l and t
-
నెలకు ఒకరోజు సెలవు: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం
వేల మంది ఉద్యోగిణులకు ఉపాధి కల్పించిన ఇంజనీరింగ్, నిర్మాణరంగ దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్అండ్టీ) సంస్థ గురువారం మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నెలసరి సమయంలో ఒకరోజు పెయిడ్ లీవ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎల్ అండ్ టీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఈ ప్రకటన చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఎల్అండ్టీ వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థ ఒకటి ఇలా నెలసరి పెయిడ్ లీవ్ ఇవ్వడం ఇదే తొలిసారి. పెయిడ్ లీవ్ విధానాన్ని ఏ తరహాలో అమలుచేస్తారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఎల్అండ్టీ మాతృసంస్థలో పనిచేసే మహిళలకే ఈ లీవ్ సౌకర్యం ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!ఎల్అండ్టీ అనుబంధ విభాగాలైన ఆర్థిక సేవలు లేదా టెక్నాలజీ వంటి విభాగాల్లో చేసే ఉద్యోగిణులకు ఈ సౌకర్యం ఉండకపోవచ్చని ఆయా వర్గాలు స్పష్టంచేశాయి. ప్రస్తుతం ఎల్అండ్టీలో 60,000 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 9 శాతం అంటే దాదాపు 5,000 మంది మహిళలు ఉన్నారు. -
100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యానికి ఎల్ అండ్ టీ తోడ్పాటు
భారతదేశం 2047 నాటికి ప్రతిష్టాత్మకంగా 100 గిగావాట్ల అణు ఇంధన లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాలని లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) దృష్టి సారించింది. భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ లక్ష్యం దేశ అణు విద్యుత్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచేందుకు, స్థిరమైన ఇంధన సరఫరాను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఎల్ అండ్ టీ వ్యూహాత్మక విజన్భారత అణు విద్యుత్ వృద్ధికి దోహదపడేందుకు కంపెనీ కట్టుబడి ఉందని ఎల్ అండ్ టీ హోల్ టైమ్ డైరెక్టర్, ఎనర్జీ ప్రెసిడెంట్ సుబ్రమణియన్ శర్మ స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రోలైజర్ తయారీ, బ్లూ అమ్మోనియా ప్రాజెక్టుల్లో అవకాశాలను అన్వేషిస్తూ అణు రంగంలో తన ఉనికిని విస్తరించాలని ఎల్ అండ్ టీ యోచిస్తోంది. భవిష్యత్ ప్రాజెక్టుల కోసం సహకారం, భూసేకరణ కోసం చర్చలు జరుపుతోంది. అణువిద్యుత్ రంగంలో విభిన్న సేవలందించాలని ఎల్ అండ్ టీ లక్ష్యంగా పెట్టుకుంది. అణు రియాక్టర్ల తయారీదారుగా ఇది కీలకమైన రియాక్టర్లు, విడిభాగాలను అందిస్తోంది. ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా భారత్ స్మాల్ రియాక్టర్ల ఏర్పాటుకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఎల్ అండ్ టీ చర్చలు జరుపుతోంది.ఇదీ చదవండి: మెటా ఇండియా-యూఎస్ సముద్రగర్భ కేబుల్ ప్రాజెక్ట్క్రియాశీల వైఖరిగ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశించడంతో భారత్‌తోపాటు విదేశాల్లో అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఎల్ అండ్ టీ ప్రయత్నిస్తోంది. కంపెనీ గుజరాత్‌లోని కాండ్లాలో భూమి కొనుగోలు చేసింది. ఇది ఎగుమతుల కోసం ఓడరేవుల సమీపంలో సౌకర్యాలకు అనువుగా ఉంటుందని భావిస్తుంది. ఒడిషాలో కొంత భూమి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఎల్ అండ్ టీ క్రియాశీల వైఖరి దేశ అణు శక్తి లక్ష్యాలకు గణనీయంగా దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు. -
రూ.70,000 కోట్ల బిడ్‌ను తిరస్కరించిన రక్షణ శాఖ
భారత్ ప్రతిష్టాత్మంగా చేపట్టిన ప్రాజెక్టు 75ఇండియా(P75I)లో భాగంగా రూ.70,000 కోట్ల విలువైన జలాంతర్గాముల తయారీ కోసం లార్సెన్ అండ్ టుబ్రో (L&T) వేసిన బిడ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈ నిర్ణయంతో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDL) మాత్రమే ఆరు తదుపరి తరం జలాంతర్గాములను నిర్మించే రేసులో నిలిచింది.ప్రాజెక్ట్ 75 ఇండియాభారత నౌకాదళం ప్రాజెక్ట్ 75ఇండియా(పీ75ఐ) మూడు వారాల పాటు నీటి అడుగున ఉండగల సామర్థ్యం కలిగిన ఆరు అధునాతన జలాంతర్గాములను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెరుగుతున్న ప్రాంతీయ బెదిరింపుల మధ్య నౌకా సామర్థ్యాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.ఎల్ అండ్ టీ బిడ్ భారత నౌకాదళ అవసరాలకు అనుగుణంగా లేదని రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించింది. స్పానిష్ కంపెనీ నవంతియా భాగస్వామ్యంతో ఎల్ అండ్ టీ స్పెయిన్‌లో కీలకమైన ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) వ్యవస్థ పనితీరును ప్రదర్శించింది. అయినా ప్రభుత్వం కంపెనీ బిడ్‌ను తిరస్కరించడం గమనార్హం. ఏదేమైనా, భారత నౌకాదళం వ్యవస్థను, దాని అంచనాలు, డిమాండ్లను అందుకోవడంలో ఎల్ అండ్ టీ విఫలమైంది.పరిమిత పోటీపై ఆందోళనఎల్ అండ్ టీ అనర్హతతో ఎండీఎల్ ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసిన ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్(ఓఈఎం)ల్లో ఒకటైన నావల్ గ్రూప్ (ఫ్రాన్స్), థైసెన్ క్రుప్ మెరైన్ సిస్టమ్స్ (జర్మనీ), డేవూ షిప్ బిల్డింగ్ (దక్షిణ కొరియా), రోసోబోరో నెక్స్పోర్ట్(రష్యా)తో కలిసి పనిచేయనుంది. ఇంత ముఖ్యమైన ఒప్పందంలో పరిమిత పోటీపై ఆందోళనలను వస్తున్నాయి. రక్షణ రంగంలో, దేశీయంగా నౌకాదళ ఉత్పత్తుల తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్ అండ్ టీని మినహాయించడం భారత్ స్వావలంబనపై ప్రభావం చూపనుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారులతో సర్వే.. ఆసక్తికర అంశాలుపీ75ఐ గురించి మరికొంత..ప్రాజెక్ట్ 75 ఇండియా (పీ75ఐ) భారత నౌకాదళం ముఖ్యమైన ప్రాజెక్ట్. అత్యాధునిక ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (ఏఐపీ) వ్యవస్థలతో కూడిన ఆరు అధునాతన డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏఐపీ వ్యవస్థ జలాంతర్గాములు ఎక్కువ సేపు బయటకు రాకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. వీటిని ఎక్కువ లోతుల్లోకి వెళ్లేలా రూపొందించనున్నారు. ఈ జలాంతర్గాముల్లో సమకాలీన పరికరాలు, ఆయుధాలు, సెన్సర్లు, ఆధునిక క్షిపణులు ఉంటాయి. -
బాసులు లేని వర్క్ కల్చర్
వారంలో 90 గంటలు పని చేయాలంటు ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యయన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విధానాన్ని వ్యతిరేకించిన ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా డెన్మార్క్ వర్క్ కల్చర్‌ను అవలంబించడం ద్వారా భారత్ ప్రయోజనం పొందే అవకాశం ఉందని సూచించారు.‘డెన్మార్క్‌లో ఉద్యోగులు మైక్రో మేనేజ్మెంట్(కింది స్థాయి బాసులు) లేకుండా స్వతంత్రంగా పనిచేస్తారు. వీరు సంవత్సరానికి కనీసం ఐదు వారాల సెలవు, ఆరు నెలల పేరెంటల్ లీవ్ అనుభవించే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన పని గంటలు ఎంచుకోవచ్చు. దాంతో వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరూ ఉద్యోగాలను వీడకుండా స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడి ఉద్యోగులు అనుభవించే సౌకర్యాలు, స్వయంప్రతిపత్తి కారణంగా చాలా మంది పనిని కొనసాగిస్తారు. కంపెనీ యజమానులు మానసిక ఆరోగ్యానికి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు విలువ ఇస్తారు. వ్యక్తిగత ఆకాంక్ష కంటే సామూహిక శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తారు’ అని చెప్పారు.అసలేం జరిగిందంటే..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.Why the people in Denmark are happiest about their work practices:- Employees are trusted to work independently without micromanagement- Minimum five weeks of vacation and six months of parental leave- Flexible hours allow time for family and personal life- Job loss is…— Harsh Goenka (@hvgoenka) January 16, 2025వినాశనానికి దారితీస్తుందంటూ ఇప్పటికే స్పందనసుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) గతంలో స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. -
‘మీ లాభాల కోసం మేం చావలేం’
ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటల పనిదినాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) తీవ్రంగా తప్పుబట్టింది. కార్మికుల శ్రేయస్సును పణంగా పెట్టి లాభాపేక్షతో అలుపెరగకుండా పని చేయించడం సరికాదని చెప్పింది. కంపెనీల లాభాల కోసం చావడానికి సిద్ధంగా లేమని కేఐటీయూ ప్రకటించింది. భారతీయ శ్రామిక శక్తిని అమానవీయంగా దోపిడీ చేయడం ద్వారా సుబ్రహ్మణ్యన్ సారథ్యం వహిస్తున్న కంపెనీ లాభాలు పొందుతుందని యూనియన్ ఆరోపించింది.కేఐటీయూ కార్యదర్శి సూరజ్ నిడియాంగా మాట్లాడుతూ..‘యూనియన్ ఈ అంశాన్ని ఒంటరి ప్రకటనగా పరిగణించడం లేదు. గతంలో నారాయణమూర్తి వారానికి 70 గంటల పని విధానం కావాలని సూచించినప్పుడు కర్ణాటకలో అమలు చేసే ప్రయత్నం జరిగింది. కేఐటీయూ జోక్యం, ఉద్యోగుల ప్రతిఘటన కారణంగానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎల్ అండ్ టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి లాభాల కోసం మా ప్రాణాలను పణంగా పెట్టలేం’ అని చెప్పారు.ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఇవే..‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూస్తారు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆయన కామెంట్లపై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థల్లో పనిగంటలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్‌సీఎల్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ వంటి వ్యక్తులు పని గంటల పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టే అంశాన్ని నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: మెటా క్షమాపణలు చెప్పాలి.. పార్లమెంటరీ కమిటీ సమన్లు..?అసలు ఉద్దేశంపై వివరణసోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్ అండ్ టీ ఇటీవల దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘ఇది భారతదేశపు దశాబ్దమని ఛైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు. అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని ప్రకటన జారీ చేసింది. -
‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’
పని గంటలపై ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వారానికి 90 గంటలు పని చేయడంతోపాటు, ఆదివారం సెలవునూ వదిలేయాలని సుబ్రహ్మణ్యన్ ఇటీవల ఓ వీడియో ఇంటెరాక్షన్‌లో తన ఉద్యోగులతో అన్నారు. దీనినై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా, సినీ నటి దీపికా పదుకొణె సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై కామెంట్ చేశారు.అసలేం జరిగిందంటే..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.వినాశనానికి దారితీస్తుంది..సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.90 hours a week? Why not rename Sunday to ‘Sun-duty’ and make ‘day off’ a mythical concept! Working hard and smart is what I believe in, but turning life into a perpetual office shift? That’s a recipe for burnout, not success. Work-life balance isn’t optional, it’s essential.… pic.twitter.com/P5MwlWjfrk— Harsh Goenka (@hvgoenka) January 9, 2025ఇదీ చదవండి: నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యతమెంటల్ హెల్త్ ముఖ్యం..వారానికి 90 గంటలు పని చేయాలని సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి దీపికా పదుకొణె(deepika padukone) స్పందించారు. సుబ్రహ్మణ్యన్ను ఉద్దేశించి ‘అతను చాలా గౌరవం, అధికారంలో ఉన్న వ్యక్తి. అంత ఉన్నత స్థానంలో వ్యక్తులు ఇలాంటి కామెంట్లు చేయడంతో షాకింగ్‌గా అనిపించింది’ అని కామెంట్ చేశారు. తన కామెంట్ చివర ‘మెంటల్ హెల్త్ మేటర్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉంచారు. ఈ వ్యవహారంపై కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని తెలిపింది. ఇలా కంపెనీ స్పష్టత ఇచ్చిన దానిపై దీపిక పదుకొణె స్పందిస్తూ ‘ఇలా ఈ అంశంపై రిప్లై ఇచ్చి మరింత దిగజారారు’ అని అన్నారు. -
ఐదు లక్షల మందితో భారత్ బ్యాటరీ షో!
రెండో విడత ‘భారత్ బ్యాటరీ షో 2025’ జనవరి 19 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్నారు. ఇందులో భారత్‌తో పాటు అమెరికా, జపాన్, చైనా తదితర దేశాల నుంచి 100కు పైగా కంపెనీలు పాల్గోనున్నాయి. ఈ రంగంలో అధునాతన ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.సుమారు 50 దేశాల నుంచి 5,00,000 మంది పైగా సందర్శకులు దీన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం వివరించింది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ) ఈ మెగా కార్యక్రమానికి భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఇందులో ప్రధానంగా లిథియం అయాన్ బ్యాటరీలు, బ్యాటరీ విడిభాగాలు, టెస్టింగ్ సొల్యూషన్స్, తయారీ పరికరాలు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్ సొల్యూషన్స్ మొదలైన వాటిని ప్రదర్శించనున్నారు. బ్యాటరీ టెక్ పెవిలియన్, సప్లై చెయిన్ పెవిలియన్, ఛార్జింగ్ ఇన్ఫ్రా పెవిలియన్ మొదలైన ప్రత్యేక పెవిలియన్లు ఉంటాయని ఐఈఎస్ఏ ప్రెసిడెంట్ దేవి ప్రసాద్ దాష్ తెలిపారు. ఐఈఎస్ఏ జనవరి 16–17 మధ్య ఇండియా బ్యాటరీ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చెయిన్ సదస్సును (ఐబీఎంఎస్సీఎస్), జనవరి 18న ఇండియా బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ రీ–యూజ్ సదస్సును నిర్వహించనున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: ఏడేళ్లలో 600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లువ్యాపార విస్తరణపై ఎల్అండ్టీ ఫైనాన్స్ దృష్టిఎల్అండ్టీ ఫైనాన్స్ కార్యకలాపాలు ప్రారంభించి మూడు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో రుణ లభ్యత, ఆర్థిక అక్షరాస్యత పెంపు, వ్యాపార విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ ఎండీ సుదీప్త రాయ్ తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంత కస్టమర్లకు ఆర్థిక సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగించుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం 20 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 35,000 పైగా సిబ్బందితో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ రూ. 696 కోట్ల నికర లాభం నమోదు చేసింది. -
వైజాగ్ స్టీల్‌కు రూ.1,650 కోట్లు.. ఎల్ అండ్ టీకి ప్రాజెక్ట్‌లు
నిర్వహణ, ఆర్థికపరమైన సవాళ్లతో సతమతమవుతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు (వైజాగ్ స్టీల్) రూ.1,650 కోట్లు సమకూర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ తెలిపింది. సంస్థ కార్యకలాపాలు యథావిధంగా కొనసాగేలా తోడ్పాటు అందించేందుకు వివిధ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న రూ.500 కోట్లు ఈక్విటీ కింద, సెప్టెంబర్ 27న రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ లోన్ కింద అందించినట్లు పేర్కొంది. సంస్థ సుస్థిరంగా నిలదొక్కుకోవడంపై ఎస్‌బీఐక్యాప్స్ ఒక నివేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.ఇదీ చదవండి: పన్నుల ప్రణాళిక.. ఎగవేత మధ్య తేడా!ఎల్అండ్టీకి భారీ ప్రాజెక్టులుఅధిక వోల్టేజీ విద్యుత్ గ్రిడ్లను విస్తరించడం, బలోపేతం చేయడం కోసం మధ్యప్రాచ్య, ఆఫ్రికాలో ప్రధాన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు మౌలిక రంగ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో వెల్లడించింది. పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ విభాగం ఈ ఆర్డర్లను పొందినట్లు కంపెనీ తెలిపింది. రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల శ్రేణిలో ఆర్డర్లు ప్రధానమైనవిగా కంపెనీ వర్గీకరించింది. కాగా, కెన్యా కోసం కొత్త నేషనల్ సిస్టమ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తారు. ప్రముఖ ఒరిజినల్ పరికరాల తయారీ కంపెనీ భాగస్వామ్యంలోని కన్సార్షియం ఈ ఆర్డర్‌ను అందుకుంది. మధ్యప్రాచ్యంలోని సౌదీ అరేబియాలో అధిక వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ల టర్న్‌కీ నిర్మాణం చేపడతారు. ఖతార్‌లో కొనసాగుతున్న విద్యుత్ వ్యవస్థ విస్తరణ ప్రాజెక్ట్‌లో అదనపు గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్స్ ఏర్పాటు చేస్తారు. -
రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం
ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీతో సహా 7,000 మందిని అయోధ్యలోని రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఇద్దరు బిలియనీర్లతో పాటు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా జనవరి 22, 2024న జరిగే ఈ వేడుకలకు హాజరవనున్నట్లు సమాచారం. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి 3,000 మంది వీవీఐపీలతో కలిపి మొత్తం 7,000 మందికి ఆహ్వానాలు పంపింది. ప్రముఖ టీవీ సీరియల్ 'రామాయణం'లో రాముడి పాత్ర పోషించిన నటుడు అరుణ్ గోవిల్, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు ట్రస్ట్ ఆహ్వానం పంపింది. అయోధ్యలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కరసేవకుల కుటుంబాలను సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. వీవీఐపీల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యోగా గురువు రామ్‌దేవ్, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ అదానీలు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిర ప్రతిష్టాపన ఉత్సవానికి 50 దేశాల నుంచి ఒక్కొక్కరిని ఆహ్వానించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రామాలయ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 50 మంది కరసేవకుల కుటుంబ సభ్యులను ఆహ్వానించాం. న్యాయమూర్తులు, శాస్త్రవేత్తలు, రచయితలు, కవులకు కూడా ఆహ్వానాలు పంపాం’ అని తెలిపారు. సాధువులు, పూజారులు, మత పెద్దలు, మాజీ సివిల్ సర్వెంట్లు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు, సంగీత విద్వాంసులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలకు ఆహ్వానం పంపినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా! అయోధ్యలో రామమందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లు. ఆలయ నిర్మాణం కోసం సుప్రీం కోర్టు ఆదేశాల ద్వారా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. హిందూ దేవతల విగ్రహాల కోసం ట్రస్ట్ స్థలం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27, 2021 వరకు శ్రీ రామ జన్మభూమి మందిర్ నిధి సమర్పణ్ అభియాన్ ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు రూ.2100 కోట్ల నిధులు సేకరించినట్లు సమాచారం. ఈ మందిర నిర్మాణాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ ప్రారంభించింది. మందిరంలో వినియోగించే టెక్నాలజీని టాటా కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ అందిస్తోంది. 161 అడుగుల ఎత్తు, 235 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవుతో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. -
రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్
ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, సాంకేతికత, సమాచార రంగాల్లో అగ్రగామిగా దూసుకెళ్తున్న 'లార్సెన్ అండ్ టుబ్రో' (Larsen & Toubro) గురించి చాలామందికి తెలుసు. కానీ ఈ సంస్థ పురోగతికి కారకుడైన ఏఎమ్ నాయక్ గురించి బహుశా విని ఉండక పోవచ్చు. కేవలం రూ. 760 తో మొదలైన ఈయన జీవితం.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని నడిపించే స్థాయికి ఎదిగింది. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 2023 సెప్టెంబర్‌లో ఎల్ అండ్ టీ చైర్మన్‌గా పదవీవిరమణ చేసిన 'అనిల్ మణిభాయ్ నాయక్' జీవితం ఐదు దశాబ్దాల క్రితం కంకర రాళ్లు, సిమెంటు ధూళి మధ్యనే మొదలైంది. మధ్య తరగతికి చెందిన అనిల్ మణిభాయ్.. స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది అయిన మణిభాయ్ నిచ్చాభాయ్ నాయక్ కుమారుడు. ఈయన ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉండేవారని సమాచారం. ముంబైకి వలస.. ఉద్యోగరీత్యా వారి కుటుంబం మహారాష్ట్రలోని ఓ మారుమూల పల్లె నుంచి ముంబైకి వలస వచ్చింది. దీంతో మణిభాయ్ చదువు ముంబైలోనే సాగింది. విశ్వకర్మ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన.. ప్రారంభంలో ఎల్ అండ్ టీ లో ఉద్యోగం పొందలేకపోయారు. నెస్టార్ బాయిలర్స్ అనే సంస్థలో ఉద్యోగం సంపాదించి ఇష్టం లేకపోయినా తండ్రి మాటకోసం చేరాడు. జూనియర్ ఇంజినీర్.. 'ఎల్ అండ్ టీ' కంపెనీలో ఉద్యోగం చేయడం అంటే దేశానికి సేవ చేయడమే అభిప్రాయంతో ఉన్న 'నాయక్' అతి తక్కువ కాలంలోనే జూనియర్ ఇంజినీర్ హోదాలో ఎల్ అండ్ టీ కంపెనీలో అడుగుపెట్టాడు. కంపెనీ పట్ల అతనికున్న నిబద్దత 21 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా చేసింది. అంకిత భావంతో పనిచేస్తున్న ఇతన్ని గుర్తించిన కంపెనీ అనేక ఉన్నత పదవులను అందించింది. ఛైర్మన్‌గా.. 1999లో కంపెనీకి సీఈవోగా.. 2017 జూలైలో గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన నాయకత్వంలో కంపెనీ ఆస్తులు 870 కోట్ల డాలర్లను పెరిగాయి. 2017 - 18లో కంపెనీ అతనికి వార్షిక వేతనంగా రూ. 137 కోట్లు చెల్లించింది. సెలవు తీసుకోకుండా పనిచేసిన పనిదినాలు కంపెనీ ఏకంగా రూ. 19 కోట్లు చెల్లించింది. మొత్తం మీద అతని మొత్తం ఆస్తి రూ. 400 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి.. ఎవరో తెలుసా? రూ. 142 కోట్లు దానం.. అనిల్ మణిభాయ్ నాయక్ ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొని అంచెలులంచెలుగా ఎదిగిన కష్టజీవి, కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి 2016లో తన మొత్తం ఆస్తిలో 75 శాతం (సుమారు రూ. 142 కోట్లు) విరాళంగా ఇచ్చేసాడు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువ విరాళాలు అందించిన టాప్ 10 దాతల్లో నాయక్ ఒకరు కావడం విశేషం. ఈయన సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి సత్కారాలను అందించింది. 2023 మర్చి 31న దాఖలు చేసిన కార్పొరేట్ షేర్‌హోల్డింగ్‌ల ప్రకారం, నాయక్ ఆస్తి మొత్తం రూ. 171.3 కోట్లు అని తెలుస్తోంది. -
ఎల్ అండ్ టీ కంపెనీపై రూ.239 కోట్లు పెనాల్టీ.. కారణం ఇదేనా..
దిగ్గజ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ షేర్ ధర సోమవారం 0.71 శాతం నష్టాల్లో ట్రేడయింది. శుక్రవారంతో పోలిస్తే షేర్ ధర 22 పాయింట్లు తగ్గి రూ.3087 వద్ద స్థిరపడింది. కంపెనీపై ఖతార్ విధించిన పెనాల్టీ ఇందుకు కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖతార్ ట్యాక్స్ విభాగం రూ.111.30 కోట్లు, రూ.127.60 కోట్ల చొప్పున రెండు జరిమానాలు విధించినట్లు ఎల్ అండ్ టీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ ప్రకటించిన ఆదాయ వివరాల్లో భారీ వ్యత్యాసం ఉందని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఖతార్‌ప్రభుత్వం వివరించింది. మార్చి 2017 నుంచి మార్చి 2018 మధ్య కాలానికిగాను కంపెనీపై ఈ జరిమానా విధించారు. అయితే సంస్థ ఈ జరిమానాపై పిటిషన్ దాఖలు చేయనుంది. మిడిల్ఈస్ట్ దేశాల్లో ఎల్ అండ్ టీ రెండో అతిపెద్ద నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది. లార్సెన్ అండ్ టూబ్రో హైడ్రోకార్బన్ వ్యాపారం పశ్చిమాసియాలో పెద్ద కాంట్రాక్టును సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆ కాంట్రాక్ట్ విలువ ఎంతో కంపెనీ వెల్లడించలేదు. కానీ దాని విలువ రూ.15 వేల కోట్ల మేర ఉండొచ్చని అంచనా. ఇందుకు సంబంధించి ఓ కస్టమర్ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. -
ఈ పెద్దాయన స్టాక్ మార్కెట్‌ని ఏలుతున్నారు?, కోట్లు వెనకేసి
చూశారా!! ఈ పెద్దాయనని. ఈయన ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారా? అయితే, మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఆయన గురించి తెలుసుకుందాం పదండి. స్టాక్ మార్కెట్‌తో డబ్బులు సంపాదించడం ఎలా? అని ఎవరినైనా అడిగితే అమ్మో స్టాక్ మార్కెటా? వద్దులే. ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తేనో లేదంటే తెలిసిన వాళ్లకి వడ్డీ ఇచ్చుకున్నా నాలుగు రాళ్లు వెనకేసువచ్చు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు? అలా ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు? అంటూ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్న వారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని, అనుభవజ్ఞులైన నిపుణులు సలహాలు తీసుకోవాలి. అలా తెలుసుకునే షేర్లలో పెట్టుబడులు పెట్టారు ఈ పెద్దాయన. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్, క్రమశిక్షణ, ఓపిక వహించారు. ఇప్పుడు ముదుసలి వయసులో భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలా అంటారా? క్రమశిక్షణ, సహనం ఈ రెండింటిలో ఆరితేరిన బిగ్ బుల్, దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్లు స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేసి డివిడెండ్లు, బోనస్ షేర్లు, షేర్ల బైబ్యాక్, స్టాక్ స్ల్పిట్లతో లాభాల్ని గడిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్ కూడా అంతే. సోషల్ మీడియా ఓవర్‌నైట్ స్టార్ గురించి పెద్దగా వివరాలు వెలుగులోకి రాలేదు. కానీ ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆస్తులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రాజీవ్ మెహతా అనే నెటిజన్ ఈ పెద్దాయన గురించి వీడియో చేశారు. ఆ వీడియోలో కోట్ల ఆస్తులు ఉన్నా సాధారణ జీవితం గడుపుతున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆయనకు ఏయే కంపెనీల్లో షేర్లు ఉన్నాయో వివరించారు. ఆ వివరాల ఆధారంగా సదరు పెద్దాయన నికర ఆస్తి విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్అండ్టీలో 27,855 షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో 4,000 షేర్లు తన వద్ద ఉన్నాయని తన మాతృ భాషలో పెద్దాయన చెప్పడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. నివేదికల ప్రకారం..100 మిలియన్ (రూ.10 కోట్ల) కంటే ఎక్కువ విలువైన షేర్లు ఉన్నాయని తెలుస్తోంది. అదనంగా, ఆ వ్యక్తి తాను సంవత్సరానికి సుమారుగా రూ. 6 లక్షల డివిడెండ్లను సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. As they say, in Investing you have to be lucky once He is holding shares worth ₹80 crores L&T ₹21 crores worth of Ultrtech cement shares ₹1 crore worth of Karnataka bank shares. Still leading a simple life#Investing @connectgurmeet pic.twitter.com/AxP6OsM4Hq — Rajiv Mehta (@rajivmehta19) September 26, 2023 ఈ సందర్భంగా రాజీవ్ మెహతా మాట్లాడుతూ పెద్దాయన చెప్పినట్లుగా పెట్టుబడులు మీరు అదృష్టవంతులు కావాలని అన్నారు. అంతేకాదు ఎల్ అండ్ టీలో రూ.80 కోట్ల విలువైన షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో రూ. 21 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో రూ. కోటి విలువైన షేర్లు ఉన్నాయని మెహతా పోస్ట్ చేశాడు.ఇప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు అని’ మెహతా పేర్కొన్నారు. Bhai 27,000 L&T shares = 8 cr no? Similarly 3.2 cr. of Ultratech 10 lakh of Ktk bank It's a decent amount still. More power to him. But please consider blurring his face, such publicity usually doesn't do good esp for old people living a simple life. — Deepak Shenoy (@deepakshenoy) September 26, 2023 ఆ వీడియోపై క్యాపిటల్ మైండ్ సీఈఓ, ఫౌండర్ దీపక్ షెనాయ్ స్పందించారు. రాజీవ్ మెహతా చెప్పిన దానిని బట్టి.. ఎల్ అండ్ టీ కంపెనీలో 27 వేల షేర్ల విలువ రూ. 8 కోట్లు, అల్ట్రాటెక్ కంపెనీలో రూ. 3.2 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంకులో రూ. 10 లక్షల విలువైన షేర్లు.. ఇలా మొత్తంగా రూ. 12 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం, ఈ పెద్దాయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది. -
చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో (ISRO) చేపట్టిన ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3 ) మిషన్ ఘన విజయం సాధించింది. చంద్రుడిపై విజయవంతంగా ల్యాండయి చరిత్ర తిరగరాసింది. ఇస్రో శాస్త్రవేత్తల ఘనతను ప్రపంచమంతా కొనియాడుతోంది. ఈ నేపథ్యంలో లార్సెన్ & టూబ్రో (L&T), మిశ్ర ధాతు నిగమ్ (MIDHANI), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) తో సహా పలు కంపెనీలు ‘చంద్రయాన్-3’ మిషన్‌లో కీలక పాత్ర పోషించాయి. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థలు వివిధ దశల్లో మిషన్‌కు సహకరించాయి. ఎల్అండ్టీ పాత్ర ఎల్వీఎం3 ఎం4 చంద్రయాన్ మిషన్ ప్రయోగంలో ఎల్అండ్టీ కీలక పాత్ర పోషించింది. 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెడ్ ఎండ్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్, నాజిల్ బకెట్ ఫ్లాంజ్ అనే క్లిష్టమైన బూస్టర్ భాగాలు పోవైలోని ఎల్అండ్టీ కర్మాగారంలో తయారయ్యాయి. ఇక్కడే వీటిని పరీక్షించారు. అలాగే కోయంబత్తూరులోని ఎల్అండ్టీ హై-టెక్ ఏరోస్పేస్ తయారీ కేంద్రంలో గ్రౌండ్, ఫ్లైట్ అంబిలికల్ ప్లేట్లు తయ్యారయ్యాయి. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం లాంచ్ వెహికల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌లో కూడా ఎల్అండ్టీ పాత్ర ఉంది. మిదాని నుంచి లోహ మిశ్రమాలు మిశ్ర ధాతు నిగమ్ విషయానికొస్తే కోబాల్ట్ చంద్రయాన్-3 మిషన్‌కు అవసరమైన నికెల్, టైటానియం లోహ మిశ్రమాలు, ప్రత్యేకమైన ఉక్కు, ఇతర క్లిష్టమైన పదార్థాలను అభివృద్ధి చేసి సరఫరా చేయడంలో కంపెనీ పాత్ర పోషించింది. ఈ సంస్థ భవిష్యత్తులో ఇస్రో జరిపే ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌తోపాటు ఇతర మార్గదర్శక కార్యక్రమాలకు కూడా కీలక సహకారం అందించనుంది. బ్యాటరీలు సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ చంద్రయాన్-3కి సంబంధించిన బ్యాటరీలను బీహెచ్ఈఎల్ సరఫరా చేసింది. బీహెచ్ఈఎల్కు చెందిన వెల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (WRI) చంద్రయాన్-3 కోసం బై-మెటాలిక్ అడాప్టర్లు తయారీ చేసింది. మీడియా నివేదిక ప్రకారం.. ఎల్వీఎం3 ఎం4 ఫ్లైట్ చంద్రయాన్-3 క్రయోజెనిక్ దశలో ఉపయోగించిన భాగాలను తయారు చేసింది ఈ సంస్థే. చంద్రయాన్-3 మిషన్ విజయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా పాత్ర పోషించింది. గతేడాది హిందుస్థాన్ ఏరోనాటిక్స్- ఎల్అండ్టీ కన్సార్టియం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నుంచి ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) రాకెట్లను తయారు చేయడానికి రూ. 860 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL)కి అనేక భాగాలు అందించడం ద్వారా చంద్రయాన్-3 మిషన్‌కు కీలకమైన సహాయాన్ని అందించినట్లు ఒక మీడియా రిపోర్ట్ పేర్కొంది. చంద్రయాన్ 3 మిషన్ ఎల్వీఎం3 లాంచ్ వెహికల్లో ఉపయోగించిన క్లిష్టమైన S200 బూస్టర్ విభాగాలను వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ చిరాగ్ దోష్‌ను ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ ట్యాంకేజీలు, S200 ఫ్లెక్స్ నాజిల్ వంటి ఇతర సబ్‌సిస్టమ్‌లు కూడా ఈ సంస్థ ఉత్పత్తేనని వివరించింది. ఇక బాలానగర్‌లోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ చంద్రయాన్-3కి సంబంధించిన కీలక భాగాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది. -
భారత్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆ కంపెనీకే.. విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా?
ప్రతిష్టాత్మక భారత్ బుల్లెట్ ట్రైన్ మెగా ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) దక్కించుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఒప్పందం విలువపై కంపెనీ స్పష్టత ఇవ్వకపోయినా దీని విలువ రూ.7 వేల కోట్లపైనే ఉంటుందని సమాచారం. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ బోర్డు మీటింగ్ జులై 25న జరుగనుంది. ఈ సందర్భంగా షేర్ల బైబ్యాక్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక డివిడెండ్ చెల్లింపును బోర్డు పరిశీలించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బోర్డు సమావేశంలో స్వీకరించనున్నట్లు లార్సెన్ అండ్ టూబ్రో ఒక ఫైలింగ్‌లో తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌లో భాగమైన 135.45 కిలో మీటర్ల ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్-C3 ప్యాకేజీ నిర్మాణ కాంట్రాక్ట్‌ను నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నుంచి తమ నిర్మాణ యూనిట్ ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ పొందినట్లు కంపెనీ ప్రత్యేక ఫైలింగ్‌లో ప్రకటించింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు ఈ ప్యాకేజీ పరిధిలో స్టేషన్లు, ప్రధాన నదీ వంతెనలు, డిపోలు, సొరంగాలు, ఎర్త్ స్ట్రక్చర్లు, స్టేషన్లు తదితర నిర్మాణాలను ఎల్అండ్టీ కంపెనీ చేపట్టనుంది. ఈ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ దాదాపు 508 కిలో మీటర్ల మేర ఉంటుంది. దీన్ని ఎంఏహెచ్ఎస్ఆర్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో 155.76 కి.మీ, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో 4.3 కి.మీ, గుజరాత్ రాష్ట్రంలో 348.04 కి.మీ మేర ఉంటుంది. మెగా ఆర్డర్ దక్కించుకున్న అనంతరం బీఎస్ఈలో ఎల్అండ్టీ షేర్లు దాదాపు 4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,594.40కి చేరుకున్నాయి. 2023-24 మొదటి త్రైమాసిక పలితాలను జులై 25న జరిగే సమావేశంలో ఎల్అండ్టీ బోర్డ్ పరిగణనలోకి తీసుకోనుంది. -
Hyderabad: ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ బిడ్స్ ఫైనల్
హైదరాబాద్: నగరంలో ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ బిడ్స్ ఫైనల్ అయ్యాయి. ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ఏర్పాటుకు వచ్చిన బిడ్స్‌లో రెండు కంపెనీలు షార్ట్ లిస్ట్ చేశారు. బిడ్స్ షార్ట్ లిస్ట్ అయిన కంపెనీల్లో L& T కన్స్ట్రక్షన్స్ , NCCలు ఉన్నాయి. పనితీరు, అనుభవం ఆధారంగా త్వరలో ఒక కంపెనీని ఫైనల్ చేస్తామని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, రూ. 5,688 కోట్లతో 31 కి.మీ మేర ఎయిర్పోర్ట్ మెట్రో రైలు ఏర్పాటు చేయడానికి టీఎస్ సర్కార్ నడుంబిగించింది. దీనిలో భాగంగా మెట్రో రైలు ఏర్పాటు కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఏర్పాటు చేశారు. విమానాశ్రయ మెట్రో కారిడార్‌కు సమీపంలో అనేక వాణిజ్య, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతోంది. దాంతో పాటుశివార్లలో మధ్యతరగతి వారికోసం తక్కువ ఖర్చుతో నివాసప్రాంతాలను అభివృద్ధి చేసి అన్ని తరగతులవారు ఎయిర్పోర్ట్ మెట్రో ద్వారా గమ్యస్థానాలకు చేరుకొనేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైతే నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికీ ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉంది. -
ఎల్అండ్టీ ఫైనాన్స్, గల్ఫ్ ఆయిల్స్ లూబ్రికెంట్స్ స్టాక్స్ కొనొచ్చా?
ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 96 టార్గెట్: రూ. 125 - కొనొచ్చు ఎందుకంటే: గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ కన్సాలిడేటెడ్ నికర లాభం 47 శాతం జంప్‌చేసింది. రూ. 500 కోట్లను తాకింది. రుణ వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 1,680 కోట్లకు చేరింది. ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం(పీపీవోపీ) అంచనాలకు అనుగుణంగా 9 శాతం బలపడి రూ. 1,240 కోట్లయ్యింది. అయితే మొత్తం రుణ ఆస్తులు 8 శాతం క్షీణించాయి. హోల్‌సేల్ రుణ ఆస్తులు 53 శాతం నీరసించడం ప్రభావం చూపింది. కాగా.. యాజమాన్య వ్యూహాల ప్రకారం రిటైల్ రుణ ఆస్తుల వేగవంత వృద్ధి కొనసాగింది. 35 శాతం ఎగశాయి. దీంతో కంపెనీ రుణ మిక్స్‌లో ప్రస్తుతం రిటైల్ రుణ ఆస్తుల వాటా 75 శాతానికి చేరింది. ఇటీవల నిర్వహించిన విశ్లేషకుల సమావేశంలో కంపెనీ యాజమాన్యం రిటైల్ విభాగంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. తద్వారా మొత్తం లోన్‌బుక్‌లో రిటైల్ విభాగం పోర్ట్‌ఫోలియోను 90 శాతానికి పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు వీలుగా గ్రామీణ, మైక్రో, గ్రూప్ రుణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. ఇక మరోవైపు వృద్ధికి వీలుగా అనలిటిక్స్‌పై ప్రత్యేక దృష్టి, ప్రస్తుత కస్టమర్లకు విభిన్న ప్రొడక్టుల విక్రయం, టెక్నాలజీపై నిరవధిక పెట్టుబడులు తదితరాలను చేపడుతోంది. వెరసి 2.8–3 శాతం ఆర్వోఏ సాధించే లక్ష్యంగా సాగుతోంది. రిటైల్ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడం కంపెనీకి లబ్ధిని చేకూర్చే వీలుంది. గల్ఫ్ ఆయిల్స్ లూబ్రికెంట్స్ ప్రస్తుత ధర: రూ. 418 టార్గెట్: రూ. 813 కొనొచ్చు ఎందుకంటే: లూబ్రికెంట్స్ విభాగంలో దేశీయంగా క్యాస్ట్రాల్ తదుపరి రెండో పెద్ద కంపెనీగా గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా నిలుస్తోంది. మార్కెట్ వాటాను పెంచుకోవడంతోపాటు.. గత మూడేళ్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులలోనూ పటిష్టస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా సమర్ధతను చాటుకుంది. వాణిజ్య వాహన విభాగ వాతావరణం(సైకిల్) ఊపందుకోవడం, జాతీయ రహదారులపై రవాణా పుంజుకోవడం, జోరు చూపుతున్న పారిశ్రామికోత్పత్తి, యుటిలిటీ వాహన విక్రయాలలో వృద్ధి వంటి అంశాలు లూబ్రికెంట్స్‌కు డిమాండును పెంచనున్నట్లు అంచనా. వెరసి బిజినెస్ టు బిజినెస్(బీటూబీ) విభాగం నుంచి లూబ్రికెంట్స్ విక్రయాలు ఊపందుకోనున్నాయి. ఇది అంతిమంగా కంపెనీకి లబ్ధిని చేకూర్చనుంది. కంపెనీ లూబ్రికెంట్స్, చమురు అమ్మకాల పరిమాణంలో బీటూబీ విభాగం నుంచి 35– 40 శాతం నమోదవుతుండటం కంపెనీకి బలాన్నిస్తోంది. దీనికితోడు అమ్మకాలలో 65 శాతంవరకూ వాటాను ఆక్రమిస్తున్న బిజినెస్ టు కన్జూమర్(బీటూసీ) లూబ్రికెంట్ బిజినెస్ విస్తరణపైనా కంపెనీ కన్నేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త ప్రాంతాలలో డీలర్ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. బీటూబీ బిజినెస్‌తో పోలిస్తే బీటూసీలో మెరుగైన మార్జిన్లు ఆర్జిస్తోంది. ఇలాంటి పలు వ్యూహాత్మక అంశాలు కంపెనీ మార్కెట్ వాటాను పెంచనున్నాయి. ఆర్థిక పనితీరు మెరుగుకు దోహదపడనున్నాయి. వెరసి భవిష్యత్‌లో దేశీ లూబ్రికెంట్స్ మార్కెట్లో నాయకత్వ స్థాయికి చేరే అవకాశముంది. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే -
ఎల్అండ్టీ రూ.24 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్టీ మార్చి త్రైమాసికానికి నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,621 కోట్ల నుంచి రూ.3,987 కోట్లకు చేరింది. ఆదాయం రూ.52,851 కోట్ల నుంచి రూ.58,335 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.24 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కంపెనీ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 19 శాతం అధికంగా రూ.2,30,528 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్లకు పైగా ఆర్డర్లను పొందడం ఇదే మొదటిసారి అని ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యం తెలిపారు. మొత్తం ఆర్డర్ల పుస్తకం మార్చి చివరికి రూ.4 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెప్పారు. ఎల్అండ్టీ కన్సాలిడేటెడ్ ఆదాయం 2022–23లో 17 శాతం వృద్ధితో రూ.1.83 లక్షల కోట్లకు చేరుకోగా, లాభం 21 శాతం పెరిగి రూ.10,471 కోట్లుగా నమోదైంది. చైర్మన్‌గా తప్పుకోనున్న ఏఎం నాయక్ ఎల్అండ్టీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఏఎం నాయక్ 2023 సెప్టెంబర్ 30 నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రస్తుతం సీఈవో, ఎండీగా ఉన్న ఎస్ఎన్ సుబ్రమణ్యం చైర్మన్, ఎండీగా 2023 అక్టోబర్ 1 నుంచి సేవలు అందించనున్నట్టు ఎల్అండ్టీ ప్రకటించింది. గౌరవ చైర్మన్‌గా నాయక్ కొనసాగుతారని తెలిపింది. -
ఎల్టీఐ–మైండ్‌ట్రీ ఆవిర్భావం
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనమయ్యాయి. ఎల్టీఐ–మైండ్‌ట్రీ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటైనట్లు ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. దీంతో సంయుక్త సంస్థ దేశీ ఐటీ సర్వీసుల రంగంలో 5.25 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో పెద్ద కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. విలీనం వెనువెంటనే అమల్లోకి వచ్చినట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్ ప్రకటించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీలో ట్రేడింగ్ 24 నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. రూ. 1.53 లక్షల కోట్ల(సోమవారం ముగింపు) మార్కెట్ విలువతో సాఫ్ట్వేర్ రంగంలో ఐదో ర్యాంకులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. విలీన సంస్థలో ఎల్అండ్టీ 68.73 శాతం వాటాను కలిగి ఉంది. విలీనంలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 100 షేర్లకు 73 ఎల్టీఐ షేర్లు జారీ చేయనున్నట్లు నాయక్ తెలియజేశారు. ఇందుకు ఈ నెల 24 రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో రెండు కంపెనీల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. విలీనం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో మైండ్‌ట్రీ షేరు 2.7 శాతం ఎగసి రూ. 3,760 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2 శాతం బలపడి రూ. 5,161 వద్ద ముగిశాయి. -
ఎయిర్‌ఫోర్స్‌కు 100వ లాంచర్..అందించిన టీఏఎస్ఎల్, ఎల్అండ్టీ!
బెంగళూరు: టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (టీఏఎస్ఎల్), ఎల్అండ్టీ ఉమ్మడిగా 100వ ఆకాశ్ ఎయిర్‌ఫోర్స్ లాంచర్‌ను భారత వాయుసేనకు విజయవంతంగా అందించినట్టు ప్రకటించాయి. ఈ లాంచర్‌ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసింది. 100వ ఎయిర్‌ఫోర్స్ లాంచర్‌ను విజయవంతంగా అందించడం తమకు, భారత రక్షణ తయారీ రంగానికి ఓ మైలురాయిగా టీఏఎస్ఎల్ సీఈవో, ఎండీ సుకరన్ సింగ్ తెలిపారు. ఎల్అండ్టీ హోల్‌టైమ్ డైరెక్టర్ జయంత్ పాటి ల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
దేశంలో బులెట్ ట్రైన్, జాక్‌పాట్ కొట్టేసిన ప్రముఖ సంస్థ!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ సంస్థ భారీ బులెట్ రైలు కాంట్రాక్టును దక్కించుకుంది. నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) నుంచి ముంబై–అహ్మదాబాద్ హై–స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టును దక్కించుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. సుమారు 116 రూట్ కిలోమీటర్ల మేర ఈ ట్రాక్‌ను నిర్మించాల్సి ఉంటుంది. గంటకు 320 కి.మీ. వరకూ వేగంతో రైలు ప్రయాణించేందుకు అనువు గా దీన్ని రూపొందించాలి. ఇందుకోసం జపాన్‌కి చెందిన షింకన్సెన్ ట్రాక్ టెక్నాలజీని ఎల్అండ్ టీ ఉపయోగించనుంది. రూ. 2,500 కోట్లు–రూ. 5,000 కోట్ల వరకూ విలువ చేసే ప్రాజెక్టులను ఎల్అండ్టీ సంస్థ భారీ కాంట్రాక్టుగా వర్గీకరిస్తుంది చదవండి👉దేశంలోని తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ అదిరిపోయిందిగా..! -
ఇంజనీర్లకు ఎల్అండ్టీ చాన్స్
న్యూఢిల్లీ: నిర్మాణ, ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ 2021లో సుమారు 1,100 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లను నియమించుకునే ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో కొనసాగుతున్న నియామకాల్లో భాగంగా.. ప్రతిష్టాత్మక ఐఐటీ సంస్థలకు చెందిన 250 మంది విద్యార్థులకు ఆఫర్లను అందించినట్టు చెప్పారు. ఏటా తాము 1,100 మందికిపైగా ఇంజనీర్లను నియమించుకుంటామని చెబుతూ.. అందులో 90 శాతం మంది ఐఐటీలు, ఎన్ఐటీల వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చెందిన వారే ఉంటారని స్పష్టం చేశారు. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులపై ఎల్అండ్టీ ఎంఎఫ్ ప్రచారం ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘లేట్ లతీఫ్ 2021’ పేరుతో ఒక డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. పన్ను ఆదా కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో ముందు నుంచే పెట్టుబడులు పెట్టడానికి ఉన్న ప్రాధాన్యం గురించి ఇన్వెస్టర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించనున్నట్టు తెలిపింది. లక్ష్యానికి ఎంత మేర పెట్టుబడులు పెట్టాలి తెలియజేసే కాలిక్యులేటర్ తదితర సమాచారాన్ని www.ltfs.com/companies/lnt-investment-management/elss.html పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ ప్రకటించింది. ఈవైలో కొత్తగా 9,000 మంది నిపుణులకు చోటు 2021లో నియమించుకోనున్నట్టు సంస్థ ప్రకటన ముంబై: ఎర్నెస్ట్ అండ్ యంగ్ సర్వీసెస్ (ఈవై) 2021లో వివిధ టెక్నాలజీ విభాగాల్లో 9,000 మంది నిపుణులను భారత్‌లో నియమించుకోనున్నట్టు ప్రకటించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ (స్టెమ్) కోర్సులు చదివిన వారు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, అనలైటిక్స్, ఇతర ఆధునిక టెక్నాలజీలకు సంబంధించి ఈ నియామకాలు ఉంటాయని ఈవై తెలిపింది. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని మా క్లయింట్లు టెక్నాలజీ ఆధారిత పరివర్తనం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయాణంలో వారికి మేము మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా మా సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాము. కనుక రానున్న సంవత్సరంలో నియామకాలను గణనీయంగా పెంచబోతున్నాము’’ అంటూ ఈవై ఇండియా పార్ట్నర్ రోహన్ సచ్దేవ్ తెలిపారు. ప్రస్తుతం ఈవై ఇండియా పరిధిలో 50,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 36 శాతం స్టెమ్ విభాగానికి చెందిన వారే ఉన్నారు. -
మైండ్‌ట్రీపై మైండ్‌గేమ్!!
ఐటీ సంస్థ మైండ్‌ట్రీ కోసం ఇటు వ్యవస్థాపకులు, అటు దిగ్గజ సంస్థ ఎల్అండ్టీ మధ్య పోరు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. కంపెనీపై పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు ఇటు వ్యవస్థాపకులు ప్రయత్నిస్తుండగా.. టేకోవర్ చేసేందుకు అటు ఎల్అండ్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మెజారిటీ వాటాదారు కాఫీ డే ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థకి చెందిన 20.3 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఓపెన్ ఆఫర్ కూడా ప్రకటిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కూడా తెలియజేసింది. టేకోవర్ తర్వాత కూడా మైండ్‌ట్రీ .. లిస్టెడ్ కంపెనీగానే కొనసాగుతుందని ఎల్అండ్టీ సీఈవో ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు, కంపెనీ చేజారిపోకుండా కాపాడుకునేందుకు మైండ్‌ట్రీ వ్యవస్థాపకుల్లో ఒకరైన సుబ్రతో బాగ్చీ.. తాజాగా (మార్చి 17న) ఒడిశా స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ పదవికి రాజీనామా చేసి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. ’మైండ్‌ట్రీని బలవంతంగా టేకోవర్ చేసే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి, కంపెనీని కాపాడుకునేందుకు వెళ్లక తప్పడం లేదు. చెట్టును (ట్రీ) నరికేసి ఆ స్థానంలో షాపింగ్ మాల్ కట్టేందుకు బుల్డోజర్లు, రంపాలతో వచ్చిన వాళ్ల నుంచి కంపెనీని కాపాడుకోవాల్సి ఉంది’ అంటూ ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఒకవేళ మైండ్‌ట్రీని గానీ ఎల్అండ్టీ చేజిక్కించుకోగలిగిందంటే.. దేశీ ఐటీ రంగంలో ఇది తొలి హోస్టైల్ టేకోవర్ కానుంది. ఎల్అండ్టీ ఆఫర్ .. మైండ్‌ట్రీలో పెద్ద వాటాదారైన సిద్ధార్థ నుంచి వాటాల కొనుగోలు కోసం ఎల్అండ్టీ షేరు ఒక్కింటికి రూ. 980 చొప్పున దాదాపు రూ. 3,269 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే ఓపెన్ మార్కెట్ నుంచి ఇంకో 15 శాతం కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 2,434 కోట్లు చెల్లించాల్సి వస్తుంది. మరోవైపు, షేరు ఒక్కింటికి రూ. 980 చొప్పున రేటుతో మరో 31 శాతం వాటాల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకోసం దాదాపు రూ. 5,027 కోట్లు వెచ్చించాల్సి రానుంది. మొత్తం మీద మూడంచెల ఈ డీల్‌తో మైండ్‌ట్రీలో ఎల్అండ్టీకి 66.3 శాతం దాకా వాటాలు లభించే అవకాశం ఉంది. ఇందుకోసం మొత్తం రూ. 10,730 కోట్ల దాకా వెచ్చించే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌కు యాక్సిస్ క్యాపిటల్, సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా సంస్థలు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు, టేకోవర్ యత్నాలను ఎదుర్కొనేందుకు వ్యవస్థాపకులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్ధార్థ నుంచి వాటాలను బైబ్యాక్ చేయడంపైనా దృష్టి పెడుతున్నారు. ఇందుకోసం గత రెండు నెలలుగా కేకేఆర్, బేరింగ్ ఏషియా, క్రిస్‌క్యాపిటల్ తదితర ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, ఇవి ముందుకు సాగుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు మూడు ప్రధాన కారణాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. కంపెనీ యాజమాన్య అధికారాన్ని ఎక్కువగా వదులుకునేందుకు వ్యవస్థాపకులు సిద్ధంగా లేకపోవడం, ఎల్అండ్టీ ఇచ్చే ఆఫర్‌కి దీటుగా చాలా మటుకు ఇన్వెస్టర్లు నిధులు వెచ్చించే అవకాశాలు లేకపోవడం, ఎల్అండ్టీతో పోరాటమంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. టేకోవర్‌కు బీజం.. 1999లో సుబ్రతో బాగ్చీ, అశోక్ సూతా, నమకల్ పార్థసారథి, కృష్ణకుమార్ నటరాజన్, స్కాట్ స్టేపుల్స్ తదితరులు 10 మంది కలిసి మైండ్‌ట్రీ కన్సల్టింగ్ సంస్థను ఏర్పాటు చేశారు. 2000లో వీజీ సిద్ధార్థ నుంచి తొలి విడతగా కొంత మేర పెట్టుబడులు సమీకరించారు. 2008లో మైండ్‌ట్రీ కన్సల్టింగ్ పేరు మైండ్‌ట్రీగా మారింది. 2011లో వ్యవస్థాపక చైర్మన్ అశోక్ సూతా రాజీనామా చేసినప్పుడు ఆయన వాటాలను కూడా కొనుగోలు చేసిన సిద్ధార్థ.. అతి పెద్ద షేర్‌హోల్డర్‌గా మారారు. 2018లో మైండ్‌ట్రీ డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్న సిద్ధార్థ.. తన వాటాలను విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఐటీæ కార్యకలాపాల విభాగం (ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ –ఎల్టీఐ) కూడా ఉన్న ఎల్అండ్టీ అప్పుడే ఇతర సంస్థల కొనుగోలు ప్రయత్నాల్లో ఉండటంతో.. దీనిపైనా దృష్టి సారించింది. ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్‌తో సిద్ధార్థ చర్చలు కూడా జరిపారు. మిగతా వ్యవస్థాపకులను కూడా ఒప్పించగలిగితే.. మరింత అధిక రేటు ఇస్తామంటూ నాయక్ ఆఫర్ ఇవ్వడంతో.. సిద్ధార్థ ఆ ప్రయత్నాలూ చేశారు. కానీ, వ్యవస్థాపకులు ఇందుకు ఇష్టపడటం లేదు. రెండు సంస్థల నిర్వహణ తీరు, పని సంస్కృతిలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వారు భావిస్తుండటమే ఇందుకు కారణం. ఇవే కారణాలతో సంస్థాగత ఇన్వెస్టర్లు, క్లయింట్లు, ఉద్యోగులు ఈ డీల్‌పై విముఖంగా ఉన్నారంటూ ఇటీవలే ఎల్అండ్టీ బోర్డుకు కూడా వారు లేఖ రాసినట్లు సమాచారం. సోమవారం మైండ్‌ట్రీ షేరు బీఎస్ఈలో 1.74 శాతం పెరిగి రూ. 962.50 వద్ద క్లోజయ్యింది. రెండూ కలిస్తే.. దాదాపు 1 బిలియన్ డాలర్ల ఆదాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. క్లౌడ్, బిగ్ డేటా వంటి కొంగొత్త టెక్నాలజీల్లో నైపుణ్యాలు మైండ్‌ట్రీకి ప్లస్‌పాయింట్స్‌గా ఉండటంతో .. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ) దీనిపై ఆసక్తిగా కనపరుస్తోంది. ఎల్టీఐ నికర విలువ దాదాపు రూ. 4,387 కోట్లుగా ఉండగా.. 2018 డిసెంబర్ ఆఖరు నాటికి సంస్థ దగ్గర సుమారు రూ. 2,032 కోట్ల మేర నగదు, లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. మైండ్‌ట్రీలో 51 శాతం వాటాలు దక్కించుకున్న పక్షంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఎల్‌టీఐకి అదనంగా మైండ్‌ట్రీ నుంచి రూ. 460 కోట్ల దాకా లాభాలు దఖలుపడతాయి. రెండూ కలిశాయంటే.. ఆదాయాలు 1.7 బిలియన్ డాలర్ల దాకా ఉంటాయని అంచనా. తద్వారా దేశీ ఐటీలో ఆరు పెద్ద సంస్థ ఏర్పాటైనట్లవుతుంది. రెండింటికీ అమెరికా, యూరప్‌లే ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. టెక్నాలజీ, మీడియా, సర్వీసెస్ విభాగాల్లో మైండ్‌ట్రీ పటిష్టంగా ఉండటం.. ఎల్‌టీఐకి లాభించనుంది. మైండ్‌ట్రీ మొత్తం వ్యాపారంలో డిజిటల్ వాటా 49.5 శాతం కాగా ఎల్‌టీఐకి 37 శాతమే ఉంది. అంతేకాకుండా ఉద్యోగిపై సగటు ఆదాయాన్ని చూస్తే ఎల్టీఐ కన్నా మైండ్‌ట్రీదే పైచేయిగా ఉంది. మైండ్‌ట్రీకి ప్రస్తుతం 19,908 మంది ఉద్యోగులు, 340 మంది క్లయింట్స్ ఉన్నారు. వ్యవస్థాపకులకు 13 శాతం వాటాలు... ప్రస్తుతం ప్రమోటర్ల గ్రూప్‌లో భాగమైన బాగ్చీ, పార్థసారథి, నటరాజన్, మైండ్‌ట్రీ సీఈవో రోస్టో రవనన్ తదితరులకు 13 శాతం వాటాలు ఉన్నాయి. నటరాజన్‌కు 3.72 శాతం, పార్థసారథికి 1.43 శాతం, రవనన్కు 0.71 శాతం, బాగ్చీకి 3.1 శాతం వాటాలు ఉన్నాయి. -
పాతబస్తీ... మెట్రో నాస్తి?
⇒18 నెలల ఆలస్యంతో ఆర్థిక భారం... ⇒పెరిగిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్మాణ సంస్థ పేచీ! ⇒జూన్‌లో మియాపూర్– ఎస్.ఆర్.నగర్ రూట్లోనే ⇒మెట్రో పరుగులు.. పాతబస్తీ రూట్‌పై ఇంకా లేని స్పష్టత సిటీబ్యూరో: గ్రేటర్ వాసుల కలల మెట్రో ప్రాజెక్టు పాతనగరవాసులకు ‘కల’గానే మిగలనుంది. ప్రస్తుతం మెట్రో పనుల పురోగతి చూస్తే ఇదే విషయం సుస్పష్టమవుతోంది. సిటీలో నాగోల్–రాయదుర్గం (28 కి.మీ), ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ), జేబీఎస్–ఎంజీబీఎస్ (10 కి.మీ) మార్గాల్లోనే మెట్రో పనులు ఊపందుకున్నాయి. కానీ ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో సుమారు 5.3 కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని ప్రభుత్వం ఖరారు చేయకపోవడంతో పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మెట్రో రెండోదశ ప్రాజెక్టు సైతం కాగితాలకే పరిమితమైంది. ఇక ఈ ఏడాది జూన్‌లో మియాపూర్–ఎస్.ఆర్‌నగర్ రూట్లోనే మెట్రోరైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నట్లు తెలిసింది. నాగోల్–బేగంపేట్ మార్గంలో మెట్రో పరుగులకు పలు అడ్డంకులున్నాయి. ప్రధానంగా బేగంపేట్, సికింద్రాబాద్ ఒలిఫెంటా రైలు ఓవర్బ్రిడ్జిల నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతో ఈ రూట్లో మెట్రో రైళ్లు కూతపెట్టే అవకాశాలు కనిపించడంలేదు. నగరంలో మెట్రో పనులు ప్రారంభమై సుమారు ఐదేళ్లు కావస్తోంది. కానీ పాతనగరంలో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో ఇప్పటివరకు పనులు ఊపందుకోలేదు. ప్రధానంగా ఈ రూట్లో 30కి పైగా ఉన్న ప్రార్థనాస్థలాల మనుగడకు ముప్పు వాటిల్లకుండా మెట్రో మార్గాన్ని మూసీనది మధ్యనుంచి మళ్లించాలని అప్పట్లో కొన్ని రాజకీయపార్టీలు డిమాండ్‌చేశాయి. దీంతో రెండేళ్లక్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో మార్గాన్ని మార్చుతామని ప్రకటించింది. ఈ అంశంపై నగరంలోని అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తరవాతనే అలైన్మెంట్ ఖరారు చేస్తామని తెలిపింది. కానీ ఇప్పటివరకు సమావేశం నిర్వహించలేదు. అలైన్మెంట్ ఖరారు చేయలేదు. ఇక మెట్రో మార్గాన్ని మూసీ నదీగర్భం నుంచి మళ్లిస్తే నిర్మాణ పరంగా పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, వాణిజ్యపరంగా తమకు గిట్టుబాటుకాదని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ వర్గాలు ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో మెట్రో మార్గం కలగానే మిగలనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆలస్యంతో నాలుగువేల కోట్ల భారం.. గ్రేటర్లో మెట్రో పనులు 2012 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. నిర్మాణ ఒప్పందం ప్రకారం ఈ పనులను 2017 జూన్ నాటికి పూర్తిచేయాల్సి ఉంది. కానీ ఆస్తులసేకరణ ప్రక్రియ జఠిలంగా మారడం, కోర్టుకేసులు, రద్దీరూట్లలో పనులు చేపట్టేందుకు రైట్‌ఆఫ్‌వే సమస్యలు తలెత్తడం.. వెరసి ప్రాజెక్టును పూర్తిచేసే గడువు 2018 డిసెంబరుకు పొడిగించారు. దీంతో తొలుత అనుకున్న నిర్మాణ వ్యయం రూ.12,132 కోట్ల నుంచి ఇప్పుడు రూ.16,375 కోట్లకు చేరింది. ద్రవ్యోల్బణం, సిమెంటు, స్టీలు ధరల్లో హెచ్చుతగ్గులు, సిబ్బంది జీతభత్యాలు, యంత్రపరికరాల దిగుమతులు, వాటి అద్దెలు, నిర్మాణం కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీరేటు పెరగడం వంటి కారణాలతో వ్యయం రూ.4243 కోట్ల మేర పెరిగినట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమకు పరిహారంగా చెల్లించాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనీయకపోవడం గమనార్హం. జూన్‌లో మియాపూర్– ఎస్.ఆర్.నగర్ రూట్లోనే పరుగులు? ఈ ఏడాది జూన్ నెలలో మియాపూర్–ఎస్.ఆర్.నగర్(14 కి.మీ) రూట్లోనే మెట్రోరైళ్లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నాగోల్–బేగంపేట్ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీయాలంటే బేగంపేట్, సికింద్రాబాద్ ఒలిఫెంటా రైలు ఓవర్బ్రిడ్జిల నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులను మే నెలాఖరునాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ పనులు ఆలస్యమైతే జూన్‌లో ప్రారంభించే అవకాశాలు లేనట్టే. కాగా ఈ ఏడాది డిసెంబరు నాటికి నాగోల్–రాయదుర్గం(28 కి.మీ), ఎల్బీనగర్–మియాపూర్ (29కి.మీ)మార్గాల్లో మెట్రో మార్గాన్ని పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రకటించాయి. కాగితాలపైనే రెండోదశ... మెట్రో తొలిదశ పనులు ఊపందుకున్న తరుణంలో ప్రభుత్వం మెట్రో రెండోదశ ప్రాజెక్టును చేపడతామని రెండేళ్లక్రితం ఆర్భాటంగా ప్రకటించింది. పలు రూట్లలో సుమారు 56 కి.మీ మార్గంలో రెండోదశ మెట్రోను ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్,హైదరాబాద్ మెట్రోరైలు,ఎల్అండ్టీ సంస్థల ప్రతినిధులు ఏడాదిక్రితం ప్రతిపాదిత మార్గాల్లో పరిశీలన జరిపి సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏడాది కావస్తున్నా ఈవిషయంలో ఒక్క అడుగూ ముందుకుపడకపోవడం గమనార్హం. ప్రస్తుతం పనుల పురోగతి ఇదీ.. ⇒మూడు మార్గాల్లో మొత్తం 67 కి.మీ మార్గానికి గాను 52 కి.మీ మార్గంలో మెట్రో పిల్లర్ల నిర్మాణం, వీటిపై మెట్రోరైళ్లు పరుగులు తీసేందుకు వీలుగా వయాడక్ట్మార్గం సిద్ధమైంది. ⇒మొత్తం 65 స్టేషన్లకుగాను 40 స్టేషన్లు సిద్ధమయ్యాయి. మరో 25 స్టేషన్ల నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ⇒మొత్తం ప్రాజెక్టును 2018 డిసెంబరునాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది. ⇒మూడు రూట్లలో పరుగులుతీసేందుకు 57 మెట్రోరైళ్లు మియాపూర్, ఉప్పల్ మెట్రో డిపోల్లో సిద్ధంగా ఉన్నాయి. అసంపూర్తిగా మిగిలిన పనులివీ.. ⇒ మొత్తం 65 స్టేషన్లలో 17 స్టేషన్లకు మాత్రమే పార్కింగ్ వసతులున్నాయి. మిగతా వాటికి పార్కింగ్ స్థలాల లభ్యత కష్టసాధ్యంగా మారింది. ⇒ ఎల్భీనగర్–మియాపూర్ మార్గంలో: అసెంబ్లీ స్టేషన్ నిర్మాణం మొదలుకాలేదు. 19 పిల్లర్లు, 8 పునాదులు అసంపూర్తిగా ఉన్నాయి. లక్డీకాపూల్, మలక్‌పేట్ ఆర్ఓబీల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ⇒జేబీఎస్–ఫలక్‌నుమా మార్గంలో: బోయిగూడ స్టీలు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. నారాయణగూడ ఫ్లైఓవర్, పుత్లీబౌలి మెట్రో మార్గం పైనుంచి మెట్రో వయాడక్ట్ నిర్మాణం ప్రారంభంకాలేదు. ⇒నాగోల్–రాయదుర్గం మార్గంలో:ఒలిఫెంటా,బేగంపేట్ రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణం పూర్తికాలేదు. అమీర్‌పేట్ మైత్రీవనం,యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో వయాడక్ట్ మార్గం పూర్తికాలేదు. ⇒సుమారు వంద ఆస్తుల సేకరణకు సంబంధించి బాధితులకు పరిహారం అందించకపోవడం,న్యాయవివాదాలు పనుల వేగాన్ని దెబ్బతీస్తున్నాయి. -
మెట్రో కూత ఇంకెప్పుడు!
-
మెట్రో కూత ఇంకెప్పుడు!
- మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన మెట్రో రైలు ప్రారంభం - మియాపూర్- ఎస్ఆర్నగర్, నాగోల్-మెట్టుగూడ రూట్లు సిద్ధం - ప్రారంభ తేదీపై సర్కారు మౌనం సాక్షి, హైదరాబాద్: లక్షల్లో వాహనాలు... అతుకులుగతుకుల రహదారులు... బిజీ లైఫ్‌లో గంటలకు గంటలు ట్రాఫిక్ పద్మవ్యూహాలను ఛేదించడానికే ఖర్చవుతోంది నగరవాసులకు! మెట్రో రైలు పరుగు పెడితే ఆ కష్టాలు కొంతైనా తీరతాయని భావించిన వారికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఈ దసరాకన్నా రైలు పట్టాలెక్కుతుందనుకుని ఆశించిన వారి ఆశలపై ఇటు సర్కారు... అటు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ నీళ్లు జల్లుతున్నాయి. ప్రారంభ తేదీపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. రెండు రూట్లు సిద్ధం... ఇప్పటికే నాగోల్-మెట్టుగూడ (8 కి.మీ.), మియాపూర్-ఎస్.ఆర్.నగర్ (11 కి.మీ.) మెట్రో మార్గం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అవసరమైన 57 రైళ్లు కూడా ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ... వాణిజ్య రాకపోకలకు అవసరమైన అనుమతులు సైతం ఇచ్చేసింది. కానీ ఆస్తుల సేకరణ, రైట్ ఆఫ్ వే సమస్యల కారణంగా మెట్రో నిర్మాణ గడువు 2017 జూన్ నుంచి 2018 డిసెంబరు వరకు పొడిగించడంతో నిర్మాణ వ్యయం సుమారు రూ.3వేల కోట్లు పెరగనుంది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్మాణ సంస్థ కోరుతున్నట్లు తెలిసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలేవీ రాకపోవడంతో ప్రారంభం విషయంలో నిర్మాణ సంస్థ సైతం ముందుకురావడం లేదని సమాచారం. మరోవైపు ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో అలైన్మెంట్ మార్పుపై ప్రభుత్వం ఎలాంటి దిశానిర్దేశం చేయకపోవడంతో మెట్రో పనులు ప్రారంభం కాలేదు. పురోగతి సరే.. పరుగులేవీ... ఎల్బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్-రహేజా ఐటీపార్క్... మూడు కారిడార్లలో మొత్తం 72 కి.మీ. మార్గంలో మెట్రో పనులు జరుగుతున్నాయి. మొత్తం 2,748 పిల్లర్లకు గానూ 2,157 పిల్లర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 48 కి.మీ. మార్గంలో పట్టాలు పరిచేందుకు వీలుగా స్పాన్లు ఏర్పాటు చేశారు. ప్రధానంగా మియాపూర్-ఎస్.ఆర్‌నగర్ రూట్లో స్టేషన్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. నాగోల్-మెట్టుగూడ మార్గంలోని స్టేషన్లకు అన్ని హంగులూ అద్దారు. కానీ ఈ మార్గాల్లో మెట్రో కూత ఎప్పుడన్నది సస్పెన్స్‌గా మారింది. అలైన్‌మెంట్‌పై అదే తీరు... ఇక ఎంజీబీఎస్-ఫలక్‌నుమా (5.3కి.మీ.) మార్గంలోనూ అలైన్మెంట్ మార్చాలని గతంలో పట్టుబట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తరవాత నిపుణుల కమిటీని నియమించింది. ప్రభుత్వం సూచించిన ప్రకారం మెట్రో మార్గాన్ని మూసీ నది మీదుగా మళ్లిస్తే వాణిజ్య పరంగా ఉపయుక్తం కాదని, సాంకేతికంగానూ ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అయితే రూటు మార్పు అంశంపై నగరంలోని అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ... ఏడాదిగా ఎలాంటి సమావేశం నిర్వహించలేదు. దీంతో ఈ రూట్లో పనులు మొదలు కాలేదు. ఇక మూడు కారిడార్లలో ఏర్పాటు కానున్న 64 స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మినీ బస్సులను నడుపుతామని ప్రకటించినా... నేటికీ ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు 18 స్టేషన్ల వద్ద మాత్రమే పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మిగతా చోట్ల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకం! -
మెట్రో పనుల్లో జాప్యం అందుకేనా?
సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు ప్రాజెక్టు తొలిదశ ప్రారంభంపై నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వం నుంచి మరిన్ని రాయితీలు,ప్రోత్సాహకాలు ఆశించి ప్రారంభాన్ని మరింత ఆలస్యం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాగోల్–మెట్టుగూడా(8కి.మీ),మియాపూర్–ఎస్.ఆర్.నగర్(12 కి.మీ)మార్గంలో మెట్రో మార్గం పూర్తయ్యింది. ఈ రెండు రూట్లలో అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వాణిజ్య కార్యకలాపాల ప్రారంభానికి సంస్థ వర్గాలు ముందుకు రాకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 2011లో కుదిరిన నిర్మా ణ ఒప్పందం ప్రకారం ఎల్భీనగర్–మియాపూర్,నాగోల్–రహేజా ఐటీపార్క్,జేబీఎస్–ఫలక్‌నుమా మొత్తం మూడు కారిడార్లలో 72 కి.మీ మెట్రో మార్గాన్ని 2017 జూన్ లోగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే రైట్‌ఆఫ్‌వే అనుకున్న సమయానికి దక్కకపోవడం, ట్రాఫిక్ అనుమతులు, ఆస్తుల సేకరణ ప్రక్రియలో జాప్యం, కోర్టు కేసుల కారణంగా 2018 డిసెంబర్‌కు ప్రాజెక్టు గడువు ను పొడిగించారు. దీంతో యంత్రసామాగ్రి అద్దెలు, పెట్టుబడి, వడ్డీలతో కాంట్రాక్టు సంస్థపై సుమారు రూ.3 వేల కోట్ల అదనపు భారం పడినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని.. లేని పక్షంలో ఆ మేరకు రాయితీలు కల్పించాలని పట్టుబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అవసరమైతే ఒప్పందానికి సవరణలు చేయాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. అయితే ఎల్అండ్టీ కోర్కెలను తీర్చేందుకు సర్కారు పెద్దలు అంగీకరించకపోవడం తో సయోధ్య కుదరక ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. జేబీఎస్–ఫలక్‌నుమా(కారిడార్–2) మార్గం లో ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.3 కి.మీ)మార్గంలో అలైన్మెంట్ మార్పుపై సర్కారు ఎటూ తేల్చకపోవడంతో ఈరూట్లో పనులు ప్రారంభం కాలేదు. ఈ లెక్క న పాతనగరానికి మరో రెండేళ్లు ఆలస్యంగా మెట్రో రైళ్లు వెళ్లడం ఖాయమని సంకేతాలు వెలువడుతున్నా యి. ప్రస్తుతం మూడు కారిడార్లలో 72 కి.మీ మార్గానికి గాను.. 56 కి.మీ మార్గంలో మెట్రో పిల్లర్ల ఏర్పాటు, 47 కి.మీ మార్గంలో పిల్లర్లపై ట్రాక్ ఏర్పాటుకు అవసరమైన వయాడక్ట్ సెగ్మెంట్ల ఏర్పాటు పనులు పూర్తయినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. దసరాకు ప్రారంభంపై వీడని సస్పెన్స్... ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మియాపూర్–ఎస్.ఆర్.నగర్,నాగోల్–మెట్టుగూడా మార్గాల్లో దసరాకు మెట్రో రైళ్ల రాకపోకలు సాగిస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఇటు సర్కారు పెద్దలు అటు హెచ్ఎంఆర్,ఎల్అండ్టీ వర్గాలు మాత్రం తొలిదశ ప్రారంభ తేదీపై పెదవి విప్పకపోవడం గమనార్హం. వారి తీరు ఎవరిదారి వారిదే అన్న చందంగా మారడంతో గ్రేటర్ సిటీజన్లు నిరాశకు లోనవుతున్నారు. పార్కింగ్..మినీ బస్సుల రాకపోకలపైనా అదే తీరు.. నాగోల్–మెట్టుగూడా,మియాపూర్–ఎస్.ఆర్.నగర్ రూట్లలో మొత్తం 20 కి.మీ మార్గంలో మెట్రో మార్గం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఈ రూట్లలో ఉన్న 16 మెట్రో స్టేషన్లలో అవసరమైన పార్కింగ్ వసతులు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది. మరోవైపు ప్రయాణీకులకు వీలుగా మినీ బస్సులు అందుబాటు లో లేకపోవడం గమనార్హం. కాగా నిర్మాణ ఒప్పం దంలో మొత్తం మూడు కారిడార్లలో ఏర్పాటు కానున్న 65 స్టేషన్లలో ప్రతి స్టేషన్‌కు విధిగా పార్కింగ్ వసతులు, స్టేషన్లకు సమీపంలో ఉండే కాలనీలకు మినీ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కానీ ఈ విషయంలో నేటికీ స్పష్టత కొరవడడం గమనార్హం. -
ఫ్లిప్‌కార్ట్ బాటలోనే ఎల్అండ్టీ
ఐఐఎం పట్టభద్రులకు ఆఫర్ లెటర్లు ఇచ్చినట్లే ఇచ్చి ఎంతకీ ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఫ్లిప్‌కార్ట్ మీద జనం దుమ్మెత్తి పోసిన సంగతి గుర్తుంది కదూ. ఇప్పుడు అదేబాటలో ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ కూడా పయనిస్తోంది. వివిధ కాలేజీలకు చెందిన దాదాపు 1500 మంది విద్యార్థులకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను ఆ కంపెనీ రద్దుచేసింది. అంటే.. ముందు ఉద్యోగం ఇస్తాం రమ్మని చెప్పి, ఆ తర్వాత లేదు పొమ్మందన్న మాట. దాంతో పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడింది. తమకు చేతిలో ఉద్యోగం ఉంది కదా అన్న నమ్మకంతో వేరే ప్రయత్నాలు ఏమీ చేయని వాళ్లు.. చదువుకోడానికి తాము తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్లను తీర్చాలంటూ బ్యాంకుల నుంచి పదే పదే ఫోన్లు రావడంతో ఏం చేయాలో తెలియక వాపోతున్నారు. పైగా, ఒకసారి ఒక కంపెనీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చిందంటే, మరో కంపెనీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూకు వెళ్లడానికి వీల్లేదని తమిళనాడులో దాదాపు అన్ని కాలేజీలలో నిబంధన ఉందని ఓ విద్యార్థి చెప్పాడు. తమ పెర్ఫార్మెన్సు తగినవిధంగా లేని కారణంగా ఆఫర్ రద్దుచేస్తున్నట్లు మెయిల్ పంపారని, ఇప్పుడు ఏం చేయాలని వాపోయాడు. ప్లేస్మెంట్లు బాగున్నాయనే ఈ కాలేజీలలో ఫీజు ఎక్కువైనా చేరి, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నామని, ఇప్పుడు బ్యాంకులు దాదాపు ప్రతిరోజూ తమకు లేఖలు పంపుతున్నాయని మరో విద్యార్థి ఆందోళన వ్యక్తం చేశాడు. ఇన్నాళ్ల బట్టి తొందరపడొద్దు, జాయినింగ్ డేట్ త్వరలోనే చెబుతామన్న ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ వాళ్లు ఇప్పుడు చావుకబురు చల్లగా చెప్పారని మండిపడ్డాడు. తమకు జరిగిన అన్యాయంపై విద్యార్థులు నిరాహార దీక్షలకు కూడా దిగారు. మరికొన్ని కంపెనీలు కూడా.. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ల పేర్లు బయటకు వచ్చాయి కాబట్టి విషయం తెలుస్తోంది కానీ, ఇంకా చాలా కంపెనీలు ఇలాగే చేస్తున్నాయి. ఇన్మోర్బి, కార్దేఖో, హాప్స్కాచ్ లాంటి కంపెనీలు కూడా తొలుత ఆఫర్ లెటర్లు ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదని అంటున్నారు. దీనివల్ల కాలేజీల ట్రాక్ రికార్డు కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
మెట్రో అలైన్మెంట్ మార్పులపై హర్షం
చారిత్రక, వారసత్వ కట్టడాలకు భంగం వాటిల్లకుండా సుల్తాన్‌బజార్, అసెంబ్లీ, పాతనగరంలో మెట్రో అలైన్మెంట్ మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం శ్రీకారం చుట్టడం పట్ల పాతనగర వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాతనగరంలో వారసత్వ కట్టడాలు, ప్రార్థనాస్థలాల మనుగడకు ఎలాంటి నష్టం వాటిల్లదని, పర్యాటక రంగానికి ఢోకా ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా తాజా మార్పులతో పాతనగరంలోని ఏడు చారిత్రక దేవాలయాలు, 28 ప్రార్థనాస్థలాలు, వందలాది నివాసాలకు నష్టం వాటిల్లకుండా జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్-2)రూట్లో మార్గం మార్పుపై నిర్మాణసంస్థకు పూర్తివివరాలతో బుధవారం రాష్ట్ర సర్కారు లేఖ అందజేయనున్న విషయం విదితమే. ఇక అలైన్మెంట్ మార్పుపై హెచ్ఎంఆర్, ఎల్అండ్టీ నిపుణులతోపాటు మెట్రో పనుల నాణ్యత, డిజైనింగ్‌ను పర్యవేక్షిస్తున్న స్వతంత్ర ఇంజినీరింగ్ సంస్థ లూయిస్ బెర్జర్ నిపుణులు సైతం సుల్తాన్‌బజార్, అసెంబ్లీతోపాటు పాతనగరంలో అలైన్మెంట్ మారనున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి త్వరలో తాజా అలైన్మెంట్ ఖరారు చేయనున్నారు. ఇందుకు అయ్యే అదనపు వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు సిద్ధంగా ఉన్న విషయం విదితమే. పాతనగరంలో అలైన్మెంట్ మార్పులు ఇక్కడే... కారిడార్-2 పరిధిలోని జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో (14.78కి.మీ) మెట్రో రైలుమార్గం పాతబస్తీలోని దారుషిఫా-మీర్‌చౌక్-శాలిబండ మీదుగా వెళితే పలు మసీదులు, అషురుఖానాలు, ఛిల్లాల మనుగడకు నష్టం వాటిల్లుతుందని ఎంఐఎం పార్టీతోపాటు ఇన్టాక్ వంటి వారసత్వ కట్టడాల పరిరక్షణ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈనేపథ్యంలోనే అలైన్మెంట్ మార్పునకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. కాగా తాజాగా మారనున్న మెట్రో మార్గాన్ని బహదూర్‌పూరా- కాలాపత్తర్- ఫలక్‌నుమా మీదుగా మళ్లించాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో నిపుణుల బృందం ఆయా మార్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నెలరోజుల్లోగా నూతన మెట్రో మార్గాన్ని ఖరారు చేయనుంది. నిపుణుల బృందం పరిశీలన అనంతరం ప్రభుత్వానికి సమర్పించనున్న నివేదికలో అలైన్మెంట్ మార్పునకు అయ్యే అదనపు వ్యయం, ఆస్తులు, స్థలాల సేకరణ, బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, మెట్రో మార్గంలో వచ్చే మలుపులు వంటి అంశాలపై స్పష్టతరానుంది. -
రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తాం: ఎల్అండ్టీ
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తాము అన్ని విధాలా సహకరిస్తామని ఎల్అండ్టీ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఎల్అండ్టీ సంస్థ ఛైర్మన్ కేఎం నాయక్ ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ వల్ల తెలంగాణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతుందనే ఆశిస్తున్నట్లు నాయక్ ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే అన్ని రకాలుగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సూరత్‌లో ఉన్న ఎల్అండ్టీ మాన్యుఫాక్చరింగ్‌ను సందర్శించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను ఈ సందర్భంగా కేఎం నాయక్ కోరారు. -
మెట్రో రూటు మార్పు అనుమానమే!
-
మెట్రో రూటు మార్పు అనుమానమే!
మెట్రోరైలు అలైన్‌మెంటు మార్పుపై ఎల్అండ్టీ వర్గాల్లో తర్జనభర్జన మొదలైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద అలైన్మెంట్ మార్పునకు సూత్రప్రాయంగా అంగీకరించినా.. ఇప్పుడు మళ్లీ ఆలోచన మొదలైంది. మెట్రో మార్గాన్ని మార్చడానికి ఒప్పుకోవాలా వద్దా అని మల్లగుల్లాలు పడుతున్నారు. వెయ్యి కోట్లు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నా, అది తాము తెచ్చిన రుణాల మీద వడ్డీ కట్టడానికే సరిపోతుందని ఎల్అండ్టీ అధికారులు అంటున్నారు. ఇప్పుడు మూడుచోట్ల మార్గం మార్చాల్సి వస్తే కేవలం ఇంజనీరింగ్ సర్వేకే ఏడాది సమయం పడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెట్రో అలైన్‌మెంటు మార్పు విషయాన్ని నిర్ధారించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. -
ఆ విగ్రహానికి ఖర్చు.. రూ. 2979 కోట్లు!
ప్రధానమంత్రి నరేంద్రమోడీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' ఖర్చు దాదాపు 2979 కోట్ల రూపాయలుగా తేలింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని మోడీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విగ్రహ ఏర్పాటు కాంట్రాక్టును లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ)కి అప్పగించారు. భారత తొలి హోం మంత్రి అయిన సర్దార్ పటేల్ విగ్రహాన్ని 182 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విగ్రహం వివరాలను గుజరాత్ ముఖ్యమంత్రి ఆనంది పటేల్ ఓ కార్యక్రమంలో వివరించారు. నాలుగేళ్ల వ్యవధిలో రూ. 2979 కోట్ల వ్యయంతో విగ్రహ నిర్మాణం మొత్తం పూర్తవుతుందని, దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఎల్అండ్టీ కంపెనీకి దీని కాంట్రాక్టును ఇస్తున్నామని ఆమె చెప్పారు. ప్రధాన విగ్రహం ఏర్పాటుకు రూ. 1347 కోట్లు, ఎగ్జిబిషన్ హాలు, కన్వెన్షన్ సెంటర్లకు రూ. 235 కోట్లు, మెమోరియల్ నుంచి గట్టుమీదకు వచ్చేందుకు వంతెన కోసం రూ. 83 కోట్లు, నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు దాని నిర్వహణకు రూ. 657 కోట్లు ఖర్చవుతాయని సీఎం పటేల్ వివరించారు. న్యూయార్క్ నగరంలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు 93 మీటర్లు కాగా, దానికి రెట్టింపు పరిమాణంలో.. అంటే 182 మీటర్ల ఎత్తున పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. -
డిసెంబర్‌లోగా తేల్చండి!
‘మెట్రో’ ఆస్తుల సేకరణపై సర్కారుకు స్పష్టం చేసిన ఎల్అండ్టీ లేకుంటే పనులు గడువులోగా పూర్తి చేయలేవున్న సంస్థ 3 కారిడార్ల పరిధిలో 1,700 ఆస్తుల సేకరణకు విడుదలే కాని నోటిఫికేషన్ కేంద్రం కనుసన్నల్లో అలైన్మెంట్ మార్పులు? హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రాజెక్టు ఆస్తుల సేకరణ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిచేయని పక్షంలో ప్రాజెక్టు పనులు ముందుకు సాగవని ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ రాష్ట్ర సర్కారుకు స్పష్టం చేసింది. నాగోల్-శిల్పారామం, ఎల్బీనగర్ -మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లలో మొత్తంగా 1,700 ఆస్తుల సేకరణ విషయంలో రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరచూ విధిస్తున్న తుది గడువులు సత్ఫలితాన్నివ్వలేదని పేర్కొన్నట్లు తెలిసింది. ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తిచేసి ప్రధాన రహదారులపై తమకు పనులు చేపట్టేందుకు వీలుగా రహదారి మధ్యలో 8 మీటర్ల విస్తీర్ణంలో బార్కేడింగ్(ఇనుపకంచె)కు అనుమతివ్వడంతోపాటు వాహనాల రాకపోకలకు వీలుగా రైట్‌ఆఫ్‌వే ఏర్పాటు చేయని పక్షంలో మొత్తం 72 కి.మీ ప్రాజెక్టు పనులను 2017 చివరినాటికి పూర్తిచేయడం అసాధ్యమని.. తాము ఇప్పటివరకు చేపట్టిన పనులపై సమీక్ష జరుపుకోక తప్పదని ఎల్అండ్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి కరాఖండిగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా బేగంపేట్ గ్రీన్‌ల్యాండ్స్, నాంపల్లి, సోమాజిగూడ, అమీర్‌పేట, సికింద్రాబాద్ ఇస్కాన్ దేవాలయం, జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లోని ఎంజీబీఎస్, సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషేర్‌గంజ్, జంగమ్మెట్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో ఆస్తుల సేకరణ ప్రక్రియకు జీహెచ్ఎంసీ ఇప్పటివరకూ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో ఆయా ప్రాంతాల్లో పనులు మరింత జాప్యం కాక తప్పదని తెలిపినట్లు సవూచారం. భూసేకరణ-పునరావాస చట్టం-2012 ప్రకారం బాధితులకు ఎంత మేర పరిహారం అందజేస్తారన్న విషయంలోనూ జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ సంస్థలు స్పష్టత ఇవ్వకపోవడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటివరకు పనులే మొదలు పెట్టలేదని తేటతెల్లం చేసింది. మరోవైపు కారిడార్-2 పరిధిలోని జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లో ఎంఐఎం పార్టీ తాజాగా తాము సూచించిన మార్గాల్లోనే మెట్రో మార్గాన్ని మళ్లించాలని పట్టుబడుతుండటంతో ఈ విషయంలో ప్రభుత్వం తక్షణం తమ విధానం స్పష్టం చేయాలని, లేని పక్షంలో ప్రాజెక్టు పనులపై నీలినీడలు కమ్ముకోవడం తథ్యమని నిర్మాణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రాజెక్టు పనుల్లో సిగ్నలింగ్, కవుూ్యనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టం, టికెట్ విక్రయ యంత్రాలు, స్మార్ట్‌కార్డులు, ఆటోమేటిక్ గేట్లు, పట్టాలు పరిచే పనులను పలు విదేశీ సంస్థలకు సబ్‌కాంట్రాక్టులు ఇచ్చామని గడువులోగా పనులు పూర్తిచేయకుంటే సదరు ఏజెన్సీలు వెనుకడుగు వేస్తాయని ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలి సింది. మరోవైపు పలు ప్రభుత్వరంగ బ్యాంకుల రుణాలపై వడ్డీల భారం పెరుగుతుందని, నగరానికి తరలించిన భారీయంత్ర సావుగ్రి, క్రేన్లు, లాంచింగ్ గడ్డర్ల నిర్వహణ ఖర్చులూ తడిసి మోపెడవుతాయని సర్కారు దృష్టికి తీసుకొచ్చింది. మరోవైపు మెట్రో కారిడార్ల పరిధిలో ఎర్రమంజిల్, హైటెక్‌సిటీ, రాయదుర్గం, అమీర్‌పేట్ ప్రాంతాల్లో తాము నిర్మించాలనుకున్న మాల్స్‌కు జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ నుంచి అందాల్సిన అనుమతులు రెండేళ్లుగా జాప్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రం కోర్టులో అలైన్మెంట్ బంతి..? అసెంబ్లీ, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గక తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇటీవలే మెట్రో ప్రాజెక్టును ట్రామ్వే యాక్ట్ పరిధి నుంచి మినహాయించి సెంట్రల్ మెట్రో యాక్ట్ పరిధిలోకి తీసుకువచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో అలైన్మెంట్ మార్చిన పక్షంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తాజాగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మారిన అలైన్‌మెంట్‌ను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తిరిగి ప్రకటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ శాఖ నుంచి కొర్రీ ఎదురయితే అలైన్మెంట్ మార్పుపై వెనక్కి తగ్గక తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాగా మరో వారం రోజుల్లోగా అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. -
బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకే..
‘మెట్రో’ వివాదంపై కేంద్రానికి తెలంగాణ సర్కారు వివరణ ఎల్అండ్టీ రాసిన లేఖ లీక్ ఆంధ్రా లాబీ, మద్దతుదారుల కుట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి సమస్యలూ లేవు ఎలాంటి అనుమతులు కూడా పెండింగ్‌లో లేవని వెల్లడి నేడు కేంద్ర అధికారులతో సమీక్ష న్యూఢిల్లీ: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నష్టపరిచేందుకే ఎల్అండ్టీ రాసిన లేఖను ఆంధ్రా లాబీ లీక్ చేసిందని, అది కూడా వారికి మద్దతిస్తున్న వాళ్లకు ఇచ్చిందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి వెల్లడించింది. ఆ ప్రాజెక్టుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేసింది. సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ, సలహాదారు బి.వి. పాపారావు కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌కుమార్ సేథ్, ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేం దర్ మిశ్రాను వేర్వేరుగా కలసి మెట్రో వివాదంపై వివరణ ఇచ్చారు. దేశంలో ఎల్అండ్టీ చేపట్టిన ఇతర ప్రాజెక్టులన్నింటి కంటే హైదరాబాద్ మెట్రో పనులు వేగంగా నడుస్తున్నాయని వారు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగానే ప్రాజెక్టు పురోగతిలో ఉందని వివరించారు. ఈ మెట్రోరైలు ప్రాజెక్టుపై ఇటీవల వివాదాలు కమ్ముకున్న నేపథ్యంలో బి.వి.పాపారావు కేంద్ర అధికారులకు కూలంకషంగా దీనిపై వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు పురోగతిని రాజీవ్‌శర్మ వివరిం చారు. ‘మెట్రో’కు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమస్యలూ లేవని, తమ తరఫు నుంచి అనుమతులేవీ పెండింగ్‌లో లేవని స్పష్టం చేశారు. అలాగే రాజీవ్‌శర్మ, పాపారావు సోమవారం సాయంత్రం రైల్వే బోర్డు అధికారులను కలిశారు. అంతకంటే ముందు సీఎస్ రాజీవ్ శర్మ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామితో భేటీ కాగా... ఈ ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నేడు మరో సమీక్ష! సీఎస్ రాజీవ్‌శర్మ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఎల్అండ్టీ మెట్రోరైల్ ఎండీ గాడ్గిల్, హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్ ప్రాజెక్టు పరిస్థితిపై మంగళవారం సమీక్షించనున్నారు. టేకోవర్ యోచనలో సర్కారు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వమే టేకోవర్ చేస్తే ఎలా ఉంటుందనే దిశగా తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వమే టేకోవర్ చేయాలంటూ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ లేఖ రాయడంతో పాటు.. అలైన్మెంట్ మార్పు విషయంలో ప్రభుత్వానికి, ఆ సంస్థకు తలెత్తుతున్న అభిప్రాయభేదాల నేపథ్యంలో ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రాజెక్టు నుంచి తప్పుకొంటామంటూ, ప్రభుత్వమే టేకోవర్ చేయాలంటూ ఈ నెల 10న ప్రభుత్వానికి ఎల్అండ్టీ రాసిన లేఖ లీక్ కావడంతో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తనతో భేటీ అయిన ఎల్అండ్టీ మెట్రో ఎండీ గాడ్గిల్‌తో... ‘మీ నిర్ణయానికి స్వాగతం. మంచిది..’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు ఢిల్లీ మెట్రో గురు శ్రీధరన్ సలహాలు కూడా తీసుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వవర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. మెట్రో రెండో దశపై చర్చల కోసం ఢిల్లీకి వెళ్లిన సీఎస్ రాజీవ్‌శర్మ, సలహాదారు పాపారావులు కేంద్ర కేబినెట్ కార్యదర్శితో మాట్లాడినప్పుడు.. ఈ టేకోవర్ ప్రస్తావన కూడా వచ్చినట్లు సమాచారం. అలాగే మెట్రోకు సంబంధించిన ఒకరిద్దరు ముఖ్యులను మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వవర్గాల్లో ఉన్నట్లు తెలిసింది. -
ఎల్ అండ్ టీ లాభాలకు డిజిన్వెస్ట్‌మెంట్ జోష్
ముంబై: ఇంజనీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్అండ్ టీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2013-14, క్యూ1)లో రెట్టింపునకుపైగా నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.967 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.459 కోట్లు మాత్రమే. అయితే, క్యూ1లో డిజిన్వెస్ట్‌మెంట్ రూపంలో రూ.1,392 కోట్ల రాబడులు రావడంతో లాభాలు ఈ స్థాయిలో పెరిగేందుకు దోహదం చేసిందని కంపెనీ పేర్కొంది. గ్రూప్ రియల్టీ వ్యాపార అనుబంధ కంపెనీలు(సబ్సిడరీలు), జాయింట్ వెంచర్ కింద ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల్లో వాటాలను ఏప్రిల్-జూన్ వ్యవధిలో విక్రయించడం ద్వారా రూ.1,382 కోట్ల అదనపు నిర్వహణ ఆదాయం సమకూరినట్లు తెలిపింది. కాగా, క్యూ1లో కంపెనీ నికర ఆదాయం రూ.18,975 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.17,241 కోట్లుగా ఉంది. 10 శాతం వృద్ధి నమోదైంది. ఆర్డర్ల జోరు... తొలి త్రైమాసికంలో కంపెనీ రూ.33,408 కోట్ల విలువైన ఆర్డర్లను చేజిక్కించుకుంది. ఇందులో విదేశీ ఆర్డర్ల విలువ రూ.14,574 కోట్లు కావడం గమనార్హం. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, హైడ్రోకార్బన్, హెవీ ఇంజనీరింగ్ విభాగాల్లో ఆర్డర్లను దక్కించుకున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఈ ఏడాది జూన్ 30 నాటికి గ్రూప్ ఆర్డర్ బుక్ విలువ రూ.1,95,392 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. గతేడాది ఇదేకాలంతో పోలిస్తే 13 శాతం పెరిగింది. ఇందులో విదేశీ కాంట్రాక్టుల వాటా 26 శాతంగా ఉంది. క్యూ1లో దేశీయంగా సెంటిమెంట్ కొంత మెరుగైనప్పటికీ.. వ్యాపార పరిస్థితులు, పెట్టుబడులు ఇంకా మందకొడిగానే కొనసాగాయని ఎల్అండ్టీ అభిప్రాయపడింది. అధిక వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం వంటివి ప్రతికూలాంశాలుగా నిలిచాయని పేర్కొంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం పెట్టుబడుల పెంపునకు, అదేవిధంగా విధానపరంగా చేపడుతున్న చర్యల ప్రభావం రానున్నరోజుల్లో ప్రతి ఫలించే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 0.7 శాతం క్షీణించి రూ.1,645 వద్ద స్థిరపడింది. -
ముడుపులు ఇచ్చే సంస్కృతి లేదు: ఎల్ అండ్ టీ
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైలు ప్రాజెక్టు దక్కించుకోవడానికి ఎవరికీ ముడుపులు ఇవ్వలేదని, అలాంటి సంస్కృతి తమది కాదని ఎల్ అండ్ టీ మెట్రో రైలు సీఈవో, ఎండీ వీఎన్ గాడ్గిల్ స్పష్టం చేశారు. తాము ముడుపులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ప్రాజెక్టు పురోగతిపై హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ పోటీని ఎదుర్కొని టెండర్‌ను దక్కించుకున్నామని తెలిపారు. 75 సంవత్సరాలుగా ఎన్నో ప్రతిష్ఠా త్మక ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశామన్నారు. టెండర్లో ఉన్న ప్రకారమే పనులు జరుగుతున్నాయని, భూములు అధికంగా కేటాయించలేదని తెలిపారు. ఈ భూములను ఎల్అండ్టీకి ప్రభుత్వం లీజుకు మాత్రమే ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ దాదాపు రూ.15 వేల కోట్లు పెట్టుబడిగా పెడుతోందన్నారు. ఇప్పటివరకు రూ.3,100 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో సబ్‌కాంట్రాక్టులు ఇవ్వలేదని, అంతర్జాతీయంగా పేరున్న సంస్థలకే కాంపిటీటివ్ బిడ్డింగ్‌లో పనులు అప్పగించామని వివరించారు. హైదరాబాద్ మెట్రో తరువాతే రియాద్‌లో రూ.8,500 కోట్ల విలువైన మెట్రో ప్రాజెక్టును ఎల్ అండ్ టీ దక్కించుకున్న విషయాన్ని గాడ్గిల్ గుర్తు చేశారు. ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని, వారి ఎత్తులు సఫలం కావని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొదటి దశను 2014కు పూర్తి చేసి 2015 మార్చి 21న ఉగాదిరోజు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. -
దాహార్తితో అల్లాడుతున్న 250 గ్రామాలు
గజ్వేల్, న్యూస్‌లైన్ : సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు సమ్మెబాట పట్టి ఐదు రోజులు కావస్తుండడంతో జిల్లాలో దాదాపు 250 గ్రామాల్లో ఈ పథకం నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, సంగారెడ్డి, హత్నూర, పుల్కల్, నర్సాపూర్, ఆందోల్, దుబ్బాక, జిన్నారం, పటాన్చెరు మండలాల్లోని 250 గ్రామాల్లో గత రెండు దశాబ్దాలుగా సత్యసాయి తాగునీటి పథకం అమలవుతోంది. ఈ పథకాన్ని ఎల్ అండ్ టీ కంపెనీ నిర్వహిస్తుండగా ఈ కంపెనీ ద్వారా 135 మంది కార్మికులు ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు. గత 13 నెలలుగా కార్మికులకు సంబంధించిన వేతన సవరణ చేయడంలో జిల్లా కార్మిక శాఖ అధికారులు, ఎల్ అండ్ టీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు విషయం తెలిసినా సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. కార్మికులకు, యాజమాన్యానికి మధ్య అధికారుల సమక్షంలో పలుసార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. వేతన సవరణ ప్రక్రియ పూర్తికాకపోవడంతో వేతనాలు అందక కార్మికులు గత 5న కార్మికులు సమ్మెనోటీసు ఇచ్చినా ఎల్అండ్టీ యాజమాన్యం స్పందించలేదు. ఫలితంగా కడుపు మండిన గత ఐదు రోజులుగా నీటి సరఫరాను పూర్తిగా నిలిపి వేసి సమ్మెలో ఉన్నారు. ఫలితంగా ఆయా మండలాల పరిధిలోని 250 గ్రామాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోయి ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. సమ్మె మరింత ఉధృతం సమస్యల పరిష్కారంలో ఎల్అండ్టీ యాజమాన్యం, అధికారు లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వేతన సవరణ పూర్తి చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం. ఇందులో భాగంగానే శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నాం. అప్పటికీ స్పందనలేకపోతే సోమవారం ఆర్డబ్ల్యూఎస్, జిల్లా కార్మిక శాఖ అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తాం. - గాల్‌రెడ్డి, సత్యసాయి పథకం కార్మిక సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్