అనుసంధానానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.ఈ బృహత్తర కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విపత్తులను తక్షణం ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం అమిత్ షా(Amit Shah) గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. తొక్కిసలాట ఘటనపై దృష్టి తిరుపతిలో ఇటీవల చోటు చేసుకున్న తిరుమల శ్రీవారి భక్తుల తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోమ్ శాఖ సైతం దృష్టి సారించిందని ఆ శాఖ మంత్రి అమిత్‌షా వీహెచ్‌పీ నేతల భేటీలో వెల్లడించారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయనతో ఆదివారం ఉదయం వీహెచ్‌పీ జాతీయ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు నేతృత్వంలో సంఘ ప్రముఖ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడలో వీహెచ్‌పీ నిర్వహించిన హైందవ శంఖారావం సభ గురించి వారు అమిత్‌షాకు వివరించారు. దేశవ్యాప్తంగా ఆలయాలను ప్రభుత్వ పరిధి నుంచి పూర్తిగా తప్పించి, స్వయం ప్రతిపత్తి క ల్పించేందుకు కేంద్రం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి తొక్కిసలాట అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ కూడా పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి వీహెచ్‌పీ నేతలకు వివరించారని తెలిసింది. ప్రజలు ఏమనుకుంటున్నారు.. రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు ఎలాంటి భావంతో ఉన్నారని అమిత్ షా(Amit Shah).. రాష్ట్ర బీజేపీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం ఆయన బస చేసిన హోటల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర సహాయ మంత్రి భూపతి శ్రీనివాసవర్మ, రాష్ట్ర పార్టీ సంఘటన కార్యదర్శి మధుకర్‌లతో కొద్దిసేపు సమావేశమై రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహాయ సహకారాలపై పెద్ద ఎత్తున ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశనం చేశారు. నామినేటెడ్ పదవులు పంపకం సహా కూటమి పారీ్టల మధ్య సమన్వయం ఎలా ఉందన్న దానిపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. -
Watch Live: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం
-
విశాఖలో YSRCP కార్యాలయం ప్రారంభం
-
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం
-
ఓమహాలో నాట్స్ ప్రస్థానానికి శ్రీకారం
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగువారికి మరింత చేరువ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓమాహాలో నాట్స్ తన ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది. ఓమాహాలోని నవాబీ హైదరాబాద్ హౌస్‌లో నాట్స్ చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఓమహాలో నాట్స్ చాప్టర్ కో ఆర్డినేటర్‌గా మురళీధర్ చింతపల్లికి నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. శ్రీనివాస్ మల్లిపుడి జాయింట్ కో ఆర్డినేటర్ పదవి వరించింది. మహిళా సాధికారిత శ్రీదేవి కమ్మ, విరాళాల సేకరణ, సభ్యత్వం ప్రదీప్ సోమవరపు, వెబ్ అండ్ మీడియా శ్రీనివాసరావు, క్రీడలు సత్యనారాయణ పావులూరి, కార్యక్రమాల నిర్వహణ కృష్ణ చైతన్య రావిపాటిలకు నాట్స్ బాధ్యతలు అప్పగించింది. మనం చేసే సేవే కార్యక్రమాలే మనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయని నాట్స్ ఓమహా చాప్టర్ సభ్యులు సరికొత్త సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్కో అధ్యక్షుడు మదన్రా పాములపాటి కోరారు. నాట్స్ చేపట్టే సేవా కార్యక్రమాలు మన పిల్లలతో సహా భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని అన్నారు. ఓమహాలో తెలుగు వారిని ఐక్యం చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని నాట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల అన్నారు. ఓమహాలో తెలుగువారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ ఉందనే భరోసా ఇచ్చే విధంగా నాట్స్ సభ్యులు, వాలంటీర్లు కృషి చేయాలని కోరారు. నాట్స్ డాక్టర్స్ హెల్ప్ లైన్ అందించిన సెకండ్ ఓపినీయన్స్ ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చిందని భాను ధూళిపాళ్ల వివరించారు. నాట్స్ మెంబర్షిప్ నేషనల్ కోఆర్డినేటర్ రామకృష్ణ బాలినేని ఒమాహా బృందాన్ని అభినందించారు. ఓమహా బృందాన్ని అందరికి పరిచయం చేశారు.ఓమహాలో నాట్స్ చాప్టర్‌ను స్థానికంగా ఉండే తెలుగు వారందరిని కలుపుకుని ముందుకు సాగుతుందని నాట్స్ ఓమహా చాప్టర్ కోఆర్డినేటర్ మురళీధర్ చింతపల్లి అన్నారు.. నెబ్రాస్కా విశ్వవిద్యాలయం నుండి తెలుగు ప్రొఫెసర్లు స్థానిక సంస్థల నుంచి సీనియర్ తెలుగు నాయకులతో కూడిన విద్యార్థి కెరీర్ కౌన్సెలింగ్ బృందాన్ని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ రావుల భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి శ్రీనివాసరావు మల్లిపూడి కృతజ్ఞతలు తెలిపారు. రావు చిగురుపాటి, హిందూ దేవాలయం అధ్యక్షుడు సుందర్ చొక్కర, ప్రొఫెసర్ డాక్టర్ ఫణిలు తమను నాట్స్ జాతీయ నాయకత్వంలో భాగస్వామ్యం చేసినందుకు నాట్స్ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ చైతన్య ఈ కార్యక్రమానికి ఆడియో వీడియో సపోర్ట్‌ను అందించారు. శ్రీదేవి కమ్మ స్టేజీ డెకరేషన్లో సహకరించారు. ప్రదీప్ సోమవరపు, సత్య పావులూరిలు నాట్స్ మెంబర్షిప్ డ్రైవ్, నాట్స్ ప్రచారాన్ని ప్రారంభించారు. నవాబీ హైదరాబాద్ హౌస్‌తో సహా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి, ఒమాహాలోని తెలుగు ప్రజలందరికీ ఓమహా నాట్స్ చాప్టర్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.(చదవండి: చికాగోలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు -
హెచ్‌సీఎల్ మరో క్యాంపస్.. అదనంగా 5 వేల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నగరంలోని హైటెక్ సిటీలో త్వరలో కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త క్యాంపస్ ద్వారా మరో 5 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్నీ నాడర్ మల్హోత్రా శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. కొత్త క్యాంపస్ ప్రారంపోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వనించారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్.. విద్యార్థులకు మెరుగైన శిక్షణ, విద్యావనరుల విస్తరణ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయాల్సిందిగా హెచ్సీఎల్ను కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్‌సీఎల్ చేస్తున్న కృషిని సీఎం అభినందించారు. హెచ్‌సీఎల్‌కు తగినంత సహకారం అందిస్తామని చెప్పారు. నైపుణ్య శిక్షణ ద్వారా యువత సాధికారత కోసం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామని రోష్నీ నాడర్ హామీ ఇచ్చారు. స్కిల్స్ యూనివర్సిటీతోపాటు హెచ్‌సీఎల్ విద్యాకార్యక్రమాలను రాష్ట్రంలోని ఇతర వర్సిటీలకు విస్తరిస్తామన్నారు. -
ప్రారంభమైన అరగంటకే లూటీ!
కరాచీ: పాకిస్తాన్‌లోని కరాచీలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ కొత్తగా ప్రారంభించిన షాపింగ్ మాల్ ‘డ్రీమ్ బజార్’ప్రారంభోత్సవం రోజునే లూటీకి గురయ్యింది. ఈ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ఒక బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది. దీనిని చూసిన జనం మాల్ లోనికి ప్రవేశించి, తమకు తోచిన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో అరగంటలో మాల్ మొత్తం ఖాళీ అయిపోయింది.రూ. 50 కంటే తక్కువ ధరలకే వివిధ వస్తువులను విక్రయిస్తామంటూ ఈ మాల్‌ను ప్రారంభించారు. మొదటి రోజునే మాల్ విధ్వంసానికి గురయ్యింది. పాకిస్తాన్లో తొలి మెగా పొదుపు దుకాణంగా ఈ మాల్‌కు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. ప్రారంభోత్సవం రోజున దుస్తులు, వివిధ ఉపకరణాలు గృహోపకరణాలను భారీ తగ్గింపు ధరలకు అందిస్తామని మాల్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో మాల్ తెరుచుకోగాగానే వేలాది మంది మాల్‌లోకి ప్రవేశించి, చేతికి అందిన వస్తువులను పట్టుకుపోయారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పరిశీలించి చూస్తే కరాచీలోని గులిస్తాన్-ఎ-జోహార్ ప్రాంతంలో ఈ మాల్‌ను ప్రారంభించారని తెలుస్తోంది. దాదాపు లక్ష మంది మాల్‌పై దాడి చేసి, ఒక్క వస్తువు కూడా వదిలిపెట్టకుండా తీసుకెళ్లిపోయారని తెలుస్తోంది.ఏఆర్వై న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం మాల్లో పరిస్థితిని నియంత్రించడానికి అక్కడి సిబ్బంది తలుపులు మూసే ప్రయత్నం చేయగా, బయటనున్నవారు కర్రలతో గ్లాస్ ఎంట్రీ గేట్‌ను పగలగొట్టి లోనికి చొరబడ్డారు. దీని తరువాత మాల్తో పరిస్థితి చాలా భయానకంగా మారింది. మరోవైపు నగరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మాల్ వెలుపల వేలాది జనం గుమిగూడారు. ఈ ఘటనను చాలామంది తమ ఫోన్లతో వీడియోలు తీశారు. మాల్ ప్రారంభించిన అరగంటలోనే ఖాళీ అయిపోయిందని, జనం వస్తువులన్నింటినీ పట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కొత్త మాల్ తెరవగా 3:30 కల్లా వస్తువులన్నీ లూటీ అయ్యాయని సమాచారం. A businessman of Pakistani origin living abroad opened a huge mall in Gulistan-e-Johar locality of Karachi, which he named Dream Bazaar. And today on the day of inauguration he had announced a special discount. A crowd of about one lakh Paki goths stormed the mall and looted the… pic.twitter.com/OmLvMn6kHF— Politicspedia (@Politicspedia23) September 1, 2024 -
మేడం వచ్చాకే రిబ్బన్ కటింగ్
సాక్షి టాస్క్‌పోర్స్: టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి గారి భార్య మొన్న కారులో కూర్చొని పోలీసు అధికారులను హడలెత్తించిన దృశ్యం చూశాం. ఇప్పుడు అదే కూటమికి చెందిన ఓ ఎమ్మెల్యే గారి భర్త రైతు బజారులో ఓ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించారు. మేడం వస్తే కానీ రిబ్బన్ కటింగ్ జరగకూడదంటూ స్వయంగా కలెక్టర్‌కే హుకుం జారీ చేసి కూటమి నేతల విపరీత ధోరణిని మరోసారి బయట పెట్టారు. వైఎస్సార్ జిల్లా కడపలో జరిగిన ఈ ఘటన వివరాలివీ..తక్కువ ధరలతో కందిపప్పు, బియ్యాన్ని వినియోగదారులకు అందించేందుకు పౌర సరఫరాల శాఖ కడప రైతు బజార్లో ఓ స్టాల్ ఏర్పాటు చేసింది. దీనిని గురువారం ఉదయం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ స్టాల్ ఓపెనింగ్‌కు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జేసీ గణేష్‌కుమార్ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కడప ఆర్డీవో, డీఎస్వోలతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులంతా ఉదయం 9.30 గంటలకే కడప రైతు బజార్‌కు చేరుకున్నారు. మరో 10 నిమిషాల్లో కలెక్టర్, జేసీ వచ్చి స్టాల్‌ను ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఇంతలోనే కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి రంగప్రవేశం చేశారు. ఆయన కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతు బజార్లో స్టాల్‌ను ఓపెనింగ్ చేయవద్దని హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే మేడం హైదరాబాదులో ఉన్నారని, ఆవిడ శుక్రవారం వచ్చి ప్రారంభిస్తారని చెప్పారు. దీంతో కలెక్టర్ స్టాల్ ప్రారంభోత్సవాన్ని నిలిపివేశారు. ఆ వెంటనే రైతు బజార్ సిబ్బంది ప్రారంభోత్సవం బ్యానర్లు, రిబ్బన్లు తొలగించారు. శుక్రవారంనాటి ప్రారంభోత్సవానికి మళ్లీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. వాస్తవానికి ఈ స్టాల్ గురించి అధికారులు ముందుగానే ఎమ్మెల్యే మాధవీరెడ్డికి తెలిపి, ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. అయితే తనకు వీలు కాదని, కలెక్టర్‌తో ఓపెనింగ్ చేయించుకోండని ఆమె చెప్పారని తెలిసింది. తీరా అన్ని ఏర్పాట్లు చేశాక చివరి నిమిషంలో ప్రారంభోత్సవాన్ని నిలిపివేయించడంతో ఇదేమి ధోరణి అని అధికారులు, వినియోగదారులు ముక్కున వేలేసుకున్నారు. -
కర్నూల్ జిల్లాలో YSR విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం
-
భూటాన్‌లో ఆస్పత్రిని ప్రారంభించిన మోదీ
థింపు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివా రం భూటాన్ రాజధాని థింపూలో అత్యాధు నిక వసతులతో నిర్మించిన ఆస్పత్రిని ఆ దేశ ప్రధాని త్సెరింగ్ టోబ్గేతో కలిసి ప్రారంభించారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 పడకలతో కూడిన గ్యాల్ట్సుయెన్ జెట్సున్ పెమా వాంగ్‌చుక్ మాతా శిశు హాస్పిటల్‌ను భారత ప్రభుత్వ సహకారంతో నిర్మించారు. నాణ్యతతో కూడిన ఆరోగ్య సేవలను అందించే ఈ ఆస్పత్రి ఎన్నో కుటుంబాలకు ఆశా కిరణం వంటిదని అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్–టిబెట్ల ఆర్థిక సహకారానికి ఒక గొప్ప ఉదాహరణ ఈ ఆస్పత్రి అని తెలిపారు. భారత్ సాయంతో మొదటి దశలో రూ.22 కోట్లతో నిర్మించిన ఈ ఆస్పత్రి 2019 నుంచి సేవలందిస్తోంది. భారత్ అందించిన మరో రూ.119 కోట్లతో చేపట్టిన ఆస్పత్రి రెండో దశ నిర్మాణం తాజాగా పూర్తయిందని విదేశాంగ శాఖ తెలిపింది. ఎయిర్‌పోర్టులో వీడ్కోలు పలికిన రాజు రెండు రోజుల పర్యటనకు గాను ప్రధాని మోదీ శుక్రవారం భూటాన్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాజు జిగ్మే ఖేసర్ వాంగ్‌చుక్ ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను అందజేశారు. మోదీతో ఆయన ప్రత్యేకంగా సమావేశమ య్యారు. పర్యటన ముగించుకుని తిరిగి శనివారం మధ్యాహ్నం మోదీ తిరుగు పయనమయ్యారు. ఆయన వెంట ప్రధాని త్సెరింగ్ టోబ్గేతోపాటు రాజు జింగ్మే ఖేసర్ వాంగ్‌చుక్ స్వయంగా పారో విమానాశ్ర యానికి వచ్చారు. వీరిద్దరూ ప్రధాని మోదీకి ఘనంగా వీడ్కోలు పలికారు. -
క్వు రేషన్స్ .. పాప్-అప్ మేళా భళా ! (ఫొటోలు)
-
ప్రతి అడుగులోనూ అభివృద్ధి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నానని, ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు సీఎం ప్రారంభోత్సవం చేశారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు. సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ►ఈ రోజు విజయవాడలో మంచి కార్యక్రమాలు జరిగిస్తూ, మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ►ఈ రోజు విజయవాడలోనే 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. ►ఇందులో 22ఏ కింద పూర్తి హక్కులు లేక, రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపు 21వేల మంది.. విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్.. అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి ఇవన్నీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతోంది. ►అదేరకంగా 9,125 పట్టాలు అనబ్జెక్షబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి రెగ్యులరైజ్ జరుగుతోంది. ►దీనికి సంబంధించి అవినాశ్ చెబుతున్నాడు.. భ్రమరాంబపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఇబ్బందికర పరిస్థితుల్లో రెగ్యులరైజ్ కాక ఇళ్లు అక్కడే కట్టుకుని, దశాబ్దాలుగా ఉంటున్నపటికీ ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బందులు పడే పరిస్థితులను చెప్పాడు. ►అవన్నీ ఈరోజు పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ►మొత్తంగా దాదాపు 31866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ ఒకవైపు జరిగిస్తుండగా రూ.239 కోట్లకు సంబంధించిన రకరకాల ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. ►దీనివల్ల మురికినీళ్లు మన ఇంటి పక్కన రాకుండా వాటిని నీట్‌గా ట్రీట్ చేసేసి సీవేజ్ ట్రట్మెంట్ ప్లాన్స్ ను 5 ప్రాంతాల్లో తీసుకొచ్చి ఫౌండేషన్ స్టోన్స్ రూ.239 కోట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ►ఇప్పుడు ఈ కరకట్ట వాల్‌ను మీరు చూస్తున్నారు. ఇటువైపున, అటువైపున ఈరెండు కరకట్ట గోడలు దాదాపు రూ.500 కోట్లతో గోడలుకట్టడమే కాకుండా కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతున్న పరిస్థితులు.. ►ఎప్పుడు వరదలు వచ్చినా ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పడమే కానీ, కచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలని అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతోందని చెప్పడానికి సంతోషపడుతున్నా. ►కరకట్ట గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్కచెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, తాతలు అందరూ ఆహ్లాదకరంగా సాయంత్రంపూట పార్కులో నడుచుకుని పోయేట్టుగా సుందరీకరణ చేస్తూ మంచి పార్కులు రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ►ఇదే విజయవాడలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వంలో రూ.400 కోట్లు పైచిలుకు ఖర్చు పెట్టి అంబేద్కర్ పార్కును కూడా మీ అందరి కళ్ల ఎదుటే ఫౌండేషన్ స్టోన్ వేయడం, ప్రారంభించడం కూడా చూశారు ►ఇంతకు ముందు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు పోవాలంటే ఒక్క ఫ్లై ఓవర్ కూడా పూర్తి కాని పరిస్థితి నుంచి ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్‌లో ఉన్న ఫ్లై ఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో రెండు ఫ్లై ఓవర్లు అదే రోడ్డులో కనిపిస్తాయి ►కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా కలుపుకొంటే ఇంకో ఫ్లై ఓవర్ ►ఇవన్నీ కూడా మన కళ్ల ఎదుటే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తాయి ►ఔటర్ రింగు రోడ్లు, కాజ నుంచి చిన్న ఔట్లపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా విజయవాడ నుంచి పోవాల్సిన అవసరం లేకుండా అటు నుంచి అటే ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా అయిపోవచ్చింది. రెండు నెలల్లో ఓపెన్ చేసే విధంగా పనులు జరుగుతున్నాయి ►ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నా ►ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇదీ అంటూ ప్రతి ఇంటికీ మంచి చేస్తూ అడుగులు వేయిస్తున్నాం ►అటువైపున మన వ్యతిరేకులంతా ఏమీ చేయరుగానీ అభివృద్ధి అభివృద్ధి అంటారు ►ఆలోచన చేయమని అడుగుతున్నా. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్లు, మీ హాస్పటళ్లు బాగుపడ్డాయి ►గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడూ జరగని విధంగా చూడని విధంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి ►వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇంటింటికీ వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం, ఏ ఒక్క రూపాయీ లంచం లేకుండా జరిగిస్తున్న పాలన కేవలం ఈ 58 నెలల పాలనలోనే అని గమనించమని కోరుతున్నా ►వీటన్నిటి వల్ల మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ కాస్త నేను రెండు మూడు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను ►ఆ తర్వాత మీ ప్రాంతాలకు వచ్చి ఎవరెవరు పట్టాలివ్వాలో శ్రీను ఒక ఏరియాలోకి, అవినాశ్ ఒక ఏరియాలోకి, ఆసిఫ్ భాయ్ తన ఏరియాలోకి వచ్చి సచివాలయ పరిధిలో పంపిణీ చేసే కార్యక్రమం వాళ్లు దగ్గరుండి చేస్తారు ►దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా ►పార్కుకు కృష్ణమ్మ జలవిహార్ అని పేరు పెడదాం.. థ్యాంక్యూ ఇదీ చదవండి: రాజకీయ ప్రత్యర్థుల ఊహకందని అడుగే ఇది -
వెలిగొండ ప్రాజెక్టుతో 4లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు
-
విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న అయోధ్య...
-
జై భీమ్..ఆకాశమంత స్ఫూర్తి..
-
నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో ర్యాలీలు
-
అంబేడ్కర్ స్మృతివనానికి మొత్తం ఖర్చు రూ.404.35 కోట్లు
-
22న సెలవు.. బ్యాంకులకూ వర్తిస్తుందా?
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఈనెల 22న (సోమవారం) అత్యంత వైభవోపేతంగా జరగబోతోంది. ఈ సందర్భంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాయి. మరోవైపున కేంద్ర ప్రభుత్వం సైతం తమ ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలకు హాఫ్ హాలీడే ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. అయితే మరి బ్యాంకుల మాటేమిటి? బ్యాంకులన్నింటికీ ఈ హాఫ్ హాలీడే వర్తిస్తుందా అన్నది ఇక్కడ తెలుసుకుందాం. ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రకారం.. అయోధ్యలోని రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు, సంబంధిత పుణ్యకార్యాల్లో పాల్గొనేందుకు వీలుగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు ఆరోజున సెలవు ఇచ్చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్నం వరకూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు సెలవు ప్రకటించింది. బ్యాంకులకు వర్తిస్తుందా? ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలే కాబట్టి ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. జనవరి 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకూ ఆయా బ్యాంకులన్నీ మూతబడి ఉంటాయి. మధ్యాహ్నం 2.30 తర్వాత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకులతోపాటు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, గ్రామీణ బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. ఇక ప్రైవేటు బ్యాంకుల విషయానికి వస్తే ఆర్బీఐ సెలవుల జాబితాలో జనవరి 22 లేదు కాబట్టి ఆరోజును పనిదినంగా పరిగణించాలి. ఈ నేపథ్యంలో ప్రైవేటు బ్యాంకుల పనివేళల్లో ఎలాంటి మార్పు ఉండదు. -
అయోద్యలో రామమందిర ప్రారంభానికి ముందు.. హైకోర్టులో పిటిషన్
చారిత్రక నగరం అయోధ్యలోని భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనవరి 22న జరిగే రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన భోలా దాస్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్యులు లేవనెత్తిన అభ్యంతరాలను తన పిటిషన్లో ప్రస్తావించారు. ప్రస్తుతం పుష్క మాసం నడుస్తుందని.. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. శ్రీరాముని ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని.. నిర్మాణంలో ఉన్న ఆలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టించడం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాక రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కోసం అధికార బీజేపీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఆరోపించారు. చదవండి: ఆయోధ్యలో మోదీ.. ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహ ప్రతిష్ఠాపన చేయనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం పాల్గొంటున్నారు. ప్రాణ ప్రతిష్ఠపై శంకరాచార్యులు అభ్యంతరం తెలిపారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది.. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు’ అని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 22న జరిగే ఈ మహా వేడుకకు దేశ విదేశాల నుంచి వేలాది మంది విశిష్ట అతిథులు హాజరు కాబోతున్నారు. బాలరాముడి ప్రతిష్టాపనకు సంబంధించిన సంప్రదాయ క్రతువులు మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట దాకా నిరంతరాయంగా కొనసాగుతాయని అయోధ్య తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. -
అయోధ్య ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక.. ప్రత్యేకతలు ఇవే..!
-
'స్కై డైవింగ్ స్టంట్'తో రామభక్తి చాటుకున్న 22 ఏళ్ల మహిళ!
అయోధ్యలో నూతన రామాలయం జనవరి 22న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అదికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు కూడా. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌కు చెందిన 22 ఏళ్ల అనామిక శర్మ అనే మహిళ అద్భుతమైన స్టంట్‌ని ప్రదర్శించింది. అయోధ్యలోని రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలోనే అనామిక బ్యాకాంక్‌లో ఈ స్కై డైవింగ్ స్టంట్తో తన రామభక్తిని ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు అనామిక శర్మ బ్యాంకాక్‌లో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో 'జైశ్రీరామ్' అనే జెండాతో ఈ స్కై డైవింగ్ స్టంట్ చేసింది. తాను తన భక్తిని ఈ స్కై డైవింగ్‌తో ముందు తీసుకువెళ్లాలనుకుంటున్నా అని అన్నారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా,జనవరి 22న జరగనున్న ఈ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సుమారు 4 వేలకు పైగా సాధువులు, పలువురు ఇతర ప్రముఖులు హాజరకానున్నారు. కాగా, అయోధ్యలో ఈ రామ మందిర ప్రతిష్టాపన వేడుకను సందర్శకులు అపూర్వమైన మరుపురాని అనుభవంగా ఉండేలా అభివృద్ధిక కార్యక్రమాలతో అందంగా తీర్చిదిత్తున్నారు సీఎం యోగి. ఈ నూతన రామాలయం రాష్ట్ర దేశవాలయంగా భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామజికి చిహ్నంగా అలారారుతుందని ఆదిత్యనాధ్లో ఉన్నారు. ఈనేపథ్యంలోనే అయోధ్యలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేశాలే అధికారులకు ఆదేశాలను కూడా జారీ చేశారు యోగి. VIDEO | 22-year-old Anamika Sharma of Prayagraj showed her devotion for Ram Temple in Ayodhya by skydiving with a ‘Jai Shri Ram’ flag from 13,000 feet in Bangkok. pic.twitter.com/Y6S8qOS9yf — Press Trust of India (@PTI_News) January 3, 2024 (చదవండి: సీతమ్మ శాపాన్ని ఉపసంహరించుకుందేమో! అందుకే ఇవాళ అయోధ్య..!) -
నంద్యాల జిల్లా: అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్ గురువారం జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు వైఎస్సార్ హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్ జోన్లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి జగన్ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. అవుకు వద్ద చేపట్టిన మూడో సొరంగం పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం గమనార్హం. ఇక కేవలం 1.275 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించే వెసులుబాటు కలగనుంది. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే. 2.60 లక్షలకు సాగునీరు.. 20 లక్షల మందికి తాగునీరు శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటిని అందించే దివంగత వైఎస్సార్ 2005లో గాలేరు–నగరి సుజల స్రవంతిని చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున 16 మీటర్ల వ్యాసంతో ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు. మట్టి పొరలు బలహీనంగా ఉన్నందున పెద్ద సొరంగం తవ్వితే కుప్పకూలే ప్రమాదం ఉందని కేంద్ర భూగర్భ శాస్త్రవేత్తలు నాడు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీంతో ఒక సొరంగం స్థానంలో 11 మీటర్ల వ్యాసంతో 5.7 కి.మీ. పొడవున, పది వేల క్యూసెక్కుల సామర్థ్యంతో రెండు చిన్న సొరంగాల తవ్వకం పనులు చేపట్టారు. వైఎస్సార్ హయాంలోనే వరద కాలువ తవ్వకంతోపాటు రెండు సొరంగాలలో చాలా వరకు పనులు పూర్తయ్యాయి. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కారు.. అవుకులో 2010 నాటికి ఎడమ వైపు సొరంగంలో 350 మీటర్లు, కుడి వైపు సొరంగంలో 180 మీటర్ల పొడవున ఫాల్ట్ జోన్లో పనులు మాత్రమే మిగిలాయి. ఫాల్ట్ జోన్లో పనులు చేయలేక టీడీపీ సర్కార్ చేతులెత్తేసింది. కుడి వైపు సొరంగంలో ఫాల్ట్ జోన్ ప్రాంతంలో తవ్వకుండా దానికి ఒక వైపు 7 మీటర్ల వ్యాసం, 5 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 394 మీటర్ల మేర ఒక లూప్‌ను 2017లో, 507 మీటర్ల పొడవున మరో లూప్‌ను 2018లో తవ్వి కుడి సొరంగంతో అనుసంధానం చేశారు. వాటి ద్వారా ఐదారు వేల క్యూసెక్కులు తరలించి చేతులు దులుపుకొన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఫాల్ట్ జోన్లో పనులు అత్యా«దునిక పద్ధతుల ద్వారా చేపట్టి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. సీమకు చంద్రబాబు ద్రోహం గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రాయలసీమ, నెల్లూరు ప్రజల చిరకాల స్వప్నం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 1996లోలోక్‌సభ ఎన్నికల గండం గట్టెక్కేందుకు గండికోట వద్ద గాలేరు–నగరికి శంకుస్థాపన చేశారు. తరువాత తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు వామికొండ వద్ద గాలేరు–నగరికి రెండో సారి శంకుస్థాపన చేశారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పనులు చేపట్టలేదు. 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్న చంద్రబాబు సీమ ప్రజలకు తీరని ద్రోహం చేసినట్లు స్పష్టమవుతోంది. విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గాలేరు–నగరిలో మిగిలిన పనులను పూర్తి చేయకుండా పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేశారు. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి మిగతా పనుల అంచనా వ్యయాన్ని పెంచి సీఎం రమేష్ నేతృత్వంలోని కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో పూర్తయిన గండికోట రిజర్వాయర్ పూర్తి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా చంద్రబాబు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా 2019 ఎన్నికలకు ముందు నాలుగైదు టీఎంసీలు నిల్వ చేసి తానే గాలేరు–నగరిని పూర్తి చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. సుభిక్షం చేసిన వైఎస్సార్ దివంగత వైఎస్సార్ కృష్ణా జలాలను రాయలసీమకు మళ్లించి సుభిక్షం చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 9 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడంతోపాటు గాలేరు–నగరిని చేపట్టారు. తెలుగుగంగ పనులను వేగవంతం చేశారు. హంద్రీ–నీవాను చేపట్టారు. గాలేరు–నగరి పనులకు రూ.4,982.69 కోట్లు ఖర్చు చేసి వరద కాలువతోపాటు గండికోట, వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్ల పనులను చాలావరకు పూర్తి చేశారు. పక్షం రోజుల్లోనే గండికోట దాహార్తి తీర్చేలా హిమాలయాలలో రహదారులు, సైనికుల అవసరాల కోసం సొరంగాల తవ్వకాలకు అనుసరిస్తున్న పాలీ యురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానాన్ని అధ్యయనం చేసిన జలవనరుల శాఖ అధికారులు ఆ నిపుణులను రాష్ట్రానికి రప్పించారు. అవుకు రెండో సొరంగంలో 165 మీటర్ల ఫాల్ట్ జోన్లో తవ్వకం పనులు చేపట్టి పాలీయురిథేన్ ఫోమ్ గ్రౌటింగ్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పూర్తైన మొదటి సొరంగం ద్వారా పది వేల క్యూసెక్కులు, తాజాగా పూర్తయిన రెండో సొరంగం ద్వారా మరో పది వేల క్యూసెక్కులు కలిపి ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులను గాలేరు–నగరి వరద కాలువ ద్వారా తరలించేలా మార్గం సుగమం చేశారు. దీంతో శ్రీశైలానికి వరద వచ్చే 15 రోజుల్లోనే గండికోట జలాశయాన్ని నింపవచ్చునని అధికారులు చెబుతున్నారు. చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు శ్రీశైలానికి వరద వచ్చే రోజుల్లోనే గాలేరు–నగరిపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపేలా వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచే పనులను సీఎం జగన్ చేపట్టారు. ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గాలేరు–నగరిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేసి సీమను సస్యశ్యామలం చేసే దిశగా చిత్తశుద్ధితో వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించడం ద్వారా గండికోటలో 2019లోనే 26.85 టీఎంసీలను నిల్వ చేయడం గమనార్హం. వరుసగా 2020, 2021, 2022లోనూ 26.85 టీఎంసీల చొప్పున గండికోటలో నిల్వ చేశారు. వామికొండ, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్లలోనూ పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. నాడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల పది టీఎంసీలకుగానూ నాలుగు టీఎంసీలను మాత్రమే టీడీపీ సర్కారు నిల్వ చేసింది. సీఎం జగన్ రూ.250 కోట్లు వెచ్చించి నిర్వాసితులకు పునరావాసం కల్పించడం ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 2019 నుంచి నాలుగేళ్లుగా పదికి పది టీఎంసీలను నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తూ వస్తున్నారు. ♦ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వెలిగోడు రిజర్వాయర్ వరకూ ఉన్న లింక్ కెనాల్, వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు తెలుగుగంగ కెనాల్‌కు లైనింగ్ చేయకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీరు ప్రవహించడం లేదు. దాంతో వెలిగోడు, బ్రహ్మంసాగర్‌కు సకాలంలో నీళ్లు చేరక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన సీఎం జగన్ రూ.500 కోట్లతో ఆ కాలువలకు లైనింగ్ చేయించారు. ఫలితంగా 2019 నుంచి ఏటా వెలిగోడు రిజర్వాయర్‌ను సకాలంలో నింపుతున్నారు. ♦ బ్రహ్మంసాగర్ మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేయకపోవడం వల్ల 17.74 టీఎంసీలకుగానూ 2018 వరకూ నాలుగు టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రూ.వంద కోట్లతో డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2020 నుంచి 17.74 టీఎంసీలను నిల్వ చేస్తూ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీటిని అందిస్తున్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని, ఇవాళ ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నాం. 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోంది. 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం, కొన్నింటి పనులు ప్రారంభిస్తాం. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ సబ్స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నాం. 12 సబ్స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం, 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం ట్రాన్స్మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్ ప్రతి గ్రామానికి ప్రతిరైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నాం. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నాం. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దీనివల్లరాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది’’ సీఎం వివరించారు. ‘‘దాదాపు రూ.3099 కోట్లతో సబ్‌స్టేషన్లకోసం ఖర్చుచేస్తున్నాం, ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించాం. మరికొన్నింటి పనులు ప్రారంభిస్తున్నాం. రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్ పవర్‌కు శ్రీకారం చుడుతున్నాం. 6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. అవేరా స్కూటర్స్ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనపు ఉద్యోగాలు వస్తాయి. 28 సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయి. హెచ్పీసీఎల్తో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం పెడుతున్నాం. సోలార్,విండ్, పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను వీరు పెడుతున్నారు. దాదాపుగా 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. కాలుష్యరహిత విద్యుత్ రాష్ట్రానికి మేలు చేస్తుంది. పలు విద్యుత్ ప్రాజెక్టులను ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ.. ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. -
బంజారా హిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన సూత్ర ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఉమేష్ మధ్యాన్, మోడల్స్ (ఫోటోలు)
-
పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
మేడమ్ చీఫ్ మినిస్టర్
డా.సూర్య రేవతి మెట్టకూరు కథానాయికగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ– ‘‘ఇది సామాజిక చిత్రంలా అనిపిస్తోంది. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘అమెరికాలో చదువుకుని, ఓ సంస్థ స్థాపించి, ఇండియాకొచ్చి ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాను. సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చెప్పాలని ఈ సినిమా ఆరంభించాను. ఇది పొలిటికల్ చిత్రం కాదు.. పబ్లిక్ మూవీ’’ అన్నారు డా.సూర్య రేవతి. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ బి.కొండకండ్ల, కెమెరా: వల్లెపు రవికుమార్. -
రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల వెల్లువ
మాదాపూర్: రాష్ట్రంలో పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందుతోందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. పర్యాటక రంగ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచదేశాలతో పోటీ పడుతోందన్నారు. రాష్ట్రంలో సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విదేశీ పర్యాటకులు దేశంలో ఎక్కువ శాతం రాష్ట్రాన్ని సందర్శిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా రిజర్వాయర్లు కడుతున్నారని వాటిని సందర్శకులు వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం విశేషంగా ఆకట్టుకుంటోందని వివరించారు. శ్రీనివాస్‌గౌడ్ మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సోమవారం వరల్డ్ టూరిజం డే–2023 వేడుకలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతీ జిల్లా కేంద్రంలో మూడు రోజులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఫుడ్ ఫెస్టివల్, చేనేత ఉత్పత్తుల స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతినిధుల కోసం తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా ప్రతి చెరువు వద్ద బోటింగ్ సదుపాయం ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో చివరిరోజు అవార్డులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ పర్యాటక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక కమిషనర్ శైలజారామయ్యర్, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎండీ మనోహర్, డైరెక్టర్ నిఖిల పాల్గొన్నారు. -
శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన సీఎం జగన్..
-
‘వైఎస్సార్ పర్యావరణ’ భవనాలు సిద్ధం
ఆటోనగర్(విజయవాడతూర్పు): ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అన్ని వసతులతో సొంత కార్యాలయాలను నిర్మించింది. ‘డాక్టర్ వైఎస్సార్ పర్యావరణ భవనాలు’ పేరిట రూ.54.43 కోట్లతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నిర్మించిన భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.22.57 కోట్లతో విజయవాడ ఏపీఐఐసీ కాలనీలో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిర్మించారు. కర్నూలులో రూ.15.93 కోట్లతో జోనల్ కార్యాలయం, తిరుపతిలో మరో రూ.15.93 కోట్లతో రీజనల్ కార్యాలయం నిర్మించారు. ఐదు అంతస్తుల్లో అత్యాధునిక రీతిలో ఈ భవనాల నిర్మాణం పూర్తిచేశారు. ఈ భవనాల్లో విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు సోలార్ సిస్టం, రక్షణ కోసం అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు అన్ని అంతస్తుల్లోనూ సెంట్రల్ ఏసీ, ఇతర అన్ని సదుపాయాలను కల్పించారు. త్వరలోనే ఈ భవనాలను ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన కేసీఆర్
-
మన వైద్య రంగం దేశానికే దిక్సూచి
కొన్ని స్టేట్మెంట్స్ ఎప్పుడూ నా మనసును తడుతుంటాయి. ఈవేళ అలా ‘నాట్ ఆల్ ఏంజిల్స్ హేవ్ వింగ్స్.. సమ్ హేవ్ స్టెతస్కోప్స్’ (దేవతలంటే రెక్కలున్న వాళ్లు మాత్రమే కాదు.. స్టెతస్కోప్స్ ఉన్న వాళ్లు కూడా) అనే కోట్ నా మనసుకు తట్టింది. అందుకే ఈ కళాశాలలో అడుగు పెట్టినప్పుడు దీనిని బోర్డుపై రాసి సంతకం పెట్టాను. కీప్ దిస్ ఇన్ మైండ్. మీరంతా మంచి డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేట్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్లర్లు అవుతారన్న నమ్మకం నాకు ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాలుగేళ్లలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, కార్యక్రమాల వల్ల మన వైద్య రంగం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రూ.8,480 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపట్టిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తొలి దశలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఐదు కళాశాలలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని స్వయంగా, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. విశాఖపట్నం నుంచి ఉదయం 10:30 గంటలకు విజయనగరం మెడికల్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. కళాశాల అంతటా కలియదిరిగి పరిశీలించిన తర్వాత విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టామని, అందులో ఇప్పటికే పూర్తి అయిన ఐదు మెడికల్ కాలేజీల్లో ఈరోజు పిల్లలు అడ్మిషన్లు తీసుకొని డాక్టర్లుగా అడుగులు వేస్తున్నారన్నారు. వైద్య విద్య అభ్యసించాక, అందరూ మంచి సేవల ద్వారా గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. మనసున్న డాక్టర్లను సమాజానికి అందించడమే లక్ష్యంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రతి జిల్లాలో టెరిషరీ కేర్... ఈ రోజు 5 మెడికల్ కాలేజీలు.. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రారంభించాం. వచ్చే ఏడాది మరో ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు చేస్తాం. మళ్లీ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా 17 మెడికల్ కాలేజీలను తీసుకు రాగలుగుతున్నాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేశాం. ప్రతి జిల్లా స్థాయిలో ఒక మెడికల్ కాలేజీ పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాం. దీనివల్ల టెరిషరీ కేర్ (స్పెషలిస్టు డాక్టర్లతో అత్యున్నత స్థాయి వైద్యం) అనేది ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలోకి మనం తీసుకు పోగలుగుతాం. ఎప్పుడైతే మెడికల్ కాలేజీ అందుబాటులో ఉంటుందో అప్పుడు అక్కడి ప్రొఫెసర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లు నిత్యం అందుబాటులో ఉంటారు. దీనివల్ల వైద్య సేవల్లో గొప్ప మార్పు ఉంటుంది. ఇలా టెరిషరీ కేర్ పెరగడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఇది ఒక ఎత్తయితే మరోవైపు వేల మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తయారు చేసే గొప్ప ఇన్స్టిట్యూషన్లను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయగలుగుతున్నాం. అదనంగా ఎంబీబీఎస్ సీట్లు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత వరకు మన రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 11 మాత్రమే ఉన్నాయి. కేవలం ఈ నాలుగేళ్ల కాలంలో దేవుడి దయతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా అధికార వికేంద్రీకరణ చేయగలిగాం. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉండే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. ఈ 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటివల్ల 2,250 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 2,185 కాగా, ఈ 17 మెడికల్ కాలేజీలు రావడంతో ఏకంగా 4,735కు పెరుగుతాయి. ఇప్పటికే ఉన్న కాలేజీల ఆధునికీకరణ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలన్నింటిలోనూ మౌలిక సదుపాయాలన్నీ అప్‌గ్రేడ్ చేయగలిగాం. ‘జీరో వేకెన్సీ’ పాలసీ తీసుకొచ్చి గతంలో పెండింగ్‌లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయతలపెట్టాం. తద్వారా దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే 609 కొత్త పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 17 కొత్త మెడికల్ కాలేజీల ద్వారా భవిష్యత్‌లో మరో 2,737 పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తోందంటే మీరంతా (వైద్య విద్యార్థులు) మంచి డాక్టర్లు కావాలి. రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడాలనేదే నా ఆశయం. యాజ్ ఏ లీడర్, విజనరీస్, దిస్ ఈజ్ అవర్ డిజైర్. అందుకే ఇదంతా మీకు వివరిస్తున్నాను. ఈ రోజు ప్రారంభమవుతున్న ఐదు మెడికల్ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు. రేపటి సంవత్సరం పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, ఆదోని ఇలాంటి బ్యాక్వర్డ్ ఏరియాల్లో కూడా మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. తద్వారా 2024–25లో మరో 750 మెడికల్ సీట్లు వస్తాయి. ఆ తర్వాత 2025–26లో గిరిజన ప్రాంతాలు, టెరిషరీ కేర్ దొరకడం కష్టంగా ఉన్న పార్వతీపురం, నర్సీపట్నం లాంటి చోట్ల మరో ఏడు మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. తద్వారా 1,050 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. నర్సింగ్ కాలేజీలూ అభివృద్ధి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 1,090 నర్సింగ్ సీట్లు ఉన్నాయి. కొత్తగా 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నాం. వీటి ద్వారా మరో 1,200 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 2,090 సీట్లు ఉంటాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఎన్ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్), ఎన్ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) మార్గదర్శకాలకు అనుగుణంగా నాడు–నేడు ద్వారా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. ఇందుకోసం దాదాపు రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నాం. జాతీయ స్థాయి కన్నా ఎంతో మెరుగు గతంలో కనివినీ చూడని విధంగా రాష్ట్రంలో ప్రతి మండలానికి కనీసం ఒక 108 వాహనం, రెండు 104 వాహనాలు ఉండేట్లుగా ఏర్పాట్లు చేశాం. 1,514 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లతో కలిపితే మొత్తం 2,204 అంబులెన్స్ వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఇలా ఏ రాష్ట్రంలోనూ తిరగడం లేదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో ఒక్క వైద్య, ఆరోగ్య విభాగంలోనే 53,126 మందిని రిక్రూట్ చేశాం. జాతీయ సగటును గమనిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల ఖాళీలు 61 శాతం ఉన్నాయి. మన రాష్ట్రంలో అది 3.96 శాతం మాత్రమే. ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి, నో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి అసలు ఎక్కడా ఖాళీలు ఏర్పడక ముందే భర్తీ చేయాలని వెంట పడుతున్నాం. జాతీయ స్థాయిలో సగటున ప్రభుత్వాస్పత్రుల్లో నర్సు పోస్టుల ఖాళీలు 27 శాతం ఉంది. మన రాష్ట్రంలో జీరో (సున్నా శాతం). జాతీయ స్థాయిలో సగటున ప్రభుత్వాస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీలు 33 శాతం. మన రాష్ట్రంలో జీరో. పేదవాళ్లకు ఉపయోగపడాలి వైద్య ఆరోగ్య రంగంలో మంచి డాక్టర్లు రావాలి. మంచి పీజీ స్టూడెంట్లు రావాలి. మీలో (వైద్య విద్యార్థుల్లో) మంచి మనసు రావాలి. మీరంతా పేదవాళ్లకు ఉపయోగపడే పరిస్థితి రావాలనేదే నా ఆశయం. ఇప్పటి వరకు బటన్ నొక్కితే డీబీటీ పద్ధతిలో 2.35 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేద ప్రజల ఖాతాల్లోకి వేయగలిగాం. ఎలాంటి లంచాలకు, ఎక్కడా వివక్షకు చోటు లేకుండా చేయగలిగాం. ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేలా వ్యవస్థను గడప వరకు తీసుకుపోగలిగాం. రేషన్ కార్డు, రేషన్ బియ్యాన్ని ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగాం. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి, ఇంటి స్థలం లేని వారెవరైనా ఉన్నారా అని వెతికి, అప్లికేషన్ పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఎవరికి ఏ రకమైన సర్టిఫికెట్ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి అడిగి మరీ సమకూరుస్తున్నాం. ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమంలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశాం. గతానికి ఇప్పటికీ ఎంతో తేడా గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు తీసుకుంటే నయం కాదని చాలా మంది అనుకుంటారు. కానీ ఈరోజు అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్), జీఎంపీ (గుడ్ మాన్యుఫాక్టరింగ్ ప్రాక్టీసెస్) నిర్దేశించిన మందులు మాత్రమే ఉంచాం. ఆరోగ్యశ్రీ సేవలు మనం రాకముందు నామమాత్రంగా ఉండేవి. గతంలో 1050 ప్రొసీజర్లు ఉంటే ఈరోజు 3,255 ప్రాసీజర్లకు విస్తరించాం. అన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాంక్లియర్ ఇంప్లాంట్ వరకు ఆరోగ్య శ్రీలో కవర్ అవుతున్నాయి. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలనే తపన, తాపత్రయంతో విస్తరిస్తున్నాం. గతంలో ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్ హాస్పిటళ్లు 900 ఉంటే ఈరోజు 2,285కు విస్తరించాయి. గతంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్ రూ.1,100 కోట్లు కూడా సరిగా లేదు. ఈ రోజు ఆ బడ్జెట్ దాదాపు రూ.3,600 కోట్ల వరకూ ఉంది. ప్రివెంటివ్ కేర్ అవసరం నాలుగేళ్ల మన పాలనలో ప్రణాళికా బద్ధంగా గ్రామ స్థాయి నుంచి మార్పులు తీసుకొస్తున్నాం. ఒకపక్క క్యూరేటివ్ కేర్, టెరిషరీ కేర్‌పై దృష్టి పెట్టాం. క్యూరేటివ్ కేర్ ఎంత అవసరమో ప్రివెంటివ్ కేర్ (ప్రమాదకరమైన వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తీవ్ర స్థాయికి చేరకముందే కనుక్కొని నిరోధించడం) కూడా అంతే అవసరం. ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్ క్లినిక్స్ ఏర్పాటయ్యాయి. వాటిలో సీహెచ్ఓ, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ఉంటారు. అక్కడ 105 రకాల మందులు ఇస్తారు. 14 రకాల డయోగ్నోస్టిక్ టెస్టులు చేస్తారు. మరో 542 అర్బన్ క్లినిక్‌లు తీసుకొచ్చాం. విలేజ్ క్లినిక్‌లను ప్రివెంటివ్ కేర్ దిశగా అడుగులు వేయిస్తున్నాం. ప్రతి మండలానికి కనీసం 2 పీహెచ్‌సీలు ఉండేట్లుగా చేస్తున్నాం. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు చొప్పున ఉంటారు. ఒక 104 వాహనం ఉంటుంది. ఒక డాక్టరు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటే, మరో డాక్టరు ఈ అంబులెన్స్‌లో షెడ్యూల్ ప్రకారం కేటాయించిన గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఇలా ప్రతి నెలా ఆ గ్రామానికి కనీసం రెండుసార్లు వెళ్లేట్లు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఆర్నెల్ల వ్యవధిలోనే ఆ గ్రామంలో ఎవరికి ఏ రోగం ఉంది.. ఎవరికి బీపీ, షుగర్ వంటి సమస్యలున్నాయనేది పూర్తిగా చెప్పగలిగేలా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాం. జగనన్న ఆరోగ్య సురక్ష మరో మంచి కార్యక్రమం ఈ రోజు మరో మంచి కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించాం. ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా సరే 7 రకాల టెస్టులు చేస్తారు. 5 దశల్లో యాక్టివిటీ మొదలు పెట్టాం. నాలుగో దశలో హెల్త్ క్యాంపులు ఉంటాయి. సెప్టెంబర్ 30న మొదటి హెల్త్ క్యాంపు నిర్వహిస్తారు. తర్వాత 45 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపులు పూర్తవుతాయి. గ్రామం మొత్తం మ్యాపింగ్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఏ రకమైన సమస్య ఉన్నా, వారికి ఉచితంగా టెస్టులు చేస్తాం. ఉచితంగా మందులు ఇవ్వబోతున్నాం. తర్వాత హ్యాండ్ హోల్డింగ్ చేయబోతున్నాం. అది చాలా కీలకమైంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇందుకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నా." అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు విడదల రజని, బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, కళావతి, పుష్ప శ్రీవాణి, జోగారావు, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, విక్రాంత్, రఘురాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, డీసీఎంఎస్ చైర్పర్సన్ భావన, ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యాధిగ్రస్తులకు పెద్దమనసుతో సాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హెలిప్యాడ్ వద్ద అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురు బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పూసపాటిరేగ గ్రామానికి చెందిన టొంపల లేఖన, బోన్‌మ్యారో మార్పిడి కోసం ఎదురు చూస్తున్న గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన దూరి భానుప్రసాద్, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరసాం గ్రామానికి చెందిన పోలియో వ్యాధిగ్రస్తుడు పిల్లా శంకరరావు, అనుకోని ప్రమాదంతో వీల్‌చైర్‌కే పరిమితమైన జి.సిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి గణే‹Ùలు తమ అనారోగ్య సమస్యలు చెప్పుకున్నారు. వీరందరి సమస్యలను ఓపికగా విన్న సీఎం వారి భుజం తట్టి ఓదార్చారు. తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున అందించాలని, మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిమిషాల వ్యవధిలో కలెక్టర్ నాగలక్ష్మి వారికి చెక్కులు అందజేశారు. ఇది కూడా చదవండి: థాంక్యూ జగనన్న.. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం -
తెలంగాణలో ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభం
-
15న ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.8,500 కోట్లతో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తలపెట్టారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తొలి విడతలో నిర్మాణం పూర్తయిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తారని ఆమె తెలిపారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి సీఎం జగన్ వస్తారని, ఇక్కడి నుంచే రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని వివరించారు. వచ్చే సంవత్సరం మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత సంవత్సరానికి మిగతా ఏడు కాలేజీలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం పర్యటనకు ఏర్పాట్లను ఆమె శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి రజిని తెలిపారు. -
ప్రపంచ ఆర్థిక ప్రగతిలో ఐదో స్థానానికి భారత్
దొండపర్తి (విశాఖ దక్షిణ):ప్రపంచ ఆర్థిక ప్రగతిలో భారతదేశం ఐదో స్థానానికి చేరుకుందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ పేర్కొన్నారు. ఈ ఘనతను సాధించడంలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. విశాఖ పోర్టులో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా రూ.96 కోట్లతో నిర్మించిన క్రూయిజ్ టెర్మినల్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి సోమవారం ప్రారంభించారు పోర్టులో రూ.237 కోట్లతో పూర్తి చేసిన ట్రక్ పార్కింగ్ టెర్మినల్, కవర్డ్ స్టోరేజ్ షెడ్లతోపాటు ఓఆర్ బెర్తుల ఆధునికీకరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ 2015లో ప్రారంభించిన సాగరమాల కార్యక్రమం ద్వారా రూ.5.60 లక్షల పెట్టుబడులతో పోర్టుల ఆధునికీకరణను చేపట్టినట్టు వెల్లడించారు. ఫలితంగా ఆధునిక మౌలిక సదుపాయాలతో భారతీయ ఓడరేవులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారుతున్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. విశాఖను క్రూయిజ్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ క్రూయిజ్ టెర్మినల్‌లో ఒకేసారి 2 వేల మంది ప్రయాణికులకు సేవలందించే అవకాశం ఉందన్నారు. కేంద్ర షిప్పింగ్, టూరిజం శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ వై.నాయక్ మాట్లాడుతూ విశాఖ క్రూయిజ్ టెర్మినల్‌ను దేశంలోనే ప్రముఖ క్రూయిజ్ టూరిజం డెస్టినేషన్‌గా తీరిదిద్దాలన్ని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ పరిశ్రమ వివిధ రంగాల్లో ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్ విశాఖకు మైలురాయి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. విశాఖ చరిత్రలో క్రూయిజ్ టెర్మినల్ ఒక మైలురాయిగా మిగిలిపోతుందన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖలో పర్యాటకాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో పోర్టులు కీలక భూమిక పోషిస్తున్నాయని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొత్త పోర్టులు, హార్బర్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎల్ నరసింహారావు, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ ఎం.అంగముత్తు, డిప్యూటీ చైర్మన్ దుబే, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గణబాబు పాల్గొన్నారు. -
జమ్మూలో టీటీడీ దేవాలయం ప్రారంభోత్సవం
జమ్మూలో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం గురువారం ఉదయం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి, టీటీడీ నార్త్ ఎల్ ఏసీ చైర్ పర్సన్ ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు టీటీడీ నిర్మిస్తోంది. జమ్మూలో ఈ రోజు 12 గంటల నుంచి భక్తులకు ఉచిత దర్శనం ప్రారంభమవుతుంది. చదవండి: జెండా ఊపి ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్ -
తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్‌ను ప్రారంభించిన కేటీఆర్
-
వైద్య ఆరోగ్యశాఖలో ఇది ఒక చరిత్ర: మంత్రి విడదల రజని
-
దేశ మనోభావాలను కించపర్చారు
అజ్మీర్: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశ మనోభావాలను కాంగ్రెస్ కించపర్చిందని, 60,000 మంది కార్మికుల కఠోర శ్రమను అగౌరవపర్చిందని ధ్వజమెత్తారు. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో బుధవారం ఓ ర్యాలీలో మోదీ ప్రసంగించారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తొమ్మిదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. మూడు రోజుల క్రితం పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభించుకున్నామని, ప్రజలంతా గర్విస్తున్నారని, దేశ ప్రతిష్ట మరింత పెరగడంతో వారంతా సంతోషిస్తున్నారని మోదీ తెలిపారు. అన్నింటిలోనూ బురదజల్లే రాజకీయాలు చేసే కాంగ్రెస్, ఇతర పార్టీలు పార్లమెంట్ కొత్త భవనం విషయంలోనూ అదే పని చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ కొత్త భవవాన్ని ప్రారంభించుకొనే అవకాశం కొన్ని తరాలకు ఒకసారి మాత్రమే వస్తుందని, కాంగ్రెస్ దాన్ని ‘స్వార్థపూరిత నిరసన’ కోసం వాడుకుందని ఆరోపించారు. మన దేశం సాధిస్తున్న ప్రగతిని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. వారి అవినీతిని, కుటుంబ వారసత్వ రాజకీయాలను తాము ప్రశ్నిస్తున్నామని, అందుకే తమపై కోపంగా ఉన్నారని పరోక్షంగా సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వారి ఆరాచకాలను ఒక ‘నిరుపేద బిడ్డ’ సాగనివ్వడం లేదని, అది వారు తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి వ్యవస్థ ‘‘పేదరికాన్ని సమూలంగా నిర్మూలిస్తామని 55 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, పేదలను దగా చేసింది. పేదలను తప్పుదోవ పట్టించడం, వారిని ఎప్పటికీ పేదలుగానే ఉంచడం కాంగ్రెస్ విధానం. కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్ ప్రజలు ఎంతగానో నష్టపోయారు. తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజాసేవకు, సుపరిపాలనకు, నిరుపేదల సంక్షేమానికి అంకితం చేస్తున్నాం. 2014కు ముందు దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చేవారు. నగరాల్లో ఉగ్రవాద దాడులు జరిగేవి. అప్పట్లో రిమోట్ కంట్రోల్‌తో పాలన సాగేది. కాంగ్రెస్ పాలనలో ప్రజల రక్తాన్ని పీల్చే అవినీతి వ్యవస్థను అభివృద్ధి చేశారు. దేశ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ గురించి మాట్లాడుకుంటోంది. దేశంలో పేదరికం అంతమవుతోందని నిపుణులు చెబుతున్నారు. మన దేశం సాధించిన ప్రతి విజయం వెనుక ప్రజల చెమట చుక్కలు ఉన్నాయి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతీయులు ప్రదర్శిస్తున్న అంకితభావం ప్రశంసనీయం. కొందరు వ్యక్తులకు మాత్రం ఇది అర్థం కావడం లేదు’’ అని ప్రధాని మోదీ తప్పుపట్టారు. అజ్మీర్‌లో సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ -
CM Cup : అట్టహాసంగా సీఎం కప్ ఆరంభ వేడుకలు (ఫొటోలు)
-
అరుదైన ఘట్టం!..జీవిత కాలంలో చూస్తానని ఊహించలేదు: దేవెగౌడ
న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ(91) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవిత కాలంలో ఈ కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకను చూస్తానని గానీ అందులోకి అడుగుపెట్టి కూర్చొంటానని గానీ ఊహించ లేదన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమని, దాన్ని చూడటం తన అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు. తాను 1962లో కర్ణాట శాసనసభలో అడుగుపెట్టానని, 1961 నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాని చెప్పారు. 32 ఏళ్ల క్రితం ఈ గొప్ప ప్రజల సభలోకి అగడుపెట్టానన్నారు. ఐతే తాను ప్రధానిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని, ప్రజా జీవితంలో ఇంతకాలం కొనసాగుతానని కూడా ఊహించలేదన్నారు. అన్నింటికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.. కొత్త పార్లమెంట్‌లోకి అడుగుపెట్టడం, కూర్చొవడమే అన్నారు. 91 ఏళ్ల వయసులో ఇలా చేస్తానని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. పాత పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పుడూ భారతదేశం ఇంకా వలసపాలనలోనే ఉందని, పూర్తి స్వేచ్ఛ రాలేదని పేర్కొన్నారు. నాటి జాతిపిత, ప్రముఖ జాతీయ వ్యక్తులను స్మరించుకుంటూ..మన దేశ పార్లమెంట్‌పై రక్తంతో తడిసిన కళంకం లేదన్నారు. తాము శాంతియుతంగా, అహింసా మార్గాల ద్వారా దేశానికి బానిస విముక్తి కలిగించి స్వతంత్యాన్ని సమపార్జించామని చెప్పారు. ఇది అత్యంత అమూల్యమైన విజయం అని, విలువలతో కూడిన వ్యవస్థను కాపాడు కోవడమే గాక మన భావితరాలకు అందించాలన్నారు. "అలాగే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పార్లమెంట్ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అది పలువురు నాయకుల అహంకారం, వినయం, గెలుపోటములు చూసింది. మొత్తంగా అది సమతుల్యతను కాపాడుకుంటూ.. భారతదేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రయత్నించింది. ఈ పార్లమెంట్ అన్ని కులాలు, జాతులు, మతాలు, భాషలు తోసహ అన్ని భౌగోళికాలను పోషించింది. ఇది అన్ని రకాల అభిప్రాయాలు, ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంది. ఇలా భారతదేశ వైవిధ్యాన్ని కాపాడే ప్రజాస్వామ్యానికి కొత్త ఇల్లు. ఈ కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా. మన సుసంపన్నమైన ప్రజాస్వామ్య సంప్రదాయం కొనసాగాలని, కాలం గడిచే కొద్ది అభివృద్ధి చెందుతూ ప్రకాశవంతంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా" అని అన్నారు దేవెగౌడ. (చదవండి: 'సెంగోల్' ఒరిగిపోయింది!: స్టాలిన్) -
తొలిరోజే 'సెంగోల్' ఒరిగిపోయింది!: స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్ ప్రారంభోత్సవం తొలిరోజే ప్రతిష్టించిన చారిత్రాత్మక సెంగోల్ ఒరిగిపోయిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మక సెంగోల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి చేశారు. సరిగ్గా ప్రారంభోత్సవం రోజే ధర్మానికి ప్రతీక, మన చారిత్రక సంప్రదాయం అపహాస్యం పాలైందంటూ విమర్శలు కురిపించారు స్టాలిన్. భారత రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు భారత రెజ్లర్లు పార్లమెంట్ కొత్త భవనం వెలుపల నిరసన చేసేందుకు యత్నించడంతో ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు సీఎం బీజేపీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ గత కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్నా ఇంతవరకు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పైగా శాంతియుతంగా పార్లమెంట్ వెలుపల నిరసన చేసేందుకు వచ్చిన రెజ్లర్లను ఈడ్చుకెళ్తూ..వారిని అదుపులోకి తీసుకెళ్లడం అనేది తీవ్రంగా ఖండించదగినదన్నారు. న్యాయం చేయలేక ధర్మానికి ప్రతీక అయిన సెంగోల్ తొలిరోజే వంగినట్లు కనిపించింది అని మండిపడ్డారు. రాష్ట్రపతిని పక్కకు తప్పించి, ప్రతిపక్షాల బహిష్కరణల మధ్య కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున ఇలాంటి దారుణం జరగడం న్యాయమేనా? అని డీఎంకే నేత స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. (చదవండి: శుభోదయం.. నవోదయం) -
నేడే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం
న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభివర్ణించిన పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని ఆదివారం ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం తెల్లవారుజాము నుంచే యాగం, పూజలు, ప్రార్థనలతో ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనున్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖు లు హాజరవుతారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఆహ్వానించనందుకు నిరసనగా పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని తాము బహిష్కరిస్తున్నట్లు 20 విపక్ష పార్టీలు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా, 25 పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్య దేవాలయాన్ని నిర్మించుకోవడానికి దేశ ప్రజలంతా ఒక్కటై, చేతులు కలపిన తీరు అసలు సిసలైన ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో లుటెన్స్ ఢిల్లీ ప్రాంతంలో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఏరియాలను పోలీసుల తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రత్యేకంగా పికెట్లు ఏర్పాటు చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో కొత్త భవనం వద్ద ధర్నా చేస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించగా, అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. అధీనం మఠం పెద్దలతో మోదీ భేటీ ప్రధాని మోదీ శనివారం తన నివాసంలో అధీనం మఠం పెద్దలతో సమావేశమయ్యారు. వారు ఆయనకు ఆశీస్సులు అందించారు. సెంగోల్తోపాటు కొన్ని బహుమతులు అందజేశారు. అనంతరం మోదీ వారిని సత్కరించారు. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి అధీనం మఠం పెద్దలు, ప్రతినిధులు తమిళనాడు నుంచి శనివారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రతి శకంలో భారత జాతీయవాదానికి తమిళనాడు కేంద్రంగా నిలిచిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు ప్రజల భాగస్వామ్యానికి తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సెంగోల్‌కు గౌరవం దక్కాల్సి ఉండగా, దాన్నొక ‘వాకింగ్ స్టిక్’గా ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్లో మూలన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం దాన్ని ఆనంద్ భవన్ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. దేశ మహోన్నత సంప్రదాయానికి ప్రతీక అయిన సెంగోల్‌ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టిస్తుండడం సంతోషకరమని ప్రధాని మోదీ చెప్పారు. హాజరయ్యే పార్టీలు, ఉభయ సభల్లో వాటి ఎంపీల సంఖ్య ఎన్డీయే పార్టీలు 1. బీజేపీ (394) 2. శివసేన (15) 3. నేషనలిస్టు పీపుల్స్ పార్టీ – మేఘాలయా(2) 4. నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ(1) 5. సిక్కిం క్రాంతికారీ మోర్చా(1) 6. జననాయక్ జనతా పార్టీ 7. ఏఐఏడీఎంకే(5) 8. ఐఎంకేఎంకే 9. ఏజేఎస్‌యూ(1) 10. ఆర్పీఐ–అథవాలే(1) 11. మిజో నేషనల్ ఫ్రంట్(2) 12. తమిళ మానిల కాంగ్రెస్(1) 13. ఐటీఎఫ్‌టీ–త్రిపుర 14. బోడో పీపుల్స్ పార్టీ 15. పీఎంకే(1) 16. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ 17. ఆప్నా దళ్(2) 18. అస్సాం గణపరిషత్ (1) నాన్–ఎన్డీయే పార్టీలు 1. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (31) 2. తెలుగుదేశం పార్టీ(4) 3. లోక్ జనశక్తి పార్టీ– రామ్ విలాస్ పాశ్వాన్(1) 4. బిజూ జనతాదళ్(21) 5. బీఎస్పీ(10) గైర్హాజరయ్యే పార్టీలు 1. కాంగ్రెస్ (81) 2. డీఎంకే (34) 3. శివసేన–యూబీటీ(7) 4. ఆమ్ ఆద్మీ పార్టీ (11) 5. సమాజ్‌వాదీ పార్టీ (6) 6. సీపీఐ (4) 7. జేఎంఎం (2) 8. కేరళ కాంగ్రెస్–మణి(2) 9. విడుదలై చిరుతైగళ్ కట్చీ(1) 10. రాష్ట్రీయ లోక్‌దళ్ (1) 11. తృణమూల్ కాంగ్రెస్ (35) 12. జేడీ–యూ (21) 13. ఎన్సీపీ (9) 14. సీపీఎం (8) 15. ఆర్జేడీ (6) 16. ఐయూఎంఎల్ (4) 17. నేషనల్ కాన్ఫరెన్స్ (3) 18. ఆర్ఎస్పీ (1) 19. ఎండీఎంకే (1) 20. ఎంఐఎం (2) -
పార్లమెంటు భవన ప్రారంభోత్సవ బహిష్కరణ నిర్ణయం...
న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న విపక్షాల నిర్ణయాన్ని ప్రముఖులు ఖండించారు. కుటుంబ పార్టీల నిర్వాకం ఇలాగే ఉంటుందని విమర్శించారు. ఈ మేరకు 270 మంది ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. వీరిలో మాజీ ఉన్నతాధికారులు, రాయబారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. పార్లమెంట్ కొత్త భవనాన్ని ప్రారంభించుకోవడం దేశ ప్రజలు గర్వపడాల్సిన సందర్భమని వివరించారు. ప్రతిపక్షాలు అపరిపక్వ, డొల్ల వాదనలతో బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం సరికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రధాని ప్రారంభిస్తే తప్పుపట్టడానికి ఏముందని ప్రశ్నించారు. ‘ఇండియా ఫస్ట్’ నినాదంతో కేంద్రం ముందుకు సాగుతోందని, కొన్ని పార్టీలు ‘ఫ్యామిలీ ఫస్ట్’ అంటున్నాయని ఎద్దేవా చేశారు. -
త్వరలో విడుదల కానున్న రూ. 75 కాయిన్ - ప్రత్యేకతేంటంటే?
Rs 75 Special Coin: నూతన పార్లమెంట్ భవనం త్వరలో ప్రారంభం కానున్న విషయం అందరికి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 75 కాయిన్ విడుదల చేయడానికి సంకల్పించింది. త్వరలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న రూ. 75 కాయిన్ ప్రత్యేకతలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రూ. 75 నాణెం సాధారణ కాయిన్స్ మాదిరిగా కాకుండా.. భిన్నంగా ఉంటుంది. ఈ నాణెం బరువు 35 గ్రాములు వరకు ఉంటుంది. దీనిని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలయికతో తయారు చేయనున్నారు. వ్యాసం 44 మిల్లీ మీటర్స్ వరకు ఉంటుంది. ప్రత్యేకతలు 75 రూపాయల నాణెం చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. ఇందులో ఆశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం, దాని కింద 'సత్యమేవ జయతే' అనే వాక్యం ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అనే పదం, కుడివైపున ఇంగ్లిష్‌లో ఇండియా అనే పదం ఉంటుంది. దీనికి మధ్య భాగంలో దాని విలువను తెలియజేయడానికి 75 అనే సంఖ్య, కాయిన్ ఎగువ అంచుపై 'సంసద్ సంకుల్' అని దేవనగరి స్క్రిప్ట్‌లో, దిగువ అంచున 'పార్లమెంట్ కాంప్లెక్స్' ఉండనున్నాయి. ప్రస్తుతం 1, 2,5,10 రూపాయల నాణేలు అందుబాటులో ఉన్నాయి. అయితే 10 నాణెం వాడకం బాగా తగ్గింది. ఇక త్వరలో కాయిన్స్ జాబితాలోకి రూ. 75 నాణెం కూడా చేరనుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 100 నాణెం కూడా గతంలోనే వెల్లడించారు. ఇది మన్‌కీ బాత్ 100 ఏపీసోడ్ సందర్భంగా విడుదల చేశారు. అయితే ఇది సాధారణ కాయిన్ మాదిరిగా వాడుకునే అవకాశం లేదు. ఇప్పుడు త్వరలో విడుదలకానున్న రూ. 75 కాయిన్ కూడా సాధారణ ప్రజలు వాడుకోవడానికి అందుబాటులో వస్తుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
పార్లమెంటు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: ముందుగా హోమం, తర్వాత సర్వమత ప్రార్థనలతో ఆదివారం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం మొదలుకానుంది. ప్రధాన కార్యక్రమంలో 18 ఎన్డీఏ పక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు దాదాపు 25 పక్షాలు పాలుపంచుకోనున్నాయి. బిజూ జనతాదళ్, జేడీ(ఎస్), అకాలీదళ్, బీఎస్పీ, లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్), టీడీపీ వీటిలో ఉన్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో దాదాపు 21 పార్టీలు కార్యక్రమాన్ని బహిష్కరించిన వేళ లోక్‌సభలో 50 మంది ఎంపీల బలమున్న ఈ ఏడు పార్టీల సంఘీభావం పాలక బీజేపీకి నైతిక స్థైర్యమిస్తుందని భావిస్తున్నారు. ప్రారంభోత్సవాన్ని పూర్తిగా అధికార పార్టీ కార్యక్రమంగా మార్చేస్తున్నారన్న విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు కూడా ఇది ఉపకరిస్తుందని బీజేపీ భావిస్తోంది. పాల్గొంటున్న బీఎస్పీ, టీడీపీ పార్లమెంటు భవనాన్ని మోదీ ప్రారంభించనుండటాన్ని స్వాగతిస్తున్నట్టు బీఎస్పీ అధినేత మాయావతి ప్రకటించారు. విపక్షాల బహిష్కరణ నిర్ణయం సరికాదన్నారు. ఆదివాసీ గౌరవం గురించి మాట్లాడుతున్న విపక్షాలకు రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపదీ ముర్ముపై పోటీ పెట్టినప్పుడు ఆ విషయం గుర్తుకు రాలేదా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ కూడా కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ప్రకటించింది. చరిత్రాత్మక సందర్భాన్ని రాజకీయం చేయకుండా హాజరై పెద్ద మనసు చూపాలని విపక్షాలకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. ప్రధాని కూడా పార్లమెంటులో భాగమేనని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేశారు. ‘‘రాష్ట్రపతి అంటే మనందరికీ గౌరవమే. ద్రౌపదీ ముర్ము గురించి కాంగ్రెస్ నేతలు ఎలా మాట్లాడారో గుర్తు చేసి ఆ పదవిని వివాదాల్లోకి లాగదలచుకోలేదు’’ అన్నారు. కార్యక్రమం ఇలా... ► పార్లమెంటు నూతన భవన ప్రాంగణంలో ఆదివారం ఉదయం ఏడింటికి హోమం జరుగుతుంది. తర్వాత సర్వమత ప్రార్థనలుంటాయి. ► అనంతరం హోమ వేదిక వద్దే తమిళనాడు తంజావూరు శైవ మఠ పెద్దలు చోళుల రాజదండమైన సెంగోల్‌ను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేస్తారు. ► అనంతరం లోక్‌సభ చాంబర్‌ను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారు. ► మధ్యాహ్నం ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, మాజీ ప్రధాని దేవెగౌడ తదితరులు పాల్గొంటారు. ► మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్, కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో పాటు విపక్ష పార్టీల నేతలందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. -
ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే వారిదే
న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియా పర్యటనలో తెలిసిందంటూ విపక్షాల్ని విమర్శించారు. ఆరు రోజుల విదేశీ పర్యటన ముగించుకొని గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రధాని మోదీ ఢిల్లీలోని పాలం విమానాశ్రయం వెలుపల తనకు స్వాగతం పలికిన బీజేపీ కార్యకర్తలు, అభిమానులనుద్దేశించి మాట్లాడారు. సిడ్నీలో భారత సంతతికి చెందిన సదస్సులో పాల్గొన్నప్పుడు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసెతో పాటుగా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు, మాజీ ప్రధాని కూడా హాజరయ్యారన్నారు. ‘‘భారతీయులకు చెందిన ఒక కార్యక్రమానికి ప్రతీ ఒక్కరూ హాజరై తమ దేశానికి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని, బలాన్ని అలా చాటారు’’ అని మోదీ కొనియాడారు. పార్లమెంటు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించే విపక్ష పార్టీలపై ఆయన నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆస్ట్రేలియాలో భారతీయ ప్రతినిధులందరికీ అరుదైన గౌరవం దక్కిందంటే అది మోదీకున్న కీర్తిప్రతిష్టల వల్ల కాదని, భారత్‌కున్న పటిష్టమైన బలం వల్లనేనని ప్రధాని స్పష్టం చేశారు. భారత్ చెప్పేది విదేశాలన్నీ వింటున్నాయని, మెజార్టీ ప్రభుత్వం ఉండడమే దానికి కారణమని చెప్పారు. తాను వినిపించేది 140 కోట్ల భారతీయుల గళమేనని ప్రపంచ నాయకులందరికీ బాగా తెలుసునన్నారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నామన్నారు. అయితే సవాళ్లనే సవాల్ చేయడం తన స్వభావమని చెప్పుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో కోవిడ్ టీకాలు విదేశాలకు ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు అప్పట్లో నిలదీశాయని, కానీ ఎందరో ప్రాణాలు నిలిపినందుకు వారంతా భారత్‌కు కృతజ్ఞతగా ఉన్నారని అన్నారు. బుద్ధుడు, గాంధీ నడయాడిన నేలపై శత్రువులపైన కూడా కరుణ చూపిస్తామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. వారసత్వ రాజకీయాలు అభివృద్ధి నిరోధం డెహ్రాడూన్: దేశాన్ని ఏళ్ల తరబడి పరిపాలించి హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని గొప్పలు చెప్పుకునే పార్టీలు వారసత్వ రాజకీయాల నుంచి బయటపడలేకపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. ఇలాంటి వారసత్వ రాజకీయాలే అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్నాయని అన్నారు. ఉత్తరాఖండ్‌లో మొట్టమొదటి వందేభారత్ రైలుని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ డెహ్రాడూన్–ఢిల్లీ రైలు ప్రారంభోత్సవంలో కాంగ్రెస్‌పై పలు విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్ రైల్వేలో మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌ను పెంచామన్నారు. 2014కి ముందు రూ.200 కోట్ల కంటే తక్కువ ఉంటే, ప్రస్తుతం రూ.5 వేల కోట్లు ఉందన్నారు. రైల్వే శాఖలో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, ట్రాకుల్ని ఆధునీకరిస్తే మరింత హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టవచ్చన్నారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న పార్టీ దానిని గుర్తించకుండా అవినీతి, కుంభకోణాలతో మునిగిపోయిందని విమర్శించారు. వారసత్వ రాజకీయాల నుంచి ఆ పార్టీ బయటపడలేకపోవడంతో దేశాభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. -
అట్టహాసంగా టిడ్కో గృహ ప్రవేశాలు
పొన్నూరు(చేబ్రోలు)/నరసరావుపేట : పేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధి నిడుబ్రోలు ప్రాంతంలో బుధవారం టిడ్కో గృహ సముదాయాల ప్రారంబోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 21 ఎకరాల్లో నిర్మించిన 2,368 టిడ్కో గృహాల్లో మొదటి విడతగా 1,660 గృహాలను మంత్రి ప్రారంభించారు. అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో మొదటి దశలో భాగంగా నిర్మించిన 500 టిడ్కో గృహాలనూ మంత్రి ప్రారంభించారు. లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు, తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా నిడుబ్రోలులో జరిగిన సభకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య అధ్యక్షత వహించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ పొన్నూరులో రూ.177 కోట్లతో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయంతో ఇక్కడ సుమారు 12 నుంచి 15 వేల జనాభాతో జగనన్న టౌన్ షిప్‌గా అభివృద్ధి చెందుతోందన్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా, అర్హతే ప్రామాణికంగా నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కిలారి రోశయ్య మాట్లాడుతూ పేదలకు లక్షల విలువ చేసే సొంతింటిని అందించిన సీఎం జగన్.. పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి లబ్దిదారులు క్షీరాభిõÙకం చేశారు. టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ చిత్తూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం పల్నాడు జిల్లా నరసరావుపేట కేసానుపల్లి పంచాయతీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో టిడ్కో గృహాల మీద ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్‌కు మహిళలు పాలాభిషేకం చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో రూ.115 కోట్లతో 1,504 గృహాల నిర్మాణం చేపట్టామని.. అందులో ఈ రోజు 500 గృహ ప్రవేశాలు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.14 కోట్లతో మౌలిక వసతులు కల్పించిందన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడంతో పాటు గతంలో డిపాజిట్ చేసిన నగదులో రూ.25 వేలు తిరిగి చెల్లించనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
New Parliament Opening: రాజకీయ రగడ
కొత్త పార్లమెంట్ ప్రారంభంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పార్లమెంట్‌ను ప్రారంభించే ప్రయత్నాలు కొనసాగుతుండగా.. అదే తేదీన సావర్కర్ జయంతి కావడం, పైగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఇరుపక్షాలు నడుమ సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. వీడీ సావర్కర్ జయంతి రోజు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇది స్వాతంత్ర్య సమరయోధుల్ని పూర్తిగా అవమానించడమేనని విమర్శిస్తోంది. లేని చోట వివాదాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటైంది. రాష్ట్రపతి దేశాధినేత. కానీ, ప్రధానిప్రభుత్వాధినేత.. ప్రభుత్వం తరపున పార్లమెంటుకు నాయకత్వం వహిస్తారు. ఆ నాయకత్వంలోనే విధానాలు చట్టాల రూపంలో అమలు చేయబడతాయి. రాష్ట్రపతి ఉభయ సభలలో సభ్యులు కాదు. కానీ, ప్రధాని మాత్రం సభ్యులే కదా అని కేంద్ర హోం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. Congress has a habit of raking controversies where none exist. While President is the Head of State, PM is the Head of Govt & leads the Parliament on behalf of the Govt, whose Policies are effected in form of Laws. The President is not a Member of either House, whereas PM is. pic.twitter.com/73Ns7NP8EK — Hardeep Singh Puri (@HardeepSPuri) May 22, 2023 కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతిని, మాజీ రాష్ట్రపతిని ఆహ్వానించకుండా.. ప్రభుత్వం పదే పదే ఔచిత్యాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారాయన. గతంలో పార్లమెంట్ శంకుస్థాపనకు అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించలేదు.. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు అని ట్వీట్ ద్వారా ఖర్గే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం, ప్రతిపక్షం, ఆఖరికి దేశంలోని ప్రతీ పౌరుడికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆమె. దేశానికి ప్రథమ పౌరురాలు. It looks like the Modi Govt has ensured election of President of India from the Dalit and the Tribal communities only for electoral reasons. While Former President, Shri Kovind was not invited for the New Parliament foundation laying ceremony… 1/4 — Mallikarjun Kharge (@kharge) May 22, 2023 ఆయన (ప్రధాని మోదీ) కార్యనిర్వాహక మండలికి అధిపతి అంతేగానీ చట్టసభకు కాదు. ఆ చట్ట సభలోనూ మాకు అధికారాల విభజన ఉంది. గౌరవనీయులైన లోక్‌సభ స్పీకర్ లేదంటే రాజ్యసభ చైర్లు పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించొచ్చు. ఇది ప్రజల సొమ్ముతో కట్టింది. ప్రధాని ఏదో తన స్నేహితులు వాళ్ల ప్రైవేట్ నిధుల నుంచి స్పాన్సర్ చేసినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు. Why should PM inaugurate Parliament? He is head of the executive, not legislature. We have separation of powers & Hon’ble @loksabhaspeaker & RS Chair could have inaugurated. It’s made with public money, why is PM behaving like his “friends” have sponsored it from their private… https://t.co/XmnGfYFh6u — Asaduddin Owaisi (@asadowaisi) May 19, 2023 మోదీగారి ఫొటోలకు ఫోజులు, సెల్ఫ్ ఇమేజ్ కోసం పాకులాట.. మర్యాదను, నిబంధనలను పక్కనపడేసిందని సీబీఐ నేత డీ రాజా విమర్శించారు. 26 నవంబర్ 2023- దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బహుమతిగా ఇచ్చిన భారత రాజ్యాంగం 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని.. కొత్త భవనం ప్రారంభోత్సవానికి ఇది తగినది.. అయితే ఇది సావర్కర్ పుట్టినరోజు మే 28న జరుగుతుంది- ఇది ఎంతవరకు సముచితం?” అంటూ తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రే పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించాలని ట్వీట్ చేశారు రాహుల్. नए संसद भवन का उद्घाटन राष्ट्रपति जी को ही करना चाहिए, प्रधानमंत्री को नहीं! — Rahul Gandhi (@RahulGandhi) May 21, 2023 కాంగ్రెస్ పనికిమాలిన పార్టీ అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శించారు. వీర సావర్కర్.. ప్రతీ భారతీయుడికి గర్వకారణమైన వ్యక్తి. ఆయన కాలి దుమ్ముకు కూడా పనికి రాని వాళ్లు ఇవాళ విమర్శిస్తున్నారని ఘాటుగా మండిపడ్డారు. పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తే వస్తే నష్టం ఏంటి?. రాహుల్ గాంధీవి ఏడుపుగొట్టు రాజకీయాలు. ఏదైనా చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకోబోతున్న సమయంలోనే.. ఏదో జరిగిపోతోందన్న రేంజ్లో తన గుండెలు బాదుకుంటారు. దేశం ప్రగతి వైపు వెళ్తుంటే.. అపశకునంలా రాహుల్ అడ్డుపడుతున్నారు అని గౌరవ్ భాటియా మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ సైతం కొత్త పార్లమెంట్ భవనం ఆవశ్యకతను చెప్పారని, అలాంటి కలను నిజం చేస్తుంటే పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారాయన. ఇదిలా ఉంటే.. పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వ్యతిరేకించేలా విపక్షాలన్నీ కలిసి మెగా సమావేశం నిర్వహించాలని భావిస్తున్నాయి. -
బందరు కల సాకారం
-
ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు
-
గవర్నర్ వెర్సెస్ గవర్నమెంట్...
-
తెలంగాణ పరిపాలన కేంద్రం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది
-
నెల్లూరు కావలిలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవం
-
మరింత జోరుగా బీఆర్ఎస్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించడంతోపాటు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. ఈ నెల 14న జరిగే భారీ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మొదలుకుని.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు వరుసగా సభలు, సమావేశాల నిర్వహణకు షెడ్యూల్ సిద్ధం చేసింది. అన్ని నియోజకవర్గాల నుంచి పాల్గొనేలా.. ఈ నెల 14న హుస్సేన్‌సాగర్ తీరంలో జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా నిర్వహించా లని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అంబేద్కర్ మన వడు ప్రకాశ్ అంబేడ్కర్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున 35,700మంది పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ నెల 30న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమంలో సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థల చైర్పర్సన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు, ఇతరులు కలుపుకొని 2,500 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్లీనరీ గత రెండేళ్లుగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్లీనరీని ఈ ఏడాది ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పేరు మారిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ ఇది. ఈ క్రమంలో జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించే అవకాశం ఉంది. సుమారు 8 వేల మంది ప్రతినిధులు ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ ప్లీనరీకి హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో స్థానిక నేతలు పార్టీ జెండాలను ఆవిష్కరిస్తారు. మరిన్ని రోజులు ఆత్మీయ సమ్మేళనాలు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను మే నెలలోనూ కొనసాగించాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. ఆత్మీయ సమ్మేళనాలకు కేడర్ నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా నిర్వహించేందుకు మాజీ స్పీకర్ మధుసూదనాచారి నేతృత్వంలో పది మందితో కూడిన పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే మరో నెలన్నర పాటు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగనున్నాయి. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సచివాలయం ఎదురుగా నిర్మించిన అమరుల స్మారకాన్ని ప్రారంభించనున్నారు. -
మధురవాడ: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి నూతన కార్యాలయం ప్రారంభం
-
వెల్ స్పన్ టెక్స్టైల్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
-
వైఎస్ఆర్టీపీ పాలేరు నియోజకవర్గ కార్యాలయం ప్రారంభం
-
రక్షణ రంగంలో మేటిగా భారత్
సాక్షి, బెంగళూరు: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్ అప్రతిహత వేగంతో ముందుకు దూసుకుపోతోందని, ఈ విషయంలో ప్రపంచంలోని అగ్రదేశాల సరసన చేరబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన దేశంలో గత తొమ్మిదేళ్లలో రక్షణ ఉత్పత్తులు భారీగా పెరిగాయని ఉద్ఘాటించారు. సానుకూల ఆర్థిక విధానాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా–2023’ను ప్రధాని మోదీ సోమవారం కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్షణ పరికరాల కోసం ఒకప్పుడు దిగుమతులపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని అన్నారు. 75 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని వివరించారు. విదేశీ పరికరాలకు మన దేశాన్ని ఒక మార్కెట్‌గా పరిగణించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. శక్తివంతమైన రక్షణ భాగస్వామిగా భారత్ తన సామర్థ్యాన్ని చాటుకుంటోందని పేర్కొన్నారు. 5 బిలియన్ డాలర్ల ఎగుమతులు రక్షణ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, ఎన్నెన్నో ఘనతలు సాధించామని నరేంద్ర మోదీ తెలియజేశారు. మిలటరీ హార్డ్‌వేర్ ఉత్పత్తి విషయంలో మన దేశం పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారిందని చెప్పారు. రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను 1.5 బిలియన్ డాలర్ల నుంచి 2024–25 నాటికి 5 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకున్న ‘తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, ఐఎన్ఎస్ విక్రాంత్’లు రక్షణ ఉత్పత్తుల రంగంలో మన అసలైన ప్రతిభా పాటవాలకు చక్కటి ఉదాహరణలని వెల్లడించారు. రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ప్రైవేట్ సెక్టార్‌ను ఆహ్వానిస్తున్నామని ప్రధానమంత్రి అన్నా రు. ఏరో ఇండియా ప్రదర్శనలో వివిధ దేశాల వైమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. లైట్ కాంబాట్ హెలికాప్టర్లో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి ప్రయాణించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు జరిగే ‘ఏరో ఇండియా’లో దాదాపు 100 దేశాల రక్షణ శాఖ మంత్రులు, ప్రతినిధులు, దేశ విదేశాలకు చెందిన 800కు పైగా డిఫెన్స్ కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రక్షణ రంగంలో రూ.75,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 250 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక ఆకర్షణగా అమెరికా ఎఫ్–13ఏ ఫైటర్ జెట్లు ఏరో ఇండియా ప్రదర్శనలో అమెరికాకు చెందిన ఐదో తరం సూపర్‌సానిక్ మల్టీరోల్ ఎఫ్–35ఏ యుద్ధవిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎఫ్–35ఏ లైట్నింగ్–2, ఎఫ్–13ఏ జాయింట్ స్ట్రైక్ ఫైటర్ అమెరికాలోని ఎయిర్‌బేస్‌ల నుంచి సోమవారం బెంగళూరుకు చేరుకున్నాయి. అమెరికా వైమానిక దళానికి చెందిన ఈ అత్యాధునిక ఫైటర్ జెట్లు భారత్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా ఎఫ్–16 ఫైటింగ్ ఫాల్కన్, ఎఫ్/ఏ–18ఈ, ఎఫ్/ఏ–18ఎఫ్ యుద్ధ విమానాలు సైతం అమెరికా నుంచి వచ్చాయి. ప్రధాని మోదీతో ప్రముఖుల భేటీ ‘ఏరో ఇండియా’ను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో బెంగళూరులో పలువురు ప్రముఖులు భేటీ అయ్యారు. కన్నడ సినీ నటులు యశ్, రిషబ్ శెట్టీ, దివంగత పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్వినీ, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్, యువ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, మనీశ్ పాండేతోపాటు పలు రంగాల పెద్దలు మోదీని కలుసుకున్నారు. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో డిన్నర్ సందర్భంగా ఈ సమావేశం జరిగింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, గుర్తింపును మరింత ఇనుమడింపజేసేందుకు దక్షిణాది సినీనటులు కృషి చేయాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలిసింది. చదవండి: భారత్‌లో భూకంప భయాలు.. మూడు రోజుల్లో మూడు రాష్ట్రాల్లో ప్రకంపనలు.. -
సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక భేటీ
సాక్షి, హైదరాబాద్: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం, సభ నిర్వహణకు సంబంధించి గురువారం శాసనసభ కమిటీ హాల్లో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈనెల 12 వరకు అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో 13న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. జన సమీకరణకు సంబంధించి 13న జరిగే సమావేశాల్లో ప్రణాళిక రూపొందించుకోవా లని సూచించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన జన సమీకరణను పర్యవేక్షించేందుకు ఇతర జిల్లాలకు చెందిన సీనియ ర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గ్రేటర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించాలని నిర్ణయించారు. ఇన్చార్జిలుగా నియమితులయ్యే నేతలు ఈ నెల 13 నుంచి 17 వరకు తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారు. బహిరంగసభకు ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మందితో జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు కేటీఆర్ సూచించారు. -
సికింద్రాబాద్ - విశాఖ వందేభారత్ రైలు.. ఈనెల 15న ప్రారంభం..
హైదరాబాద్: ఈనెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణ మధ్య రైల్వే ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ విశాఖ పట్నం మధ్య నడవనుంది. ఈనెల 16 నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ముందస్తు బుకింగ్స్‌ను శనివారం నుంచి చేసుకోవచ్చు. ఈ వందే భారత్ ట్రైన్‌కు 20833 నంబర్ ఏర్పాటు చేసింది దక్షిమ మధ్య రైల్వే. ఇది ఉదయం 5.45కు విశాఖపట్నం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుండి బయల్దేరి రాత్రి 11.30కు విశాఖ చేరుకోనుంది. రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. 14 ఏసీ కోచ్‌లు గల వందే భారత్ రైలులో మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణం చేసేందుకు వెసులు బాటు ఉంది. చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి పత్రికలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధి పత్రికలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువేయడంలో వాటి పాత్ర కీలకమని మాజీ మంత్రి కృష్ణ యాదవ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రజాబలం తెలుగు దినపత్రిక 2023 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది ఈ సభకు మాజీ మంత్రి కృష్ణ యాదవ్, ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్, గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు ముఖ్య అతిథులుగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ యాదవ్ మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని, వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా నిస్సంకోచంగా వార్తలు రాసి నిజా నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, యాదగిరిగుట్ట అష్టలక్ష్మి టెంపుల్ అధ్యక్షులు అశోక్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావది లక్ష్మీనారాయణ, మైనంపల్లి హనుమంతరావు ట్రస్ట్ చైర్మన్ మోహన్ రెడ్డి, తెలంగాణ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ కేసరి వెంకటేశ్వర్లు, ఉర్దూ పేపర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇగ్బాల్ హుస్సేన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందే లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థికాభివృద్ధికి విద్య బలమైన సాధనం: గవర్నర్ హరిచందన్
సాక్షి, విజయవాడ: ఏ సమాజమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య అత్యంత బలమైన సాధనమని, విద్య, పేదరికం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెనిగండ్ల గ్రామం కౌండిన్యపురంలో సోమవారం నిర్వహించిన ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్టు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఎఎస్ అకాడమీని గవర్నర్ ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని అర్హులైన పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకారవేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ ఒక వ్యక్తి మంచి విద్యాధికునిగా మారినప్పడు గణనీయమైన ఆదాయార్జనతో పేదరికం నుండి బయటపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గత కొన్ని సంవత్సరాలలో సుమారు 4,500 మంది పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.96 లక్షల ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమన్నారు. సమాజంలో అర్హులైన బలహీన వర్గాల విద్యార్థులకు శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఔత్సాహిక విద్యార్థులకు మేలు చేకూర్చుతుందన్నారు. జాతీయ విద్యా విధానం-2020 విద్యారంగంలో పెద్ద సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. రాబోయే దశాబ్దాల్లో భారతదేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చగలదని గవర్నర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా టాటా, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణు గోపాల్ రెడ్డి, ట్రస్టు వ్యవస్ధాపకులు, మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఇ.వి. నారాయణ, వాణిజ్య పన్నుల శాఖ మాజీ అదనపు కమిషనర్ వై. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు -
కొత్త సంవత్సరం కానుక.. కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి.. సిగ్నల్ లేని ప్రయాణానికి మార్గం సుగమమం చేసేందుకు మరో ఫ్లైఓవర్ కొత్త సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్‌కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లను మునిసిపల్ ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఆదివారం ప్రారంభించారు. దీనిద్వారా ఆల్విన్‌కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసేందుకు మార్గం సుగమమైంది. ఫ్లై ఓవర్ వివరాలు.. ► రూ.263.09 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం ► ఫ్లై ఓవర్‌తోపాటు 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్‌పాస్ ► ఫ్లైఓవర్ పొడవు దాదాపు 3 కి.మీ. ► 2, 3, 4, 5 లేన్లుగా గ్రేడ్ సెపరేటర్‌గా నిర్మాణం ► ఎస్సార్డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో ఇది 18వ ఫ్లైఓవర్ ► ప్రత్యేక ఆకర్షణగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు ఉపయోగాలు.. ► గచ్చిబౌలి వైపు నుంచి ఆలి్వన్‌కాలనీ జంక్షన్ వైపు వన్‌వే ఫ్లైఓవర్‌గా ఇది అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు, మసీద్‌బండ, బొటానికల్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలు ఫ్లైఓవర్ పైకి వెళ్తాయి. మాదాపూర్ లేదా హఫీజ్‌పేట్ వైపు వెళ్లవచ్చు. హఫీజ్‌పేట్ నుంచి వచ్చే గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలు అండర్ పాస్ ద్వారా వెళ్తాయి. దీంతో శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. ► కొండాపూర్, మాదాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు చేయవచ్చు. ► కొత్తగూడ, కొండాపూర్ బొటానికల్ గార్డెన్ జంక్షన్లలో వాహనదారులకు ఊరట. ► ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం. ► మాదాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలివైపు వెళ్లే వారు ఇక సులభంగా రాకపోకలు సాగించే అవకాశం. ► గచ్చిబౌలి కూడలి నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆలి్వన్‌కాలనీ, మాదాపూర్ ప్రాంతాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ► ట్రాఫిక్ సమస్య, సమయం, వాహనాల ఇంధనం ఖర్చు తగ్గుతాయి. ఏర్పాట్ల పరిశీలన.. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, డీఈ భరద్వాజ్, ఏఈ పరమేష్, ఏఈ శివకృష్ణ, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నవీన్, బోస్, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, నర్సింహ్మసాగర్,ఖాజా, రామకృష్ణ ఆంజనేయులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. చదవండి: అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు -
రూ.13 కోట్ల వంతెన.. ప్రారంభానికి ముందే ఫసక్..
బెగుసరాయ్: రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ఏడాది పాటు నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి కూడా నోచుకోకుండానే కూలిపోయింది. 2017లోనే దీన్ని నిర్మించినప్పటికీ అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో నిరుపయోగంగా ఉంది. ఇటీవలే పగుళ్లు రావడంతో స్థానికులు అధికారులకు లేఖ రాశారు. వారు చర్యలు తీసుకునే లోపే వంతెన ఆదివారం కూలిపోయింది. బిహార్‌లో బెగుసరాయ్ జిల్లాలో బుధిగండక్ నదిపై 2017లో 206 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని నిర్మించారు. అప్రోచ్ రోడ్డు వేసేందుకు ప్రైవేటు భూమిని సేకరించలేదు. దీంతో అది ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. అప్పుడప్పుడు ట్రాక్టర్లు, భారీ వాహనాలు వంతెన మీదుగా వెళ్తున్నాయి. వంతెన 2, 3 పిల్లర్ల మధ్య భాగంలో పగుళ్లు బారి పోయింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ప్రారంభం కూడా కాకుండానే వంతెన కూలడంతో నిర్మాణ నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మిసెస్ వరల్డ్‌గా సర్గమ్ కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం.. -
బుధువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
-
శ్రీకాకుళంలో మంచు లక్ష్మి సందడి.. చూసేందుకు ఎగబడిన జనం
శ్రీకాకుళం: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లిష్ నేర్చుకోవాలని సినీ నటి మంచు లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆలయ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి డాక్టర్ మోహన్‌బాబు అరసవల్లి క్షేత్రానికి వెళ్లాలని సూచించారని, అద్భుతంగా స్వామి దర్శనం జరిగిందన్నారు. ఇక తాము ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే ఎన్జీవో తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 475 ప్రభు త్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తున్నామని, తద్వారా విద్యార్థులకు ఇంగ్లిష్‌ను నాణ్యంగా బోధించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో స్థానిక జిల్లాలో కొరసవాడ ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాసులను ప్రారంభించేందుకు తాను జిల్లాకు వచ్చినట్టు వివరించారు. అలాగే మరోవైపు నటనను కొనసాగిస్తున్నానని, త్వరలోనే ‘లేచింది మహిళా లోకం’ అనే పూర్తి మహిళల చిత్రం విడుదల కానుందని, అలాగే తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి కుటుంబకథా చిత్రాన్ని కూడా చేయనున్నానని ప్రకటించారు. స్మార్ట్ క్లాస్రూమ్ ప్రారంభం పాతపట్నం: కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.3 లక్షలతో డిజిటల్ తరగతిని (స్మార్ట్ క్లాస్‌రూం)ను సినీ నటి మంచు లక్ష్మి మంగళవారం ప్రారంభించారు. ఆమె ముందుగా ఓపెన్ టాప్ జీపులో కొరసవాడ చేరుకున్నారు. ఊరివారితో పాటు సమీప గ్రామస్తులు కూడా ఆమెను చూడడానికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 20 పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్‌రూంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆమెతో పాటు జిల్లా డీఈఓ జి.పగడాలమ్మ, ఎంఈఓలు సీహెచ్ మణికుమార్, కె.రాంబాబు, ప్రధానోపాధ్యాయు డు సింహాచలం, సర్పంచ్ జక్కర ఉమా, ఎంపీటీసీ మడ్డు సుగుణ కుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే హిరమండలం మండలంలోని సవరచొర్లంగి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ క్లాస్‌రూంను కూడా ఆమె ప్రారంభించారు. -
ఏపీలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఇవే..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) గ్రౌండ్స్‌లో శనివారం జరిగే బహిరంగ సభా వేదికగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొననున్నారు. ప్రాజెక్టుల వివరాలు.. ► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే ► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం ► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన ► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం ► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం ఇదీ చదవండి: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్ -
భోగాపురం ఎయిర్‌పోర్టుకు త్వరలో శంకుస్థాపన
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన కేసులను హైకోర్టు కొట్టేయడంతో త్వరలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టడానికి ఏపీ ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ప్రణాళికలు సిద్ధంచేసింది. ఈనెల 12న విశాఖ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనుల ప్రారంభానికి ప్రధాని మోదీ విశాఖ వస్తున్న తరుణంలో భోగాపురం ఎయిర్‌పోర్టు పనులకు కూడా శంకుస్థాపన చేయించాలని ఏపీఏడీసీఎల్ యోచిస్తోంది. ప్రధాని యాత్రకు సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్ ఇంకా ఖరారు కానందున.. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా షెడ్యూల్లో చేర్చాల్సిందిగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరనున్నట్లు ఏపీఏడీసీఎల్ ఎండీ భరత్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. రూ.2,300 కోట్లతో నిర్మాణం విశాఖకు సమీపంలో విజయనగరం జిల్లా భోగాపురం వద్ద 2,203 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధంచేసింది. సుమారు రూ.2,300 కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణ కాంట్రాక్టును జీఎంఆర్ సంస్థ చేజిక్కించుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదిరింది. పనులు ప్రారంభించడానికి ఇంతకాలం కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. కానీ, ఈ విషయంలో ప్రభుత్వం గట్టిగా వాదించడం ద్వారా అనుకూలమైన తీర్పు రావడంతో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ అధికారులు తెలిపారు. అలాగే, మూడేళ్లలో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ రెండున్నర ఏళ్లల్లోనే పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు తెలిపారు. ఏటా 60 లక్షల మంది ప్రయాణం ఇక భోగాపురం తొలిదశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణించేలా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి ఏటా సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వాస్తవంగా విశాఖ నుంచి ఇంకా ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ఎయిర్‌పోర్టు భారత నావికాదళానికి సంబంధించినది కావడంతో విమాన రాకపోకలపై అనేక ఆంక్షలున్నాయి. అదే భోగాపురంలో విమానాశ్రయం వస్తే 24 గంటలూ సర్వీసులు నడిపే అవకాశముంటుంది. ఇక విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం ఏటా 4,400 టన్నుల సరుకు రవాణా జరుగుతుండగా కొత్త విమానాశ్రయం వస్తే ఇది భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖలోని విమానాశ్రయం మూసివేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఇప్పటికే నిరభ్యంతర సర్టిఫికెట్‌ను కూడా ఇచ్చింది. అప్పట్లో టీడీపీ తీరుతో రోడ్డెక్కిన రైతులు గత టీడీపీ ప్రభుత్వంలో తొలుత 15 వేల ఎకరాలు అవసరమని ఆ పార్టీ నేతలు నాయకులు ప్రకటనలు చేయడంతో భోగాపురం మండల రైతులు తీవ్ర ఆందోళనలకు దిగారు. దీంతో ఐదువేల ఎకరాలతో సరిపెట్టాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. పరిహారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ 2015 ఆగస్టులో రైతులు రోడ్డెక్కారు. నిబంధనలేవీ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే 2019 సాధారణ ఎన్నికలు సమీపించాయి. మరోవైపు.. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఏమీ పూర్తిచేయలేదు. కానీ, ఎన్నికలకు రెండునెలల ముందు ఫిబ్రవరి 14న ఎలాంటి అనుమతులు లేకుండానే హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఇప్పుడు రెట్టింపు పైగా పరిహారం కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్ విమానాశ్రయానికి అవసరమైన అనుమతుల కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ అదే సమయంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారు. భూమి పరిస్థితిని బట్టి పరిహారాన్ని ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ప్రకటించారు. అంతకుముందు డి.పట్టా భూములకు టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం రూ.12.50 లక్షలు మాత్రమే. అలాకాకుండా వారికీ జిరాయితీ భూమితో సమానంగా పరిహారం మంజూరు చేశారు. దీంతో చాలామంది హైకోర్టులో పిటిషన్లను ఉపసంహరించుకున్నారు. మిగతా వాటినీ శుక్రవారం హైకోర్టు పరిష్కరించింది. సంబంధిత రైతులకు పరిహారం ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ మేరకు ఆ మొత్తాన్ని చెల్లించడానికి జిల్లా కలెక్టరు ఎ. సూర్యకుమారి తదితర అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేస్తోంది. మరోవైపు.. విమానాశ్రయ నిర్వహణకు, ఇతర అనుబంధ కార్యకలాపాలకు 2,750.78 ఎకరాలు సరిపోతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తిచేసింది. అలాగే, విమానాశ్రయ పరిధిలోనే గత టీడీపీ ప్రభుత్వం అక్కడక్కడా వదిలేసిన దాదాపు 117 ఎకరాల సేకరణ పూర్తయ్యింది. జాతీయ రహదారి నుంచి అనుసంధాన రోడ్డు, ట్రంపెట్ ఆకారంలో వంతెన నిర్మాణానికి అవసరమైన 119 ఎకరాల సేకరణ రెండో దశ నోటిఫికేషన్‌తో కొలిక్కి వచ్చింది. నిర్వాసితులకు టౌన్‌షిప్‌లను తలదన్నే కాలనీలు ఇక ఇళ్లు కోల్పోయిన 376 కుటుంబాల కోసం రూ.80 కోట్ల వ్యయంతో టౌన్‌షిప్‌లను తలదన్నేలా రెండు కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తోంది. అంతేకాక.. ఒక్కో కుటుంబానికి పునరావాస పరిహారంగా ఐదు సెంట్ల స్థలం, రూ.8.70 లక్షల చొప్పున పునరావాస పరిహారాన్ని ప్రస్తుత ప్రభుత్వం మంజూరు చేసింది. చదవండి: ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? -
ప్రారంభించిన 4 నెలలకే కుంగిన రోడ్డు.. ‘అట్లుందటి ప్రభుత్వ పనితనం’
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. ప్రారంభించిన నాలుగు నెలలకే రోడ్డుపై ఇలా గుంతలు పడటం గమనార్హం. బెంగళూరులోని తూర్పు శివారు ప్రాంతాలను ఐటీ హబ్‌లోని ఇతర ప్రాంతాలకు కలిపేలా కుందనహళ్లి అండర్‌పాస్ నిర్మించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) రూ. 19.5 కోట్లతో ఈ అండర్‌పాస్‌ను నిర్మించింది. ఇందులో భాగంగా వేసిన సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రభుత్వ నాసిరకపు పనికి ఇది నిదర్శమని మండిపడింది. కాంట్రాక్టర్ నుంచి ‘40 శాతం’ కమీషన్ అంటూ బీజేపీపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే నాగరాజు యాదవ్ విమర్శించారు. సంబంధిత కాంట్రాక్టర్‌తోపాటు ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరు నగరానికి ప్రత్యేక మంత్రి కావాలని తాము డిమాండ్ చేస్తున్నామని.. బెంగళూరు ఇంచార్జీ అయిన సీఎం బసవరాజ్ బొమ్మై ఆ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు.. #WATCH: Another day, another road in Bengaluru. A section of road caves in near NPS Kengeri. Officials have taken up restoration work. While @chairmanbwssb says it's because of leakage from a water pipe, the issue persists across the city. pic.twitter.com/v1LJ7hr3H1 — Suraj Suresh (@Suraj_Suresh16) October 10, 2022 ప్రస్తుతం కుంగిపోయిన రోడ్డుపై అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పట్టనుంది. మరోవైపు రోడ్డు లోపల పైప్ లైన్ పగలడం వల్ల గత కొన్ని రోజులుగా నీరు చేరి రోడ్డు కుంగిందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. బెంగళూరు వాటర్ సప్లై, సీవేజ్ బోర్డు పగిలిన పైప్‌లైన్‌ను సరిచేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తూ.. ఉచితంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయనున్నట్లు బెంగుళూరు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
అందుకే సాధ్యమైంది.. వరుసగా మూడోసారి నంబర్‌వన్: సీఎం జగన్
సాక్షి, నంద్యాల జిల్లా: రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పారిశ్రామిక వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయన్నారు. కొలిమిగుండ్లలో బుధవారం.. రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభలో సీఎం ప్రసంగిస్తూ రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని అన్నారు. ‘‘కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశాం. రైతులకు మంచి జరగడంతో పాటు ఉద్యోగావకాశాలు రావాలి. రానున్న 4 ఏళ్లలో 20వేల ఉద్యోగాలు వస్తాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ వరుసగా 3వ సారి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే ఇది సాధ్యమైంది. మాది ఇండస్ట్రీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం’’ అని సీఎం జగన్ అన్నారు. ఈ సారి పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చారు. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేలు లీజు చెల్లిస్తాం. మూడేళ్లకోసారి 5 శాతం లీజు పెంచుతాం. కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్‌గా ఉండాలి. గ్రోత్ రేటులో దేశంలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది.రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని సీఎం పేర్కొన్నారు. చదవండి: రామ్‌కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్ -
మహబూబ్‌నగర్‌లో సందడి చేసిన కృతిశెట్టి (ఫొటోలు)
-
కర్తవ్యపథ్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రక మార్గమైన రాజ్‌పథ్.. కర్తవ్యపథ్గా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. కొత్త రూపం సంతరించుకున్న ఈ సెంట్రల్ విస్టా స్ట్రెచ్‌ను కాసేపటి కిందట ప్రధాన మంత్రి నరేంద్రం మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు సైతం పాల్గొన్నారు. గురువారం సాయంత్రం.. ఇండియా గేట్ దగ్గర 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ముందుగా ఆవిష్కరించారు. పూలు జల్లి స్వాతంత్ర ఉద్యమ వీరుడికి నివాళి అర్పించారు. అనంతరం కర్తవ్యపథ్ మార్గాన్ని ఆయన ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి.. రైజినా హిల్స్ రాష్ట్రపతి భవన్ దాకా మూడున్నర కిలోమీటర్ల మేర కర్తవ్యపథ్ కొత్త హంగులతో సిద్ధమైంది ఇప్పుడు. PM Modi inaugurates all new redeveloped Rajpath as Kartvyapath in New Delhi pic.twitter.com/owdlU05VKl — ANI (@ANI) September 8, 2022 #WATCH | PM Narendra Modi unveils the statue of Netaji Subhas Chandra Bose beneath the canopy near India Gate (Source: DD) pic.twitter.com/PUJf4pSP9o — ANI (@ANI) September 8, 2022 వలస పాలనలోని అవశేషాలు, కట్టడాల తొలగింపులో భాగంగా నరేంద్ర మోదీ హయాంలోని కేంద్రం ప్రభుత్వం పలు పేర్లను మార్చేయడం, కట్టడాలను పునర్మించడం చేస్తోంది. నూతన పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసం-కార్యాలయంతో కూడిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టును కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తున్న వాళ్లను శ్రమజీవులుగా అభివర్ణించిన ప్రధాని మోదీ.. రిపబ్లిక్ డే పరేడ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తానని స్వయంగా వాళ్లతోనే వెల్లడించారు కూడా. అనంతరం సెంట్రల్ విస్టా అవెన్యూ పునరద్దరణ ప్రాజెక్టును ప్రధాని మోదీ పరిశీలించారు. Shedding Colonial Past! A Special Day for India - Visuals of the Central Vista Avenue#KartavyaPath pic.twitter.com/rP2QSipyuS — Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) September 8, 2022 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ రోజు అతిపెద్ద పరివర్తన ప్రాజెక్టు ఆవిష్కృతమవుతోంది. కర్తవ్య మార్గం దేశరాజధాని గుండెలాంటిది. ఈ దేశ ప్రజలకు సేవ చేయడమే మన కర్తవ్యం. వారిని పాలించడం కాదని గుర్తు చేసేందుకే కర్తవ్య మార్గం అని పేరుపెట్టాం అని కేంద్రం మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. #WATCH | PM Modi interacts with workers who were involved in the redevelopment project of Central Vista in Delhi PM Modi told 'Shramjeevis' that he will invite all of them who worked on the redevelopment project of Central Vista for the 26th January Republic Day parade pic.twitter.com/O4eNAmK7x9 — ANI (@ANI) September 8, 2022 20 నెలల తర్వాత పునరాభివృద్ధి పనుల అనంతరం ఈ మార్గం(కర్తవ్యపథ్).. ప్రజా సందర్శనార్థం రేపటి(శుక్రవారం) నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. సరికొత్త హంగులతో కర్తవ్యపథ్ జనాలను ఆకట్టుకుంటుందని న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇదీ చదవండి: రాజ్‌పథ్‌ను కట్టిందెవరు? చారిత్రక నేపథ్యం వెనుక ఆసక్తికరమైన అంశాలెన్నో.. -
రాజ్‌పథ్ ఇక గతం.. కర్తవ్యపథ్ ఎంతో ఘనం
నిత్యం జనాల కోలాహలంతో సందడిగా ఉండే చారిత్రక మార్గం అది. అలాంటిది దాదాపు 20 నెలల పాటు మూగబోయింది అది. ఇప్పుడు కొత్త పేరుతో.. సరికొత్త హంగులతో సందర్శకులకు స్వాగతం పలకనుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్స్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ స్ట్రెచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. కర్తవ్య పథ్‌గా మారిన రాజ్‌పథ్ నేపథ్యం ఓసారి గుర్తు చేసుకుందాం. రాజ్‌పథ్.. చారిత్రక మార్గం. ఈ పేరు వినగానే గణతంత్ర దినోత్సవం నాడు జరిగే సైనిక పరేడ్లు, విన్యాసాలు గుర్తుకు రావడం ఖాయం. ఢిల్లీ వాసులకైతే ఇదొక సేదతీరే అడ్డా. చలికాలం సీజన్లో సూర్యకిరణాలను ఆస్వాదిస్తుంటారు అక్కడి ప్రజలు. అక్కడే ఉన్న రైల్ భవన్, శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, విజ్ఞాన్ భవన్ ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయాల్లో ఇక్కడే సేద తీరుతుంటారు. రాజధాని చూడడానికి వచ్చే యువత, జంటలు, కుటుంబాలు చాలావరకు ఇక్కడే టైం పాస్ చేస్తుంటాయి. నేరెడు చెట్లు, ఇంకా ఎన్నో నీడను పంచేవి. అలాంటి.. దారి రూపం.. పేరు మారిపోయాయి. అధికారికంగా ఇప్పుడది కర్తవ్య పథ్ అయ్యింది. బుధవారం అంటే ఇవాళ(సెప్టెంబర్ 7, 2022).. జరిగిన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ భేటీ రాజ్‌పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మార్చేస్తూ నిర్ణయం తీసుకుంది. ► ప్రధాని నరేంద్ర మోదీ కొత్తరూపం సంతరించుకున్న ఈ మార్గాన్ని ప్రారంభిస్తారు. కానీ, సాధారణ ప్రజానీకం మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఒక్కరోజు తర్వాతే(శుక్రవారం) నుంచి ఈ కొత్తదారిని వీక్షించొచ్చు. ఈమధ్యలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతాయని ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ► ప్రజాశక్తీకి నిదర్శనంగా ఉండేందుకే కర్తవ్యపథ్గా అనే పేరుపెట్టినట్లు కేంద్రం చెబుతోంది. వసలవాద మైండ్‌సెట్‌ను తొలగించే క్రమంలో భాగంగానే.. అప్పటి పేర్లు, కట్టడాలను మార్చేయాలనే గట్టి ఉద్దేశంతో ఉంది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. ► 1911లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ సమయంలో నిర్వహించిన దర్బార్ కోసం వచ్చిన అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ 5 ఢిల్లీకి వచ్చారు. ఆ టైంలోనే వైశ్రాయ్ భవన్(నేటి రాష్ట్రపతి భవన్) దాకా ఒక రాచబాటను వాడుకలోకి తీసుకొచ్చారు. అదే తర్వాత రాజ్‌పథ్(కర్తవ్యపథ్) అయ్యింది. ► లండన్‌లో జార్జ్ 5 తండ్రి ఎడ్వర్డ్ 7 స్మారకార్థం 1905లో ‘కింగ్స్‌వే’ను ప్రారంభించారు. రాజ్‌పథ్ నమునా కూడా కింగ్స్‌వేను దాదాపుగా పోలి ఉంటుంది. దీంతో ఆనాడు ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఫ్రొఫెసర్‌గా పని చేస్తున్న పెర్సివల్ స్పియర్.. ఢిల్లీ రాజమార్గానికి ‘కింగ్స్‌వే’ పేరును ప్రతిపాదించారు. దీంతో మనదగ్గరా కింగ్స్వేగానే అది ఉండిపోయింది. ► అయితే స్వాతంత్రం అనంతరం ఢిల్లీ కింగ్స్‌వే పేరును.. రాజ్‌పథ్ అని మార్చేశారు. 1961లో ఈ పేరు మారింది. ► రాజ్‌పథ్ నిర్మించింది.. సర్దార్ నారాయణ్ సింగ్ అనే కాంట్రాక్టర్. బ్రిటిషర్ల పాలనలో ఈ మార్గం ఒక్కటే కాదు.. ఢిల్లీలో చాలారోడ్లను నిర్మించిన కాంట్రాక్టర్ కూడా ఈయనే. ► రైజినా హిల్స్ మీద ఉన్న రాష్ట్రపతి భవన్ నుంచి విజయ్ చౌక్ మీదుగా ఇండియా గేట్ వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పొడవు మార్గంగా రాజ్‌పథ్ ఉండేది. ► గత కొన్ని సంవత్సరాలుగా రాజ్‌పథ్.. దానికి అనుసంధానంగా ఉండే సెంట్రల్ విస్టా ఎవెన్యూలు.. ట్రాఫిక్, ఇతర కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ► పబ్లిక్ టాయిలెట్స్, తాగు నీటి సవతి, కుర్చీలు-బల్లలు, పార్కింగ్ స్పేస్ తగినంత లేకపోవడం.. తదితర కారణాలతో రూపురేఖలు మార్చేయాలని నిర్ణయించింది కేంద్రం. వీటికి తోడు రిపబ్లిక్ డే పరేడ్, ఇతర కార్యక్రమాల నిర్వాహణ.. వీక్షకులకు సరిపడా జాగా లేకపోవడంతో ఇక్కడ అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ► బ్రిటిష్ వలసపాలనలో కట్టించిన కట్టడాల తొలగింపులో భాగంగా.. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు తెర మీదకు వచ్చింది. త్రికోణాకారంలో నూతన పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ప్రధాని నివాసం, ప్రధాని కార్యాలయం, ఉప రాష్ట్రపతి ఎన్క్లేవ్ రానున్నాయి. ఈ క్రమంలోనే రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్ రూపు రేఖలు మారిపోయాయి. ► 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. బ్రిటిషర్లు, వలసపాలనలో పేర్లకు, గుర్తులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ► కర్తవ్యపథ్.. ఇక సువిశాలంగా ఉండనుంది. ఎటు చూసినా పచ్చదనంతో లాన్స్, వాక్‌వేస్, కాలువలు, స్నాక్స్ దొరికేలా దుకాణాలు, లైటింగ్ సిస్టమ్స్, టాయిలెట్స్ సౌకర్యాలు, సైన్ బోర్డులు.. ఏర్పాటు చేశారు. ► కొత్త రూపం సంతరించుకోనున్న ఈ తోవ గుండా రాష్ట్రాల వారీగా ఫుడ్‌స్టాల్స్, గ్రానైట్ వాక్‌వేలు ఏర్పాటు చేశారు. వెండింగ్ జోన్లు, పార్కింగ్ స్థలాలు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉండనుంది. వర్షపు నీటిని, రీయూజ్ వాటర్ ప్రాజెక్టులను సైతం అమలు చేయనున్నారు. ► సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. ఈ రోడ్డును మీడియా, ప్రభుత్వ డాక్యుమెంట్లు ‘సెంట్రల్ విస్టా ఎవెన్యూ’గా పేర్కొన్నాయి. కానీ, అధికారికంగా మాత్రం ఇప్పుడదిక కర్తవ్య పథ్. ► శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 28 అడుగుల గ్రానైట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి మరీ.. కర్తవ్యపథ్, సెంట్రల్ విస్టా లాన్స్ స్ట్రెచ్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. #WATCH | Delhi: Visuals from the redeveloped Kartavya Path that will soon be opened for public use pic.twitter.com/YUoNXFToRL — ANI (@ANI) September 7, 2022 -
ప్రారంభోత్సవం రోజునే పరాభవం... హఠాత్తుగా కుప్పకూలిన వంతెన: వీడియో వైరల్
Bridge collapsed immediately after an official cut the ribbon to inauguration: డెమొక్రెటిక్ రిపబ్లక్ ఆఫ్ కాంగో(డీర్సీ)లో ఒక వంతెన ప్రారంభోత్సవంలో అధికారులు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో చక్కర్లు కొడుతుండటంతో ఈ ఘటన వెలుగు చూసింది. వాస్తవానికి కాంగ్లోలో వర్షాకాలంలో స్థానికులు నదిని దాటేందుకు ఒక చిన్న వంతెనను నిర్మించారు. ఆ వంతెన ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. పైగా పెద్ద ఎత్తున్న అధికారులు కూడా వచ్చారు. సరిగ్గా ఒక మహిళా అధికారి రిబ్బన్ కటింగ్ చేస్తుండగా... హఠాత్తుగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు అంతా ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ బెంబేలెత్తిపోయారు. దీంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై అధికారులను రక్షించి సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అదృష్టవశాత్తు ఎవరు కిందపడిపోలేదు, పైగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఐతే ఈ వంతెనను మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించారు. కానీ వంతెన నిర్మాణ నాణ్యతల్లో లోపాలు కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో... స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున్న ప్రభుత్వ వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అదీగాక ఈ వంతెనకు ముందు ఉన్న తాత్కాలికా నిర్మాణం తరుగచుగా కూలిపోతుంటుందని ఒక స్థానిక వార్త సంస్థ పేర్కొనడం గమనార్హం. (చదవండి: యూకే హోం సెక్రటరీగా భారత సంతతి మహిళ) -
నగరానికి శోభ.. గండిపేట పార్కు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గండిపేట జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పార్కులో యాంఫీ థియేటర్‌తో పాటు గ్రీనరీతో కూడిన అందమైన ప్రదేశాలను ఏర్పాటు చేశారన్నారు. గండిపేట పార్కును అద్భుతంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు, హెచ్ఎండీఏ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అందమైన హైదరాబాద్ నగరానికి ఈ పార్కు మరింత శోభను తీసుకొస్తుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, గండిపేట పార్కును 5.50 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. రూ.35.60 కోట్ల వ్యయంతో పార్కును రూపొందించారు. సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్లు, ఎంట్రన్స్ ప్లాజా, వాక్‌వేస్, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పేసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ యాక్సెస్ రోడ్, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులను నిర్మించారు. -
ఐమాక్స్‌లో ‘గాంధీ’ చిత్ర ప్రదర్శన.. ప్రారంభించిన మంత్రి తలసాని
-
TS: ఒకే చోట నుంచి రాష్ట్రమంతా వీక్షణ.. పోలీస్ ట్విన్ టవర్స్ ప్రత్యేకలివే..
సాక్షి, సిటీ బ్యూరో: రాష్ట్రానికే తలమానికంగా దేశానికే ఆదర్శంగా నగరంలో ఏర్పాటైన తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్ఐసీసీసీ) ఆధునిక సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దీన్ని నిర్మించారు. గురువారం జరగనున్న దీని ప్రారంభ వేడుకలను చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించాలని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. చదవండి: టీఆర్ఎస్లో టెన్షన్.. మునుగోడుపై ‘ఐ ప్యాక్’ కీలక నివేదిక! ఈ నేపథ్యంలోనే వీటి కోసం నగర పోలీసు విభాగానికి చెందిన 25 మంది అధికారులను నియమించారు. ఆద్యంతం పర్యవేక్షించే బాధ్యతల్ని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్‌కు అప్పగించారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆహ్వానిస్తున్నారు. టీఎస్‌పీఐసీసీసీ హంగులివే.. పోలీసు సింగిల్ విండో: నగర కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలు, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకువస్తున్నారు. వీటిలో ఏ విభాగానికి సంబంధించిన పని కోసమైనా ప్రజలు వివిధ చోట్లకు తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానం అమలుకానుంది. కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ: టీఎస్‌ఐసీసీసీలో విపత్కర, అత్యవసర పరిస్థితుల్లో అని విభాగాల అధిపతులూ ఒకేచోట సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇవి తక్కువ సమయంలో అందరికీ చేరడం అదనపు ఆకర్షణలు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో కార్పొరేట్ స్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనికోసం ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం: డయల్– 100, అంబులెన్స్, ఫైర్స్, మహిళా భద్రత, షీ–టీమ్స్, హాక్ ఐ... ఈ వ్యవస్థలన్నీ ఒకే చోట ఉంటాయి. దీంతో అత్యవసర సమయాలతో పాటు బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం స్పందించేలా కంప్యూటర్ ప్రొగ్రామింగ్ ఉండనుంది. జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలతో పాటు ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులతో అనుసంధానమైన వ్యవస్థ ఇది. సిటిజన్ పిటిషన్ మేనేజ్మెంట్: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని విభాగాల వారీగా కేటాయింపు, సత్వర స్పందన, పరిష్కారం, వీటి మ్యాపింగ్ మొత్తం కంప్యూటర్ ద్వారా జరుగుతుంది. మార్కెట్, సోషల్ మీడియా విశ్లేషణ, మెబైల్ యాప్స్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. రిసెప్షన్ సెంటర్లో కియోస్‌్కలు ఏర్పాటు చేస్తారు. శాంతిభద్రతల విభాగం నగర వ్యాప్తంగా ఉండే సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్న దృశ్యాలను భారీ వీడియో వాల్ సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ప్రత్యేక ఎనలటిక్స్‌గా పిలిచే సాఫ్ట్వేర్స్ ద్వారా శాంతిభద్రతల పరిస్థితుల్ని అంచనా వేస్తారు జీపీఎస్ పరిజ్ఞానం ఉన్న వాహనాలను అవసరమైన చోటుకు మళ్ళిస్తారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం నగరంలో ట్రాఫిక్ నిర్వహణకూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. సెన్సర్ల ద్వారా వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసి మార్పు చేర్పులు సూచిస్తారు. ఆర్టీఏ డేటాబేస్–అనుమానిత వాహనాల డేటాబేస్లను అనుసంధానిస్తారు. తక్షణ స్పందన కోసం ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉంటాయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం: ఎఫ్ఐఆర్ మొదలు కేసు స్థితిగతుల నిశిత పరిశీలన, నేరగాళ్ల డేటాబేస్ నిర్వహణ, నేరాలు జరిగే ప్రాంతాల క్రైమ్ మ్యాపింగ్, అధ్యయనం, జైలు నుంచి విడుదలయ్యే నేరగాళ్లపై పర్యవేక్షణ, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ లాబ్ ఇతర టూల్స్ నేరాల నిరో«ధం, కేసుల సత్వర పరిష్కారానికి ఉపకరిస్తాయి. బిజినెస్ ఇంటెలిజెన్స్: నేరాలను పసిగట్టే, నేరగాళ్ల కదలికల్ని గుర్తించే సాఫ్ట్వేర్ ఎనలటికల్ టూల్స్ అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు డేటా ఎనాలసిస్, అడ్వాన్స్ సెర్చ్‌కూ సాంకేతిక పరిజ్ఞానం వాడనున్నారు. అదనంగా ప్రత్యేక వెబ్ డిజైనింగ్ టూల్స్‌తో మెరుగైన సేవలు అందించనున్నారు. అనేక కార్యాలయాల మార్పు.. నగర పోలీసు కమిషనరేట్ ఆగస్టు నెలాఖరు కల్లా టీఎస్‌ఐసీసీసీలోకి తరలనుంది. 18వ అంతస్తులో కొత్వాల్ కార్యాలయం ఉంటుంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ తదితరాలు సైతం అక్కడకే వెళ్తాయి. ఇవి అయిదో అంతస్తులో ఉండనున్నాయి. ఏడో అంతస్తును ఇతర విభాగాల కోసం కేటాయించారు. ప్రధాన కంట్రోల్ రూమ్‌లోనూ వీరికి భాగస్వామ్యం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్ సిటీ ట్రాఫిక్ కమిషనరేట్‌గా మారనుంది. దీంతో పాత కంట్రోల్ రూమ్‌ను పూర్తి స్థాయిలో సీసీఎస్, డిటెక్టివ్ డిపార్ట్మెంట్లతో పాటు మధ్య మండల కార్యాలయానికి అప్పగిస్తారు. ఫలితంగా సిట్ కార్యాలయం కూడా ఇక్కడకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాతబస్తీలో ఉన్నట్లే బషీర్‌బాగ్‌లోనూ కమిషనర్ కోసం ఓ కార్యాలయం ఉండనుంది. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ తెలంగాణ పోలీసును దేశంలోనే బెస్ట్ పోలీసింగ్‌గా తయారు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సదుపాయాలు కల్పించారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రూపకల్పన చేసినట్లు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారన్నారు. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం, 14వ అంతస్తులో గ్యాలరీని ప్రారంభిస్తారని తెలిపారు. పకడ్బందీ ఏర్పాట్లు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వారం రోజుల నుంచి ఏర్పాట్లలో మునిగిపోయారు. బుధవారం సీఎం కాన్వాయ్ రిహార్సల్స్‌ను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణకే తలమానికం.. టీఎస్ఐసీసీసీ (ఫొటోలు)
-
బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అటువైపు వెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 4న బంజారాహిల్స్‌లో హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయం, పోలీసు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్ మీదుగా వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి రోడ్డు నంబర్–36, 45 మీదుగా మాదాపూర్ వైపునకు మళ్లాలి. మాసబ్‌ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 వైపు వచ్చే వాహనాలు బంజారాహిల్స్ రోడ్డు నంబర్–1, 10 మీదుగా జహీరానగర్, కేన్సర్ ఆస్పత్రి మీదుగా వెళ్లాలి. ఫిల్మ్‌నగర్ మీదుగా ఒర్సి ఐస్‌ల్యాండ్ మీదుగా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్ఎన్టీ, ఎన్ఎఫ్సీఎల్ మీదుగా పంజగుట్ట వైపు వెళ్లాలి. మాసబ్‌ట్యాంక్ మీదుగా రోడ్డు నంబర్ 12, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనదారులు మెహిదీపట్నం, నానల్‌నగర్, టోలిచౌకి, ఫిల్మ్‌నగర్, జూబ్లిహిల్స్‌కు చేరుకోవాలి. 4న కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించనున్న సీఎం బంజారాహిల్స్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే మణిహారంగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నూతనంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనాన్ని మంగళవారం ఆయ న హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు నాగేందర్, గోపీనాథ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్ చేతుల మీదు గా ప్రారంభం జరుగుతుందని తెలిపారు. (క్లిక్: జీహెచ్ఎంసీ నెత్తిన మరో పిడుగు) -
‘దళితబంధు’.. పుట్నాల్లా పంచేది కాదు
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకం పుట్నాలు, బఠానీల మాదిరిగా పంచేది కాదని, సంపదను పునరుత్పత్తి చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(డిక్కి) ఆధ్వర్యంలో సైఫాబాద్‌లో ఏర్పాటు చేసిన బిజినెస్ ఫెసిలిటేషన్ సెంటర్, మోడల్ కెరీర్ సెంటర్‌ను బుధవారం కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించే వారి కోసం టీఎస్ ఐపాస్ నుంచి 15 రోజుల్లోనే అన్ని అనుమతులు జారీ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇలా అందరి ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ ఉపాధికల్పన, నిరుద్యోగం అన్నారు. ‘దేవుడు అందరినీ సమానంగానే పుట్టించి ఒకటే రక్తం, ఒకటే బుర్రను ఇచ్చినా అవకాశాలను మాత్రం సమానంగా ఇవ్వలేదు, మనుషులు కులం, మతం పేరిట విభజించబడి డబ్బున్నవారు, లేనివారిగా సమాజం అవతరించింది’అని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో అనుకూల వాతావరణం దేశంలో ఎక్కడాలేనివిధంగా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం తెలంగాణలో ఉందని డిక్కి జాతీయ అధ్యక్షుడు నర్రా రవికుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విధానాలకు డిక్కి నమూనా ఆదర్శ చాప్టర్‌గా తయారైందని డిక్కి వ్యవస్థాపక అధ్యక్షుడు మిళింద్ తుంబ్లే అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ పాలసీని ప్రస్తావిస్తున్నామని, ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా పాలసీ కోసం ప్రయత్నిస్తున్నాయన్నారు. సమావేశంలో టీఎస్ఐఐసీ ౖచైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం
కుత్బుల్లాపూర్/సుభాష్‌నగర్: ప్రభుత్వ రంగంలో గత 8 ఏళ్లుగా విద్యా ప్రమాణాలను పెంచుతూ వస్తున్నామని... పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. అంగన్వాడీ మొదలు యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో గుణాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్, బహుదూర్‌పల్లిలలో రూ. 2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన జూనియర్ కాలేజీని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో కలసి ప్రారంభించారు. వొకేషనల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల భేరిలో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో ఇదే జూనియర్ కాలేజీ శిథిలావస్థలో ఉండేదని, ప్రస్తుతం కొత్త భవనం నిర్మించి వొకేషనల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గురుకుల విద్యార్థులు ఐఐటీలకు... ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో 5 లక్షల మంది విద్యార్థులకు రూ. 1.20 లక్షల చొప్పున ఖర్చు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నాణ్యమైన విద్యతోపాటు ఇంట్లో కూడా అందని సకల సౌకర్యాలు అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందించే నాణ్యమైన చదువుతో వెయ్యి మందికంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఐఐటీకి వెళ్లారని... ఇది ప్రభుత్వం చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోందన్నారు. 400 గురుకుల పాఠశాలలను 1,052 గురుకులాలను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామని.. ఇది ఎంతో గర్వకారణమన్నారు. విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.18 వేల కోట్లు చెల్లించామని, విదేశాల్లో చదువుకోవాలనుకునే ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు అందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. జిల్లాకో మెడికల్ కాలేజీ చొప్పున 33 మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయని... అగ్రికల్చర్, లా కాలేజీలు, 79 డిగ్రీ కాలేజీలు, రెండు యూనివర్సిటీలను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కోరిన మేరకు ఉర్దూ కాలేజీని మంజూరు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబిత, మల్లారెడ్డి ప్రసంగించగా ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్, సురభి వాణీదేవి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. -
సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, హైదరాబాద్: అల్వాల్ రైతు బజార్ ఎదురుగా ఉన్న స్థలంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగనున్న ఈ కార్యక్రమం నేపథ్యంలో తిరుమలగిరి చౌరస్తా–బొల్లారం చెక్‌పోస్టు మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వాహనచోదకులు ఈ మార్గాన్ని అనుసరించవద్దని సూచిస్తున్నారు. కరీంనగర్ హైవేకు రాకపోకలు సాగించే వారు ఔటర్ రింగ్ రోడ్‌ను ఆశ్రయించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సోమవారం సూచించారు. నిర్ణీత సమయంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించడమో, పూర్తిగా ఆపేయడమో జరుగుతుందన్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్ హైవే మధ్య ఉన్న టివోలీ ఎక్స్‌రోడ్స్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, తెలంగాణ తల్లి విగ్రహాల కేంద్రంగా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. కరీంనగర్ హైవే నుంచి హైదరాబాద్ సిటీలోకి వచ్చే మార్గంలో షామీర్పేట ఓఆర్ఆర్, బిట్స్ జంక్షన్, తూముకుంట ఎన్డీఆర్ విగ్రహం, బొల్లారం చెక్‌పోస్టు కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. (చదవండి: కూకట్‌పల్లిలో... దేవాలయం శిఖర ప్రతిష్ట చేస్తున్న చినజీయర్ స్వామి ) -
గుజరాత్లో జేసీబీ ఎక్కిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
న్యూఢిల్లీ: నిర్మాణ రంగ పరికరాల తయారీ దిగ్గజం జేసీబీ తాజాగా గుజరాత్‌లోని వదోదరలో కొత్త ప్లాంటు ఆవిష్కరించింది. దాదాపు 100 మిలియన్ పౌండ్లతో (సుమారు రూ. 995 కోట్లు) నిర్మించిన ఈ ఫ్యాక్టరీని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ప్రారంభించారు. అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులకు అవసరమైన భాగాలను ఈ ప్లాంటులో తయారు చేయనున్నట్లు జేసీబీ చైర్మన్ లార్డ్ బామ్ఫోర్డ్ తెలిపారు. ఇది ఏటా 85,000 టన్నుల ఉక్కును ప్రాసెస్ చేయగలదని వివరించారు. 1979లో భారత్‌లో తయారీ కార్యకలాపాలు ప్రారంభించిన జేసీబీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయి. చదవండి: తులసిభాయ్.. ఆ ప్రముఖుడికి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ -
చైనాకు ధీటుగా మరో కట్టడం.. అబ్బురపరుస్తున్న వీడియో
ప్రపంచంలోని ఎన్నో వింతల్లో మరో విశేష కట్టడం చేరబోతోంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించేందుకు వియత్నాం వేదికైంది. ప్రపంచంలోనే అతిపొడవైన గాజు వంతెనను వియత్నాంలోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో నిర్మించారు. ఈ గాజు వంతెన పొడవు 2,073.5 అడుగులు ఉండగా.. భూమి నుంచి వంతెన ఎత్తు సుమారుగా 500 అడుగుల ఎత్తులో ఉంది. కాగా, ఈ వంతెనను ఏప్రిల్ 30వ తేదీన ఓపెన్ చేయబోతున్నారు. ఈ వంతెనపై ఇప్పటికే అధికారులు భద్రతను పరిశీలించారు. అనంతరం సోన్ లా ప్రావిన్స్‌లోని మోక్ చౌ ఐలాండ్ టూరిస్ట్ ఏరియా అధికారులు.. ఈ గాజు వంతెన అధికారిక పొడవు ప్రపంచంలోనే ఎక్కువగా ఉండటంతో వంతెన గుర్తింపు కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు సమర్పించినట్లు తెలిపారు. ఇక, ఈ వంతెనపైకి ఒక్కసారి 500 మంది మాత్రమే నడవడానికి అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ వంతెన నిర్మాణానికి ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ సెయింట్ గోబైన్ ఉత్పత్తి చేసిన సూపర్ టెంపర్డ్ గ్లాస్‌ను ఉపయోగించారు. ఇక, చైనాలో కూడా ఓ గాజు వంతెనను నిర్మించిన విషయం తెలిసిందే. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్జియాజీ గ్రాండ్ కాన్యన్‌పై 1,410.7 అడుగుల పొడవుతో గాజు వంతెన ఉంది. ఈ వంతెన ప్రస్తుతం పొడవైనదిగా గిన్నిస్ రికార్డుల్లో ఉంది. కాగా, ఈ వంతెనను 2016లో ఓపెన్ చేశారు. అప్పటి నుంచి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ వంతెనకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అయ్యాయి. -
Yadadri Temple: వైకుంఠమే దిగివచ్చింది!
అల వైకుంఠపురం భువికి దిగి వచ్చిందా అన్నట్టుగా యాదాద్రి శోభాయమానమైంది. పునర్నిర్మాణ ఆలయ మహాకుంభ సంప్రోక్షణ అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆలయ శిఖరాలు, ఉప ఆలయ సన్నిధులు, ప్రాకార మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీల దర్శనం అనంతరం భక్తులు ఆలయానికి పోటెత్తారు. కృష్ణశిలలతో అబ్బురపరిచే శిల్పాలతో రూపుదిద్దుకున్న అద్భుత నిర్మాణం ఓవైపు.. యాదగిరీశుడి స్వయంభూ దర్శనం మరోవైపు భక్తులను తన్మయత్వంలో ముంచేశాయి. సాక్షి,యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ క్రతువు అంగరంగ వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి తరలివచ్చి నారసింహుడి సేవలో పాల్గొన్నారు. తొలుత బాలాలయం నుంచి స్వామివారి బంగారు కవచ మూర్తులు, యాగమూర్తులు, కల్యాణ మూర్తులు, అర్చనా మూర్తులు, అళ్వారులు, అండాళ్ అమ్మవార్ల ఉత్సవమూర్తులను తీసుకుని శోభాయాత్ర నిర్వహించారు. తిరువీధులతో ప్రదక్షిణ చేసి మూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని, పూజలు చేశారు. వేద మంత్రాల మధ్య మహాకుంభ సంప్రోక్షణ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటనలో ప్రధాన ఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణను వేద మంత్రాల మధ్య వైభవంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్, కేసీఆర్ మనవడు హిమాన్షు, దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో గీతారెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఆచార్యులు విమాన గోపురాల వద్దకు చేరుకున్నారు. తొలుత గర్భాలయంపై ఉన్న విమానగోపురం వద్ద పూజలు చేసి, ఆశీర్వచనం నిర్వహించారు. కేసీఆర్‌కు కంకణధారణ చేసి, సుదర్శన చక్రానికి పూజలు చేయించారు. అనంతరం దివ్య విమాన రాజగోపురం వద్ద ఉదయం 11:55 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త మిథునలగ్న అభిజిత్ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించారు. ప్రధానాచార్యులు నల్లంథీఘల్ లక్ష్మీనర్సింహాచార్యుల ఆధ్వర్యంలో సువర్ణ సుదర్శన చక్రానికి బంగారు కలశంలో నింపిన పవిత్ర నదీజలాలతో మహాకుంభాభిషేకం (సంప్రోక్షణ) నిర్వహించారు. ఇదే సమయంలో మిగతా గోపురాల వద్ద మంత్రులు కుంభ సంప్రోక్షణ చేశారు. చివరిగా సుదర్శన చక్రం చుట్టూ ప్రదక్షిణలు, హారతి నివేదన పూర్తి చేశారు. కుటుంబ సభ్యులతో వీఐపీలు.. సీఎం పిలుపు మేరకు యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మహాకుంభ సంప్రోక్షణ జరుగుతున్న సమయంలో అందరినీ ప్రధానాలయ ముఖమండపంలో కూర్చో బెట్టారు. అంతా సంప్రదాయ వస్త్రాలు ధరించారు. అర్చకులతో కలిసి భజనలు చేస్తూ నారసింహ జపం చేశారు. గర్భాలయంలో సీఎం కుటుంబ సభ్యుల అనంతరం అంతా దర్శనాలు చేసుకున్నారు. మొత్తంగా పంచారాత్ర ఆగమ శాస్త్రానుసారం ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం సంప్రదాయబద్ధంగా యాదాద్రి ఆలయ ఉద్ఘాటన క్రతువును పూర్తి చేశారు. సన్మానాలు చేసిన సీఎం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న దేవస్థానం అభివృద్ధి మండలి వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డి, ఆలయ ధర్మకర్త నర్సింహమూర్తి, ఆర్కిటెక్టులు ఆనంద సాయి, మధుసూదన్, స్థపతులు సుందర రాజన్, ఆనందాచారి వేలు తదితరులను సీఎం, మంత్రులు సన్మానించారు. మంత్రులు, వీఐపీల పూజలు.. దివ్యవిమాన గోపురం వద్ద సీఎం కేసీఆర్ సంప్రోక్షణ పూజలు చేయగా.. తూర్పు రాజగోపురంపై దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు; దక్షిణ రాజగోపురం వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి దంపతులు; పశ్చిమ రాజగోపురం వద్ద మంత్రి జగదీష్‌రెడ్డి దంపతులు; ఉత్తర రాజగోపురం వద్ద మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు; పశ్చిమ రాజగోపురం(సప్తతల) వద్ద మంత్రి పువ్వాడ అజయ్ దంపతులు; తూర్పు (త్రితల) రాజగోపురం వద్ద మంత్రి గంగుల కమలాకర్ దంపతులు; ఆండాళ్ అమ్మవారి సన్నిధి వద్ద విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి; గరుడాళ్వార్ సన్నిధి వద్ద అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి; ఆంజనేయస్వామి సన్నిధి వద్ద మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి; ఆగ్నేయ ప్రాకార మండపం–2 వద్ద మంత్రి సబితా ఇంద్రారెడ్డి; వాయవ్య ప్రాకార మండ పాల వద్ద మంత్రి సత్యవతి రాథోడ్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి; ఈశాన్య ప్రాకార మండపాల వద్ద మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంప్రోక్షణ పూజలు చేశారు. కిక్కిరిసిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ ఉద్ఘాటన, స్వయంభూ దర్శనం పునః ప్రారంభం కోసం వచ్చిన వీఐపీలు, వారి కుటుంబ సభ్యులు, భక్తులతో యాదాద్రి నిండిపోయింది. సోమవారం మొదట సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్లు, వారి కుటుంబ సభ్యులు ఆలయంలో నారసింహుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అధికారులు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాధారణ భక్తులను అనుమతించారు. అప్పటికే యాదగిరిగుట్ట పట్టణ శివార్లలో వేచి ఉన్న వేలాది మంది భక్తులు వరుసకట్టారు. కొండ దిగువన కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి.. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి యాదాద్రిపైకి చేరుకున్నారు. సుదూ ర ప్రాంతాల నుంచీ వచ్చిన భక్తులు స్వామి వారి స్వయంభూ విగ్రహాలను దర్శించుకుని తన్మయత్వంలో మునిగిపోయారు. పూర్తి రాతితో నిర్మించిన ఆలయాన్ని సందర్శించి మంత్రముగ్ధులయ్యారు. ముగిసిన పంచకుండాత్మక యాగం పంచనారసింహుడు కొలువైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. 7 రోజులు కొనసాగిన సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలకు ఆచార్యులు 8వ రోజు సోమ వారం రాత్రి ముగింపు పలికారు. మహాకుంభ సంప్రోక్షణ తర్వాత ప్రధానాలయంలో శాంతి కల్యాణం జరిపించారు. వేడుకల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, రంగాచార్యులు పాల్గొన్నారు. జయజయధ్వానాల మధ్య.. మహాకుంభ సంప్రోక్షణ పూర్తయిన అనంతరం సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులు ప్రధానాలయంలోకి చేరుకున్నారు. ధ్వజ స్తంభానికి, గరుఖ్మంతుడికి పూజలు చేశారు. గర్భాలయం గడపకు సీఎం కేసీఆర్ సతీమణి శోభ పూజ చేశారు. తర్వాత భక్తుల జయజయధ్వానాల మధ్య ఆచార్యులు స్వయంభూ లక్ష్మీనరసింహుడి గర్భాలయం ద్వారాలను తెరిచారు. కేసీఆర్, కుటుంబ సభ్యులు లోనికి వెళ్లి ప్రథమ పూజలు చేశారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదం ఇచ్చారు. సీఎం దంపతులకు ఆలయ ప్రధాన అర్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనర్సింహచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు మహావేద ఆశీర్వచనం ఇచ్చారు. మహాకుంభ సంప్రోక్షణ ఇదీ నూతనంగా నిర్మించిన ఆలయం, గోపురాలపై ఏర్పాటు చేసిన కలశాలకు పంచారాత్ర ఆగమశాస్త్రం ప్రకారం చేసిన పూజలే మహాకుంభ సంప్రోక్షణ. ఇందుకోసం ఈ నెల 21 నుంచి బాలాలయంలోని యాగశాలలో పంచకుండాత్మక హోమం నిర్వహించారు. బిందెలలో నింపిన పవిత్ర నదీజలాలకు మహామంత్రాలతో ఆవాహన చేశారు. ఆ పవిత్ర జలాలతో ప్రధానాలయ గోపురాలపై కలశాలు, సుదర్శన చక్రానికి మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించారు. పవిత్ర మంత్ర జలాల అభిషేకం, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయం పవిత్రమై.. భక్త కోటికి భగవంతుని పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఆచార్యులు తెలిపారు. యాదాద్రి సమాచారం యాదాద్రీశుడి ప్రధానాలయాన్ని ప్రతిరోజూ ఉదయం 3 గంటలకు తెరుస్తారు. సుప్రభాతం, బిందెతీర్థం, ఆరాధన, బాలభోగం, నిజాభిషేకం, అలంకరణ, సహస్ర నామార్చన పూర్తిచేశాక.. 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సర్వ దర్శనాలు ఉంటాయి. మధ్యలో 8 గంటల నుంచి గంటపాటు వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతిస్తారు. మధ్యాహ్నం 12.45 నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వ దర్శనాలు ఉంటాయి. మధ్యలో 4 నుంచి 5 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 8.15 వరకు పూజలు జరుగుతాయి. తర్వాత 9.15 గంటల వరకు మళ్లీ సర్వ దర్శనాలు ఉంటాయి. తర్వాత రాత్రి నివేదన, శయనోత్సవం, ద్వార బంధనం నిర్వహిస్తారు. విశేష పూజలివీ.. : ప్రతిరోజు ఉదయం 6.30 నుంచి రాత్రి 9.15 గంటల వరకు సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనం కొనసాగుతాయి. ఉదయం 8.30 నుంచి 10 గంటల వరకు శ్రీసుదర్శన నారసింహ హోమం, 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు శ్రీస్వామి వారి వెండి మొక్కు జోడు సేవలు, 6.45 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్బార్ సేవ ఉంటాయి. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ప్రతి మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11గంటల వరకు ఆకుపూజ.. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ నిర్వహిస్తారు. శోభాయాత్ర నుంచి భోజనం దాకా.. యాదాద్రిలో 5 గంటలకు పైగా గడిపిన సీఎం కేసీఆర్ సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో ఆసాంతం సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఉదయం 9.20 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్లో టెంపుల్‌సిటీకి చేరుకున్న ఆయన.. 9.32 గంటలకు మొదటి ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి వచ్చారు. కేసీఆర్, ఆయన కుటుంబసభ్యు లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమాలు, పూజల వివరాలివీ.. ఉదయం ► 10.10: సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. తూర్పు రాజగోపురం నుంచి ప్రదక్షిణ చేశారు. ► 10.45: ఎంపీ సంతోష్, మనవడు హిమాన్షుతో కలిసి కేసీఆర్ విమాన గోపురంపైకి ఎక్కారు. ► 10.50: శోభాయాత్ర ముగిసింది. అర్చకులు బంగారు కవచ మూర్తులను ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు. ► 11.04: కేసీఆర్ ఆధ్వర్యంలో మహాకుంభ సంప్రోక్షణ పూజలు మొదలుపెట్టారు. ► 11.22: విమాన గోపురం వద్ద కేసీఆర్, ఇతరులకు ఆశీర్వచనం చేశారు. ► 11.27: మంత్రులు, ప్రజాప్రతినిధులు వారికి కేటాయించిన గోపురాలు, ప్రాకార మండపాల వద్ద సంప్రోక్షణ పూజలు ప్రారంభించారు. ► 11.32: ఆచార్యులు సీఎం కేసీఆర్‌కు కంకణధారణ చేసి.. సుదర్శన చక్రానికి పూజలు చేశారు. ► 11.50: కేసీఆర్ గోత్రనామాలతో పూజలు చేస్తూ మహాకుంభ సంప్రోక్షణ చేసే బంగారు కలశాన్ని ఆయనకు అందించారు. ► 11.55: విమాన గోపురానికి ఏర్పాటు చేసిన స్వర్ణ సుదర్శన చక్రానికి సీఎం కేసీఆర్.. మిగతా గోపురాలకు మంత్రులు ఏకకాలంలో కుంభ సంప్రోక్షణ నిర్వహించారు. ► 11.58: సుదర్శన చక్రం చుట్టూ ప్రదక్షిణలు చేసి, హారతి ఇచ్చారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు కల్యాణకట్టలో తలనీలాలు.. యాదగిరిగుట్ట: లక్ష్మీనర్సింహుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అధునాతనంగా నిర్మించిన కొత్త కల్యాణకట్టను చూసి ఆనందం వ్యక్తం చేశారు. అధికారులు తిరుమల తరహాలో భక్తులకు టోకెన్లు ఇచ్చి.. తలనీలాలు తీసేచోటికి పంపా రు. దర్శనానికి వచ్చిన భక్తులంతా కొండ కింద నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు అచరించారు. పుష్కరిణి మధ్య ఏర్పాటు చేసిన దేవతామూర్తులకు పూజలు చేశారు. అనంతరం దర్శనం కోసం కొండపైకి వెళ్లారు. ప్రత్యేక బందోబస్తు మధ్య..: యాదాద్రి ప్రధానాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది మహాద్భుతం యాదగిరిగుట్ట, రాజాపేట, మోటకొండూర్: యాదాద్రి ఆలయం తెలంగాణకే మకుటాయమానమని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో పాలుపంచుకోవటం ఆనందదాయకమని చెప్పా రు. యాదాద్రి ఆలయం అద్భుతమని, పునః ప్రారంభ క్రతువులో పాల్గొనడం సంతోషంగా ఉందని మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత చెప్పారు. పువ్వాడపై తేనెటీగల దాడి యాదాద్రి ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి పువ్వాడ అజయ్, వేద పండితులపై ఉదయం 11:45 సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. అలాగే సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించిన ఆయన.. అనంతరం హైదరాబాద్ వెళ్లి ప్రాథమిక చికిత్స పొందారు. ఈ ఆనందంచెప్పలేనిది మేం గత 30 ఏళ్లుగా ప్రతినెలా యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటాం. ఆలయ పునః నిర్మాణం చేపట్టి స్వయంభూ దర్శనం నిలిపివేయడంతో ఆరేళ్లుగా బాలాలయంలో దర్శనం చేసుకుంటున్నాం. ఇప్పుడు తొలిరోజే స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆలయం వైభవోపేతంగా రూపుదిద్దుకుంది. వైకుంఠంలో స్వామి వారిని దర్శించుకున్న అనుభూతి కలిగింది. –భాగ్యలక్ష్మి, సికింద్రాబాద్ మేం ఒకరోజు ముందే యాదాద్రికి వచ్చి వేచి ఉన్నాం. తొలిరోజు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనంతో మనసు పులకరించింది. నల్లరాతి కట్టడం, శిల్పాలు, అలంకరణ కనువిందుగా ఉన్నాయి. ఆలయం మరో తిరుపతిలా ఎంతో బాగుంది. – వెంకటమ్మ, పరిగి నాలుగేళ్ల కింద స్వామివారిని బాలాలయంలో దర్శించుకున్నాం. ఇప్పుడు నూతన ఆలయం, స్వయంభూ దర్శనం మొదలవడంతో కుటుంబ సమేతంగా వచ్చాం. సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ బస్సులో కొండపైకి చేరుకున్నాం. 30 నిమిషాల్లో స్వామివారి దర్శనం లభించింది. ఇది ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆలయ నిర్మాణం చాలా బాగుంది. – లక్ష్మి, సంగారెడ్డి -
యాదాద్రి: మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
యాదాద్రి: మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్
Updates సీఎం కేసీఆర్‌కు ఘన సన్మానం వైటీడీఏ, దేవస్థానం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వైస్ ఛైర్మన్ కిషన్‌రావు, ఈవో ఘనంగా సన్మానించారు. అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం కేసీఆర్ సన్మానించారు. ఆర్కిటెక్ ఆనందసాయి, ప్రధాన స్తపతి సుందర్ రాజన్, ఈవో గీతారెడ్డి, రుత్వికులు, పూజారులను సీఎం సన్మానించారు. తొలి పూజ నిర్వహించిన సీఎం కేసీఆర్ నరసింహస్వామివారి ప్రధాన ఆలయ ముఖద్వారాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం నరసింహస్వామివారిని మొదటి దర్శనం చేసుకున్నారు. స్వామివారి గర్భాలయంలో తొలి పూజ నిర్వహించారు. 11.56AM యాదాద్రి మహా కుంభ సంప్రోక్షణ క్రతువు. మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ దంపతులు. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి కేసీఆర్ ప్రత్యేక పూజలు. పవిత్ర జలాలతో అభిషేకం చేసిన సీఎం కేసీఆర్ దంపతులు. సుదర్శన స్వర్ణ చక్రానికి యాగ జలాలతో సంప్రోక్షణ. కేసీఆర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేసిన అర్చకులు 10: 57AM సప్త రాజగోపురాల కళాశాల వద్ద సిద్ధంగా ఉన్న వేద పండితులు, మంత్రులు. దివ్య విమాన గోపురం సుదర్శన చక్రం వద్ద మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొన్న సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మనుమడు హిమాన్ష్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్. మహా కుంభ సంప్రోక్షణకు హాజరైన సీఎం కేసీఆర్ కూతురు కవిత, 15 మంది మంత్రులు, శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, విప్స్, ఎమ్మెల్సీలు. 10:14AM యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాలయం నుంచి యాత్ర ప్రారంభం కాగా, ఇందులో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.మంగళవాయిద్యాల నడుమ శోభయాత్ర కొనసాగుతోంది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు మంత్రులు జగదీష్ రెడ్డి, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వడ అజయ్ కుమార్, విప్ గొంగిడి సునీత తదితరులు యాదాద్రికి చేరుకున్నారు. ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ మొదలవుతుంది. ఆలయ పూజారులు, రుత్వికులు, వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఏకకాలంలో మహాకుంభ సంప్రోక్షణ జరుగుతుంది. గోపురాలు, దైవ సన్నిధులు, ఉప ఆలయాలు, ప్రాకార మండపాల వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, ఉన్నతాధికారులు సంప్రోక్షణలో పాల్గొంటారు. తర్వాత గర్భాలయంలో సీఎం కేసీఆర్ తొలి పూజ చేస్తారు. అర్చకులు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేస్తారు. అనంతరం ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సీఎం సన్మానిస్తారు. ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని యాగశాల స్థలం వద్ద మధ్యాహ్న భోజనాలు చేస్తారు. యాదాద్రీశుడి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాదాద్రికి వచ్చే వాహనాల విషయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల వాహనాలను యాదగిరిగుట్టకు సమీపంలోని వడాయిగూడెం వద్ద నిలపాలి. కీసర, సిద్దిపేట, గజ్వేల్, తుర్కపల్లి నుంచి వచ్చే భక్తుల వాహనాలను మల్లాపురం వద్ద ఆపేస్తారు. రాజాపేట వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని స్పెక్ట్రా వెంచర్లో నిలపాలి. వరంగల్, జనగాం, ఆలేరు నుంచి వచ్చే భక్తుల వాహనాలను వంగపల్లి సమీపంలో నిలిపివేస్తారు. ఈ వాహనాలన్నింటినీ మధ్యాహ్నం 3 గంటల తర్వాతే యాదగిరిగుట్ట పట్టణంలోకి అనుమతిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మూడు వేల మందితో బందోబస్తు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సహా పెద్ద సంఖ్యలో వీఐపీలు పాల్గొంటుండటంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట పట్టణం, రాయగిరి నుంచి వచ్చే రహదారి, చుట్టుపక్కల ప్రాంతాలు, రింగ్‌రోడ్డు, కొండపైన కలిపి సుమారు మూడు వేల మంది పోలీసు సిబ్బంది పహరా కాస్తున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సివిల్ పోలీసులతోపాటు ట్రాఫిక్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఐటీ, ఇంటెలిజెన్స్, ఎస్బీ, షీటీం విభాగాల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు. బాంబ్, డాగ్ స్వా్కడ్ బృందాలతో ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇక యాదగిరిగుట్ట పట్టణం, యాదాద్రి కొండ, వీఐపీలు పర్యటించే ప్రాంతాల్లో కలిపి 442 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా పట్టణంలో వెబ్ కాస్టింగ్ వాహనంతో పరిశీలన జరుపుతున్నారు. 3 గంటలదాకా ‘గుట్ట’బయటే.. యాదాద్రీశుడి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతించనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాదాద్రికి వచ్చే వాహనాల విషయంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ♦సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల వాహనాలను యాదగిరిగుట్టకు సమీపంలోని వడాయిగూడెం వద్ద నిలపాలి. ♦కీసర, సిద్దిపేట, గజ్వేల్, తుర్కపల్లి నుంచి వచ్చే భక్తుల వాహనాలను మల్లాపురం వద్ద ఆపేస్తారు. ♦రాజాపేట వైపు నుంచి వచ్చే భక్తుల వాహనాలు ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని స్పెక్ట్రా వెంచర్లో నిలపాలి. ♦వరంగల్, జనగాం, ఆలేరు నుంచి వచ్చే భక్తుల వాహనాలను వంగపల్లి సమీపంలో నిలిపివేస్తారు. ఈ వాహనాలన్నింటినీ మధ్యాహ్నం 3 గంటల తర్వాతే యాదగిరిగుట్ట పట్టణంలోకి అనుమతిస్తారు. పూర్తిస్థాయిలో భద్రత యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్‌తోపాటు ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ మేరకు పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశాం. దర్శనాల కోసం భక్తులు మధ్యాహ్నం 3గంటల తర్వాతే రావాలి. ప్రతి భక్తుడు క్యూ కాంప్లెక్స్ వద్ద జియో ట్యాగింగ్ చేసుకోవాలి. తర్వాత క్యూకాంప్లెక్స్‌లో నుంచి తూర్పు రాజగోపురం ద్వారా దర్శనాలకు వెళ్లవచ్చు. అనంతరం ప్రసాదాలు కొనుగోలు చేసి బస్సులో కొండ దిగాలి. –మహేశ్ భగవత్, రాచకొండ పోలీస్ కమిషనర్ వీఐపీలు, ఉద్యోగుల వాహనాల పార్కింగ్ ఇలా.. ♦వీఐపీల వాహనాలను టెంపుల్ సిటీకి వెళ్లే మార్గంలో ఉన్న మున్నూరుకాపు సత్రం వద్ద నిలపాల్సి ఉంటుంది. ♦యాదాద్రి క్షేత్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, మీడియా, ఆచార్యుల వాహనాలను పాత గోశాలలోని సత్యనారాయణస్వామి వ్రత మండపం వద్ద నిలపాలి. ♦ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలను తులసీ కాటేజీలో పార్కింగ్ చేయాలి. -
ఇస్కాన్ సంకల్పం
-
అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించిన సీఎం జగన్
-
51 ప్రాజెక్టులకు ముందడుగు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గురువారం శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే...: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు. మీ దార్శనికత, ముందుచూపు ఈ దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా చోటు దక్కించుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్స్ కార్యక్రమం మీరు చేస్తున్న అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయిలా చేరింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మీరు రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖలను అత్యంత నేర్పరితనంతో, వేగవంతంగా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. పెరిగిన జాతీయ రహదారుల పొడవు మీ హయాంలో రహదారుల నిర్మాణం 2014లో రోజుకు 12 కిలోమీటర్ల స్ధాయి నుంచి ప్రస్తుతం మన మాట్లాడుకుంటున్నట్టు 37 కిలోమీటర్ల స్ధాయికి చేరుకుంది. మా రాష్ట్రంలో మీ సమర్ధవంతమైన పనుల వల్ల జాతీయరహదారుల పొడవు 2014లో ఉన్న 4193 కిలోమీటర్ల నుంచి 95 శాతం గ్రోత్ రేటుతో నేడు 8163 కిలోమీటర్లకు చేరింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 51 ప్రాజెక్టులు ముందడుగు కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మొత్తం 51 ప్రాజెక్టులకు సంబంధించి ముందడుగులు పడుతున్నాయి. ఇందులో రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించిన 741 కిలోమీటర్ల పొడవైన 30 రహదారుల పనులకు శంకుస్ధాపనతో పాటు, ఇప్పటికే రూ.11,157 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మరో 21 రహదారులను ఇవాళ ప్రారంభిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీ గారికి, ప్రత్యేకించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద రద్దీను దృష్టిలో ఉంచుకుని మరో ఫ్లైఓవర్ నిర్మించాలని 2019 ఆగష్టులో నేను విజ్ఞప్తి చేశాను. ఆ మేరకు మంత్రి గడ్కరీ వెంటనే మంజూరు చేసి, 2020లోనే నిర్ణయం తీసుకుని,ఆ పై నిర్మాణ పనులు కూడా వేగవంతం చేసి.. ఆ ఫ్లైఓవర్‌ను కూడా గౌరవ కేంద్రమంత్రి ప్రారంభిస్తుండటం చాలా సంతోషం. గతంలో ఇదే విజయవాడలో 2019లో మనం అధికారంలోకి వచ్చేనాటికి కూడా పూర్తికాని బెంజ్ సర్కిల్లోని తూర్పున ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గడ్కరీ సహకారంతో వాయువేగంతో పూర్తి చేయగలిగామని సంతోషంగా చెపుతున్నాం. రూ.10,600 కోట్లతో పనులు రాష్ట్రంలో జాతీయరహదారుల విస్తరణ, అభివృద్ది, నిర్మాణంలో వీటి అన్నింటికి సంబంధించి అత్యంత చొరవతో మన ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. భూసేకరణతో పాటు ఎక్కడ ఏ సమస్య కూడా తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ... రహదారుల నిర్మాణం వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు మనం తీసుకుంటున్నాం. ఇదే సందర్భంలో మరో విషయం కూడా చెప్పాలి. రాష్ట్రంలోని మిగిలిన రహదారులు అంటే.. జాతీయరహదారులు కాకుండా మిగిలిన రహదారులకు సంబంధించిన పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగవంతంగా అడుగులు ముందుకేస్తోంది. ఇందుకోసం మనం రూ.10,600 కోట్లు కేటాయించాం. ఇప్పుడే ఆర్ అండ్ బి కార్యదర్శి కృష్ణబాబు ఆ రూ.10,600 కోట్లకు సంబంధించిన పనుల వివరాలన్నీ చెప్పారు. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి కనెక్టవిటీ ప్రతి మండల కేంద్రం నుంచి కూడా జిల్లా కేంద్రం వరకు రెండు లైన్ల రోడ్లుగా మారుస్తూ... దాదాపుగా రూ.6,400 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. పూర్తిగా రోడ్లన్నీ కూడా రిపేర్లు, మెయింటైనెన్స్ చేయడం కోసం మాత్రమే మరో రూ.2300 ఖర్చు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న ప్రతి రోడ్డు పూర్తి చేసేందుకు మరో రూ.1700 కోట్లు ఖర్చుతో కలిపి రూ.10,600 కోట్లకు సంబంధించిన రహదారి పనులకు శ్రీకారం చుట్టాం. ఇందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇక రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున మీరు చేసిన మంచి పనులన్నింటికీ కూడా ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి రాజకీయాలు లేకుండా ప్రజల మందుర మీకు మా సంతోషాన్ని, కృతజ్ఞతలూ తెలియజేస్తున్నాను. ఇవాళ మరికొన్ని రోడ్ల నిర్మాణం కూడా ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని విజ్ఞప్తి చేస్తూ.. మీ ఆమోదం కోసం కొన్ని ప్రతిపాదనలను మీ ముందు ఉంచుతున్నాను. మరికొన్ని ప్రతిపాదనలు విశాఖతీరంలో విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి– భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రహదారి నిర్మాణం. రుషికొండ, భీమిలి కొండలను, సముద్ర తీరాన్ని తాకుతూ పర్యాటక రంగానికే వన్నె తెచ్చే విధంగా .. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు కనెక్ట్ చేసే విధంగా నేషనల్ హైవే 60ను కలుపూతూ 6 లేన్ల రహదారి చాలా అవసరం అని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే విజయవాడ తూర్పున బైపాస్... కృష్ణానదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం అవసరం. నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఈ బైపాస్ చాలా అవసరం అవుతుంది. మీరు వెస్ట్రన్ బైపాస్కు శాంక్షన్ ఇచ్చారు, ఈస్ట్రన్ బైపాస్కు కూడా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధాన జాతీయ రహదారులు నగరం గుండా వెళ్తుండడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటికీ కూడా ఈ రెండు బైపాస్‌లు పరిష్కారమార్గాలవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ రహదారులుగా.. అలాగే వైఎస్సార్ కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టికల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారి.. వీటన్నింటినీ కూడా జాతీయ రహదారులగా గుర్తించి అభివృద్ది చేయాలని మనసారా కోరుతున్నాను. నిండుమనస్సుతో మీరు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే తెలుగువారైన మన కిషన్ రెడ్డి గారు కూడా.. మన రాష్ట్ర అభివృద్ది కొరకు నాలుగడుగులు ఎప్పుడూ ముందుకు వేస్తూనే ఉన్నారు. ఆయన కూడా మరింత చొరవ చూపాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చివరిగా.. ఈ ప్రతిపాదనలన్నింటినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయరహదారుల శాఖకు పంపించాం. గడ్కరీ దయచేసి వీటన్నింటినీ పరిశీలించి, పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మరోవైపు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇటీవలే రాష్ట్ర రహదారులపై ఆర్ఓబీల నిర్మాణాలకు సంబంధించి కేంద్రం అడిగిన 20 ప్రతిపాదనలు సిద్ధం చేశాం. దీనికి సంబంధించి కూడా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్నాం. వీటన్నింటితో పాటు మంచి చేస్తున్న మంచి వారికి ఎప్పుడూ మంచి జరగాలని ఆశిస్తూ.. కోరుకుంటూ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు కూడా మనందరి ప్రభుత్వానికి కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, కె నారాయణస్వామి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి ఫలితం.. దశాబ్దాల కల సాకారం
సాక్షి, పుంగనూరు: పలమనేరు–పుంగనూరు బైపాస్ రోడ్డు కోసం సుమారు ముప్పై ఏళ్లుగా స్థానికులు ఎదురుచూస్తున్నారు. పూర్తిగా సిద్ధమైన ఈ రహదారిని 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కీలకపాత్ర పోషించిన ఎంపీ మిథున్‌రెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి 2017లోనే పుంగనూరు–పలమనేరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి నడుంబిగించారు. కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో పలుమార్లు చర్చించి రోడ్డు నిర్మాణానికి రూ.309 కోట్లు విడుదల చేయించారు. అనంతరం 55 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మామూళ్ల కోసం కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెట్టి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఎంపీ మిథున్‌రెడ్డి త్వరితగతిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించేందుకు చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులను పరుగులు పెట్టించి మరీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ క్రమంలో దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చదవండి: (చిరంజీవికి సీఎం అత్యంత గౌరవమిచ్చారు) ఇదీ మార్గం పలమనేరు రోడ్డులోని అరబిక్ కాలేజీ నుంచి పుంగనూరు బైపాస్ ప్రారంభమవుతుంది. చదళ్ల సమీపంలోని తిరుపతి రోడ్డు మీదుగా ఎంబీటీ రహదారిలోని భీమగానిపల్లె వద్ద కలుస్తుంది. పెంచుపల్లె, బండ్లపల్లె, బాలగురప్పపల్లె, మేలుపట్ల, భగత్‌సింగ్‌కాలనీ, రాగానిపల్లె, రాంపల్లె, దండుపాళ్యం మీదుగా రోడ్డు సాగుతుంది. బైపాస్ రోడ్డు నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరకు రెక్కలు రావడంతో రియల్ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. పుంగనూరుకు తలమానికం ఎంపీ మిథున్‌రెడ్డి అవిరళ కృషితోనే బైపాస్ నిర్మాణం పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డు పనులు ముందుకు సాగకుండా ఏళ్ల తరబడి అడ్డుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ రహదారి ప్రజలకు ఎంతో ఉపయోగకరం. – ఎస్.ఫకృద్ధీన్ షరీఫ్, పుంగనూరు -
జనగామలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవం
-
కేసీఆరే నిజమైన అంబేడ్కర్‌వాది
సాక్షి, మహబూబ్‌నగర్: ‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చూపిన మార్గంలో 14 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ సాధించిన వ్యక్తి సీఎం కేసీఆర్.. డాక్టర్ బాబాసాహెబ్ గారినే కేసీఆర్ అవమానించిండు అని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.. కేంద్ర బడ్జెట్‌పై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము లేక విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ కంటే నిజమైన అంబేడ్కర్‌వాది ఎవరూ లేరు’అని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్‌లో రైతు వేదిక, 40 డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో సీఎం మాట్లాడారని.. తెలంగాణకు నిధుల కేటాయింపు విషయమై ప్రశ్నించారని.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే కేంద్రం నుంచి ఉలుకూపలుకు లేదన్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా లేక, విషయ పరిజ్ఞానం లేక, భావ దారిద్య్రంతో కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్లు కొందరు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే దేశమంతా ‘దళితబంధు’ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ప్రధానమంత్రిని ప్రత్యేకంగా రాష్ట్రానికి పిలిచి సన్మానం చేస్తామన్నారు. తెలంగాణనూ సమదృష్టితో చూడాలని కోరుకుంటా.. ‘నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటా’అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వయంగా చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 105 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశాయన్నారు. ఇది అంబేడ్కర్‌ను అవమానించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి రాజ్యాంగ సవరణకు ఒక కమిటీ వేశారని, మోహన్ భాగవత్ కొత్త రాజ్యాంగం కావాలన్నారని.. వారు కూడా రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లా అని నిలదీశారు. ‘ప్రధాని మోదీ శనివారం సమతామూర్తి విగ్రహాన్ని అవిష్కరించేందుకు వస్తున్నారు. ఆయన కలలోకి వెళ్లి తెలంగాణను కూడా సమదృష్టితో చూడాలని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కర్ణాటక, మహారాష్ట్రలతో సమానంగా తెలంగాణను చూడాలని ఆ రామానుజచార్యుల వారిని కోరుకుంటా’అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సహకరించడం లేదు.. ‘విద్య విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. దేశంలో 150 మెడికల్ కాలేజీలు, 8 ఐఐఎం కళాశాలలు, వందకు పైగా నవోదయ పాఠశాలలు మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పొరాడు అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాధించింది కేసీఆరే. కేంద్రం కలసి వచ్చినా రాకపోయినా ప్రజాశీర్వాదంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి కేటీఆర్ -
భద్రతా వలయంలో శ్రీరామనగరం.. అడుగడుగునా పోలీసు నిఘా
సాక్షి, శంషాబాద్: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్న సందర్భంగా ఎస్పీజీ అధికారులు బుధవారం ఉదయం విగ్రహ ప్రాంగణంతో పాటు యాగశాలను సందర్శించారు. ఎస్పీజీ డీఐజీ నవనీత్‌కుమార్ రాష్ట్ర పోలీసులతో కలిసి అక్కడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన భద్రత సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూం సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్ కంట్రోల్ రూంను పూర్తి స్తాయిలో సిద్ధం చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్ కంట్రోల్ రూం పనిచేయనుంది. ఎస్పీజీతో పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో వీరు నిరంతరం నిఘా కాస్తున్నారు. ఉత్సవాలకు ప్రత్యేక అశ్వాలు సమతామూర్తి సహస్రాబ్ధి సమరోత్సాహ వేడుకల్లో పూజా కార్యక్రమాల్లో దేవతా మూర్తుల రథోత్సవం వేళ ముందుగా నడిపించేందుకు ఏపీలోని కడప వ్యాసాశ్రమం నుంచి రెండు శ్వేత రంగు అశ్వాలను తీసుకొచ్చారు. రంగ, గోధ అనే పేర్లుగల ఈ అశ్వాలను ఆశ్రమంలో దేవతామూర్తుల బయటికి తీసుకొచ్చే సమయంలో ముందుగా నడిపిస్తుంటారు. వీటితో పాటు చిన్న జీయర్ ఆశ్రమంలో ఉన్న మరో అశ్వం యతి కూడా ఉత్సవాల్లో పాల్గొననుంది. ఈ అశ్వాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సమరోత్సాహ భక్తి ‘స్వీయ చిత్రం’ సమతామూర్తి సమారోహ వేదికలో స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి వచ్చిన మహిళలు వీరు.. యాగశాల వద్ద నరసింహస్వామి అవతారంలో ఓ వ్యక్తి తిరుగుతుండడంతో కొందరు వలంటీర్లు ఆయనకు దండం పెడుతుండగా.. మరికొందరు మహిళలు సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యం. (క్లిక్: 13 తర్వాతే సందర్శకులకు అనుమతి) యాగశాలకు చేరుకున్న ఛత్రీలు.. యాగశాల వద్దకు బుధవారం కూడా వరుసగా ప్రత్యేకంగా తయారు చేయించిన ఛత్రీలు చేరుకున్నాయి.. వాటిని తయారు చేసిన కార్మికులు కొందరు యాగశాల వరకు మోసుకుంటూ తీసుకెళ్లారు. (చదవండి: వెయ్యేళ్ల సమతాస్ఫూర్తి.. రామానుజ సమతా కేంద్రం నిర్మాణం..) టీటీడీ ప్రత్యేక సేవలు ముచ్చింతల్‌లో జరుగుతున్న సహస్రాబ్ధి సమారోహ్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం తమ వంతు పాత్ర పోషిస్తోంది. ప్రాంగణంలో తిరుమల తిరుపతి ప్రాసస్త్యం, తిరుమల నాడు–నేడు వ్యత్యాసాలు తెలిపే పలు ఛాయా చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిత్ర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల కార్యక్రమాల్లో సహకరించేందుకు తితిదే సిబ్బంది 35 మంది రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. వీరు కాక దాదాపు 500 మంది వేద పారాయణం చేసేవారు, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఆర్టిస్టులు, హరికథ కళాకారులు, మంగళవాద్యాలు మోగించే కళాకారులు 15 మంది వచ్చారు. వీరి కార్యకలాపాలను తితిదే తెలంగాణ ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. ఆకట్టుకున్న శోభాయాత్ర సమతా కేంద్రంలో బుధవారం ఉదయం తొలిరోజు నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం ఆకట్టుకుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ చంద్ర, జై హనుమాన్ నినాదాలతో వేలాది మంది భక్తులు, పండితులు పాల్గొన్న ఈ యాత్ర కనుల పండుగగా సాగింది. ఈ యాత్రకు త్రిదండి చిన జీయర్‌స్వామి సారథ్యం వహించారు. వందలాదిగా రుత్వికులు వేద మంత్రోచ్చారణలు చేస్తూ ఏడుగురు పూజ్య జీయర్లను అనుసరించారు. భక్తుల భజనలకు తోడుగా కోలాట నృత్యాలు ఆహ్లాదపరిచాయి. అనంతరం వాస్తు పూజ, పుణ్యహవచనం జరిగాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
108 దివ్య దేశ దివ్యాలయాల ప్రతిష్ఠా మహోత్సవం (ఫోటోలు)
-
వాసవి మాత దర్శనం చేసుకున్న మంత్రి వెల్లంపల్లి
-
ప్రారంభోత్సవానికి సిద్ధం!
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరిగే ఉద్ఘాటనకు రావాలని సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీని కలిసి కోరిన నేపథ్యంలో పనుల్లో వేగం పెరిగింది. సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఈనెల 20 తేదీ వరకు తుది దశ పనుల పర్యవేక్షణకు యాదాద్రికి మరోసారి రానున్నారు. మహా సుదర్శనయాగం నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలను సీఎం పర్యవేక్షించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ముందు శాస్త్రోక్త కార్యక్రమాలకు సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. నూతన ఆలయంలో స్వయంభూ శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారి దర్శనం భక్తులకు కల్పించే ముందు శాస్త్రోక్తంగా ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల దిశానిర్దేశం కోసం దేవస్థానం ఈవో గీతారెడ్డి, ఉప ప్రధానాచార్యులు త్రిదండి చినజీయర్‌స్వామిని కలిశారు. ఆయన పనుల ఒత్తిడిలో ఉండటంతో రెండు రోజుల తర్వాత మరోసారి రావాలని కోరారు. దీంతో మరోసారి జీయర్ స్వామిని కలిసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. -
సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతే నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2021ను ఆదివారం ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎంపిక చేసిన 105 ఆవిష్కరణలు తోటి భారతీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వందకంటే ఎక్కువ ఆవిష్కర్తలు వర్చువల్ షోకేస్ ద్వారా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంకేతికత, రవాణా, నీరు, ఆరోగ్య రంగాల్లో పాఠశాల విద్యార్థుల నుండి ఇళ్లల్లో తయారీదారుల వరకు, మెకానిక్ నుండి రైతు వరకు వందకి పైగా ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆవిష్కరణలను ప్రజలు www.teamtsic.telangana,gov.in/intinta-innovator-exhibition-2021 పోర్టల్‌లో సందర్శించవచ్చు. ఈ కార్యక్రమం కోసం 33 జిల్లాల సైన్స్ అధికారులు జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. హైదరాబాద్ నుంచి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. -
బాలానగర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. రూ.387 కోట్లతో 1.13 కి.మీ. పొడవుతో ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. 6 లైన్లు, 24 మీ. వెడల్పు, 26 పిల్లర్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ప్రారంభోత్సవ క్యార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభంతో స్థానికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫ్లైఓవర్ ప్రారంభం అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కూకట్పల్లి-సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. త్వరలో రహదారుల విస్తరణ చేపడతామన్నారు. ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు స్కైవే నిర్మిస్తామని తెలిపారు. ఫతేనగర్ ఫ్లైఓవర్‌ను విస్తరిస్తామని కేటీఆర్ వెల్లడించారు. 2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ.387 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. బ్రిడ్జి ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. రెండు డివిజన్లతో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు, 24 మీటర్లు వెడల్పు 26 పిల్లర్లతో నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఒక ప్రత్యేకత ఉంది. హైదరాబాద్ నగరంలోని అతి ప్రధాన రహదారుల్లో ఒకటి, 6 లేన్లతో సిటీలోనే నిర్మించిన మొట్టమొదటి బ్రిడ్జి ఇది. -
డిజైన్ లైబ్రరీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన నటి మన్నారా చోప్రా
-
సిరిసిల్ల సర్కారు బడి.. మెరుగుబడి!
-
ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: నూతన పార్లమెంటు శంకుస్థాపనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. నూతన పార్లమెంట్ నిర్మాణానికి గురువారం ఢిల్లీలో శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా కేసీఆర్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక పేర్కొన్నారు. ప్రజలందరికీ గర్వకారణమైన ఈ పార్లమెంటు నిర్మాణం ఎప్పుడో జరగాల్సి ఉందని, ప్రస్తుతం వినియోగంలో ఉన్న సదుపాయాలు విదేశీయుల చరిత్రతో ముడిపడి ఉన్నాయని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
కేసీఆర్ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధం
సాక్షి, వరంగల్: ‘నలభై ఏండ్ల నా రాజకీయ జీవితంలో అందరూ నన్ను వాడుకున్నారు. ఏ ఒక్కరూ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దయవల్ల నాకు మంత్రి పదవి వచ్చింది. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమే’అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం కొడకండ్లలో రైతువేదిక ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో మంత్రి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని బాగు చేసుకుంటున్నానని, రాజకీయంగా తగిన గుర్తింపు, స్థాయినిచ్చిన కేసీఆర్ ఆశీర్వాదం తనకు ఎల్లప్పుడూ ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి రాదని నమ్ముతున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు. కాకతీయులను మించిన మహానుభావుడు తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యాలను సుసాధ్యం చేసిన అపర భగీరథుడు, కాకతీ య రాజులను మించిన మహానుభావుడు కేసీఆర్.. అని మంత్రి ఎర్రబెల్లి దయా కర్రావు సీఎంను కొనియాడారు. అహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్న సీఎంని మనందరం గుండెల్లో పెట్టుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ అంతా కరువు ప్రాంతంగా ఉండేదని, తాను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పు డు చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, ఎస్సారెస్పీ ఎండిపోయి తుమ్మ చెట్లు మొలిచాయని, దేవాదుల పూర్తికాలేదని గుర్తుచేశారు. రైతుల పేరు చెప్పుకుని గతంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, సాగునీరు, విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో దేవాదుల పూర్తి చేసుకుని చెరువులను నింపుకున్నామని, ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు వస్తున్నాయని, దండగన్న వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతుబిడ్డ సీఎం కావడంవల్లనే ఇదంతా సా«ధ్యమైందని, రైతుల జీవితాల్లో కేసీఆర్ గొప్ప మార్పు తీసుకొచ్చారన్నారు. సీఎం కేసీఆర్ దయవల్ల పాలకుర్తి నియోజకవర్గానికి సాగునీరు వచ్చిందని తెలిపారు. కొత్త ఒరవడికి శ్రీకారం సాక్షి, జనగామ: రైతు వేదికల నిర్మాణంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. ఇది భారతదేశ చరిత్రలోనే నిలిచి పోయే రోజు. అన్నం పెట్టే రైతన్నను ఏడు దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోలేదు. కారణజన్ముడైన కేసీఆర్.. రైతులు అడగక ముందే అన్నీ ఇస్తున్నారు. రైతు వేదిక ప్రారంభం సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం. రక్తం పారిన నేలలో సీఎం కేసీఆర్ నీళ్లు పారిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల ఎకరాల పంట పండుతోంది. రైతు పండించే ప్రతీ గింజ, తెల్లని పత్తిలో కేసీఆర్ కనిపిస్తున్నారు. కవి దాశరథి చెప్పినట్లుగా ఇప్పుడు కరువు కాటకాలు కనిపించడం లేదు. కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణ సమాజం కన్న కలలను సీఎం నిజం చేస్తున్నారు. – సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయాన్ని పండుగ చేశారు కొందరు ముఖ్యమంత్రులు వ్యవసాయాన్ని దండగ చేస్తే కేసీఆర్ పండుగ చేశారు. రైతు పక్షపాతి, రైతు ప్రేమికుడు కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ వస్తే కరెంటు రాదని కొందరు ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్ చొరవతో 24 గంటల కరెంటు వస్తోంది. 1.65 లక్షల మంది రైతు బంధు సైనికులకు బాధ్యత వహించడమే కాకుండా సీఎంకు దగ్గరగా ఉండే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిను ఐటీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 184 కోట్ల రూపాయల వ్యయంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిని చేరుకునేందుకు నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్‌ను కూడా కేటీఆర్ ప్రారంభించారు. దీనికి ‘పెద్దమ్మతల్లి ఎక్స్‌ప్రెస్ వే’గా పేరు పెట్టారు. (దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఇక రయ్ రయ్) కేబుల్ బ్రిడ్జి వివరాలు.. కేబుల్ బ్రిడ్జి మొత్తం పొడవు (అప్రోచెస్ సహా) :735.639 మీటర్లు ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే బ్రిడ్జి పొడవు: 425.85 మీటర్లు (96+233.85+96) అప్రోచ్ వయాడక్ట్+సాలిడ్ ర్యాంప్: 309.789 మీటర్లు క్యారేజ్ వే వెడల్పు: 2x9 మీటర్లు (2x3 లేన్లు) ఫుట్‌పాత్ : 2x1.8 మీటర్లు స్టే కేబుల్స్ 56 (26x2) ప్రాజెక్ట్ వ్యయం: రూ.184 కోట్లు నిర్మాణ సంస్థ: ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ -
సౌర విద్యుత్‌తో వెలుగు రేఖలు
సాక్షి, న్యూఢిల్లీ : 21వ శతాబ్ధంలో ఇంధన అవసరాలు తీర్చడంలో సౌర విద్యుత్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సౌర విద్యుత్ నాణ్యతతో పాటు భద్రతతో కూడినదని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని రెవాలో 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రధానమంత్రి మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. ఏటా 15 లక్షల టన్నుల విలువైన కార్బన్ డయాక్సైడ్తో సమానమైన వాయువుల విడుదలను ఈ ప్లాంట్ తగ్గిస్తుందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. రెవాలో సౌర విద్యుత్ ప్లాంట్ రాకతో ఈ ప్రాంత పరిశ్రమలకు విద్యుత్ సరఫరాతో పాటు ఢిల్లీ మెట్రో రైల్‌కు కూడా ఈ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. షాజపూర్, నీముచ్, చత్తార్పూర్లో కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ల పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ దశాబ్ధంలోనే రెవాలో సోలార్ ప్లాంట్ ద్వారా ఈ ప్రాంతం శభారీ ఇంధన హబ్‌గా ఎదుగుతుందని ఆయన ఆకాంక్షించారు. చదవండి : భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి -
విమానయాన రంగానికి ఉజ్వల భవిష్యత్తు
సాక్షి, హైదరాబాద్: దేశంలో పౌర విమానయాన రంగం తాత్కాలికంగా కొన్ని ఒడిదుడుకులకు లోనవుతున్నా ఈ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. భాగస్వామ్య పెట్టుబడులతో విమానయాన రంగం బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) సహకారంతో ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (ఎఫ్ఎస్టీసీ) హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పైలట్ శిక్షణ కేంద్రాన్ని కేటీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎనిమిది విమానాలు నిలిపే సామర్థ్యమున్న (8–బే) పైలట్ ట్రైనింగ్ సెంటర్లో ఇప్పటికే ఏ–320 నియో, బాంబార్డియర్ డాష్–8, ఏటీఆర్ 72–600 సిమ్యులేటర్లను హైదరాబాద్ బేలో ఏర్పాటు చేయగా ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లోనూ ఇప్పటికే మరో ఐదు సిమ్యులేటర్లను ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసిందన్నారు. గురుగ్రాం, హైదరాబాద్‌లో ఏర్పాటైన ఎఫ్ఎస్టీసీ శిక్ష ణ కేంద్రాల ద్వారా పైలట్లకు అత్యాధునిక శిక్షణ సాధ్యమవుతుందన్నారు. స్వల్ప వ్యవధిలో తక్కువ ఖర్చుతో అత్యాధునిక శిక్షణ లభిస్తుండటంతో ఆగ్నేయాసియా దేశాలకు చెందిన వైమానిక సంస్థలతోపాటు దేశీయ సంస్థలు కూడా భారత్‌లో శిక్షణ భాగస్వాములుగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నాయ న్నారు. ఎఫ్ఎస్టీసీని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ సిమ్యులేటర్‌ను కాసేపు సరదాగా నడిపారు. 2011లో ఎఫ్ఎస్టీసీ ప్రస్థానం ప్రారంభం... వైమానిక రంగంలో ప్రాంతీయ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఏర్పాటైన ఎఫ్ఎస్టీసీ 2012లో ఎయిర్‌బస్ ఏ– 320, బోయింగ్ బి–737 సిమ్యులేటర్లను అందుబాటులోకి తెచ్చింది. కార్యకలాపాలను విస్తరించుకుంటూ 2015లో యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ గుర్తింపు కూడా పొందింది. 2018లో హైదరాబాద్ శిక్షణ కేంద్రాన్ని శంకుస్థాపన చేయడంతోపాటు గుజరాత్ ఫ్లయింగ్ క్లబ్ నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఇప్పటికే 1,100 మందికి శిక్షణ ఇచ్చిన ఎఫ్ఎస్టీసీ... హైదరాబాద్ శిక్షణా కేంద్రం ద్వారా దక్షిణాదిలో పైలట్ల శిక్షణ అవసరాలను తీరుస్తుందని అంచనా వేస్తున్నారు. -
స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్ధాపన చేసిన సీఎం
-
పరిశ్రమల ఏర్పాటుకు చేయూతనిస్తాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా సహాయ, సహకారాలను అందిస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అనువైన ప్రాంతమని, తమ ప్రభుత్వం చొరవ తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కార్ల తయారీ ప్లాంటు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించిన సందర్భంగా గురువారం నిర్వహించిన ‘గ్రాండ్ ఓపెనింగ్’ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యం, రూ.13,500 కోట్ల పెట్టుబడితో కియా కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటైంది. ప్లాంట్ పరిశీలించిన సీఎం.. కియా సంస్థ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ప్రస్తుతం కియా ద్వారా నేరుగా 3 వేల మందికి, అనుబంధ కంపెనీల ద్వారా 3,500 మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఏటా కార్ల ఉత్పత్తి సామర్థ్యం 70 వేల నుంచి 3 లక్షలకు చేరడం వల్ల ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో కియా సంస్థ పెట్టుబడులు పెట్టడం దేశానికే గర్వకారణమని, అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభం కావడం సంతోషకరమన్నారు. ఇందుకోసం కృషి చేసిన కియా సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు. అంతకు ముందు ముఖ్యమంత్రి జగన్ గన్నవరం నుంచి నేరుగా పుట్టపర్తి చేరుకుని అక్కడి నుంచి కియా ప్లాంటు వద్దకు వచ్చారు. ప్లాంటులో కార్ల తయారీ యూనిట్‌కు సంబంధించిన అన్ని విభాగాలను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం నుంచి మంచి సహకారం: కియా గ్లోబల్ సీఈవో హన్ తమ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని కియా సంస్థ గ్లోబల్ సీఈవో హన్ ఊ పాక్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో ఏర్పాటైన ఈ ప్లాంటు ప్రపంచస్థాయి కార్ల తయారీ యూనిట్ల సరసన నిలుస్తుందన్నారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 28 లక్షల కార్లను విక్రయించాలనేది తమ లక్ష్యమని, అనంతపురం యూనిట్ ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. తమ సంస్థ నుంచి త్వరలో రానున్న ‘కియా కార్నివల్’ కారును భారతీయుల అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు నెలల్లో 40,649 కార్ల విక్రయం కియా ప్లాంటులో తయారైన సెల్టోస్ కారుకు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని హన్ తెలిపారు. ఒకేరోజు రికార్డు స్థాయిలో 6,046 బుకింగ్స్ వచ్చాయన్నారు. గత నాలుగు నెలల్లోనే 40,649 కార్లను విక్రయించినట్లు తెలిపారు. కొరియా సంస్థలకు ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని, రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయని భారత్‌లో కొరియా రాయబారి బోంగో కిల్‌షిన్ చెప్పారు. కార్యక్రమంలో కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూక్యున్ షిమ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, శంకరనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కియా కార్ల గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న కియా సంస్థ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమైన కియా ప్రతినిధులు -
ప్రాణవాయువు కొనుక్కునే దుస్థితి రావొద్దు: ఇంద్రకరణ్
సాక్షి, హైదరాబాద్: మనుషులకు ప్రాణాధారమైన గాలిని (ఆక్సిజన్) కొనుక్కోవాల్సిన దుస్థితి రాకుండా ఉండేందుకు అడవులను పరిరక్షించుకుని జాగ్రత్త పడాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అర్బన్‌పార్కు ప్రారంభంతో పాటు వివిధ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొ ని మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అటవీ సంరక్షణ చర్యలతో ప్రజల్లో అవగాహన పెరుగుతోందన్నారు. అడవుల రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోతున్న తరుణంలో ప్రభుత్వం ‘అర్బన్ లంగ్ స్పేస్’పేరుతో రిజర్వ్ ఫారెస్టులను అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంద్రకరణ్ తెలిపారు. -
కేంద్రం మరిన్ని సంస్థలు ఏర్పాటు చేయాలి
-
‘కర్తార్‌పూర్’కు మన్మోహన్ రారు
న్యూఢిల్లీ/లాహోర్: కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ యాత్రికుడిలాగా మన్మోహన్ అక్కడికి వెళ్తారని ఆదివారం పేర్కొన్నాయి. కాగా, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలని తాము పంపిన ఆహ్వానాన్ని మన్మోహన్ అంగీకరించారని ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు వెల్లడించాయి. ‘నవంబర్ 9న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన్మోహన్ ఒక ప్రత్యేక అతిథిగా కాకుండా, ఒక సాధారణ వ్యక్తిగా హాజరవుతారు’ అని అక్కడి స్థానిక వార్తాపత్రిక డాన్ పేర్కొంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని సిక్కు జాతా ప్రతినిధుల బృందంతో పాటు మన్మోహన్ సింగ్ పాల్గొననున్నారు. -
నగరం చుట్టూ 8 లాజిస్టిక్ పార్క్‌లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మహానగరం చుట్టూ మరో 8 లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు కానున్నాయని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మంగళ్‌పల్లి, బాటసింగారంలో ఏర్పాటవుతున్న రెండు లాజిస్టిక్ పార్క్‌లకు ఇవి అదన మని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్‌ను శుక్రవారం విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో హెచ్ఎండీఏ, ఆన్‌కాన్ సంస్థ కలసి దీన్ని నెలకొల్పాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. దేశంలోనే పీపీపీ విధానం లో ఏర్పాటైన మొదటి లాజిస్టిక్ పార్క్ ఇదేనని కేటీఆర్ చెప్పారు. ఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గతంలో నిర్మించిన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్లకు అదనంగా మూడు ఇంటర్ స్టేట్ బస్ టెర్మినళ్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు రైల్వే టెర్మినళ్లు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఒకటి చర్లపల్లిలో.. మరొకటి ఈదులనాగులపల్లిలో ఏర్పాటవుతాయని వీటిని రోడ్డు మార్గాలకు అనుసంధానిస్తామన్నారు. త్వరలో టౌన్షిప్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ముచ్చర్లలో అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటవుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ పూర్తయితే వేల మంది యువతకు ఉద్యోగాలు దక్కుతాయన్నారు. ఓఆర్ఆర్తో ఎన్నో సానుకూలతలు.. హైదరాబాద్ చుట్టూ 162 కిలోమీటర్ల మేర విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్డు వల్ల మహానగరానికి నలువైపులా పరిశ్రమలు నెలకొల్పే సౌలభ్యం ఏర్పడిందని చెప్పారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బుద్వేల్‌లో మరొక ఐటీ క్లస్టర్ ఏర్పా టుచేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడులో ఏరోస్పేస్ పార్క్ రానుందని చెప్పారు. పనిచేయకపోతే పదవి పోతది.. ‘వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చాలామంది కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా పోటీ చేయాలనుకుంటున్నా రు. కొత్త చట్టం గురించి చదువుకుని ఎన్నికల బరిలోకి దిగాలి. పనిచేయకపోతే పదవిపోతది. తిరిగి తీసుకునే అధికారం మున్సిపల్ మంత్రికి కూడా లేదు’’అని కేటీఆర్ వివరించారు. మన బిడ్డలకు ఉద్యోగాలు దక్కితేనే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న దానికి సార్థకత చేకూరుతుందన్నారు. లాజిస్టిక్ పార్కులు అభినందనీయం.. లాజిస్టిక్ పార్క్‌లు ఏర్పాటు చేయడం అభినందనీయమని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టీఎస్ఐపాస్ కింద సింగిల్‌విండో విధానంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఆదర్శంతో 18 నెలల్లోనే లాజిస్టిక్ పార్క్‌ని ఏర్పాటు చేశామని ఆన్‌కాన్ సంస్థ ఎండీ రాజశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇనాం భూ సమస్య పరిష్కరిస్తా:మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్నం: యారాడ సముద్ర తీరంలో రూ.2 కోట్ల వ్యయంతో ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ రెస్టారెంట్‌ను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం యారాడ గ్రామంలో జీవీఎంసీ నిర్మించిన రెండు కమ్యూనిటీ భవనాలను మంత్రి అవంతి,ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ ఇనాం భూ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.యారాడని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. -
ఫలించిన భగీరథ యత్నం
సాక్షి, వరంగల్ : సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో శుక్రవారం సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది... తరతరాలుగా తెలంగాణ ప్రజలు కంటున్న కల సాకారమైంది... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం కావడంతో అందరి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది.. విశిష్ట అతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యఅతిథులుగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు వైఎస్.జగన్మోహన్రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొనగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మేడిగడ్డ ఆనకట్టను ప్రారంభించిన అనంతరం గోదావరి మాతకు పూజలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర పుటల్లోకెక్కింది. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునే దిశగా చేపట్టిన ప్రయత్నం సక్సెస్ కావడంతో గోదారమ్మే మురిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇంజినీర్లు చేసిన భగీరథ యత్నం ఫలించినట్లయింది. నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజినీరింగ్ అద్భుతంగా ఈ ప్రాజెక్టును వర్ణించాల్సి ఉండగా.. ఇంత భారీ, ఖరీదైన సాగునీటి ప్రాజెక్టు మరొటి లేక పోవడం.. ఎత్తిపోతల పథకాల్లోనే ప్రపంచంలో అరుదైనదిగా గుర్తింపు సాధించడం విశేషం. ప్రాజెక్టు కోసం భూమి మీద సాగిన నిర్మాణాలు... భూగర్భంలో అంతస్తుల లోతులో నిర్మించిన మహా బాహుబలి పంప్‌హౌస్‌లు... కిలోమీటర్ల కొద్దీ సాగిన అండర్ టన్నెల్ (సొరంగాలు) అందరి దృష్టికి ఆకర్షిస్తుండగా.. గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం కానుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న వేళ ఉమ్మడి వరంగల్‌లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఊరూవాడ సంబరాలు జరుపుకున్నారు. గ్రామాల్లో బాణసంచా పేల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. అద్భుత ఘట్టం... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును శుక్రవారం ఉదయం గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు అతిరథ మహారథుల సమక్షంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. గవర్నర్, పొరుగు రాష్ట్రాల సీఎంలతో పాటు తెలంగాణ మంత్రులు వివిధ బ్యారేజీలు, పంపుహౌస్‌లను ప్రారంభించారు. తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభంలో భాగంగా సరిగ్గా ఉదయం 11.23 గంటలకు మేడిగడ్డ బ్యారేజీ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఇక 11.26 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1.07 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్‌లో మోటార్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం సరిగ్గా ఎనిమిది నిమిషాలకు అంటే మధ్యాహ్నం 1.15 గంటల నుండి పంప్ హౌస్ నుంచి నీటి పంపింగ్ ప్రారంభమయింది. దీంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణలోని బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి వచ్చినట్లయింది. అంతకుముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద, కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద శృంగేరి పీఠం అర్చకులు మణిశశాంక్ శర్మ, గోపీకష్ణ శర్మ ఆధ్వర్యంలో 40మంది వేదపండితులు జలాశయ ప్రతిష్టాంగ యాగం, జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్న ఈ యాగం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా వేద పండితులు ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్‌ను ఆశీర్వందించారు. ఎవరెరు పాల్గొన్నారంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, మహారాష్ట్ర డీజీపీ జైస్వాల్, ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్, బి.వెంకటేష్ నేత, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, నీటి పారుదల శాఖ ఈఎన్సీలు మురళీధర్‌రావు, హరే రాం, వెంకటేశ్వర్లు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు నదీ జలాల వాటాలు, పంపకాల విషయంలో ఇటు రాష్ట్రాల మధ్య, అటు దేశాల మధ్య ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై ఆసక్తికరమైన చర్చ సాగింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరా>్వత మహారాష్ట్ర ప్రభుత్వంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహ పూర్వకంగా నెరిపిన దౌత్య సంబంధాలు ఫలించాయి. గోదావరి జలాలు ప్రతీ ఏటా వేల టీఎంసీల చొప్పున సముద్రం పాలు కావడం కన్నా సమర్థవంతంగా వాడుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆసక్తిగా మారింది. అతిథులు, బ్యాంకర్లకు సన్మానం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులు గవర్నర్ నరసింహన్, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికిన కేసీఆర్ వెళ్లేటప్పుడు హెలీకాప్టర్ వరకు వెళ్లి మరీ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక సహకారం అందించిన బ్యాంకుల ప్రతినిధులను కూడా ముఖ్యమంత్రి సన్మానించి జ్ఞాపికలు అందించారు. ఆంధ్రా బ్యాంక్ ఎండీ, సీఈఓ జె.పక్రిసామి, ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంకే.భట్టాచార్య, ఆర్ఈసీ లిమిటెడ్ డైరెక్టర్(టెక్నికల్) ఎస్.కే.గుప్తా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్(కమ్యూనికేషన్స్) పీ.కే.సింగ్ అలహాబాద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామచంద్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలకృష్ణ అల్సె, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ కుమార్ తమ్తా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జనరల్ మేనేజర్ బినోద్ కుమార్, నాబార్డ్ సీజీఎం విజయ్ కుమార్, కార్పొరేషన్ బ్యాంక్ డీజీఎం అండ్ జోనల్ హెడ్ ఎం.జే.అశోక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ హెడ్ హైదరాబాద్ ఎస్.వీ.రామకష్ణ, ఆంధ్రా బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్యామల్ గోష్ రె, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం మహ్మద్ మక్సూద్ అలీ, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఆర్.మనోహర్ తదితరులు సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు. -
నేడే గంగావతరణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రపుటల్లో నేటి నుంచి నవ శకం ప్రారంభం కానుంది. కాళేశ్వరంలోని ముక్తీశ్వరుడి సాక్షిగా గోదావరి జలాలతో రాష్ట్రానికి అభిషేకం చేసే మహాక్రతువు మొదలవ్వనుంది. దేశ సాగునీటి రంగ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో అనతి కాలంలోనే పూర్తయిన బృహత్తర బహుళార్ధక సాధక కాళేశ్వర ఎత్తిపోతల పథకం నేటి నుంచి జాతికి అంకితం కానుంది. భగీరథుడు గంగను దివి నుంచి భువికి దించితే... నేటి భగీరథ యత్నం తెలుగు గంగను నేల నుంచి నింగికి ఎత్తే సరికొత్త చరిత్రను సృష్టించనుంది. ఈ బృహత్తర ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లోని 6వ నంబర్ మోటార్‌ను ఆన్ చేయడం ద్వారా గోదావరి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మహోజ్వల ఘట్టానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తోపాటు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లు హాజరుకానున్నారు. దేశ, రాష్ట్ర చరిత్ర గతికి దిశానిర్దేశం చేసిన గంగావతరణ దినంగా జూన్ 21 ఖ్యాతికెక్కనుంది. ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం... రాష్ట్రంలోని 70 శాతం భూభాగానికి 40లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే మహాస్వప్నం సాకారం దిశగా తొలి అడుగు పడనుంది. బీళ్లువారిన తెలంగాణ నేలలన్నీ సస్యశ్యామలం చేసేందుకు గోదావరి పరుగులు పెట్టనుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ప్రాజెక్టు పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. గోదావరిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటితో తొలి ఎత్తిపోతలు మొదలు కానుంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్‌లలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద యాగశాలలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. రుత్వికులు, పండితులు ఇప్పటికే అక్కడ హోమాలకు సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరుకానున్న గవర్నర్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలు, ఆయా రాష్ట్రాల మంత్రుల కోసం 5 హెలికాప్టర్లు సమకూర్చగా ఒక్కో ప్రాంతం వద్ద ఆరు హెలిప్యాడ్లు సిద్ధం చేసి ఉంచారు. సిద్ధమవుతున్న యాగశాల శుక్రవారం ఉదయం 7 గంటలకే ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి సతీసమేతంగా చేరుకోనున్నారు. అక్కడ జరిగే జలసంకల్ప మహయాగ హోమంలో పాల్గొంటారు. ఉదయం 8:30 గంటలకు మరో హెలికాప్టర్లో గవర్నర్ నరసింహన్ సైతం హైదరాబాద్ నుంచి బయల్దేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అమరావతి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకోనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ముంబై నుంచి నేరుగా మేడిగడ్డకు చేరుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకల్లా గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ జరిగే హోమంలో కేసీఆర్‌తోపాటు పాల్గొంటారు. అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్ ఉన్న కన్నెపల్లికి హెలికాప్టర్లో చేరుకొని అక్కడ అప్పటికే కొనసాగుతున్న పూర్ణాహుతిలో పాల్గొంటారు. సుగంధ మంగళ ద్రవ్యాలను హోమంలో వేస్తారు. అనంతరం 6వ నంబర్ మోటార్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం నీటి ప్రవాహాలుండే డెలివరీ సిస్టర్న్ వద్ద గోదావరి జలాలకు పూజలు చేస్తారు. అక్కడి నుంచి కన్నెపల్లి గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనాలు చేసి అనంతరం అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం పంచుకున్న ఇంజనీర్లు, ఏజెన్సీలు, సహకారం అందించిన బ్యాంకర్లకు సన్మాన కార్యక్రమం ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. స్థానికుడైన మంత్రి ఈటల రాజేందర్ మేడిగడ్డ, కన్నెపల్లి ప్రాంతాల వద్ద ఏర్పాట్లను సమన్వయపరుస్తారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నెపల్లి పంప్‌హౌస్ పూజా కార్యాక్రమంలో పాల్గొంటారు. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నిండుకుండలా.. మిగతా పంపుల వద్ద మంత్రులు, స్ధానిక ఎమ్మెల్యేలు... మేడిగడ్డ, కన్నెపల్లిలో పూజలు జరుగుతున్న సమయంలోనే కీలకమైన అన్నారం బ్యారేజీ, పంప్‌హౌస్, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌లతోపాటు నంది మేడారంలోని ప్యాకేజీ–6 పంప్‌హౌస్, రామడుగులోని ప్యాకేజీ–8 పంప్‌హౌస్‌ల్లోనూ పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అన్నార పరిధిలో జరిగే పూజా కార్యక్రమాల్లో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొననుండగా సుందిళ్ల పరిధిలోని పూజలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూజలు చేయనున్నారు. ప్యాకేజీ–6లో మంత్రి మల్లారెడ్డి, ప్యాకేజీ–8లో మంత్రి జగదీశ్‌రెడ్డి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఈ సందర్భంగా అక్కడే సుమారు 500 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజా కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు. 3 వేల మందితో భద్రత కట్టుదిట్టం... సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి గవర్నర్, ముగ్గురు సీఎంలు వస్తుండటంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడా భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా 3 వేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సివిల్ పోలీసులతోపాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, ఏపీఎస్పీ బలగాలు కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల దగ్గర మోహరించాయి. నలుగురు ఎస్పీలు, ఇద్దరు ఏఎస్పీలు, 16 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రాంతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం, మావోయిస్టుల ప్రభావం ఉండటంతో భద్రతా సిబ్బంది రేయింబవళ్లు పహారా కాస్తున్నారు. గోదావరి నదికి ఇరువైపులా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ నిర్వహించాయి. పెద్దపల్లి నుంచి కాళేశ్వరం, భూపాలపల్లి నుంచి కాళేశ్వరం వెళ్లే ప్రధాన రహదారులను జల్లెడ పడుతున్నాయి. పంపుహౌస్‌ను పరిశీలిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి పొంచి ఉన్న వరుణుడి ముప్పు... ప్రారంభోత్సవ కార్యక్రమానికి వరుణిడి ముప్పు పొంచి ఉంది. భూపాలపల్లి జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర అరగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో శుక్రవారం జరగబోయే కార్యక్రమానికి వరణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ఈటల రాజేందర్ గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి పరిశీలించారు. కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోనున్న ఫడ్నవిస్! కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తున్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకోనున్నట్లు అనధికార వర్గాల ద్వారా తెలిసింది. ముందుగా సీఎం కేసీఆర్, వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆలయంలో పూజలు చేస్తారని ప్రచారం జరిగినా షెడ్యూల్ రాలేదు. అయితే ఫడ్నవిస్ ఒక్కరే స్వామివారికి అభిషేకం చేయనున్నట్లు తెలిసింది. అతిథుల కోసం 100 బెల్లం లడ్డూలు ప్రత్యేకంగా తయారు చేయించగా దేవాదాయశాఖ కమిషనర్ అనీల్ కుమార్, ఏడీసీ శ్రీనివాసరెడ్డి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. -
21న కాళేశ్వర ‘తీర్థం’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రానికి వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని ఎత్తిపోయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొత్త శకానికి నాంది పలకనుంది. తెలంగాణ భూ భాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగు, తాగు, పరిశ్రమల అవసరాలను తీర్చే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగానే అక్కడే జల సంకల్ప మహాయాగం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ని ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. గోదావరిలో వరద ఉండే దినాలను బట్టి కనిష్టంగా 150 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి, రూ.50 వేల కోట్ల మేర నిధులు ఖర్చు చేసి పనులు పూర్తి చేసింది. ఏటా 80 లక్షల ఎకరాల్లో పంట... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, మరో 20 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. కొత్తగా ఆయకట్టు సాగులోకి వచ్చే జిల్లాల్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి, నల్లగొండ, సంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి జిల్లాలున్నాయి. కాళేశ్వరం నీటితోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం చేపట్టారు. నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులకు కూడా నీరందివ్వనున్నారు. దీంతో కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, నిజమాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, సూర్యాపేట జిల్లాల్లో మరో 20 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరగనుంది. మొత్తంగా రాష్ట్రంలోని 40 లక్షల ఎకరాలకు ప్రతీ ఏడాది 2 పంటలకు నీరందనుండగా, ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. అందుకే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయనిగా నిలవబోతోందని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. రాత్రింబవళ్లు పనులు.. పూర్తయిన నిర్మాణాలు.. కాళేశ్వరం పథకానికి 2016, మే 2న కన్నెపల్లి వద్ద ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు రాత్రింబవళ్లూ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 20 లిఫ్టులను నిర్మిస్తున్నారు. 12 బ్లాకుల్లో 1,531 కిలోమీటర్ల మేర ప్రధాన కాల్వలు, 203 కిలోమీటర్ల మేర సొరంగాల పనులు సాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 4 వేల మందికి పైగా కార్మికులు నిరంతరం షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు ఇప్పటికే పూర్తవగా, మేడిగడ్డ పంప్‌హౌజ్‌లో 11 మోటార్లకు గానూ 8 మోటార్లు సిద్ధమయ్యాయి. మిగతా వాటి పనులు సాగుతున్నాయి. అన్నారంలో 8కి గానూ 5, సుందిళ్లలో 9కిగానూ 6 సిద్ధం చేశారు. ఇందులో మేడిగడ్డ పంపులను ఈ నెల 21న కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించి గోదావరి నీటి ఎత్తిపోతలకు అంకురార్పణ చేయనున్నారు. రెండు లేక మూడు మోటార్లతో 21 నుంచి మేడిగడ్డను ఆరంభించి అన్నారానికి నీటిని తరలించాలని, అక్కడ 4.47 టీఎంసీల నిల్వకు రాగానే, రెండు మోటార్లతో 28 నుంచి అన్నారం ఎత్తిపోతలను ఆరంభించి సుందిళ్లకు నీటిని తరలించాలని, అక్కడ 4.25 టీఎంసీల నిల్వకు చేరగానే, వచ్చే నెల 5 నుంచి 3 మోటార్లను ఆరంభించి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6, 7, 8 ఉండగా, ఇందులో ప్యాకేజీ–6 ద్వారా ఎల్లంపల్లి నుంచి నీటిని మేడారం రిజర్వాయర్‌కు తరలించేలా పనులు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో 124 మెగావాట్ల సామర్థ్యమున్న 7 మోటార్లను సిద్ధం చేయాల్సి ఉండగా ఇప్పటికే 4 రెడీ అయ్యాయి. ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తయింది. లైనింగ్ పనులు పూర్తి కావస్తున్నాయి. ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యమున్న బాహుబలి మోటార్ పంపులు 5 సిద్ధమయ్యాయి. ఇంకో మోటార్‌ను మరో 15–20 రోజుల్లో సిద్ధం చేయనున్నారు. ఇక మిడ్‌మానేరు కింద కొండపోచమ్మసాగర్ వరకు ప్యాకేజీ–10, 11, 12, 13, 14 ఉండగా, ఇవన్నీ యుద్ధ ప్రాతిపాదికన జరుగుతున్నాయి. ఇందులో చాలా ప్యాకేజీల్లో మోటార్ల బిగింపు ప్రక్రియ లక్ష్యాల మేరకు పూర్తయింది. ఈ ఖరీఫ్‌లో కొండపోచమ్మసాగర్ వరకు 150 టీఎంసీల మేర నీటిని ఈ సీజన్లో తరలించేలా పనులు పూర్తి చేస్తున్నారు. మొత్తంగా మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు తరలిస్తారు. అంటే గోదావరి నది నీళ్లను అర కిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేస్తారు. తొలి ఫలితం ఎస్సారెస్పీకే... కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా లబ్ధి పొందనున్న తొలి ఆయకట్టు ఎస్సారెస్పీదే కానుంది. ఎల్లంపల్లి మిడ్‌మానేరుకు తరలించే నీటిని వరద కాల్వపై నిర్మస్తున్న ఎస్పారెస్పీ పునరుజ్జీవన పథకంలోని లిఫ్టుల ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటిని తరలించనున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద 9.68 లక్షలు, స్టేజ్–2 కింద మరో 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను దాటుకొని నీరు ఎల్లంపల్లి మీదుగా వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరుకు చేరుతుంది. అయితే మిడ్‌మానేరుకు చేరకముందే వరద కాల్వ మీద మూడు పంప్‌హౌజ్‌లను నిర్మించి రివర్స్ పంపింగ్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని వరద ఉండే 60 నుంచి 120 రోజుల పాటు ఎస్సారెస్పీకి పంపిస్తారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలోని మూడు పంప్‌హౌజ్‌లకు గానూ రెండు పంప్‌హౌజ్‌లలో సిద్ధమవుతున్నాయి. ఈ రెండు పంప్‌హౌస్‌ల్లో 6.5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగేసి చొప్పున పంపులను జూన్ చివరికి పూర్తి చేసి, జులై నుంచి ఖరీఫ్‌లో కనిష్టంగా 60 టీఎంసీల నీటిని ఆయకట్టుకు తరలించనున్నారు. ఈ నీటికి ఎస్సారెస్పీకి సహజ ప్రవాహాలతో వచ్చే మరో 30 నుంచి 40 టీఎంసీల నీరు తోడైతే పూర్తి ఆయకట్టుకు నీరందించడం సాధ్యం కానుంది లేని పక్షంలో 60 టీఎంసీ నీటినే ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన 9 లక్షల ఎకరాలకు సరఫరా చేయనున్నారు. చెరువులకు ఊతం... కాళేశ్వరం ద్వారా వచ్చే గోదావరి జలాలతో తొలి ప్రాధాన్యంగా చెరువులు నింపనున్నారు. ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వరదనీరు, పడబాటు నీళ్లు అన్ని చెరువులకు మళ్లేలా పనులు చేస్తున్నారు. మేడిగడ్డ మొదలు బస్వాపూర్ వరకు గరిష్టంగా 2,600 చెరువులు నింపే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఇందులో మిడ్‌మానేరు దిగువన బస్వాపూర్ వరకు 1,700 చెరువులు నింపే అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇక ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజీ–2 కింద 700 చెరువులు, కడెం కింద 50 చెరువులు, వరద కాల్వ కింద 60 చెరువులు నింపవచ్చని గుర్తించారు. ఇందులో ఈ ఖరీఫ్ సీజన్లోనే ఎస్సారెస్పీ కింద 200 చెరువులు, అనంతగిరి కింద సిరిసిల్ల జిల్లాలో 30 చెరువులు నింపి 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. రంగనాయక సాగర్ కింద సిద్దిపేట జిల్లాలో 50, సిరిసిల్ల జిల్లాలో 70 చెరువులు నింపనున్నారు. ఈ రిజర్వాయర్ల పనుల అనంతరం మల్లన్నసాగర్‌కు చేరే నీటిని ఫీడర్ చానల్ తవ్వి గంధమల, బస్వాపూర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల కింది కాలువలకు అనుసంధానించి కనిష్టంగా 150 చెరువులు నింపేలా పనులు చేస్తున్నారు. ఈ చెరువులను నింపేందుకు వీలుగా 785 తూముల నిర్మాణం చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఏపీ, మహారాష్ట్ర సీఎంలకు కేసీఆర్ ఆహ్వానం.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని కేసీఆర్ నిశ్చయించారు. త్వరలోనే విజయవాడకు వెళ్లి వైఎస్ జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. బుధవారం కేసీఆర్ ఫడ్నవీస్‌తో ఫోన్లో మాట్లాడి ప్రారంభోత్సవానికి రావాలని కోరగా ఆయన అంగీకరించారు. త్వరలోనే స్వయంగా ముంబై వెళ్లి ఫడ్నవీస్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు. విద్యుత్ సరఫరా ఏర్పాట్లు పూర్తి... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల నీరు ఎత్తిపోయడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం కానుంది. 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి 7,152 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. దీనికి తగినట్టుగానే ఏర్పాట్లు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు అత్యధిక విద్యుత్ సరఫరా అందించడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ట్రాన్స్‌కోలో ఎత్తిపోతల పథకాల కోసమే ప్రత్యేక డైరెక్టర్ సూర్యప్రకాశ్‌ను సీఎం కేసీఆర్ ఇప్పటికే నియమించారు. జెన్ కో– ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యుత్, నీటి పారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించారు. ఆస్ట్రియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్థ్యాన్ని మదింపు చేశారు. బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు. ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్‌లకు అవసరమైన విద్యుత్‌కోసం గోలివాడ గ్రామ శివారులో ట్రాన్స్మిషన్ (సబ్‌స్టేషన్) వ్యవస్థ సిద్ధమైంది. నిర్దేశిత గడువుకు ముందే ఈ వ్యవస్థను పూర్తిచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యాంశాలు.. నీటిని సరఫరా చేసే మార్గం పొడవు: 1832 కి.మీ. వాలు కాలువ పొడవు: 1531 కి.మీ. వాలు టన్నెల్ పొడవు: 203 కి.మీ. ప్రెషర్ పైపు లైన్ పొడవు: 98 కి.మీ. లిఫ్టులు: 20 పంపు హౌస్‌లు: 19 అవసరమయ్యే విద్యుత్: 4,992.47 మెగావాట్లు జలాశయాలు: 19 జలాశయాల నిల్వ సామర్థ్యం: 141 టీఎంసీ ప్రాజెక్టులో నీటి లభ్యత (టీఎంసీల్లో) గోదావరి నీరు: 180 ఎల్లంపల్లి ప్రాజెక్టులో లభ్యమయ్యే నీరు: 20 ఎల్లంపల్లి వద్ద మొత్తం నీటి లభ్యత: 200 చెరువుల పరివాహక ప్రాంత నీటి లభ్యత: 10 ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాల రీచార్జ్: 25 ఆవిరి నష్టాలు: 10 ప్రాజెక్టు వినియోగానికి నికరంగా నీటి లభ్యత: 225 ప్రాజెక్టులో నీటి వినియోగం (టీఎంసీల్లో) కొత్త ఆయకట్టుకు సాగునీరు- 134.5 శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ ఆయకట్టు స్థిరీకరణ- 34.5 హైదరాబాద్‌కు నీటి సరఫరా- 30 గ్రామాలకు తాగునీరు- 10 పారిశ్రామిక అవసరాలకు- 16 మొత్తం నీటి వినియోగం- 225 -
ఆకివీడులో వైఎస్ఆర్సీపీ కార్యలయం ప్రారంభం
-
తమిళనాడు: కన్యాకుమారిలో శీవారి ఆలయం
-
తిరుపతిలో మెహరీన్, రాశీఖన్నా సందడి
-
ఆ రాష్ట్రంలో ప్రారంభమైన తొలి ఎయిర్పోర్ట్
గ్యాంగ్‌టక్ : సిక్కిం తొలి ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పయోంగ్ వద్ద 2009లో శంకుస్ధాపన జరిగిన ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌గా దీన్నిఅభివృద్ధి చేశారు. ఆదివారం సాయంత్రం ఎంఐ-8 విమానంలో ఇక్కడికి చేరుకున్న ప్రధానికి గవర్నర్ గంగా ప్రసాద్, సీఎం పవన్ చామ్లింగ్ తదితరులు లివింగ్ ఆర్మీ హెలిపాడ్‌లో స్వాగతం పలికారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేశారు. ఈశాన్య రాష్ట్రాల ప్రయాణీకులకు మిగిలిన ప్రపంచంతో కనెక్టివిటీ పెరిగేందుకు ఈ విమానాశ్రయం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. -
మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎంపీ
-
భారత్ ప్రాజెక్టుపై పాక్ అభ్యంతరం
ఇస్లామాబాద్: భారత్- పాకిస్తాన్ మధ్య వివాదాస్పద కిృష్ణగంగా హైడ్రాలిక్ ప్రాజెక్టుని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భారత్ ఈ హైడ్రాలిక్ ప్రాజెక్టుని ప్రారంభించడంపై పాక్ బహిరంగంగా విమర్శిస్తోంది. కశ్మీర్లో భారత్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై పాక్ ఎప్పటినుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ జలాల ఒప్పందంలోని వివాదాలను పరిష్కరించకుండా ప్రాజెక్టును ఏలా ప్రారంభిస్తారని పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై పాక్ విదేశాంగ శాఖ శనివారం ఓ లేఖని విడుదల చేసింది. కశ్మీర్‌లోని బందీపూర్ జిల్లాలో కిృష్ణగంగా నదిపై 330 మెగావాట్ల సామర్థ్యంతో కిృష్ణగంగా హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు 2007లో భారత్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇండస్ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని పాక్ చేస్తోన్న ఆరోపణలను భారత్ ఖండించింది. ఒప్పందంలోని అంశాలకు లోబడే ఈ ప్రాజెక్టుని నిర్మించినట్లు భారత్ తెలిపింది. -
రాహుల్ గాంధీ వస్తే అడ్డుకుంటాం
అమేథి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తన సొంత నియోజకవర్గం అమేథిలో ఊహించని పరిణామం ఎదురైంది. ప్రధాన మంత్రి సడక్ యోజన ద్వారా రూ. 3.5 కోట్లతో తావూరి, కొట్వా గ్రామాల మధ్య 5.5 కిలోమీటర్ల దూరం గల రోడ్డును ప్రారంభించడానికి రాహుల్ సిద్దమైన నేపథ్యంలో స్థానిక బీజేపీ నేతలు ఆయన పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. రోడ్డును రాహుల్ ప్రారంభించడానికి వీల్లేదని, ఆయన వస్తే అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, రాహుల్ ఎలా ప్రారంభిస్తారని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. రోడ్డును ప్రారంభించి రాహుల్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమా శంకర్ పాండే విమర్శించారు. కాగా రోడ్డు పనులు పూర్తికాకముందే రాహుల్ ఎలా ప్రారంభిస్తారని, పూర్తయ్యే వరకు వేచి ఉండాలని సీడీఎం అభయ్ పాండే తెలిపారు. కాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర మిశ్రా.. ఇది ప్రారంభోత్సవం కాదని కేవలం పనులను పర్యవేక్షించం కోసమే రెండు రోజులు పర్యటనలో భాగంగా రాహుల్ వస్తున్నారని తెలిపారు. -
వోల్వో కార్స్ నుంచి న్యూ ఎక్స్‌సి 60
కొరుక్కుపేట: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం వోల్వో కార్స్ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో కూడిన న్యూ ఎక్స్‌సి 60 కారును మార్కెట్లోకి విడుదల చేసింది. సౌకర్యవంతంగాను, సేఫ్టీ ఫ్యూచర్లతో, అద్భుతమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో రూపుదిద్దుకున్న న్యూ ఎక్స్‌సి 60ని చెన్నై మార్కెట్లో అందుబాటులోకి తెచ్చినట్లు వోల్వో ఆటో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రాంప్ తెలిపారు. చెన్నైలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఎక్స్ సి 60 వోల్వో కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీని ధర రూ.55.9 లక్షలుగా నిర్ణయించామన్నారు. పవర్ ప్లస్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కలిగిన రోబస్ట్ డీజిల్ ఇంజిన్‌ను పొందుపరిచామని తెలిపారు. భారతీయ రహదారులపై అత్యంత వేగంగా ఈ కారు దూసుకుపోతోందన్నారు. -
అభివృద్ధి భారతం.. కలాం కల
దానిని సాకారం చేసేందుకు కలసికట్టుగా కృషి చేద్దాం - దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు - రామేశ్వరంలో కలాం స్మారకం ప్రారంభం - కలాం సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని - జయలలిత లేనిలోటు స్పష్టంగా తెలుస్తోందన్న మోదీ సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న 2022 నాటికి అభివృద్ధి భారతాన్ని చూడాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలుగన్నారని, ఆయన కలలను నిజం చేసేందుకు మనందరం కలసికట్టుగా కృషి చేద్దామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ప్రస్తుతం దేశంలో 125 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో అడుగు ముం దుకేస్తే.. దేశం 125 కోట్ల అడుగులు ముందుకువెళుతుంది’’అని ప్రధాని పేర్కొన్నారు. గురువారం భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం రెండో వర్ధంతి సందర్భంగా తమిళనా డులోని రామేశ్వరం సమీపంలోని పేయికరుం బూరులో కలాం భౌతికకాయాన్ని ఖననం చేసి న చోటనే నిర్మించిన స్మారక మండపాన్ని ప్రధా ని జాతికి అంకితం చేశారు. కలాం సమాధి వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. మాది చేతల ప్రభుత్వం.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడుతూ.. కలాం కలలుగన్న అభివృద్ధి భారతాన్ని నిజం చేసేం దుకు కేంద్రం ప్రారంభించిన వివిధ అభివృద్ధి పథకాలైన.. స్టాండప్ ఇండియా లేదా స్టార్టప్ ఇండియా, అమృత్ సిటీస్ లేదా స్మార్ట్ సిటీస్, స్వచ్ఛభారత్ ప్రాజెక్టులు చాలాదూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. కలాం స్మారకంతో రామేశ్వరానికి మరింత శోభ, ప్రతిష్ట చేకూరిం దని, యువత, పర్యాటకులు రామేశ్వరాన్ని, కలాం స్మారకాన్ని సందర్శించాలని మోదీ కో రారు. ‘‘కలాం అంతిమయాత్రలో పాల్గొన్నపు డే స్మారకంపై మాటిచ్చా. నేడు అది నిలబెట్టుకున్నా. రెండేళ్ల వ్యవధిలో అద్భుతమైన స్మారక నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని నిరూపించా’’అని మోదీ పేర్కొన్నారు. స్ఫూర్తిప్రదాత కలాం.. కలాం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారని మోదీ అన్నారు. యువతను, విద్యార్థులను కలాం అమితంగా ఇష్టపడేవా రని, వారి కోసమే స్టాండప్, స్టార్టప్ స్కీముల ను ప్రారంభించామని, యువతకు ఎటువంటి గ్యారంటీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు ముద్రా బ్యాంకును ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకుని పనిచేస్తే.. కొత్త భారతదేశాన్ని, కొత్త తమిళనాడును చూడవచ్చన్నారు. రామేశ్వరం నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు వెళ్లే వీక్లీ రైలును ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీఎం కె.పళనిస్వామి, కేంద్ర మంత్రులు పొన్ రాధాకృష్ణన్, నిర్మలాసీతారామన్, ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. స్మారకం.. ప్రత్యేకం..: కలాం స్వగ్రామం పేయికరుంబూరులో తమిళనాడు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కలాం స్మారకాన్ని నిర్మించారు. రూ.15 కోట్లతో నిర్మించిన ఈ స్మారకానికి కలాం తన జీవితకాలంలో ఎక్కువ శాతం గడిపిన డీఆర్డీవోనే రూపకల్పన చేసింది. కలాం శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో రూపొందించిన మిస్సైళ్లు, రాకెట్ల నమూనాలను ఇందులో ఏర్పాటు చేశారు. కలాం వీణ వాయించే విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. కలాంకు చెందిన 900 పెయింటింగ్‌లు, 200 అరుదైన ఛాయాచిత్రాలను ఉంచారు. అమ్మ ఆశీస్సులు ఉంటాయి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని కలాం స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘జయలలిత మరణం తర్వాత తమిళనాడులో నేను పాల్గొన్న భారీ కార్యక్రమం ఇదే. ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మ(జయలలిత) లేకపోయినా.. తమిళనాడు సమగ్ర వికాసానికి ఆమె ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని నేను నమ్ముతున్నాను’’అని మోదీ వ్యాఖ్యానించారు. కలాం.. సలాం.. అబ్దుల్ కలాం గుణగణాలను ప్రస్తుతిస్తూ ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన కలాం.. సలాం గీతాన్ని దేశం నలుమూలల నుంచి ఒకేసారి ఐదు కోట్ల మంది విద్యార్థులతో కలసి మోదీ పాడారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. కలాం కుటుంబంతో కొంతసేపు కలాం కుటుంబ సభ్యులతో ప్రధాని మోదీ కొద్దిసేపు గడిపారు. కలాం సోదరుడు ముత్తుమీరాన్ మరైక్కాయర్ తదితర సభ్యులతో కలసి కూర్చుని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. వారి చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకుని మురిపెంగా ముద్దులాడారు. -
కలామ్ స్మారక మందిరం ప్రారంభం
►కలాం.. కలకాలం! చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ స్మారక మండపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రామేశ్వరం జిల్లా పేయ్‌కరుంబులో రూ.15 కోట్లతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని ఆవిష్కరించారు. కలాంను పేయ్‌కరుంబులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఖననం చేసిన విషయం తెలిసిందే. అదే స్థలంలో రూ.15 కోట్లతో ఈ స్మారక మండపాన్ని నిర్మించారు. అబ్దుల్ కలాం రెండో వర్ధంతి సందర్భంగా మోదీ ఈ మండపాన్ని ఆరంభించారు. అలాగే కలామ్ కుటుంబసభ్యులతో ఆయన ముచ్చటించారు. అంతకు ముందు కలామ్ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత ‘కలాం...సలాం’ అంటూ రూపొం దించిన గీతాన్ని ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులు ఒకేసారి ఆలపించారు. ‘కలాం విషన్ 2020 సంతోష్ వాహినీ’ ప్రసార వాహనాన్ని ప్రారంభించారు. 12.25 గంటలకు రామేశ్వరం–అయోధ్య ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను, రామేశ్వరం నుంచి ధనుష్కోటికి రూ.55 కోటత్లో నిర్మించిన జాతీయ రహదారిని ఆరంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నితిన్ గడ్కరి, పొన్ రాధాకృష్ణన్, నిర్మలా సీతారామన్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీఎం ఎడపాడి పళనిస్వామి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. చరిత్ర ఎరుగని బందోబస్తు ప్రధాని మోదీ రాక సందర్భంగా రామేశ్వరం జిల్లాలో తమిళనాడులో గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉచ్చిపుళ్లి విమానాశ్రయం నుంచి రామేశ్వరం వరకు జాతీయ రహదారి పొడవునా వేలాది మంది పోలీసులు బందోబస్తు పాటిస్తున్నారు. బుధ, గురువారాల్లో సముద్రంలో చేపలవేటకు మత్య్సకారులను అనుమతించలేదు. భారత నౌకాదళం, సముద్రతీర గస్తీదళం సైతం సముద్ర తీరంపై నిఘా పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ తరువాత సైతం భావిభారత పౌరులను తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతగా పాటుపడ్డారు అబ్దుల్‌కలాం. మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో 2015 జూలై 27వ తేదీన జరిగిన ఒక సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ వేదికపైనే ఆయన కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు సైతం కలాం మృతికి కన్నీళ్లు పెట్టాయి. అబ్దుల్‌కలాం జన్మించిన రామేశ్వరం పేయ్ కరుంబులో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఆయన ఆశయాలను ప్రతిబింబించేలా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ప్రధాని మోదీ అదేరోజు ప్రకటించారు. ప్రముఖ కట్టడాల స్ఫూర్తితో.. స్మారక మండప నిర్మాణ పనులను డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) పర్యవేక్షణలో సాగాయి. ప్రస్తుతం తొలిదశగా రూ.15 కోట్లతో మణిమండపం, రూ.10 కోట్లతో పరిసరాల్లోని నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మండప నిర్మాణానికి అవసరమైన అపురూపమైన వస్తువులను దేశం నలుమూలల నుంచి (కేరళ మినహా) తెప్పించారు. ప్రధానమైన ప్రవేశ ద్వారాలను తంజావూరు శిల్పులు తీర్చిదిద్దారు. స్థానిక పనివారితోపాటు బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిర్మాణ రంగ నిపుణుల సేవలను వినియోగించారు. వీరుగాక కొత్త ఢిల్లీ నుంచి 500 మంది పనివారిని రప్పించారు. దేశంలోని అనేక ప్రముఖ కట్టడాల స్ఫూర్తితో దీని నిర్మాణం చేపట్టారు. అబ్దుల్ కలాం జీవితంలోని ప్రధాన ఘట్టాలను అక్కడ పొందుపరిచారు. అద్భుతమైన గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం పేపర్ బాయ్‌గా జీవితం ప్రారంభించి భార త ప్రథమ పౌరుడి స్థాయి వరకు తన జీవనగమనంలో అన్నింటా తన బాధ్యతలకు వన్నెతెచ్చారు కలాం. అంతరిక్ష శాస్త్రవేత్తగా ఆయన చేసిన సేవలు నేటికీ మరువలేనివి. అందుకే అన్నింటిలోకి ఆయన ఇష్టపడే అంతరిక్ష ప్రయోగాలకు గుర్తుగా ఫొటో మ్యూజియంలో రాకెట్ నమూనాలను ఉంచారు. ఆయనలోని కళాకారుడిని పరిచయం చేసేలా కలాం రూపొందించిన చిత్ర లేఖనాలను అమర్చారు. ప్రాంగణం పరిసరాల్లో పచ్చదనం ఉట్టిపడుతోంది. డీఆర్డీవో కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా 24/7 పనిచేసేలా సీసీ కెమెరాలను అమర్చారు. రెండోదశలో అబ్దుల్‌కలాం వినియోగించిన పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం, ఆడిటోరియం నిర్మిస్తారు. కలాం వర్ధంతి రోజు జూలై 27, జయంతి రోజైన అక్టోబర్ 15వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. -
విలువైన జ్ఞాపకాలు
‘ఇవాళ్టి రాజకీయాలే, రేపటి చరిత్ర’అంటుంది చరిత్ర రచనా విధానం. ఇవాళ్టి రాజకీయాలంటే నడుస్తున్న చరిత్ర. ఈ నడుస్తున్న చరిత్రకు వ్యాఖ్యాతే మంచి పత్రికా రచయిత. రాజకీయ, సామాజిక పరిణామాలు, కళ, సంస్కృతి, ఉద్యమాలు వంటి వాటి వెంట నడుస్తాడు పత్రికా రచయిత. వాటితో తర్కిస్తాడు, విభేదిస్తాడు, సమర్ధిస్తాడు కూడా. అంతిమంగా సమకాలీన చరిత్ర ఫస్ట్ రిపోర్ట్‌ను అందిస్తాడు. అందుకే ఒక పత్రికా రచయిత జీవిత చరిత్ర సమకాలీన సామాజిక, రాజకీయ చరిత్రగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ప్రముఖ పత్రికా రచయిత డాక్టర్ జీఎస్ వరదాచారి ‘జ్ఞాపకాల వరద’ అలాంటి రచనే. ‘ఒకరికి వినిపించదగిన విశేషం నా జీవితంలో ఏముంది?’అని ప్రశ్నించుకుంటూ రాసుకున్న జ్ఞాపకాలివి. అందుకే బాల్యం గురించి చెప్పినా, ఉద్యోగ జీవితం గురించి వర్ణించినా సామాజిక నేపథ్యాన్ని గమనించుకుంటూనే రాశారు. ఏడు అధ్యాయాలలో (చిన్ననాటి ముచ్చట్లు, వివాహం– విద్యాభ్యాసం, జర్నలిజం వైపు మొగ్గు, ఉద్యోగపర్వం, శ్రామికాభ్యుదయం, రచనలు–పురస్కారాలు, దొరకునా ఇటువంటి సేవ?) జీఎస్ జ్ఞాపకాలు వెల్లువెత్తాయి. ‘గోవర్ధన వారి ఇంట్లో దూలాలను తడితే వేదమంత్రాలు వినిపిస్తాయి’. వరదాచారి ఇంటిపేరు అదే. స్వస్థలం ఆర్మూరు (వరదాచారి తాతగారు ఆరమూరు అని రాసేవారట). ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. అదీ ఒక నానుడితో చెప్పేవారు– ‘ఆర్మూర్ ఖుదా కా నూర్, సేంధీ సజ్దీక్ పానీ దూర్’. అంటే ఆర్మూర్ దివ్యతేజం. కల్లు దగ్గర, నీరు దూరం. చుట్టూ ఈత చెట్ల తోపులు. మంచినీటికి మాత్రం క్రోసులు నడిచి వెళ్లాలి. అసలు పేరు నవనాథపురం. నిజాం పాలన, తీరుతెన్నులు అందులో ప్రతిబింబించాయి. కొన్ని హిందూ అగ్రకులాల స్త్రీపురుషులు ప్రభు వర్గీయులను అనుకరిస్తూ బురఖాలు, షేర్వాణీలు ధరించేవారు. తెలుగు భాషకు రాచ మర్యాద లేకున్నా, నాలుగో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరిగేదంటూ జీఎస్ రాసిన వాక్యాలు చారిత్రకంగా, విద్యాపరంగా ఇప్పుడూ ప్రాముఖ్యం ఉన్న సత్యాలు. అలాగే ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉండేదో అవగతమవుతుంది. జీఎస్‌కు ఉన్నత పాఠశాలలో ఉర్దూ పేపర్లో అత్యధికంగా మార్కులు వచ్చాయి. ఇదెలా సాధ్యమైందో ఇందులో చదవవలసిందే (పే 26). అప్పుడు విద్యార్థులందరికీ శుక్రవారం సెలవు. దీనిని అర్థం చేసుకోవచ్చు. తరచూ ‘నిజాంకు కొడుకు పుట్టాడు’ అంటూ సెలవులు ఇచ్చేవారు. ఇదెలా సాధ్యమనీ, ఇంతమంది ఎలా పుడతారనీ విద్యార్థులంతా ప్రశ్నించుకున్నారు. మిషనరీల కార్యకలాపాలు ఎలా ఉండేవో కూడా రచయిత వివరించారు. ఈ క్రమంలోనే రచయిత నిజాం సాగర్ ప్రాజెక్టు పరిణామం గురించి కూడా ప్రత్యేకంగా రాసుకున్నారు. ఒక నియంత నిర్మించి పెట్టిన సాగునీటి పథకం, ప్రజాస్వామ్య యుగంలో ఎండిపోయిన సంగతిని గుర్తు చేసుకోవడం ఒక అవసరం కోసమే. తరువాత మజ్లిసె (ఇలాగే రాయాలట) ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (వారే రజాకార్లు) ఆవిర్భావం, కార్యకలాపాల గురించి కూడా రచయిత జ్ఞాపకం చేసుకున్నారు. ఇన్ని అంశాలను తడిమిన వారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరా టం, కమ్యూనిస్టుల పాత్ర గురించి చెప్పకుండా ఉండటం సాధ్యం కాదు. ‘కమ్యూనిస్టుల చారిత్రక తప్పిదం’అనే ఉపశీర్షిక కిందే రచయిత ఆ ముఖ్యమైన అంశాన్ని వివరించారు. రజాకార్ల హింస, భూస్వామ్య వ్యతిరేక పోరాటం, ఆనాటి ఎన్కౌంటర్ల గురించి కొద్దిగానే అయినా చక్కని శైలిలో అందించారు. ఇందులో అమృత్లాల్ అనే వ్యక్తి జీవిత పరిణామం గురించి కూడా చదువుతాం. ఆయన జీఎస్ ఉపాధ్యాయుడే. ఇదంతా జీఎస్ జీవి తంలో ఒక దశను వెల్లడించే ఘటనల అక్షరరూప చిత్ర చయనిక. ఆ ఘటనల అంతరార్ధాన్ని జీఎస్ వివరించిన తీరు ప్రత్యేకంగా ఉంటుంది. జీఎస్ పత్రికా రంగంలోకి యాదృచ్ఛికంగా వచ్చినవారు కాదు. తను చదివిన మొదటి పత్రిక ‘కృష్ణా పత్రిక’ అన్న సంగతి కూడా ఆయన గుర్తుంచుకున్నారు. అనుకోకుండా ఆ పత్రికకు పాఠకుడయ్యారు జీఎస్. 1954 ప్రాంతం నుంచి పత్రికా రచన, జర్నలిజం కోర్సుతో పరిచయం ఏర్పడినవారాయన. అంటే దాదాపు నాన్ ముల్కీ అలజళ్లు, ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి జరిగిన చరిత్రకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ఒక పత్రికా రచయితగా ఈ చరిత్రను గమనించారు. సంపాదక లేఖగా జీఎస్ పంపిన రచననే ‘స్వతంత్ర’ పత్రిక వ్యాసం రూపంలో ప్రచురించిందట. అదే జీఎస్ తొలి వ్యాసం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు చేసిన తరువాత ‘ది హిందూ’లో కొద్దికాలం ఇంటర్న్‌షిప్ చేశారు జీఎస్. అప్పటి అనుభవాలు కొత్తగా పత్రికా రచనలోకి వస్తున్నవారు చదివితే విస్మయం కలుగుతుంది. చిరస్మరణీయ ఉదంతం పేరుతో ఆనాటి చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మగారితో జీఎస్‌కు ఎదురైన అనుభవం వంటిది తమ జీవితంలో కూడా సంభవించాలని ప్రతి పత్రికా రచయిత కోరుకోవాలి. తెలుగు సాహితీ వైభవాన్ని పరిశీలించే అవకాశం కూడా జీఎస్‌కు వచ్చింది. ఆ అనుభవాలు కూడా చక్కగా రాశారు. అలాగే రాసిన వార్తకు రమణీయమైన శీర్షిక పెట్టడం పత్రికా రచయిత ప్రతిభను, సృజనను వెల్లడిస్తుంది. ఈ అంశాన్ని కూడా జీఎస్ చర్చించారు. అనుభవజ్ఞుడైన ఒక పత్రికా రచయిత జీవిత చరిత్ర భావి పత్రికా రచయితలకు దివిటీ వంటిదే. అలాంటి పత్రికా రచయిత చుట్టూ ఉండే విషయాలు సామాన్య పాఠకులను కూడా ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఈ ‘జ్ఞాపకాల వరద’ చదవవలసిన పుస్తకమే. జ్ఞాపకాల వరద, డా. జి.యస్. వరదాచారి, ఎమెస్కో ప్రచురణ. పేజీలు 272, వెల రూ. 150/– నేటి ఉదయం 10గంలకు హైదరాబాద్‌లో (సోమాజీగూడ ప్రెస్‌క్లబ్) ‘జ్ఞాపకాల వరద’ను ఆవిష్కరిస్తున్న సందర్భంగా.. – గోపరాజు -
రాజధాని నిర్మాణానికి సమయం కావాలి
ప్రతి ఒక్కరిదీ ఒక్క రూపాయైనా భాగస్వామ్యం ఉండాలి తాత్కాలిక అసెంబ్లీ భవన ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు సాక్షి, అమరావతి: తాను అనుకున్న విధంగా రాజధాని నిర్మాణం చేయాలంటే సమయం, తగినన్ని వనరులు కావాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక శాసనసభ, శాసనమండలి భవనాలకు చంద్రబాబు గురువారం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పొలంలో అయినా అసెంబ్లీ బ్రహ్మాండంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణం అంటే ఒక్క ముఖ్యమంత్రి లేదా మంత్రులో చేసేది కాదని, ప్రతి ఒక్కరిదీ ఒక్క రూపాయైనా భాగస్వామ్యం ఉండాలని కోరారు. చంద్రబాబు తాత్కాలిక శాసనసభ, శాసనమండలి భవనాలను పరిశీలించారు. వారు అసెంబ్లీలో తమకు కేటాయించే కుర్చీల్లో కూర్చొని పరిశీలించారు. అసెంబ్లీ భవనాల్లో తమ చాంబరులో కూర్చొని కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు గాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి ఏర్పాటుకు బదులుగా ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున అదనపు భత్యం చెల్లింపునకు సంబంధించిన ఫైలుపై చంద్రబాబు గురువారం సంతకం చేశారు. ప్రజా గోడుకు పోలీసు ‘చాటు’ ప్రజలు తమ సమస్యలపై గొంతెత్తకుండా ప్రభుత్వం పోలీసులను ఉపయోగించడం రాష్ట్రంలో ఎక్కువైంది. శాసనసభ, మండలి భవనాల ప్రారంభోత్సవం అనంత రం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతు న్నప్పు డు సభికుల మధ్య కూర్చొన్న ఒక మహిళ లేచి తనకు జరి గిన అన్యాయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఆమెకు అక్కడున్న పోలీసులు ఆ అవకాశం లేకుండా చేశారు. దీనితో ఆమె నిరాశకు గురయ్యారు. కాగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణితో పాటు ప్రభు త్వ సీఎస్ అజయ్ కల్లం, డీజీపీ ఎన్. సాంబశివరావు, పలు వురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. -
ట్రంప్ ట్రింఫ్.. ఓ టెక్నాలజీ అద్భుతం
వాషింగ్టన్: ‘డొనాల్డ్ జాన్ ట్రంప్ అనే నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా విశ్వసనీయతతో విధులు నిర్వర్తిస్తానని, దేశ సంరక్షణకు శాయశక్తులా కృషిచేస్తానని, సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను’ అంటూ లక్షలమంది సాక్షిగా వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో ట్రంప్.. అసలైన ట్రింఫ్ (విజయోత్సవం) జరుపుకున్నారు. అదే వేదికపై అధ్యక్షుడి హోదాలో ఆయన చేసిన తొలి ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నిదేశాల్లోని వార్తాపత్రికలు, న్యూస్ చానెళ్లు ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని హైలైట్ చేశాయి. అయితే అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు మాత్రం ట్రంప్ చిన్నబుచ్చుకునేలా.. జనంలేని ప్రదేశాల ఫొటోలను ప్రధానంగా ప్రచురించాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ట్రంప్.. జర్నలిస్టులను నీతిలేని వాళ్లంటూ తిట్టిపోశారు. ఈ గొడవ సంగతి పక్కనపెడితే.. ట్రంప్ ట్రింఫ్ సందర్భంగా ‘సీఎన్ఎన్’ చిత్రీకరించిన ఫొటో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. క్యాపిటల్ భవనంపై ట్రంప్ ప్రసంగిస్తుండగా, బిడ్డింగ్తోపాటు సుదూరంలో ఉన్న జనాలను సైతం కవర్‌చేస్తూ 360 డిగ్రీల కోణంలో ఓ గిగాపిక్సల్ ఫొటోను తీశారు. దూరం నుంచి తీసినప్పటికీ, ఫొటోను జూమ్ చేస్తూ పోయేకొద్దీ అక్కడున్న అందరి ముఖాలను స్పష్టంగా చూడొచ్చు. కుడి, ఎడమలకు పాన్ చేస్తూ 360 డిగ్రీల అనుభూతిని పొందొంచ్చు. టెక్నాలజీ పరంగా అద్భుతమంటూ ప్రశంసలు పొందుతున్న ఫొటోను మీరూ చూసి ఆనందించాలనుకుంటే.. ఇక్కడ క్లిక్ చేయండి. -
జనవరి 20నే ప్రమాణం ఎందుకు?
(సాక్షి నాలెడ్జ్ సెంటర్): లీప్ సంవత్సరం నవంబర్‌లో అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన అభ్యర్థి జనవరి 20న ప్రమాణం చేసే సంప్రదాయం 1937లో ఆరంభమైంది. దేశ 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ రెండోసారి 1936లో ఎన్నికయ్యాక జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు వరకూ మార్చి4న కొత్త అధ్యక్షుడు ప్రమాణం చేయడం సంప్రదాయంగా 140 ఏళ్లు కొనసాగింది. ఎఫ్డీ రూజ్వెల్ట్ తొలిసారి 1932లో గెలిచి మార్చి4న ప్రమాణం చేశారు. ఇలా ఆయన మార్చి4న ప్రమాణం చేసిన చివరి అధ్యక్షునిగా, జనవరి 20న పదవీ స్వీకారం చేసిన తొలి దేశాధినేతగా చరిత్రకెక్కారు. అమెరికా తొలి అధ్యక్షుడి తొలి ప్రమాణం ఏప్రిల్ 30న ఎన్నికైన అధ్యక్షుడి ప్రమాణం తేదీని మార్చి4గా అమెరికా రాజ్యాంగం నిర్ణయించింది. నవంబర్ మొదటివారంలో జరిగిన పోలింగ్ తర్వాత ఎన్నికల ప్రక్రియ సంబంధించిన పూర్తి చేయడానికి, అధ్యక్షుడితోపాటు ఎన్నికైన ప్రజాప్రతినిధులు దేశ రాజధానికి చేరుకోవడానికి(18 శతాబ్దం చివరిలో ఇప్పటిలా రవాణా సౌకర్యాలు లేవు) తగినంత అంటే దాదాపు నాలుగు నెలల సమయం ఇవ్వడానికి మార్చి 4ను ముహూర్తంగా నిర్ణయించారు. అయితే, కొన్ని కార ణాల వల్ల తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ మొదటిసారి 1789 ఏప్రిల్ 4న ప్రమాణం చేశారు. రెండోసారి ఆయన 1797 మర్చి4న ప్రమాణం చేయడంతో ఈ రాజ్యాంగ సంప్రదాయం 1933 వరకూ కొనసాగింది. 1789 మార్చి 4న అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే అప్పట్లో మార్చి 4కు అంత ప్రాధాన్యం ఇచ్చారు. 1933లో 20వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రమాణం తేదీ మార్చారు. ప్రమాణం ఎలా? ఎవరితో? జనవరి 20 మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లేదా తర్వాత అధ్యక్షునితో ప్రమాణం చేయిస్తారు. సాధారణంగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త అధ్యక్షునితో ప్రమాణం చేయిస్తారు. ప్రమాణం తర్వాత అధ్యక్షుడు తొలిసారి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అధ్యక్షుడు బరాక్ ఒబామాతో రెండుసార్లూ(2009, 2013) అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. రేపు జనవరి 20న కూడా డొనాల్డ్ ట్రంప్‌తో రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు. ఇండియాలో మాదిరిగా వయసును బట్టి అమెరికాలో జడ్జీలు రిటైరుకారు. అధ్యక్షుడు మరణిస్తే ఉపాధ్యక్షుడే వారసుడు రాజ్యాంగం ప్రకారం పదవిలో ఉన్న అధ్యక్షుడు మరణించడం, రాజీనామా చేయడం జరిగితే ఉపాధ్యక్షుడు అధ్యక్షుడవుతారు. సాధారణంగా మరణించిన రోజు లేదా రాజీనామా అమోదించిన రోజు ఉపాధ్యక్షుడు దేశాధ్యక్షునిగా ప్రమాణం స్వీకారం చేస్తారు. ఇలా పదవిలో ఉన్న అధ్యక్షుల మరణం(సహజ మరణం లేదా హత్యకు గురికావడం) లేదా రాజీనామా ఫలితంగా ఇప్పటి వరకూ 9 మంది అమెరికా ఉపాధ్యక్షులు అధ్యక్షులయ్యారు. పదవిలో ఉండగా మరణించినవారు(సహజ మరణం) నలుగురు అధ్యక్షపదవిలో ఉండగా సహజ మరణం పొందినవారు నలుగురు. వారు:1841లో విలియం హెన్రీ హ్యారిసన్(9వ అధ్యక్షుడు), 1850లో జకారి టేలర్(12), 1923లో వారెన్ జి.హార్డింగ్(29), 1945లో ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్(32). హత్యకు గురైన నలుగురు అధ్యక్షులు అమెరికా చరిత్రలో గొప్ప అధ్యక్షుల్లో ఒకరైన అబ్రహం లింకన్(16) పదవిలో ఉండగా(1865 ఏప్రిల్15న రెండోసారి ఎన్నికై ప్రమాణం చేసిన నెలకే) హత్యకు గురైన తొలి అధ్యక్షునిగా చరిత్రకెక్కారు. మిగిలినవారు: 1881లో జేమ్స్ ఎ.గార్ఫీల్డ్(20), 1901లో విలియం మెక్‌కిన్లీ(25), 1965లో జాన్ఎఫ్ కెనడీ(35). అభిశంసన తప్పించుకుని రాజీనామాచేసిన ఒకే ఒక్కడు రిచర్డ్ నిక్సన్ 35వ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌కు(రిపబ్లికన్) అనేక ప్రత్యేకతలున్నాయి. 1960 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి 1968 ఎన్నికల్లో గెలవడం నిక్సన్ ప్రత్యేకత.1972 ఎన్నికల్లో రెండోసారి గెలిచాక, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణ, అమెరికా కాంగ్రెస్ తీర్పు కారణంగా రాజీనామా చేశారు నిక్సన్. అధ్యక్ష పీఠం వైట్‌హౌస్‌లో కూర్చుని ఇలా రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనకు పాల్పడి, కాంగ్రెస్ అభిశంసనను తృటిలో తప్పించుకుని, రాజీనామా చేసి అపకీర్తి మూటగట్టుకున్న అధ్యక్షునిగా చరిత్రలో ఆయన నిలిచిపోయారు. నాలుగుసార్లు గెలిచిన ఏకైక నేత ఫ్రాక్లిన్ రూజ్వెల్ట్ 32వ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్డ్ 12 ఏళ్ల ఒక నెల 8 రోజులు పదవిలో ఉండి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో తొలి ప్రెసిడెంట్ జార్జి వాషింగ్టన్ సహా 15 మంది అధ్యక్షులు రెండుసార్లు ఎన్నికయ్యారు. 23 మంది ఒక్కసారి మాత్రమే ఎన్నికయ్యారు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ మాత్రం నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఆయన నాలుగోసారి గెలిచాక మూడు నెలలే పదవిలో ఉండి మరణించారు. 22వ రాజ్యాంగ సవరణతో పదవి 8 ఏళ్లకే పరిమితం రూజ్వెల్ట్ మరణించాక 1947లో 22వ రాజ్యాంగ సవరణ తెచ్చి, రెండుసార్లకు మించి అధ్యక్షపదవిలో ఉండకూడదనే నిబంధన తీసుకొచ్చారు. ఇలాంటి నిబంధన ఏదీలేకున్నా తొలి అధ్యక్షుడు వాషింగ్టన్ మూడోసారి అధ్యక్షుడుకావడానికి అంగీకరించలేదు. అధ్యక్షుడి మరణం కారణంగా ఈ పదవిలోకి వచ్చిన తొమ్మిది మందిలో నలుగురు ఒక్కొక్కసారి ఈ పదవికి ఎన్నికయ్యారు. ఇలా అధ్యక్ష పదవి ఖాళీ కావడంతో ప్రెసిడెంట్ అయిన చివరి నేత జెరాల్డ్ ఫోర్డ్ సహా ఐదుగురు రెండోసారి అధ్యక్షులు కాలేకపోయారు. 70 ఏళ్ల వయసులో ప్రమాణం చేస్తున్న 45వ అధ్యక్షుడు అధ్యక్షునిగా తొలిసారి ప్రమాణం చేసినప్పుడు ఎక్కువ వయసు ఉన్న నేతగా ఇప్పటి వరకూ రోనాల్డ్ రీగన్(69 ఏళ్ల 345 రోజులు) రికార్డుల్లో ఉన్నారు. 1981లో మొదటిసారి ప్రమాణంచేసిన రీగన్ రికార్డును రేపు జనవరి 20న డొనాల్డ్ జె.ట్రంప్ బద్దలగొట్టబోతున్నారు. ఆ రోజున ట్రంప్ వయసు 70 సంవత్సరాల, ఏడు నెలల, ఏడు రోజులు. జీవించి ఉన్న నలుగురు మాజీ అధ్యక్షుల్లో ఇద్దరు బిల్ క్లింటన్, జార్జి డబ్ల్యూ బుష్ మాదిరిగానే ట్రంప్ కూడా 1946లో పుట్టారు. అందరి చిన్న అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ ఇప్పటి వరకూ అధ్యక్షులైన 44 మంది నేతల్లో తొలి ప్రమాణం నాటికి అందరికన్నా చిన్నవాడిగా థియోడర్ రూజ్వెల్ట్(27వ) రికార్డు సృష్టించారు. అప్పటికి ఆయన వయసు 42 ఏళ్ల 322 రోజులు. అప్పటి అధ్యక్షుడు విలియం మెక్‌కిన్లీ రెండోసారి గెలిచి ప్రమాణం చేసిన ఆరు నెలలకే హత్యకుగురవడంతో రూజ్వెల్ట్కు అవకాశం వచ్చింది. ఆయన తర్వాత చిన్నవాడు జాన్ ఎఫ్ కెనడీ. ఆయన వయసు 43 ఏళ్ల 236 రోజులు. ఆ తర్వాత తక్కువ వయసులో ప్రమాణం చేసిన ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ వయసు 1993 జనవరి 20 నాటికి 46 ఏళ్ల 156 రోజులు. 50 నిండకుండా అధ్యక్షులైన 9 మంది నేతలు 227 ఏళ్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో 50 ఏళ్లు నిండకుండా మొదటిసారి అధ్యక్షునిగా ప్రమాణం చేసిన నేతలు 9 మంది. వారిలో అయిదో నేత ప్రస్తుత(44వ) అధ్యక్షుడు బారక్ హుసేన్ ఒబామా. ఆయన వయసు 2009 జనవరి 20 నాటికి 47 ఏళ్ల 167 రోజులు. జీవించి ఉన్న మాజీ అధ్యక్షులు నలుగురులో ఇద్దరికి 92 ఏళ్లు ఒక్కొక్కసారే అధ్యక్షులుగా ఉన్న 39వ అధ్యక్షుడు జిమీ కార్టర్, 41వ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్–ఇద్దరూ 1924లో జన్మించారు. ఈ నెల 20 సాయంత్రానికి బతికి ఉన్న మాజీ అధ్యక్షులు అయిదుగురవుతారు.. ప్రమాణం చేసిన రోజే శ్వేతసౌధంలోకి డొనాల్డ్ ట్రంప్ అమెరికా చట్టసభలకు నెలవైన సంయుక్త రాష్ట్రాల కాపిటల్ భవనం(వాషింగ్టన్ డీసీ) మెట్ల మీద కొత్త అధ్యక్షునిగా ప్రమాణం చేసిన రోజే(జనవరి 20న)డొనాల్డ్ జె. ట్రంప్ అధికార నివాసం వైట్‌హౌస్‌లోకి కుటుంబసమేతంగా ప్రవేశిస్తారు. ఆ రోజు ఉదయం అధ్యక్ష భవనంలోని తన పడకగదిలో నిద్రలేచే అధ్యక్షుడు బరాక్ ఒబామా సాయంత్రానికి భార్య మిషెల్, కూతుళ్లు మాలియా, సాషాతో కలిసి నగరంలోని మరో భవనంలోకి వెళ్లిపోతారు. నవంబర్ 8 పోలింగ్ తర్వాత పది వారాలకు జరిగే ఈ లాంఛనం సమయంలోనే ఒబామా కుటుంబానికి సంబంధించిన లగేజిని అధ్యక్ష భవనం సిబ్బంది తరలించే ఏర్పాట్లలో ఉంటారు. మరి కొందరు సిబ్బంది ట్రంప్, ఆయనతో నివసించే ఆయన కుటుంబ సభ్యుల సామాన్లు తీసుకొచ్చి వైట్‌హౌస్‌లో సర్దే పనిలో హడావుడిగా నిమగ్నమౌతారు. శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్‌తో 45వ అధ్యక్షునిగా అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయిస్తారు. ట్రంప్‌కు ముందు ఉపాధ్యక్షునిగా మైకేల్ పెన్స్ ప్రమాణం ఉంటుంది. ఈ ప్రమాణాల తర్వాత కొత్త అధ్యక్షుడి హోదాలో తొలి ప్రసంగం చేస్తారు. ప్రమాణాలకు, ప్రసంగానికి మధ్య సంగీత నృత్య ప్రదర్శనలతోపాటు ధార్మిక నేతల అనుగ్రహ భాషణలుంటాయి. (1789 ఏప్రిల్ 30న అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ కూడా ఇలాగే ప్రమాణం తర్వాత ప్రసంగించారు. తొలి అధ్యక్షుడు ప్రమాణం, మొదటి ప్రసంగం అప్పటి తొలి రాజధాని న్యూయార్క్ నగరం ఫెడరల్ హాల్లో చేశారు. వాషింగ్టన్‌తో న్యూయార్క్ చాన్సలర్ ప్రమాణం చేయించారు) ఒబామాకు వీడ్కోలు పదవీ విరమణ చేసిన అధ్యక్షుడు ఒబామా వీడ్కోలు కార్యక్రమం ముగిశాక, ట్రంప్ దేశాధ్యక్షుని హోదాలో తొలిసారి అమెరికా కాంగ్రెస్ మధ్యాహ్న భోజన విందులో పాల్గొంటారు. తర్వాత అధ్యక్ష ప్రారంభోత్సవ పరేడ్‌లో కూడా పాల్గొంటారు. వెంటనే ప్రమాణం చేసిన ప్రదేశం కాపిటల్ నుంచి ట్రంప్ కాన్వాయ్‌తో పెన్సిల్వేనియా అవెన్యూ(కాపిటల్, వైట్‌హౌస్‌ను కలిపి మెయిన్‌రోడ్) ద్వారా నెమ్మదిగా అధ్యక్షభవనం శ్వేతసౌధానికి చేరుకుంటారు. మైలున్నర పొడవున్న దారికి ఇరు వైపులా శ్రేయోభిలాషులు, నిరసనకారులు ఉంటారు. ఇలా నాలుగేళ్ల అధ్యక్ష పదవి కారణంగా ట్రంప్ బస వైట్‌హౌస్‌లో జనవరి 20 సాయంత్రం నుంచి మొదలవుతుంది. మరుసటి ఉదయం వైట్‌హౌస్ పడకగదిలో నిద్రలేచాక ఆఫీసు సమయానికి సిద్ధమై, వెస్ట్ వింగ్‌లోని తన కార్యాలయానికి ట్రంప్ నడుకుంటూ వెళతారు. -
ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది వైఎస్
-
కొత్త జిల్లాలను ప్రారంభించే ప్రముఖులు వీరే..
హైదరాబాద్ : తెలంగాణలో నూతనంగా ఏర్పాటుచేయనున్న జిల్లాలను ప్రారంభించే ప్రముఖుల పేర్లను సర్కార్ ప్రకటించింది. వారి వివరాలు... సిద్దిపేట- సీఎం కేసీఆర్, పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు. జనగామ- శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ జయశంకర్ జిల్లా- శాసనసభాపతి మధుసూదనాచారి మెదక్- ఉప సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి జగిత్యాల- ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ వరంగల్ రూరల్- ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి యాదాద్రి- హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పెద్దపల్లి- మంత్రి ఈటల రాజేందర్ కామారెడ్డి- మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంచిర్యాల- మంత్రి పద్మారావు వికారాబాద్- మంత్రి మహేందర్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల- మంత్రి కేటీఆర్ కొమురం భీం ఆసిఫాబాద్- మంత్రి జోగురామన్న సూర్యాపేట- మంత్రి జగదీశ్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్మల్- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాగర్‌కర్నూల్- మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబాబాద్- మంత్రి చందూలాల్ జోగులాంబ గద్వాల- మంత్రి లక్ష్మారెడ్డి మేడ్చల్(మల్కాజ్గిరి)- తలసాని శ్రీనివాస యాదవ్ వనపర్తి- ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి -
మోదీ అంటే సంతోషాన్ని ఇచ్చేవారు
-
రామగుండంలో భూ నిర్వాసితుల ఆందోళన
-
కాళేశ్వరానికి తొలి అడుగు
► నేడు మేడిగడ్డ వద్ద భూమి పూజ చేయనున్న సీఎం ► పాజెక్టుతో కొత్తగా 18 లక్షల ఎకరాలకు నీరు.. ► 12 లక్షల ఎకరాల స్థిరీకరణ ► రూ. 69,581.33 కోట్ల వ్యయం ► 4,500 మెగావాట్ల విద్యుత్ అవసరం ► 185 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీల నిర్మాణం ► రెండేళ్లలో మల్లన్నసాగర్‌కు నీరివ్వాలని లక్ష్యం సాక్షి, హైదరాబాద్: నీటి కరువుతో అల్లాడుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సోమవారం తొలి అడుగు పడనుంది. ఉదయం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భూమి పూజ చేయనున్నారు. 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 12 లక్షల స్థిరీకరణ లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పురుడు పోసుకుంటోంది. 2017 నాటికి మెజార్టీ పనులను పూర్తి చేసి మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు పనులను పూర్తి చేసి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని ప్రభుత్వం సంకల్పించింది. పూర్తి స్థాయి లభ్యత!: ప్రాణహిత-చేవెళ్ల రీడిజైనింగ్‌లో భాగంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న నీటి లభ్యత, అంతర్రాష్ట్ర సమస్యలు, ఆయకట్టు లక్ష్యాలు ఇప్పటికే కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రాణహిత పాత డిజైన్‌లో ఉన్న తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతతో పోలిస్తే మేడిగడ్డ వద్ద లభ్యత ఎక్కువగా ఉన్నందున నిర్ణీత 160 టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తమ్మిడిహెట్టి వద్ద 1,144.8 టీఎంసీల సరాసరి లభ్యత ఉండగా.. కాళేశ్వరం వద్ద 1,651 టీఎంసీల లభ్యత ఉంటుంది. తమ్మిడిహెట్టి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలు అయితే.. మేడిగడ్డ వద్ద సామర్థ్యం 101 మీటర్ల ఎత్తులో 19 టీఎంసీలుగా ఉండనుంది. ఇక్కడ్నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశముందని ప్రభుత్వం చెబుతోంది. ప్రాణహిత డీపీఆర్ మేరకు తమ్మిడిహెట్టి నుంచి రంగారెడ్డికి నీటి మళ్లించే క్రమంలో మొత్తంగా 10 రిజర్వాయర్లను 16 టీఎంసీల సామర్ధ్యంతో చేపట్టాలని నిర్ణయించగా.. ఇప్పుడు ఏకంగా 185 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు, బ్యారేజీలు ప్రతిపాదించారు. వీటి ద్వారా 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు మరో 12 లక్షల ఎకరాలను స్థిరీకరించి మొత్తంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు 4,500 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉండగా.. ప్రాజెక్టుకు రూ.69,581.33 కోట్ల ఖర్చవుతుందని లెక్కగట్టారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు ఆయకట్టుకు పారేలా ప్రణాళిక ఉండాలని ప్రభుత్వం అధికారులకు మార్గదర్శనం చేసింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ వరకు అన్ని పనులను పూర్తి చేయడం, వీలైనంత నీటిని నిల్వ చేసుకోవడం, తక్షణమే కనీసం 5 లక్షల ఎకరాలకు నీరందించడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. ప్రాజెక్టు పరిధిలో కాల్వలు, రిజర్వాయర్లు, టన్నెళ్ల పనులన్నీ ఏకకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ముంపు లెక్కలు కొలిక్కి.. మేడిగడ్డ బ్యారేజీతో మహారాష్ట్రలో ఉండే ముంపు ఎంతో తేలింది. 102 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే 399 హెక్టార్లు, 101.5 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 315 హెక్టార్లు, 101 మీటర్ల ఎత్తులో 240 హెక్టార్లు, 100 మీటర్ల ఎత్తులో 83 హెక్టార్ల ముంపును నిర్ధారించారు. ఇందులో 102 మీటర్లు, 101 మీటర్ల ఎత్తులో పెద్దగా ముంపు లేనందున ఈ ఎత్తులను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రను కోరే అవకాశం ఉంది. ఒకవేళ 102 మీటర్ల ఎత్తుకు అంగీకరిస్తే బ్యారేజీ నిల్వ సామర్ధ్యం 22 టీఎంసీలు ఉండనుంది. 101 మీటర్లకు పరిమితమైతే 19.73 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంటుంది. మేడిగడ్డ ముంపు సర్వే కొలిక్కి రావడం, తమ్మిడిహెట్టిపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఉన్న నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించి ఈ వారంలోనే తెలంగాణ, మహారాష్ట్రల మధ్య మరో దఫా చర్చలు జరగనున్నాయి. అధికారుల స్థాయిలో చర్చలు ముగించి, ఈ నెలలోనే ముఖ్యమంత్రుల స్థాయిలో ఏర్పాటైన అంతరాష్ట్ర బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమయం ఇచ్చిన వెంటనే ఒప్పందాల ప్రక్రియ ముగించి, మేడిగడ్డ బ్యారేజీకి అధికారికంగా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ద్వారా జిల్లాల వారీగా ప్రతిపాదిత ఆయకట్టు ఇదీ.. జిల్లా ఆయకట్టు ఆదిలాబాద్ 1,00,000 నిజామాబాద్ 4,54,500 కరీంనగర్ 2,01,449 మెదక్ 7,30,646 వరంగల్ 20,595 నల్లగొండ 2,62,360 రంగారెడ్డి 50,000 మొత్తం 18,19,550 (దీంతోపాటు 11,80,450 ఎకరాలను స్థిరీకరించనున్నారు. ఈ లెక్కన మొత్తం ఆయకట్టు 30 లక్షల ఎకరాలవుతుంది) కాళేశ్వరం రిజర్వాయర్లు, సామర్థ్యాలు ఇలా.. రిజర్వాయర్ సామర్థ్యం(టీఎంసీల్లో) మేడిగడ్డ (101మీటర్లు)19.73 అన్నారం 6.22 సుందిళ్ల 2.16 పత్తిపాక 5.50 మలక్‌పేట 3 అనంతగిరి 3.50 ఇమామాబాద్ 2.50 మల్లన్నసాగర్ 50 కొండపోచమ్మ 21 బస్వాపూర్ 14.16 గంధమల 9.87 మోతె 2.90 గుజ్జుల 1.50 కాటేవాడి 5 తడమడ్ల 5 తిమ్మక్కపల్లి 3 ఖాచాపూర్ 2.50 ఇసాయిపేట 2.50 మంచిప్ప 5 హైదరాబాద్ నీటిసరఫరా 20 మొత్తం 185.19 కాళేశ్వరం ద్వారా వివిధ కింద స్థిరీకరణ ఇలా (టీఎంసీల్లో) ఎల్లంపల్లి 20 మిడ్‌మానేరు 25 ఎల్ఎండీ 25 నిజాంసాగర్ 17 సింగూరు 29 ఎస్సారెస్పీ 80 గౌరవెల్లి 9 గండిపల్లి 1.50 మొత్తం 206.50 -
రాజధాని ఉద్యోగులకు 5 రోజులే పనిదినాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు లేవు, ఆదాయము లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం తెల్లవారుజామున ఏపీ సచివాలయ భవన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం విడిపోవాలని మనం కోరుకోలేదని.. విభజన చేయాలంటే ఏపీకి న్యాయం చేయాలని చెప్పానన్నారు. రాజధాని అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉంటాయని చెప్పారు. ఉద్యోగులకు 30 శాతం హెచ్ ఆర్ ఏ ప్రకటించారు. ఉద్యోగులకు రాజధాని ప్రాంతంలో 5 వేల గృహాల సముదాయం నిర్మిస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.2,400 కోట్లు మంజూరు చేస్తూ ఫైలుపై సంతకం చేశారు. రుణ ఉపశమనంలో బ్యాలెన్స్ రూ. 178 కోట్ల విడుదల ఫైలుపై సంతకం చేశారు. 'అమరావతికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నా. రైతులు, రాజధాని ప్రాంత పేదలు బాగుండాలి. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు జూన్ 15 నాటికి పూర్తవుతాయి. నాపై నమ్మకముంచి 33,500 ఎకరాల భూమి ఇచ్చారు. ప్రపంచంలో 10 ఉత్తమమైన రాజధానుల్లో మన రాజధానుంటుంది. సీఎం అయిన వెంటనే సింగపూర్ వెళ్లి రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని కోరాను. 6 నెలల్లో సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. జూన్‌లో మంచి రోజులు లేనందున ఇవాళే సచివాలయాన్ని ప్రారంభించాం. రెండో విడత రైతు రుణమాఫీపై సంతకం చేస్తున్నట్లు' చంద్రబాబు చెప్పారు. -
'వైద్యులు నైతిక విలువలకు కట్టుబడాలి'
విజయవాడ: ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు సమగ్ర వైద్యం అందించడంతో పాటు వైద్యులు నైతిక విలువలకు కట్టుబడి ఉండటమే ప్రధాన ఉద్దేశ్యంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్హతలు, మెరిట్ ప్రతిపాదికన 1000 నర్సులు,501 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. వైద్య ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు చెబుతున్నట్లు సమాచారం తమ వద్ద ఉన్నదని వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 'ప్రస్తుత పరిస్ధితులలో సిఫార్సుల ద్వారా నా కొడుకు, కూతురుకు కూడ ఉద్యోగం ఇప్పించుకోలేనని.. అంత పారదర్శకంగా కాంట్రాక్ట్ ఉద్యోగ నియమకాలు చేపడుతున్నాం' అని మంత్రి కామినేని వెల్లడించారు. ఇప్పటివరకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల క్రింద లక్ష మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. గర్భిణీలకు మార్చి 8 వ తేది నుండి అల్ట్రా సౌండ్ పరీక్షలను ఉచితంగా చేస్తామని తెలిపారు. త్వరలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
'త్వరలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్‌ను గుంటూరులో ఏర్పటు చేయనన్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు నెల్లూరులో ట్రామా కేర్ సెంటర్, అరకులో నేచర్ క్యూర్ ఆసుపత్రులను నిర్మంచనున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, కాకినాడ ప్రభుత్వాసుపత్రుల్లో వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. -
'అమరావతి అజరామరంగా నిలుస్తోంది'
ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అమరావతి అజరామరంగా నిలుస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోది అభివృద్ధి మంత్రంతో ప్రపంచం మొత్తం ప్రస్తుతం భారత్ వైపు చూస్తుందన్నారు. దేశం మాత్రం తెలుగురాష్ట్రాల వైపు చూస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. తెలుగు ప్రజల క్షేమం కోరుకునే వ్యక్తిగా తాను హామీల అమలుకు కృషి చేస్తానన్నారు. స్వయానా భారత ప్రధాని నరేంద్రమోదీనే పార్లమెంట్ ప్రాంగణం నుండి మట్టిని, పవిత్ర యమునా నది నుండి నీటిని తీసుకొచ్చి నేను సైతం అంటూ రాజధాని నిర్మానానికి తీసుకొచ్చారని అన్నారు. శాతవాహనులు, ఇక్ష్వాకులు లాంటి గొప్ప రాజవంశాల పాలనకు వారసత్వంగా అమరావతి అజరామరమై నిలుస్తోందన్నారు. -
అమరావతిలో మోదీ పర్యటన ఖరారు
- రాజధాని శంకుస్థాపన అనంతరం తిరుమల వెళ్లనున్న ప్రధాని హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి రాక ఖరారయింది. ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 11:45కు గన్నవరం చేరుకునే ఆయనకు అధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకోనున్న మోదీ.. మధ్యాహ్నం 12:35 గంటలకు రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దాదాపు రెండు గంటలపాటు అక్కడే గడుపుతారు. ఆ తరువాత 2:45 గంటలకు అమరావతి నుంచి తిరుపతికి పయనమవుతారు. 4:05 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడినుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకుంటారు. సాయంత్రం 5:25 గంటలకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. కార్యక్రమాలను ముగించుకుని రాత్రి 7:30 గటలకు మోదీ తిరిగి ఢిల్లీ పయనమవుతారు. ఈ మేరకు ప్రభుత్వాధికారులు ప్రధాని పర్యటన వివరాలను శుక్రవారం వెల్లడించారు. -
'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు'
-
'ఎక్కడి రైతులకు అక్కడే అభివృద్ధి భూములు'
హైదరాబాద్ : నూతన రాజధాని నిర్మాణానికి అక్టోబర్ 22 న శంకుస్థాపన చేస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంత రైతుల నుంచి ఇప్పటివరకూ 21,500 ఎకరాలకు అగ్రిమెంట్లు కుదిరాయని ఆయన చెప్పారు. ఏ గ్రామంలో రైతులకు అదే గ్రామంలో అభివృద్ధి చెందిన భూములు ఇస్తామన్నారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చిందని ఆయన అన్నారు. ఈ తీర్పు ఆధారంగా భూ సమీకరణ మరింత సులభంగా సాగుతుందని మంత్రి పేర్కాన్నారు. ఒకవేళ భూములివ్వని రైతుల నుంచి..పంటలు పూర్తయ్యాక భూ సేకరణ చేపట్టనున్నట్లు నారాయణ వివరించారు. -
హైదరాబాద్‌లో టెక్నోజెన్ ఐటీ సంస్థ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘రాజకీయ నాయకుడిగా పలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల ప్రారంభోత్సవంలో, సదస్సులు, సమావేశాల్లో పాల్గొన్నానే తప్ప.. నాకు ఏమాత్రం ఐటీ పరిజ్ఞానం లేదు. వయస్సు రీత్యా నేనీ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్హుణ్ణి మాత్రమే’’నని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ టెక్నోజెన్ ఐటీ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సంస్థ సీఈఓ లాక్స్ చీపూరీ మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా ఐటీ సేవలందిస్తున్న సిస్కో టెక్నాలజీ సంస్థే ఈ టెక్నోజెన్ అన్నారు. హెల్త్, మొబిలిటీ, గేమిఫికేషన్, డీడబ్ల్యూ/బీఐ, సీఎక్స్ఎం వంటి ఐటీ సేవలను హైదరాబాద్ కేంద్రంగా అందించేందుకు ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాజన్ నటరాజన్, సీఓఓ దీపక్ థాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిర్‌పోర్ట్‌కు తాళ్లపాక అన్నమయ్య పేరు !
కడప: కడప ఎయిర్‌పోర్ట్‌కు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య పేరు పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఆదివారం కడపలో ఎయిర్‌పోర్ట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప - బెంగళూరు విమాన సర్వీసును చంద్రబాబు ప్రారంభించారు. అయితే అంతకుముందు విమానాశ్రయంలోకి బీజేపీ నేతలు, కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల జోక్యంతో బీజేపీ నేతలు సద్దుమణిగారు. -
'భూమి పూజను అడ్డుకుంటాం'
గుంటూరు: రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేయకుండా జూన్ 6 న భూమి పూజ నిర్వహిస్తే అడ్డుకుంటామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతాంగ సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 2న చంద్రబాబు నాయుడు చేపట్టే నవనిర్మాణ దీక్షను రైతు ద్రోహి దీక్షగా అభివర్ణించారు. -
బార్ ఓపెన్ చేసిన మంత్రులు!
ముంబయి: మహారాష్ట్ర మంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు చెడ్డపేరు తీసుకొచ్చారు. ఆయన కేబినెట్లో బాధ్యతలు నిర్వహిస్తూ అహ్మద్ నగర్లో ఓ బారు షాపును ఓపెన్ చేశారు. దీంతో అది ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు తావునిచ్చింది. హోంశాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న రామ్ షిండే, ఆర్థిక శాఖ సహాయమంత్రిగా పనిచేస్తున్న దీపక్ కేసర్కార్ అహ్మద్ నగర్లో ఓ బారు షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. గతంలో తమ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మధ్య పాన నిషేధానికి కట్టుబడి ఉన్నామని, దఫాలవారిగా ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధమని కేబినెట్ సమేతంగా ఫడ్నవీస్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మంత్రులు చేసిన చర్యలు పలు విమర్శలకు తావిచ్చింది. -
పీవీ నరసింహారావు 'లోపలి మనిషి' పుస్తక ఆవిష్కరణ