ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ సంస్థ(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) గుజరాత్‌లోని నవ్సారి సిటీలో అక్టోబర్ 2న బుల్లెట్ ట్రైన్ తొలి క్యాస‍్టింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఈ నిర్మాణ పనుల్ని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ పర్యవేక్షిస్తుంది. తాజాగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా 11.90 నుంచి 12.4 మీటర్ల పొడవు, 2.1 నుంచి 2.5 మీటర్ల వెడల్పు, 3.40 మీటర్ల లోతు, 60 వేల కిలోల బరువైన క్యాస్టింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ తరహాలో మొత్తం 19(సెగ్మెంట్స్) క్యాస్టింగ్ యార్డ్‌లను తయారు చేయాల్సి ఉంటుంది
The first segment for Mumbai- Ahmedabad HSR corridor was casted yesterday at a casting yard near Navsari. These segments are 11.90 to 12.4m in length 2.1 to 2.5 m in width having depth of 3.40 m & weighing approx. 60 MT, 19 such segments will make a span of 45m. https://t.co/yP9nNw46i2
— NHSRCL (@nhsrcl) October 1, 2021
19 సెగ‍్మెంట్స్ ఎందుకు
బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి నిర్మాణాల్ని చేపట్టలేని పిల్లర్స్, ట్రాకులు,బ్రిడ్జ్‌లను మరో ప్రాంతంలో విడివిడిగా నిర్మిస్తారు. అనంతరం పెద్ద పెద్ద పొక్లెయిన‍్ల సాయంతో తరలించి అవసరమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. అలా ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణాల్ని సెగ్మెంట్స్‌గా విభజించి నిర్మిస్తున్నారు.
చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!
Comments
Please login to add a commentAdd a comment