SN Subramanian
-
బాసులు లేని వర్క్ కల్చర్
వారంలో 90 గంటలు పని చేయాలంటు ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యయన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ విధానాన్ని వ్యతిరేకించిన ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా తాజాగా డెన్మార్క్ వర్క్ కల్చర్‌ను అవలంబించడం ద్వారా భారత్ ప్రయోజనం పొందే అవకాశం ఉందని సూచించారు.‘డెన్మార్క్‌లో ఉద్యోగులు మైక్రో మేనేజ్మెంట్(కింది స్థాయి బాసులు) లేకుండా స్వతంత్రంగా పనిచేస్తారు. వీరు సంవత్సరానికి కనీసం ఐదు వారాల సెలవు, ఆరు నెలల పేరెంటల్ లీవ్ అనుభవించే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన పని గంటలు ఎంచుకోవచ్చు. దాంతో వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరూ ఉద్యోగాలను వీడకుండా స్థానిక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అక్కడి ఉద్యోగులు అనుభవించే సౌకర్యాలు, స్వయంప్రతిపత్తి కారణంగా చాలా మంది పనిని కొనసాగిస్తారు. కంపెనీ యజమానులు మానసిక ఆరోగ్యానికి, వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు విలువ ఇస్తారు. వ్యక్తిగత ఆకాంక్ష కంటే సామూహిక శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తారు’ అని చెప్పారు.అసలేం జరిగిందంటే..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.Why the people in Denmark are happiest about their work practices:- Employees are trusted to work independently without micromanagement- Minimum five weeks of vacation and six months of parental leave- Flexible hours allow time for family and personal life- Job loss is…— Harsh Goenka (@hvgoenka) January 16, 2025వినాశనానికి దారితీస్తుందంటూ ఇప్పటికే స్పందనసుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) గతంలో స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. -
‘మీ లాభాల కోసం మేం చావలేం’
ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటల పనిదినాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) తీవ్రంగా తప్పుబట్టింది. కార్మికుల శ్రేయస్సును పణంగా పెట్టి లాభాపేక్షతో అలుపెరగకుండా పని చేయించడం సరికాదని చెప్పింది. కంపెనీల లాభాల కోసం చావడానికి సిద్ధంగా లేమని కేఐటీయూ ప్రకటించింది. భారతీయ శ్రామిక శక్తిని అమానవీయంగా దోపిడీ చేయడం ద్వారా సుబ్రహ్మణ్యన్ సారథ్యం వహిస్తున్న కంపెనీ లాభాలు పొందుతుందని యూనియన్ ఆరోపించింది.కేఐటీయూ కార్యదర్శి సూరజ్ నిడియాంగా మాట్లాడుతూ..‘యూనియన్ ఈ అంశాన్ని ఒంటరి ప్రకటనగా పరిగణించడం లేదు. గతంలో నారాయణమూర్తి వారానికి 70 గంటల పని విధానం కావాలని సూచించినప్పుడు కర్ణాటకలో అమలు చేసే ప్రయత్నం జరిగింది. కేఐటీయూ జోక్యం, ఉద్యోగుల ప్రతిఘటన కారణంగానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎల్ అండ్ టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి లాభాల కోసం మా ప్రాణాలను పణంగా పెట్టలేం’ అని చెప్పారు.ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు ఇవే..‘ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు? భార్యను ఎంత సేపు చూడగలరు? భర్తలను భార్యలు ఎంత సేపు చూస్తారు? ఆఫీసుకు వెళ్లి పని మొదలుపెట్టండి. ఆదివారాలు కూడా ఆఫీసుకురండి. వారానికి 90 గంటలు పనిచేయాలి’ అంటూ కంపెనీ లార్సన్ అండ్ టుబ్రో ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆయన కామెంట్లపై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేట్ సంస్థల్లో పనిగంటలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, హెచ్‌సీఎల్ మాజీ సీఈఓ వినీత్ నాయర్ వంటి వ్యక్తులు పని గంటల పరిమాణం కంటే పని నాణ్యతపై దృష్టి పెట్టే అంశాన్ని నొక్కి చెప్పారు.ఇదీ చదవండి: మెటా క్షమాపణలు చెప్పాలి.. పార్లమెంటరీ కమిటీ సమన్లు..?అసలు ఉద్దేశంపై వివరణసోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకతని గమనించిన ఎల్ అండ్ టీ ఇటీవల దిద్దుబాటు చర్యలకు దిగింది. ‘ఇది భారతదేశపు దశాబ్దమని ఛైర్మన్ సుబ్రమణ్యన్ విశ్వసిస్తున్నారు. అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ ఛైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని ప్రకటన జారీ చేసింది. -
ఎక్కువ గంటలు పనిచేస్తే సక్సెస్ వస్తుందా?
న్యూఢిల్లీ: ‘‘ఆదివారాలు కూడా ఆఫీస్‌కు రండి. వారానికి 90 గంటలు పనిచేయండి’’అంటూ ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ పారిశ్రామికవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ గంటలు పనిచేస్తే విజయం వస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదని, కష్టపడి పనిచేయడం ముఖ్యమని, ఏది ఉన్నా ఉన్నత స్థాయి మేనేజ్మెంట్ నుంచే ఇది అమలు కావాలన్న అభిప్రాయాలు వినిపించాయి. అంతేకాదు, ఎల్అండ్టీ ఉద్యోగుల సగటు మధ్యస్త వేతనం కంటే 534 రెట్లు అధికంగా రూ.51 కోట్ల వేతనాన్ని 2023–24 ఆర్థిక సంత్సరానికి సుబ్రమణియన్ తీసుకోవడంపైనా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ‘‘వారంలో 90 గంటలా? సండేని సన్ టు డ్యూటీగా ఎందుకు పేరు మార్చకూడదు. వారంలో ఒకరోజు సెలవుదినాన్ని ఒక భావనగా మార్చేయండి’’ అంటూ ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ హర్ష గోయెంకా ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. కష్టపడి, స్మార్ట్‌గా పనిచేయడాన్ని తాను విశ్వసిస్తానన్నారు. జీవితాన్ని పూర్తిగా కార్యాలయానికే అంకింత చేయడం వల్ల విజయం రాకపోగా, అగ్గి రాజుకుంటుందన్నారు. ఉద్యోగం–జీవితం మధ్య సమతుల్యత అన్నది ఐచి్ఛకం కాదని, తప్పనిసరి అని పేర్కొన్నారు. మారికో చైర్మన్ హర్‡్ష మారివాలా కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని ఎక్స్‌పై వ్యక్తం చేశారు. ‘‘విజయానికి కష్టపడి పనిచేయడం అన్నది కీలకం. ఇందుకు ఎన్ని గంటలు పనిచేశామన్నది ముఖ్యం కాదు. నాణ్యత, ఆ పని పట్ల అభిరుచి విజయాన్ని నిర్ణయిస్తాయి’’అని పేర్కొన్నారు. బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన సందర్భంగా దీనిపై స్పందించారు. ‘‘ఇది అగ్ర స్థాయి ఉద్యోగుల నుంచి ప్రారంభిద్దాం. ఫలితమిస్తుందని తేలితే అప్పుడు మిగిలిన వారికి అమలు చేద్దాం’’అని పేర్కొన్నారు. -
అన్నేసి గంటలు పనిచేస్తే జరిగేది ఇదే!
భారత్‌లో పనిగంటల అంశం మరోసారి చర్చ తెర మీదకు వచ్చింది. ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారం మొత్తం మీద ఏకంగా 90 గంటలు పని చేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. మొన్నీమధ్యే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 70 గంటలు పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యం ‘అంతకుమించి’ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ఈ దరిమిలా వీళ్లిద్దరి గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇంతకీ 70.. 90.. మనిషి శరీరం ఒక వారంలో అసలు ఎన్నేసి పనిగంటలను చేయగలదు?. ఏ మేర పని ఒత్తిడిని ఒక ఉద్యోగి భరించగలరు?. అలా గనుక పని చేస్తే.. శరీరంలో కలిగే మార్పులేంటి?. ఈ విషయంలో అసలు వైద్యులు ఏం చెబుతున్నారు?.. బిజినెస్ టైకూన్లు చెబుతున్న అంతటి పని భారం ఉద్యోగి మోయ తరమేనా?.. వారంలో 90 గంటలపని.. అంటే ఏడు రోజులపాటు 13 గంటల చొప్పున పని చేయాలన్నమాట. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, ఇతర పనులు, ప్రయాణాలు, ఆఖరికి కుటుంబ సభ్యులతో గడపడం లాంటి వాటితో సర్దుకుపోవాలన్నమాట. అయితే ఇది శారీరకంగానేకాదు.. మానసికంగానూ మనిషిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయం ప్రకారం.. వారంలో 55 గంటలకు మించి గనుక పని చేస్తే గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉంటుందట. అలా పనిచేసే ఉద్యోగుల్లో వందలో 35 మంది స్ట్రోక్ బారినపడే అవకాశం ఉంది. వందలో 17 మంది ప్రాణమే పొగొట్టుకునే అవకాశం ఉంది అని ఆ స్టడీ వెల్లడించింది. ‘‘ఎక్కువసేపు పని చేయడమంటే గుండె మీద ఒత్తిడి పెంచడమే. దీనివల్ల కోర్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. తద్వారా బీపీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. అలా హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌తో పాటు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడడమో లేదంటే కుంచిచుపోతాయి’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. ఉద్యోగుల పని గంటలు తగ్గాల్సిందే!.. ఇక ఎక్కువ గంటలు పని చేయడం డయాబెటిస్‌కు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఇది రక్తంలో షుగర్ స్థాయిపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతుంది. మహిళలు 45 గంటలకంటే ఎక్కువసేపు పని చేసినా.. పురుషులు 53 గంటలకు మించి పని చేసినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు తెలిపాయి కూడా. ఇక చాలాసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఇది ఒబెసిటీ(స్థూలకాయం)కి దారి తీయొచ్చు. అన్నింటికి మించి.. విపరీతమైన పనిభారం మానసిక ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. ఇది బంధాలకు బీటలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే.. విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. జీరో రెస్ట్ వర్క్.. నిద్రాహారాలను నిర్లక్ష్యం చేయిస్తుంది. పని ఒత్తిడి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతిమంగా.. అనారోగ్యకరమైన జీవనశైలి వైపునకు అడుగులు వేయిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో అధిక పని గంటల నిర్ణయాలతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వారానికి మొత్తం 40 గంటలే పని ఉండాలి!ఇన్ఫోసిస్ మూర్తి(78) ఏమన్నారంటే..ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలి.తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మరోసారి ఆయన స్పందిస్తూ..ఇన్ఫోసిస్(Infosys)ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?.ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం(64) ఏమన్నారంటే..ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను. అయినా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. అందుకోసం ఆదివారం సెలవులనూ వదిలేయాలి. ఇదీ చదవండి: 104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి -
ఎల్అండ్టీ గ్రూప్ కంపెనీలకు నాయక్ గుడ్‌బై
న్యూఢిల్లీ: ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్టీటీఎస్) చైర్మన్‌గా తప్పుకోవాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో ఈ రెండు సంస్థలకు చైర్మన్‌గా ఎస్ఎన్ సుబ్రమణియన్ 27న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఇరు కంపెనీలు ప్రకటించాయి. వ్యవస్థాపక చైర్మన్‌గా ఏఎం నాయక్ ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీని చురుకైన అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దినట్టు సంస్థ పేర్కొంది. ఈ నెల 26నాటి ఎల్టీఐ మైండ్‌ట్రీ 28వ ఏజీఎంతో తన బాధ్యతలకు ముగింపు పలకాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారని, దీంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్‌ను నూతన చైర్మన్‌గా బోర్డు ఎంపిక చేసినట్టు, ఇది 27 నుంచి అమల్లోకి వస్తుందని ఎల్టీఐ మైండ్‌ట్రీ ప్రకటించింది. కంపెనీ పురోగతికి నాయక్ అందించిన సేవలకు అభినందనలు తెలియజేసింది.సుబ్రమణియన్ సారథ్యంలో ఎల్టీఐ మైండ్‌ట్రీ తన వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని, కొత్త విజయశిఖరాలను చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు నాయక్ ప్రకటించారు. అంతకుముందు ఈ సంస్థ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్గా కొనసాగగా, 2019లో మైండ్‌ట్రీని విలీనం చేసుకున్న అనంతరం ఎల్టీఐ మైండ్‌ట్రీగా మారడం తెలిసిందే. మైండ్‌ట్రీని సొంతం చేసుకోవడంలో నాయక్, సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎల్టీటీఎస్ రెండింటిలోనూ ఎల్అండ్టీకి మెజారిటీ వాటాలున్నాయి. -
గతవారం బిజినెస్
నియామకాలు ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా రామన్ రాయ్ నియమితులయ్యారు. క్వాట్రో సీఎండీగా ఉన్న ఈయన 2017–18 ఆర్థిక సంవత్సరానికి గానూ నాస్కామ్ చీఫ్‌గా కొనసాగుతారు. అలాగే నాస్కామ్ వైస్ చైర్మన్‌గా రిషద్ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు. అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడైన ఈయన విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ కొత్త సీఈవోగా ఎస్ఎన్ సుబ్రమణ్యన్ నియమితులయ్యారు. జూలై 1 నుంచి ఆయన సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం సుబ్రమణ్యన్ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. మరోవైపు, దాదాపు 17 ఏళ్లుగా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏఎం నాయక్.. సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఈయన అక్టోబర్ 1 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇన్ఫోసిస్‌లో మళ్లీ జీతాల రగడ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, కంపెనీ యాజమాన్యానికి మధ్య మరోసారి వివాదం రగులుకుంది. సీవోవో ప్రవీణ్‌రావు పారితోషికాన్ని భారీగా పెంచుతూ చేసిన ప్రతిపాదనకు కంపెనీ వాటాదారులు తాజాగా ఆమోదం తెలిపారు. దీంతో మరోసారి ఈ అంశంపై మాటల యుద్ధం మొదలైంది. వేతనాల విషయంలో కింది ఉద్యోగులను త్యాగాలు చేయాలని కోరుతూ అదే సమయంలో ఉన్నత ఉద్యోగులకు పారితోషికాలు భారీగా పెంచడం ఏవిధంగా సమంజసమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులైన ఎన్ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు. చాలా వరకు కింది స్థాయి ఉద్యోగులకు 6 నుంచి 8% మేర వేతనాలు పెంచుతూ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు 60 నుంచి 70% పెంచడం అనైతికమన్నారు. తగ్గిన ఎస్బీఐ బేస్ రేటు ఎస్బీఐ తాజాగా రుణాలపై వడ్డీ రేటుకు సంబంధించిన బేస్ రేటును 0.15% మేర తగ్గించింది. దీంతో ఇది 9.25% నుంచి 9.10%కి దిగి వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని వర్తింపచేస్తున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. మరోవైపు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) కూడా 15 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇది 14% నుంచి 13.85%కి చేరింది. ఎంసీఎల్ఆర్ మాత్రం యథాతథంగా ఉంటుంది. కాగా మరొకవైపు బ్యాంక్ పెంచిన చార్జీలు, మార్చిన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. ఎస్బీఐలో కొత్తగా విలీనమైపోయిన అనుబంధ బ్యాంకుల కస్టమర్లకు ఈ చార్జీలు ఏప్రిల్ 24 నుంచి వర్తిస్తాయి. లక్ష్యాన్ని దాటిన పన్నుల రాబడి మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో పన్ను వసూళ్లు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సందర్భంగా రూ.16.97 లక్షల కోట్ల పన్ను వసూళ్లను అంచనా వేస్తున్నట్టు ప్రభుత్వం సవరించిన లక్ష్యాన్ని పేర్కొంది. కానీ పన్నుల వసూళ్లు రూ.17.10 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 18 శాతం అధికంగా పన్నుల ఆదాయం వచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కార్పొరేట్ అవినీతిలో 9వ స్థానంలో భారత్ వ్యాపారాల నిర్వహణలో అవినీతి, లంచగొండితనం విధానాలు పాటిస్తున్న దేశాల జాబితాలో భారత్ 9వ స్థానంలో నిల్చింది. అయితే 2015లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఈసారి తొమ్మిదో స్థానానికి తగ్గడం కాస్త ఊరటనిచ్చే అంశం. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నిర్వహించిన ఒక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మొత్తం 41 దేశాల్లో ఈ సర్వే నిర్వహించగా.. కార్పొరేట్ అవినీతిలో ఉక్రెయిన్ అగ్రస్థానంలోను.. సైప్రస్, గ్రీస్ తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. రెపో యథాతథం ఆర్బీఐ రెపోను యథాతథంగా 6.25%గా కొనసాగించాలని నిర్ణయించింది. ఇప్పటికే బ్యాంకుల వద్ద అధిక నిల్వల (లిక్విడిటీ) పరిస్థితి నెలకొనడం, పదేళ్ల బాండ్ ఈల్డ్ భారీ పెరుగుదల దీనితో ద్రవ్యోల్బణం భయాలు, వృద్ధి బాటలో ప్రభుత్వ వ్యయాలు వంటి అంశాలు దీనికి కారణం. మరోవైపు ఆర్బీఐ రివర్స్ రెపోను పావుశాతం పెంచి 6%కి చేర్చింది. అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్)ను కూడా పావుశాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 6.5%కి తగ్గింది. ఎఫ్‌డీలే ముద్దు భారతీయులు మ్యూచువల్ ఫండ్స్, షేర్ల కంటే ఫిక్స్డ్ డిపాజిట్లవైపే (ఎఫ్డీలు) ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని సెబీ తాజా సర్వేలో తేలింది. దీని ప్రకారం.. 95%కి పైగా భారతీయులు తమ సొమ్ములను బ్యాంక్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుండగా, 10% కన్నా తక్కువ మందే మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎఫ్‌డీల తర్వాత జీవిత బీమా పాలసీలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకాలు, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఉన్నాయి. విశ్వసనీయమైన బ్రాండ్ ’శాంసంగ్’ దక్షిణ కొరియాకు చెందిన కన్సూమర్ డ్యూరబుల్స్ సంస్థ శాంసంగ్ తాజాగా భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా అవతరించింది. దీని తర్వాతి స్థానాల్లో సోనీ, ఎల్జీ ఉన్నాయి. ఇక నాల్గవ స్థానంలో యాపిల్ ఉంది. కాగా టాప్–5లో కేవలం ఒకే ఒక దేశీ కంపెనీ టాటా గ్రూప్ మాత్రమే స్థానం పొందగలిగింది. ఇది ఐదో స్థానంలో ఉంది. ఇక ఆరవ స్థానంలో హోండా కొనసాగుతోంది. గ్రాసరీలోకి ఫ్లిప్‌కార్ట్ రీఎంట్రీ! దేశీ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ తాజాగా గ్రాసరీ విభాగంలోకి పునరాగమనం చేస్తోంది. దీని ద్వారా దేశీ రిటైల్ పరిశ్రమలో సాధ్యమైనంత వాటాను చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ‘మేం గ్రాసరీ విభాగంలోకి మళ్లీ అడుగుపెడుతున్నాం. దేశీ కొనుగోళ్లలో 80 శాతం యూనిట్లు గ్రాసరీకి చెందినవే. గ్రాసరీ మార్కెట్ విలువ 400–600 మిలియన్ డాలర్ల శ్రేణిలో ఉంది. అందుకే మేం ఇందులోకి మళ్లీ వస్తున్నాం’ అని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. కాగా ఫ్లిప్‌కార్ట్ ఇదివరకు 2015 అక్టోబర్‌లో గ్రాసరీ (కిరాణ) వస్తువులు ఆర్డర్ల కోసం ప్రత్యేకమైన యాప్ ‘నియర్‌బై’ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కానీ తగినంత ఆదరణ లేకపోవడంతో తర్వాత కొన్ని నెలలకే ఈ వ్యాపారాన్ని మూసేసింది. మార్చిలో తయారీ రంగం పరుగు తయారీ రంగం మార్చిలో మంచి పనితీరును ప్రదర్శించింది. ఫిబ్రవరిలో 50.7 పాయింట్ల వద్ద ఉన్న సూచీ మార్చిలో 52.2కు చేరింది. ఐదు నెలల్లో సూచీ ఈ స్థాయికి వెళ్లడం ఇదే తొలిసారి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఎగుమతుల ఆర్డర్లు పెరగడం ఈ సానుకూల ఫలితానికి కారణమని నికాయ్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఈ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే వృద్ధిగా, ఆ దిగువన ఉంటే, క్షీణతగా భావించడం జరుగుతుంది. నవంబర్ 8 డీమోనిటైజేషన్ అనంతరం రెండు నెలలు దేశంలో తయారీరంగం తీవ్ర ఒడిదుడుకులకు గురయిన సంగతి తెలిసిందే. తిరిగి క్రమంగా ఈ రంగం కోలుకుంటోంది. డీల్స్.. ఎస్బీఐ తాజాగా ట్రావెల్ ప్రిపెయిడ్ కార్డుల విక్రయానికి సంబంధించి ప్రముఖ ట్రావెల్ గ్రూప్ కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్‌తో పంపిణీ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మలేషియాలో బహుళార్ధ పోర్టు నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఎంఎంసీ పోర్ట్స్‌తో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆభరణాల రిటైల్ చెయిన్ కళ్యాణ్ జ్యూయలర్స్ కంపెనీలో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పిన్కస్ రూ.500 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. దేశంలో నైటింగేల్స్ పేరిట హోమ్ హెల్త్‌కేర్ విభాగంలో సేవలందిస్తున్న మెడ్‌వెల్ వెంచర్స్ తాజాగా రూ.134 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్బీలో భాగంగా మహీంద్రా పార్టనర్స్, 8 రోడ్స్ వెంచర్స్, ఎఫ్ప్రైమ్ క్యాపిటల్ ఈ పెట్టుబడులు పెట్టాయి. ఖనిజాలు, లోహాల వ్యాపారంలో ఉన్న ట్రైమెక్స్ ఇండస్ట్రీస్ తాజాగా పామాయిల్ విపణిలోకి ప్రవేశించింది. ముడి పామాయిల్ ఉత్పత్తిలో ప్రపంచ దిగ్గజమైన మలేషియా సంస్థ ఫెల్డా గ్లోబల్ వెంచర్స్ హోల్డింగ్ బెర్హడ్‌తో కంపెనీ చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం కింద ఫెల్డా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా ట్రైమెక్స్ విక్రయిస్తుంది. ఏరోస్పేస్ దిగ్గజాలు బోయింగ్, జెట్‌బ్లూ సంస్థలు జునుమ్ ఏరో స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టాయి. సహకార ఎరువుల తయారీ దిగ్గజం ఇఫ్కో తాజాగా స్టార్టప్ సంస్థ గ్రామీణ్ హెల్త్ కేర్‌లో 26 శాతం వాటాలు దక్కించుకుంది. -
ఎల్ అండ్ టీ సీఈవోగా సుబ్రమణ్యన్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ కొత్త సీఈవోగా ఎస్ఎన్ సుబ్రమణ్యన్ నియమితులయ్యారు. జూలై 1 నుంచి ఆయన సీఈవో, ఎండీగా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం సుబ్రమణ్యన్ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. 1984లో ఎల్అండ్టీలో చేరిన ఆయన వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఇటు భారత్ అటు మధ్యప్రాచ్యంలో పలు ఇన్ఫ్రా ప్రాజెక్టులను పర్యవేక్షించారు. మరోవైపు, దాదాపు 17 ఏళ్లుగా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏఎం నాయక్.. సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మూడేళ్ల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు 52 ఏళ్లుగా ఎల్అండ్టీలో నాయక్ వివిధ హోదాల్లో పనిచేశారు. 1999లో సీఈవో, ఎండీగా నియమితులైన ఆయన .. 2003లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. నాయక్ సారథ్యంలో ఎల్అండ్టీ గ్రూప్ 16 బిలియన్ డాలర్ల దిగ్గజంగా ఎది గింది. ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలతో పాటు టెక్నాలజీ, తయారీ, ఆర్థిక సేవల రంగాల్లోకి కూడా ప్రవేశించింది. 30 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1999లో రూ. 4,400 కోట్లుగా ఉన్న కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 1.58 లక్షల కోట్లకు చేరింది.