Bullet Train
-
హైస్పీడ్ బుల్లెట్ రైలును పరీక్షించిన చైనా
బీజింగ్:ఆవిష్కరణల్లో చైనా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ రైలు నమూనాను చైనా రైల్వే సంస్థ తాజాగా ఆవిష్కరించింది. దీనికి సీఆర్450గా పేరుపెట్టింది. ఆదివారం(డిసెంబర్29) బీజింగ్‌లో ఈ రైలును పరీక్షించారు. ట్రయల్‌రన్‌లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైలు దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిమీ వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైలుగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది.ఈ బుల్లెట్ రైలు చైనా రాజధాని బీజింగ్ నుంచి షాంఘై నగరానికి కేవలం రెండున్నర గంటల్లోనే ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతమున్న సీఆర్400 మోడల్ కంటే ఇది 12 శాతం బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20 శాతం తక్కువగానే వాడుతుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు.ఇక గత బుల్లెట్ రైలు మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ వేగాన్ని అందుకోవడం గమనార్హం. చైనా హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రపంచలోనే అతిపెద్దది కావడం గమనార్హం. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు. -
వాళ్లు ఏది చేసినా రికార్డే అవుతుంది సార్!
-
గుజరాత్ బుల్లెట్ ప్రాజెక్టులో అపశృతి
అహ్మాదాబాద్: గుజరాత్‌లోని బుల్లెట్ రైల్ ప్రాజెక్టులో ప్రమాదం చోటు చేసుకుంది. ఆనంద్ జిల్లా వసాద్ దగ్గర పిల్లర్లు కూలిపోయాయి. ఆకస్మికంగా పిల్లర్లు కూలడంతో ఈ ప్రమాదంలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఐరన్ బీమ్ కూలిపోవడంతో 3-4 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను రక్షించారు. వారిని ఆసుపత్రికి తరలించామని ఆనంద్ ఎస్పీ గౌరవ్ జసాని చెప్పారు.VIDEO | Gujarat: "According to the primary information, 3-4 workers were trapped under the debris after an iron beam collapsed. The rescue operation started immediately. Two people have already been rescued and were taken to the hospital," says Anand SP Gaurav Jasani on collapse… pic.twitter.com/0N5ze6JR1S— Press Trust of India (@PTI_News) November 5, 2024 -
స్నేక్ ఎఫెక్ట్.. ఆలస్యమైన బుల్లెట్ రైలు
టోక్యో: జపాన్‌లో బుల్లెట్ రైలు 17 నిమిషాలు ఆలస్యమవడం హాట్‌టాపిక్‌గా మారింది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు నిమిషం ఆలస్యం కాకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటాయి. అయితే అనూహ్యంగా బుల్లెట్ రైలు ఆలస్యమవడానికి ఓ పాము కారణమైంది. పాము రైలుపైకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లలో కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి ఉంటుంది. పాములను మాత్రం అనుమతించరు. ప్రయాణికుల లగేజీని మాత్రం చెక్ చేసే నిబంధన లేదు. ఎవరైనా ప్రయాణికుల లగేజీలో పాము వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జపాన్‌లో బుల్లెట్ రైలు 1964 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ 2700కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సగటున నిమిషానికంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లెట్ రైలు స్పీడు గంటకు 300 కిలో మీటర్లు. ఇదీ చదవండి.. జపాన్‌కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డు -
బుల్లెట్ రైలు ఎప్పుడు పట్టాలెక్కుతుందంటే..
దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా బుల్లెట్రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కుతుందని చెప్పారు. ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన ఈమేరకు వివరాలు వెల్లడించారు. ‘బుల్లెట్ రైలు కోసం 500కి.మీల పొడవైన ప్రాజెక్టును నిర్మించేందుకు వివిధ దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. కానీ, భారత్ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 8-10 ఏళ్లలోనే పూర్తిచేయనుంది. 2026 నాటికి ఈ రైలు పట్టాలెక్కనుంది. మొదట గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడపనున్నాం. 2028 నాటికి ముంబయి-అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’ అని మంత్రి చెప్పారు. దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందనట్లు మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయినట్లు సమాచారం. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకున్న ఫుడ్ డెలివరీ సంస్థ సీఈవో -
‘ఆ ప్రయాణం చేస్తే శరీరం కరిగిపోతుంది.. కాళ్లూ చేతులు విడిపోతాయి’
ప్రపంచంలో నిత్యం కొత్త ఆవిష్కరణలు వస్తూనే ఉంటాయి. పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో శాస్త్ర, సాంకేతిక రంగంలో ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే కొత్త పరిజ్ఞానాలు పుట్టుకొచ్చిన ప్రతీసారి కొత్త భయాలు మొదలవుతాయి. ప్రస్తుతం జనరేటివ్ ఏఐ ఆధారిత సాధనాలతో ఈ భయం ఎక్కువవుతోంది. ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, వ్యాపావేత్తలు ఏఐ భవిష్యత్తు తరానికి ముప్పు తెస్తుందని కొందరు భావిస్తే, ఆ సాంకేతికతతో మరింత మేలు జరుగుతుందని ఇంకొందరు అంటున్నారు. వారి భావనలు ఎలాఉన్నా మర్పు సత్యం. కొత్త పరిజ్ఞానాలు వచ్చినప్పుడు ఇలాంటి వాదోపవాదాలు జరగటం, భయాలు తలెత్తటం మొదటి నుంచీ ఉన్నవే. అప నమ్మకం, సందేహం, ఆవిష్కరణల్లోని సంక్లిష్టత, టెక్నాలజీ మీద అవగాహన లేకపోవటం, అర్థం చేసుకోలేక పోవటం వంటివన్నీ వీటికి కారణమవుతుంటాయి. తమ జీవనోపాధికి భంగం కలుగుతుందనే అభిప్రాయమూ భయాన్ని సృష్టిస్తుంది. చరిత్రలో ఇలాంటి ఒక ఆవిష్కరణ గురించి తెలుసుకుందాం. విచిత్రమైన భయాలు ‘రైలులో ప్రయాణం చేస్తే తీవ్ర గాయాలవుతాయి. ప్రాణాలూ పోవచ్చు.’ ‘శరీరం కరిగిపోతుంది. కాళ్లూ చేతులు విడిపోయి, పక్కలకు ఎగిరి పడతాయి.’ ‘గర్భిణుల రైళ్లలో ప్రయాణం చేస్తే వారి కడుపులోంచి పిండాలు బయటకు వచ్చేస్తాయి.’ ఇప్పుడంటే ఇవి నవ్వు తెప్పిస్తుండొచ్చు గానీ ఒకప్పుడు ఇలాగే భయపడేవారు. రైల్ సిక్నెస్ ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా రైలు ప్రయాణం ఇంగ్లండ్‌లో 1825లో ప్రారంభమైంది. రైలు వేగం, అది చేసే చప్పుడు, దాన్నుంచి వెలువడే పొగ చాలామందిని భయభ్రాంతులకు గురిచేశాయి. అప్పటికి రైలు వేగం గంటకు 30 కిలో మీటర్లు. అంత వేగంతో ప్రయాణిస్తే ప్రమాదమని, బోగీ కదలికలకు ఎముకలు విరిగిపోతాయని వణికిపోయేవారు. ఈ రైలు భయానికి జర్మనీలో ‘ఈసెన్బాంక్రాన్కీట్’ అనీ పేరు పెట్టారు. అంటే ‘రైల్ సిక్నెస్’ అని అర్థం. ఇదీ చదవండి: పెళ్లికొడుకు వాచ్‌పై కన్నేసిన జూకర్బర్గ్ దంపతులు.. ధర ఎంతో తెలుసా.. బుల్లెట్ రైలు ఇంగ్లండ్ మొత్తానికి రైలు మార్గం విస్తరించిన తర్వాత కూడా భయాలు పోలేదు. విమర్శలూ తగ్గలేదు. రైలు ప్రయాణాన్ని వెటకారం చేస్తూ సెటైర్లు కూడా వెలువడ్డాయి. గుర్రాలు, గుర్రపు బగ్గీల వంటి ఆనాటి ప్రయాణ సాధనాలను, పరిస్థితులను బట్టి చూస్తే కొత్త రైలు భయం అర్థం చేసుకోదగిందే. టెక్నాలజీ పురోగమిస్తున్నకొద్దీ, వాడకం పెరుగుతున్నకొద్దీ మామూలు విషయంగా మారుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు గంటకు 460 కి.మీ. వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లకు చేరుకున్నాం. -
వీడియో వైరల్..భారత్‌లో బుల్లెట్ ట్రైన్ ఎలా ఉందో చూశారా!
భారత ప్రజలు బుల్లెట్ ట్రైన్స్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు రైల్లో ప్రయాణాలు చేయాలంటే ఒక్కోసారి రోజుల సమయం పడుతోంది. అయితే బుల్లెట్ ట్రైన్స్‌తో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. కేవలం గంట వ్యవధిలోనే 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది రైలు. దీంతో బుల్లెట్ ట్రైన్స్ ఎప్పుడు మనదేశంలో అడుగుపెడతాయా ? అని ఎదురుచూస్తున్నారు ప్రయాణికులు. ఈ తరుణంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ గురించి ట్వీట్ చేశారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ ఎలా ఉండబోతుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. सपने नहीं हकीकत बुनते हैं! Stay tuned for #BulletTrain in Modi 3.0!#ModiKiGuarantee pic.twitter.com/0wEL5UvaY8 — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 12, 2024 508 కిలోమీటర్ల దూరం ముంబై - అహ్మదాబాద్ మధ్య 508 కి.మీల దూరాన్ని కవర్ చేసే ఈ బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 320 కి.మీ వేగాన్ని అందుకోగలదని, ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గనుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఇక బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ కోసం 24 రివర్ బ్రిడ్జ్‌లు, 28 స్టీల్ బ్రిడ్జ్‌లు, 7 పర్వత ప్రాంతాల్లో టన్నెల్, 7 సముద్ర మార్గాన 7 టన్నెల్,12 స్టేషన్ల నిర్మాణం జరగనుంది. మోదీ 3.0లో బుల్లెట్ ట్రైన్ కోసం మోదీ 3.0లో బుల్లెట్ రైలు కోసం వేచి ఉండండి అంటూ అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన వీడియోలో ముంబై-అహ్మదాబాద్ కారిడార్ నవంబర్ 2021 నుంచి బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మన దేశంలో మొదటి బుల్లెట్ రైలు గుజరాత్‌లోని బిలిమోరా - సూరత్ మధ్య 50 కి.మీల విస్తీర్ణంతో ఆగస్టు 2026లో పూర్తవుతుందని రైల్వే మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. లక్ష్యం అదే రైల్వే శాఖ కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో రోజుకు 70 ట్రిప్పులతో 35 బుల్లెట్ రైళ్లను నడపనుంది. 2050 నాటికి ఈ సంఖ్యను 105 రైళ్లకు పెంచాలని యోచిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు ప్రతి సంవత్సరం 1.6 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తారని అంచనా. రూ. 1 లక్ష 8,000 కోట్లు భారతదేశం మొట్టమొదటి ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ సుమారు రూ. 1 లక్ష 8,000 కోట్లు అంచనా వేయబడింది. ఆగస్టు 2026 నాటికి సూరత్-బిలిమోరా (63 కిమీ) మధ్య ట్రయల్ రన్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. -
బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే..
దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) తెలిపింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ 508 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. రూట్ నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ వల్ల రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూరుస్తోందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ దాదాపు పూర్తయిందని ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..? దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. -
చైన్నె టూ మైసూర్ వయా చిత్తూరు మీదుగా బుల్లెట్ ట్రైన్
గుడిపాల: తమిళనాడులోని చైన్నె నుంచి కర్ణాటకలో ఉన్న మైసూరుకు బుల్లెట్ ట్రైన్ నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు సుమారు 435 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ వేయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ (నేషనల్ హైస్పీడ్ కార్పొరేషన్ లిమిటెడ్) అధికారులు ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ఫైఓవర్‌పై వేసిన ట్రాక్‌లోనే వెళ్లనుంది. ఈ క్రమంలో జిల్లాలోని 41 గ్రామాల్లో భూసేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. మూడు రాష్ట్రాలను కలుపుతూ.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకను కలుపుతూ 340 గ్రామా ల మీదుగా బుల్లెట్ ట్రైన్ రాకపోకలు సాగించేలా అధికారులు డీపీఆర్ రూపొందించారు. సాధారణంగా చైన్నె నుంచి మైసూర్‌కు రైలులో వెళ్లాలంటే దాదాపు 10 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ ట్రైన్లో అయితే కేవలం 2 గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. ఈ ట్రైన్‌కు చిత్తూరులో స్టాపింగ్ ఇవ్వడంతో జిల్లావాసులకు సైతం సేవలందించనుంది. జిల్లాలో 41 గ్రామాలు జిల్లాలోని 41 గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రైన్ ప్రయాణించనుంది. ఈ మేరకు 435 కిలోమీటర్ల వరకు 18 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఇప్పటికే శాటిలైట్, ల్యాండ్ సర్వే పూర్తి చేసింది. 750 మంది ప్రయాణికులతో గంటకు 250 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు. గుడిపాల మండలంలోని 189 కొత్తపల్లె వద్ద చిత్తూరు స్టాపింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రైతులతో సమావేశాలు ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ అధికారులు భూసేకరణలో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.. 41 గ్రామాలకు గాను 30 గ్రామాలకు చెందిన రైతులతో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేశారు. వారి అభిప్రాయాలను పకడ్బందీగా సేకరిస్తున్నారు. భూములు ఇచ్చిన వారి కుటుంబంలో చదువుకున్న వారికి ఏదో ఒకవిధంగా ఉద్యోగావకాశం కల్పిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు. దీనిపై పలువురు రైతులు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఐదురెట్ల పరిహారం బుల్లెట్ ట్రైన్లో ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం రెండు గంటల్లోనే చైన్నె నుంచి మైసూర్‌కు వెళ్లిపోవచ్చు. మొత్తం ఫ్లైఓవర్ మీద వేసిన ట్రాక్‌పైనే రైలు వెళుతుంది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాం. రైతులకు మార్కెట్ ధర కంటే ఐదు రెట్లు పరిహారం ఇవ్వాలని నిర్ణయించాం. – నరసింహ, ఏఈ, ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ -
India Bullet Train: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి
భారత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. గుజరాత్లో జరుగుతున్న ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024’కు హాజరై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 నాటికి పూర్తవుతుందన్నారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 35కి.మీ దూరం సిద్ధం అవుతుందని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు బాగానే జరుగుతున్నాయని చెప్పారు. అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రాజెక్ట్ కచ్చితంగా ఏ సమయంలోపు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగమైన అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ కూడా దాదాపు పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: ఖజానాకు చేరిన పన్ను వసూళ్లు ఎంతంటే.. దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. -
బుల్లెట్ ట్రైన్‌పై కీలక విషయం వెల్లడించిన రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో తొలి బుల్లెట్ రైలు సెక్షన్ 2026 ఆగస్టులో అందుబాటులోకి రానుంది. 50 కిలోమీటర్ల నిడివి గల గుజరాత్‌లోని బిల్లిమోరా-సూరత్ సెక్షన్ దేశంలో తొలి బుల్లెట్ రైలు సెక్షన్‌గా రికార్డులకెక్కనుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అహ్మదాబాద్-ముంబైల మధ్య నిర్మితమవుతున్న బుల్లెట్ రైల్ కారిడార్ పనులు 2021 సంవత్సరంలోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కారిడార్‌లో భాగంగా బిల్లిమోర-సూరత్ సెక్షన్ తొలుత పూర్తవనుంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులను లక్షా 8 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. ఇందులో రూ.10 వేల కోట్లను కేంద్రం, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు చెరి రూ.5 వేల కోట్లు భరిస్తున్నాయి. మిగతా సొమ్ము మొత్తం జపాన్ ప్రభుత్వం 0.1శాతం నామినల్ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించింది. ఇదీచదవండి..ఓలా, ఉబెర్లపై ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం -
బుల్లెట్ రైలులో కదలిక
(ముంబై నుంచి సాక్షి ప్రతినిధి) : దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యల్లో కొన్ని పరిష్కారం కావడంతో నిర్మాణ సంస్థ పనులు పునరుద్ధరించింది. ముంబై–అహ్మదాబాద్ మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టును 2026 ఆగస్టు నాటికి పూర్తి చేయాలనేది టార్గెట్. అయితే భూసేకరణలో జాప్యం కారణంగా ఏడాదిన్నర ఆలస్యమయ్యే అవకాశముంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో కలిసి హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయ బృందం పశ్చిమ రైల్వే, మధ్య రైల్వే కార్యాలయాలు, మ్యూజియం సందర్శించి రైల్వే కార్యకలాపాలు సహా వివిధ కార్యక్రమాలను అధ్యయనం చేసింది. ఇవీ ముంబై హెచ్ఎస్ఆర్ స్టేషన్ ప్రత్యేకతలు ముంబై–అహ్మదాబాద్–హెచ్ఎస్ఆర్ కారిడార్‌లో ఉన్న ఏకైక భూగర్భస్టేషన్ ముంబై హెచ్ఎస్ఆర్ స్టేషన్. ఈ స్టేషన్లో 6 ప్లాట్‌ఫారాలు ఉంటాయి. ప్రతీ ప్లాట్ఫారం పొడవు సుమారు 415 మీటర్లు. గ్రౌండ్ లెవల్ నుంచి 24 మీటర్ల లోతులో ఈ ప్లాట్ ఫారం నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందులో ప్లాట్‌ఫాం, కాన్కోర్స్, సర్విస్ ఫ్లోర్ సహా మూడు అంతస్తులు ఉంటాయి. ♦ స్టేషనుకు రెండు ప్రవేశ ద్వారాలు/నిష్క్రమణ గేట్లు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఒకటి మెట్రో లైన్ 2బీ సమీపంలో మెట్రో స్టేషన్‌కు, మరొకటి ఎంటీఎన్ఎల్ నిర్మాణం వైపు ప్రయాణికుల రాకపోకలకు తగినంత స్థలం, కాన్కోర్స్, ప్లాట్‌ఫాం స్థాయిలో సౌకర్యాలు కల్పించే విధంగా ఎగ్జిట్ గేట్లు రూపొందించారు. ♦ ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి, సహజ లైటింగ్ వ్యవస్థకు ప్రత్యేక స్కైలైట్ ఏర్పాటు చేశారు. ♦ స్టేషన్లో ప్రయాణికుల కోసం సెక్యూరిటీ, టికెటింగ్, వెయిటింగ్ ఏరియా, బిజినెస్ క్లాస్ లాంజ్, నర్సరీ, రెస్ట్రూమ్, స్మోకింగ్ రూమ్, ఇన్ఫర్మేషన్ కియోస్‌్క, రిటైల్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అనౌన్స్మెంట్ సిస్టమ్, సీసీటీవీ నిఘా తదితర సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా : సీపీఆర్ఓ సుమిత్ ఠాకూర్ రైల్వేకు చెందిన పలు ప్రాజెక్టులు శరవేగంగా అభివృద్ధి చేస్తున్నామని పశ్చిమరైల్వే చీఫ్ పబ్లిక్‌రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ఠాకూర్ చెప్పారు.రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులు ప్రోత్సాహకరంగా సాగుతున్నాయని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. నిత్యం 80 లక్షల మంది ముంబై రైల్వే పరిధిలో ప్రయాణిస్తున్నారని, భారత్‌లో సెమీ స్పీడ్ రైళ్ల ప్రవేశానికి మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా హైస్పీడ్ రైళ్ల శకం కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. ముంబైలో బుల్లెట్ ట్రైన్ పనులు వివిధ స్థాయిల్లో జరుగుతున్నాయని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుష్మ తెలిపారు. -
భారత్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆ కంపెనీకే.. విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా?
ప్రతిష్టాత్మక భారత్ బుల్లెట్ ట్రైన్ మెగా ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) దక్కించుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఒప్పందం విలువపై కంపెనీ స్పష్టత ఇవ్వకపోయినా దీని విలువ రూ.7 వేల కోట్లపైనే ఉంటుందని సమాచారం. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ బోర్డు మీటింగ్ జులై 25న జరుగనుంది. ఈ సందర్భంగా షేర్ల బైబ్యాక్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక డివిడెండ్ చెల్లింపును బోర్డు పరిశీలించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బోర్డు సమావేశంలో స్వీకరించనున్నట్లు లార్సెన్ అండ్ టూబ్రో ఒక ఫైలింగ్‌లో తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌లో భాగమైన 135.45 కిలో మీటర్ల ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్-C3 ప్యాకేజీ నిర్మాణ కాంట్రాక్ట్‌ను నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నుంచి తమ నిర్మాణ యూనిట్ ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ పొందినట్లు కంపెనీ ప్రత్యేక ఫైలింగ్‌లో ప్రకటించింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు ఈ ప్యాకేజీ పరిధిలో స్టేషన్లు, ప్రధాన నదీ వంతెనలు, డిపోలు, సొరంగాలు, ఎర్త్ స్ట్రక్చర్లు, స్టేషన్లు తదితర నిర్మాణాలను ఎల్అండ్టీ కంపెనీ చేపట్టనుంది. ఈ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ దాదాపు 508 కిలో మీటర్ల మేర ఉంటుంది. దీన్ని ఎంఏహెచ్ఎస్ఆర్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో 155.76 కి.మీ, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో 4.3 కి.మీ, గుజరాత్ రాష్ట్రంలో 348.04 కి.మీ మేర ఉంటుంది. మెగా ఆర్డర్ దక్కించుకున్న అనంతరం బీఎస్ఈలో ఎల్అండ్టీ షేర్లు దాదాపు 4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,594.40కి చేరుకున్నాయి. 2023-24 మొదటి త్రైమాసిక పలితాలను జులై 25న జరిగే సమావేశంలో ఎల్అండ్టీ బోర్డ్ పరిగణనలోకి తీసుకోనుంది. -
జపాన్ బుల్లెట్ ట్రైయిన్‌లో స్టాలిన్..భారత్‌లో కూడా..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగపూర్, జపాన్ రెండు దేశాల్లో అధికారికగా పర్యటించనున్న తెలిసిందే. ఈ క్రమంలో జపాన్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం రాజధాని టోక్యోకి చేరుకోవడానికి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆ బుల్లెట్ ట్రైయిన్ జపాన్‌కు 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న టోక్యోకు వెళ్లారు. స్టాలిన్ ట్విట్టర్ వేదికగా..ఇది భారతీయ పౌరులకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. బుల్లెట్ ట్రైయిన్‌కి సమానమైన డిజైన్‌లో వేగం, నాణ్యతలలో లోపం లేని రైలు భారతదేశంలో కూడా అందుబాటులోకి రావాలన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ రైలు ద్వారా ప్రయోజనం పొందాలే ప్రయాణం సులభతరం చేయాలన్నారు. ஒசாகா நகரிலிருந்து டோக்கியோவுக்கு #BulletTrain-இல் பயணம் செய்கிறேன். ஏறத்தாழ 500 கி.மீ தூரத்தை இரண்டரை மணிநேரத்திற்குள் அடைந்துவிடுவோம். உருவமைப்பில் மட்டுமல்லாமல் வேகத்திலும் தரத்திலும் #BulletTrain-களுக்கு இணையான இரயில் சேவை நமது இந்தியாவிலும் பயன்பாட்டுக்கு வர வேண்டும்; ஏழை -… pic.twitter.com/bwxb7vGL8z — M.K.Stalin (@mkstalin) May 28, 2023 (చదవండి: కొత్త పార్లమెంట్ భవనంపై లాలు యాదవ్ పార్టీ వివాదాస్పద ట్వీట్) -
పక్షులు చూపిన ‘బుల్లెట్’ మార్గం.. నిజమే.. ఆ కథేంటంటే
జపాన్ అంటేనే టెక్నాలజీకి మారుపేరు.. సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకూ మూలం. గంటకు నాలుగైదు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు ఆ దేశానికి ప్రత్యేకం. మరి బుల్లెట్ రైళ్లు విజయవంతం కావడానికి తోడ్పడింది ఎవరోతెలుసా..? రెండు పక్షులు. నిజమే. ఆ వివరాలేమిటో చూద్దామా.. యుద్ధం వ్యథ నుంచి.. రెండో ప్రపంచ యుద్ధం చివరిలో పడిన అణు బాంబులు, ఆ తర్వాతి ఆంక్షలతో జపాన్ బాగా కుంగిపోయింది. ఆ వ్యథ నుంచి కోలుకుని, సరికొత్తగా నిలిచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అప్పటికే టెక్నాలజీపై పట్టున్న జపాన్.. ప్రపంచంలో వేగంగా ప్రయాణించే బుల్లెట్ రైలును 1964 అక్టోబర్ ఒకటిన ఆవిష్కరించింది. ట్రాక్‌ను, రైలు టెక్నాలజీని మరింతగా ఆధునీకరిస్తూ వేగాన్ని పెంచుతూ పోయింది. ఈ క్రమంలో కొత్త సమస్యలు మొదలయ్యాయి. గుడ్లగూబ స్ఫూర్తితో.. బుల్లెట్ రైళ్లు విద్యుత్‌తో నడుస్తాయి. పైన ఉండే కరెంటు తీగల నుంచి రైలుకు విద్యుత్ సరఫరా అయ్యేందుకు ‘పాంటోగ్రాఫ్’లుగా పిలిచే పరికరం ఉంటుంది. బుల్లెట్ రైలు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ పాంటోగ్రాఫ్ వద్ద గాలి సుడులు తిరుగుతూ విపరీతమైన శబ్దం వచ్చేది, ఆ పరికరం త్వరగా దెబ్బతినేది. జపాన్ శాస్త్రవేత్తలు దీన్ని నివారించడంపై దృష్టిపెట్టారు. గుడ్లగూబలు వేగంగా ప్రయాణిస్తున్నా చప్పుడు రాకపోవడాన్ని గమనించారు. వాటి ఈకల అంచులు రంపం వంటి ఆకృతిలో ఉండటమే దీనికి కారణమని గుర్తించి.. బుల్లెట్ రైళ్ల ‘పాంటోగ్రాఫ్’లను ఆ తరహాలో అభివృద్ధి చేశారు. 1994లో బుల్లెట్ రైళ్లకు అమర్చారు. ప్రస్తుతం బుల్లెట్ రైళ్లతోపాటు చాలా వరకు ఎలక్ట్రిక్ రైళ్లకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. గాలి నిరోధకతను ఎదుర్కొనేందుకు.. బుల్లెట్ రైళ్ల వేగసామర్థ్యాన్ని పెంచే క్రమంలో గాలి నిరోధకతతో సమస్య వచ్చింది. ఈ రైళ్ల వేగం ఆశించినంత పెరగకపోవడం, టన్నెళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు అత్యంత తీవ్రతతో ధ్వని వెలువడటం ఇబ్బందికరంగా మారింది. దీనికి పరిష్కారాన్ని అన్వేషిస్తున్న శాస్త్రవేత్తలకు.. ఈసారి కింగ్‌ఫిషర్ పక్షి మార్గం చూపింది. వేగంగా ప్రయాణించేందుకు దాని ముక్కు ఆకృతి వీలుగా ఉందని వారు గుర్తించారు. ఈ మేరకు బుల్లెట్ రైలు ముందు భాగాన్ని కాస్త సాగి ఉండేలా తీర్చిదిద్దారు. రెండు పక్కలా త్రికోణాకారంలో ఉబ్బెత్తు భాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్పులతో గాలి నిరోధకత తట్టుకోవడం, ధ్వనిని తగ్గించడం వీలైంది. పక్షులు చూపిన మార్గంలో.. గుడ్లగూబ, కింగ్‌ఫిషర్ పక్షుల స్ఫూర్తితో, మరికొంత టెక్నాలజీ జోడించి చేసిన మార్పులతో.. 1997లో షింకణ్‌సెన్–500 సిరీస్ రైలును నడిపారు. అది గంటకు 300 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. నాటికి ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచిన రైలుగా ఇది రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆ రైలు నుంచి పరిమితి మేరకు 70 డెసిబెల్స్ స్థాయిలోనే ధ్వని వెలువడటం గమనార్హం. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ మార్పులతో రైలు తయారీ, విద్యుత్ వినియోగం, నిర్వహణ ఖర్చులు కూడా తగ్గాయి. తర్వాత జపాన్ స్ఫూర్తితో చైనా, పలు యూరోపియన్ దేశాలు బుల్లెట్ ట్రైన్లను అభివృద్ధి చేశాయి. -
స్కర్ట్ వేసుకున్న స్టార్ హీరో.. వరల్డ్‌వైడ్‌గా చర్చ
Brad Pitt Explains On Why He Wore Skirt On Bullet Train Red Carpet: ఇప్పటివరకు బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన దుస్తులు ధరించి ట్రోలింగ్‌కు గురి కావడం చూశాం. తాజాగా ఇలాంటి డిఫరెంట్ వేర్‌తో దర్శనమిచ్చి వైరల్‌గా మారాడు ఓ స్టార్ హీరో. హాలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో బ్రాడ్ పిట్ ఒకరు. యాక్షన్ సినిమాలతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ ఆస్కార్ విన్నర్. ఈ హీరో కూడా అప్పుడప్పుడు విచిత్రమైన ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తుంటాడు. బ్రాడ్ పిట్ తాజాగా నటించిన చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం రిలీజ్‌కు ముందు పలు దేశాల్లో ప్రీమియర్ షోలను వేస్తున్నారు. ఇలానే కొన్ని వారాల క్రితం బెర్లిన్‌లో 'బుల్లెట్ ట్రైన్' ప్రీమిర్ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం వేసిన రెడ్ కార్పెట్‌పై స్కర్ట్ వేసుకుని కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు బ్రాడ్ పిట్. మోకాళ్ల వరకు ఉన్న స్కర్ట్, బూట్లు, వదులుగా ఉండే నార షర్ట్, జాకెట్‌తో దర్శనమిచ్చిన బ్రాడ్ పిట్ లుక్ వరల్డ్‌వైడ్‌గా వైరల్ అయింది. బ్రాడ్ పిట్ వేసుకున్న కాస్ట్యూమ్‌పై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. దీంతో ఈ విషయంపై తాజాగా లాస్ ఏంజెల్స్‌తో జరిగిన మూవీ ప్రీమియర్ షోలో స్పందించాడు బ్రాడ్ పిట్. చదవండి: సౌత్ సినిమాలు సరిగ్గా ఆడట్లేదు: అలియా భట్ ఈ ప్రీమియర్ షోకు సాధారణ దుస్తుల్లో వచ్చన బ్రాడ్ పిట్.. 'బెర్లిన్‌లో అలా ఎందుకు చేశానో నాకు కూడా సరిగ్గా తెలియదు. కానీ త్వరలో మనందరం చనిపోతాం. అందుకే కొంచెం డిఫరెంట్‌గా చేద్దామని అనిపించింది' అని స్కర్ట్ వేసుకోవడంపై వివరణ ఇచ్చాడు. అలాగే తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు. 'నేను రిటైర్ అవుతున్నాననే ఉద్దేశ్యంతో అలా మాట్లాడలేదు. ప్రస్తుతం నేను మిడిల్ ఏజ్‌లో ఉన్నాను. చివరి రోజుల్లో ఎలా ఉండాలనుకుంటున్నానో చెప్పాను అంతే' అని పేర్కొన్నాడు. చదవండి: 4కె ప్రింట్‌తో మళ్లీ రిలీజ్ చేస్తున్నారంటగా.. ఫ్యాన్స్ హ్యాపీనా.. -
యాక్షన్ కామెడీ మూవీ బుల్లెట్ ట్రెయిన్ రిలీజ్ ఎప్పుడంటే?
హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ నటించిన తాజా చిత్రం బుల్లెట్ ట్రెయిన్. యాక్షన్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అమెరికాలో ఆగస్టు 5న రిలీజ్ కాబోతోంది. కానీ ఇండియాలో మాత్రం ఒకరోజు ముందుగానే అంటే ఆగస్టు 4కే థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాగా డెడ్‌పూల్ 2 డైరెక్టర్ డేవిడ్ లేచ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జోయ్ కింగ్, బ్రెయిన్ టైరీ హెన్రీ, ఆరన్ టేలర్ జాన్సన్, కరెన్ ఫుకుహార, లొగాన్ లెర్మన్ తదితరులు నటిస్తున్నారు. చదవండి: పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీపై విమర్శలు.. తొలిసారి స్పందించిన ఆలియా ట్రీట్మెంట్ ఫెయిల్, కాళ్లు, చేతులు మొద్దుబారుతున్నాయి: ఏడ్చిన నటి -
వెరైటీగా.. స్కర్టులో స్టార్ హీరో.. ఫోటోలు వైరల్
సినిమా ప్రమోషన్స్ కోసం హీరో, హీరోయిన్స్ రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. సినిమాను ఆడియెన్స్‌కు దగ్గర చేసేందుకు ఢిపరెంట్ కాన్సెప్ట్స్‌తో ప్రమోషన్స్ చేస్తుంటారు. హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ కూడా తన సినిమాను ప్రమోట్ చేసేందుకు వెరైటీ గెటప్‌లో దర్శనమిచ్చాడు. తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'బుల్లెట్ ట్రైన్' త్వరలోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో మాంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా బెర్లిన్ ప్రీమియర్‌కు వచ్చిన బ్రాడ్ పిట్ లినెన్ స్కర్ట్‌తో కనిపించి అందరికి షాకిచ్చాడు. మ్యాచింగ్ బ్రౌన్ జాకెట్, పింక్ షర్ట్‌తో స్టైలిష్ గెటప్‌లో సందడి చేశాడు. అంతేకాకుండా ఈ గెటప్‌లో తన కాలిపై ఉన్న టాటూలతో మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఒక కాలికి ఖడ్గమృగం, మరో కాలికి పుర్రె టూటూలతో బ్రాడ్ పిట్ స్పెషల్ లుక్‌లో కనిపించారు. ఇక ఈ ప్రీమియర్ షోకి జోయి కింగ్, ఆరోన్ టేలర్-జాన్సన్, బ్రియాన్ టైరీ హెన్రీతో సహా మిగిలిన తారాగణం సందడి చేసింది. -
అవినీతి ఆరోపణలు: బుల్లెట్ ట్రైన్ బాస్‌పై వేటు
న్యూఢిల్లీ: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రిని విధులనుంచి తొలగించింది కేంద్రం. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ఎండీ సతీష్ సేవలను రైల్వే శాఖ రద్దు చేసినట్లు సీనియర్ అధికారులు నిన్న( గురువారం) తెలిపారు. అలాగే ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్‌కు మూడు నెలల పాటు ఈ బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. అధికార దుర్వినియోగం, నిధులను అక్రమంగా ప్రైవేట్ కంపెనీకి మళ్లించడం లాంటి అనేక ఆరోపణల నేపథ్యంలో అగ్నిహోత్రిపై ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సీఎండీగా తొమ్మిదేళ్ల పదవీకాలంలో ఒక ప్రైవేట్ కంపెనీతో కుదుర్చుకున్న "క్విడ్ ప్రోకో" డీల్ ఆరోపణలువెల్లువెత్తాయి. దీనిపై జూన్ 2న లోక్‌పాల్ కోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఆయననను తొలగించేందుకు నిర్ణయించినట్లు వారు తెలిపారు. అవినీతి నిరోధక చట్టం, 1988 కింద నేరం జరిగిందో లేదో నిర్ధారించుకోవడంతోపాటు, విచారణ నివేదికను ఆరు నెలల్లోగా లేదా డిసెంబర్ 12, 2022 లోపు సమర్పించాలని లోక్‌పాల్ సీబీఐని ఆదేశించింది. అలాగే అగ్నిహోత్రి పదవీ విరమణ చేసిన ఒక సంవత్సరంలోనే ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం తీసుకున్నారని కూడా అధికారులు ఆరోపించారు. రిటైర్డ్ అధికారులు కేంద్రం ఆమోదం లేకుండా పదవీ విరమణ తరువాత ఏడాది దాకా ఎలాంటి వాణిజ్య ఉద్యోగాలను స్వీకరించకూడదన్న ప్రభుత్వ నిబంధనను ఉల్లంఘించారని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై అగ్నిహోత్రి అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ అరోపణలను అతని సన్నిహితులు తీవ్రంగా ఖండించారు. 1982 బ్యాచ్ ఐఆర్ఎస్ఈ అధికారి, అగ్నిహోత్రి 2021జూలై లో ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిసీఎల్‌లో చేరారు. అంతకుముందు ఆర్వీఎన్ఎల్ సీఎండీగా ఉన్నారు. -
రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!
తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. రియల్ హీరో అనడం ఎంతమాత్రం తక్కువ కాదు. క్షణాల్లో ఘోర ప్రమాదం జరుగుతుందని తెలిసి.. తన ప్రాణం పోయిన పర్వాలేదనుకుని వంద మందికి పైగా ప్రాణాలు నిలబెట్టాడు యాంగ్ యోంగ్. దక్షిణ చైనాలో హైస్పీడ్ బుల్లెట్ రైలు డీ2809 శనివారం ప్రమాదానికి గురైంది. గుయిజౌ ప్రావిన్స్‌లో బుల్లెట్ రైలు ప్రమాదానికి గురికాగా.. డ్రైవర్ కోచ్ నుజ్జునుజ్జు అయ్యి అందులోని డ్రైవర్ యాంగ్ యోంగ్ ప్రాణం విడిచాడు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టిన అధికారులకు.. ట్రైన్ డేటా ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. డీ2809 రైలు.. గుయియాంగ్ నుంచి రోంగ్జియాంగ్ స్టేషన్ల మధ్య ఒక టన్నెల్ వద్దకు చేరుకోగానే.. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. అయితే.. టన్నెల్‌కు చేరుకునే ముందు ట్రాకుల మీద అసాధారణ పరిస్థితులను యాంగ్ గుర్తించాడు. వెంటనే.. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేశాడు. దీంతో ముందున్న బురద, మట్టి కుప్పలను బలంగా ఢీకొట్టి రైలు సుమారు 900 మీటర్ల దూరం జారుకుంటూ ముందుకు వెళ్లింది. ఆపై స్టేషన్ వద్ద బోల్తా పడడంతో డ్రైవర్ కోచ్ బాగా డ్యామేజ్ అయ్యింది. Train driver on D2809 "5 second braking" : Emergency braking becomes muscle memory, Yang Yong did everything he could pic.twitter.com/IkiMUvcknt — tigers tiger (@tigerstiger1) June 5, 2022 యోంగ్ బ్రేకులు గనుక వేయకుండా ఉంటే.. పూర్తిగా బల్లెట్రైలే ఘోర ప్రమాదానికి గురై భారీగా మృతుల సంఖ్య ఉండేది!. కానీ, యోంగ్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తన ప్రాణం కన్నా ప్రయాణికులే ముఖ్యం అనుకున్నాడు. యోంగ్ నేపథ్యం.. ఆయన ఇంతకు ముందు సైన్యంలో పని చేశారు. రిటైర్ అయిన తర్వాత.. కో-డ్రైవర్‌గా, అసిస్టెంట్ డ్రైవర్‌గా, ఫోర్‌మ్యాన్‌గా, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, గ్రౌండ్ డ్రైవర్‌గా.. చివరికి ట్రైన్ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టాడు. దేశం కోసం సేవలు అందించిన వీరుడు.. చివరకు జనాల ప్రాణాలను కాపాడడం కోసమే ప్రాణాలు వదిలాడు. యోంగ్ చేసిన త్యాగం.. ఆ దేశాన్ని కంటతడి పెట్టించింది. రియల్ హీరోగా ఆయన్ని అభివర్ణిస్తోంది. తనను తప్ప.. మిగతా అందరినీ కాపాడుకున్న ఆ హీరోను ఆరాధిస్తోంది ఇప్పుడు అక్కడ. యోంగ్ పార్థివదేహానికి అతని స్వస్థలం గుయిజౌలోని జున్యీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో ప్రజల కన్నీళ్ల మధ్య ఘనంగా జరిగింది. The heroic driver of #D2809 Yang Yong returned to his hometown of #Zunyi , #Guizhou , under the escort of the convoy. Locals spontaneously lined the way to bid farewell Welcome home heroes. 6月5日,D2809司机杨勇在车队护送下回到家乡贵州遵义。当地人自发夹道送别:“欢迎英雄回家!” pic.twitter.com/c8OokOdx24 — Michael Franklin ( 100% follow back) (@Michael04222710) June 6, 2022 -
ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్.. స్పీడ్ అదిరిపోలే?
బీజింగ్: ఫిబ్రవరిలో జరగబోయే బీజింగ్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ రైలును ప్రారంభించింది. ఈ బుల్లెట్ రైలు ముఖ్య ప్రత్యేకత ఇందులో డ్రైవర్ లేకపోవడమే. కేవలం ఈ ఒలింపిక్స్ కోసం కొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. డ్రైవర్ లెస్ ఫ్యూక్సింగ్ బుల్లెట్ రైలు గంటకు 217 మైళ్ల(350 కిమీ) వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి ఉన్న ఎనిమిది క్యారేజీలలో 564 మంది ప్రయాణీకుల వెళ్లగలరు. చైనా రాజధాని బీజింగ్ - జాంగ్జియాకౌ నగరాల మధ్య ప్రయాణీకులను తీసుకెళ్లడానికి దీనిని ప్రారంభించింది. ఇందులో 5జీ సౌకర్యం గల లింక్డ్ బ్రాడ్ కాస్ట్ స్టూడియో ఉంది. దీని ద్వారా పాత్రికేయులు ప్రసారం చేయవచ్చు. బీజింగ్ డౌన్ టౌన్ జిల్లా నుంచి జాంగ్జియాకౌలోని ఒలింపిక్స్ గేమ్స్ జరిగే వేదికలకు ప్రయాణీకులను తరలించడానికి కేవలం 50 నిమిషాలు పడుతుందని ఆ దేశ క్సిన్హువా పత్రిక నివేదించింది. 2018లో ఈ రైల్వే నిర్మాణం ప్రారంభమైంది. కేవలం ఏడాది కాలంలోనే 2019లో ఈ మార్గాన్ని(బీజింగ్-జాంగ్జియాకౌ) పూర్తిచేసింది. The first train custom-made for the Beijing Winter Olympics set off on Thursday on the high-speed railway linking Beijing and Zhangjiakou, the co-host cities of the upcoming 2022 Winter Games. #GLOBALink pic.twitter.com/GYdzzdpwvG — China Xinhua News (@XHNews) January 6, 2022 (చదవండి: అదిరిపోయిన తొలి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. రేంజ్, ధర ఎంతో తెలుసా?) -
డ్రాగన్ పన్నాగం: సరిహద్దులో బుల్లెట్ ట్రైన్ ప్రారంభం
బీజింగ్: సరిహద్దు వివాదాలు పూర్తిగా సమసిపోకముందే డ్రాగన్ దేశం చైనా మరో పన్నాగానికి తెర తీసింది. ఈసారి భారత్-టిబెట్ సరిహద్దుల్లో పట్టు పెంచుకునేందుకు తొలి బుల్లెట్ రైలును ప్రారంభించింది. తద్వారా బలగాలను ఈ ప్రాంతంలోకి వేగంగా చేరవేసేందుకు అవకాశం కలుగుతుంది. టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్చీ వరకూ 435.5 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని, బుల్లెట్ ట్రైన్‌ను చైనా ప్రారంభించింది. టిబెట్‌లో ఇదే తొలి బుల్లెట్ ట్రైన్. అరుణాచల్ ప్రదేశ్‌కు సమీపంలో ఉన్న నింగ్చీకి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించడం ద్వారా చైనా వ్యూహాత్మక అడుగు వేసినట్లయింది. సిచువాన్-టిబెట్ రైల్వే పరిధిలోకి వచ్చే నింగ్చీ సెక్షన్లో ఈ బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డ్రాగన్ దేశం ఈ బుల్లెట్ ట్రైన్ ప్రారంభించింది. సిచువాన్-టిబెట్ రైల్వే టిబెట్‌లో నిర్మించిన రెండో రైలు మార్గం. గతంలో క్వింఘాయ్-టిబెట్ రైల్వే మార్గాన్ని ప్రారంభించారు. సరిహద్దులో భద్రతను పరిరక్షించడంతో ఈ కొత్త రైలు మార్గం కీలక పాత్ర పోషిస్తుందని.. కనుక దీన్ని తర్వగా పూర్తి చేయాలని నవంబర్‌లో అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఈ రైలు మార్గం నిర్మాణంతో చెంగ్డూ నుంచి లాసా వెళ్లేందుకు గతంలో 48 గంటల సమయం పడుతుండగా.. తాజాగా బుల్లెట్ ట్రైన్ ప్రారంభంతో ఇది 13 గంటలకు తగ్గబోతోంది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ రైలు మార్గం ఏర్పాటు కీలక అడుగు కానుంది. చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం.. -
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గంలో మార్పులు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై, తెలంగాణ రాజధాని హైదరాబాద్ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్ రైలు మార్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మార్పుల వల్ల ముంబై–హైదరాబాద్ మధ్య సుమారు 20 కిలోమీటర్ల దూరం తగ్గిపోయింది. దూరం తగ్గడంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్న నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్)కు సుమారు రూ. 4 వేల కోట్లు ఆదా కానున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో కనెక్టివిటీని మరింత పెంచేందుకు, ఆ ప్రాంతాలను చేరుకునేందుకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముంబై–హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ సర్వే) అధ్యయనం పనులు ఇదివరకే ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న ముంబై–నాగ్‌పూర్, ముంబై–అహ్మదాబాద్, ముంబై–హైదరాబాద్ ఇలా మూడు వేర్వేరు ప్రాజెక్టుల పనుల వల్ల రవాణ వ్యవస్థ మెరుగుపడి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మరింత అభివృద్ధి చెందనుంది. దీంతోపాటు వేగవంతమైన రవాణా కూడా అందుబాటులోకి రావడంతో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశముంది. అయితే, కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ దాదాపు అన్ని రైల్వే ప్రాజెక్టులపై ప్రభావం చూపింది. పనులన్నీ మందగించాయి. కానీ, ఇప్పుడు కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టుల పనులు ఇప్పుడిప్పుడే మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. తొలుత ప్రతిపాదించిన ముంబై–హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ మార్గం 650 కిలోమీటర్లు ఉండగా.. స్వల్ప మార్పుల జరిగిన తర్వాత ఈ దూరం 630 తగ్గింది. అంటే 20 కిలోమీటర్ల దూరం తగ్గింది. సాధారణంగా బుల్లెట్ ట్రైన్ కోసం కిలోమీటరు మార్గం తయారు చేయాలంటే సుమారు రూ. 200 కోట్లు ఖర్చవుతాయి. అలాంటిది ప్రస్తుత మార్పులతో ఏకంగా 20 కిలోమీటర్ల దూరం తగ్గడం వల్ల నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్‌కు రూ. 4 వేల కోట్ల మేర ఆదా కానున్నాయి. ముందుగా ప్రతిపాదించిన ముంబై–హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గంలో థానే, న్యూ ముంబై, లోణావాల, పుణే, బారామతి, పండర్పూర్, షోలాపూర్, గుల్బర్గా, జహీరాబాద్, వికారాబాద్ స్టేషన్లు ఉండేవి. కానీ, మార్పులు చేసిన దాని ప్రకారం థానే, న్యూ ముంబై, లోణావాల, పుణే, బారామతి, పండర్పూర్, షోలాపూర్, తాండూర్, వికారాబాద్ స్టేషన్లు ఉండబోతున్నాయి. దీంతో ఈ బుల్లెట్ రైలు మార్గం దూరం దాదాపు 20 కిలోమీటర్ల మేర తగ్గిపోయింది. చదవండి: మీరు మోసపోలేరు.. సీఎంను కలుస్తా మీ అయ్య ఇచ్చాడు? ముంబై మేయర్ వ్యాఖ్యలు దుమారం -
ప్రకృతి పిలిచినా.. రైలు ఆగలేదు!
వెబ్‌డెస్క్: జపాన్‌లో బుల్లెట్ రైలు నడిపే ఓ డ్రైవర్ నిర్లక్ష్యం అందరినీ కాసేపు టెన్షన్ పెట్టింది. ప్రకృతి పిలుపుతో డ్రైవర్ బాత్రూంకి వెళ్లగా, డ్రైవర్ లేకుండానే బులెట్ రైలు కొన్ని నిమిషాలు పరుగులు పెట్టింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ కావడంతో డ్రైవర్, కండక్టర్లపై చర్యలకు సిద్ధమయ్యారు. అసలేం జరిగిందంటే.. హికరీ 633 సూపర్ ఫాస్ట్ బుల్లెట్ రైలు శుక్రవారం ఉదయం టొకైడో-షిన్కన్సేన్ రైల్వే లైన్ల మధ్య నడుస్తోంది. ఆ టైంలో హఠాత్తుగా కడుపు నొప్పి రావడంతో డ్రైవర్ బాత్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో కండక్టర్ని తన సీట్లో ఉంచి వెళ్లాలి. కానీ, ఆ కండక్టర్‌కి లైసెన్స్ లేదు. దీంతో కాక్‌పిట్‌ను ఖాళీగానే వదిలి బాత్రూంకి వెళ్లాడు. కనీసం రైలు వేగాన్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు ట్రైన్ గంటకు150 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. రైళ్లో 160 మంది ప్యాసింజర్లు ఉన్నారు. బుల్లెట్ ట్రైన్ మానిటరింగ్ చేస్తున్న అధికారులు.. డ్రైవర్ ఇంజిన్ కాక్‌పిట్‌లో లేకపోవడంతో కంగారుపడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ప్రమాదేమీ జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చర్యలు తప్పవు సెంట్రల జపాన్ రైల్వే జపాన్ రూల్స్ ప్రకారం.. బుల్లెట్ ట్రైన్ నడిపే డ్రైవర్‌తో పాటు కండక్టర్‌కి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ డ్రైవర్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనప్పుడు, అత్యవసర సమయాల్లోనూ ఆ కండక్టర్ ట్రైన్‌ను నడపొచ్చు. అలాకాని పక్షంలో డ్రైవర్ ఎంత ఎమర్జెన్సీ అయిన కాక్‌పిట్‌ను వదిలేసి వెళ్లకూడదు. -
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌కు శివసేన షాక్!
థానే: అహ్మదాబాద్– ముంబై మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శివసేన ఝలక్ ఇచ్చింది. రైల్వే లైను నిర్మాణానికి జిల్లాలో కావాల్సిన భూమిని ప్రాజెక్టుకు బదలాయించేందుకు శివసేన నేతృత్వంలోని థానే మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ) నిరాకరించింది. థానే జిల్లాలోని షిల్– దాయ్‌ఘర్ ప్రాంతంలో 3,800 చదరపు మీటర్ల భూమిని రూ. 6కోట్ల పరిహారం తీసుకొని బదలాయించాలని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను టీఎంసీ పాలక మండలి తోసిపుచ్చింది. -
ముంబై-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ డీపీఆర్‌పై కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై-పుణే-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై కసరత్తు సాగించేందుకు నవంబర్ 5న ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేశారు. 711 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్‌పై సర్వే, ఉపరితలం,అండర్‌గ్రౌండ్ సదుపాయాలు, సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముంబై-పుణే-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు టెండర్లను నవంబర్ 18న తెరుస్తారు. టెండర్లో విజయవంతమైన బిడ్డర్‌ను గుర్తించి టెండర్‌ను ఖరారు చేస్తారు. ఇక ప్రభుత్వం మొత్తం ఏడు రూట్లలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అభివృద్ధి చేయాలని గుర్తించింది. ముంబై-పుణే-హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ-లక్నో-వారణాసి, ముంబై-నాసిక్-నాగపూర్, ఢిల్లీ-జబల్పూర్-అహ్మదాబాద్, చెన్నై-మైసూర్, ఢిల్లీ-చండీగఢ్-అమృత్సర్, వారణాసి-పాట్నా-హౌరా రూట్లలో బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నారు. దేశంలో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లను తయారు చేసే బాధ్యతను రైల్వే మంత్రిత్వ శాఖ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)కు అప్పగించింది. చదవండి : భూకంపంలోనూ నడిచే బుల్లెట్ ట్రైన్! -
త్వరలోనే ఏడు కొత్త మార్గాల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు
ఢిల్లీ : దేశంలో త్వరలోనే ఏడు కొత్త మార్గాల్లో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఢిల్లీ నుంచి వారణాసి, అహ్మదాబాద్, అమృత్సర్ వరకు మూడు రైళ్లు వారణాసి నుంచి హౌరా, ముంబై నుంచి నాగ్‌పూర్, హైదరాబాద్, చివరగా చెన్నై నుంచి మైసూర్ వరకు బుల్లెట్ రైళ్లును నడిపాలని భారత రైల్వేశాఖ యోచిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం భారత రైల్వేతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఐఐ) ఆద్వర్యంలో త్వరలోనే భూసేకరణ జరగనున్నాయి. మంత్రి గడ్కరీ నేతృత్వంలోని మంత్రుల బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (2022 నాటికి పట్టాలపైకి 44 వందే భారత్ రైళ్లు) దేశంలోని ఏడు ముఖ్యమైన మార్గాల్లో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే ఈ మార్గాల్లో రైల్వే కారిడర్‌కు సంబంధించిన వివరాలను ఎన్‌హెచ్‌ఐఐకు అందించిన రైల్వే శాఖ త్వరలోనే పనులు ప్రారంభించాల్సిందిగా కోరింది. ఈ మేరకు నోడల్ అధికారిని నియమించాలని కోరుతూ రైల్వే బోర్డు చైర్మన్ వి.కె. యాదవ్ ఈ మేరకు లేఖ రాశారు. అయితే లాక్డౌన్ కారణంగా చాలా ప్రాజెక్టుల నిర్మాణాలు ఆలస్యం ఆలస్యం అవుతున్న సంగతి తెలిసిందే. .81,000 కోట్ల రూపాయల భారీ రైల్వే ప్రాజెక్టు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనులు సైతం ప్రస్తుతం మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో కొత్తగా ఏడు మార్గాల్లో బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టు ప్రాధాన్యం సంతరించుకుంది. (భూకంపంలోనూ నడిచే బుల్లెట్ ట్రైన్!) -
భూకంపంలోనూ నడిచే బుల్లెట్ ట్రైన్!
టోక్యో: జపాన్ బుల్లెట్ ట్రైన్స్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు జపాన్ మరో తాజా రికార్డును సృష్టించింది. భూకంప సమయంలోనూ ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చెరవేసే బులెట్ ట్రైన్‌ను రూపొందించింది. ఈ బుల్లెట్ రైలు వేగంగా, చాలా సున్నితంగా ప్రయాణిస్తుంది. గంటకు 360 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దాంతో పాటు భూకంపం సంభవించినప్పుడు ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకువెళ్లగలదు. (వినూత్న మాస్కు.. ధర రూ.3 వేలు!) ఈ ట్రైన్ నంబర్ N700S - 'S' అంటే 'సుప్రీం' అని అర్థం. జూలై 1నుంచి ఇది సేవను అందిస్తోంది. ఇది టోక్యో- ఒసాకా స్టేషన్ల మధ్య నడుస్తోంది. 2019లో దీనికి సంబంధించిన టెస్ట్ రన్ చేశారు. 2020 జూలై నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రపంచంలోని వేగంగా నడిచే రైళ్లలో ఒకటి. దీని ఆపరేటింగ్ వేగం గంటకు 285 కిలోమీటర్లు. (సునామీ శోకం మరిచేలా... జపాన్ విజయ గీతిక) -
బుల్లెట్ రైళ్లలో విశేషాలెన్నో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే బుల్లెట్ రైల్‌ను ప్రవేశపెట్టిన దేశం జపాన్. అది టోక్యో, ఒసాకా మధ్య 1964, అక్టోబర్ ఒకటవ తేదీన ప్రారంభమైంది. హిటాచి కంపెనీ తయారు చేసిన ఈ బుల్లెట్ రైలు వేగం అప్పుడు గంటకు 210 కిలోమీటర్లు. ఇప్పుడు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైళ్లు వచ్చాయి. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సాధారణంగా 30 సెకన్లు మాత్రమే. ఒక నిమిషం ఆలస్యమైతే దాన్ని ఆలస్యంగా పరిగణిస్తారు. ఐదు నిమిషాలు ఆలస్యమైతే అందుకు కారణం ఏమిటో ఆ రైలును నడుపుతున్న కంపెనీ ప్రభుత్వానికి సమాధానం ఇచ్చుకోవాలి. బుల్లెట్ రైళ్ల వల్ల ఈ 55 ఏళ్లలో ఒక్కరు కూడా మరణించక పోవడం విశేషం. 1960వ దశకం నుంచి జపాన్‌లో బుల్లెట్ రైళ్లను నడుపుతున్న ఇటాచీ కంపెనీ ఆ తర్వాత బుల్లెట్ ట్రైన్ల టెక్నాలజీని బ్రిటన్‌లో ప్రవేశ పెట్టింది. 2009లో అత్యధిక వేగంతో, అంటే గంటకు 140 మైళ్ల వేగంతో నడిచే ‘జావెలిన్’ రైలును లండన్‌లోని సెయింట్ ప్యాంక్రాస్ ఇంటర్నేషనల్ నుంచి కెంట్ వరకు ప్రవేశ పెట్టింది. ఈ బుల్లెట్ రైళ్లు ఎంత వేగంతో ప్రయాణించినప్పటికీ లోపలున్న ప్రయాణికులకు పెద్దగా శబ్దం వినిపించకుండా ఉండే సౌకర్యంగా ఉంటుంది. ట్రైన్ వెళుతున్నప్పుడు బయట నుంచి చూసే ప్రజలకు కూడా పెద్దగా శబ్దం వినిపించక పోవడం దాని సాంకేతిక పరిజ్ఞాన గొప్పతనం. అల్ఫా ఎక్స్‌గా పిలిచే షింకాన్సేన్ అనే కొత్త బుల్లెట్ ట్రెయిన్‌ను తూర్పు జపాన్ రైల్వే కంపెనీ త్వరలోనే తీసుకరాబోతోంది. దీని వేగం గంటకు 360 కిలోమీటర్లు. యూరప్‌లో నడుస్తున్న హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కన్నా ఈ షింకాన్సేన్ రైలు 0.3 మీటర్లు వెడల్పు ఎక్కువగా ఉంటుంది. బుల్లెట్ రైళ్లకు భూ ప్రకంపనలు గుర్తించే సెన్సార్లు ఉంటాయి. ఎక్కడైనా భూ ప్రకంపనలు వచ్చినట్లయితే వెంటనే వాటంతట అవే నిలిచిపోతాయి. ఈ బుల్లెట్ రైళ్లు వచ్చినప్పుడు, వెళుతున్నప్పుడు సిబ్బంది నడుము వరకు వంగి గౌరవ వందనం చేస్తారు. రగ్బీ ప్రపంచకప్కప్ సమీపిస్తున్న సందర్భంగా ఈ బుల్లెట్ రైళ్లను మరింత ముస్తాబు చేసుకుంటున్నాయి. క్రీడాకారులు క్రీడామైదానాల వద్ద సులభంగా దిగడం కోసం ఎక్కడం కోసం అతి వేగంగా నడిచే బుల్లెట్ రైళ్లతోపాటు నెమ్మదిగా నడిచే బుల్లెట్ రైళ్లును కూడా ప్రవేశపెడుతున్నారు. -
‘బుల్లెట్’ కోసం పోటీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత తొలి బుల్లెట్ రైలుకు గుర్తింపు తీసుకొచ్చేందుకు జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) ప్రయత్నాలు ప్రారంభించింది. 2022 నుంచి ముంబయి–అహ్మదాబాద్ మధ్య పరుగులు పెట్టే ఈ హైస్పీడ్ రైలుకు పేరును సూచించడంతో పాటు మస్కట్‌ను రూపొందిం చేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మస్కట్ ప్రభావవంతంగా ఉండటంతో పాటు ఎన్హెచ్ఎస్ ఆర్సీఎల్ విలువలను ప్రతిబింబించేలా ఉండాలని సూచించింది. అలాగే ప్రజలు బుల్లెట్ ట్రైన్‌తో మమేకమయ్యేలా పేరు ఉండాలని పేర్కొంది. విజేతలకు నగదు బహుమతి అందజేస్తామని, ఆసక్తి గల వ్యక్తులు మార్చి 25 నాటికి పేర్లను, మస్కట్ డిజైన్లను పంపించాలని తెలిపిం ది. మరిన్ని వివరాల కోసం mygot.in చూడాలని సూచించింది. 2017లో ఇలాం టి పోటీనే నిర్వహించి ఎన్హెచ్ఎస్ ఆర్సీఎల్ లోగో అయిన ‘చీతా’ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. -
‘బుల్లెట్ రైలు తర్వాత.. ముందు వీటిని పట్టించుకోండి’
న్యూఢిల్లీ : బెల్లెట్ ట్రైన్ సంగతి వదిలేసి.. ముందు ఉన్న వాటి మీద దృష్టి పెడితే మంచిదంటూ ఎద్దేవా చేశారు బీజేపీ మహిళా నాయకురాలు లక్ష్మీ కాంత్ చావ్లా. రైల్వే పనితీరు ఎలా ఉందో వివరిస్తూ సోషల్ మీడియాఓ ఓ వీడియోను రిలీజ్ చేశారు. పంజాబ్ మాజి మంత్రి చావ్లా ఈ నెల 22న శౌర్య - యమున రైలు ఎక్కారు. అమృత్సర్ నుంచి అయోధ్య వెళ్లిన ఆ రైలు దాదాపు 10 గంటలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంది. అన్ని గంటలు రైల్లో ఉండాల్సి రావడంతో తీవ్ర అసహనానికి గురైన చావ్లా.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మొబైల్లో వీడియో తీశారు. ఈ వీడియోలో చావ్లా మాట్లాడుతూ.. ‘మేం ప్రయాణం చేసిన రైలు చాలా సార్లు నిలిచిపోయింది. గడిచిన 24 గంటల్లో మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మేం ప్రయాణించిన రైలు వేరే మార్గంలోకి వెళ్లిపోయింది. దాంతో దాదాపు 10 గంటలు ఆలస్యంగా నడిచింది. కానీ దీని గురించి ఒక్కరు కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. కనీసం ప్రయాణికులకు ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయలేదం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గంటకు 120, 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైల్ల సంగతి పక్కన పెట్టండి. ముందు ఉన్న వాటిలో సరైన సౌకర్యాలు కల్పించండి. చాలా చోట్ల వెయిటింగ్ రూమ్స్ లేవు. ఇంత దారుణమైన చలిలో జనాలు ఫుట్‌పాత్ మీదే నిద్ర పోతున్నారు. పియూష్ జీ, మోదీ జీ వీరి పట్ల దయ చూపండి’ అన్నారు. ఇదేకాక రైల్వే అధికారులు ఏ విధంగా లంచం డిమాండ్ చేస్తున్నారో వివరించారు. ‘శతాబ్ది, రాజధాని లాంటి రైళ్లు కేవలం సంపన్నుల కోసమే. పేద ప్రజలు, కూలీలు, సైనికులు ఉపయోగించే రైళ్ల పరిస్థితి ఏంట’ని చావ్లా ప్రశ్నించారు. అంతేకాక రైల్వే మంత్రి ఈ రైళ్లలో ప్రయాణిస్తే అప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందన్నారు. ‘మోదీ జీ జనాలు నిరాశలో ఉన్నారు. మీరు చెప్పిన అచ్చే దిన్ ఎవరి కోసమే నాకు తెలియదు కానీ కచ్చితంగా సామాన్యుల కోసం మాత్రం కాద’ని ఆరోపించారు. రైలు ఆలస్యంపై ఫిర్యాదు చేసేందుకు తాను రైల్వే వెబ్సైట్లో ఉన్న అన్ని ప్రకటనలకు ఫోన్ చేశానని, చివరకు ఓ మంత్రికి మెయిల్ కూడా చేశానని చావ్లా తెలిపారు. అయినా ఏ ఒక్కరి నుంచీ సమాధానం రాలేదని ఆరోపించారు. -
బుల్లెట్ రైలు పక్కన పట్టాలపై కూర్చోండి!
టోక్యో: జపాన్‌కు చెందిన బుల్లెట్ రైలు కంపెనీ షింకన్సేన్ వినూత్నమైన శిక్షణ విధానాన్ని అమలుచేస్తోంది. బుల్లెట్ రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే.. అవి వెళుతున్న మార్గంలోని టన్నెల్స్‌లో పట్టాల పక్కన ఉద్యోగుల్ని కూర్చోబెడుతోంది. రైళ్ల నిర్వహణ, భద్రత విభాగంలో పనిచేస్తున్న 190 మంది ఉద్యోగులకు కంపెనీ ప్రస్తుతం ఈ తరహా శిక్షణ ఇస్తోంది. వేగంగా వెళ్లే బుల్లెట్ రైలు పక్కనే తమను కూర్చోబెట్టడంపై పలువురు ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కంపెనీ వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో షింకన్సేన్ సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘మా నిర్వహణ సిబ్బందికి వారి విధుల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతో ముఖ్యమో తెలియజెప్పేందుకే ఈ శిక్షణ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. ఇందులో భాగంగా భద్రతాపరమైన అంశాలకు మేం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ శిక్షణపై కంపెనీ వెనక్కు తగ్గబోదు. 2015లో ఓ ప్రమాదం కారణంగా బుల్లెట్ రైలు బయటిభాగం ఊడిపోవడంతో వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ ఈ శిక్షణను ప్రారంభించింద’ని తెలిపారు. షింకన్సేన్ సంస్థ తయారుచేసిన రైళ్ల కారణంగా గత 50 ఏళ్లలో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదు. ప్రస్తుతం భారత్‌లోని ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఈ కంపెనీయే చేపడుతోంది. -
భారత్ మెడలో ‘బుల్లెట్’ గుదిబండ
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశంలో తొలి బుల్లెట్(ముంబై-అహ్మదాబాద్) రైలును పరుగులు పెట్టించేందుకు సాంకేతిక సాయంతో పాటు, 88 వేల కోట్ల రూపాయల రుణాన్ని దేశానికి లబ్ధి చేకూరేలా జపాన్ ఇవ్వబోతోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2017లో ఎంతో ఆనందంగా ప్రకటించారు. వీటన్నింటికన్నా మించి జపాన్ ఇస్తున్న భారీ రుణంపై వడ్డీ కేవలం 0.1 శాతమే. 50 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించేలా ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. దీనిపై మాట్లాడుతూ జపాన్ మనకు వడ్డీ లేని రుణం ఇస్తున్నట్లే లెక్క అని వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఒప్పందం జరిగి ఏడాది పూర్తి కాకముందే ప్రాజెక్టు వ్యయం 7 శాతం అంటే దాదాపు రూ. 6,160 కోట్లు పెరగడం సంచలనంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం జపాన్ కరెన్సీ యెన్‌తో పోల్చితే భారత రూపాయి భారీగా పతనం కావడమే. సెప్టెంబర్ 15, 2017న భారత్, జపాన్ల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు రుణ ఒప్పందం కుదిరింది. అదే రోజున ఫోరెక్స్ మార్కెట్లో 1 యెన్‌కు 57 పైసలు విలువ ఉంది. కానీ, ప్రస్తుతం ఈ రోజు(జులై 28)న భారత రూపాయి విలువ 62 పైసలకు పడిపోయింది. 2007 సెప్టెంబర్ 17న ఒక యెన్ విలువ 0.3517 పైసలు. గత పదేళ్లలో రూపాయితో పోల్చినప్పుడు జపాన్ యెన్ 64 శాతం పుంజుకుంది. వచ్చే 50 ఏళ్లలో రూపాయితో పోల్చినప్పుడు యెన్ మరింత బలపడితే జపాన్‌కు మనం చెల్లించాల్సిన రుణం భారీ మొత్తంలో పెరిగిపోతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్‌లో ద్రవ్యోల్బణం 3 శాతంగా నమోదవుతుంది. ఇదే సమయంలో జపాన్ ద్రవ్యోల్బణం సున్నాగా నమోదు కానుంది. ఇదే జరిగితే జపాన్ కరెన్సీతో పోల్చినప్పుడు రూపాయి 3 శాతం పతనం అవుతుంది. అంటే 20 ఏళ్లలో దాదాపు 60 శాతం పతనం కావొచ్చు. ఈ లెక్కన జపాన్ మనకు అప్పుగా ఇచ్చిన 88 వేల కోట్ల రూపాయల మొత్తం లక్షా యాభై వేల కోట్లు అవుతుంది. రుణాన్ని చెల్లించేందుకు 50 ఏళ్ల గడువుంది. ఈ సమయంలో భారతదేశ ద్రవ్యోల్బణంలో మార్పులు రుణంపై భారీ ప్రభావాలు చూపించే అవకాశం మెండుగా ఉంది. ఇప్పటికే పెరిగిపోతున్న ప్రాజెక్టు వ్యయం.. మరోవైపు బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి 1.1 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని మీడియా రిపోర్టులు వస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్ పద్ధతిలో కాకుండా బిడ్డింగ్ పద్ధతిలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు నిర్మాణదారును పిలిచినట్లయితే దాదాపు 3.2 బిలియన్ డాలర్ల వ్యయాన్ని భారత్ తగ్గించుకోగలిగేది(మిగిలిన దేశాల్లో హై స్పీడ్ రైలు ప్రాజెక్టుల వ్యయాలతో మన ప్రాజెక్టును పోల్చితే ఈ తేడా తెలుస్తుంది). -
బుల్లెట్ ట్రైన్‌నూ ఇలాగే నడిపిస్తారా..?
సాక్షి, ముంబై : చినుకు పడితే రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచి రైలు సర్వీసులకు బ్రేక్ పడుతుండటంపై బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ముంబై నగరంలో ఇటీవల వరదలతో రైల్వే ట్రాక్‌లపైకి నీరు నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలు రద్దయిన క్రమంలో ప్రయాణీకుల ఇబ్బందులను ప్రస్తావించింది. నీటిలో మునిగిన ట్రాక్‌లపైనా రైళ్లు నడిచే సాంకేతికత అంతర్జాతీయంగా అందుబాటులో ఉందా..?..త్వరలో నిర్మించే బుల్లెట్ ట్రైన్‌ను వరద నీటిలో నడిపిస్తారా..? అంటూ హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత స్మితా మయాంక్ ధ్రువ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ నరేష్ పాటిల్, జస్టిస్ గిరీష్ కులకర్ణిలతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. వరదలతో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు పశ్చిమ, మధ్య రైల్వే అధికారులతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. పశ్చిమ, మధ్య రైల్వే జనరల్ మేనేజర్ల భేటీ త్వరలో జరుగుతుందని, ఈ సమావేశంలో రైల్వే బ్రిడ్జిలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, ఫ్లాట్‌ఫాం ఎత్తు, మహిళల భద్రత వంటి పలు అంశాలపై చర్చిస్తారని కేంద్రం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ చెప్పారు. ఇటీవల అంథేరి బ్రిడ్జి కూలిన అంశాన్ని ప్రస్తావించిన బెంచ్ అన్ని బ్రిడ్జిల స్థితిగతులపై రైల్వేలు తక్షణమే వ్యవస్ధాగత ఆడిట్ నిర్వహించాలని కోరింది. -
బుల్లెట్ రైలు వద్దు.. బుల్లెట్ దెబ్బలకు రెడీ..
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ ప్రభుత్వానికి చెందిన ‘గుజరాత్ గ్యాస్ కంపెనీ’ 2007లో రైతుల నుంచి భూమిని సేకరించి భూగర్భం నుంచి గ్యాస్ పైపులైన్లు వేసినప్పుడు మహేశ్ పటేల్ అనే రైతు తన పండ్ల తోటలో 130 మామిడి, సపోటా చెట్లను కోల్పోయారు. ఆయనకు ప్రతి చెట్టు నుంచి ఏడాదికి నాలుగువేల రూపాయల లాభం వచ్చేది. ఈ లెక్కన ఆయనకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టం వాటిల్లింది. ఆయనకు జరిగిన నష్టం ఇదొక్కటే కాదు. ఆయన పొలం గుండా గ్యాస్ పైపు లైన్ డయగ్నల్లీ (వికర్ణంగా) పోవడంతో ఇరువైపులున్న కొంత పొలం ఎందుకు ఉపయోగపడకుండా పోయింది. అక్కడ పెద్ద చెట్లు పెరిగే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఆయనకు మరో ప్రమాదం ముంచుకు వచ్చింది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన బుల్లెట్ రైలు కూడా ఆయన పొలం గుండానే వెళుతోంది. అప్పుడు మరింత నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తోట గుజరాత్‌లోని నవసారి జిల్లా మానెక్‌పూర్‌లో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, దాద్రానగర్ హవేలి ప్రాంతాల్లోని 312 గ్రామాల గుండా ప్రతిపాదిత బుల్లెట్ రైలు వెళుతుంది. వాటిల్లో ‘అగ్రి ఎక్స్‌పోర్టు జోన్’గా గుర్తించిన ఎనిమిది జిల్లాలు కూడా ఉండడం గమనార్హం. వాటిల్లో నవసారి జిల్లా ఒకటి. మహేశ్ పటేల్ ఇంతకుముందు ఒక్క గుజరాత్ గ్యాస్ పైప్‌లైన్ వల్లనే నష్టపోయారు. కొందరు రైతులైతే రెండు, మూడు గ్యాస్ పైపు లైన్ల కారణంగా నష్టపోయారు. గుజరాత్ గ్యాస్‌తో పాటు గెయిల్, రిలయన్స్ కంపెనీల గ్యాస్ లైన్ల కారణంగా వారు నష్టపోయారు. ఎందుకంటే ఈ మూడు కంపెనీల లైన్లు పక్కపక్కన కిలోమీటరున్నర పరిధి గుండా వెళ్లాయి. 2001లో ‘అగ్రి ఎక్స్పర్ట్ జోన్’గా ప్రకటించిన ఎనిమిది జిల్లాల్లో బుల్లెట్ రైలు కారణంగా 80,487 చెట్లను కొట్టివేయాల్సి వస్తుందని, వాటిల్లో దాదాపు 27 వేల పండ్ల చెట్లు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. వారికి నష్ట పరిహారం ఎంత, ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ‘నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్’ అధికారులు తెలిపారు. గ్యాస్‌పైప్ లైన్లు వేసినప్పుడు చెట్టుకింత నష్ట పరిహారం అని ఇచ్చారని, ఇప్పుడు అదే లెక్కన ఇవ్వొచ్చని వారంటున్నారు. ఎనిమిది జిల్లాల పరిధిలో 11 లక్షల టన్నులు మామిడి, నాలుగున్నర లక్షల టన్నుల సపోటా పండ్ల దిగుమతి వస్తోందని రైతు సంఘం తెలియజేసింది. 2017లో నవసారి జిల్లా దేశంలో అత్యధిక సపోటా పండ్లను దిగుమతి చేసిన జిల్లాగా కూడా గుర్తింపు పొందిందని రైతులు తెలిపారు. మొత్తం గుజరాత్లో దిగుబడి అవుతున్న మామిడి పండ్లలో 45 శాతం దిగుబడి ఈ నవసారి నుంచే వస్తోందని వారు చెప్పారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న వల్సాద్ జిల్లా నుంచి ఎక్కువ దిగుబడి వస్తోందని వారంటున్నారు. బుల్లెట్ రైలు కారణంగా ఈ రెండు జిల్లాల్లోనే 16,398 పండ్ల చెట్లు, 10,919 ఇతర చెట్లు పోతాయని అధికారుల అంచనాలే తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా 15 నుంచి 20 ఏళ్ల వయస్సున్న చెట్లని రైతులు తెలిపారు. ఇతర చెట్లలాగా మామిడి చెట్లను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించలేమని, కొత్తగా పెట్టే చెట్లు ఎదగాలంటే కనీసం పదేళ్లు పడుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ స్థాయిలో చెట్లను కొట్టివేయడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు. బుల్లెట్ రైతు ప్రతిపాదనను గుజరాత్ పరిధిలోని పండ్ల తోటల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ రైతుల్ని చైతన్య పరుస్తున్నారు. రైల్వేశాఖ నిర్వహిస్తున్న అవగాహనా తరగతులను వరుసగా బహిష్కరిస్తున్నారు. ఎవరికో మేలు చేయడం కోసం, తమ పొట్టలు కొట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. బుల్లెట్ రైలుకు వ్యతిరేకంగా బుల్లెట్లు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వారు ఆవేశంగా అంటున్నారు. జౌళి, బంగారు వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న బుల్లెట్ రైలు(ముంబై నుంచి అహ్మదాబాద్) మార్గాన్ని 508 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. 1.1 లక్షల కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ ప్రాజెక్టును జపాన్ ప్రభుత్వం సహకారంతో చేపడుతున్నారు. బుల్లెట్ రైలు వస్తే రెండు నగరాల మధ్య దూరాన్ని రెండు గంటల్లో అధిగిమించవచ్చు. ప్రస్తుతం ఏడు గంటలు పడుతోంది. -
‘బుల్లెట్ ట్రైన్ కాదు.. మ్యాజిక్ ట్రైన్’
అమేథీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం విమర్శల వర్షం కురిపించారు. అమేథీ పర్యటనలో ఉన్న రాహుల్ మాట్లాడుతూ.. మోదీ చేపట్టింది బుల్లెట్ ట్రైన్ కాదు.. మ్యాజిక్ ట్రైన్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటికి పూర్తి కాదని ఆరోపించారు. ఆహ్మద్బాద్, ముంబైల మధ్య నిర్మించ తలపెట్టిన బుల్లెట్ ట్రైన్ మ్యాజిక్‌గానే మిగులుతుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే బుల్లెట్ ట్రైన్ కల సాకారమవుతుందని ఆయన పేర్కొన్నారు. భారీ వ్యయంతో మోదీ ప్రభుత్వం చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై తొలి నుంచి విపక్షాలు ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ప్రాజెక్టుపై రాహుల్ మాట్లాడుతూ..‘మోదీ జీ స్నేహితులైన ధనికులు ప్రయాణించడానికే బుల్లెట్ ట్రైన్ ఉపకరిస్తుంది. ఇది భారత్‌కు ఇప్పుడు అనవసరం. 2016లో దేశంలో చోటుచేసుకున్న వేర్వేరు రైలు ప్రమాదాల్లో 200మంది మరణించారు. బుల్లెట్ ట్రైన్‌కు వెచ్చించే భారీ మొత్తాన్ని రైల్వే భద్రతకు మళ్లిస్తే.. రైలు ప్రమాదాలో ఒక్కరు కూడా మృతిచెందకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చ’ని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
బుల్లెట్ ట్రైన్ : రోజుకు 70 ట్రిప్పులు
సాక్షి, అహ్మదాబాద్ : ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు కేవలం రెండుగంటల్లో చేర్చే బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టి షెడ్యూల్ టైమ్‌లో పట్టాలెక్కించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) వేగవంతం చేసింది. ముంబయి నుంచి సబర్మతికి ఫాస్ట్ ట్రైన్ రెండు గంటల్లో, రూట్లోని 12 స్టేషన్లలో ఆగే బుల్లెట్ ట్రైన్ రెండుగంటల 58 నిమిషాల్లో గమ్యస్ధానాలకు చేరుకుంటాయని ఎన్హెచ్ఎస్ఆర్సీ అధికారులు తెలిపారు. రద్దీ సమయాల్లో ప్రతి 20 నిమిషాలకూ ఒక బుల్లెట్ ట్రైన్ ఉంటుందని ఎన్హెచ్ఎస్ఆర్సీ పీఆర్ఓ ధనంజయ్ కుమార్ చెప్పారు. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిమీ వేగంతో దూసుకుపోతుందని, రోజుకు 70 ట్రిప్పులు నడపాలని యోచిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్ మధ్య రైలు ప్రయాణానికి దాదాపు ఏడుగంటల సమయం పడుతుండగా, విమాన ప్రయాణానికి గంట సమయం పడుతోంది. -
జపాన్‌లో బుల్లెట్ ట్రయిన్‌కు ప్రమాదం!
టోక్యో : భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బుల్లెట్ ట్రయిన్ సురక్షితం కాదనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు ఆధారం చేకూరేలా జపాన్ రాజధాని టోక్యోలని షింకాన్షెన్ బుల్లెట్ ట్రయిన్లో పొగలు, మంటలు వచ్చాయి. ఈ షింకాన్షెన్ బుల్లెట్ ట్రయిన్ సంస్థే.. భారత్‌లోనూ బుల్లెట్ ట్రయిన్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఆ సంస్థకు చెందిన రైలే భవిష్యత్‌లో భారత్‌లో పరుగులు తీయనుంది. వివరాల్లోకి వెళితే...బుల్లెట్ ట్రయిన్ విభాగంలో అత్యంత శక్తివంతమైన షింకాన్షెన్ బుల్లెట్ ట్రయిన్ కు బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. పట్టాలు బీటలు వారడంతో.. రైల్లో మంటలు, పొగలు వచ్చాయి. అయితే ఈ ఘటనలో ప్రాణహాని లేకపోయినా.. బుల్లెట్ ట్రయిన్ వ్యవస్థలో ఇదో భారీ ప్రమాదంగా నిపుణులు చెబుతున్నారు. అత్యంత వేగంగా దూసుకుళ్లే ఈ రైలులో బుధవారం దక్షిణ జపాన్‌లోని నాగయ స్టేషన్ వద్ద పొగలు రావడం, అలాగే విచిత్రంగా వస్తున్న శబ్దాలు రావడాన్ని అధికారులు గుర్తించారు. ఆ వెంటనే రైలును పూర్తిగా నిలిపేశారు. రైలును పూర్తిగా పరిశీలించిన అధికారులు చాసిస్ కింద ఆయిల్ లీక్ అవడం వల్ల పొగలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ ట్రయిన్ అలాగే మరికొంత దూరం ప్రయాణించి ఉంటే.. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవని అధికారులు చెబుతున్నారు. రైల్లోని వెయ్యి మంది ప్రయాణికులును మరో బుల్లెట్ ట్రైన్లో తరలించారు. ఈ ఘటనపై షింకాన్షెన్ అధికారులు మాట్లాడుతూ.. ఇది అసాధారణ సమస్య అని చెప్పారు. దీని గురించి మేం సీరియస్‌గానే చర్చిస్తున్నట్లు వారు తెలిపారు. -
చెన్నై బుల్లెట్ రైలుకు చైనా బ్రేక్ వేసిందా?
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారతంలో తొలి బుల్లెట్ రైలు (హైస్పీడ్ రైలు) కల కలగానే ఉండిపోనుందా.. చెన్నై నుంచి బెంగళూరుకు హైస్పీడ్ రైలు మార్గం పనులు దాదాపు పడకేసినట్లేనా అంటూ ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం అవుననుకోక తప్పదేమో. ఎందుకంటే చైనా సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు భారత్ సిద్ధం కాగా.. గత ఏడాది కిందటే సర్వే పూర్తి చేసిన చైనా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన తెలియజేయలేదని అధికారులు చెబుతున్నారు. భారత్, చైనాకు మధ్య డోక్లామ్ వివాదం నెలకొన్ని నేపథ్యంలోనే చైనా ఈ ప్రాజెక్టు విషయంలో మిన్నకుండా పోయినట్లు సమాచారం. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య మొత్తం 492 కిలో మీటర్ల హైస్పీడ్ రైలు సర్వీసును ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ప్రాజెక్టు అధ్యయనం 2014లో ప్రారంభించగా 2016లో దానికి సంబంధించిన నివేదికను కూడా ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయం కూడా చైనానే భరించనున్నట్లు తెలిపింది. అయితే, పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన చైనా అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదంట. దీంతో ఈ ప్రాజెక్టుకు ముందుకు వెళుతుందో లేదో.. అసలు మొదలవుతుందో ఆగిపోతుందో తెలియడం లేదని అధికారులు అంటున్నారు. -
'మోదీ ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లే..'
ముంబయి : ఓ పక్క నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నారని తీవ్ర ఊహాగానాలు రేకెత్తుతుండగా వాటిని ఆయన పటాపంచలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల భారత వృద్ధి రేటు నెమ్మదించిందని అన్నారు. కశ్మీర్ పాలసీతోపాటు, బుల్లెట్ రైలు ప్రాజెక్టును కూడా విమర్శించారు. బుల్లెట్ రైలు అనేది ఆచరణ సాధ్యంకాదని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పొందే ప్రయోజనాలు, ఇరు రాష్ట్రాల మధ్య కేటాయింపుల్లో చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. 'మహారాష్ట్రకు కేవలం నాలుగు స్టేషన్లు మాత్రమే ఇచ్చారు. కానీ, ఎక్కువ స్టేషన్లు గుజరాత్‌కు ఉన్నాయి. అసలు బుల్లెట్ రైలు వెనుక ఉద్దేశం ఏమిటో నాకు ఇప్పటి వరకు తెలియడం లేదు. వాస్తవానికి బుల్లెట్ రైలు కావాల్సింది ఒక ముంబయికి ఢిల్లీకి మధ్య. లేదంటే ఢిల్లీకి కోల్‌కతాకు మధ్య లేదా ముంబయి చెన్నై మధ్య. ముంబయి అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ఆచరణ సాధ్యం కాదు. అయితే, గుజరాత్‌కు వచ్చే ప్రయోజనాలు తాను కాదనబోనని, అయితే, మహారాష్ట్రకు జరిగే నష్టం గురించే తాను ఎత్తి చూపాలని అనుకుంటున్నానని తెలిపారు. -
పౌర రవాణా పట్టదా?
విశ్లేషణ నగరాలు, పలు నగర ప్రాంతాలుగా వృద్ధి చెందుతున్నాయి. ప్రతి కేంద్రాన్ని మరో దానితో అనుసంధానించడం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చాలా అవసరం. కాబట్టి ఏకీకృత మెట్రో పాలిటన్ రోడ్డు రవాణా వ్యవస్థ చాలా ఉపయోగకరం. మనకో బుల్లెట్ ట్రైన్ రాబోతున్నదనేది నిజం. మన రైల్వే వ్యవస్థలోని భద్రతాపరమైన సమస్యలు చాలావరకు పరిష్కారం కాకుండానే ఉన్నా కూడా... అది మన పౌర రవాణా వ్యవస్థకు అత్యంత ఖరీదైన సంకేతం. రవాణా రంగంలోని పెరుగుతున్న అవసరాలు, అరకొర సదుపాయాలు కలసి పౌరులను నివారించదగిన కష్టాలకు గురిచేస్తున్నాయనేది కూడా వాస్తవమే. ఎంతో కాలం క్రితమే పూర్తి కావాల్సిన మెట్రోలు, రోడ్లు కిక్కిరిసిపోయాక ఇప్పుడు నిర్మితమవుతున్నాయి. దేశవ్యాప్తంగా రవాణా సదుపాయాల ప్రణాళికల రూపకల్పన, అమలులో పాదచారులను, సైకిల్ వాలాలను కర్మకు వదిలేశారు. రోడ్డు పక్క కాలిబాటలను ఎవరో ఆక్రమించేసుకుని ఉంటారు కాబట్టి వాటిపై మీరు నడవ లేరు, రోడ్ల మీద సైకిల్ తొక్కనూ లేరు. నేను నివసించే థానే, ఇటీవలే 20 లక్షల జనాభాను దాటిన జనసమ్మర్దతగల నగరం. తలా తోకాలేని లేదా ప్రణాళికా రచన దాదాపు పూర్తిగా లోపించడం... ఒక నగరాన్ని ఎలాంటి చిక్కుముళ్లలో బంధిస్తుందనడానికి అది ఒక ఉదాహరణ. అత్యంత శక్తివంతమైన అతి వేగవంతమైన పౌర రవాణా సదుపాయాల గురించి 1987 లోనే చర్చించినా నేటికీ ఇంకా డిజైన్ల రూపకల్పన దశకు చేరలేదు. గత దశాబ్దకాలంగా ప్రైవేట్ కార్లు బహిరంగ రహదారులకు అడ్డుకట్టలుగా మారుతున్నాయి. థానేలో బస్సుల నిర్వహణ అత్యంత అధ్వానం. బస్సుల్లో చాలా వరకు, పౌర రవాణాకు ఉపయోగించడం మొదలెట్టే నాటికే శిథిలావస్థకు చేరుతుంటాయి. విడి భాగాలు కనుమరుగవుతుండటంతో ఆమోదయోగ్యమైన స్థాయిలో వాటిని నడపడం కష్టమౌతుంటుంది. రాజకీయవేత్తలతో కుమ్మక్కయిన ప్రైవేటు ఆపరేటర్లు చట్టవిరుద్ధంగా బస్సులను లాభదాయకంగా తిప్పుతుంటారు. రవాణా సదుపాయాలను కల్పించాల్సిన ప్రభుత్వమే వీటిని సక్రమమైన పద్ధతిలో పెట్టాలి. కానీ చాలా రాష్ట్రాల్లో నగరాల లోపలి రూట్ల బస్సు సర్వీసులను సైతం అధ్వానంగానే నిర్వహిస్తుంటారు. దేశంలో ఎక్కడా సమంజసనీయమైన, సౌఖ్యకరమైన, సమర్థవంతమైన, అందుబాటులో ఉండే, సురక్షిత స్థానిక రవాణా సేవలు ఎంత గాలించినా కనబడవు. ప్రతి నగరమూ, నగరాంతర్గత లేదా పట్టణ సముదాయాంతర్గత రవాణా వ్యవస్థపై ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. అయినా కార్లు, స్కూటర్లు, ఆటోరిక్షాలపై ఆధారపడటం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడా పార్కింగ్ స్థలాలు ఉండవు. పాదచారుల భద్రతను విస్మరిస్తారు. స్పీడ్ బ్రేకర్లు కని పించకుండా పోతాయి లేదా వాటిని అసలు నిర్మించరు. ప్రైవేటు మోటారు వాహనాలకే ప్రాధాన్యం లభిస్తుంది కాబట్టి పాదచారులు రోడ్లు క్రాస్ చేయడానికి ఉపయోగపడే స్థలాల గురించిన యోచనే ఉండదు. నాగపూర్‌లో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రవేశించనున్నారు. నగర పాలక సంస్థ అప్రతిష్టకు తగ్గట్టే వారు సకాలంలో చెల్లింపులు జరిగేలా పనిని బట్టి నిర్ణీత కాలానికి నగదు చెల్లింపు (క్యాష్ ఇన్ ఎస్క్రో) ఒప్పందాలను కోరుతున్నారు. సమర్థవంతమైన లోకల్ ట్రైన్లను, ముని సిపల్ కార్పొరేషన్ నిర్వహణలోని బస్సు రవాణాను, నలుపు–పసుపు ట్యాక్సీ క్యాబ్‌లను, ఇçప్పుడు ఉబర్, ఓలా తదితర కార్లను చూస్తే... ముంబై నగరానికి సమర్థవంతమైన రవాణా వ్యవస్థ ఉన్నట్టే కనిపిస్తుంది. ఇవన్నీ కలసి ప్రైవేటు, ప్రభుత్వ వాహనాల వేగాన్ని కొన్ని చోట్ల గంటకు నాలుగు కిలో మీటర్లకు తగ్గించేశాయి. బృహత్తర మెట్రోపాలిటన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో తలపెట్టిన మెట్రోలు ఇంకా మొదలు కానే లేదు. ఆ వ్యవస్థ నిర్మాణం పూర్తి కావడానికి మరో దశాబ్దిన్నర కాలమైనా పడుతుంది. కానీ అవి మాత్రమే సరి పోవు. ప్రతి చిన్న పట్టణంలోనూ ఉన్న పని ప్రదేశాలకు తక్కువ దూరమే ప్రయాణించాల్సి వచ్చేలా మెట్రో పాలి టన్ ప్రాంతంలోని కొత్త కేంద్రాల వద్ద నూతన ఆర్థిక కార్యకలాపాలు ఏమీ లేకున్నా జనాభా వృద్ధి చెందుతోంది. నగర పాలక సంస్థలు వాటిని నడపలేవనే వాస్తవాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి గానీ గుర్తించ లేదు. ముంబై నగర రవాణా సంస్థ బెస్ట్ దాదాపు దివాలా అంచులకు చేరింది. బస్సుల, ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోయి అది తన ఉద్యోగులకు సకాలానికి జీతాలను చెల్లించలేకపోతోంది. దానికి ఆర్థిక సహా యాన్ని అందించి, దాని కోసం ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలనే విషయం పరిగణనలో ఉంది. అది సైతం బ్యాండ్ ఎయిడ్ పట్టీ వేయడమే అవుతుంది. ముంబైతో పాటూ మెట్రో పాలిటన్ ప్రాంతంలోని థానే, నవీ ముంబై, పన్వెల్, కల్యాణ్–డోంబివిలి, ఉల్లాస్‌నగర్, మీరా–భయందర్, భివాండి–నిజాంపూర్, వసాయ్–వీరార్ నగరాలన్నీ తమ చిన్న భౌగోళిక ప్రాంతాలకు సమర్థవంతంగా సేవలను అందించడంలో విఫలమయ్యాయి. ఈ నగరాలన్నింటి వద్ద అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను అన్నిటినీ కలిపి, మెట్రో ప్రాంతం అంతటా వాటిని అభిలషణీయం స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చే ఆలోచన సైతం ప్రభుత్వానికి తట్టలేదు. అది చేస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. ఏకీకృతమైన మెట్రో పాలిటన్ రోడ్డు రవాణా వ్యవస్థ నగర ప్రజలకు ఒక వరమే అవుతుంది. నగరాలు, నగర ప్రాంతాలుగా వృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ప్రతి కేంద్రాన్ని మరో దానితో అనుసంధానించడం ఆర్థికవ్యవస్థ ముమ్మరంగా కార్యకలాపాలు సాగించడానికి చాలా అవసరం. కాబట్టి ఇది కొంత ఆలోచించాల్సిన విషయం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
'లక్ష కోట్ల లూటీకే మోదీ 'బుల్లెట్''
ముంబయి : ప్రధాని నరేంద్రమోదీపై శివసేన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. రూ.1.08లక్షల కోట్లను లూటీ చేసేందుకే బుల్లెట్ రైలు ప్రాజెక్టును మోదీ తెరమీదకు తెచ్చారంటూ తన అధికార పత్రిక సామ్నాలో దుయ్యబట్టింది. ఇది మోదీ అత్యంత ఖరీదైన డ్రీమ్ అని దాని పేరిట దేశం సొమ్మును దోపిడిచేయాలనుకుంటున్నారనితీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఈ మధ్య పీయూష్ గోయల్‌ను రైల్వే మంత్రిని చేశారని, ఆయన బీజేపీ కోశాధికారి కూడా అని, అందుకే ఆయనను ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు కోసం రైల్వేమంత్రిని చేశారంటూ విమర్శించింది. 'ఈ ప్రాజెక్టు కోసం జపాన్ ప్రతి ఒక్కటి అందిస్తుంది.. నెయిల్స్ నుంచి రైళ్ల వరకు.. మానవ శక్తి వనరుల నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఇంకా చెప్పాలంటే సిమెంట్ నుంచి కాంక్రీట్ వరకు కూడా.. డబ్బు భూమి మాత్రం.. గుజరాత్, మహారాష్ట్రది. మొత్తం ఆదాయం మాత్రం టోక్యోకు వెళ్లిపోతుంది. ఈ లూటీని, మోసాన్ని ఎవరూ ప్రశ్నించకుండా మోదీ మానస పుత్రిక (బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు)కు మాత్రం అభినందనలు చెబుతున్నారు' అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మండిపడింది. -
మోదీది ఖరీదైన కల
సాక్షి, ముంబైః ప్రధాని నరేంద్ర పనితీరుపై శివసేన మరోసారి ధ్వజమెత్తింది. మోదీ తన ఖరీదైన కలలకోసం దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని సేనవ్యాఖ్యానించింది. ప్రధాని నరేంద్రమోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌పై సేన విమర్శలు గుప్పించింది. కేంద్ర ప్రభుత్వం అనసవరంగా 1.08 లక్షల కోట్ల రూపాయలను బుల్లెట్ ట్రైన్ కోసం ఖర్చుపెడుతోందని శివసేన పేర్కొంది. మోదీ ఖరీదైన కలను నెరవేర్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 30 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని విమర్శించింది. సాధారణ వ్యక్తి కోసం ప్రధాని కలలు కనడంలేదని.. అత్యంత సంపన్న, ధనిక, వ్యాపార వర్గాల కొసం మాత్రమే ఆయనన కలలు కంటున్నారని సేన అధికార పత్రిక సామ్నాలో పేర్కొంది. ముంబైలో లోకల్ ట్రైన్ సిస్టమ్ చాలా అస్తవ్యస్తంగా.. అనేక సమస్యలతో నడుస్తోందని.. దీనిని ముందు సంస్కరిస్తే బాగుండేదని శివసేన పేర్కొంది. బుల్లెట్ ట్రైన్ కోసం పెట్టే పెట్టబడితో విదర్భ, కొంకణ్, మరఠ్వాడా ప్రాంతాల్లో అనేక రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చని శివసేన సూచించింది. -
14న బుల్లెట్ రైలు శంకుస్థాపన
హాజరుకానున్న మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సెప్టెంబర్ 14న నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే పాల్గొంటారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇక్కడి సబర్మతీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దాదాపు రూ.98,000 కోట్లతో చేపడుతున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టు వ్యయంలో 81 శాతాన్ని జపాన్ రుణంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 13న గుజరాత్‌కు చేరుకోనున్న మోదీ, అబేలు 14న జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా మోదీ, అబేలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఈ రైలు 2023లో అందుబాటులోకి రానుంది. దీనిద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్(508 కి.మీ)కు రెండు గంటల్లో చేరుకోవచ్చు. -
2023 నాటికి ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు
ముంబై : ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు 2023 నాటికి పట్టాలు ఎక్కనుందని నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అఖిల్ ఖరే తెలిపారు. ఈ రైలుకు సంబంధించిన సమగ్ర డిజైన్ కోసం గత డిసెంబర్లో జనరల్ కన్సల్టెంట్‌ను నియమించామని, గ్రౌండ్ సర్వే పూర్తి అయినట్లు తెలిపారు . ఈ ప్రాజెక్టులో 21 కి.మీ భూగర్భ టన్నెల్, 7 కి.మీ వరకు సముద్ర మార్గం ఉంటుందన్నారు. ఇది దేశంలోనే మొదటి హైస్పీడ్ రైలు మార్గం అన్నారు. స్థల సేకరణలో ఇబ్బందులు తలెత్తకుండా మిగతా ప్రాజెక్టును భారీ ఎత్తులో నిర్మించనున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్–సబర్మతి మధ్య రైల్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయన్నారు. మెట్రో లైన్ల నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు. అహ్మదాబాద్, వడోదర, సబర్మతిలలో ప్రస్తుతం ఉన్న స్టేషన్లకు సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలనుకున్నట్లు తెలిపారు. ముంబైలోని బీకేసీ వద్ద ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.10 లక్షల కోట్లు అవుతుందని ఖరే తెలిపారు. -
ప్రాథమిక సదుపాయాలే మహాభాగ్యం
అవలోకనం గుజరాతీలు బుల్లెట్ ట్రైన్ కావాలని కోరడం లేదు. సాధారణ ట్రాఫిక్ రద్దీని తట్టుకునే ఫ్లై ఓవర్లున్న జాతీయ రహదారులు వారికి కావాలి. నిర్మించడానికి ముందే కూలిపోకుండా ఉండే, రెండేళ్ల పాటూ బాగు చేయకుండా వదిలేయని మౌలిక నగర సదుపాయాలు కావాలి. ప్రాథమిక సదుపాయాలన్నీ సక్రమంగా ఉండేలా చూసే విసుగెత్తించే నాయకత్వమే వారికి అవసరం. అంతేగానీ బుల్లెట్ ట్రైన్ల గురించి కలలు కనగల అద్భుత మేధో నాయకత్వం కాదు. నేనీ కాలమ్‌ను నా కుటుంబ స్వస్థలమైన సూరత్ నుంచి రాస్తున్నాను. దేశంలోని అతి పురాతనమైన, పెద్ద నగరాలలో సూరత్ ఒకటి. ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీల లాగా ఇది బ్రిటిష్ వాళ్లు నిర్మించినది కాదు. భారతీయులే నిర్మించిన ఈ నగరానికి అనేక శతాబ్దాల లిఖిత చరిత్ర ఉంది. ఢిల్లీ సుల్తానుల కాలానికే ఉన్న ఈ నగరం మొగల్ చక్రవర్తులకు ఉప ఖండంలోనే అత్యధిక రాబడి.నిచ్చిన నగరం. జహంగీర్ కాలంలో ప్రముఖ ఓడ రేవుగా, పెద్ద వాణిజ్య కేంద్రంగా సూరత్ విలసిల్లుతుండగా... 1608లో బ్రిటిష్ వారు మొదటిసారిగా ఇక్కడ దిగారు. మూడు శతాబ్దాల తర్వాత ఓడ రేవును ముంబైకి తరలించినా ఈ నగరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేటంత పెద్దది గానే ఉండేది. లియో టాల్‌స్టాయ్ ‘సూరత్ కాఫీ హౌస్’ అనే ఓ చిన్న కథను కూడా రాశారు. నేటి సూరత్ ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల నగిషీ కేంద్రం. (ప్రపంచ వ్యాప్తంగా లభించే మొత్తం వజ్రాలలో ముడింట రెండు వంతులు సూరత్‌కు వచ్చి వెళ్లాల్సిందే). ఇంచుమించుగా లండన్ నగరం అంత జనాభా కలిగిన ఈ నగరం ప్రపంచంలోని అతి పెద్ద వస్త్ర ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి. భారత్‌లోని మరే ఇతర నగరం కన్నా తలసరి ఆదాయం ఇక్కడే ఎక్కువ. అయినా నా స్వస్థలమైన ఈ నగరానికి చేరుకోవడం నాకు దాదాపుగా అసాధ్యమైంది కాబట్టే ఇదంతా చెబుతున్నాను. నేనిప్పుడు నివాసం ఉంటున్న బెంగళూరు నుంచి ఇక్కడికి నేరుగా వచ్చే విమాన సర్వీసు లేదు. ఎందుకంటే సూరత్‌లో ఉన్న ఒక్క విమానాశ్రాయం పనిచేయడం లేదు. ప్రైవేటు విమాన సంస్థలేవీ సూరత్‌కు విమాన సర్వీసులను నడపవు. మోదీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన కొద్ది కాలానికే ఒక గేదె సూరత్ విమానాశ్రయంలోకి దూసుకురాగా ఒక విమానం దాన్ని ఢీకొంది. ఆ విమానం జెట్ ఇంజన్ దెబ్బతింది. దీంతో సూరత్-ముంబై-బెంగళూరులను కలుపుతూ ఉన్న ఈ ఒక్క ప్రైవేటు విమాన సర్వీసునూ రద్దు చేశారు. విమానాశ్రయం చుట్టూ ఉన్న కంచెలో ఉన్న సందుగుండా గేదె లోపలికి చొరబడిందని, గోడను నిర్మించడానికి ఆదేశించామని నరేంద్ర మోదీ కేబినెట్లోని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతిరాజు ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఏ మాత్రం నమ్మకాన్నీ కలిగించకపోవడంతో ఆ విమాన సంస్థ గత రెండేళ్లుగా సూరత్ సర్వీసు ఊసెత్తడం లేదు. ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా నేను విమానంలో ముంబై చేరి, అక్కడి నుంచి ఐదు గంటలు రోడ్డు మార్గాన ప్రయాణించాలి. ఈ 300 కిలోమీటర్ల దూరం ముంబై, ఢిల్లీలను కలిపే రహదారి. అది మన దేశంలోనే అత్యుత్తమ రహదారి వ్యవస్థయైన గోల్డెన్ క్వాడ్రిలేటరల్‌లో (చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలను కలుపుతుంది) భాగం. అయినా ఈ ప్రయా ణానికి ఐదు గంటలు ఎందుకు పట్టినట్టు? ముంబైకు వెలుపల ఫౌంటెన్ హోటల్ అనే ప్రాంతానికి సమీపంలోని ఒక ఫ్లై ఓవర్ పగలడమో లేదా బీట్లు పడటమో జరిగింది. దీంతో ఆ వంతెనపై నుంచి ఒకేసారి ఇరు వైపులకూ వాహనాలను అనుమతించడం ప్రమాదకరంగా మారింది. కాబట్టి ఒక వైపు నుంచి వాహనాలను వదిలినప్పడు రెండో వైపున ఉన్నవి తరచుగా గంట సేపు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది బాగా రద్దీగా ఉండే రహదారి, బహుశా దేశంలోనే అతి రద్దీగా ఉండే మార్గం. కాబట్టి అలా ఆగిపోయే కార్లు, ట్రక్కుల బారు చాలా కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ పరిస్థితి ఇలా ఎంత కాలం నుంచి ఉన్నదని డ్రైవర్‌ను అడిగితే కనీసం నాలుగు నెలలవుతుందని తెలిసింది. అయినా దాన్ని బాగు చేసే పనులు ఇంకా మొదలు కాలేదు. సూరత్ చేరేసరికి క్రితం సారి నేనక్కడికి వచ్చేటప్పటికి... కూలి పోయి 11 మంది ప్రాణాలను బలిగొన్న ఫ్లై ఓవర్‌ను ఇంకా పునర్నిర్మించలేదు. అది సరికొత్త ఫ్లైఓవర్, దానిలో ఒక భాగం కింద దన్నుగా నిలిపిన పరంజాను తొలగించడంతోనే కుప్పుకూలిపోయింది. రెండేళ్ల నుంచి ఆ చిన్న భాగాన్ని బాగు చేయలేకపోవడంతో సూరత్‌లోని అతి ముఖ్యమైన రహదారి అత్వాలైన్స్పై ఉన్న ఆ ఫ్లై ఓవర్ నిరుపయోగంగా మారింది. నేను చెప్పదలుచుకున్న అంశాన్ని ఇదైనా మీకు స్ఫురింపజేస్తుంది. భారత దేశపు బుల్లెట్ ట్రైన్ పరుగులు తీయబోయే మార్గం ఇదే. ఆ అతి వేగపు రైలు వ్యవస్థ అహ్మదాబాద్‌లో మొదలై సూరత్‌కు చేరుతుంది. అంటే ఇంచుమించుగా అహ్మదాబాద్-ముంబైలకు మధ్యన ఉంటుంది. బుల్లెట్ ట్రైన్ కావాలని గుజ రాతీలు కోరడం లేదు. వారికి కావాల్సింది జంతువులు తిరగకుండా ఉండే, సక్రమంగా పనిచేసే విమానాశ్రయాలు. సాధారణ ట్రాఫిక్ రద్దీని తట్టుకునే ఫ్లై ఓవర్లున్న జాతీయ రహదారులు వారికి కావాలి. నిర్మించడానికి ముందే కూలిపోకుండా ఉండి, రెండేళ్ల పాటూ బాగు చేయకుండా వదిలేయని మౌలిక నగర సదుపాయాలు వారికి కావాలి. వారికి అవసరమైనది ప్రాథమిక సదుపాయాలన్నీ సక్రమంగా ఉండేలా చూసే విసు గెత్తించే నాయకత్వమే తప్ప, బుల్లెట్ ట్రైన్ల గురించి కలలు కనగల అద్భుత మేధో నాయకత్వం కాదు. లండన్ నగరం అంత ఉండే ఈ చారిత్రక నగరం అభివృద్ధిపట్ల చూపుతున్న ఈ యథాలాప ధోరణి ఆశ్చర్యకరం. అది దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం (2008లో కుటుంబానికి సగటున రూ. 4.5 లక్షలకుపైగా). బెంగళూరు నుంచి అలాంటి సుప్రసిద్ధ నగరాన్ని చేరుకోవడం అంటే నాకు లండన్‌కు వెళ్లడం కంటే కూడా కష్టం. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈ-మెయిల్ : aakar.patel@icloud.com -
బుల్లెట్ రైలు నడిపిన ప్రధాని మోదీ
టోక్యో: జపాన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ఒప్పందాలు చేసుకున్నారు. జపాన్ పారిశ్రామిక రంగంలో భారత్ కీలక భాగస్వామ్యం కోరుకుంటోందని, దీనివల్ల ఇరు దేశాలకు లాభదాయకమని మోదీ చెప్పారు. శనివారం కొబెలో మోదీ జపాన్ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. 2007, 2012లో ఇక్కడ పర్యటించానని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి మోదీ టోక్యో నుంచి కొబెకు హై స్పీడ్ రైల్లో ప్రయాణించారు. రైల్లో మోదీ, అబె ఇద్దరూ కలసి డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లారు. మోదీ కాసేపు డ్రైవర్ సీట్లో కూర్చుని ఆపరేట్ చేశారు. కొబెలో ప్రధాని మోదీ వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులతో భేటీ అయ్యారు. మోదీ, అబె సమక్షంలో గుజరాత్, హ్యోగో ప్రభుత్వాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. -
బుల్లెట్ ట్రైన్ లో పాము కలకలం
టోక్యో: జపాన్ లో కదులుతున్న బుల్లెట్ ట్రైన్(నోజోమీ 103) లో సోమవారం ఓ పాము కలకలం సృష్టించింది. దీంతో దేశ రాజధాని టోక్యో నుంచి హిరోషిమాకు బయల్దేరిన ఆ రైలును అధికారులు అర్ధాంతరంగా నిలిపివేశారు. జపాన్ రైల్వేశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రైన్ లోని సీట్ల మధ్య ఉన్న ఖాళీలో పాము తిరగడం గమనించిన ఓ ప్రయాణికుడు సమాచారం అందించినట్లు చెప్పారు. దీంతో వెంటనే రైలును నిలిపివేసి పాముని పట్టుకున్నట్లు వెల్లడించారు. ముదురు గోధుమ రంగులో ఉన్న పాము విషపూరితమైనది కాదని చెప్పారు. ప్రయాణీకులకు ఎవరికీ అసౌకర్యం కలగకుండా సాధారణ సమయానికే రైలు హిరోషిమాకు చేరుకుందని పేర్కొన్నారు. అధికారుల ఆధీనంలో ఉన్న పామును ఎవరైన ప్రయాణీకులు తమ వెంట తెచ్చుకున్నారా? అనే కోణంలో విచారణ జరుగుతున్నట్లు చెప్పారు. పాము తమదేనని ఇప్పటివరకూ ఎవరూ అధికారులను సంప్రదించలేదని వెల్లడించారు. కాగా, ఐదేళ్ల క్రితం కూడా బుల్లెట్ రైలులో పాము కనిపించడంతో రైలును నిలిపివేశారు. అప్పటి నుంచి చిన్నపాటి పక్షులు, చేపలను తప్ప మిగతా వాటితో రైళ్లలో ప్రయాణించడాన్ని జపాన్ ప్రభుత్వం నిషేధించింది. జపాన్ బుల్లెట్ రైళ్లు సమయానికి గమ్యాన్ని చేరుకోవడంలో ప్రపంచంలోనే ముందున్నాయి. -
దూసుకొస్తున్న బుల్లెట్
⇒ ముంబై-అహ్మదాబాద్ మధ్య ఏర్పాటుకు నిర్ణయం ⇒ 2018 నుంచి మొదలుకానున్న పనులు ⇒ 2024కల్లా ట్రాక్ పైకి ⇒ 8 గంటల ప్రయాణం ఇక 2 గంటల్లో ప్యాసింజర్.. ఎక్స్‌ప్రెస్.. సూపర్‌ఫాస్ట్.. వీటి మధ్య ఉన్న ప్రధాన తేడా వాటి వేగమే. అదే వాటి పేర్లను మార్చేసింది. ఈ వేగానికి కారణం టెక్నాలజీ. దీనికి ఆ రంగం.. ఈ రంగం అంటూ ఏ తేడా ఉండదు. ఇది ఏ రంగంలోనైనా వినూత్నమైన మార్పులకు నాంది పలుకుతుంది. అలాంటిదే ఇప్పుడు మన రైల్వే రంగంలోనూ జరగబోతోంది. ఒకప్పుడు కొంత దూరానికి కూడా పొగ రైళ్లలో రోజుల తరబడి ప్రయాణించేవాళ్లం. ఇప్పుడు కొన్ని గంటల్లోనే సుదూర గమ్యాలను చేరుకునే అవకాశం అందుబాటులో ఉంది. అదే ‘బుల్లెట్’ ట్రైన్. దీనిని మొదటగా ఆర్థిక రాజధాని అయిన ముంబై, ప్రధానమంత్రి మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2-3 గంటల్లోనే చేరుకోవచ్చు. బుల్లెట్ రైలు ఏర్పాటు ఆలోచన యూపీఏ ప్రభుత్వం నుంచి ఉంది. దీనిని తొలిగా 2009-10 ైరె ల్వే బడ్జెట్లో ప్రస్తావించారు.. అప్పటి యూపీఏ ప్రభుత్వం పుణే రైల్వేస్టేషన్ నుంచి అహ్మదాబాద్ రైల్వేస్టేషన్ వరకు ముంబై మీదుగా దాదాపు 650 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్వే కారిడార్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. ఈ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు అనుకున్నారు. ప్రాజెక్టు అధ్యయనానికి సంబంధించి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య 2013లో ఒక ఎంవోయూ కూడా కుదిరింది. తర్వాత కాలానుగుణంగా కొన్ని మార్పులు జరిగాయి. చివరికి 2015 డిసెంబర్లో భారత్, జపాన్ మధ్య ముంబై- అహ్మదాబాద్ కారిడార్‌కు సంబంధించిన ఒప్పందం జరిగింది. ప్రాజెక్టు విశేషాలు ఇవి..! ఈ బుల్లెట్ రైలు దేశ పారిశ్రామిక రాజధాని అయిన ముంబై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ అహ్మదాబాద్ మధ్య సేవలందించనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం సుమారు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఇది 11 స్టేషన్లను కలుపుతూ వెళ్తుంది. ప్రస్తుతం ముంబై నుంచి అహ్మదాబాద్‌కు సాధారణ రైళ్లలో వెళ్లాలంటే దాదాపు 8 గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే సుమారు 2 నుంచి 3 గంటల్లో ముంబై నుంచి అహ్మదాబాద్ చేరుకోవచ్చు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.97,636 కోట్లు. దీనికి జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజెన్సీ(జైకా) 81 శాతం నిధులు అంటే రూ.76,165 కోట్లను రుణంగా అందించనుంది. రుణంలో వ్యయ పరిమితి, వడ్డీ, దిగుమతి సుంకాలన్నీ కలగలిపి ఉన్నాయి. 15 ఏళ్ల మారటోరియంతో 50 ఏళ్ల పాటు 0.1 శాతం వార్షిక వడ్డీ చెల్లించేలా రుణ ఒప్పందం జరిగింది. భారత రైల్వే రూ.9,800 కోట్లను అందించనుండగా.. మిగతా మొత్తాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌లు భరిస్తాయి. ట్రాక్ నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.140 కోట్ల నుంచి 200 కోట్లు ఖర్చవుతుందని జైకా అధ్యయనంలో తేలింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం ఈ ఏడాది చివరికల్లా పూర్తి కానుండగా.. పనులు 2018లో ప్రారంభమవుతాయి. 2024 నాటికి బుల్లెట్ ట్రాక్ మీదకి దూసుకొచ్చే అవకాశం ఉంది. బ్రేక్ వేయాల్సిందిక్కడే.. ముంబై-అహ్మదాబాద్ మధ్య రైలు 11 చోట్ల ఆగనుంది. ముం బై, థానే, విరార్, దహను, వల్సద్, వపి, సూరత్, భరూచ్, వడోదరా, ఆనంద్/నడియాద్, అహ్మదాబాద్ స్టేషన్లు ప్రతిపాదనలో ఉన్నాయి. చార్జీలిలా..! సాధారణ రైళ్ల ఫస్ట్‌క్లాస్ ఏసీ టికెట్ ధరతో పోలిస్తే బుల్లెట్ రైలు టికెట్ ధర దాదాపు 1.5 రెట్లు అధికంగా ఉంటుంది. అంటే ముంబై-అహ్మదాబాద్ మధ్య ఏసీ మొదటి తరగతి టికెట్ ధర రూ.2,200 ఉంటే.. అదే బుల్లెట్ రైలులో అయితే దాదాపు రూ.3,300గా ఉంటుంది. కాగా, ఈ రైలులో 10 నుంచి 16 కోచ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. తద్వారా 1,300 నుంచి 1,600 మంది ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రైలులో వైఫై వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జపాన్‌దే తొలి బుల్లెట్.. చైనాదే వేగం ప్రపంచంలో మొట్టమొదటి హైస్పీడ్ రైల్వే వ్యవస్థను 1964లో జపాన్ నిర్మించింది. ఆ తర్వాత 1981లో ఫ్రాన్స్, 1989లో ఇటలీ, 1991లో జర్మనీ, 1992లో స్పెయిన్, 1997లో బెల్జియం దేశాలు నిర్మించగా.. 2007లో చైనాలో అందుబాటులోకి వచ్చింది. కాగా, చైనాకు చెందిన షాంఘై మాగ్లేవ్ రైలు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలుగా రికార్డులకెక్కింది. దీని గరిష్ట వేగం గంటకు 430కి.మీ కాగా, సగటు వేగం గంటకు 251 కి.మీ. దీనిని 2004 ఏప్రిల్‌లో ప్రారంభించారు. అలాగే చైనాకే చెందిన హార్మొనీ సీఆర్‌హెచ్ 380ఏ ఈ రైలును 2010 అక్టోబర్‌లో ప్రారంభించారు. దీని గరిష్ట వేగం 380 కి.మీ. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రెండో రైలు. ఇదీ బీజింగ్-షాంఘై మధ్య సేవలందిస్తోంది. కాగా, జపాన్‌కు చెందిన జపనీస్ మాగ్లేవ్ రైలు(గంటకు 603 కి.మీ) పట్టాలెక్కితే ఇదే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డులకెక్కనుంది. అవసరమా? దాదాపు రూ.లక్ష కోట్లు వెచ్చించి రెండు రాష్ట్రాల మధ్య హైస్పీడ్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? అని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇదివరకే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను పునరుద్ధరిస్తే మంచి ఫలితా లు పొందొచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే దేశంలో నడుస్తోన్న పలు రైళ్లను వాటి శక్తిసామర్థ్యాల మేర వినియోగించుకోలేకపోతున్నామని గుర్తు చేస్తున్నారు. ధనవంతులు, వ్యాపారవేత్తలను దృష్టిలో ఉంచుకొని కాకుండా సామాన్యులను పరిగణనలోకి తీసుకొని సంస్కరణలు జరగాలంటున్నారు. సంపన్నులు విమానాల్లో కూడా ప్రయాణించగలరని, వారి కోసం ఎయిర్ కనెక్టివిటీ సౌలభ్యాన్ని మెరుగుపరిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. అలాగే దీని స్థాపనకు జపాన్ (50 ఏళ్లకు) రుణమిస్తోంది. ఇంత సుదీర్ఘకాలానికి అప్పుచేసి పప్పు కూడు తినడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. - గుండ్ర వెంకటేశ్ - సాక్షి, సెంట్రల్ డెస్క్ సముద్రంలోనూ బుల్లెట్.. అరేబియా సముద్రం కింద ఈ రైలు బుల్లెట్లా దూసుకుపోనుంది. దాదాపు రైలు మార్గమంతా భూ ఉపరితలంపైనే ఉంటుంది. అయితే థానే నుంచి విరార్ వరకు సుమారు 21 కిలోమీటర్ల మేర మాత్రం సముద్రగర్భంలో ప్రయాణించొచ్చు. ఇందుకోసం ఓ భారీ టన్నెల్‌ను నిర్మించనున్నారు. -
రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు
- చైనాలో సీఎం బృందం పరిశీలన - టియాంజిన్ నుంచి బీజింగ్ వరకు ప్రయాణం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మంగళవారం టియాంజిన్ నుంచి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించినట్లు హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బుల్లెట్ రైలులో సీఎంతో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు ప్రయాణించారు. అమరావతి- విశాఖపట్నం, అమరావతి- హైదరాబాద్ మధ్య బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టే అవకాశాలపై టియాంజిన్ నుంచి బీజింగ్ మధ్య 140 కిలోమీటర్లను 31 నిమిషాల్లో ప్రయాణించి పరిశీలించారు. బీజింగ్ నుంచి గుయాన్ చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక పోవడంతో సీఎం ఏడున్నర గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. పీవీకి నివాళులు: చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో పీవీ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడితే తాను సీఎంగా వాటిని కొనసాగించానని తెలిపారు. ఢిల్లీలో పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. -
చైనాలో చంద్రబాబు బుల్లెట్ ట్రైన్ జర్నీ
బీజింగ్ : చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన ఇవాళ టియాంజిన్ నుంచి బీజింగ్ నగరానికి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. బుల్లెట్ రైళ్లు, హైస్పీడు రైళ్ల సర్వీసుల్ని అధ్యయనం చేయడానికి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్ మార్గాల్లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలపై పరిశీలన చేశారు. టియాంజిన్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో వున్న బీజింగ్ నగరానికి ముఖ్యమంత్రి కేవలం 31 నిమిషాలలో చేరుకున్నారు. కాగా చైనాలోని బుల్లెట్ రైళ్లు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అనంతరం బుల్లెట్ రైళ్ళను పరిశీలించిన అనంతరం చంద్రబాబునాయుడు గుయాన్ వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. కాగా బుల్లెట్ ట్రయిన్లో ప్రయాణం చేయడం ఓ మధురానుభూతి అని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. Elated at the experience of travelling in a Bullet train from Tianjin to Beijing. A memorable experience. #ChinaTrip pic.twitter.com/flyZtuJ80H — N Chandrababu Naidu (@ncbn) 28 June 2016 -
1,500 కి.మీ. 5 గంటల్లో..
ఢిల్లీ నుంచి కోల్‌కతాకు బుల్లెట్ రైలుపై కసరత్తు న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి కోల్‌కతాకు 5 గంటలలోపే చేరుకోవచ్చు! 1,513 కి.మీ దూరమున్న ఈ మార్గంలో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ఈ మార్గంలో బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఇది కార్యరూపంలోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కసరత్తు బాధ్యతను రైల్వే శాఖ స్పెయిన్‌కు చెందిన కన్సల్టెన్సీకి అప్పగించింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో ఢిల్లీ-కోల్‌కతా కారిడార్ భాగమని రైల్వే శాఖ అధికారి ఒకరు చెప్పారు. దీనికి రూ. 84 వేల కోట్లు వ్యయమవుతుందని అంచనా. స్పెయిన్ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం ఈ ప్రతిపాదిత బుల్లెట్ రైలు ప్రయాణం ఢిల్లీ-కోల్‌కతాకు 4.56 గంటలు పడుతుంది. అదే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 17 గంటలు పడుతుంది. బుల్లెట్ రైలు గంటలకు 300 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ఈ మార్గంలో ఆగ్రా, లక్నో, వారణాసి, పట్నాలతోపాటు 12 నగరాలు కలుస్తాయి. ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి లక్నోకు, వారణాసికి, పట్నాకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది ఢిల్లీ నుంచి 506 కి.మీ దూరంలో ఉన్న లక్నోకు 1.45 గంటలు, 782 కి.మీ. దూరంలో ఉన్న వారణాసికి 2.45 గంటలు పడుతుంది. 4 మెట్రో నగరాలను హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించే వజ్ర చతుర్భుజి ప్రాజెక్టులో భాగమైన ఢిల్లీ-ముంబై, ముంబై-చెన్నై హైస్పీడ్ కారిడార్ సాధ్యాసాధ్యాలపైనా అధ్యయనం చేయనున్నారు. దూరం-ప్రయాణ సమయం ఢిల్లీ-లక్నో 506 కి.మీ. 1.45 గంటలు ఢిల్లీ-వారణాసి 782 కి.మీ. 2.40 గంటలు ఢిల్లీ-కోల్‌కతా 1,513 కి.మీ. 4.56 గంటలు ఎంత ఖర్చవుతుంది? ఢిల్లీ-కోల్‌కతా కారిడార్ రూ.84 వేల కోట్లు -
మూడు గంటల్లో ఢిల్లీ నుంచి వారణాసికి..
న్యూఢిల్లీ: మరో బుల్లెట్ రైలు దేశ ప్రజలకు అందుబాటులోకి రానుంది. న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య ఈ రైలు పరుగులు తీయనుంది. ఢిల్లీ నుంచి వయా అలిఘర్,ఆగ్రా, లక్నో,సుల్తాన్ పూర్ మీదగా ఈ రైలు వారణాసికి చేరుకుంటుంది. కాగా ప్రస్తుతం ఢిల్లీ-వారణాసి మధ్య 10 నుంచి 14 గంటల పాటు ప్రయాణ సమయం పడుతోంది. అయితే తాజాగా బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఆ ప్రయాణ సమయం అనూహ్యంగా తగ్గిపోనుంది. ఈ రెండు నగరాల మధ్య ఉన్న 782 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2గంటల 40 నిమిషాల్లోనే ఈ రైలు చేరుకోనుంది. ఇక ఢిల్లీ నుంచి లక్నోకు కేవలం గంటా 45 నిమిషాల్లో గమ్యస్థానం చేరుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి అధ్యయనం చేసిన స్పానిష్ సంస్థ నివేదిక కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. ఈఏడాది చివరికల్లా నివేదిక తుది రూపు దిద్దుకోనుంది. దీనికోసం సుమారు రూ.43,000 కోట్ల వ్యయం కానున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ముంబయి-అహ్మదాబాద్ కారిడార్ మధ్య నడిచే బుల్లెట్ ట్రయిన్ ఇటీవలే ట్రయిల్ రన్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రైలు 2023కి ప్రజలకు అందుబాటులోకి రానుంది. -
బుల్లెట్ కు బ్రేకు
ముంబై: దేశంలో తొలిసారిగా అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించే బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ముంబైలోని రద్దీ ప్రదేశంలో కుర్లా బాంద్రా కాంప్లెక్స్ (బీకేసీ) కింద అండర్ గ్రౌండ్ స్టేషన్ నిర్మాణనికి రైల్వేశాఖ ప్రతిపాందించింది. ఇందుకోసం జపాన్ కు చెందిన కంపెనీకి కాంట్రాక్టు కూడా అప్పగించింది. బీకేసీలో స్టేషన్ నిర్మాణం వల్ల వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యతరం తెలుపుతోంది. దీనివల్ల రూ.10,000 కోట్లు నష్టం జరుగుతుందని, అందుకే అక్కడ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తోందని సమాచారం. -
ఆ ట్రైన్ టికెట్ ధర రూ. 3300
న్యూఢిల్లీ: అహ్మదాబాద్- ముంబై మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలు, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధరలతో పొల్చితే అరశాతం మాత్రమే ఎక్కువగా ఉండనున్నట్టు తమ ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వశాఖ పార్లమెంట్‌కు తెలిపింది. రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాతపూర్వకంగా బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనల వివరాలను పార్లమెంట్‌కు బుధవారం తెలిపారు. 'మొదటి దశ బుల్లెట్ ట్రైన్ల గరిష్ట వేగాన్ని గంటకు 350 కిలో మీటర్లుగా, ఆపరేటింగ్ వేగాన్ని గంటకు 320 కిలో మీటర్లుగా నిర్ధారించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణానికి 2.07 గంటల సమయం పడుతోంది. ప్రతి స్టేషన్లో స్టాప్ ఉంటే 2.58 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ-నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ- చెన్నై కారిడార్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతుంది' అని తమ ప్రతిపాదనల వివరాలను పార్లమెంట్ కు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర అహ్మదాబాద్- ముంబైకి ప్రయాణించడానికి 2200 రూపాయలు ఖర్చు అవుతుంది. హై స్పీడ్ కారిడార్ గుండా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణిస్తే రైల్వే మంత్రిత్వ శాఖనిర్ధారించిన టారిఫ్ ప్రకారం టికెట్ ధర రూ.3300 అవుతుంది. -
మనకు సముద్రం కింద నుంచి బుల్లెట్ ట్రైన్
న్యూఢిల్లీ: బుల్లెట్ రైలు త్వరలో భారతీయ రైల్వేలో అడుగుపెట్టడమే ఒక గొప్ప అనుభూతి అనుకుంటే.. అంతకుమించిన మధురానుభూతి అతిత్వరలో లభించనుంది. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రయాణించడం ద్వారా అది సొంతం కానుంది. ఎందుకంటే అరేబియా తీరం గుండా ఉండే ఈ రెండు ప్రాంతాల మధ్య నడిచే బుల్లెట్ రైలు సముద్రం కింద నుంచి పరుగులు పెట్టనుందట. దీని కోసం ఓ భారీ సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేయనున్నారు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలును ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలు ప్రయాణించే మొత్తం 508 కిలోమీటర్లు కాగా.. అందులో 21 కిలోమీటర్లు సముద్రం క్రింది నుంచి ప్రయాణించనుంది. అందుకు ప్రధాన కారణం ధానే వద్ద ఓ పెద్ద సముద్ర చీలిక అడ్డురావడం. ఈ నేపథ్యంలోనే ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రైలు ఏర్పాటు కోసం మొత్తం రూ.97,636 కోట్లు వెచ్చిస్తుండగా.. ఇందులో జపాన్ వద్ద నుంచే 81శాతం రుణంగా ఇస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి ఒప్పందం 2016 చివరినాటికి పూర్తి కానుండగా.. 2018లో పనులు ప్రారంభం కానున్నాయి. -
ఆ రైలు రోజుకు 100 ట్రిప్పులు వెయ్యాల్సిందే
అహ్మదాబాద్: ఒక రైలు ఒక ట్రిప్పులో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అంలాంటివి రోజుకు 100 ట్రిప్పులు వేస్తేగానీ ఆ రైలు కోసం చేసిన అప్పు తీరదు! 'ఆ.. ఒక రైలు 100 ట్రిప్పులు తిరగటమేంటి? సాధ్యమయ్యేపనేనా!'అనే సందేహం రావచ్చు. అది అలాంటిలాంటి రైలు కాదు.. ఇండియన్ రైల్వేస్ కలల ప్రాజెక్టు బుల్లెట్ ట్రైన్. వచ్చే ఏడాది చివర్లో పట్టాలెక్కనున్న బుల్లెట్ ట్రైన్ తొలి దశ సర్వీసు ముంబై- అహ్మదాబాద్ ల తిరగనుంది. 300 కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ ధర రూ. 1500 అనుకుంటే, రోజుకు 100 ట్రిప్పులు అంటే 88 వేల నుంచి 1.18 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తేగానీ ఈ ప్రాజెక్టు వర్క్ అవుట్ కాదంటున్నారు ఆర్థిక నిపుణులు. రైల్వే శాఖ అభ్యర్థన మేరకు ఐఐఎం అహ్మదాబాద్ ఒక నివేదిక ను సమర్పించింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జపాన్ నుంచి తీసుకునే రూ.97,636 కోట్ల రుణాన్ని గడువు లోపు వడ్డీతో కలిపి చెల్లించాలంటే రోజుకు 100 ట్రిప్పులు తప్పవని సూచించింది. జపాన్ నుంచి తీసుకునే రుణంలో 80శాతం 0.1 శాతం వడ్డీతో 50 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. మిగతా 20 శాతం రుణాన్ని 8 శాతం వడ్డీరేట్ తో కేంద్ర తన వాటాగా అందించనుంది. బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టు 2017 చివరిలో ప్రారంభంకానుంది. ప్రాజెక్టు చేపట్టిన ఐదేళ్లలో ముంబాయి-అహ్మదాబాద్ వాసులకు అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టబోయే ప్రాజెక్టులో ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. -
జపాన్‌లో టైం అంటే టైమే..
జపాన్‌లో రైళ్ల సమయపాలన చూస్తే మనోళ్లు నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటారా? అక్కడ ట్రైయిన్ ఐదు నిమిషాలు లేటయినా ప్రయాణికులకు రైల్వే సిబ్బంది సారీ చెబుతారట! అక్కడితో ఆగకుండా.. రైలు ఆలస్యంగా వచ్చినట్టు సర్టిఫికెట్ కూడా ఇస్తారట. ఉద్యోగులు ఆఫీసుకు ఆలస్యమైతే అందుకు కారణంగా ఈ సర్టిఫికెట్‌ను చూపించే వెసులుబాటు ఉందట. ఇక రైలు ఒక గంటగానీ ఆలస్యంగా వస్తే అది పెద్ద వార్త అయి కూర్చుంటుంది! జపాన్ బుల్లెట్ ‘బ్రెయిన్’ జపాన్ బుల్లెట్ ట్రెయిన్ ఎలా పుట్టిందో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధంలో బాంబులు జార విడిచే కమికాజే డైవ్ విమానాలకు డిజైన్ చేసిన ఓ ఇంజనీర్ బ్రెయిన్ నుంచి పుట్టింది. తాను రూపొందించిన కమికాజే విమానాల విధ్వంసం చూసి ఆయన తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యాడు. తన నైపుణ్యాన్ని శాంతి కోసం వాడాలని నిర్ణయించుకొని షింకన్సేన్ (బుల్లెట్ రైలు) డిజైన్‌ను రూపొందించాడు. ఇప్పటివరకు ఈ బుల్లెట్ రైలు ఒక్కసారి కూడా ప్రమాదానికి గురికాకపోవడం గమనార్హం. -
మనకూ 'బుల్లెట్'
-
మనకూ 'బుల్లెట్'
- ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గానికి రూ. 98,000 కోట్ల జపాన్ సాయం - భారత ఆర్థిక వ్యవస్థ ఇక పరుగులు పెడుతుంది: ప్రధాని మోదీ - మేకిన్ ఇండియాకు 12 బిలియన్ డాలర్ల నిధి: షింజో అబే - భారత్-జపాన్ విజన్ 2025పై సంయుక్త ప్రకటన - పౌర అణుశక్తి సహకారం, రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు న్యూఢిల్లీ: భారత్-జపాన్ మధ్య వ్యూహాత్మక, ద్వైపాక్షిక భాగస్వామ్యం కొత్త రెక్కలు తొడిగింది. జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని మోదీ మధ్య శనివారం ఢిల్లీలో జరిగిన భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సు.. రెండు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసింది. భారత్‌లో తొలి బుల్లెట్ రైలుతోపాటు పౌర అణు ఒప్పందం, రక్షణ రంగంలో కీలక సహకారం వంటి ముఖ్యమైన 16 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రభుత్వాలతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల అభివృద్ధికి సహకారం వంటి ఒప్పందాలూ ఉన్నాయి. భారత ఆర్థిక రాజధాని ముంబై - గుజరాత్ ముఖ్య వ్యాపార కేంద్రం అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ఏర్పాటుకు 12 బిలియన్ డాలర్ల (రూ. 98వేల కోట్లు) ప్యాకేజీ ఇవ్వటంతో పాటు సాంకేతికంగా పూర్తి సహకారం అందించేందుకు జపాన్ అంగీకరించింది. ఈ ఒప్పందం చారిత్రాత్మకమని.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ కలలను జపాన్ అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేదన్నారు. తొలి బుల్లెట్ రైలు కల సాకారానికి సహాయం చేస్తున్న జపాన్ ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ ఒప్పందం భవిష్యత్తులో భారత రైల్వే వ్యవస్థ అభివృద్ధికి నాంది పలకనుంది. భారత ఆర్థిక వ్యవస్థ మార్పుకు ‘బుల్లెట్ రైలు ఒప్పందం’ ఇంజన్ వంటిద’ని మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 50 ఏళ్ల కాల వ్యవధికి.. 0.1 శాతం వడ్డీతో 80 శాతం నిధులను (రూ.98వేల కోట్లు) జపాన్ అందించనుంది. దీంతో పాటు పౌరఅణు ఒప్పందంలో సహకారం, రక్షణ రంగ సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవటంపైనా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలతో పాటు.. దక్షిణ చైనా సముద్రం, ఉగ్రవాదం, ఐక్యరాజ్యసమితి సంస్కరణలు మొదలైన అంశాలపైనా ఇద్దరు ప్రధానులు చర్చించారు. ‘భారత్-జపాన్ విజన్ 2025; ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యం-భారత, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుహృద్భావం నెలకొనేందుకు సంయక్తంగా పనిచేయటం’పై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవటంతోపాటు తూర్పు ఆసియా ప్రాంతంలో భద్రత, శాంతి నెలకొల్పటం.. దక్షిణ చైనా సముద్ర వివాదంలో 2002లో చేసుకున్న ఒప్పందానికే కట్టుబడి ఉండాలని మోదీ-అబేలు నిర్ణయించారు. - ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ (డీఎంఐసీ) ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించటంపై చర్చించారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్సీ) పనుల్లో అభివృద్ధిపై ఇద్దరు ప్రధానులు సంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి దశలో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం.. ఇందుకు అవసరమైన నిధులపై మోదీ-అబే చర్చించారు. మోదీ: ఈ సదస్సుతో భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడనున్నాయి. అపెక్ సభ్యత్వం విషయంలో సహకరించిన అబేకు కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ శాశ్వత సభ్యత్వం సాధిస్తాం. ప్రపంచ శాంతి, భద్రత విషయంలో కొత్త భాగస్వామ్యానికి జపాన్‌తో పౌర అణుశక్తి సహకార ఒప్పందం తోడ్పడుతుంది. రక్షణ రంగంలో చేసుకున్న ఒప్పందాలు ఇరు దేశాల సైన్యం పరస్పర సహకారానికి కీలకం. ఈ సదస్సులో వివిధ విభాగాల్లో ప్రత్యేక భాగస్వామ్యానికి గుర్తుగా జపాన్ పౌరులకు మార్చి 1 2016 నుంచి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించనున్నాం అబే: ‘మేకిన్ ఇండియా’కు సహకారం అందించేందుకు 12 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేశాం. జపాన్ తయారీరంగ కంపెనీలు భారత్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ నిధులను వినియోగిస్తాం. దీంతోపాటు విదేశీ అభివృద్ధి సాయం (ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ టు ఇండియా) కింద భారత్‌కు మరో 5 బిలియన్ డాలర్లు అందిస్తాం. భారత్‌లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులతోపాటు.. 13 జపాన్ పారిశ్రామిక వాడల (జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్స్) అభివృద్ధికి సహకరిస్తాం. భారత్-జపాన్ మధ్య జరిగిన 16 ఒప్పందాలు: 1. శాంతియుత వినియోగానికి పౌర అణుశక్తి సహకార ఒప్పందం 2. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం 3. రక్షణ రంగంలో పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మార్పునకు ఒప్పందం 4. పరస్పర మిలటరీ సమాచారం మార్పిడి చేసుకునే ఒప్పందం 5. రెండు దేశాల మధ్య డబుల్ టాక్సేషన్ తొలగింపు ఒప్పందం 6. భారత రైల్వేలు, జపాన్ మౌలిక వసతుల మంత్రిత్వ శాఖల మధ్య సహకార ఒప్పందం 7. భారత్‌లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత రైల్వే వ్యవస్థకోసం జపాన్ రైల్వే మంత్రిత్వ శాఖతో ఒప్పందం 8. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల పరస్పర సహకారం. 9. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు యువ పరిశోధకుల పరస్పర మార్పును సహకారం. 10. భారత సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ విభాగం, జపాన్ ఆరోగ్య శాఖ మధ్య సహకారం. 11. ఇరు దేశాల మానవ వనరుల మంత్రిత్వ శాఖల మధ్య సంస్కృతి, క్రీడలు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం 12. నీతి ఆయోగ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ ఆఫ్ జపాన్ మధ్య ఒప్పందం 13. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తోయామా ప్రిఫెక్షర్ మధ్య పరస్పర సహకార ఒప్పందం 14. కేరళ ప్రభుత్వం, జపాన్‌లోని మూడు నగరాల మేయర్ల మధ్య అభివృద్ధి ఒప్పదం. 15. ఐఐఎం అహ్మదాబాద్, జపాన్ నేషనల్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలసీ మధ్య ఒప్పందం 16. భారత పర్యావరణ శాఖ, జపాన్ వ్యవసాయ, అటవీ శాఖ మధ్య సహకారం. -
బుల్లెట్ రైలు ప్రాజెక్టు జపాన్‌కే
ఢిల్లీ: చైనాను వెనక్కి నెట్టి మరీ భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును జపాన్ చేజిక్కించుకుంది. ఈ ప్రాజెక్టుపై చైనా భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ భారత్ జపాన్ టెక్నాలజీకే మొగ్గు చూపింది. ఈ మేరకు బుధవారం క్యాబినెట్ 98,000 కోట్ల భారీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. జపాన్ ప్రధాని షిజో అబే భారత పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించే అవకాశం ఉంది. షింజో అబే శుక్రవారం మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు రానున్నారు. చైనా ఈ ప్రాజెక్టు మీద ఆసక్తి చూపినప్పటికీ.. డిజైన్, మేనేజ్మెంట్ లోపాలతో పాటు, గతంలో చైనాలోని వెన్జూ నగరంలో జరిగిన బుల్లెట్ రైలు ప్రమాదంలో 40 మంది మృతి చెందగా 200 మంది గాయపడ్డారు. ఇలాంటి లోపభూయిష్టమైన విధానాల మూలంగా భారత్.. చైనాపై ఆసక్తి చూపించనట్లు తెలుస్తోంది. అయితే చైనా మాత్రం ఈ ప్రాజెక్టు జపాన్ కు దక్కడంపై.. ఈ కాంట్రాక్టు చిన్న అంశమే అని పేర్కొంది. భారత్ లో పెట్టుబడులకు చైనాకు ఇంకా అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అరవింద్ పనగాడియా నేతృత్వంలోని కమిటీ జపాన్ రైల్వే 'షీన్కన్సేన్ సిస్టమ్' అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, సమయపాలన పాటిస్తున్నట్లు అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్టు మూలంగా ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 505 కిలోమీటర్ల దూర ప్రయాణం 7గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది. -
బుల్లెట్ ట్రైన్‌కు తొలి అడుగు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) సోమవారం తన నివేదికను రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు సమర్పించింది. ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 505 కిలోమీటర్ల దూర ప్రయాణం 7గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం కూడా అదే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ట్రాక్ నిర్మాణం, రైలు నిర్మాణానికి సుమారు రూ. 9880 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని జేఐసీఏ అంచనా వేసింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైలులో ప్రయాణం అత్యంత ఖరీదు అవుతుంది. ఈ నివేదికను పూర్తి అధ్యయనం చేసిన తరువాత ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తారని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
కొత్త ప్రాజెక్టులు కష్టమే!
- పాత వాటికే పెద్ద పీట - నేడు పార్లమెంటులో రైల్వే బడ్జెట్ - డీజిల్ ధరలు తగ్గినా చార్జీలు తగ్గవు.. పెంచే అవకాశాలూ ఉన్నాయ్ - పస్తుత ప్రాజెక్టులను పూర్తిచేయడానికే రూ. 1.82 లక్షల కోట్లు అవసరం - ఇక కొత్తగా ప్రాజెక్టులు, కొత్త రైళ్ల ప్రకటనపై ఆచితూచి అడుగులు - 2015-16 సంవత్సరానికి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్‌పై అంచనాలివీ న్యూఢిల్లీ: రైల్వే విభాగం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో.. రైల్వే బడ్జెట్లో ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీలను పెంచుతారా? కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారా లేక పాత వాటికే ప్రాధాన్యమిస్తారా? అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. రైల్వేమంత్రి సురేశ్ ప్రభు గురువారం ఉదయం పార్లమెంటులో 2015-16 ఆర్థిక సంవత్సర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ‘మేక్ ఇన్ ఇండియా’ చర్యలతో పాటు రైల్వేల్లో భద్రతా ప్రమాణాలను పెంచే ప్రతిపాదనలు ఉంటాయని భావిస్తున్నారు. సరుకు రవాణా చార్జీలతో వచ్చే ఆదాయం నుంచి రూ. 24,000 కోట్ల నిధులను.. ప్రయా ణ చార్జీల్లో వస్తున్న నష్టాన్ని భర్తీ చేసేం దుకు వినియోగిస్తున్న పరిస్థితుల్లో.. దీనిని తగ్గించేం దుకు ప్రభు కత్తి మీద సాము చేయా ల్సి ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. డీజిల్ ధరలు తగ్గినా.. చార్జీలు తగ్గించరు! 2012-13 సంవత్సరం వరకూ పదేళ్ల పాటు రైల్వే చార్జీలను పెంచలేదు. ఆ ఏడాది నాటి రైల్వేమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత దినేష్‌త్రివేది అన్ని తరగతుల ప్రయాణ చార్జీలనూ పెంచారు. అయితే.. సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత రావడంతో రెండో తరగతి, స్లీపర్ క్లాస్ చార్జీల పెంపును ఉపసంహరించాల్సి వచ్చింది. ఆ తర్వాతా ప్రయాణ చార్జీలు పెరిగాయి. గత ఏడాది జూలైలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి రైల్వే బడ్జెట్లో ప్రయాణ చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం పెంచారు. డీజిల్ ధరలు తగ్గిపోయినప్పటికీ.. రైల్వే చార్జీలను తగ్గించే అవకాశం లేదని రైల్వే సహాయమంత్రి మనోజ్‌సిన్హా ఇప్పటికే స్పష్టంచేశారు. వాస్తవానికి రైల్వే విభాగం 2013 నుంచి ఇంధన సర్దుబాటు వ్యయం(ఎఫ్ఏసీ) ఆధారంగా చార్జీలను సవరించే విధానాన్ని అనుసరిస్తోంది. ప్రస్తుతం డీజిల్ ధరలు తగ్గినప్పటికీ.. విద్యుత్ ధర నాలుగు శాతం పైగా పెరిగిందని.. కాబట్టి చార్జీలను తగ్గించే అవకాశం లేదని చెప్తున్నారు. ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రైవేట్‌కు బాట? ఇదిలావుంటే.. రైల్వే ఆమోదించిన మొత్తం ప్రాజెక్టులు 676 ఉన్నాయి. వీటి విలువ రూ. 1,57,883 కోట్లు. వీటిలో 317 ప్రాజెక్టులను మాత్రమే పూర్తిచేయగలిగారు. మిగతా 359 ప్రాజెక్టులను పూర్తిచేయాలంటే ఇప్పుడు రూ. 1,82,000 కోట్లు అవసరం. కీలకమైన ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు భారీగా నిధుల ప్రవాహం అవసరమైన నేపధ్యంలో.. సంస్కరణ వాదిగా చెప్పే సురేశ్ ప్రభు.. ప్రభుత్వ రంగ రవాణా సంస్థ అయిన రైల్వేల్లోకి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించేందుకు రోడ్ మ్యాప్ ప్రకటించే అవకాశముంది. అలాగే భారీగా నిధుల కొరత ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కొత్త రైళ్లు, కొత్త ప్రాజెక్టులను ప్రకటించే విషయంలోనూ రైల్వేమంత్రి ఆచితూచి అడుగువేస్తారని చెప్తున్నారు. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాజెక్టులు.. పూర్తికావచ్చిన కొత్త లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులకు మాత్రమే నిధులు కేటాయించవచ్చని తెలుస్తోంది. రానున్న 2015-16కు కేంద్రం నుంచిరూ. 50,000 కోట్ల మేర బడ్జెటరీ మద్దతు కోరిన రైల్వేశాఖ.. రైల్వే భద్రత నిధి కింద మరో రూ. 20,000 కోట్లు కేటాయించాలని కేంద్ర ఆర్థికశాఖకు విజ్ఞప్తిచేసింది. రైల్వే ప్రమాదాలకు ప్రధాన కారణంగా ఉన్న మానవరహిత లెవల్ క్రాసింగ్లను తొలగించేందుకు ఈ నిధులు ఉపయోగిస్తామని చెప్తోంది. అలాగే.. రైల్వేల ఆదాయ వనరులను పెంచుకునేందుకు.. చార్జీలు కాకుండా కొత్త మార్గాలను అన్వేషించేందుకు ప్రభు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. వాణిజ్యప్రకటనల నుంచి ఆదాయాన్ని పెంచుకోవటం, అదనపు భూమిని వినియోగించుకోవటం తదితరాలు ఉంటాయని చెప్తున్నారు. ‘బుల్లెట్ రైలు’కు ప్రాధాన్యం... దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడతామన్న ఎన్డీఏ సర్కారు హామీకి అనుగుణంగా.. ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య తలపెట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, ప్రతిపాదిత వజ్ర చతుర్భుజి మార్గంలో సర్వే కార్యక్రమాలపై సురేష్‌ప్రభు ప్రకటనలు చేసే అవకాశముంది. రైలు బోగీలోని క్రాంక్ షాఫ్టులు, ఆల్టర్నేటర్లు, ఫోర్జ్డ్ వీల్స్ వంటి చాలా పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవటానికి బదులుగా.. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో భాగంగా దేశంలోనే తయారు చేసేందుకు చర్యలు ప్రకటించవచ్చు. అలాగే.. ప్రయాణికుల సౌకర్యార్థం 100 రైళ్లలో పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేయటం, దాదాపు 100 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి, రైల్వే స్టేషన్లలో సౌకర్యాల పెంపు, ఇంటర్-సిటీ సర్వీసుల్లో ఏసీ బోగీల ఏర్పాటు, ఏసీ డెము రైళ్లను ప్రవేశపెట్టటం వంటి పలు చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి: ప్రభు రైల్వేలు కష్ట కాలం ఎదుర్కొంటున్నప్పటికీ.. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను నెరవేర్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని రైల్వేమంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతున్న మంత్రి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా వివిధ వర్గాల నుంచి కొత్త రైళ్లు, కొత్త లైన్లు, కొత్త ప్రాజెక్టుల కోసం డిమాండ్లు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వేబడ్జెట్‌ను ఖరారు చేసే ముందు ఆయన పారిశ్రామిక ప్రతినిధులతో కూడా సమావేశమయ్యారు. -
పుణే-ముంబై ‘బులెట్’ మరింత జాప్యం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే-ముంబై మహానగరాల మధ్య తలపెట్టిన బులెట్ రైలు ఇప్పట్లో కదిలే పరిస్థితులు కనిపించడం లేదు. పుణే-ముంబై-అహ్మదాబాద్ మధ్య బులెట్ రైలును నడపాలని తొలుత ప్రతిపాదించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రాజెక్టుకే రైల్వే విభాగం పచ్చజెండా ఊపింది. దీంతో ఇప్పట్లో పుణేకు బులెట్ రైలు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. పుణేకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలంతా బీజేపీకి చెందిన వారే. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. దీంతో తమ బులెట్‌రైలు కల నెరవేరుతుందనుకున్న నగరవాసుల ఆశలు ఆవిరయ్యాయి. దేశంలోని వాణిజ్య, పర్యాటక హబ్‌లు, పుణ్యక్షేత్రాలను కలిపేందుకు 10 సంవత్సరాల క్రితం భారతీయ రైల్వే ఆరు కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే ఈ బులెట్ రైలును ప్రస్తావించింది. 2006లో పుణే-ముంబై-అహ్మదాబాద్ రైలు మార్గంపై సర్వే నిర్వహించారు. ఈ మార్గంలో ఈ బులెట్ రైలును నడపడం లాభదాయకంగా ఉంటుందని సర్వే నిర్వహించిన సంస్థ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదించింది. 2009లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 55,800 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఈ రైలులో ప్రయాణించవచ్చని అంచనా. ఇదిలాఉంచితే కేంద్ర ప్రభుత్వం పుణే ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బులెట్‌కు పచ్చ జెండా ఊపింది. మధ్య రైల్వే పుణే జనసంపర్క్ అధికారి వై.కే. సింగ్ మాట్లాడుతూ పుణే-ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య పూర్తి సర్వే జరగలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టాల్సి ఉందని అన్నారు. గుజరాత్ రాష్ట్రం ముంబై-అహ్మదాబాద్‌ల రైలు విషయమై ప్రత్యేక శ్రద్ధను కనబరచడంతో ఈ రైలుకు అనుమతి లభించిందని చెప్పారు. ఈ రైలు ప్రస్తుతం పశ్చిమ రైల్వే అహ్మదాబాద్ డివిజన్ పరిధిలో ఉందన్నారు. ఇదే విషయమై పుణే-ముంబై ప్రయాణికుల గ్రూపు సంఘం అధ్యక్షుడు హర్ష మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఈ రైలు కోసం తీవ్రంగా కృషి చేయాల్సి ఉందన్నారు. -
బుల్లెట్ కదిలేనా?
చెన్నై - బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రైల్వే మార్గంలో వంద చోట్ల ట్రాక్ వంపులు తిరిగి ఉండడం, లెవల్ క్రాసింగ్స్ సమస్య నెలకొంది. కొత్త ట్రాక్‌కు కోట్లు కుమ్మరించాల్సిన దృష్ట్యా, అందుకు తగ్గ లాభాలు వచ్చేనా అన్న మీమాంసలో రైల్వే వర్గాలు ఉన్నాయి. సాక్షి, చెన్నై : చెన్నై - బెంగళూరు మీదుగా మైసూర్ వరకు అతి వేగంతో వెళ్తే బుల్లెట్ రైలును నడిపేందుకు కేంద్ర రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ప్రకటన గత ఏడాది రైల్వే బడ్జెట్ ద్వారా వెలువడింది. 160 కి.మీ.కన్నా అత్యధిక వేగంతో దూసుకెళ్లే ఈ రైలు సేవలు సాధ్యమా అన్నది తేల్చేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. చైనాకు చెందిన నిపుణులతో పాటుగా రైల్వే యంత్రాంగంలోని ప్రత్యేక అధికారుల బృందం రెండు నెలలుగా పరిశీల నలో మునిగిపోయారు. ఈ పరిశీలన ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో పాత ట్రాక్‌లో బుల్లెట్ రైలు పట్టాలెక్కేది అనుమానమేనన్న భావన ఈ బృందం వ్యక్తం చేసినట్లు సమాచారం. పట్టాలెక్కేనా?: ఈ బృందం పరిశీలన మేరకు చెన్నై - బెంగళూరు - మైసూర్ మార్గంలో బుల్లెట్ రైలు పట్టాలెక్కించాల్సి ఉంది. చెనై నుంచి బెంగళూరుకు ఉన్న రైల్వే మార్గాన్ని ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రస్తుతం చెన్నై నుంచి బెంగళూరుకు ఉన్న రైల్వే ట్రాక్‌ల సామర్థ్యాన్ని ఆరా తీసింది. ట్రాక్‌లు పటిష్టంగా ఉన్నా, మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ బృందం పరిగణించింది. ఈ మార్గంలో బెంగళూరు వరకు వంద చోట్ల వంపులు ఉండడం, లెవల్ క్రాసింగ్స్ మరిన్ని ఉండడం వెలుగు చూసింది. ఈ వంపులు ఐదు డిగ్రీల కోణంలో వంగి ఉండడంతో వాటిని సరి చేయాలంటే శ్రమతో కూడుకున్న పనిగా తేల్చారు. అతి వేగంగా దూసుకెళ్లే బుల్లెట్ రైలు మార్గంలో వంపులు, లెవల్ క్రాసింగ్‌లు ఉంటే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువే. ఈ దృష్ట్యా, పాత ట్రాక్‌ను పక్కన పెట్టి, కొత్తగా బుల్లెట్ రైలు కోసం ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకు కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. కిలో మీటరు దూరానికి రూ.200 కోట్లు చొప్పున ఖర్చు పెట్టాల్సి రావడంతో పాటుగా ఈ పనులు ముగియడానికి కొన్నేళ్లు పట్టడం ఖాయం అన్న అభిప్రాయానికి వచ్చారు. స్థల సేకరణ సమస్య తప్పదని ఈ బృందం పరిశీలనలో స్పష్టమైంది. ఈ బృందం తన పరిశీలన ప్రక్రియను ముగించి ఫిబ్రవరిలో నివేదికను కేంద్ర రైల్వే యంత్రాంగానికి సమర్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్రం బుల్లెట్ రైలును పట్టాలెక్కించేది లే నిది తేలనుంది. ఈ విషయంగా ఆ బృందంలోని ఓ అధికారి పేర్కొంటూ, పాత ట్రాక్‌లో బుల్లెట్ రైలు సాగేది అనుమానమేనని పేర్కొన్నారు. కొత్త ట్రాక్ ఏర్పాటు చేయాల్సి వస్తే అందుకు కోట్లు కుమ్మరించాల్సి ఉంటుందని, అందుకు తగ్గ లాభాన్ని రైల్వే శాఖ ఆర్జించే అవకాశాలు తక్కువేనన్నారు. కోట్లాది రూపాయల నిధుల్ని కేంద్రం మంజూరు చేసేది అనుమానమేనని, ఈ దృష్ట్యా, ఆ మార్గంలో బుల్లెట్ ట్రాక్ ఎక్కేది డౌటేనని పేర్కొనడం గమనార్హం. -
ఐఐటీలో 'బుల్లెట్' కోర్సు
కొల్కతా: ఖరగ్‌పూర్ ఐఐటీలో బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ కోర్సు ప్రారంభిస్తున్నట్లు ఇన్చార్జ్ ప్రొఫెసర్ సుబ్రన్షు రాయ్ శుక్రవారం కొల్‌కత్తాలో వెల్లడించారు. ఏ ఏడాది చివరి నాటికి ఈ కోర్సు రూపకల్పన పూర్తి అవుతుందని... ఆ వెంటనే కోర్సును ప్రారంభిస్తామని చెప్పారు. అందుకు భవనాల నిర్మాణం కోసం రైల్వే పరిశధన కేంద్రం (సీఆర్ఆర్) రూ. 20 కోట్లు కేటాయించిందని తెలిపారు. మరో ఆరు నెలలో ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అలాగే రైల్వే రంగంలో నాలుగు కీలక అంశాలపై కూడా పరిశోధనలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా రైల్వేలో స్వదేశీ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రాయ్ విశదీకరించారు. ఇప్పటికే క్యాంపస్‌లోని ఐఐటీయన్లు హైస్పీడ్ ట్రైన్ బోగిలో టెక్నాలజీపై పని చేస్తున్నారని తెలిపారు. అలాగే రైల్వే టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధి కోసం రైల్వే శాఖ మరో రూ. 20 కోట్లు మంజురు చేసిందని రాయ్ వెల్లడించారు. -
ఇతర రాష్ట్రాలకు తరలిపోయేనా?
అగమ్యగోచరంగా మారిన బులెట్ రైలు ప్రాజెక్టు భవితవ్యం సాక్షి, ముంబై: ప్రతిపాదిత ముంబై-అహ్మదాబాద్ బులెట్ రైలు టెర్మినస్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అందుకు అవసరమైన స్థలమిచ్చేందుకు ముంబై మహానగర ప్రాంతీయ అభివద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెమ్మార్డీయే తన పట్టువిడవని పక్షంలో ఈ రెండు నగరాల మధ్య బులెట్ రైలు నడపడం సాధ్యం కాదని రైల్వే పరిపాలనా విభాగం స్పష్టం చేసింది. వ్యాపార లావాదేవీల కోసం ప్రతిరోజూ ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య అనేకమంది రాకపోకలు సాగిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును ఈ రెండు నగరాల మధ్య ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నామని రైల్వేశాఖ స్పష్టం చేసింది. అయితే టెర్మినస్ నిర్మాణం కోసం అవసరమైన స్థలమిచ్చేందుకు ఎమ్మెమ్మార్డీయే అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రాంతాలను వెతుక్కోవాల్సి ఉంటుందని తెలిపింది. బీకేసీలో స్థలాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ.వేల కోట్లు విలువచేసే స్థలాన్ని టెర్మినస్ కోసం ఇవ్వడం కుదరదంటూ ఎమ్మెమ్మార్డీయే తేల్చిచెప్పిన విషయం విదితమే. దీంతో బాంద్రా రైల్వే స్టేషన్‌కు, టెర్మినస్‌కు ఆనుకుని ఉన్న తమ సొంత స్థలాల్లో బులెట్ రైలు టెర్మినస్‌ను నిర్మించాలని రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. అయితే ఆ స్థలం అనుకూలంగా లేకపోవడమేకాకుండా సానుకూలంగా ఉండదని భావించి..బీకేసీలోనే స్థలం కావాలని డిమాండ్ చేస్తోంది. ఈ స్థలమిస్తే తీవ్రంగా నష్టపోతామని భావించిన ఎమ్మెమ్మార్డీయే అందుకు నిరాకరిస్తోంది. టెర్మినస్ నిర్మాణానికి అవసరమైన స్థలమిచ్చేందుకు ఎమ్మెమ్మార్డీయే నిరాకరించడంతో ఈ ప్రాజెక్టు భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ రైల్వే అధికారులు త్వరలో సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ కానున్నారు. అప్పటికీ ఎమ్మెమ్మార్డీయే తన పం తాన్ని వీడని పక్షంలో ఈ ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించడం తప్ప మరో మార్గం లేదని రైల్వే అధికార వర్గాలు స్పష్టం చేశాయి. -
బాంద్రాలోనే బులెట్ రైలు టెర్మినస్!
సాక్షి, ముంబై: ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రవేళపెట్టనున్న ప్రతిపాదిత బులెట్ రైలు టెర్మినస్ నిర్మాణం బాంద్రా-కుర్లా కాంప్లెక్ (బీకేసీ)లోనే జరగనుందని దాదాపు ఖరారైంది. దీనికి సమీపంలో ఉన్న రైల్వే స్థలాల్లో బులెట్ రైలు టెర్మినస్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. బులెట్ రైలు టెర్మినస్ కోసం బీకేసీలో ఉన్న స్థలాన్ని ముంబై మహానగరం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) ఇచ్చేందుకు ఇటీవల నిరాకరించిన విషయం తెలిసిందే. ఇక్కడ స్థలాల ధరలు మండిపోతున్నాయి. దీంతో రూ.వేల కోట్లు విలువచేసే స్థలాన్ని టెర్మినస్ కోసం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. అంతేగాకుండా ఇక్కడి స్థలం రైల్వేకిస్తే తమ ఆదాయానికి గండిపడుతుందని, అందుకు రైల్వే సొంత స్థలాల్లో టెర్మినస్ నిర్మించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా లేఖ పంపించింది. దీంతో టెర్మినస్ నిర్మాణం వివాదాస్పదంగా మారింది. కాని బాంద్రా రైల్వే స్టేషన్‌కు, టెర్మినస్‌కు ఆనుకుని రైల్వే సొంత స్థలాలున్నాయి. అక్కడ బులెట్ రైలు టెర్మినస్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఉన్న 546 కి.మీ దూరాన్ని 1.52 గంటల సమయంలోనే చేరుకోవచ్చు. అందుకు రూ.50 వేల కోట్లు ఖర్చవుతుండవచ్చని అంచనవేశారు. బీకేసీకి సమీపంలో బాంద్రా రైల్వే స్టేషన్, టెర్మినస్ పరిసరాల్లో రైల్వేకు సొంత స్థలాలున్నాయి. అయినప్పటికీ రైల్వే పరిపాలన విభాగం ఎమ్మెమ్మార్డీయే స్థలంపైనే కన్నేసిందని ఆ సంస్థ అదనపు కమిషనర్ సంజయ్ సేఠీ అన్నారు. ఇక్కడి స్థలాలు చుక్కలను తాకుతున్నాయి. వేల కోట్లు విలువచేసే స్థలాన్ని రైల్వేకు ఉచితంగా అందజేస్తే ఎమ్మెమ్మార్డీయేకు భారీ నష్టం వాటిల్లుతుందని సేఠీ తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వేకు బీకేసీలోని స్థలాన్ని ఇచ్చేందుకు నిరాకరించినట్లు ఆయన వెల్లడించారు. -
బులెట్ రైలుకు ప్రాజెక్టుకు ఆదిలోనే బ్రేకు?
టెర్మినల్ నిర్మాణం కోసం స్థలమిచ్చేందుకు ఎమ్మెమ్మార్డీయే విముఖత సాక్షి, ముంబై: ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య బులెట్ రైలు ప్రవేశపెట్టాలనే ప్రధాని నరేంద్ర మోదీ కలలు కన్న కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చే సూచనలు కనిపించడం లేదు. బులెట్ రైలు టెర్మినస్ నిర్మాణం కోసం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న స్థలమిచ్చేందుకు ముంబై మహానగర ప్రాంతీయ అభివద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) సిద్ధంగా లేదు. దీంతో ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర రైల్వే మంత్రాలయ చేస్తున్న ప్రయత్నాలకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య బులెట్ రైలు ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన చాలా కాలం నాటిదే. అయినప్పటికీ కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రైల్వే పరిపాలనా విభాగం బడ్జెట్లో బులెట్ రైలుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అంతేకాకుండా ప్రతిపాదిత బులెట్ రైలు ట్రేన్పై సాధ్యాసాధ్యాలు, అందుకయ్యే వ్యయం తదితర అంశాలపై నివేదిక ను రూపొందించే బాధ్యతలను రైట్ కన్సల్టెంట్, జపాన్ ఇంటర్నేషనల్ కో-అపరేషన్ ఏజన్సీలకు అప్పగించింది. ఈ మేరకు రూపొందించిన తుది నివేదిక ఇటీవల రైల్వే మంత్రాలయతోపాటు, రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో ముంబై-అహ్మదాబాద్ వయా ఠాణే 495.5 కి.మీ. పొడవైన ఈ మార్గంపై రైలు పరుగులు తీయాలంటే స్టాండర్డ్ గేజ్ అవసరమని పేర్కొంది. బీకేసీ మైదానంలో భూగర్భంలో 20 మీటర్ల పొడవైన టెర్మినల్ నిర్మించి అక్కడి నుంచి మెట్రో, పశ్చిమ, సెంట్రల్ రైల్వే మార్గాలతో జోడించాలని నిర్ణయించింది. ఇందుకోసం బీకేసీలో ఉన్న స్థలమివ్వాలని రైల్వే శాఖ కోరింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బులెట్ రైలు ప్రాజెక్టు విషయమై ఎమ్మెమ్మార్డీయేతో చర్చించారు. అయితే ఈ ప్రతిపాదనను ఎమ్మెమ్మార్డీయే తిరస్కరించింది. తమ వైఖరిని కేంద్రంతోపాటు రైల్వే శాఖకు తెలియజేసింది. నగరంలో స్థలాల రేట్లు చుక్కలను తాకుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని బీకేసీలో స్థలాన్ని ఇచ్చేందుకు అథారిటీ వెనకడుగు వేసింది. ఎమ్మెమ్మార్డీయేకి బీకేసీలోనే అత్యంత విలువైన స్థలాలున్నాయి. రైల్వే వద్ద కూడా సొంత స్థలాలున్నాయి. అందులోనే బులెట్ రైలు టెర్మినల్ ను నిర్మించుకోవాలని సూచించింది. తమ సొంత స్థలాలు ఇచ్చేందుకు వీలుపడదని లేఖ ద్వారా స్పష్టం చేసింది. దీంతో ఇరు ప్రధాన నగరాల మధ్య ప్రవేశపెట్టనున్న బులెట్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన అటకెక్కే ప్రమాదం తలెత్తింది. అయినప్పటికీ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తే తప్ప ఈ ప్రాజెక్టు గాడినపడే అవకాశాలు లేవు. -
ఆర్నెల్లకోసారి జపాన్ టూర్
* ఏపీ రాయబారులు, జపాన్‌లో కార్యాలయం, చంద్రబాబు నాయుడు, బుల్లెట్ రైలు * జపాన్‌లోని తెలుగువారితో చంద్రబాబు వెల్లడి * ఏపీకి రాయబారులుగా వ్యవహరించాలని వారికి పిలుపు * ఏపీ ప్రభుత్వం తరఫున జపాన్‌లో కార్యాలయం తెరుస్తాం * జపాన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన * ఏపీ సీఎం బృందం.. పర్యటన విజయవంతం: కంభంపాటి సాక్షి, హైదరాబాద్: ఆరు నెలలకోమారు జపాన్ను సందర్శిస్తానని, మరో 15 రోజుల్లో ఒక ప్రతినిధి బృందం ఏపీ నుంచి జపాన్‌లో పర్యటించి పెట్టుబడులకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జపాన్‌లో పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణమయ్యే ముందు.. అక్కడి తెలుగువారు ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ జపాన్‌లో ఉన్న తెలుగువారు ఆంధ్రప్రదేశ్‌కు రాయబారులుగా వ్యవహరించాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. త్వరలో జపాన్‌లో ఏపీ ప్రభుత్వం తరఫున ఒక కార్యాలయం ఏర్పాటు చేసి పెట్టుబడులను రాబట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.విద్య, వైద్యం తదితర రంగాల్లో వ చ్చే మార్పులను తనకు మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపాలని అక్కడి తెలుగు వారిని కోరారు. రాష్ట్రంలో బుల్లెట్ రైలును ప్రవేశ పెడతామని, జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడులు పెట్టే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. భారత్‌కు బయలుదేరే ముందు బాబు టోక్యోలోని నరిటా విమానాశ్రయాన్ని సందర్శించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ సి.ఎం.రమేశ్, జపాన్‌లో భారత రాయబారి దీపాగోపాలన్ వాద్వాపాల్గొన్నారు. రాష్ట్రానికి తిరిగి వచ్చిన బాబు బృందం... ఆదివారం అర్ధరాత్రి జపాన్ బయలుదేరి వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలో 19 మంది మంత్రు లు, పారిశ్రామికవేత్తల బృందం శనివారం రాత్రి హైదరాబాద్ నగరానికి తిరిగొచ్చింది. జపాన్ రాజధాని టోక్యోలో భారత కాలమానం ప్రకా రం ఉదయం నాలుగు గంటలకు బయలుదేరిన ఈ బృందం హాంకాంగ్ మీదుగా అర్ధరాత్రి 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుం దని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయ వర్గాలు తొలుత వెల్లడించాయి. అయితే సీఎం బృందం సాయంత్రం ఆరు గంటలకే ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు స్వాగతం పలికారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న బాబు అక్కడి నుంచి నేరుగా గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ భారత వైద్య మండలి మాజీ చీఫ్ కేతన్‌దేశాయ్ నివాసంలో జరిగే ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు బేగంపేటలో అధికారులు స్వాగతం పలికారు. పర్యటన విజయవంతం: కంభంపాటి సీఎం నేతృత్వంలో చేపట్టిన జపాన్ పర్యటన విజయవంతమైందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు పేర్కొన్నారు. మంత్రి పి. నారాయణ, ఎంపీ సీఎం రమేశ్‌లతో కలిసి ఆయన ఢిల్లీ విమానాశ్ర యంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో అటోమొబైల్, టెక్స్టైల్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. -
బుల్లెట్ ట్రైన్లో చంద్రబాబు!
-
కోస్టల్ కారిడార్‌కు ప్రణాళిక సిద్ధం
విశాఖ-చెన్నై మధ్య ఏప్రిల్ నుంచే ప్రారంభం అడ్డంకిగా మారనున్న భూ సేకరణ విశాఖ-చెన్నై మధ్య బుల్లెట్ ట్రైన్? బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా జలరవాణాకు పరిశీలన హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విశాఖపట్నం-చెన్నై కారిడార్ ప్రాజెక్టు 2015 ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) కారిడార్ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. కారిడార్‌లో మెగా టూరిజం ప్రాజెక్టులు, పోర్టుల అభివృద్ధి, పెట్రో కెమికల్ ఇండస్ట్రీలు, ఎల్ఎన్జీ టెర్మిన ళ్లు, పవర్ ఆధారిత పరిశ్రమలపై ఇప్పటికే ఓ బ్లూ ప్రింటును కూడా రూపొందించింది. పోర్టుల నుంచి జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉండేలా రేడియం రోడ్లు, 6 లేన్ల రహదారులు నిర్మించనున్నారు. 975 కి.మీ. పొడవున్న కోస్తా తీర ప్రాంతం టూరిస్ట్ హబ్‌గా రూపొందించేందుకు వీలుగా బీచ్ రిసార్ట్స్, క్లబ్ హౌసెస్, హౌస్ బోట్స్ తదితరాలతో అందమైన పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దనున్నారు. అంతేకాకుండా బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా జలరవాణాకు అనుకూలంగా చేయనున్నారు. ఇందుకు 421.55 కి.మీ. పొడవున్న బకింగ్‌హామ్ కాలువను కాకినాడ నుంచి చెన్నైలోని విల్లుపురం వరకు జలరవాణాకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ఏడీబీ సూచించింది. విశాఖ-చెన్నై నడుమ బుల్లెట్ ట్రైన్ నడిపేందుకు అనువుగా రైలు మార్గంపై అధ్యయనం చేయాలని రైల్వేకు లేఖ కూడా రాసింది. దక్షిణాసియాకు ప్రధాన వ్యాపార కేంద్రం కోస్టల్ కారిడార్‌లో తొలుత పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, సౌకర్యాల కంటే పారిశ్రామిక జోన్ల ఏర్పాటుకు ప్రాధాన్యతిచ్చి పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఏడీబీ ప్రణాళికలు రూపొందించింది. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, అనంతపురం, ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఐదు పారిశ్రామిక జోన్ల ఏర్పాటుకుగాను రూ.15,320 కోట్లను అందించేందుకు ఏడీబీ సంసిద్ధత వ్యక్తం చేసింది. పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసి జపాన్, చైనా, దక్షిణ కొరియా, యూరప్‌ల నుంచి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన ప్రతిపాదనలను కూడా ఏడీబీ అందించింది. 1.50 లక్షల ఎకరాల భూమి అవసరం కోస్టల్ కారిడార్‌లో ఏర్పాటు చేయనున్న పారిశ్రామిక జోన్లకు మొత్తం 1.50 లక్షల ఎకరాల భూమి అవసరమవుతుందని గతంలోనే నిర్ణయించారు. ప్రధానంగా రాజమండ్రి, భీమవరం, నూజివీడు, విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేటల మీదుగా వెళుతుంది. ఆయా ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు గాను పెద్ద మొత్తంలో భూమి అవసరం కానుంది. భూసేకరణ ఇక్కడ ప్రధాన అడ్డంకిగా మారనుంది. ఈ కారిడార్‌లో విజయవాడ, గుంటూరు ప్రాంతాలుండటం, ఇక్కడే రాజధాని నిర్మాణానికి అవసరమైన భూ సమీకరణ జరగనుండడంతో మరల పారిశ్రామిక జోన్లకు భూ సేకరణ ఎంతమేరకు సాధ్యమన్నది ప్రశ్నగా మారింది. -
చెన్నైవాసులు సైకిల్ ప్రియులు
- దేశంలోనే ప్రథమ స్థానం - త్వరలో సైకిల్ ట్రాక్ చెన్నై, సాక్షి ప్రతినిధి: మానవుల ప్రయాణం ఆనాడు నడకతో ప్రారంభమై నేడు బుల్లెట్ ట్రైన్లకు చేరుకున్న దశలో సైతం చెన్నై నగరవాసులు సైకిల్ వినియోగంలో నెంబర్‌వన్‌గా నిలిచి ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకప్పుడు గమ్యం ఎంత దూరమైనా సగటు మానవుడు కాలినడకనే ఎంచుకున్నాడు. కలక్రమేణా గుర్రపు బగ్గీలు, బండ్లు అందుబాటులోకి వచ్చినా ఆ వాహనాలు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండేవి. క్రమేణా సైకిళ్లు ప్రవేశించాయి. ఆ తరువాత వ్యక్తిగత ప్రయాణంలో సైకిళ్ల స్థానంలో మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, కార్లు వాడుకలోకి వచ్చాయి. దేశంలోని ముంబయి, డిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో రోజు రోజుకూ మోటార్ సైకిళ్లు, కార్ల సంఖ్య పెరిగిపోతోంది. ఆ నగరాల్లో రానురానూ సైకిల్ కనుమరుగై పోతుండగా, మోటార్ సైకిల్ లేని ఇళ్లు ఉండవంటే అతిశయోక్తి కాదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయా నగరాలతో పోలిస్తే చెన్నై నగరంలో సైకిల్ వాడకం ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. 2001లో 46 శాతం మంది సైకిళ్లు వాడుతుండగా అది క్రమేణా తగ్గుతూ 2011 నాటికి 37 శాతానికి చేరింది. అయినా ఇతర నగరాల కంటే అధికమనే సత్యమని వెల్లడైంది. పూనే 33 శాతం, డిల్లీ 31 శాతం, హైదరాబాద్, కోల్‌కతా 26 శాతం, బెంగళూరు 23 శాతం, ముంబై 9 శాతం సైకిల్ వినియోగం ఉన్నట్లు తేలింది. వేగంగా గమ్యం చేరుకోవాలంటే మోటార్ సైకిల్ లేదా కారును ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా ఆరోగ్య పరిరక్షణకు నడక లేదా సైకిల్ తొక్కడం అవసరమనే స్పృహ చెన్నైవాసులకు అత్యధికమని సర్వేలో తేటతెల్లమైంది. ఇతర నగరాల్లో సైతం వ్యాయామాన్ని దృష్టిలో ఉంచుకుని సైకిల్ పట్ల ఆసక్తి ఉన్నా సైకిల్ ప్రయాణికులు వెళ్లేందుకు అవసరమైన ప్రత్యేక బాట లేకపోవడం కారణంగా దాన్ని వినియోగించడం లేదని తెలుస్తోంది. పూనేలో 134 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఉంది. అలాగే బెంగళూరులో 40, ముంబయిలో 13 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఉంది. నగరవాసుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చెన్నైలో సైతం సైకిల్ ట్రాక్‌ను నిర్మించే ఆలోచనలో కార్పొరేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. -
దూసుకెళ్లొచ్చు..
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య హై స్పీడ్ బుల్లెట్ ట్రేయిన్లు ప్రవేశపెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ కన్న కలలు త్వరలో సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన ఫైళ్ల కదలికలు వేగం పుం జుకున్నాయి. దేశంలో మొట్టమొదటి రైలు ఛత్రపతి శివాజీ టర్మినస్ (అప్పటి వీ.టీ.)-ఠాణేల మధ్య నడిచి చరిత్ర సృష్టించాయి. ఇప్పుడు మొట్ట మొదటి బుల్లెట్ ట్రేయిన్ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి ఠాణే మీదుగా అహ్మద్‌బాద్ వరకు పరుగులు తీయనుంది. ఈ హై స్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే 500 కి .మీ. ప్రయాణాన్ని కేవలం గంట న్నర లోపు అధిగమించవచ్చు. ఈ ప్రాజెక్టుకు సం బంధించిన తుది నివేదిక రైల్వే పరిపాలన విభాగం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.ఈ నివేదికపై ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం చర్చించనుంది. 2008లో ప్రతిపాదన ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రే యిన్ నడపాలని 2008లో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్లో ప్రకటించారు. ఆ ప్రకా రం ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య నడపాలని సంకల్పించారు. అందుకు అవసరమైన ఆర్థిక నివేదిక రూపొందించే బాధ్యతలు రైట్ కన్సల్టెంట్, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజన్సీ (జాయ్కా)కి అప్పగించారు. ఎప్పటి నుంచో ఆటకెక్కిన ఈ ప్రాజెక్టు నరేంద్ర మోడీ ప్రధాని కాగానే మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇటీవల ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కూడా ఈ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. తమ పదవి కాలంలోనే ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని మోడీ ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉంది. ఆ మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ పనులు మరింత వేగవంతం చేసింది. రైల్వేమార్గంలో మార్పు ముంబై-అహ్మదాబాద్ వయా ఠాణే మీదుగా 498.5 కి.మీ. దూరం ఉంది. ఈ రైళ్లను పశ్చిమ రైల్వే మార్గంలో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ట్రాక్‌పైనే నడపాలని ప్రారంభంలో ప్రతిపాదిం చారు. కానీ ఈ ట్రాక్‌పై బుల్లెట్ ట్రేన్లు నడపడం సాధ్యం కాదని గుర్తించారు. అందుకు స్టాండర్డ్ గేజ్‌తో కూడిన రెండు ట్రాక్‌లు అదనంగా వేయాల్సి ఉంటుందని నివేదికలో స్పష్టం చేశారు. ఈ రైళ్లను పశ్చిమ మార్గంలోని ముంబెసైంట్రల్ నుంచి నడపాలంటే అనేక కట్టడాలను నేలమట్టం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బీకేసీ నుంచి వయా ఠాణే-విరార్ మీదుగా అహ్మదాబాద్ వరకు నడపాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అందుకు బీకేసీ మైదానంలో 200 మీటర్ల మేర భూగర్భంలో బుల్లెట్ ట్రేన్ టర్మినస్ నిర్మించనున్నారు. దీన్ని మెట్రో, సెంట్రల్, పశ్చిమ రైల్వే మార్గాలతో కనెక్టివిటీ చేయనున్నారు. ఈ రైలుకు 8 నుంచి 16 వరకు బోగీలుం టాయి. వేగం గంటకు 300-350 కి.మీ. ఉంటుంది. 200 కి.మీ. ప్రయాణానికి రూ 1,000, 500 కి.మీ. ప్రయాణానికి రూ.1,500చార్జీలు ఉంటాయని అం చన వేశారు. బీకేసీ నుంచి బయలుదేరిన ఈ బుల్లెట్ ట్రేన్ మార్గంలో ఠాణే, విరార్, బోయిసర్, డహాణు రోడ్, వాపి, వల్సాడ్, బిలిమోరియా, భరూచ్, ఆణంద్, ఆహ్మదాబాద్ ఇలా స్టేషన్లు ఉంటాయి. -
పట్టాలపై నెత్తుటి చారిక!
ఈమధ్యనే బుల్లెట్ రైలును కలగనడం ప్రారంభించిన రైల్వే శాఖ చరి త్రలో ఇదొక నెత్తుటి పుట. కాపలాదారులేని లెవెల్ క్రాసింగ్‌లు జనం ప్రాణాలు తీస్తున్నాయని తెలిసికూడా దశాబ్దాల నుంచి పట్టనట్టుగా ఉండిపోయిన రైల్వేశాఖ నిర్లక్ష్యం సాక్షిగా గురువారం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 14 పసిమొగ్గలు రైలు పట్టాలపై నెత్తుటి ముద్ద లుగా మిగిలారు. ఇరవైమందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. పొద్దుటే హడావుడిగా నిద్రలేచి స్కూలుకు తయారై అమ్మానాన్నలకు టాటా చెప్పిన కొన్ని నిమిషాల్లోనే చోటుచేసుకున్న ఈ విషాదం కన్న వారినే కాదు... యావత్తు దేశ ప్రజలనూ తీవ్రంగా కలచివేసింది. ప్రమాదం జరిగిందని తెలిశాక రైల్వేశాఖ, సర్కారు స్పందించిన తీరు ఎంత యాంత్రికంగా ఉన్నదో గమనిస్తే...లోక్‌సభలో ఈ ఉదంతం ప్రస్తావనకొచ్చినప్పుడు రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ మాట్లాడిన మాటలు వింటే మళ్లీ మరో ప్రమాదం సంభవించబోదన్న భరోసా ఏమీ కలగదు. మరణించినవారి కుటుంబాలకు, గాయపడినవారికి పరిహారాన్ని ప్రకటించి, ప్రమాదంపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చి ఊరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్రమోడీ సంతాపం ప్రకటించారు. సదానందగౌడ కూడా విచారం వ్యక్తం చేశారు. కానీ, ఇవన్నీ సరిపోవు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే రైల్వేమంత్రి హుటాహుటీన ఘటనాస్థలికి రావాలి. వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని బాధిత కుటుంబాలకు సాంత్వన వాక్యాలు పలకాలి. తమ శాఖనుంచి జరిగిన వైఫల్యమేమిటో గమనించాలి. ఇవి చేసినంతమాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావన్నది నిజమే. తల్లడి ల్లుతున్న ఆ తల్లిదండ్రుల జీవితాల్లో నెలకొన్న విషాదం తొలగిపోద న్నదీ వాస్తవమే. కానీ, అలా చేయడంవల్ల రైల్వే శాఖ ఎంత సున్ని తంగా ఆలోచిస్తున్నదో, జరిగిన ఘటనపై ఆ శాఖ మంత్రిలో ఎంత ఆందోళన నెలకొనివున్నదో దేశానికి తెలుస్తుంది. భవిష్యత్తులో ఇక ఇలాంటివి పునరావృతం కాని విధంగా చర్యలుంటాయన్న విశ్వాసం ఏర్పడుతుంది. ఆ విశ్వాసాన్ని కలగజేయ డంలో సదానందగౌడ విఫలమయ్యారు. రైల్వే భద్రతపై నియమించిన అనేకానేక కమిటీల్లో ఒకటైన అనిల్ కకోద్కర్ కమిటీ నాలుగేళ్ల క్రితం ఇచ్చిన నివేదిక భద్రత విషయంలో తీసుకోవాల్సిన పలు చర్యలను సూచించింది. లెవెల్ క్రాసింగులను వెనువెంటనే తొలగించి వాటి స్థానంలో ఓవర్ బ్రిడ్జిలు, అండర్‌బ్రిడ్జిలు, సబ్‌వేలు నిర్మించాలన్నది అందులో ఒకటి. ఇందుకు రూ. 40,000 కోట్లు ఖర్చవుతాయని అంచనావేసింది. కాపలాదారులేనిచోట సరేగానీ...ఉన్నచోట ఇప్పుడ వుతున్న ఖర్చంతా ఆదా అవుతుందని, పైగా రైళ్లు నిరాఘాటంగా, వేగంగా వెళ్లడానికి వీలవుతుంది గనుక ఆ మేరకు ఇంధనం కలిసొ స్తుందని వివరించింది. వీటన్నిటి పర్యవసానంగా ఏడెనిమిదేళ్లలోనే ఈ వ్యయాన్ని రాబట్టుకోవచ్చునని తెలిపింది. కానీ, ప్రతి రైల్వే బడ్జెట్ లోనూ ఇందుకోసం కేటాయించే మొత్తం చాలా స్వల్పం. గత పదేళ్ల యూపీఏ పాలనలోనే క్షమార్హంకాని నిర్లక్ష్యం కొనసాగిందనుకుంటే... మొన్నటి ఎన్డీయే రైల్వే బడ్జెట్లో కూడా ఇలాంటి లెవెల్ క్రాసింగ్లను ఎత్తేయడానికి కేటాయించిన సొమ్ము రూ. 1,600 కోట్లు. దేశమంతా ఉన్న రైల్వే గేట్లను మార్చడానికి ఈ మొత్తం ఏమాత్రం సరిపోదు. ఒక్క దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే దాదాపు 1,200 రైల్వే గేట్లున్నాయని అంచనా. ఇందులో దాదాపు 500 గేట్లు గత నాలుగేళ్లలో తీసేయగ లిగారు. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలాదారును పెట్టడానికి కొన్ని లక్షలు ఖర్చవుతాయి. ఓవర్ బ్రిడ్జి లేదా సబ్వే నిర్మిస్తే రూ. 2 కోట్ల వరకూ వ్యయమవుతుంది. 2016 నాటికల్లా అన్ని లెవెల్ క్రాసింగ్ లనూ కాపలా గేట్లుగా మార్చాలన్న లక్ష్యం పెట్టుకున్నా బడ్జెట్లో చేసే కేటాయింపులు దానికి దీటుగా ఉండటంలేదు. చిత్రమేమంటే, రైల్వే శాఖ వైపునుంచి ఇంత నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కిమ్మనడంలేదు. ఇక కాపలాదారులున్న రైల్వే గేట్లవద్ద భద్రతకూడా అంత గొప్పగా ఏమీ లేదు. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా బాధ్యతను రైల్వేశాఖ ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పజెబుతోంది. 2001 నుంచి ప్రయాణికుల టిక్కెట్లపై భద్రతా సుంకం వసూలు చేస్తున్నారు. ‘అలా చేయడం ద్వారా మా బాధ్యతను పెంచుకుం టున్నాం’ అని ఆనాటి రైల్వే మంత్రి నితీష్‌కుమార్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పారు. కానీ, ఆచరణలో జరిగిందేమిటి? లెవెల్ క్రాసింగ్‌లు ఎప్పటిలానే ఉన్నాయి. వేల సంఖ్యలో ఉన్న కాలంచెల్లిన వంతెనలూ అలాగే ఉన్నాయి. నాసిరకం పట్టాలూ మారలేదు. వీటన్నిటినీ సరిచేయడానికి అవసరమైన కేటాయింపులు చేయడానికి బదులు తాజా బడ్జెట్లో బుల్లెట్ రైలు ప్రతిపాదనలు మాత్రం దూసుకొచ్చాయి. లోపాలన్నిటినీ యధాతథంగా ఉంచి బుల్లెట్ రైళ్లు నడిపినంత మాత్రాన మనకొచ్చే ఖ్యాతి ఏమీ ఉండదు. తమ పిల్లలు తమలాంటి జీవితం అనుభవించకూడదని, వారికి మంచి భవిష్యత్తు అందించాలన్న తపనతో తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి వేలకు వేలు ఖర్చుచేస్తున్నారు. పదుల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్వెంట్కు స్కూలు బస్సులో పంపితే పిల్లలు సురక్షితంగా ఉంటారన్న భరోసాతో మరింత సొమ్మును అదనంగా ఖర్చుచేస్తున్నారు. సరైన పర్యవేక్షణ, జాగ్రత్తలు తీసుకోలేని యాజ మాన్యం చివరకు తమకు కడుపుకోత మిగులుస్తుందని వారు ఊహిం చివుండరు. ఈ ఘటనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మేల్కొని లెవెల్ క్రాసింగ్‌ల విషయంలో కేంద్రంతో ఉమ్మడి పోరాటం చేయాలి. ఈ కృషిలో మిగిలిన రాష్ట్రాలను కూడా కలుపుకోవాలి. అలాగే, పాఠశాలలకు ఉదయమూ, సాయంత్రమూ ఆర్టీసీ బస్సులను తిప్పే అంశాన్ని పరిశీలించాలి. -
8 గంటల ప్రయాణం 4 గంటల్లోనే..
ముంబై: భారత్‌లో ఇక బుల్లెట్ రైళ్ల శకం ప్రారంభం కాబోతోంది. జపాన్, చైనా, అమెరికా, కెనడా, తైవాన్, బ్రిటన్, బ్రెజిల్ తదితర దేశాలు వినియోగిస్తున్న బుల్లెట్ రైళ్లు ఇక మనదేశంలోనూ దూసుకుపోనున్నాయి. రైలు ప్రయాణ సమయాన్ని సగానికి, సగం తగ్గించగలిగే హైస్పీడ్ నెట్వర్క్ బుల్లెట్ రైళ్లపై రైల్వే మంత్రి సదానంద గౌడ కొత్త రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పటికే సర్వే జరిగిన ముంబై-అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైలు సర్వీసును నడుపుతామని ఆయన ప్రకటించారు. ఈ ఒక్క బుల్లెట్ రైలు ప్రాజెక్టుకే రూ. 60వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్ట్‌కోసం తొలుత రూ. వందకోట్లు బడ్జెట్లో కేటాయించారు. బుల్లెట్ రైలు సర్వీసు ముఖ్యాంశాలు ఇవీ.. * ముంబై-అహ్మదాబాద్ మధ్య దూరం 520 కిలోమీటర్లు. రైలు ప్రయాణానికి ఇపుడు దాదాపు 8గంటలు పడుతుండగా, బుల్లెట్ రైళ్లలో, 3-4గంటల్లోనే గమ్యం చేరుకోవచ్చు. * ఈ కారిడార్‌లో స్టేషన్‌కు స్టేషన్‌కు మధ్య దూరం 50నుంచి 100కిలోమీటర్లు ఉంటుంది. * బుల్లెట్ రైలు దాదాపు 350కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. బుల్లెట్ రైళ్ల మార్గాలు మామూలు రైల్వే లైన్లకు సంబంధంలేకుండా ప్రత్యేకంగా ఉంటాయి. * ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌లో కిలోమీటర్ రైల్వే ట్రాక్ నిర్మాణానికి రూ. 15కోట్లు ఖర్చవుతుండగా, హైస్పీడ్ నె ట్‌వర్క్‌లో ట్రాక్ నిర్మాణానికి ఏకంగా రూ.125కోట్లు అవుతుంది. * ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్‌కు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జేఐసీఏ-జైకా) సహకరిస్తోంది. ప్రాజెక్ట్ ఆర్థిక అంశాలతోపాటుగా, సాంకేతిక పరిజ్ఞాన అంశాలపై కూడా జైకా అధ్యయనం జరుపుతుంది. వచ్చే ఏడాది జూన్‌కు నివేదిక జైకా తన నివేదిక అందజేస్తుంది. -
బుల్లెట్ రైలు వచ్చేస్తుందోచ్!
-
ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు
న్యూఢిల్లీ: ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలును ప్రవేశపెడతామని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. ఇపుడున్న రైళ్లకు కూడా హైస్పీడుకు పెంచుతామన్నారు. దీనివల్ల ప్రయాణ సమయాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ముందుగా ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు వస్తుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరిన్ని మార్గాల్లో వీటిని ప్రవేశపెడతామని తెలిపారు. ఇప్పటికే ఉన్న, కొత్తగా రాబోతున్న ఓడరేవులకు అనుసంధానంగా మరిన్ని రైలు మార్గాలను ఏర్పాటుచేస్తామన్నారు. ఇందుకోసం అవసరమైతే పీపీపీ పద్ధతిలో నిధులు సేకరిస్తామని చెప్పారు. బొగ్గు ఎక్కువగా లభించే ప్రాంతాలను కూడా రైల్వే పరిధిలోకి తెస్తామన్నారు. దీనివల్ల విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు త్వరగా అందుతుందని చెప్పారు. -
రైలు చార్జీలు పెంచే యోచన
ఉత్తమ సేవలందించాలంటే తప్పదన్న రైల్వే మంత్రి ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు రైల్వే బడ్జెట్ నాలుగు ‘ఎస్’లకు ప్రాధాన్యం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానందగౌడ దొడ్డబళ్లాపురం : ప్రయాణీకులకు ఉత్తమ సేవలందించాలంటే రైలు చార్జీలు పెంచినా తప్పులేదని, ప్రయాణీకులు కూడా చార్జీల పెంపునకు సముఖంగా ఉన్నారని, అయితే సేఫ్టీ, సర్వీస్, సెక్యూరిటీ కోరుతున్నారని కేంద్ర రైల్వే శాఖ మంత్రి డీవీ సదానందగౌడ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆయన పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి నీలయ్యకు మద్దతుగా ప్రచారం చేయడానికి పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఇక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. జులై 2వ వారంలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనన్నానని చెప్పిన ఆయన ఇప్పటికే బడ్జెట్ తయారీ నడుస్తోందన్నారు. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పలు విడతలుగా చర్చిస్తున్నానన్నారు. సేఫ్టీ, సెక్యూరిటీ, సర్వీస్‌కు ప్రాధాన్యతనిస్తానన్న ఆయన వీటికితోడు ప్రయాణీకుల స్పీడ్ కూడా కోరుకుంటున్నారని ఈ దిశలో సేవలందిస్తామన్నారు. రైల్వే శాఖలో చైనా, జపాన్ దేశాల తరహాలో బుల్లెట్ ట్రైన్ సేవలందించే ఆలోచన ఉందన్న సదానందగౌడ స్థాయిలో సేవలందించాలంటే ఉన్న ఆదాయం సరిపోదన్నారు. దీని కోసం రైల్వే శాఖలోకి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్‌ను ఆహ్వానిస్తున్నామన్నారు. అదేవిధ ంగా ఫారిన్ డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కు (ఎఫ్‌డీఐ) అవకాశం కల్పిసామన్నారు. రైలు సేవలు దేశంలో సామాన్యుడికి మరింత దగ్గరయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. గత రైల్వే మంత్రి ఖర్గే పలు స్టేషన్లలో రైళ్ల నిలుపుదలను రద్దు చేశారని, అయితే వాటిని యథావిధిగా నిలిచేలా చర్యలు తీసుకుంటామని, ఆయా స్టేషన్ల పరిధిలోని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను సంప్రదించి అవసరం మేరకు నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. హీరేమఠ్ ఆరోపణలు నిరాధారం : ఎన్సీపీఎన్ఆర్ వ్యవస్థాపకుడు హీరేమఠ్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని హైకోర్టు తీర్పు ఇచ్చిందని సదాసంద గౌడ ఈ సందర్భంగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. హీరేమఠ్ తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఆరోపణలు చేయడం పద్దతి కాదన్నారు. తగిన సాక్ష్యాధారాలుంటే మీడియా ముందు ప్రవేశపెట్టాలన్నారు. అయినా ఆయనకు దేవుడు మంచి చేయాలని, ఆయన పోరాటాలు కొనసాగించాలని కోరుకుంటున్నానని నవ్వుతూ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నరసింహస్వామి, పార్టీ నేతలు కేఎం హనుమంతరాయప్ప, బీసీ నారాయణస్వామి,జోనా మల్లికార్జున్, యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ స్థానిక నేతలు పలువురు హాజరయ్యారు. -
మైసూరుకు బుల్లెట్ ట్రైన్
సాక్షి, బెంగళూరు : మైసూరు - బెంగళూరు మధ్య బుల్లెట్ ట్రైన్ సదుపాయం కల్పించాలనుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇందుకు జపాన్‌కు చెందిన కొన్ని కంపెనీలు ఆర్థికంగా, సాంకేతికంగా సహకారం అందించడానికి ముందుకు వచ్చాయన్నారు. చైనాలో ఈనెల 11 నుంచి మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న ఆయన అక్కడి అనుభవాలతోపాటు విదేశీపెట్టుబడిదారుల సహకారంతో రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను గూర్చి బెంగళూరులో మీడియాకు సోమవారం వివరించారు. త్వరలోనే జపాన్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులు బెంగళూరును సందర్శించి బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారని చెప్పారు. ఈ సౌకర్యం ఏర్పాటైతే 250 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 30 నిమిషాల్లో చేరుకునేందుకు వీలవుతుందని వివరించారు. చెన్నె-బెంగళూరు మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ సదుపాయం కల్పించే విషయం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. అదేవిధంగా బెంగళూరులోని దేవనహళ్లి వద్ద ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టు జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించేందకు వీలుగా కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్దతిలో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు ఖర్చుకాగలవని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. భవన నిర్మాణానికి చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ప్రభుత్వ పెట్టుబడిదారుల సదస్సు వచ్చే ఏడాది అక్టోబరు నెలలో రాష్ట్రంలో నిర్వహించే సదస్సులో పాల్గొనాల్సిందిగా ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. చాలా మంది ఈ సదస్సులో పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారన్నారు. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగంలో ఎక్కువ పెట్టుబడులు రావడం వల్ల రాష్ట్రంలోని అన్ని చాలా రకాల పరిశ్రమల స్థాపనకు, అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇజ్రాయిల్ ‘మైక్రో ఇరిగేషన్’ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని... అక్కడి కంపెనీలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సిద్ధరామయ్య తెలిపారు. జఫర్‌కు కృతజ్ఞతలు చైనా పర్యటనలో తన భోజనానికి ఎలాంటి ఇబ్బం దులు లేకుండా దగ్గరుండి చూసుకున్న అక్కడి షాంగ్రిల్లా హోటల్లో పనిచేస్తున్న జఫర్ అనే వంటవాడికి సిద్ధరామయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చైనాలో టీ అసలు తాగలేదన్నారు. సూట్ కంటే పంచెకట్టు తనకు సౌకర్యవంతంగా ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు.