వారంలో 90 గంటలు పని చేయాలంటు ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యయన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విధానాన్ని వ్యతిరేకించిన ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా డెన్మార్క్ వర్క్ కల్చర్‌ను అవలంబించడం ద్వారా భారత్ ప్రయోజనం పొందే అవకాశం ఉందని సూచించారు.
‘డెన్మార్క్‌లో ఉద్యోగులు మైక్రో మేనేజ్‌మెంట్(కింది స్థాయి బాసులు) లేకుండా స్వతంత్రంగా పనిచేస్తారు. వీరు సంవత్సరానికి కనీసం ఐదు వారాల సెలవు, ఆరు నెలల పేరెంటల్ లీవ్ అనుభవించే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన పని గంటలు ఎంచుకోవచ్చు. దాంతో వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరూ ఉద్యోగాలను వీడకుండా స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడి ఉద్యోగులు అనుభవించే సౌకర్యాలు, స్వయంప్రతిపత్తి కారణంగా చాలా మంది పనిని కొనసాగిస్తారు. కంపెనీ యజమానులు మానసిక ఆరోగ్యానికి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు విలువ ఇస్తారు. వ్యక్తిగత ఆకాంక్ష కంటే సామూహిక శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తారు’ అని చెప్పారు.
అసలేం జరిగిందంటే..
ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.
Why the people in Denmark are happiest about their work practices:
- Employees are trusted to work independently without micromanagement
- Minimum five weeks of vacation and six months of parental leave
- Flexible hours allow time for family and personal life
- Job loss is…— Harsh Goenka (@hvgoenka) January 16, 2025
వినాశనానికి దారితీస్తుందంటూ ఇప్పటికే స్పందన
సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) గతంలో స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.
Comments
Please login to add a commentAdd a comment