
హైదరాబాద్: ఈనెల 15న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణ మధ్య రైల్వే ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ వందే భారత్ రైలు సికింద్రాబాద్ విశాఖ పట్నం మధ్య నడవనుంది. ఈనెల 16 నుండి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ముందస్తు బుకింగ్స్‌ను శనివారం నుంచి చేసుకోవచ్చు.
ఈ వందే భారత్ ట్రైన్‌కు 20833 నంబర్ ఏర్పాటు చేసింది దక్షిమ మధ్య రైల్వే. ఇది ఉదయం 5.45కు విశాఖపట్నం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుకుంటుంది. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుండి బయల్దేరి రాత్రి 11.30కు విశాఖ చేరుకోనుంది.
రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. 14 ఏసీ కోచ్‌లు గల వందే భారత్ రైలులో మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణం చేసేందుకు వెసులు బాటు ఉంది.
చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment