jute
-
కేంద్రం శుభవార్త.. గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ స్కీమ్ పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపు మాత్రమే కాకుండా ఎల్పీజీ సబ్సిడీ పథకాన్ని కూడా ఏడాది పాటు పొడిగించింది. కేంద్రం గతేడాది అక్టోబర్‌లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఎల్పీజీ సబ్సిడీని సిలిండర్‌పై రూ.300కి పెంచింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఈ రాయితీని వర్తిస్తుంది. రానున్న మూడేళ్లలో అదనపు ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తామని, దీనికి రూ.1650 కోట్ల ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. జనపనారకు కూడా కేంద్రం కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు తెలిపింది. జనపనార మద్దతు ధర ఇప్పుడు ఉన్నదానికంటే కూడా 285 రూపాయలు పెంచింది. దీంతో క్వింటాల్ జనపనార ధర రూ. 5,335కు చేరింది. -
కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బందికి మోదీ ఊహించని బహుమతి
న్యూఢిల్లీ: కాశీలోని విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఊహించని బహుమతి పంపించారు. అక్కడ పనిచేసే సిబ్బంది, కార్మికుల కోసం జూట్‌తో(జనపనార) తయారు చేసిన 100 జతల చెప్పులను పంపించారు. ప్రధాని మోదీ తమకు పాదరక్షలను పంపడంపై కాశీ విశ్వనాథ్ ధామ్ పూజారులు, సిబ్బంది, సేవకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదల పట్ల మోదీకున్న శ్రద్ధకు ఇది నిదర్శనమంటున్నారు. కాగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయ ప్రాంగణంలో పూజారులు, పని చేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు ఇలా ఎవరైనా రబ్బరు, తోలు చెప్పులు ధరించి తిరగడం నిషిద్ధం. ఈ క్రమంలో ఇటీవల కాశీని సందర్శించిన మోదీ.. అక్కడ చాలామంది పూజారులు, సిబ్బంది, పారిశద్ధ్య కార్మికులు కాళ్లకు చెప్పులు లేకుండా అభివృద్ధి పనుల్లో పాల్గొనడాన్ని గమనించారు. ఈ క్రమంలో చలికాలంలో కాళ్లకు చెప్పులు లేకుండా వారు ఇబ్బందులు పడుతుండడం చూసి మోడీ చలించిపోయారు. అయితే గుడిలో లెదర్, రబ్బరుతో చేసిన జోళ్లు ధరించడం నిషిద్ధం కాబట్టి.. జనపనారతో చేసిన 100 చెప్పుల జతలను కాశీకి పంపించారు. ఆలయ అధికారులు వీటిని కార్మికులకు పంపిణీ చేశారు. చదవండి: వైరల్: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్ అదిరింది! కాగా మోదీ ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్‌లో చాలా సేపు గడిపారు. అక్కడి సిబ్బంది, సేవకులతో కలిసి ఫోటోలు దిగి, సహపంక్తి భోజనాలు కూడా చేశారు. చదవండి: కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు -
జూట్ కారిడార్‌కు అనుమతి
- జనపనార బ్యాగుల తయారీ నైపుణ్యత కేంద్రాలు మంజూరు - మొదట కోడుమూరు.. తర్వాత ఎమ్మిగనూరు, ఆదోనిలో ఏర్పాటు - జాతీయ జనపనార బోర్డు కార్యదర్శితో సమావేశమైన ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు నియోజకవర్గ పరిధిలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలో జనపనార బ్యాగుల తయారీ నైపుణ్యత కేంద్రాలు మంజూరైనట్లు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. రాయలసీమ పరిధిలో కర్నూలు నియోజకవర్గం వెనకబడి ఉందని, ఇక్కడి ప్రజల ఉపాధి కోసం జనపనార బ్యాగుల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కేంద్రాల ఏర్పాటు కోసం ఈనెల 5వ తేదీన కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ జనపనార బోర్డుకు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ఇందుకు నేషనల్ జ్యూట్ బోర్డు (జాతీయ జనపనార బోర్డు) సానుకూలంగా స్పందించిందన్నారు. బోర్డు కార్యదర్శి, డైరెక్టర్ అరవింద్‌కుమార్ సోమవారం కర్నూలుకు వచ్చి ఎంపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలోగా కోడుమూరులో 25 మందికి మొదటి శిక్షణ కేంద్రం ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. సమావేశంలో కలకత్తా, హైదరాబాదుకు సంబంధించిన జ్యూట్‌బోర్డు సాంకేతిక అధికారులు నరసింహులు (ఎన్‌జేబీ ఎంపీఓ), ధనుంజయ్ (ఎన్‌జేబీ టీఏ) తదితరులు పాల్గొన్నారు. -
14 అడుగుల జనప మొక్క
చినలింగాయపాలెం(కాకుమాను): పంట పొలాల్లో వరి పైరు తర్వాత పశువుల మేత కోసం పండించే జనప పంట సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. కాకుమాను మండలం చినలింగాయపాలెంకు చెందిన రైతు వేల్పూరి సోమయ్య మూడు నెలల క్రితం పొన్నూరు నుండి జనప విత్తనాలు కొనుగోలు చేసి తెచ్చి పంటపొలంలో చల్లాడు. రెండు విత్తనాలను ఇంటి పెరట్లోనూ చల్లాడు. అందులో ఓ మొక్క దాదాపు 14 అడుగులకు మించి పెరగడంతో ఆ మొక్కను గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. భూమి సారవంతంగా ఉండటం, విత్తనాలలో జన్యుపర లోపాలు జరగటం వలన మొక్కలు ఇలా అధిక ఎత్తు పెరిగే అవకాశం ఉంటుందని మండల వ్యవసాయాధికారిణి సిహెచ్.సునీత తెలిపారు.