
వేల మంది ఉద్యోగిణులకు ఉపాధి కల్పించిన ఇంజనీరింగ్, నిర్మాణరంగ దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్‌అండ్‌టీ) సంస్థ గురువారం మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నెలసరి సమయంలో ఒకరోజు పెయిడ్ లీవ్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఎల్ అండ్ టీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ ఈ ప్రకటన చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఎల్‌అండ్‌టీ వంటి దిగ్గజ కార్పొరేట్ సంస్థ ఒకటి ఇలా నెలసరి పెయిడ్ లీవ్ ఇవ్వడం ఇదే తొలిసారి. పెయిడ్ లీవ్ విధానాన్ని ఏ తరహాలో అమలుచేస్తారనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఎల్‌అండ్‌టీ మాతృసంస్థలో పనిచేసే మహిళలకే ఈ లీవ్ సౌకర్యం ఉంటుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: నెలకు 10 రోజులు: టెక్ కంపెనీ కొత్త రూల్!
ఎల్‌అండ్‌టీ అనుబంధ విభాగాలైన ఆర్థిక సేవలు లేదా టెక్నాలజీ వంటి విభాగాల్లో చేసే ఉద్యోగిణులకు ఈ సౌకర్యం ఉండకపోవచ్చని ఆయా వర్గాలు స్పష్టంచేశాయి. ప్రస్తుతం ఎల్‌అండ్‌టీలో 60,000 మంది ఉద్యోగులు ఉండగా వారిలో 9 శాతం అంటే దాదాపు 5,000 మంది మహిళలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment