India Bullet Train: బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి | India's First Bullet Train Will Run Between Surat And Bilimora In 2026: Union Minister Ashwini Vaishnaw - Sakshi
Sakshi News home page

India Bullet Train: బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి

Published Fri, Jan 12 2024 3:14 PM | Last Updated on Fri, Jan 12 2024 3:27 PM

Bullet Train Project May Start In 2026 - Sakshi

భారత్‌లో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. గుజరాత్‌లో జరుగుతున్న ‘వైబ్రెంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2024’కు హాజరై మాట్లాడారు. అహ్మదాబాద్‌-ముంబయి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 నాటికి పూర్తవుతుందన్నారు. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు 35కి.మీ దూరం సిద్ధం అవుతుందని చెప్పారు.

ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు బాగానే జరుగుతున్నాయని చెప్పారు. అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రాజెక్ట్ కచ్చితంగా ఏ సమయంలోపు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగమైన అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ కూడా దాదాపు పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్‌ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: ఖజానాకు చేరిన పన్ను వసూళ్లు ఎంతంటే..

దేశంలోనే ఈ తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కారిడార్‌ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement