మన్మోహన్ సింగ్, షా మహమూద్ ఖురేషీ
న్యూఢిల్లీ/లాహోర్: కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ యాత్రికుడిలాగా మన్మోహన్ అక్కడికి వెళ్తారని ఆదివారం పేర్కొన్నాయి. కాగా, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలని తాము పంపిన ఆహ్వానాన్ని మన్మోహన్ అంగీకరించారని ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు వెల్లడించాయి. ‘నవంబర్ 9న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన్మోహన్ ఒక ప్రత్యేక అతిథిగా కాకుండా, ఒక సాధారణ వ్యక్తిగా హాజరవుతారు’ అని అక్కడి స్థానిక వార్తాపత్రిక డాన్ పేర్కొంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని సిక్కు జాతా ప్రతినిధుల బృందంతో పాటు మన్మోహన్ సింగ్ పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment