ప్రతిష్టాత్మక భారత్ బుల్లెట్ ట్రైన్ మెగా ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) దక్కించుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఒప్పందం విలువపై కంపెనీ స్పష్టత ఇవ్వకపోయినా దీని విలువ రూ.7 వేల కోట్లపైనే ఉంటుందని సమాచారం.
లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ బోర్డు మీటింగ్ జులై 25న జరుగనుంది. ఈ సందర్భంగా షేర్ల బైబ్యాక్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక డివిడెండ్ చెల్లింపును బోర్డు పరిశీలించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బోర్డు సమావేశంలో స్వీకరించనున్నట్లు లార్సెన్ అండ్ టూబ్రో ఒక ఫైలింగ్‌లో తెలిపింది.
ప్రతిష్టాత్మకమైన ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌లో భాగమైన 135.45 కిలో మీటర్ల ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్-C3 ప్యాకేజీ నిర్మాణ కాంట్రాక్ట్‌ను నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నుంచి తమ నిర్మాణ యూనిట్ ఎల్‌అండ్‌టీ కన్‌స్ట్రక్షన్ పొందినట్లు కంపెనీ ప్రత్యేక ఫైలింగ్‌లో ప్రకటించింది.
ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు
ఈ ప్యాకేజీ పరిధిలో స్టేషన్‌లు, ప్రధాన నదీ వంతెనలు, డిపోలు, సొరంగాలు, ఎర్త్ స్ట్రక్చర్‌లు, స్టేషన్‌లు తదితర నిర్మాణాలను ఎల్‌అండ్‌టీ కంపెనీ చేపట్టనుంది. ఈ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ దాదాపు 508 కిలో మీటర్ల మేర ఉంటుంది. దీన్ని ఎంఏహెచ్‌ఎస్‌ఆర్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో 155.76 కి.మీ, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో 4.3 కి.మీ, గుజరాత్ రాష్ట్రంలో 348.04 కి.మీ మేర ఉంటుంది.
మెగా ఆర్డర్ దక్కించుకున్న అనంతరం బీఎస్‌ఈలో ఎల్‌అండ్‌టీ షేర్లు దాదాపు 4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,594.40కి చేరుకున్నాయి. 2023-24 మొదటి త్రైమాసిక పలితాలను జులై 25న జరిగే సమావేశంలో ఎల్‌అండ్‌టీ బోర్డ్ పరిగణనలోకి తీసుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment