కాశీ విశ్వనాథ్ ధామ్‌ సిబ్బందికి మోదీ ఊహించని బహుమతి | PM Modi Sends 100 Pairs of Jute Footwear To Kashi Vishwanath Dham workers | Sakshi
Sakshi News home page

PM Modi Gift: కాశీ విశ్వనాథ్ ధామ్‌ సిబ్బందికి ఊహించని బహుమతి అందించిన ప్రధాని మోదీ

Published Mon, Jan 10 2022 8:13 PM | Last Updated on Mon, Jan 10 2022 9:23 PM

PM Modi Sends 100 Pairs of Jute Footwear To Kashi Vishwanath Dham workers - Sakshi

న్యూఢిల్లీ: కాశీలోని విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఊహించని బహుమతి పంపించారు. అక్కడ పనిచేసే సిబ్బంది, కార్మికుల కోసం జూట్‌తో(జనపనార) తయారు చేసిన 100 జతల చెప్పులను పంపించారు. ప్రధాని మోదీ తమకు పాదరక్షలను పంపడంపై కాశీ విశ్వనాథ్ ధామ్ పూజారులు, సిబ్బంది, సేవకులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదల పట్ల  మోదీకున్న శ్రద్ధకు ఇది నిదర్శనమంటున్నారు. కాగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయ ప్రాంగణంలో పూజారులు, పని చేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు ఇలా ఎవరైనా రబ్బరు, తోలు చెప్పులు ధరించి తిరగడం నిషిద్ధం. 

ఈ క్రమంలో ఇటీవల కాశీని సందర్శించిన మోదీ.. అక్కడ చాలామంది పూజారులు, సిబ్బంది, పారిశద్ధ్య కార్మికులు కాళ్లకు చెప్పులు లేకుండా అభివృద్ధి పనుల్లో పాల్గొనడాన్ని గమనించారు. ఈ  క్రమంలో చలికాలంలో కాళ్లకు చెప్పులు లేకుండా వారు ఇబ్బందులు పడుతుండడం చూసి మోడీ చలించిపోయారు. అయితే గుడిలో లెదర్‌, రబ్బరుతో చేసిన జోళ్లు ధరించడం నిషిద్ధం కాబట్టి.. జనపనారతో చేసిన 100 చెప్పుల జతలను కాశీకి పంపించారు. ఆలయ అధికారులు వీటిని కార్మికులకు పంపిణీ చేశారు.
చదవండి: వైరల్‌: ‘సార్‌, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్‌ అదిరింది!

కాగా మోదీ ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్‌లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్‌లో చాలా సేపు గడిపారు.  అక్కడి సిబ్బంది, సేవకులతో కలిసి ఫోటోలు దిగి, సహపంక్తి భోజనాలు కూడా చేశారు.
చదవండి: కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement