L and T chairmen
-
‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’
పని గంటలపై ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వారానికి 90 గంటలు పని చేయడంతోపాటు, ఆదివారం సెలవునూ వదిలేయాలని సుబ్రహ్మణ్యన్ ఇటీవల ఓ వీడియో ఇంటెరాక్షన్‌లో తన ఉద్యోగులతో అన్నారు. దీనినై ప్రముఖులు విభిన్నంగా స్పందిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గొయెంకా, సినీ నటి దీపికా పదుకొణె సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై కామెంట్ చేశారు.అసలేం జరిగిందంటే..ఎల్ అండ్ టీ ఉద్యోగి ఒకరు ఛైర్మన్‌తో వీడియో ఇంటెరాక్షన్‌లో భాగంగా కొన్ని అంశాలను అడుగుతూ..ఉద్యోగులు శనివారాల్లో ఎందుకు పని చేయాల్సి ఉంటుందని అన్నారు. దాంతో వెంటనే సుబ్రహ్మణ్యన్(l and t chairman comments) స్పందిస్తూ ‘ఆదివారాన్ని కూడా పని దినంగా ఆదేశించలేం కదా. నేను మీతో ఆదివారం పని చేయించుకోలేకపోతున్నాను. మీరు సండే కూడా పని చేస్తే మరింత సంతోషిస్తాను. ఎందుకంటే నేను ఆ రోజు కూడా పని చేస్తున్నాను’ అని అన్నారు. ఇంట్లో ఉండి ఉద్యోగులు ఏం చేస్తారని సుబ్రహ్మణ్యన్ ప్రశ్నించారు. ‘ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు? నీ భార్యవైపు ఎంతసేపు చూస్తూ ఉంటావు? రండి, ఆఫీసుకు వచ్చి పని ప్రారంభించండి. మీరు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలంటే వారానికి 90 గంటలు పని చేయాలి’ అన్నారు.వినాశనానికి దారితీస్తుంది..సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా(Harsh Goenka) స్పందిస్తూ..‘వారానికి 90 రోజుల పనా? సండేను సన్-డ్యూటీ అని.. ‘డే ఆఫ్’ను ఓ పౌరాణిక భావనగా ఎందుకు మార్చకూడదు. తెలివిగా కష్టపడి పని చేయడాన్ని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని మొత్తం ఆఫీసుకే అంకితంగా మారిస్తే అది వినాశనానికి దారితీస్తుందే తప్ప విజయం చేకూరదు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనేది ఆప్షన్ కాదు. అవసరం అని నా భావన’ అని తన ఎక్స్ ఖాతాలో పోర్కొన్నారు. ‘వర్క్ స్మార్ట్ నాట్ స్లేవ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.90 hours a week? Why not rename Sunday to ‘Sun-duty’ and make ‘day off’ a mythical concept! Working hard and smart is what I believe in, but turning life into a perpetual office shift? That’s a recipe for burnout, not success. Work-life balance isn’t optional, it’s essential.… pic.twitter.com/P5MwlWjfrk— Harsh Goenka (@hvgoenka) January 9, 2025ఇదీ చదవండి: నిబంధనలు పాటిస్తే బ్యాంకులదే బాధ్యతమెంటల్ హెల్త్ ముఖ్యం..వారానికి 90 గంటలు పని చేయాలని సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి దీపికా పదుకొణె(deepika padukone) స్పందించారు. సుబ్రహ్మణ్యన్ను ఉద్దేశించి ‘అతను చాలా గౌరవం, అధికారంలో ఉన్న వ్యక్తి. అంత ఉన్నత స్థానంలో వ్యక్తులు ఇలాంటి కామెంట్లు చేయడంతో షాకింగ్‌గా అనిపించింది’ అని కామెంట్ చేశారు. తన కామెంట్ చివర ‘మెంటల్ హెల్త్ మేటర్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉంచారు. ఈ వ్యవహారంపై కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘అసాధారణ ఫలితాలు సాధించాలంటే అసామాన్య కృషి అవసరం. కలసికట్టుగా అంకితభావంతో కృషి చేస్తే వృద్ధిని కొనసాగించగలుగుతాం. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలనే విజన్‌ను సాకారం చేసుకోగలుగుతాం. కంపెనీ చైర్మన్ వ్యాఖ్యలు ఇదే లక్ష్యాన్ని ప్రతిఫలిస్తున్నాయి’ అని తెలిపింది. ఇలా కంపెనీ స్పష్టత ఇచ్చిన దానిపై దీపిక పదుకొణె స్పందిస్తూ ‘ఇలా ఈ అంశంపై రిప్లై ఇచ్చి మరింత దిగజారారు’ అని అన్నారు. -
ఎల్అండ్టీ గ్రూప్ కంపెనీలకు నాయక్ గుడ్‌బై
న్యూఢిల్లీ: ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్టీటీఎస్) చైర్మన్‌గా తప్పుకోవాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో ఈ రెండు సంస్థలకు చైర్మన్‌గా ఎస్ఎన్ సుబ్రమణియన్ 27న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఇరు కంపెనీలు ప్రకటించాయి. వ్యవస్థాపక చైర్మన్‌గా ఏఎం నాయక్ ఎల్టీఐ మైండ్‌ట్రీ కంపెనీని చురుకైన అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దినట్టు సంస్థ పేర్కొంది. ఈ నెల 26నాటి ఎల్టీఐ మైండ్‌ట్రీ 28వ ఏజీఎంతో తన బాధ్యతలకు ముగింపు పలకాలని ఏఎం నాయక్ నిర్ణయించుకున్నారని, దీంతో ప్రస్తుతం వైస్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్‌ను నూతన చైర్మన్‌గా బోర్డు ఎంపిక చేసినట్టు, ఇది 27 నుంచి అమల్లోకి వస్తుందని ఎల్టీఐ మైండ్‌ట్రీ ప్రకటించింది. కంపెనీ పురోగతికి నాయక్ అందించిన సేవలకు అభినందనలు తెలియజేసింది.సుబ్రమణియన్ సారథ్యంలో ఎల్టీఐ మైండ్‌ట్రీ తన వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని, కొత్త విజయశిఖరాలను చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు నాయక్ ప్రకటించారు. అంతకుముందు ఈ సంస్థ ఎల్అండ్టీ ఇన్ఫోటెక్గా కొనసాగగా, 2019లో మైండ్‌ట్రీని విలీనం చేసుకున్న అనంతరం ఎల్టీఐ మైండ్‌ట్రీగా మారడం తెలిసిందే. మైండ్‌ట్రీని సొంతం చేసుకోవడంలో నాయక్, సుబ్రమణియన్ కీలక పాత్ర పోషించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీ, ఎల్టీటీఎస్ రెండింటిలోనూ ఎల్అండ్టీకి మెజారిటీ వాటాలున్నాయి. -
రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్
ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, సాంకేతికత, సమాచార రంగాల్లో అగ్రగామిగా దూసుకెళ్తున్న 'లార్సెన్ అండ్ టుబ్రో' (Larsen & Toubro) గురించి చాలామందికి తెలుసు. కానీ ఈ సంస్థ పురోగతికి కారకుడైన ఏఎమ్ నాయక్ గురించి బహుశా విని ఉండక పోవచ్చు. కేవలం రూ. 760 తో మొదలైన ఈయన జీవితం.. వేలకోట్ల సామ్రాజ్యాన్ని నడిపించే స్థాయికి ఎదిగింది. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 2023 సెప్టెంబర్‌లో ఎల్ అండ్ టీ చైర్మన్‌గా పదవీవిరమణ చేసిన 'అనిల్ మణిభాయ్ నాయక్' జీవితం ఐదు దశాబ్దాల క్రితం కంకర రాళ్లు, సిమెంటు ధూళి మధ్యనే మొదలైంది. మధ్య తరగతికి చెందిన అనిల్ మణిభాయ్.. స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది అయిన మణిభాయ్ నిచ్చాభాయ్ నాయక్ కుమారుడు. ఈయన ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఉండేవారని సమాచారం. ముంబైకి వలస.. ఉద్యోగరీత్యా వారి కుటుంబం మహారాష్ట్రలోని ఓ మారుమూల పల్లె నుంచి ముంబైకి వలస వచ్చింది. దీంతో మణిభాయ్ చదువు ముంబైలోనే సాగింది. విశ్వకర్మ యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈయన.. ప్రారంభంలో ఎల్ అండ్ టీ లో ఉద్యోగం పొందలేకపోయారు. నెస్టార్ బాయిలర్స్ అనే సంస్థలో ఉద్యోగం సంపాదించి ఇష్టం లేకపోయినా తండ్రి మాటకోసం చేరాడు. జూనియర్ ఇంజినీర్.. 'ఎల్ అండ్ టీ' కంపెనీలో ఉద్యోగం చేయడం అంటే దేశానికి సేవ చేయడమే అభిప్రాయంతో ఉన్న 'నాయక్' అతి తక్కువ కాలంలోనే జూనియర్ ఇంజినీర్ హోదాలో ఎల్ అండ్ టీ కంపెనీలో అడుగుపెట్టాడు. కంపెనీ పట్ల అతనికున్న నిబద్దత 21 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా చేసింది. అంకిత భావంతో పనిచేస్తున్న ఇతన్ని గుర్తించిన కంపెనీ అనేక ఉన్నత పదవులను అందించింది. ఛైర్మన్‌గా.. 1999లో కంపెనీకి సీఈవోగా.. 2017 జూలైలో గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన నాయకత్వంలో కంపెనీ ఆస్తులు 870 కోట్ల డాలర్లను పెరిగాయి. 2017 - 18లో కంపెనీ అతనికి వార్షిక వేతనంగా రూ. 137 కోట్లు చెల్లించింది. సెలవు తీసుకోకుండా పనిచేసిన పనిదినాలు కంపెనీ ఏకంగా రూ. 19 కోట్లు చెల్లించింది. మొత్తం మీద అతని మొత్తం ఆస్తి రూ. 400 కోట్లు అని సమాచారం. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి.. ఎవరో తెలుసా? రూ. 142 కోట్లు దానం.. అనిల్ మణిభాయ్ నాయక్ ఎన్నెన్నో కష్టాలను ఎదుర్కొని అంచెలులంచెలుగా ఎదిగిన కష్టజీవి, కష్టం విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి 2016లో తన మొత్తం ఆస్తిలో 75 శాతం (సుమారు రూ. 142 కోట్లు) విరాళంగా ఇచ్చేసాడు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కువ విరాళాలు అందించిన టాప్ 10 దాతల్లో నాయక్ ఒకరు కావడం విశేషం. ఈయన సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ వంటి సత్కారాలను అందించింది. 2023 మర్చి 31న దాఖలు చేసిన కార్పొరేట్ షేర్‌హోల్డింగ్‌ల ప్రకారం, నాయక్ ఆస్తి మొత్తం రూ. 171.3 కోట్లు అని తెలుస్తోంది. -
కేసీఆర్‌తో ఎల్అండ్టీ చైర్మన్ భేటీ
- ఎస్.ఆర్.నగర్-మియాపూర్ మెట్రో ప్రాజెక్టుపై సమాలోచన హైదరాబాద్: ఎస్.ఆర్.నగర్-మియాపూర్(12 కి.మీ.) రూట్లో మెట్రో రైళ్ల ప్రయోగ పరీక్షల నిర్వహణ, రైళ్ల రాకపోకలను అధికారికంగా ఎప్పుడు ప్రారంభించాలన్న అంశంపై సీఎం కేసీఆర్‌తో ఎల్అండ్టీ సంస్థ చైర్మన్ ఏఎం నాయక్ మంగళవారం భేటీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మూడు కారిడార్ల పరిధిలో ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ట్రాఫిక్ అనుమతులు, అగ్నిమాపకశాఖ అనుమతుల మంజూరు వంటి విషయాల్లో ప్రభుత్వ పరంగా సహకారం అందజేస్తే ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-శిల్పారామం, జేబీఎస్-ఫలక్‌నుమా మార్గాల్లో మొత్తం 72 కి.మీ. మార్గంలో 2016 చివరినాటికి మెట్రో ప్రాజెక్టు పనులు పూర్తిచేసే అవకాశం ఉంటుందని ఆయన సీఎంకు వివరించినట్లు సమాచారం. మెట్రో కారిడార్లలో మరిన్ని ప్రభుత్వ స్థలాల లీజునిచ్చే అంశంతోపాటు వాణిజ్య ప్రకటనల పన్నులో కొంత మొత్తంలో రాయితీ ఇవ్వాలని సీఎంకు విన్నవించినట్లు తెలిసింది. మెట్రో రెండోదశ కింద నాగోల్-ఎల్బీనగర్, ఎల్బీనగర్-హయత్‌నగర్, ఉప్పల్-ఘట్కేసర్, మియాపూర్-పటాన్చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారీ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తమకు అవకాశం ఇవ్వాలని నాయక్ సీఎంను కోరినట్లు తెలిసింది. ఈ భేటీ విషయమై ఎల్అండ్టీ వర్గాలను ‘సాక్షి’వివరణ కోరగా.. ఇది అధికారిక సమావేశం కాదని, సీఎం, ఎల్అండ్టీ చైర్మన్లు కలసి భోజనం చేశారని ఇందులో ప్రత్యేకతలేవీ లేవని తెలపడం గమనార్హం.