‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’ | RPG Group Chairman Harsh Goenka and Deepika Padukone responded sharply to l and t chairman comments on 90-hours work | Sakshi
Sakshi News home page

‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’

Published Fri, Jan 10 2025 1:18 PM | Last Updated on Fri, Jan 10 2025 3:46 PM

RPG Group Chairman Harsh Goenka and Deepika Padukone responded sharply to l and t chairman comments on 90-hours work

పని గంటలపై ఎల్‌ అండ్‌ టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వారానికి 90 గంటలు పని చేయడంతోపాటు, ఆదివారం సెలవునూ వదిలేయాలని సుబ్రహ్మణ్యన్‌ ఇటీవల ఓ వీడియో ఇంటెరాక్షన్‌లో తన ఉద్యోగులతో అన్నారు. దీనినై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గొయెంకా, సినీ నటి దీపికా పదుకొణె సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలపై కామెంట్‌ చేశారు.

అసలేం జరిగిందంటే..

ఎల్‌ అండ్‌ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్‌(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.

L&T ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం

వినాశనానికి దారితీస్తుంది..

సుబ్రహ్మణ్యన్‌ వ్యాఖ్యలపై ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా(Harsh Goenka) స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్‌-డ్యూటీ అని.. ‘డే ఆఫ్‌’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్ అనేది ఆప్షన్‌ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్‌ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్‌ స్మార్ట్‌ నాట్‌ స్లేవ్‌’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

ఇదీ చదవండి: నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యత

మెంటల్‌ హెల్త్‌ ముఖ్యం..

వారానికి 90 గంటలు పని చేయాలని సుబ్రహ్మణ్యన్‌ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి దీపికా పదుకొణె(deepika padukone) స్పందించారు. సుబ్రహ్మణ్యన్‌ను ఉద్దేశించి ‘అతను చాలా గౌరవం, అధికారంలో ఉన్న వ్యక్తి. అంత ఉన్నత​ స్థానంలో వ్యక్తులు ఇలాంటి కామెంట్లు చేయడంతో షాకింగ్‌గా అనిపించింది’ అని కామెంట్‌ చేశారు. తన కామెంట్‌ చివర ‘మెంటల్ హెల్త్ మేటర్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉంచారు. ఈ వ్యవహారంపై కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్‌ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని తెలిపింది. ఇలా కంపెనీ స్పష్టత ఇచ్చిన దానిపై దీపిక పదుకొణె స్పందిస్తూ ‘ఇలా ఈ అంశంపై రిప్లై ఇచ్చి మరింత దిగజారారు’ అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement