దిగ్గజ కంపెనీ లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ షేర్ ధర సోమవారం 0.71 శాతం నష్టాల్లో ట్రేడయింది. శుక్రవారంతో పోలిస్తే షేర్ ధర 22 పాయింట్లు తగ్గి రూ.3087 వద్ద స్థిరపడింది. కంపెనీపై ఖతార్ విధించిన పెనాల్టీ ఇందుకు కారణమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఖతార్ ట్యాక్స్ విభాగం రూ.111.30 కోట్లు, రూ.127.60 కోట్ల చొప్పున రెండు జరిమానాలు విధించినట్లు ఎల్ అండ్ టీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ ప్రకటించిన ఆదాయ వివరాల్లో భారీ వ్యత్యాసం ఉందని, అందుకే ఈ చర్య తీసుకున్నట్లు ఖతార్‌ప్రభుత్వం వివరించింది.
మార్చి 2017 నుంచి మార్చి 2018 మధ్య కాలానికిగాను కంపెనీపై ఈ జరిమానా విధించారు. అయితే సంస్థ ఈ జరిమానాపై పిటిషన్ దాఖలు చేయనుంది. మిడిల్‌ఈస్ట్ దేశాల్లో ఎల్ అండ్ టీ రెండో అతిపెద్ద నిర్మాణ సంస్థగా కొనసాగుతోంది.
లార్సెన్ అండ్ టూబ్రో హైడ్రోకార్బన్ వ్యాపారం పశ్చిమాసియాలో పెద్ద కాంట్రాక్టును సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆ కాంట్రాక్ట్ విలువ ఎంతో కంపెనీ వెల్లడించలేదు. కానీ దాని విలువ రూ.15 వేల కోట్ల మేర ఉండొచ్చని అంచనా. ఇందుకు సంబంధించి ఓ కస్టమర్ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను అందుకున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment