బుల్లెట్ ట్రైన్కు తొలి అడుగు
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జేఐసీఏ) సోమవారం తన నివేదికను రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు సమర్పించింది. ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 505 కిలోమీటర్ల దూర ప్రయాణం 7గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం కూడా అదే.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ట్రాక్ నిర్మాణం, రైలు నిర్మాణానికి సుమారు రూ. 9880 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని జేఐసీఏ అంచనా వేసింది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ రైలులో ప్రయాణం అత్యంత ఖరీదు అవుతుంది. ఈ నివేదికను పూర్తి అధ్యయనం చేసిన తరువాత ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తారని రైల్వే శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.