భారత ప్రజలు బుల్లెట్ ట్రైన్స్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు రైల్లో ప్రయాణాలు చేయాలంటే ఒక్కోసారి రోజుల సమయం పడుతోంది. అయితే బుల్లెట్ ట్రైన్స్‌తో ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. కేవలం గంట వ్యవధిలోనే 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది రైలు. దీంతో బుల్లెట్ ట్రైన్స్ ఎప్పుడు మనదేశంలో అడుగుపెడతాయా ? అని ఎదురుచూస్తున్నారు ప్రయాణికులు.
ఈ తరుణంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ గురించి ట్వీట్ చేశారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ ఎలా ఉండబోతుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
सपने नहीं हकीकत बुनते हैं!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 12, 2024
Stay tuned for #BulletTrain in Modi 3.0!#ModiKiGuarantee pic.twitter.com/0wEL5UvaY8
508 కిలోమీటర్ల దూరం
ముంబై - అహ్మదాబాద్ మధ్య 508 కి.మీల దూరాన్ని కవర్ చేసే ఈ బుల్లెట్ రైలు గరిష్టంగా గంటకు 320 కి.మీ వేగాన్ని అందుకోగలదని, ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గనుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఇక బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ కోసం 24 రివర్ బ్రిడ్జ్‌లు, 28 స్టీల్ బ్రిడ్జ్‌లు, 7 పర్వత ప్రాంతాల్లో టన్నెల్, 7 సముద్ర మార్గాన 7 టన్నెల్,12 స్టేషన్‌ల నిర్మాణం జరగనుంది.
మోదీ 3.0లో బుల్లెట్ ట్రైన్ కోసం
మోదీ 3.0లో బుల్లెట్ రైలు కోసం వేచి ఉండండి అంటూ అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన వీడియోలో ముంబై-అహ్మదాబాద్ కారిడార్ నవంబర్ 2021 నుంచి బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మన దేశంలో మొదటి బుల్లెట్ రైలు గుజరాత్‌లోని బిలిమోరా - సూరత్ మధ్య 50 కి.మీల విస్తీర్ణంతో ఆగస్టు 2026లో పూర్తవుతుందని రైల్వే మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
లక్ష్యం అదే
రైల్వే శాఖ కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో రోజుకు 70 ట్రిప్పులతో 35 బుల్లెట్ రైళ్లను నడపనుంది. 2050 నాటికి ఈ సంఖ్యను 105 రైళ్లకు పెంచాలని యోచిస్తోంది. కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు ప్రతి సంవత్సరం 1.6 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తారని అంచనా.
రూ. 1 లక్ష 8,000 కోట్లు
భారతదేశం మొట్టమొదటి ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ సుమారు రూ. 1 లక్ష 8,000 కోట్లు అంచనా వేయబడింది. ఆగస్టు 2026 నాటికి సూరత్-బిలిమోరా (63 కిమీ) మధ్య ట్రయల్ రన్‌ను లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment