Bullet train project
-
బుల్లెట్ రైలు ఎప్పుడు పట్టాలెక్కుతుందంటే..
దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా బుల్లెట్రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కుతుందని చెప్పారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈమేరకు వివరాలు వెల్లడించారు. ‘బుల్లెట్ రైలు కోసం 500కి.మీల పొడవైన ప్రాజెక్టును నిర్మించేందుకు వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. కానీ, భారత్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 8-10 ఏళ్లలోనే పూర్తిచేయనుంది. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కనుంది. మొదట గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడపనున్నాం. 2028 నాటికి ముంబయి-అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’ అని మంత్రి చెప్పారు. దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందనట్లు మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయినట్లు సమాచారం. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకున్న ఫుడ్ డెలివరీ సంస్థ సీఈవో -
బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే..
దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) తెలిపింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ 508 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. రూట్ నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ వల్ల రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూరుస్తోందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ దాదాపు పూర్తయిందని ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..? దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. -
India Bullet Train: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి
భారత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. గుజరాత్లో జరుగుతున్న ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024’కు హాజరై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 నాటికి పూర్తవుతుందన్నారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 35కి.మీ దూరం సిద్ధం అవుతుందని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు బాగానే జరుగుతున్నాయని చెప్పారు. అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రాజెక్ట్ కచ్చితంగా ఏ సమయంలోపు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగమైన అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ కూడా దాదాపు పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: ఖజానాకు చేరిన పన్ను వసూళ్లు ఎంతంటే.. దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. -
జెట్ స్పీడ్‌లో బుల్లెట్ ట్రెయిన్ నిర్మాణ పనులు..రూ.3,681 కోట్లతో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ), మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) సంయుక్తంగా బుల్లెట్ ట్రెయిన్ స్టేషన్ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్నాయి. ప్రాజెక్ట్ విలువ రూ.3,681 కోట్లు. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ నుంచి ఈ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాయి. 508.17 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్లో భాగంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్‌ను హెచ్‌సీసీ, ఎంఈఐఎల్ నిర్మిస్తాయి. ఆరు ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేస్తారు. 16 కోచ్‌లు ఉన్న బుల్లెట్ ట్రెయిన్ నడవడానికి వీలుగా ఒక్కొక్కటి 414 మీటర్ల పొడవులో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తారు. మెట్రో, రోడ్డు మార్గాలకు అనుసంధానంగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ ఉంటుందని హెచ్‌సీసీ తెలిపింది. ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్ మార్గంలో భూగర్భంలో ఉండే ఏకైక స్టేషన్ ఇదే. నేల నుంచి 24 మీటర్ల లోపల ఏర్పాటు చేస్తారు. మూడు అంతస్తుల్లో స్టేషన్ ఉంటుంది. -
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం.. 22 వేల చెట్ల నరికివేతకు హైకోర్టు అనుమతి
ముంబై: మహారాష్ట్రలో చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 22 వేల చెట్లను నరికేందుకు బాంబే హైకోర్టు శుక్రవారం అనుమతించింది. ముంబై- అహ్మదాబాద్ మధ్య నడవున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ముంబైతోపాటు పొరుగున్న ఉన్న పాల్ఘర్, థానే జిల్లాల్లో విస్తరించి ఉన్న 22,000 మడ చెట్లను నరికేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్‌కు(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) అనుమతిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.. ఈమేరకు చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ అహుజాతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే షరతులు వర్తిస్తాయని పేర్కొంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ మంజూరు చేసిన అనుమతులలో పేర్కొన్న నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. కాగా ముంబై, పాల్ఘడ్, థానే జిల్లాల్లోని 50,000కు పైగా మడ చెట్లను నరికివేయడం కోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కోరిన అనుమతిని 2018లో కో-ఆర్డినేట్ బెంచ్ తీరస్కరించింది. ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ కోసం నరికివేత అవసరమైతే అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. దీంతో ఎన్‌ఎచ్‌ఆర్‌ఎస్‌సీఎల్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా? ప్రాజెక్టు నిర్మాణం కోసం నరికివేయాల్సిన మడ చెట్ల సంఖ్యలను 50,000 నుంచి 20,000 వరకు తగ్గించామని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌సిఎల్ తరపున న్యాయవాది ప్రహ్లాద్ పరాంజపే కోర్టుకు తెలిపారు. అంతేగాక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని అనుమతులు పొందామని.. దీనికి తోడు నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్లు ఎక్కువ మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు. మడ అడవులకు సమీపంలో ఉన్న రెండు ప్లాట్‌ఫారమ్‌లను కొద్దిగా దూరంగా మార్చాలని, దీనివల్ల నరికివేసే మడ చెట్ల సంఖ్య తగ్గుతుందని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ సూచించాయని పేర్కొన్నారు. ఇందుకు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌సిఎల్ అంగీకరించిందని, దీంతో చెట్ల సంఖ్య 53,467 నుండి 22,000కి తగ్గిందని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై బాంబే ఎన్విరాన్మెంటల్ యాక్షన్ గ్రూప్ అనే ఎన్జీవో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిషేధిత ప్రాంతంలో ఎలాంటి పేలుడు కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని కోర్టును కోరింది. అలాగే చెట్లు నరకడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయలేదని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుధీర్భంగా ఇరు వార్గల వాదనలు విన్న ధర్మాసనం.. డిసెంబర్ 1న రిజర్వ్ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడించింది. -
దేశంలో బులెట్ ట్రైన్, జాక్‌పాట్ కొట్టేసిన ప్రముఖ సంస్థ!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ సంస్థ భారీ బులెట్ రైలు కాంట్రాక్టును దక్కించుకుంది. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) నుంచి ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టును దక్కించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. సుమారు 116 రూట్ కిలోమీటర్ల మేర ఈ ట్రాక్‌ను నిర్మించాల్సి ఉంటుంది. గంటకు 320 కి.మీ. వరకూ వేగంతో రైలు ప్రయాణించేందుకు అనువు గా దీన్ని రూపొందించాలి. ఇందుకోసం జపాన్‌కి చెందిన షింకన్సెన్ ట్రాక్ టెక్నాలజీని ఎల్అండ్ టీ ఉపయోగించనుంది. రూ. 2,500 కోట్లు–రూ. 5,000 కోట్ల వరకూ విలువ చేసే ప్రాజెక్టులను ఎల్అండ్టీ సంస్థ భారీ కాంట్రాక్టుగా వర్గీకరిస్తుంది చదవండి👉దేశంలోని తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ అదిరిపోయిందిగా..! -
దేశంలోని తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ అదిరిపోయిందిగా..!
దేశంలోని ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మార్గంలో నిర్మిస్తున్న సూరత్ బుల్లెట్ రైలు స్టేషనుకు సంబంధించిన గ్రాఫికల్ డిజైన్ ఫోటోలను రైల్వే, జౌళి శాఖ మంత్రి దర్శన జార్దోష్ తన ట్విటర్ ఖాతా వేదికగా షేర్ చేశారు. జార్దోష్ ట్విటర్ పోస్టులో ఇలా పేర్కొన్నారు.. "సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ గ్రాఫికల్ డిజైన్ చిత్రాలను మీ అందరితో పంచుకుంటున్నాను. అత్యాధునిక పరిజ్ఞానంతో బహుళ-అంతస్థులలో నిర్మిస్తున్న ఈ స్టేషన్ లోపల ప్రదేశం మెరిసే వజ్రాన్ని - సూరత్ నగరాన్ని పోలి ఉంటుందని" ఆమె తెలిపారు. సూరత్ బుల్లెట్ రైలు స్టేషనుకు చెందిన బయట, లోపలికి సంబంధించిన రెండు గ్రాఫికల్ చిత్రాలతో సహ మరోక చిత్రంలో స్టేషన్ నిర్మిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. 2017లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి ప్రధాని మోదీ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2023 డిసెంబరు నాటికి తొలి ప్రయాణం చేయాలన్నది లక్ష్యం. కానీ, మహారాష్ట్రలో భూ సేకరణలో జాప్యం, కోవిడ్-19 మహమ్మారి వల్ల మార్చి 2020లో ప్రకటించిన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా గడువును 2028 వరకు పొడిగించారు. ఫిబ్రవరి 9 నాటికి గుజరాత్ రాష్ట్రంలో 98.63 శాతం, దాద్రా అండ్ నగర్ హవేలీలో 100 శాతం, మహారాష్ట్రలో 60.2 శాతం భూ సేకరణ జరిగింది. Sharing with you all, 1st glimpse of graphical representation of Surat's Bullet Train station. The state-of-the-art multi-level station will have external facade and interiors of the station resemble a sparkling diamond - the pride of Surat city. #NayeBharatKiNayiRail #Surat pic.twitter.com/YQppvzEF8Z — Darshana Jardosh (@DarshanaJardosh) February 10, 2022 నిర్మాణంలో ఉన్న ఈ 508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు. ఈ మొత్తం ప్రాజెక్టు పొడవులో 348 కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రంలో, 4 కిలోమీటర్లు కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా అండ్ నగర్ హావేలీలో, మిగిలిన 156 కిలోమీటర్ల దూరం మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. అందులో 81 శాతం సొమ్ము జపాన్ నుంచి రుణంగా అందనుంది. 2026లో సూరత్ - బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి బుల్లెట్ రైలు ట్రయల్ రన్ జరుగుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్నావ్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో చెప్పారు. (చదవండి: మార్కెట్లోకి కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇక కుర్రకారు తగ్గేదె లే!) -
బెంగళూరు - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్... రైల్వే శాఖ కీలక నిర్ణయం
దేశంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశంలో ఇప్పటికే ఎనిమిది కారిడార్లలో బుల్లెట్ రైళ్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. కాగా భవిష్యత్తు అవసరాలు, పెరుగుతున్న డిమాండ్‌ని పరిగణలోకి తీసుకుని మరో నాలుగు కారిడార్లలో బుల్లెట్ ట్రైన్‌ని పరుగులు పెట్టించాలని నిర్ణయం తీసుకుంది. వాటి సరసన ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా విరాజిల్లుతున్నా బుల్లెట్ ట్రైన్ల పరంగా ఇండియా ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఆసియాలో బిగ్గెస్ట్ ఎకానమీలైన చైనా, జపాన్లలో ఇప్పటికే బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దీంతో బుల్లెట్ ట్రైన్ కలిగిన దేశాల సరసన ఇండియాను నిలపపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. 8 కారిడార్లలో బుల్లెట్ ట్రైన్ కలను సాకారం చేసేందుకు రైల్వేశాఖ ప్రాథమికంగా 8 రూట్లలో బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో ముంబై - సూరత్ - వడోదర - అహ్మదాబాద్, ఢిల్లీ - నోయిడా - ఆగ్రా - కాన్పూర్ - లక్నో - వారణాసి, ఢిల్లీ - జైపూర్ - ఉదయ్‌పూర్ - అహ్మదాబాద్, ముంబై - నాసిక్ - నాగ్‌పూర్, ముంబై - పూణే - హైదరాబాద్, చెన్నై - బెంగళూరు - మైసూర్, ఢిల్లీ - ఛండీగడ్ - లూథియానా - జలంధర్ - అమృత్సర్, వారణాసి - పాట్నా - హౌరా మార్గాలు ఉన్నాయి. నిర్మాణంలో మొదట ప్రతిపాదించిన 8 కారిడార్లలో ముంబై - అహ్మబాబాద్ రూట్లో 508 కిలోమీటర్ల నిడివితో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణ పనులు సాగుతున్నాయి. దీని కోసం ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ పేరుతో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశారు. మరోవైపు ముంబై - హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గానికి సంబంధించి భూ సేకరణ పనులు షురూ అయ్యాయి. మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు రెడీ అయ్యాయి. కొత్తగా నాలుగు ప్రస్తుతం డీపీఆర్‌లు రెడీ అయిన ప్రాజెక్టులతో పాటు మరో నాలుగు మార్గాల్లో బుల్లెట్ రైలుని అందుబాటులోకి తేవాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో బెంగళూరు - హైదరాబాద్ (618 కి.మీ), నాగ్‌పూర్ - వారణాసి (855 కి.మీ), పట్నా - గువహాటి (850 కి.మీ), అమృత్సర్ - పఠాన్‌కోట్ - జమ్ము (192 కి.మీ) మార్గాలను ఉన్నాయి. వీటిని ఇప్పటికే నేషనల్ రైల్ ప్లాన్ 2022లో చేర్చారు. త్వరలో ఈ మర్గాల్లో బుల్లెట్ రైల్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేయనున్నారు. ఉత్తరాదికే ప్రాధాన్యం కేంద్రం అమలు చేస్తోన్న బుల్లెట్ రైలు ప్రాజెక్టులో గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు గణనీయంగా లబ్ధి పొందనుండగా దక్షిణాది రాష్ట్రాలైన కేరళా, ఆంధప్రదేశ్‌లతో పాటు ఒడిషా, ఝార్ఖండ్‌లను పూర్తిగా విస్మరించారు. తమిళనాడు, మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు కంటితుడుపు చర్యలా బుల్లెట్ రైలు ప్రాజెక్టులు ఉన్నాయి. చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు -
Hyderabad: బుల్లెట్ బండి.. పట్నం వస్తోందండీ
సాక్షి, హైదరాబాద్: దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి చారిత్రక భాగ్యనగరికి హైస్పీడ్ రైల్ అందుబాటులోకి రానుంది. రెండు నగరాల ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (హెచ్ఎస్ఆర్) కార్యాచరణ చేపట్టింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 650 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎలివేటెడ్ వయాడక్ట్, టన్నెల్ కారిడార్ కోసం హెచ్ఎస్ఆర్ తాజాగా భూసేకరణ పనులను చేపట్టింది. థానె, నవీ ముంబై, లోనావాలా, పుణె, బారామతి, పండరీపూర్, షోలాపూర్, గుల్బర్గా, వికారాబాద్‌ల మీదుగా ఈ రైలు పరుగులు పెట్టనుంది. మొత్తం 10 స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. ఎలివేటెడ్ కారిడార్‌గా ఉంటుందని, అవసరమైన చోట్ల సొరంగ మార్గాల్లో నిర్మించనున్నట్లు హెచ్ఎస్ఆర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు ప్రధాన నగరాల మధ్య రోడ్డు మార్గంలో వాహనాల రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకొనేలా బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. చదవండి: అంగన్వాడి కేంద్రంలో చిన్నారి మృతి! గంటకు 330 కి.మీ వేగం.. హైస్పీడ్ రైలు గంటకు 330 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ట్రైన్లో మొత్తం 10 కార్లు ఉంటాయి. 750 మంది హాయిగా ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతం మెట్రో రైలు తరహాలోనే పూర్తిగా ఏసీ బోగీలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో 284 గ్రామాల్లో సుమారు 1197.5 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మహారాష్ట్రలో నాలుగు జిల్లాలు థానె, రాయ్‌పూర్, పుణె, షోలాపూర్, కర్ణాటకలోని గుల్బర్గా, తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించనున్నారు. చదవండి: ప్రధాని అపాయింట్మెంట్ కేసీఆర్ అడగలేదు రైలుకు ఎక్కువ.. ఫ్లైట్‌కు తక్కువ... ప్రస్తుతం హైదరాబాద్– ముంబై మధ్య విమానాలు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం నుంచి కూడా పెద్ద ఎత్తున రాకపోకలు కొనసాగుతున్నాయి. 617 కి.మీ విమాన యానానికి 1.30 గంటల సమయం పడుతోంది. ముంబై– హైదరాబాద్ మధ్య 773 కి.మీ ఉన్న రైలు మార్గంలో 14.20 గంటల సమయం పడుతోంది. రోడ్డు మార్గం 710 కి.మీ వరకు ఉంటుంది. బస్సులు, కార్లు తదితర వాహనాల్లో చేరుకొనేందుకు 13. 15 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం నిర్మించతలపెట్టిన 650 కి.మీ హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా గంటకు 330 కి.మీ చొప్పున కేవలం 3 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. -
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు
ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ సంస్థ(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) గుజరాత్‌లోని నవ్సారి సిటీలో అక్టోబర్ 2న బుల్లెట్ ట్రైన్ తొలి క్యాస్టింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఈ నిర్మాణ పనుల్ని ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ పర్యవేక్షిస్తుంది. తాజాగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా 11.90 నుంచి 12.4 మీటర్ల పొడవు, 2.1 నుంచి 2.5 మీటర్ల వెడల్పు, 3.40 మీటర్ల లోతు, 60 వేల కిలోల బరువైన క్యాస్టింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ తరహాలో మొత్తం 19(సెగ్మెంట్స్) క్యాస్టింగ్ యార్డ్‌లను తయారు చేయాల్సి ఉంటుంది The first segment for Mumbai- Ahmedabad HSR corridor was casted yesterday at a casting yard near Navsari. These segments are 11.90 to 12.4m in length 2.1 to 2.5 m in width having depth of 3.40 m & weighing approx. 60 MT, 19 such segments will make a span of 45m. https://t.co/yP9nNw46i2 — NHSRCL (@nhsrcl) October 1, 2021 19 సెగ్మెంట్స్ ఎందుకు బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి నిర్మాణాల్ని చేపట్టలేని పిల్లర్స్, ట్రాకులు,బ్రిడ్జ్‌లను మరో ప్రాంతంలో విడివిడిగా నిర్మిస్తారు. అనంతరం పెద్ద పెద్ద పొక్లెయిన్ల సాయంతో తరలించి అవసరమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. అలా ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణాల్ని సెగ్మెంట్స్‌గా విభజించి నిర్మిస్తున్నారు. చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్! -
త్వరలో సాకారంకానున్న హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్!
సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. హైదరాబాద్–ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడార్ అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు రూట్ సర్వే/నిర్మాణం కోసం చేపట్టిన గూగుల్ మ్యాపింగ్ తుది దశకు చేరుకుంది.వారం, 10 రోజుల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. జీపీఎస్ ఆధారిత ఏరియల్ సర్వే కోసం ప్రస్తుతం నవీ ముంబై నుంచి హైదరాబాద్ వరకు పిల్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా వికారాబాద్– తాండూరు మధ్య దిమ్మెల నిర్మాణం కూడా పూర్త యింది. ఏరియల్ సర్వే నెల రోజుల్లో పూర్తి కావొ చ్చని తెలుస్తోంది. సాంకేతిక ప్రక్రియ పూర్తయిన తర్వాత హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. ‘ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయి బుల్లెట్ రైలు పట్టాలెక్కేందుకు కనీసం 3 నుంచి నాలుగేళ్లు పట్టే అవకాశం ఉంది’ అని ద.మ«. రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. మొత్తం 711 కిలోమీటర్ల మార్గం.. ప్రస్తుతం ముంబైలో రైల్వే టర్మినళ్లు ఎక్కువగా ఉన్న దృష్ట్యా నవీ ముంబై నుంచి హైదరాబాద్ వరకు హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తున్నారు. మొత్తం 711 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ పట్టాలపైన బుల్లెట్ రైలు గం టకు 320 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. మూడున్నర గంటల సమయంలోనే హైదరాబాద్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. ప్రస్తుత రైళ్లు హైద రాబాద్ నుంచి ముంబైకి చేరుకునేందుకు 13 నుంచి 14 గంటల సమయం పడుతోంది. కాగా, నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 6 కారిడా ర్లలో 4,109 కి.మీ. మేర హైస్పీడ్ ట్రాక్‌లను నిర్మిం చనుంది. ముంబై– అహ్మ దాబాద్, ముంబై– నాసి క్– నాగ్‌పూర్, చెన్నై– బెంగళూరు– మైసూరు, ముంబై– హైదరా బాద్, ఢిల్లీ– వారణాసి, ఢిల్లీ– అహ్మదాబాద్, ఢిల్లీ– అమృత్సర్ మార్గాలు ఉన్నాయి. -
హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–ముంబై మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ కారిడార్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి తాజాగా బిడ్లు పిలిచారు. దేశంలో హై స్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ది నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ఈ బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నవంబర్ 5న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నవంబర్ 11 నుంచి టెండర్ పత్రాల దాఖలు మొదలుకానుంది. నవంబర్ 17తో టెండర్ల దాఖలు గడువు ముగుస్తుంది. 18న డీపీఆర్ తయారీ సంస్థను ఎంపిక చేస్తారు. ప్రధాని మోదీ కృతనిశ్చయంతో ముందుకు.. హైదరాబాద్ నుంచి ముంబైకి పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్ రైల్ కారిడార్‌ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. దేశంలో హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే తొలి బుల్లెట్ రైల్ కారిడార్ ముంబై– అహ్మదాబాద్ మధ్య సిద్ధమవుతోంది. 459 కి.మీ. నిడివి ఉన్న ఢిల్లీ–అమృత్సర్–చండీగఢ్, 865 కి.మీ. పొడవైన ఢిల్లీ–వారణాసి, 753 కి. మీ. దూరం ఉండే ముంబై– నాగ్‌పూర్, 886 కి.మీ. తో రూపొందే ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గాలను హై స్పీడ్ కారిడార్లుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయిం చింది. వీటి డీపీఆర్‌ల ప్రక్రియ ప్రారంభం కావటం విశేషం. చెన్నై– మైసూరు, వారణాసి–హౌరా ప్రాజెక్టులు కూడా ఉన్నా, వాటి డీపీఆర్ ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టు పనులు ప్రారంభించే దిశగా కేంద్రం ఏర్పా ట్లు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్–చెన్నై సెమీ హైస్పీడ్ కారిడార్లకు సం బంధించిన ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. ఇందు లో రష్యా కంపెనీకి చెందిన ఇంజనీర్లు హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించారు. అది సాధ్యమే నని అందులో స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నారు. -
‘సేన కూటమితో బుల్లెట్ ట్రైన్‌కు బ్రేక్’
ముంబై : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ పట్టాలపైకి ఎక్కడం అసాధ్యమని భావిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్‌లను కలుపుతూ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకునే అవకాశం ఉంది. మహారాష్ట్రలో అధికార పగ్గాలను చేపట్టిన అనంతరం శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును రద్దు చేస్తుందని, రూ లక్ష కోట్ల వ్యయాంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మహారాష్ట్ర వెచ్చించాల్సిన రూ 5000 కోట్లను నిలిపివేస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 2017 సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు కేవలం 0.1 శాతం వడ్డీతో జపాన్ రూ 88,000 కోట్లు రుణం ఇవ్వనుంది. ప్రాజెక్టు ముందుకు సాగాలంటే మొత్తం వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై మహారాష్ట్ర ఖర్చు చేయబోదని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక రైతుల సంక్షేమం, వ్యవసాయ రుణాల మాఫీని నూతన ప్రభుత్వం చేపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. -
కారు నుంచి బుల్లెట్ రైలు వరకూ
ఒసాకా/కోబే: భారత ఆర్థికాభివృద్ధిలో జపాన్ కీలకమైన పాత్ర పోషించిందని ప్రధాని మోదీ తెలిపారు. సంయుక్త భాగస్వామ్యంలో కార్లు(మారుతీ సుజుకీ) తయారుచేయడం దగ్గర్నుంచి బుల్లెట్ రైళ్ల వరకూ ఇరుదేశాల మధ్య సంబంధాలు కాలంతోపాటు దృఢమయ్యాయని వ్యాఖ్యానించారు. నేటి నుంచి రెండ్రోజుల పాటు సాగే జీ20 సదస్సు కోసం మోదీ జపాన్‌లోని ఒసాకాకు చేరుకున్నారు. అనంతరం జపాన్ ప్రధాని షింబో అబేతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థ పటిష్టత కోసం, అవినీతిని నిర్మూలించడానికి రుణఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని ఇరువురు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వాణిజ్యం, డేటా ఫ్లో నియంత్రణ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని మోదీ–అబేలు నిర్ణయించారు. వాతావరణ మార్పులపై ఈ జీ20 సదస్సులోనే ఓ నిర్మాణాత్మక అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో జపాన్ నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్(ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు)పై ఇరువురు కొద్దిసేపు చర్చించుకున్నారు. జీ20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశంకానున్నారు. ఇరుదేశాల సంస్కృతిలో అంతర్భాగం.. ప్రపంచదేశాలతో భారత్ సంబంధాల విషయానికి వస్తే జపాన్‌కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. సామరస్యం, పరస్పరం గౌరవించుకోవడం అన్నది ఇరుదేశాల సంస్కృతిలో అంతర్భాగంగా ఉందని వ్యాఖ్యానించారు. జపాన్ పర్యటనలో భాగంగా కోబే నగరంలో గురువారం భారత సంతతి ప్రజలతో మోదీ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీకి భారత సంతతి ప్రజలు కరతాళధ్వనులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాబోయే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావడంలో జపాన్ పాత్ర ఎంతో ఉంది. ఈరోజు ఇండియాలో ప్రతీచోట జపాన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు ఉన్నాయి. అదే సమయంలో భారత మానవ వనరులు, నైపుణ్యంతో జపాన్ లబ్ధిపొందుతోంది’ అని అన్నారు. ‘విపత్తు’ సాయం కోరుతున్నా.. విపత్తు నిర్వహణ, పునరావాసం, పునర్నిర్మాణం విషయంలో జపాన్ సహకారాన్ని తాము కోరుతున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఏడాది భారత్‌లో జరిగే ఇండియా–జపాన్ వార్షిక సదస్సుకు అబే రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. కాగా, ఈ భేటీకి ముందు ఇరుదేశాల రక్షణ, విదేశాంగ మంత్రులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 3 కోతుల కథ చెప్పిన మోదీ భారత్–జపాన్ల మధ్య ఎంత బలమైన సంబంధాలు ఉన్నాయో తెలిపేందుకు కళ్లు, చెవులు, నోరు మూసుకున్న మూడు కోతులను మోదీ ప్రస్తావించారు. ‘చెడు చూడవద్దు.. చెడు వినవద్దు.. చెడు మాట్లాడవద్దు అని బాపూ(మహాత్మా గాంధీ) చెప్పడాన్ని మనమందరం వినుంటాం. ఇందుకు కళ్లు, చెవులు, నోరు మూసుకున్న కోతులను ప్రతీకగా చూపుతారు. కానీ ఇందుకు మూలం 17వ శతాబ్దపు జపాన్‌లో ఉంది. మిజారు అనే కోతి చెడు చూడదు. కికజారు అనే కోతి చెడు వినదు. ఇవజారు అనే కోతి చెడు మాట్లాడదు’ అని మోదీ తెలిపారు. -
చిక్కుల్లో బుల్లెట్ ట్రైన్..?
సాక్షి, ముంబయి : ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు అవసరమైన భూ సేకరణపై అధికారులు తలపట్టుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్‌కు ఎంతకాలమైనా వేచిచూస్తామని, ముందుగా వైద్యులు, మందులు వంటి మౌలిక వసతులను కల్పించాలని అభిప్రాయసేకరణకు గ్రామాలకు వెళ్లిన అధికారులకు స్ధానికుల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బుల్లెట్ ట్రైన్‌కు నోడల్ సంస్థగా వ్యవహరిస్తున్న నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను చేపడుతోంది. వైద్య సేవలతో పాటు చెరువులు, సోలార్ విద్యుత్ దీపాలు, అంబులెన్స్‌ల వంటి పలు డిమాండ్లను పాల్ఘార్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు అధికారులు ముందుంచుతున్నారు. ఆయా గ్రామ కూడళ్లలో గ్రామసభలు నిర్వహించి ప్రాజెక్టుపై అవగాహన కల్పిస్తున్న అధికారులకు స్ధానికులు తమ డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ రూటు మార్చింది. గ్రామసభలకు బదులు నేరుగా భూయజమానులను కలిసి పరిహారంతో పాటు వారి డిమాండ్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. 2022 నాటికి బుల్లెట్ ట్రైన్‌ను పట్టాలెక్కించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. 508 కిమీ ట్రైన్ కారిడార్‌లో అత్యధిక భాగం 110 కిమీ మేర పాల్ఘార్ జిల్లా మీదుగానే సాగుతుంది. జిల్లాలోని 73 గ్రామాలకు చెందిన 300 హెక్టార్ల భూమి ఈ ప్రాజెక్టుకు అవసరం. అయితే ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు భూసేకరణను జిల్లాలోని గిరిజనులు, పండ్ల పెంపకందారులు తీవ్రంగా వ్యతిరేకిస్తునా్నరు. మరోవైపు గ్రామస్థుల నిర్ధిష్ట డిమాండ్లను నెరవేర్చడం ద్వారా భూసేకరణ సాఫీగా సాగేలా ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ వ్యవహరిస్తోంది. గ్రామస్థులు వ్యక్తిగత సమస్యలు కాకుండా సామాజిక సమస్యలనే తెరపైకి తెస్తుండటంతో వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపుతున్నారు. భూసేకరణను వ్యతిరేకిస్తున్న సపోటా, మామిడి పెంపకందార్లను కూడా ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్ అధికారులు ఊరడిస్తున్నారు. మెరుగైన ప్యాకేజ్‌తో పాటు బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కితే స్ధానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
మరింత ఆలస్యం కానున్న బుల్లెట్ ట్రైన్..?
ముంబై : ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్’ మరింత ఆలస్యం కానునట్లు సమాచారం. జపాన్ దేశ సహకారంతో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం గడువు విధించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు భూ సేకరణ అంత సులభంగా సాధ్యమయ్యేలా కనపడటంలేదని రైల్వే అధికారులు తెలుపుతున్నారు. ముంబై - అహ్మదాబాద్ మార్గంలో రూపొందనున్న ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కారిడార్‌లో ఐదోవంతు భాగం అనగా 108 కి.మీ. విస్తీర్ణం పాల్గార్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం ముఖ్యంగా మామిడి, సపోట వంటి పండ్ల తోటలకు ప్రసిద్ధి. దాంతో ఈ భూములను వదులుకోవడానికి పాల్గార్ రైతులు సుముఖంగా లేరు. భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులు కూడా పలు షరతులు విధిస్తున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అడగ్గా...మరికొందరు ప్రస్తుత మార్కెట్ విలువ కంటే 50శాతం ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో రైతుల వద్ద నుంచి భూమిని సేకరించడం తమ వల్ల కాదంటూ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) అధికారులు చేతులేత్తాసారు. దాంతో ప్రభుత్వం ఈ విషయం గురించి చర్చించడానికి భారతీయ రైల్వేకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను నియమించినట్లు సమాచారం. అయితే పాల్గార్ రైతులు మాత్రం బలవంతంగా తమ భూములను లాక్కుంటే నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. వచ్చే ఏడాది పాల్గార్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో మిగితా రాజకీయ పార్టీలు కూడా రైతులకు మద్దతు తెలుపుతుకన్నాయి. ‘బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని...ఈ ప్రాజెక్ట్ కోసం వెచ్చించే సొమ్మును మన రైల్వేలను అభివృద్ధి పర్చడం కోసం వినియోగిస్తే మంచిద’ని వాదిస్తున్నాయి. ఈ వియషం గురించి జపాన్ ఇంటర్నేషనల్ కో - ఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) అధికారి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నాటికి అనగా 2022, ఆగస్టు 15 నాటికి ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. 2023 నుంచి ఈ బుల్లెట్ ట్రైన్ వినియోగంలోకి రావాలిని ఒప్పందం. అందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి భూ సేకరణ జరగాలి. కానీ భూ సేకరణకు రైతులు ఒప్పుకోవడం లేదు. ఈ విషయం గురించి మేము భారతీయ రైల్వే అధికారులతో చర్చించినప్పడు వారు ఇదేమంత పెద్ద విషయం కాదు మేము చూసుకుంటామన్నా’రని తెలిపారు. మోదీ ‘మేకిన్ ఇండియా’లో భాగంగా...కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో 17 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇండియా జపాన్ నుంచి 50 ఏళ్ల కాలపరిమితితో అధిక మొత్తంలో రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. -
రూ.98వేల కోట్ల మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్‌కు చిక్కులు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ డ్రీమ్... ముంబై-అహ్మదాబాద్ మధ్యలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ తొలి రన్ 2022 ఆగస్టు నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూములను సేకరించడం కూడా మొదలుపెట్టింది. కానీ అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైంది. భూమి కొనుగోలులో కేంద్ర ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. మహారాష్ట్రలోని పాల్గడ్ జిల్లాలో గిరిజన గ్రామాలు, స్థానిక కమ్యూనిటీలు తామెంతో ప్రాణప్రదంగా చూసుకునే భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. పాల్గడ్ జిల్లాలో మొత్తం 70కి పైగా గిరిజన గ్రాములున్నాయి. ఆ గ్రామాల్లో 20కి పైగా గ్రామాలు ఈ ప్రాజెక్ట్‌కు భూమి ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రతిపాదిత రైల్ కారిడర్‌కు వ్యతిరేకంగా నిరసన ఉద్యమాలు కూడా చేపట్టారు ఆ గ్రామ ప్రజలు. భారత తొలి హై-స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. 508 కిలోమీటర్లు ఈ ట్రైన్ కారిడర్‌ను నిర్మిస్తున్నారు. అసలు 2018 జూన్ నాటికే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ భూమి కొనుగోలులో వచ్చిన చిక్కుతో దీని నిర్మాణాన్ని 2019 జనవరికు జరిపారు. ఈ ఏడాది చివరి వరకు ఎలాగైన ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూమిని సేకరించి, వచ్చే ఏడాది ప్రారంభించాలని చూస్తున్నారు. కానీ ఈ ఏడాది చివరి వరకైనా భూమిని సేకరిస్తారో లేదో స్పష్టత కావడం లేదు. పాల్గడ్ జిల్లా నుంచి వెళ్లే 110 కిలోమీటర్ల కారిడర్ మహారాష్ట్ర, గుజరాత్ రాజధానులను కలుపుతోంది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దీనికి వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నాయని కానీ అనుకున్న సమయానికి దీని నిర్మాణం చేపడతామని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించే భూమికి సర్కిల్రేటు కంటే ఐదు రెట్లు ఎక్కువగా చెల్లిస్తామని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో 1400 ఎకరాలను, గుజరాత్లో రూ.10 కోట్ల భూమిని సేకరిస్తున్నట్టు దేశీయ రైల్వే పేర్కొంది. దీనిలో భాగంగా పాల్గడ్ జిల్లాలోనే 200 ఎకరాలను సేకరించాల్సి ఉంది. దీనిలో ఎక్కువ భాగం గిరిజనులవే. మొత్తం 73 గ్రామాల్లో 50 గ్రామాలు అధికారుల ఒప్పందానికి అంగీకరించాయని, కానీ 23 గ్రామాల గిరిజనులు మాత్రం రైల్వే అధికారులకు సహకరించడం లేదని దేశీయ రైల్వే పేర్కొంది. సర్వేకు వెళ్లిన వారిపై దాడులు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటికే జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఫండ్స్‌ను అందించింది. ముంబైలో కొన్ని ప్రాంతాల్లో భూమి కొనుగోళ్లు పూర్తయ్యాయి. -
‘ఎద్దుల బండిపై వెళ్లండి’
గాంధీనగర్ : బుల్లెట్ రైలు ప్రాజెక్టును వ్యతిరేకించే వారందరూ ఎద్దుల బండిపై ప్రయాణం చేయాలని గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అహ్మదాబాద్-ముంబైల మధ్య జపాన్ సహకారంతో లక్షా పదివేల కోట్లతో నిర్మించతలపెట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ప్రారంభించాలని భావించినా, అది సాధ్యం కాలేదని మోదీ అన్నారు. ఇప్పుడు జనతా ప్రభుత్వం ప్రాజెక్టు ప్రారంభించడంతో దాన్ని వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. అతి తక్కువ మొత్తానికి ప్రాజెక్టును తీసుకురావడంతో కాంగ్రెస్ ఓర్వలేకపోతోందని అన్నారు. బుల్లెట్ ట్రైన్ కారిడార్ వల్ల గుజరాత్లో ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరుగుతాయని చెప్పారు. ప్రాజెక్టుకు వాడే ముడి సరుకు మొత్తాన్ని జపాన్ భారత్ నుంచే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని పెద్దలకు గుజరాత్‌తో సంబంధాలు ఉన్నా.. రాష్ట్రానికి చేసిందని శూన్యమని చెప్పారు. కనీసం ఫెర్రీ సర్వీసులను కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేకపోయిందని అన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రభుత్వం వచ్చిన తర్వాత గుజరాత్లో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో రాష్ట్రం ఆనందమయంగా ఉందని గుర్తు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదిగా రికార్డు సృష్టించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర పర్యాటక రంగం వృద్ధి సాధిస్తుందని అన్నారు. గుజరాత్ తీర రేఖ పొడవునా 1300 దీవులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని సింగపూర్ కంటే గొప్పగా తీర్చిదిద్దాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు వెల్లడించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను మోదీ కోరారు. -
పార్టీ ఎన్నికల్లోనూ రిగ్గింగేనా?
భరూచ్/సురేంద్రనగర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికను ఒక ప్రహసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎన్నిక జరగకమునుపే ఫలితం వెల్లడయిందని, ఏఐసీసీకి రాహుల్‌గాంధీయే అధ్యక్షుడవుతారని అందరి కీ తెలిసిపోయిందన్నారు. దీనిని బట్టి సంస్థాగత ఎన్నికల్లోనూ ఆ పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వెల్లడయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సురేంద్రనగర్, భరూచ్లలో జరిగిన ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు దేశాన్ని ఎలా కాపాడగలుగుతారని కాంగ్రెస్‌ను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు రిగ్గింగ్ ఆనవాయితీగా మారిందన్నారు. ముందుగా ఆ పార్టీలోనే ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వహిం చాలని సూచించారు. జవహ ర్లాల్ నెహ్రూ కంటే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కే అప్పటి పార్టీ సమావేశంలో ఎక్కువ ఓట్లు వచ్చినా, కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడి నెహ్రూను ప్రధానిగా ఎన్నుకున్నారన్నారు. మొరార్జీ దేశాయ్ విషయం లోనూ ఇదే జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత షెహ్జాద్ పూనావాలా కూడా పార్టీ అంతర్గత ఎన్నికల తీరును తప్పుబట్టారని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు తమ యువనేతను గద్దెపైన కూర్చోబెట్టేందుకు నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపించారు. సమాజాన్ని విభజించాలని చూస్తోంది కులాలు, మతాల ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని విభజించాలని చూస్తోందని ప్రధానమంత్రి మోదీ విరుచుకుపడ్డారు. అన్నదమ్ములమధ్య, ధనిక పేద, వర్గాల ప్రజలకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి, అక్షరాస్యులు, నిరక్షరాస్యులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఆయా కులాల నాయకులు హార్దిక్‌పటేల్, జిగ్నేష్ మెవానీ, అల్పేశ్ ఠాకూర్ వంటి వారితో ఒప్పందాలు చేసుకుంటోందని విమర్శించారు. వాళ్లు చేయలేని పనిని మేం చేశాం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ. వారు చేయలేని పనిని తాము చేస్తున్నందుకు కాంగ్రెస్‌కు మంటగా ఉందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చౌకబారు విమర్శలకు చేస్తున్నారని అన్నారు. బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించటం వారికి ఇష్టం లేకుంటే ఎద్దుల బండ్లపై తిరగొచ్చునని ఎద్దేవాచేశారు. జాతీయతే మనల్ని సాయపడేలా చేస్తుంది: మోదీ అహ్మదాబాద్: జాతీయత భావమే తనకు, తన ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా ఉంటూ, క్రైస్తవులు సహా వివిధ వర్గాల ప్రజలకు సాయపడేలా చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఆదివారం ఆయన శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ విశ్వ విద్యాప్రతిష్టానమ్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. గాంధీనగర్ ఆర్చిబిషప్ థామస్ మెక్వాన్ గత నెలలో క్రైస్తవులకు రాసిన లేఖను ప్రస్తావించారు. జాతీయవాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలంటూ ప్రార్థన చేయాలని క్రైస్తవులను ఆ లేఖలో కోరటం తనను ఎంతో ఉత్తేజితుడిని చేసిందన్నారు. ఆ లేఖ ప్రతి భారతీయుడికి మార్గదర్శిగా పనిచేస్తుందన్నారు. -
బుల్లెట్ ట్రెయిన్ దండగేనా..?
సాక్షి,న్యూఢిల్లీ: మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ముంబయి-అహ్మదాబాద్ మధ్య చేపట్టిన బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.బుల్లెట్ ట్రెయిన్ ప్రవేశపెడుతున్న ఈ రూట్లో ప్రస్తుతం నడిచే రైళ్లలో 40 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆర్టీఐ సమాచారం వెల్లడించింది. ముంబయి-అహ్మదాబాద్ రూట్లో రైళ్లలో ప్రయాణీకుల సంఖ్య దారుణంగా పడిపోతూ పశ్చిమ రైల్వేలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ సెక్టార్లో ఇప్పటికే పశ్చిమ రైల్వేలకు గత క్వార్టర్లో రూ 30 కోట్ల నష్టం నమోదైంది. అంటే నెలకు రూ 10 కోట్ల మేర పశ్చిమ రైల్వే నష్టాలు మూటగట్టుకుంది. బుల్లెట్ ట్రెయిన్ రాకతో పరిస్థితి మరింత దిగజారుతుందని ఆర్టీఐ కింద సమాచారం రాబట్టిన ముంబయికి చెందిన సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాణీకుల తాకిడి తగినంతగా లేని ఈ రూట్లో కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై రూ లక్ష కోట్లు వెచ్చించాలని ప్రయత్నిస్తోందని..అందుకు తగ్గట్టుగా ఎలాంటి కసరత్తును చేపట్టలేదని గల్గాలి అన్నారు. రెడ్ సిగ్నల్ బుల్లెట్ ట్రెయిన్ పట్టాల పైకి ఎక్కిన అనంతరం అది ఎంతవరకూ ఆర్థికంగా నెగ్గుకురాగలుగుతుందనేది అనుమానమేనని అన్నారు. మరోవైపు నష్టాల భయంతో ఈ రూట్లో కొత్తగా ఎలాంటి రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేలు ముందుకురావడం లేదు. ఆర్థికంగా గిట్టుబాటు కాని సెక్టార్లో కేంద్రం భారీ వ్యయంతో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుకు పూనుకోవడం పట్ల గల్గాలి వంటి సామాజికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గల్గాలి ప్రశ్నలకు బదులిచ్చిన పశ్చిమ రైల్వే ముంబయి-అహ్మదాబాద్ రూట్లో 40 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయని, అహ్మదాబాద్-ముంబయి రూట్లో ఏకంగా 44 శాతం సీట్లుగా ఖాళీగా ఉంటున్నాయని వెల్లడించింది. వైట్ఎలిఫెంట్ కానుందా..? ముంబయి-అహ్మదాబాద్ మధ్య రైళ్లకు డిమాండ్ తక్కువగా ఉండటం,విమాన ప్రయాణాలు, మెరుగైన రోడ్ కనెక్టివిటీ వంటి కారణాల నేపథ్యంలో బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టుపై కేంద్రం పునరాలోచించాలని గల్గాలి కోరారు. డిమాండ్ కొరవడినందున ఈ ప్రాజెక్టు ప్రజాధనాన్ని మింగే తెల్లఏనుగులా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
బుల్లెట్ రైలుకు ‘చిరుత’ లోగో
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.1.08లక్షల కోట్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టు ‘లోగో డిజైన్’ పోటీలో 27ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ చక్రధర్ ఆళ్ల విజేతగా నిలిచారు. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న చిరుత పులి రైలు ఇంజన్‌పై కనిపించేలా ‘లోగో’ను సృష్టించి కాంపిటీషన్లో గెలిచాడు. ఇకపై బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అధికారిక పత్రాలపై ఈ లోగోనే వాడనున్నారు. ప్రస్తుతం చక్రధర్ అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)లో గ్రాఫిక్ డిజైన్ పీజీ రెండో సంవత్సరం అభ్యసిస్తున్నాడు. అహ్మదాబాద్, ముంబై నగరాలను కలుపుతూ 500 కి.మీ. పొడవైన బుల్లెట్ రైలు ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ చేపడుతోంది. సతీశ్ గుజ్రాల్ నేతృత్వంలోని కమిటీ చక్రధర్ లోగోను తుది విజేతగా ప్రకటించింది. -
అందర్ని చంపేస్తుంది : అలాంటిదే ఈ ప్రాజెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి విమర్శల వర్షం కురిపించారు. ఈ ప్రాజెక్టు కూడా అచ్చం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లాంటిదేనని, ప్రతి ఒక్కర్ని చంపుకుంటూ పోతుందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. రైలు భద్రతను పెరుగుపరచకుండా.. ఈ ప్రాజెక్టుపై వ్యర్థంగా ఖర్చు చేయడంపై మండిపడ్డారు. ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్ రోడ్డు రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌పై నిన్న జరిగిన విషాద ఘటన అనంతరం ఒక్క రోజుల్లోనే చిదంబరం బుల్లెట్ ప్రాజెక్టుపై విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతతో పాటు ప్రతి దాన్ని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు చంపుకుంటూ పోతుందని, ఇది అచ్చం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లాంటిదేనని పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కంటే భద్రత, మెరుగైన సదుపాయాలపై రైల్వే దృష్టిసారించాలని సూచించారు. బుల్లెట్ ట్రైన్లు సాధారణ ప్రజల కోసం కాదని, డబ్బూ, పలుకుబడి ఉన్నవాళ్ల ప్రయాణం చేయడం కోసమని అన్నారు. చిదంబరం ట్వీట్ల రూపంలో ఈ విమర్శలు చేశారు. కాగ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని షింజో అబేలు సెప్టెంబర్ 14న దేశీయ మొదటి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తవుతుంది. 500 పైగా కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లో బుల్లెట్ ట్రైన్ చేరుకుంటుంది. -
కలల ‘బుల్లెట్’ కు ముందడుగు..
► అహ్మదాబాద్‌లో శంకుస్థాపన చేసిన భారత్, జపాన్ ప్రధానులు ► భారత్‌కు జపాన్ ఇచ్చిన పెద్ద కానుకన్న ప్రధాని మోదీ ► ఇరుదేశాల సంబంధాల్లో కొత్తశకం ప్రారంభం: షింజో అబే ► వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలు సహా 15 ఒప్పందాలపై సంతకాలు అహ్మదాబాద్/గాంధీనగర్: భారత్–జపాన్ సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడింది. జపాన్ ఆర్థిక సాయంతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు గురువారం అహ్మదాబాద్‌లో శంకుస్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం సబర్మతిలోని అథ్లెటిక్స్స్టేడియంలో జరిగిన కార్యక్రమం సభలో మోదీ మాట్లాడుతూ.. రూ.1.1 లక్షల కోట్లతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ‘భారత్‌కు జపాన్ ఇచ్చిన పెద్ద కానుక’ అని మోదీ వ్యాఖ్యానించారు. భారత కలల ప్రాజెక్టుకు ముందడుగు పడిందన్నారు. ‘భారత–జపాన్ భాగస్వామ్యం ప్రత్యేకం, వ్యూహాత్మకం, అంతర్జాతీయం’అని అబే పేర్కొన్నారు.ఆ తర్వాత గాంధీనగర్‌లో జరిగిన భారత్–జపాన్ వార్షిక సదస్సులో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను పెంచేలా భద్రతతోపాటు పలు రంగాల్లోనూ కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా ఇరువురు నేతలు చర్చించారు. ఉగ్రసాయం మానుకోవాలని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. భారత్–జపాన్.. ఒకరికొకరు! ‘పటిష్ఠ భారత్ కావాలని జపాన్.. జపాన్ బలోపేతాన్ని భారత్ కోరుకుంటున్నాయ’ని అబే వ్యాఖ్యానించారు. ‘నా మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘదృష్టి గల నేత. నవభారత నిర్మాణానికి ఆయన సంకల్పించారు. అందులో భాగంగా రెండేళ్ల క్రితమే హైస్పీడ్ రైళ్లను తీసుకురావాలని ఆయన భావించారు. కొన్నేళ్లలోనే బుల్లెట్ రైలు కిటికీ నుంచి అందమైన భారతాన్ని దర్శిస్తాం’ అని అబే పేర్కొన్నారు. దేశంలో బుల్లెట్ రైలుండాలన్న భారత్ కలను సాకారంచేసే దిశగా ధైర్యంగా తొలి అడుగు ముందుకు పడిందని మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.88వేల కోట్ల రూపాయలను నామమాత్రమైన 0.1శాతం వడ్డీకే ఇచ్చినందుకు జపాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను బుల్లెట్ రైలు గురించి మాట్లాడితే.. పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని విమర్శించారు. ఇప్పుడు దీనికి పనులు మొదలవుతుంటే.. ఇప్పుడు ఈ రైలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. వేగవంతమైన అనుసంధానత కారణంగా సమయం తగ్గుతుంది తద్వారా ఆర్థిక ప్రగతికి మార్గం పడుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు శిక్షణ కోసం వడోదరలో జపాన్ సాయంతో ఏర్పాటుచేయనున్న ఇన్స్టిట్యూట్లో 4వేల మందికి శిక్షణనివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్, మహారాష్ట్ర సీఎంలు విజయ్ రూపానీ, ఫడ్నవిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆప్‌ను అహ్మదాబాద్ – ఆంచీ ముంబై! బుల్లెట్ రైలు ద్వారా అహ్మదాబాద్, ముంబై నగరాల మధ్య ప్రయాణ సమయంతోపాటుగా ప్రజల మధ్య దూరం కూడా తగ్గుతుందని మోదీ పేర్కొన్నారు. గుజరాతీ, మరాఠీ పదాలను ఉపయోగిస్తూ.. ‘ఆప్‌ను అహ్మదాబాద్ నుంచి ఆంచీ ముంబై’ మధ్య నడిచే రైలు వల్ల ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. ‘భారతీయులం, మరీ ముఖ్యంగా గుజరాతీలం ఏది కొనాలన్నా, అమ్మాలన్నా గీచి గీచి బేరమాడతాం. చిన్న బండి కొనుక్కునేందుకు పది బ్యాంకులు తిరిగి ఎవరు తక్కువ వడ్డీకి రుణమిస్తారో వెతుకుతాం. ఇప్పుడు జపాన్ కూడా రూ.1.1 లక్షల కోట్ల ప్రాజెక్టుకు కేవలం 0.1 శాతం వడ్డీకే రుణమిచ్చింది’ అని మోదీ పేర్కొన్నారు. జపాన్‌లో తొలి రెండక్షరాలు (ఇంగ్లీషులో) జే,ఏ ఇండియాలో తొలి అక్షరం ఐ కలిస్తే ‘జై’ అవుతుందన్న అబే.. ‘జై జపాన్, జై ఇండియా’ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఈ నినాదం కోసం మోదీతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు. అనంతరం గాంధీనగర్‌లోని దండి కుటీర్ మ్యూజియంను అబేకు దగ్గరుండి మోదీ చూపించారు. వ్యూహాత్మక బంధాల బలోపేతం అనంతరం, గాంధీనగర్‌లో భారత్–జపాన్ వార్షిక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మోదీ–అబే మధ్య ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయాంశాలపై చర్చలు జరిగాయి. రక్షణ, వాణిజ్యం, పౌరఅణు శక్తి రంగాల్లో సహకారాన్ని పెంచుకునే దిశగా వీరిద్దరూ చర్చలు జరిపారు. దీంతోపాటుగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తృతం చేసుకునే దిశగా పౌర విమానయానం, వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించి 15 ఒప్పందాలు జరిగాయి. చైనా దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు కూడా అంగీకారం కుదిరింది. అనంతరం ఇరువురు నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సంయుక్త ప్రకటనపై సంతకం చేయటం ద్వారా.. భారత–జపాన్ సంబంధాల్లో కొత్త శకం ప్రారంభం కానుంది. దీని ఆధారంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా శాంతినెలకొల్పేలా.. ఇరుదేశాల ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మేం బలంగా ముందుకు తీసుకెళ్తాం’ అని అబే తెలిపారు. ఇరుదేశాలు ‘భారత్–జపాన్ పెట్టుబడుల రోడ్ మ్యాప్’కు అంగీకరించాయన్నారు. పౌర అణు ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ.. క్లీన్ ఎనర్జీ రంగంలో ఇరుదేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైందని అబే తెలిపారు. అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించుకునేలా చరిత్రాత్మక ఒప్పందంపై గతేడాది తన జపాన్ పర్యటన సందర్భంగా సంతకం చేసినట్లు మోదీ పేర్కొన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో జపాన్ 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30వేల కోట్లు) పెట్టుబడులు పెట్టిందని.. గతేడాది కన్నా ఇది 80 శాతం ఎక్కువని మోదీ వెల్లడించారు. కాగా జపాన్ ప్రధాని అబే అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటే ఆయన భార్య అకీ అబే కూడా బిజీగా గడిపారు. వివిధ పాఠశాలలు, కాలేజీలతోపాటుగా అంధులకోసం నడుస్తున్న ఎన్జీవోను సందర్శించారు. భూములు తీసుకుంటారనే బాధతో.. బుల్లెట్ రైలు ప్రాజెక్టుకోసం భూసేకరణలో తమ వ్యవసాయ భూములు పోతాయేమోనని మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బోయ్సర్ రైల్వే స్టేషన్ ఎదుట నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టిన రైతులు.. వ్యవసాయ భూములు తీసుకుంటే తమ జీవితాలు దుర్భరమవుతాయని ఆవేదన చెందారు. గుజరాత్ ఎన్నికల కోసమే: కాంగ్రెస్ హైస్పీడ్ రైలును కాంగ్రెస్ పార్టీ ‘గుజరాత్ ఎన్నికల బుల్లెట్ రైలు’గా అభివర్ణించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ రైలుకు శంకుస్థాపన చేశారని విమర్శించింది. ప్రయాణికుల భద్రతపై దృష్టిపెట్టాల్సిందిపోయి.. ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టును ప్రారంభించారని లోక్‌సభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు విశేషాలు ♦ ప్రాజెక్టు ఖర్చు రూ.1.1లక్షల కోట్లు ♦ జపాన్ చేస్తున్న సాయం 88వేల కోట్లు (0.1 శాతం వడ్డీపై రుణం) ♦ ముంబై–అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్లు ♦ గరిష్ట వేగం గంటకు 320 – 350 కిలోమీటర్లు ♦ మొత్తం స్టేషన్లు 12 ♦ ప్రయాణ సమయం 12 స్టేషన్లలో ఆగితే 2.58 గంటలు ♦ కొన్ని స్టేషన్లలోనే ఆగితే 2.07 గంటలు ♦ ప్రస్తుత రైల్వే మార్గంలో ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణ సమయం 7–8 గంటలు ♦ 2022 ఆగస్టు 15న దీన్ని ప్రారంభించాలని లక్ష్యం. ఉగ్రసాయంపై.. ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటంలో భారత్‌కు సంపూర్ణ సహకారం ఉంటుందని అబే స్పష్టం చేశారు. అల్‌కాయిదాతోపాటుగా పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలపై పోరాటంలో సహకారానికి మద్దతు తెలిపారు. ముంబై (2008), పఠాన్‌కోట్ (2016) ఉగ్రదాడులకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని ఈ సందర్భంగా మోదీ, అబేలు పాకిస్తాన్‌ను కోరారు. ‘ఉగ్రవాద కేంద్రాలు తొలగించటం, వారికి ఎలాంటి వసతులు అందకుండా చేయటం, ఉగ్ర నెట్‌వర్క్‌ల ధ్వంసం, సీమాంతర ఉగ్రవాదం లేకుండా చూడాలని అన్ని దేశాలను మోదీ–అబే కోరారు’ అని సంయుక్త ప్రకటన పేర్కొంది. -
బుల్లెట్ ట్రైన్‌తో దూసుకెళ్తాం: మోదీ
సాక్షి, అహ్మదాబాద్: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ ప్రాంతాలు, ప్రజల మధ్య దూరం తగ్గడంతో హైస్పీడ్ కనెక్టివిటీ ఫలితంగా ఉత్పాదకత పెరుగుతుందని అన్నారు. ముంబయి, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ పనులను ప్రారంభించిన అనంతరం ఈ ప్రాజెక్టుతో మేక్ ఇన్ ఇండియా ఆశయాలు మున్ముందుకు సాగుతాయని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే పేర్కొన్నారు. భారత్, జపాన్ల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని ఇరువురు నేతలు అన్నారు. అహ్మదాబాద్‌లో శంకుస్ధాపన కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో నవభారత్ ఆవిష్కరణకు ఉత్తేజం లభిస్తుందని, మన స్వప్నాలు ఫలించేలా దేశం సగర్వంగా ముందుకు సాగేందుకు బాటలు పడతాయని అన్నారు. ఈ భారీ ప్రాజెక్టులో ఎలాంటి జాప్యం, అవరోధాలు లేకుండా ముందుకెళ్లేందుకు జపాన్ ప్రధాని అబే ప్రత్యేక చొరవ తీసుకున్నారని ప్రశంసించారు. బుల్లెట్ ట్రైన్ కోసం జపాన్ కేవలం 0.1 శాతం వడ్డీతో రూ 80,000 కోట్ల రుణం మంజూరు చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన టెక్నాలజీ జపాన్ అందిస్తుండగా, పరికరాలు, తయారీ పూర్తిగా భారత్‌లోనే జరుగుతుందని అన్నారు. రూ 1.10 లక్షల కోట్లతో చేపట్టే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2022 నాటికి పూర్తవుతుంది. ముంబయి, అహ్మదాబాద్‌ల మధ్య 500 కిమీ దూరాన్ని కేవలం రెండు గంటల్లోనే బుల్లెట్ ట్రైన్ చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టును భారత రైల్వేలు, జపాన్‌కు చెందిన షిన్కన్సెన్ టెక్నాలజీలు సంయుక్తంగా చేపడతాయి. -
బుల్లెట్ ట్రెయిన్: బీహెచ్ఈఎల్ జోష్
సాక్షి, ముంబై: దేశంలో తొలి బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టును దక్కించుకుందన్న వార్తలతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బీహెచ్ఈఎల్) మార్కెట్లో దూసుకుపోతోంది. రూ. 1.1 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టనున్న దేశంలోని తొలి బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టును దక్కించుకునేందుకు బీహెచ్ఈఎల్ కవాసాకితో కలిసి పని చేయనుందనే అంచనాలు ఇండస్ట్రీలో భారీగా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భెల్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దాదాపు గురువారం 10 శాతం పెరిగింది. దీంతో ఈ ఏడాదిలోనే ఇది అత్యంత ఎక్కువ పెరుగుదలగా నమోదైంది. అహ్మదాబాద్-ముంబై హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ రోలింగ్ స్టాక్ కోసం భెల్, కవాసాకి హెవీ ఇండస్ట్రీస్ కలిసి పనిచేస్తాయని జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే వ్యాఖ్యలను ఉటంకిస్తూ బ్లూంబెర్గ్ నివేదించింది. మరోవైపు ఇది తమకు మంచి ప్రోత్సాహాన్నందిస్తుందని భెల్ సీఎండీ తెలిపారు. దీంతో బీహెచ్ఈఎల్ స్టాక్ భారీ లాభాలతో 52 వారాల గరిష్టాన్ని తాకింది. కాగా జపాన్ సాయంతో దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు నిర్మాణానికి కేంద్రం నాంది పలికింది. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు నిర్మాణ పనులకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే గురువారం అహ్మదాబాద్ లో శంకుస్థాపన చేశారు.