Corridor Project
-
Metro Rail: హైదరాబాద్‌లో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ విస్తరణతో హైదరాబాద్ ప్రజారవాణా ముఖచిత్రంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన నార్త్‌సిటీ మెట్రో కారిడార్లతో ఉత్తర, దక్షిణాలను కలిపే అతిపెద్ద మెట్రో కారిడార్లు అందుబాటులోకి రానున్నాయి. శామీర్‌పేట్, మేడ్చల్ నుంచి నేరుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు రాకపోకలు సాగించవచ్చు. రెండో దశలో ప్రతిపాదించిన అన్ని కారిడార్లు పూర్తయితే హైదరాబాద్ మెట్రో 230.4 కిలో మీటర్ల వరకు విస్తరించనుంది. ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు మెట్రో సదుపాయం ఉంది. రెండో దశలో 190.4 కిలోమీటర్ల కారిడార్లు విస్తరించనున్నారు. వీటితో పాటు ఫోర్త్‌సిటీకి ప్రతిపాదించిన మరో 40 కిలోమీటర్లు కూడా పూర్తయితే మొత్తం 230 కిలోమీటర్లతో చెన్నై, బెంగళూర్ నగరాల మెట్రోల సరసన చేరే అవకాశం ఉంది. రెండో దశలో మొదట 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘బి’ విభాగంగా నార్త్‌సిటీకి రెండు కారిడార్లలో 45 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలను రూపొందించారు. వీటితో పాటు ఎయిర్‌పోర్టు నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు మరో 40 కిలోమీటర్లు కూడా ఈ రెండో దశలోనే పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని వైపులా మెట్రో కారిడార్లు వినియోగంలోకి వస్తే లక్షలాది మంది ప్రయాణికులు అతిపెద్ద కారిడార్లలో రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. మొదట విస్తరించనున్న 5 కారిడార్లలో 2028 నాటికి సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అంచనా. నార్త్‌సిటీ రెండు కారిడార్లతో కలిపి సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల మంది పయనించవచ్చని అంచనా. 2030 నాటికి 15 లక్షలు దాటనుంది. శామీర్‌పేట్ టూ ఎయిర్‌పోర్టు.. శామీర్‌పేట్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి దేశవిదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు శామీర్‌పేట్ నుంచి ప్యారడైజ్, ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు సుమారు 62 కిలోమీటర్ల కారిడార్ వినియోగంలోకి రానుంది. మేడ్చల్ నుంచి కూడా ఎయిర్‌పోర్టు వరకు ఇంచుమించు 63 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, నాగోల్ మీదుగా కూడా రాకపోకలు సాగించవచ్చు. దీంతో మొదటి, రెండో కారిడార్లలో మెట్రోలు మారాల్సి ఉంటుంది. మరోవైపు మేడ్చల్, శామీర్‌పేట్ ప్రాంతాల నుంచి నేరుగా కోకాపేట్, రాయదుర్గం, హైటెక్‌సిటీ ఐటీ సంస్థలకు కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా.. మరోవైపు ఇప్పుడు ఉన్న మూడు కారిడార్లలో కేవలం 69 కిలోమీటర్ల వరకు మెట్రో సదుపాయం ఉంది. దీంతో ప్రయాణికులు ఎక్కడో ఒక చోట మెట్రో నుంచి ప్రత్యామ్నాయ రవాణా సదుపాయంలోకి మారాల్సి వస్తుంది. రెండో దశలో ‘ఏ’ ‘బి’ కారిడార్లు, స్కిల్యూనివర్సిటీ కారిడార్ కూడా పూర్తయితే నలువైపులా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెట్రో ప్రయాణ సదుపాయం లభించనుంది. హయత్‌నగర్ నుంచి పటాన్చెరు.. హయత్‌నగర్ నుంచి పటాన్చెరు వరకు నగరంలో మరో అతిపెద్ద కారిడార్‌లో కూడా మెట్రో పరుగులు తీయనుంది. దీంతో తూర్పు, పడమరల మధ్య సుమారు 50 కిలోమీటర్ల వరకు మెట్రో కనెక్టివిటీ ఏర్పడనుంది. ప్రస్తుతం ఈ రూట్లో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు 29 కిలోమీటర్లు మెట్రో అందుబాటులో ఉంది. కొత్తగా మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 7.1 కిలోమీటర్లు కొత్తగా నిర్మించడం వల్ల మొత్తం 50 కిలోమీటర్లు నిరాటంకమైన రవాణా సదుపాయం లభించనుంది. ప్రస్తుతం ఈ రూట్లో లక్షలాది మంది ప్రయాణికులు సిటీ బస్సులు, సొంత వాహనాలపై ఆధారపడి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఒక్క కారిడార్లోనే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
డబుల్ డెక్కర్ కారిడార్‌కు నేడే శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జంట నగరాలతోపాటు ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల ప్రజలకు ప్రయోజనకరమైన ‘డబుల్ డెక్కర్ కారిడార్’ కు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. 44వ నంబర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)పై దశాబ్దాలుగా వాహనదారులు ఎదుర్కొంటున్న కష్టాలకు దీనితో ఉపశమనం లభించనుంది. రూ.1,580 కోట్లతో 5.32 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. తర్వాత దీనిపైనే మెట్రోరైల్ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇలా.. ప్రతిపాది కారిడార్ సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్‌బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ల మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు వద్ద ముగుస్తుంది. మొత్తం కారిడార్ పొడవు 5.32 కిలోమీటర్లుకాగా.. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.65 కిలోమీటర్లు, అండర్‌గ్రౌండ్ టన్నెల్ సుమారు 600 మీటర్ల వరకు ఉంటాయి. మొత్తం 131 పియర్స్ (స్తంభాలు)తో.. ఆరు వరుసల రహదారిని నిర్మిస్తారు. ఈ కారిడార్లోకి ప్రవేశించేందుకు, దిగేందుకు బోయినపల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా రెండు చోట్ల (0.248 కిలోమీటర్ వద్ద), (0.475 కిలోమీటర్ వద్ద) ర్యాంపులు నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయ్యాక దానిపై మెట్రోరైల్ మార్గం నిర్మిస్తారు. దానితో ఇది డబుల్ డెక్కర్ కారిడార్‌గా మారుతుంది. రోజూ వేలాది వాహనాలు.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్ జంక్షన్ వద్ద రోజూ సగటున 1,57,105 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ పర్ డే– పీసీయూ) ప్రయాణిస్తుంటే.. ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 72,687 వాహనాలు వెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ దారి ఇరుగ్గా ఉండటంతో ట్రాఫిక్ స్తంభించిపోతూ.. వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ఈ కష్టాలు తీరుతాయి. ఎలివేటెడ్ కారిడార్ విశేషాలివీ ► మొత్తం పొడవు: 5.320 కిలోమీటర్లు ► ఎలివేటెడ్ కారిడార్: 4.650 కిలోమీటర్లు ► అండర్‌గ్రౌండ్ టన్నెల్: సుమారు 600 మీటర్లు ► సేకరించాల్సిన భూమి: 73.16 ఎకరాలు ► ఇందులో రక్షణశాఖ భూమి: 55.85 ఎకరాలు ► ప్రైవేట్ స్థలాలు: 8.41 ఎకరాలు ► అండర్‌గ్రౌండ్ టన్నెల్ కోసం: 8.90 ఎకరాలు ► మొత్తం ప్రాజెక్టు వ్యయం: రూ.1,580 కోట్లు ప్రాజెక్టుతో ప్రయోజనాలివీ ► జాతీయ రహదారి–44లో సికింద్రాబాద్‌తోపాటు ఆదిలాబాద్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. ►హైదరాబాద్ నగరం మధ్య నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ఆర్ వరకు చేరుకునే అవకాశం. ►మేడ్చల్–మల్కాజిగిరి–మెదక్–కామారెడ్డి–నిజామాబాద్–నిర్మల్–ఆదిలాబాద్‌కు ప్రయాణికులు, సరకుల రవాణా వేగంగా సాగనుంది. -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్‌పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్‌పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్‌కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్‌సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్‌ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్‌వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్‌ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
నేడు ‘జగన్నాథ్’ కారిడార్ ప్రారంభం.. ప్రత్యేకతలివే!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సన్నాహాల నడుమ ఒడిశాలో జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. దీనిని శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ (ఎస్ఎస్పీ) లేదా జగన్నాథ టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును బుధవారం (జనవరి 17) ప్రారంభించనున్నారు. కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా ఒడిశాలోని పూరీ ప్రాంతాన్ని వివిధ రకాలపూలు, రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించారు. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన ‘మహాయాగం’ మంగళవారం రెండో రోజు కూడా కొనసాగగా, బుధవారం మధ్యాహ్నం గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేబ్ నిర్వహించే ‘పూర్ణాహుతి’తో ముగుస్తుంది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు, జగన్నాథుని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని దర్శనం కోసం భక్తులు నేటి ఉదయం నుంచే బారులు తీరారు. హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి 80 ప్లటూన్ల పోలీసు బలగాలను (ఒక ప్లాటూన్‌లో 30 మంది పోలీసులు) మొహరించినట్లు శ్రీ జగన్నాథ ఆలయ హెరిటేజ్ కారిడార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) తెలిపారు. దాదాపు 100 మంది సూపర్వైజరీ అధికారులు, 250 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులు కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కింద రూ. 800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాద్ పచేరి (బయటి గోడ) చుట్టూ భారీ కారిడార్లు నిర్మించారు. ఇది 12వ శతాబ్దపు ఆలయాన్ని ఒక క్రమ పద్ధతిలో సందర్శించడానికి భక్తులకు సహాయపడుతుంది. పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాలయ వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. పూరీలో శ్రీ జగన్నాథ్ పరిక్రమ ప్రాజెక్ట్ ప్రారంభం రోజున అంటే జనవరి 17న ప్రభుత్వ సెలవు దినంగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. కారిడార్ ప్రాజెక్ట్‌లో పార్కింగ్ స్థలం, శ్రీ సేతు, పుణ్యక్షేత్రం, జగన్నాథ ఆలయ యాత్రికుల రాకపోకలకు కొత్త రహదారి, టాయిలెట్లు, క్లాక్ రూమ్‌లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా గల 90 ప్రముఖ ఆలయాల ప్రతినిధులను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం ఆహ్వానించింది. -
కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బందికి మోదీ ఊహించని బహుమతి
న్యూఢిల్లీ: కాశీలోని విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఊహించని బహుమతి పంపించారు. అక్కడ పనిచేసే సిబ్బంది, కార్మికుల కోసం జూట్‌తో(జనపనార) తయారు చేసిన 100 జతల చెప్పులను పంపించారు. ప్రధాని మోదీ తమకు పాదరక్షలను పంపడంపై కాశీ విశ్వనాథ్ ధామ్ పూజారులు, సిబ్బంది, సేవకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదల పట్ల మోదీకున్న శ్రద్ధకు ఇది నిదర్శనమంటున్నారు. కాగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయ ప్రాంగణంలో పూజారులు, పని చేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు ఇలా ఎవరైనా రబ్బరు, తోలు చెప్పులు ధరించి తిరగడం నిషిద్ధం. ఈ క్రమంలో ఇటీవల కాశీని సందర్శించిన మోదీ.. అక్కడ చాలామంది పూజారులు, సిబ్బంది, పారిశద్ధ్య కార్మికులు కాళ్లకు చెప్పులు లేకుండా అభివృద్ధి పనుల్లో పాల్గొనడాన్ని గమనించారు. ఈ క్రమంలో చలికాలంలో కాళ్లకు చెప్పులు లేకుండా వారు ఇబ్బందులు పడుతుండడం చూసి మోడీ చలించిపోయారు. అయితే గుడిలో లెదర్, రబ్బరుతో చేసిన జోళ్లు ధరించడం నిషిద్ధం కాబట్టి.. జనపనారతో చేసిన 100 చెప్పుల జతలను కాశీకి పంపించారు. ఆలయ అధికారులు వీటిని కార్మికులకు పంపిణీ చేశారు. చదవండి: వైరల్: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్ అదిరింది! కాగా మోదీ ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్‌లో చాలా సేపు గడిపారు. అక్కడి సిబ్బంది, సేవకులతో కలిసి ఫోటోలు దిగి, సహపంక్తి భోజనాలు కూడా చేశారు. చదవండి: కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు -
కాశీ సాక్షిగా నవశకం
భారతదేశ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదు. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచమంతా మనల్ని అలాగే చూస్తుంది. స్వచ్ఛత, సృజన మన మార్గం కావాలి. స్వచ్ఛ భారత్ ఉద్యమంలో అందరూ పాలుపంచుకోవాలి. కాశీ కారిడార్ భారత్‌కు నిర్ణయాత్మక దిశను చూపుతుంది. భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోం ది. ఈ చరిత్రకు సాక్షులం కావడం మన అదృష్టం. ► కాశీ ఆలయం గతంలో 3,000 చదరపు అడుగుల్లోనే ఉండేది. ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా దర్శించుకోవచ్చు. శివుడి రక్షణలోని కాశీ ఎన్నటికీ నాశనం కాబోదు. ► కాశీ విశ్వనాథ్ ధామం ఒక భారీ భవంతి మాత్రమే కాదు. దేశ సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు చిహ్నం. అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ్ ధామంతోపాటు బౌద్ధ, సిక్కు పర్యాటక కేంద్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. ► ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ సైతం ఉద్భవిస్తాడు. సాలార్ మసూద్ మన దేశంలో అడుగుపెడితే రాజా సుహల్దేవ్ అతడిని ఎదుర్కొంటాడు. మన ఐక్యతలోని శక్తిని తెలియజేస్తాడు. ఎన్నో కుతంత్రాలను తట్టుకుని కాశీ సగర్వంగా నిలిచింది. నవ చరిత్రకు సాక్షులం ► ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ ఉద్భవిస్తాడు ► సాలార్ మసూద్ వస్తే రాజా సుహల్దేవ్ ఎదుర్కొంటాడు ► భారత్ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదు ► దేశ నాగరిక వారసత్వానికి గొప్ప ప్రతీక కాశీ ► మహోన్నత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోంది ► కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభం వారణాసి: భారతదేశ నాగరిక వారసత్వానికి, ఔన్నత్యానికి కాశీ నగరం గొప్ప ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఔరంగజేబు లాంటి నిరంకుశ పాలకులు కాశీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని, అప్పటి దాడులు, దౌర్జన్యకాండ చరిత్ర పుటల్లో చీటిక అధ్యాయాలుగా మిగిలిపోయాయనని అన్నారు. మన ప్రాచీన పవిత్ర నగరం కాశీ తన మహోన్నతమైన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటోందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులకు కాశీ కర్మభూమి, జన్మభూమి అన్నారు. ప్రధాని మోదీ సోమవారం తన నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి, ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. శతాబ్దాల బానిసత్వం భారత్‌ను ఆత్మన్యూనతకు గురిచేసిందని, ఆ ప్రభావం నుంచి దేశం క్రమంగా బయటపడుతోందని చెప్పారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ భారత్‌కు నిర్ణయాత్మక దిశను చూపుతుందని, భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటోందన్నారు. ఈ నవ చరిత్రకు సాక్షులం కావడం మనం అదృష్టమని చెప్పారు. ఔరంగజేబు వస్తే ఛత్రపతి శివాజీ సైతం ఉద్భవిస్తాడని, సాలార్ మసూద్(భారత్‌పై దండెత్తిన ముస్లిం) మన దేశంలో అడుగుపెడితే రాజా సుహల్దేవ్ అతడిని ఎదుర్కొంటాడని, మన ఐక్యతలోని శక్తిని తెలియజేస్తాడని అన్నారు. ఔరంగజేబు, సాలార్ మసూద్, వారెన్ హేస్టింగ్స్ లాంటి వాళ్లు కాశీని ధ్వంసం చేయడానికి ఎన్నో కుతంత్రాలు సాగించారని, అన్నింటినీ తట్టుకొని నగరం సగర్వంగా నిలిచిందని చెప్పారు. సుల్తాన్లు వచ్చారు, పోయారు గానీ కాశీ మాత్రం స్థిరంగా నిలిచి ఉందని పేర్కొన్నారు. ఈ దేశం మట్టి మిగతా ప్రపంచం కంటే భిన్నమైనదని వివరించారు. తన ప్రసంగం మధ్యలో పలుమార్లు ‘హర హర మహదేవ్’ మంత్రాన్ని పఠించారు. అప్పుడప్పుడు స్థానిక యాసలో మాట్లాడుతూ ఆహూతులను ఆకట్టుకున్నారు. సనాతన సంస్కృతికి చిహ్నం రాణి అహల్యాబాయి కాశీ విశ్వేశ్వరుడి ఆలయాన్ని పునర్నిర్మించారని, సిక్కు రాజు రంజిత్ సింగ్ ఈ గుడి గోపురాలకు బంగారు పూత వేయించారని మోదీ గుర్తుచేశారు. కాశీ విశ్వనాథ్ ధామం కేవలం ఒక భారీ భవంతి మాత్రమే కాదని, దేశ సనాతన సంస్కృతికి, ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు చిహ్నం అని వెల్లడించారు. అయోధ్యలో రామమందిరం, కాశీలో విశ్వనాథ్ ధామంతోపాటు సముద్రంలో వేలాది కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్, పేదల కోసం లక్షలాది ఇళ్లను భారత్ నిర్మించుకుంటోందని, పరిశోధకులను అంతరిక్షంలోకి పంపిస్తోందని తెలిపారు. బౌద్ధ, సిక్కు పర్యాటక కేంద్రాలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. విశ్వనాథ్ ధామం పాత, కొత్తల మేలు కలయిక అని అన్నారు. మన శక్తిసామర్థ్యాలకు ఈ ధామం ఒక సాక్షిభూతమని, గట్టి పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని వివరించారు. సృజనాత్మకతకు పదును పెట్టండి భారతదేశ శక్తి, భక్తి కంటే విధ్వంసకుల బలం ఎప్పటికీ ఎక్కువ కాబోదని మోదీ తేల్చిచెప్పారు. మనల్ని మనం ఎలా చూసుకుంటామో ప్రపంచమంతా మనల్ని అలాగే చూస్తుందని చెప్పారు. స్వయం సమృద్ధ (ఆత్మనిర్భర్) భారత్ కోసం ప్రయత్నాలు కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛత, సృజన మన మార్గం కావాలన్నారు. నమామి గంగా మిషన్‌ను విజయవంతం చేయాలన్నారు. భారత్ ఎన్నో శతాబ్దాలపాటు బానిసత్వం కింద మగ్గిపోయిందని, ఇది మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని, ఫలితంగా మన సృజనపై మనం నమ్మకాన్ని కోల్పోయామని చెప్పారు. పూర్తి ఆత్మవిశ్వాసంతో సృజనాత్మకతకు పదును పెట్టాలని ప్రజలకు సూచించారు. త్వరలో 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోబోతున్నామని, మరో 25 ఏళ్ల తర్వాత (100వ స్వాతంత్య్ర దినోత్సవాల నాటికి) ఇండియా ఎలా ఉండాలని కోరుకుంటున్నామో అందుకోసం ఇప్పటినుంచి కృషి చేయాలని పేర్కొన్నారు. కాశీకి శివుడే రక్షణ కాశీ విశ్వనాథ ఆలయాన్ని భారీగా విస్తరించామని నరేంద్ర మోదీ తెలిపారు. గతంలో ఈ ఆలయం 3,000 చదరపు అడుగుల్లోనే ఉండేదని, ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించిందని చెప్పారు. నిత్యం 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు సులభంగా దర్శించుకోవచ్చని అన్నారు. శివుడి రక్షణలో ఉన్న కాశీ నగరం ఎన్నటికీ నాశనం కాబోదని వ్యాఖ్యానించారు. మోదీకి తలపాగా బహూకరణ మోదీ రాకతో వారణాసి సందడిగా మారింది. హర హర మహాదేవ్, మోదీ మోదీ అని నినదిస్తూ జనం ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లారు. కాలభైరవ మందిరం వద్ద కారులో ఉన్న మోదీ దగ్గరకు వచ్చేందుకు ఓ బ్రాహ్మణుడు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అది గమనించిన మోదీ చేతులు ఊపారు. దీంతో భద్రతా సిబ్బంది సదరు బ్రాహ్మణుడిని అనుమతించారు. ఆయన మోదీకి గులాబీ రంగు తలపాగా, కాషాయం రంగు అంగవస్త్రాన్ని బహూకరించారు. మోదీ కటౌట్లు, పోస్టర్లతో కాశీ వీధులు నిండిపోయాయి. గంగా హారతి తిలకించిన ప్రధాని మోదీ 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో కలిసి సోమవారం సాయంత్రం గంగా నదిలో ఓడపై విహరించారు. ప్రఖ్యాత దశాశ్వమేధ ఘాట్ వద్ద ఆగి, గంగా హారతిని తిలకించారు. కూలీలపై పూలవర్షం కాశీ విశ్వనాథ్ ధామం నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలకు మోదీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వినమ్రంగా చేతులు జోడించి అభివాదం చేశారు. వారిపై పూల రేకులు చల్లారు. కూలీతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం వారితోపాటు కూర్చొని ఫొటో దిగారు. విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు సోమవారం ఉదయం కాశీకి చేరుకున్న మోదీ కాలభైరవ ఆలయంలో(కాశీ కా కొత్వాల్) ప్రత్యేక పూజలు చేశారు. గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథుడికి అభిషేకం చేసేందుకు స్వయంగా కలశంలో గంగా జలాన్ని సేకరించారు. ఆలయానికి చేరుకొని విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వనాథ్ ధామ్ ప్రాంగణంలో భారతమాత, మహారాణి అహల్యాబాయి హోల్కర్, ఆది శంకరాచార్య విగ్రహాలను అధికారులు ఏర్పాటు చేశారు. ‘కాశీ విశ్వనాథ్ ధామ్’ ప్రారంభోత్సవంలో యూపీ సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, వేలాది మంది మత గురువులు, సాధువులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారణాసిలో కార్మికులతో కలిసి భోజనం చేస్తున్న ప్రధాని మోదీ భరతమాత విగ్రహానికి నమస్కరిస్తూ.. -
Viral Video: కార్మికులపై ప్రధాని మోదీ పూల వర్షం.. వారిని సన్మానించి, లంచ్ చేసి
వారణాసి : కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ నిర్మాణ రంగ కార్మికులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూల వర్షం కురిపించారు. కారిడార్ నిర్మాణంలో పాల్గొన్న వారిపై పూలు చల్లి సన్మానించారు. ప్రతి ఒక్క కార్మికుడిపై పూలు చల్లేందుకు ఆ ప్రాంగణమంతా తిరిగారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులను మోదీ ఆప్యాయంగా పలకరించి, ముచ్చటించారు. కారిడార్ నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్జతలు తెలియజేశారు. అనంతరం వారితో గ్రూప్‌ఫోటో దిగారు. కొద్దిసేపు ముచ్చటించి వారితో లంచ్ కూడా చేశారు. కాగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో సోమవారం ప్రధాని మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ కారిడార్‌ను జాతికి అంకితం చేశారు. కాశీ విశ్వనాథుడి మందిరం, కాల భైరవేశ్వరుడి ఆలయాన్ని ఆధునికీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీని నిర్మాణ వ్యయం 339 కోట్ల రూపాయల పైమాటే. ఈ కార్యక్రమం కంటే ముందు కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ జలాభిషేకం చేశారు. గంగా నదిలో పుణ్య స్నానం చేసి.. ఆ నది జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. వారణాసి ఎంపీగా.. కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులకు 2019 మార్చి 8న మోదీ శంకుస్థాపన చేయగా, రూ.339 కోట్లతో పూర్తయిన కాశీ విశ్వనాథ్ కారిడార్ తొలి దశ పనులను ఇవాళ మోదీ ప్రారంభించారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కేవలం భవనాల నిర్మాణం కాదని.. భారత సనాతన సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అని మోదీ అన్నారు. #Varanasi: PM @narendramodi honours Swacchata Mitra at the inauguration of #KashiVishwanathDham pic.twitter.com/GQi31u53K3 — DD News (@DDNewslive) December 13, 2021 -
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు
ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ సంస్థ(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) గుజరాత్‌లోని నవ్సారి సిటీలో అక్టోబర్ 2న బుల్లెట్ ట్రైన్ తొలి క్యాస్టింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఈ నిర్మాణ పనుల్ని ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ పర్యవేక్షిస్తుంది. తాజాగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా 11.90 నుంచి 12.4 మీటర్ల పొడవు, 2.1 నుంచి 2.5 మీటర్ల వెడల్పు, 3.40 మీటర్ల లోతు, 60 వేల కిలోల బరువైన క్యాస్టింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ తరహాలో మొత్తం 19(సెగ్మెంట్స్) క్యాస్టింగ్ యార్డ్‌లను తయారు చేయాల్సి ఉంటుంది The first segment for Mumbai- Ahmedabad HSR corridor was casted yesterday at a casting yard near Navsari. These segments are 11.90 to 12.4m in length 2.1 to 2.5 m in width having depth of 3.40 m & weighing approx. 60 MT, 19 such segments will make a span of 45m. https://t.co/yP9nNw46i2 — NHSRCL (@nhsrcl) October 1, 2021 19 సెగ్మెంట్స్ ఎందుకు బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి నిర్మాణాల్ని చేపట్టలేని పిల్లర్స్, ట్రాకులు,బ్రిడ్జ్‌లను మరో ప్రాంతంలో విడివిడిగా నిర్మిస్తారు. అనంతరం పెద్ద పెద్ద పొక్లెయిన్ల సాయంతో తరలించి అవసరమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. అలా ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణాల్ని సెగ్మెంట్స్‌గా విభజించి నిర్మిస్తున్నారు. చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్! -
3 కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు
సాక్షి, అమరావతి: పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మౌలిక వసతులు కల్పించడం ద్వారా పరిశ్రమలను ఆకర్షించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణంపై దృష్టి సారించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం నుంచి ఇప్పటికే విశాఖ-చెన్నై కారిడార్, చెన్నై-బెంగళూరు కారిడార్లు వెళ్తుండగా తాజాగా హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌కు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో మూడు పారిశ్రామిక కారిడార్లు దక్కించుకున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. ఈ కారిడార్లలో మొత్తం 8 క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్) నుంచి భారీగా నిధులను తీసుకురావడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. చదవండి: భీమిలి భోగాపురం మధ్య.. పారిశ్రామిక కారిడార్ ఏడీబీ నిధులు రూ.4,598 కోట్లతో విశాఖ-చెన్నై కారిడార్: విశాఖ-చెన్నై కారిడార్‌ను ఏడీబీ(ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్) రుణ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. తొలిదశలో విశాఖలో అచ్యుతాపురం-రాంబిల్లి, నక్కపల్లి క్లస్టర్లు, చిత్తూరు జిల్లాలో ఏర్పేడు-శ్రీకాళహస్తి క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ క్లస్టర్లలో మౌలిక వసతులకు సంబంధించి రూ.4,598 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. భూ సేకరణ పనుల కోసం రూ.165 కోట్ల అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కారిడార్‌లో భాగంగానే మెడ్‌టెక్ జోన్ రెండో దశ పనులను రూ.110కోట్లతో చేపడుతున్నారు. చదవండి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో నిక్‌డిట్ నిధులతో అభివృద్ధి చేస్తున్న క్లస్టర్లు: కొప్పర్తి: తొలిదశలో 4 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నీటిని సోమశిల ప్రాజెక్టు నుంచి తీసుకురావడానికి ప్రభుత్వం డీపీఆర్ తయారు చేస్తోంది. కృష్ణపట్నం: 2,500 ఎకరాల్లో సుమారు రూ.1,500 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. శ్రీకాళహస్తి: ఈ క్లస్టర్‌ను నిక్‌డిట్ నిధులతో 8వేల ఎకరాల్లో, ఏడీబీ నిధులతో 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నారు. నక్కపల్లి: విశాఖ-చెన్నై కారిడార్‌లో భాగంగా ఈ కస్టర్‌ను ఏడీబీ నిధులతో వేయి ఎకరాలు, నిక్‌డిట్ నిధులతో 3 వేల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నారు. వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్లస్టర్లతో పాటు 7వేల ఎకరాల్లో ప్రకాశం జిల్లా దొనకొండ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్)ను అభివృద్ధి చేయనున్నారు. ఓర్వకల్లు: హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లో భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో క్లస్టర్‌ను తాజాగా అభివృద్ధి చేయనున్నారు. దీన్ని కూడా నిక్‌డిట్ నిధులతో చేపట్టడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. సుమారు 7వేల ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తోంది. మౌలిక వసతులపైనే దృష్టి సీఐఐ, ఐఎస్బీ, అసోచామ్ వంటి పెద్ద సంస్థల నుంచి వచ్చిన సూచనల మేరకే మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నాం. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఆటోమొబైల్ వంటి కీలక రంగాల వారీగా క్లస్టర్లను అభిృవృద్ధి చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ పారిశ్రామిక పార్కుల పనులను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించాం. - మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి -
‘కర్తార్‌పూర్’కు మన్మోహన్ రారు
న్యూఢిల్లీ/లాహోర్: కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరుకారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే సాధారణ యాత్రికుడిలాగా మన్మోహన్ అక్కడికి వెళ్తారని ఆదివారం పేర్కొన్నాయి. కాగా, పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మహమూద్ ఖురేషీ కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రావాలని తాము పంపిన ఆహ్వానాన్ని మన్మోహన్ అంగీకరించారని ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు వెల్లడించాయి. ‘నవంబర్ 9న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన్మోహన్ ఒక ప్రత్యేక అతిథిగా కాకుండా, ఒక సాధారణ వ్యక్తిగా హాజరవుతారు’ అని అక్కడి స్థానిక వార్తాపత్రిక డాన్ పేర్కొంది. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని సిక్కు జాతా ప్రతినిధుల బృందంతో పాటు మన్మోహన్ సింగ్ పాల్గొననున్నారు. -
సిద్ధూపై మంత్రుల గుస్సా
చండీగఢ్/జైపూర్: తన కెప్టెన్ రాహుల్ గాంధీయే తప్ప, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాదంటూ పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ సలహా మేరకే పాక్‌లో కర్తార్‌పూర్ కారిడార్ పనుల ప్రారంభానికి వెళ్లినట్లు సిద్ధూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వీటిపై సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేయడంతో సిద్దూ కాస్తంత వెనక్కి తగ్గి..‘పాక్‌లో నా పర్యటన విషయంలో రాహుల్‌గాంధీ జోక్యం ఏమీ లేదు. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు నేను అక్కడికి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే’ అంటూ పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సిద్ధూపై తోటి మంత్రివర్గ సభ్యుల ఆగ్రహం తగ్గలేదు. దీనిపై మంత్రులు తృప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, సుఖ్బీందర్ సింగ్ సర్కారియా, రాణా గుర్మీత్ సింగ్ సోధి మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ మా నేత. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. పంజాబ్‌లో మా ప్రభుత్వ కెప్టెన్ అమరీందర్. ఆయన కెప్టెన్సీలోని మంత్రి వర్గంలో సిద్ధూయే కాదు సీఎం అమరీందర్‌ను కెప్టెన్‌గా అంగీకరించని వారెవరైనా మంత్రి వర్గం నుంచి వెంటనే తప్పుకోవాలి. లేదా క్షమాపణ చెప్పి పంజాబ్‌లో సీఎం అమరీందరే కెప్టెన్ అన్న విషయం అంగీకరించాలి’ అని అన్నారు. కాగా, సిద్ధూ వ్యాఖ్యల వ్యవహారం సోమవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
సత్సంబంధాలనే కోరుకుంటున్నాం
కర్తార్‌పూర్: సిక్కు యాత్రికుల సౌలభ్యం కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో బుధవారం శంకుస్థాసన చేశారు. పాక్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, సైన్యం కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే కోరుకుంటోందని చెప్పారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలనూ ఇరు దేశాల నాయకత్వాలు బలం, కృషితో పరిష్కరించుకోవచ్చన్నారు. ‘దేవుడు తమకు ఇచ్చిన అవకాశాలను భారత్, పాక్‌లు అర్థం చేసుకోవడం లేదు. నేను ఎప్పుడైనా భారత్‌కు వెళ్తే.. పాక్‌లోని రాజకీయ నేతలు భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నా పాక్ సైన్యం మాత్రం అలా జరగనివ్వదని నాకు చెబుతుంటారు. కానీ సైన్యంతో సహా మేమంతా భారత్‌తో సుహృద్భావాన్నే కోరుకుంటున్నామని స్పష్టం చేస్తున్నా’ అని ఇమ్రాన్ అన్నారు. ఒకప్పుడు భీకర యుద్ధాలు చేసుకున్న ఫ్రాన్స్, జర్మనీలే ప్రస్తుతం శాంతియుత వాతావరణంలో సత్సంబంధాలను కలిగి ఉన్నాయనీ, భారత్–పాక్ మధ్య కూడా శాంతి, మంచి సంబంధాలు సాధ్యమేన న్నారు. పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో ఉన్న కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారను, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారను కలుపుతూ నాలుగు కిలో మీటర్ల రహదారిని అంతర్జాతీయ సరిహద్దు మీదుగా భారత్, పాక్‌లు కలిసి నిర్మిస్తుండటం తెలిసిందే. ఇందుకోసం భారత్‌లో సోమవారమే శంకుస్థాపన జరగ్గా, పాక్ ఆ పనిని బుధవారం ప్రారంభించింది. శంకుస్థాపన కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులు హర్సిమ్రత్ కౌర్ బాదల్, హర్దీప్సింగ్ పురీ హాజరయ్యారు. పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వద్దని సూచించినా వినకుండా ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లడం తెలిసిందే. ‘వీసా’పై నిర్ణయం తీసుకోవాలి: సుష్మ కర్తార్‌పూర్ కారిడార్‌లో ప్రయాణించే సిక్కు యత్రికులకు వీసా అవసరం ఉండదని వార్తలు వచ్చినప్పటికీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాటలు అందుకు వ్యతిరేకంగా ఉన్నాయి. యాత్రికులకు వీసా అవసరమో కాదో ఇంకా నిర్ణయించాల్సి ఉంద న్నారు. హైదరాబాద్‌లో సుష్మ మాట్లాడుతూ ఈ కారిడార్‌కు, పాక్‌తో చర్చలకు సంబంధం లేదని పేర్కొన్నారు. కర్తార్‌పూర్ కారిడార్ శంకుస్థాపన సభలో ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తప్పుబట్టింది. దైవకార్యాన్ని ఇమ్రాన్ రాజకీయాలకు ఉపయోగించడం పట్ల విచారం వ్యక్తం చేసింది. కాగా, పలువురు ఖలిస్తాన్ విభజన వాద సిక్కులు కూడా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ ఖలిస్తాన్ నేత గోపాల్ దాస్.. పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వాతో కరచాలనం కూడా చేశారు. అయితే గోపాల్ దాస్ పాకిస్తాన్‌లోని గురుద్వారల కమిటీలో సీనియర్ నేత అనీ, అన్ని సిక్కు మతపరమైన కార్యక్రమాలకూ ఆయనను ఆహ్వానిస్తారని ఓ అధికారి చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన ముఖ్యులందరితోనూ ఆర్మీ చీఫ్ కరచానలం చేశారనీ, భారత మీడియా ఈ అంశాన్ని భూతద్దంలో చూస్తోందన్నారు. సిద్ధూ పాక్‌లోనూ గెలవగలడు ఇరు దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తున్న సిద్ధూపై భారత్‌లో ఎందుకు విమర్శలు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్‌లో కూడా సిద్ధూ ఎంతో ప్రాచుర్యం పొందాడనీ, ఆ దేశంలోని పంజాబ్‌లో ఎన్నికల్లో నిలబడినా అతను గెలుస్తాడని ఖాన్ పేర్కొన్నారు. భారత్–పాక్‌ల మధ్య శాంతి నెలకొనేందుకు సిద్ధూ భారత ప్రధాని అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిన అవసరం రాదనే తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కర్తార్‌పూర్ కారిడార్ కార్యరూపం దాల్చడానికి మీరే కారణమంటే మీరే కారణమంటూ ఇమ్రాన్ ఖాన్, సిద్ధూలు గతంలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి కూడా సిద్ధూ హాజరైనప్పుడు కర్తార్‌పూర్ కారిడార్ గురించి ఖాన్‌తో ఆయన మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. సీఎం సలహాను పెడచెవిన పెట్టి తన వ్యక్తిగత పర్యటన అంటూ పాక్‌కు వెళ్లిన సిద్ధూపై పంజాబ్‌లో ప్రతిపక్ష శిరోమణి అకాళీదళ్, బీజేపీ విమర్శలు గుప్పించాయి. ఇదీ కర్తార్‌పూర్ చరిత్ర 1522: సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ తొలి గురుద్వారాను కర్తార్‌పూర్‌లో ఏర్పాటుచేశారు. మరణించేంత వరకు, 18 ఏళ్లపాటు ఆయన అక్కడే బోధనలు చేస్తూ కాలం గడిపారు. 1999: ప్రధాని వాజ్‌పేయి శాంతి ప్రయత్నాల్లో భాగం గా పాక్‌కు బస్సులో వెళ్లినప్పుడు ఈ కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదించారు. 2000: భారత్ వైపు నుంచి ఓ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా భారత్‌లోని సిక్కులు వీసా, పాస్‌పోర్టు లేకుండానే కర్తార్‌పూర్ గురుద్వారాను సందర్శించేలా అనుమతించేందుకు పాక్ అంగీకారం. 2018 ఆగస్టు: ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన సిద్ధూ. గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరుస్తామని పాక్ ఆర్మీ చీఫ్ తనకు చెప్పినట్లు వెల్లడి. నవంబర్ 22: కర్తార్‌పూర్ కారిడార్‌లో భాగంగా డేరా బాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. నవంబర్ 26: భారత్‌వైపు కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య శంకుస్థాపన. నవంబర్ 28: పాకిస్తాన్ వైపు నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్. -
‘కౌగిలింత అంతే.. రాఫెల్ డీల్ కాదు కదా’
న్యూఢిల్లీ : పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కౌగిలింత అనేది కేవలం ఒక్క సెకన్ మూవ్మెంట్ అంతే.. అదేమీ రాఫెల్ డీల్ అంతా ప్రమాదకరం కాదంటూ బీజేపీకి చురకలంటించారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధూ ఈ సందర్భంగా తాను గతంలో పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడాన్ని మరోసారి సమర్ధించుకున్నారు. ఈ విషయం గురించి సిద్ధూ మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా ఇద్దరు పంజాబీలు ఎదురుపడితే కౌగిలించుకుంటారు.. పంజాబ్‌లో ఇది చాలా సర్వ సాధారణం. ఇది కేవలం ఒక్క సెకన్ మూవ్మెంట్ అంతే.. రాఫెల్ డీల్ అంతా ప్రమాదకరం కూడా కాదం’టూ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు. The hug(with Pakistan Army Chief) was for hardly a second, it was not a #RafaleDeal . When two Punjabis meet they hug each other, its normal practice in Punjab.: Navjot Sidhu in Lahore pic.twitter.com/zZemyh0qls — ANI (@ANI) November 27, 2018 అంతేకాక ఈ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం ఇరు దేశాల ప్రజలను దగ్గర చేసి, శాంతిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి కర్తార్‌పూర్ నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలోనే రహదారి నిర్మించేందుకు వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు. -
‘కర్తార్‌పూర్’కు శంకుస్థాపన
గురుదాస్‌పూర్: పాకిస్తాన్‌లోని గురుద్వార దార్బార్ సాహిబ్‌ను సందర్శించే సిక్కు యాత్రికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేయనున్న కర్తార్‌పూర్ కారిడార్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలపడం విదితమే.16వ శతాబ్దంలో రావి నది ఒడ్డున నిర్మితమైన ఈ గురుద్వార సిక్కులకు చాలా పవిత్రమైనది. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఇక్కడే తన జీవితంలోని చివరి 18 ఏళ్లు గడిపారు. దేశ విభజన అనంతరం కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వార పాకిస్తాన్‌కు వెళ్లింది. భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి కర్తార్‌పూర్ నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలోనే రహదారి నిర్మించేందుకు వెంకయ్య శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ఈ కారిడార్‌తో ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మాట్లాడుతూ పాక్‌కు హెచ్చరికలు చేశారు. భారత్ శాంతికి ప్రాధాన్యమిస్తుందనీ, కానీ భారత్‌కు భారీ, శక్తిమంతమైన సైన్యం ఉందన్న విషయాన్ని పాక్ గుర్తించాలన్నారు. సరిహద్దుల్లో భారత సైనికులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల, సైనికుల దాడులకు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బజ్వానే కారణమన్నారు. -
యూపీలో డిఫెన్స్ కారిడార్
లక్నో: ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లలో ఒకదాన్ని ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటుచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీని వల్ల రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు, సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ఈ కారిడార్‌ను ఆగ్రా, అలహాబాద్, లక్నో, కాన్పూర్, ఝాన్సీ, చిత్రకూట్లకు విస్తరిస్తామని తెలిపారు. బుధవారం లక్నోలో మొదలైన రెండు రోజుల పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో మోదీ ఈ విషయం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మోదీ యూపీ పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ..యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్నారు. ప్రతికూల వాతావరణాన్ని అధిగమించే సామర్థ్యం(పొటెన్షియల్), విధానాలు(పాలసీ), ప్రణాళికలు(ప్లానింగ్), పనితీరు(పెర్ఫామెన్స్) లాంటివి అభివృద్ధికి మార్గాలని, ఈ విషయంలో యూపీ సర్కారు, ప్రజలు మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
ఢిల్లీ-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో కదలిక
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సర్వే, డిజైన్ పనులు ఆరంభమయ్యాయి. నార్త్-సౌత్ రైల్ కారిడార్‌గా పేరొందిన ఢిల్లీ-చెన్నై హైస్పీడ్ రైలు మార్గంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు చైనా బృందం ఏపీ, తెలంగాణ లో అధ్యయనం చేపట్టింది. దేశంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్, చైనా ప్రభుత్వాల నడుమ ఒప్పందం కుదిరింది. సర్వే, డిజైన్ పనులు ఉచితంగా చేసేందుకు చైనాలోని సియాయున్ రైల్వే కంపెనీ ముందుకు రావడంతో ఈ బాధ్యతల్ని కేంద్రం ఆ బృందానికే అప్పగించింది. కో ఆర్డినేటింగ్ ఏజెన్సీగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) వ్యవహరించనుంది. దీంతో ఫీజిబిలిటీ అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కూడిన చైనా బృందం సోమవారం నుంచి తెలంగాణ, ఏపీలో పర్యటన ప్రారంభించింది. ముందుగా ఏపీ రవాణా ముఖ్య కార్యదర్శి శాంబాబ్‌తో చైనా బృందం సచివాలయంలో భేటీ అయింది. తెలంగాణ ముఖ్య కార్యదర్శితో భేటీ కుదరకపోవడంతో మంగళవారం అధ్యయనానికి చైనా బృందం విజయవాడ బయలుదేరి వెళ్ళనుంది. కాగా, ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ఉన్న రైల్వే ట్రాక్ సామర్థ్యం గంటకు 160 కి.మీ. మేర వేగంతో రైళ్లను నడిపేందుకు మాత్రమే సాధ్యమవుతోంది. హైస్పీడ్ రైలు మార్గానికి ఈ ట్రాక్ సామర్ధ్యం సరిపోదు. కాబట్టి కొత్తగా ట్రాక్ ఏర్పాటు చేసేందుకు చైనా బృందం నిర్ణయించింది. గంటకు 350 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా ట్రాక్ డిజైన్ రూపొందించాలని నిర్ణయించారు.