Jute products
-
ఖైదీల రూటు జ్యూట్ వైపు
కలకత్తా వాసి చైతాలి దాస్ వయసు 50 ఏళ్లు. గోల్డెన్ ఫైబర్‌గా పిలిచే జ్యూట్ పరిశ్రమను స్థాపించడంలోనే కాదు అందుకు తగిన కృషి చేసి గోల్డెన్ ఉమన్‌గా పేరొందింది చైతాలి. ముఖ్యంగా ఖైదీలతో కలిసి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ‘జనపనారను పర్యావరణ అనుకూలమైన, విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది మన సాంస్కృతిక గొప్పతనాన్నీ పెంచుతుంది. నా ఫౌండేషన్ ద్వారా ఖైదీలను ఆదుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని వివరించే చైతాలి ఆలోచనలు మన దృష్టి కోణాన్ని కూడా మార్చుతుంది. చైతాలి మొదలు పెట్టిన ప్రయాణం ఆమె మాటల్లోనే... ‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్. మా ఇల్లు సెంట్రల్ జైలు, ప్రెసిడెన్స్ కరెక్షనల్ హోమ్ మధ్య ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ జైలు జీవితం గడుపుతున్నవారి గురించి తెగ ఆలోచించేదాన్ని. మా నాన్న లాయర్ కావడం కూడా అందుకు మరో కారణం. నాన్నతో కలిసి ఆయన ఆఫీసుకు, పోలీస్ స్టేష¯Œ కు, సెంట్రల్ జైలుకు వెళ్లడం వల్ల నాలో అక్కడి వాతావరణం ఒక ఉత్సుకతను రేకెత్తించేది. జైలు గోడల లోపలి జీవితం ఆశ్చర్యపోయేలా చేసేది. కటకటాల వెనుక ఉన్న జీవితాలను, అక్కడ వాళ్లు ఎలా ఉంటారో చూపించే సినిమాలను చూడటం స్టార్ట్ చేశాను. రాత్రిళ్లు నిద్రపోయాక మా ఇంటికి సమీపంలో ఉన్న జూ నుంచి పులుల గర్జనలు వినిపించేవి. అర్ధరాత్రి సమయాల్లో పోలీసుల విచారణ, ప్రజల అరుపులు, కేకలు వినిపిస్తుండేవి. ఆ శబ్దాలు నాలో భయాన్ని కాకుండా దృష్టికోణాన్ని మార్చాయి. శాశ్వత ముద్ర నా చిన్నతంలో కొన్నిసార్లు మా నాన్నగారు కోర్టుకు తీసుకెళ్లారు. మొదటిసారి వెళ్లినప్పుడు నిందితులను కోర్టు హాలుకు తీసుకురావడం, పోలీసు వ్యాన్‌లో నుంచి వ్యక్తులు దిగడం గమనించాను. నా ఉత్సుకత తారస్థాయికి చేరుకుంది. మా నాన్న సహోద్యోగులలో ఒకరిని ‘ఎవరు వాళ్లు’ అని అడిగాను. తప్పు చేసినవారిగా ముద్రపడి, పర్యవసనాలను ఎదుర్కొనేవారు అని చెప్పారు. నేను అక్కడే నిలబడి గమనిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు వారి వైపు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వెంటనే వారి మధ్య ఉద్వేగభరితమైన సంభాషణలు విన్నాను. వారి బాధలు చూస్తుంటే ఏదైనా సాయం చేయాలనిపించేది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. కాలక్రమంలో చదువుతోపాటు ఇతరులకు సాయం చేసే మార్గం కోసం చాలా అన్వేషించాను. అందులో భాగంగా వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. 2015లో చైతాలి రక్షక్ ఫౌండేషన్‌కు పునాది పడింది. ఈ ఫౌండేషన్ మగ, ఆడ ఖైదీలు, ఇతర నిరుపేద మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. మొదటిసారి కరెక్షనల్ హోమ్‌లో నా పనిని ప్రారంభించాను. మొదట్లో స్పోకెన్ ఇంగ్లిషుపై దృష్టి పెట్టాను. మహిళలు, ఖైదీలతో కుకీలను తయారు చేయించడం, యోగాను పరిచయం చేయడం, చెక్కపనిలో పాల్గొనడం, పెయింటింగ్ సెషన్లు నిర్వహించడం వంటి అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టాను. ఆ ప్రాజెక్ట్‌లు విభిన్న కార్యక్రమాలను ప్రతిబింబించేవి. అంతర్జాతీయంగా... బెంగాల్ జనపనార పరిశ్రమలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. నేను, ఖైదీలతో జనపనార ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాను. వివిధ ప్రదేశాలలో వారి సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడుతుండేదాన్ని. ఆ తర్వాత వివిధ ఈ–ప్లాట్ఫార్మ్స్, జాతీయ– అంతర్జాతీయ వేదికలపైకి కూడా వారి జనపనార ఉత్పత్తులను తీసుకెళ్లాను. ౖఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ జ్యూట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎన్జెబి)తో కనెక్ట్ అయ్యాను. శిక్షణ ద్వారా ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా జ్యూట్ ఉత్పత్తుల తయారీలో దాదాపు మూడు వేల మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చాం. దీంతో ఈ ప్రాజెక్ట్ ‘రూట్ టు జ్యూట్’గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంక్యుబేట్ చేసింది. మా స్టార్టప్ హస్తకళలు, రగ్గులు, హ్యాండ్‌బ్యాగులు వంటి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2021 జనవరి 7న రూపొందించిన అతిపెద్ద జ్యూట్ బ్యాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. యువత కోసం.. ప్రత్యేకంగా విభిన్నరకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. ఫ్యాషన్‌లో భాగంగా యువతకు చూపుతున్నాం. యూనివర్శిటీ లేదా కాలేజ్ నుండి బయటికి వచ్చే విద్యార్థులు జ్యూట్ బ్యాగ్‌లను ధరించి వెళుతుండగా చిత్రీకరించి ప్రదర్శిస్తుంటాం. ఇది వారిలో ఆసక్తిని పెంచుతుంది. తప్పు చేసిన వారిని ప్రజలు నేరస్తులుగా చూస్తారు. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమైనప్పుడు వారి అవగాహనలో మార్పు కలుగుతుంది. జనం కూడా వారిని అభినందించడం ప్రారంభిస్తారు. ఇలా క్రమంగా అందరిలోనూ అంగీకారం పెరుగుతుంది. తప్పు చేసినవారు లేదా దోషులుగా ముద్రపడిన వ్యక్తులు కూడా మార్పు చెందగలరు’ అని తన కృషి ద్వారా చూపుతోంది చైతాలి. -
తక్కువ ఖర్చుతో అధిక లాభాలిచ్చే పంట..
-
కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బందికి మోదీ ఊహించని బహుమతి
న్యూఢిల్లీ: కాశీలోని విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఊహించని బహుమతి పంపించారు. అక్కడ పనిచేసే సిబ్బంది, కార్మికుల కోసం జూట్‌తో(జనపనార) తయారు చేసిన 100 జతల చెప్పులను పంపించారు. ప్రధాని మోదీ తమకు పాదరక్షలను పంపడంపై కాశీ విశ్వనాథ్ ధామ్ పూజారులు, సిబ్బంది, సేవకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పేదల పట్ల మోదీకున్న శ్రద్ధకు ఇది నిదర్శనమంటున్నారు. కాగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయ ప్రాంగణంలో పూజారులు, పని చేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు ఇలా ఎవరైనా రబ్బరు, తోలు చెప్పులు ధరించి తిరగడం నిషిద్ధం. ఈ క్రమంలో ఇటీవల కాశీని సందర్శించిన మోదీ.. అక్కడ చాలామంది పూజారులు, సిబ్బంది, పారిశద్ధ్య కార్మికులు కాళ్లకు చెప్పులు లేకుండా అభివృద్ధి పనుల్లో పాల్గొనడాన్ని గమనించారు. ఈ క్రమంలో చలికాలంలో కాళ్లకు చెప్పులు లేకుండా వారు ఇబ్బందులు పడుతుండడం చూసి మోడీ చలించిపోయారు. అయితే గుడిలో లెదర్, రబ్బరుతో చేసిన జోళ్లు ధరించడం నిషిద్ధం కాబట్టి.. జనపనారతో చేసిన 100 చెప్పుల జతలను కాశీకి పంపించారు. ఆలయ అధికారులు వీటిని కార్మికులకు పంపిణీ చేశారు. చదవండి: వైరల్: ‘సార్, కర్ఫ్యూలో క్రికెట్ ఆడొచ్చా’? పోలీసుల పంచ్ అదిరింది! కాగా మోదీ ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్‌లో చాలా సేపు గడిపారు. అక్కడి సిబ్బంది, సేవకులతో కలిసి ఫోటోలు దిగి, సహపంక్తి భోజనాలు కూడా చేశారు. చదవండి: కరోనా తెచ్చిన మార్పు.. 24 గంటల్లో ఎనిమిది వేలకు పైగా ఆర్డర్లు -
జ్యుట్ బోలే ఈకో ఫ్రెండ్లీ
సింథటిక్.. ప్లాస్టిక్.. పర్యావరణానికి అప్రియం! లెదర్.. కాటన్.. పర్యావరణానికి ప్రియం.. కానీ మన్నిక తక్కువ! అటు పర్యావరణానికి హాని తలపెట్టకుండా.. ఏళ్లకేళ్లు మన్నికనిచ్చేది జనపనారగా మనం పిలుచుకొనే జ్యూట్! ఇది అచ్చంగా లోకల్ ప్రొడక్ట్.. మన సంప్రదాయ ఉత్పత్తి ఎన్నో ఆధునిక ఉపయోగాలకు ఊతమవుతోంది. తన శ్రమతో జ్యూట్ ప్రొడక్ట్స్‌ను ఓ పరిశ్రమలా నెలకొల్పాలని ఇరవై ఏళ్లుగాప్రయత్నిస్తోంది చంటి ప్రసన్న కేంద్రం వ్యవస్థాపకురాలు లక్ష్మీవాసన్.. ఆ కార్ఖానా కథ గురించి.. లక్ష్మీవాసన్ స్వతహాగా రచయిత్రి. కథలు, కవితలు ఎన్నో రాశారు. వాటన్నిటికీ మూల వస్తువు అణగారిన జనమే. ఏ ఆసరాలేని స్త్రీల గురించే ఆమె ఆలోచనలు. విడాకులు తీసుకున్న మహిళలు, వితంతువులు.. ఇంకా ఇతర కారణాలతో ఒంటరిగా బతుకుతున్న స్త్రీల కోసం ఏదైనా చేయాలని ఆరాటపడ్డారామె. అప్పుడే జనపనార గురించి తెలుసుకున్నారు. దాన్నే ఈ ఆడవాళ్లందరికీ ఆర్థికంగా ఊతమిచ్చే వనరుగా మలిచారు. అలా పుట్టిందే చంటి ప్రసన్న కేంద్రం. నెగ్లెక్టెడ్ మెటీరియల్.. డిమాండెడ్ ప్రొడక్ట్స్ పైన చెప్పిందంతా 1993 నాటి సంగతి. అప్పటికీ మనదేశంలో విస్తారంగా పండే జనపనారను పట్టించుకున్న వాళ్లెవరూలేరు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల తర్వాత మన దగ్గర ఎక్కువగా ఉండే దీన్ని మనమూ ఏనాడూ లక్ష్య పెట్టలేదు. లక్ష్మీ వాసన్ మాత్రం దృష్టిపెట్టారు. జనుము ఉరఫ్ జ్యూట్‌తో ఎన్ని ఉపయోగాలున్నాయి? వాటితో ఎన్ని వస్తువులు తయారుచేయొచ్చో ఓ అధ్యయనం చేశారు. జ్యూట్ ప్రొడక్ట్స్‌లో తన ఇంటి చుట్టుపక్కల కొంతమంది మహిళలకు శిక్షణ ఇప్పించారు. నేషనల్ సెంటర్ ఫర్ జ్యూట్ డైవర్సిఫికేషన్ సపోర్ట్‌తో ఈ మహిళలకు జనుమును సప్లయ్ చేస్తూ వాళ్ల చేత ముందుగా క్యారీబ్యాగ్స్, పౌచెస్, ఉత్తరాలు, బిల్లులు గట్రా పెట్టుకునే వాల్ హ్యాంగింగ్స్, చిన్న పర్సులు, ఫైల్ ఫోల్డర్స్, లేస్‌లు, షోకేస్ పీస్‌లు తయారు చేయించారు. ఒకరకంగా చెప్పాలంటే జ్యూట్ ఉత్పత్తులను హైదరాబాద్ లో మొదటిసారి ఇంట్రడ్యూస్ చేశారు. వాటికి మార్కెట్లో మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఆసక్తి ఉన్న మరికొంత మంది స్త్రీలకూ శిక్షణ ఇప్పించారు. డ్వాక్రా బజార్లో వీళ్లు తయారుచేసిన ఉత్పత్తులను మార్కెట్ చేశారు. ఇదంతా లక్ష్మీవాసన్ రామంతాపూర్‌లో ఉన్నప్పటి విషయం. ఇప్పుడు.. స్వయం ఉపాధి కేంద్రం చంటి ప్రసన్న కేంద్రం పన్నెండేళ్ల కిందట మేడ్చల్‌కు చేరుకుంది. రామంతాపూర్లోనూ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. మండల ప్రాంతానికీ తన కాన్సెప్ట్‌ను విస్తరించి జ్యూట్ ఉపయోగాన్ని పెంచి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు లక్ష్మీవాసన్. దానికి తగ్గట్టుగానే ఆర్థిక స్వావలంబన లేని మహిళలకు ఇందులో శిక్షణ ఇప్పించి జ్యూట్ ఉత్పత్తుల తయారీతో ఎంతోకొంత నిలబడేలా చేస్తున్నారు. అంతేకాక విద్య, వైద్య, న్యాయ రంగాల్లో రాణించిన మహిళలతో వీరికి ఆయా రంగాలపై అవగాహ న కల్పిస్తున్నారు. కాలంతో పరుగు.. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ఉత్పత్తులనూ మారుస్తోంది చంటి ప్రసన్న కేంద్రం. కేవలం బ్యాగులు, వాల్ హ్యాంగిగ్స్ వంటి వాటికే పరిమితం కాకుండా సూట్‌కేస్‌లు, స్టోలర్స్, డోర్‌మ్యాట్స్, కర్టెన్స్, టేబుల్‌క్లాత్స్, టేబుల్ కార్నర్స్ లాంటివీ తయారు చేయిస్తోంది. ‘మా పెద్దమ్మాయి రాజీవి ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసేది. తను ఒకసారి లెదర్ స్టోలర్ తెచ్చింది. అరే.. ఇలాంటిది జ్యూట్లోనూ తయారు చేస్తే బాగుంటుందని అప్పటికప్పుడు ఆ స్టోలర్ మోడల్ తీసుకొని జ్యూట్ స్టోలర్‌ను తయారు చేశారు మా కేంద్రంలోని ఆడవాళ్లు. వాటికి ఆస్ట్రేలియాలో ఎంత డిమాండుందో’ అని చెప్పారు లక్ష్మీవాసన్. లక్ష్మీ చిన్న కూతురు రజని ఆస్ట్రేలియాలో ఉంటుంది. అమ్మ చేస్తున్న ప్రయత్నం మెచ్చి, ఆ వస్తువులు నచ్చి వాటిని ఆస్ట్రేలియాలకు తీసుకెళ్లింది. అక్కడ వాటికి ఊహించని డిమాండ్ రావడంతో ఇప్పుడూ ఇక్కడి ఉత్పత్తులను ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నారు లక్ష్మీవాసన్. చేయాల్సింది ఎంతో.. ‘ఫారిన్ కంట్రీస్‌లో జ్యూట్కి చాలా క్రేజ్. ఆ కమర్షియల్ సక్సెస్‌ను మనమూ చూడాలంటే ఇక్కడా దీని వాడకాన్ని బాగా ప్రాచుర్యంలోకి తేవాలి. ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా పనిచేస్తూ ఎంతోమంది స్త్రీలకు ఆసరాగా నిలబడుతున్న చంటి ప్రసన్న కేంద్రం వంటి సంస్థలకు ప్రభుత్వం చేయూతనివ్వాలి. ఇప్పటి వరకు ఈ కేంద్రం కొన్ని వందల మందికి జ్యూట్ వస్తువుల తయారీలో శిక్షణనిచ్చింది ఉచితంగా. ఇంకా ఇస్తూనే ఉంది. మొన్ననే రామంతాపూర్, ఇక్కడ కలిపి 50 మంది దాకా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు. వాళ్లందరికీ కొన్న రేట్‌కే జ్యూట్‌ను ఇచ్చి వస్తువులను తయారు చేయిస్తున్నాను. మార్కెటింగ్ చేసుకోలేనివారికి నేనే ఎగ్జిబిషన్స్‌లో స్టాల్స్ పెట్టించి అమ్మిస్తున్నాను. ఇంట్లో వృద్ధులు కూడా ఎవరి మీద ఆధారపడకుండా రోజుకో గంట జ్యూట్ లేసులు అల్లి యాభై రూపాయలు సంపాదించుకోవచ్చు. ఏ ఫండ్స్ లేకుండా ఇంతమందికి ఆధారంగా నిలుస్తున్న మా ఈ శ్రమను ఓ పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం సహాయం అందిస్తే దీన్ని వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాను’ అని తన మనసులో మాట చెప్పారు లక్ష్మీవాసన్. ఆమె కోరుకున్నట్టుగానే చంటి ప్రసన్న కేంద్రం ఓ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్‌గా మారి ఎందరో మహిళలకు ఉపాధితోపాటు పర్యావరణ పరిరక్షణ జరగాలని ఆకాంక్షిద్దాం!. - సరస్వతి రమ